mlc namination
-
సీఎం జగన్ మైనార్టీల పక్షపాతి: ఇక్బాల్
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మైనార్టీల పక్షపాతి అని మరోసారి రుజువయిందని వైఎస్సార్సీపీ నేత మహ్మద్ ఇక్బాల్ అన్నారు. బుధవారం ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాటల మనిషి కాదని.. చేతల మనిషి అని ప్రస్తుతించారు. రంజాన్ పండగ రోజు తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పారని.. బక్రీద్ పండుగ రోజు ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింనందుకు ముస్లింలతో పాటు, తెలుగు రాష్ట్ర్రాల పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఓడిపోయిన వారిని కూడా ఆదరించి పదవులు ఇస్తున్న గొప్ప వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. చంద్రబాబు ఓట్లు కోసం మాత్రమే ఎన్నికల ముందు మైనార్టీలకు పదవులు ఇచ్చారని విమర్శించారు. వైఎస్ జగన్.. తండ్రిని మించిన తనయుడు: చల్లా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి చల్లా రామకృష్ణారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో పది సంవత్సరాలు ప్రతి పక్షం, పాలకపక్షంలోనూ కలిసి పనిచేశానని తెలిపారు. తండ్రిని మించిన తనయుడు వైఎస్ జగన్ అని ప్రశంసించారు. ఎమ్మెల్సీగా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెప్పారు. ప్రజావాణి, ప్రభుత్వ ప్రాధాన్యతలను శాసనమండలిలో వినిపిస్తానని.. బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని తెలిపారు. రాష్ట్ర్ర సమస్యలపై ఇక్బాల్‌కు మంచి అవగాహన ఉంది: గడికోట శ్రీకాంత్‌రెడ్డి రాష్ట్ర్ర సమస్యలపై మహ్మద్ ఇక్బాల్‌కు మంచి అవగాహన ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. విద్యావంతుడైన ఇక్బాల్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. -
'మాట మీద నిలబడే వ్యక్తి వైఎస్ జగన్'
-
'ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి వైఎస్ జగన్'
హైదరాబాద్ : ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్ సీపీ తరపున ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన గోవిందరెడ్డి అన్నారు. ఆయన బుధవారం అసెంబ్లీ సెక్రటరీకి నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖరెడ్డి ఆశీస్సులతో గతంలో ఎమ్మెల్యేగా గెలిచానని, వైఎస్ఆర్ సీపీ ఆవిర్భావం నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేశానని గోవిందరెడ్డి అన్నారు. తన సేవలను గుర్తించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ఖరారు చేశారని ఆయన తెలిపారు. -
నామినేషన్ వేసిన మంత్రి నారాయణ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ సోమవారం ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఈరోజు ఉదయం 11 గంటలకు తన నామినేషన్‌ను అసెంబ్లీ ఇన్చార్జి కార్యదర్శి, రిటర్నింగ్ అధికారి సత్యనారాయణకు అందచేశారు. కోలగట్ల వీరభద్రస్వామి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఈనెల 21న ఎన్నిక జరగనుంది. 12న నామినేషన్ల పరిశీలన, 14న ఉపసంహరణ ఉంది. ఇక అసెంబ్లీలో టీడీపీ మెజారిటీ ఉండటంతో నారాయణ ఎన్నిక ఖాయం కానుంది. కాగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత నారాయణను తన మంత్రివర్గంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఉభయ సభల్లో వేటిలోనూ సభ్యుడు కారు. మంత్రిగా నియమితులైన వాళ్లు ఏదో ఒక సభలో ఆరు నెలల్లోగా సభ్యులు కావాలన్న నిబంధన ఉంది.