
విజయవాడ, సాక్షి: హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో మంత్రి నారాయణ ఏకీభవించారు.హోంమంత్రిగా అనిత విఫలమైందన్న పవన్ వ్యాఖ్యలను పరోక్షంగా మంత్రి నారాయణ సమర్థించారు. ఇతర శాఖల్లో తప్పులు జరిగినప్పుడు సీఎం, డీప్యూటీ సీఎం స్పందిస్తారని అన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కూడా అదే చేశారని తెలిపారు.
‘‘పవన్ ఏం కామెంట్ చేశారు. ఏం చేయలేదు. సిరియస్‌గా తీసుకుని పనిచేయమన్నారు. డిప్యూటి సీఎంగా అక్కడ జరిగిన దానిని బేస్ చేసుకుని మాట్లాడారు. దానికి తగ్గట్లుగా హోం మినిస్టర్ చర్యలు తీసుకుని ముందుకు పోవడం జరుగుతుంది.
..సీఎం, డిప్యూటీ సీఎం వేరే డిపార్టుమెంట్ సరిగ్గా పనిచేయకుంటే కామెంట్స్ చేస్తారు. లీగల్‌గా పోలీసులు చేయడానికి కొన్ని అడ్డంకులు ఉండోచ్చు. దాని వల్ల ఒకోసారి అలస్యం కావచ్చు. ఆయన చెప్పిన దాని ప్రకారం స్పీడ్‌గా చేయడానికి అవకాశం ఉంటుంది. సీఎం అన్ని కో ఆర్డినేట్ చేస్తారు’’అని అన్నారు.

Comments
Please login to add a commentAdd a comment