'ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి వైఎస్ జగన్'
హైదరాబాద్ : ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్ సీపీ తరపున ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన గోవిందరెడ్డి అన్నారు. ఆయన బుధవారం అసెంబ్లీ సెక్రటరీకి నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖరెడ్డి ఆశీస్సులతో గతంలో ఎమ్మెల్యేగా గెలిచానని, వైఎస్ఆర్ సీపీ ఆవిర్భావం నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేశానని గోవిందరెడ్డి అన్నారు. తన సేవలను గుర్తించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ఖరారు చేశారని ఆయన తెలిపారు.