Govinda Reddy
-
మాట నిలబెట్టుకున్న YS జగన్.. తక్షణమే 10 లక్షల సాయం
-
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
బద్వేలు అర్బన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి మహిళలు, విద్యార్థినులకు రక్షణ కరువైందని వైఎస్సార్ జిల్లా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధ విమర్శించారు. బద్వేలు సమీపంలో బాలిక దస్తగిరమ్మ ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురికావడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు. రాష్ట్రంలో మహిళలు, విద్యార్థినులపై జరుగుతున్న వరుస ఘటనలు చూస్తుంటే కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో అర్థమవుతుందన్నారు. ఆదివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. లిక్కర్, ఇసుక దందాలతో శాంతిభద్రతలు గాలికి..హిందూపురం నియోజకవర్గంలో అత్తాకోడళ్లపై జరిగిన గ్యాంగ్‌రేప్ ఘటన.. కర్నూలు జిల్లా అస్పరి మండలంలో అశ్విని అనే ఇంటర్ విద్యార్థిని హత్య ఘటన మరువక ముందే తాజాగా బద్వేలులో దస్తగిరమ్మ హత్య.. ఇలా వరుసగా దుర్ఘటనలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయకపోవడం బాధాకరమన్నారు. లిక్కర్, ఇసుక స్కాంలలో పాలకులు నిండా మునిగిపోయి మహిళల రక్షణ బాధ్యతలను పూర్తిగా విస్మరిస్తున్నారన్నారు. పోలీసు వ్యవస్థ కూడా అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిపక్ష నేతలను తప్పుడు కేసులతో వేధించడమే పనిగా పెట్టుకున్నారని, శాంతిభద్రతలను పట్టించుకోవడం మానేశారని మండిపడ్డారు. ఇంతటి దారుణ పరిస్థితులు రాష్ట్రంలో మునుపెన్నడూ లేవన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో మహిళల రక్షణకు పెద్దపీటఇక గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బాలికలు, మహిళల భద్రతకు పెద్దపీట వేశారని, ఇందులో భాగంగానే విప్లవాత్మకంగా దిశ యాప్‌ను తీసుకొచ్చారన్నారు. మహిళల రక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 18 దిశ పోలీసుస్టేషన్లు ఏర్పాటుచేయడంతో పాటు ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు ఏర్పాటుచేసి ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఏర్పాటుచేశారని వారు గుర్తుచేశారు. అంతేకాక.. పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టపరిచామన్నారు. అయితే, రాజకీయ కక్షతో చంద్రబాబు దిశ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. -
లాగిపెట్టి గువ్వ మీద కొట్టాడు.. టీడీపీ నేత బరితెగింపు
-
ఎగ్జిట్ పోల్స్ పై రాయదుర్గం ఎమ్మెల్యే రియాక్షన్
-
ప్రమాదపుటంచుల్లో ప్రపంచం
పక్కనున్న ఇల్లు తగలబడుతుంటే మనది కాదు కదా అని వదిలేస్తే ఆ మంటలు మన ఇంటినీ కాల్చివేస్తాయి. ఇప్పుడు హమాస్–ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధం ఈ వాస్తవాన్నే నొక్కి చెబుతోంది. రెండేళ్ల క్రితం ఉక్రెయిన్‌లో రష్యా మొదలెట్టిన దురాక్రమణ యుద్ధం ఇంకా చల్లార నే లేదు. ఇంతలో హమాస్ రాజేసిన యుద్ధ జ్వాలలు లెబనాన్ మొదలుకొని జోర్డాన్, సిరియా, ఇరాక్‌ల వరకూ మొత్తం పశ్చిమాసియాను చుట్టుముట్టాయి. ఇదే సమయంలో ఎర్రసముద్రంలో మాటుగాసిన హౌతీ మిలిటెంట్లు అటుగా వచ్చిపోయే భారీ వాణిజ్య నౌకలే లక్ష్యంగా క్షిపణి దాడులు చేయడం ప్రపంచ దేశాలను కలవరపరుస్తోంది. గత నవంబర్‌లో అయిదువేల కార్లను మోసుకుపోగల ‘గెలాక్సీ లీడర్’ అనే నౌకపై హెలికాప్టర్‌తో దాడిచేసి, ఆ తర్వాత దాన్ని హైజాక్ చేశారు హౌతీలు. నౌకకు బహమాస్ జెండాయే ఉన్నా అది ఇజ్రాయెల్ కోటీశ్వరుడి షిప్పింగ్ కంపెనీదని హౌతీలు పసిగట్టారు. ఆ తర్వాత ఒక ఫ్రెంచ్ యుద్ధనౌక, ఒక గ్రీక్ నౌక, నార్వే జెండాతో పోతున్న కెమికల్ ట్యాంకర్లున్న నౌక వీరి దాడులకు లక్ష్యంగా మారాయి. మధ్యలో రెండు చైనా, రష్యాల నౌకలపైనా దాడులు జరిగాయి. కానీ పొరపాటైందని హౌతీలు ప్రకటించారు. జనవరి 15న వారు నేరుగా అమెరికా కార్గో నౌకపై దాడి చేశారు. ప్రపంచ నౌకా వాణిజ్యంలో ఇంచు మించు 17 శాతం ఎర్రసముద్రం మీదుగా జరుగుతుందని అంచనా. పర్షియా జలసంధి నుంచి యూరప్‌కు తరలిపోయే చమురు, సహజవాయు ట్యాంకులన్నీ ఎర్రసముద్రం గుండా పోవాల్సిందే. కానీ ఈ దాడుల తర్వాత అందులో చాలా భాగం తగ్గిపోయింది. అనేక సంస్థలు ఆఫ్రికా చుట్టూ తిరిగి నౌకల్ని నడపాలని నిర్ణయించాయి. ఇందువల్ల సరుకు రవాణా వ్యయం భారీగా పెరిగిపోయింది. ఇరాన్ పెంచి పోషిస్తున్న హౌతీల ఆగడాలు అరికడతామని అమెరికా, బ్రిటన్లు రంగంలోకి దిగాయి. అందుకు ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ వంటివి సహకారం అందిస్తున్నాయి. హౌతీ మిలి టెంట్లు క్షిపణులతో, డ్రోన్లతో గత ఏడాది అక్టోబర్ 31న ఎర్రసముద్రంలోని ఇజ్రాయెల్ టూరిస్టు రిసార్ట్‌పై బాంబు దాడులు చేశారు. అయితే వాటిని ఇంటర్సెప్టర్ల సాయంతో ఇజ్రాయెల్ జయప్రదంగా అడ్డుకోగలిగింది. దాంతో రెండు ఈజిప్టు పట్టణాల్లో పేలుళ్లు సంభవించాయి. ఆ తర్వాత వారు అమెరికా ఎమ్క్యూ–9 రీపర్ డ్రోన్‌ను కూల్చారు. సమర్థవంతమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల సాయంతో హౌతీలు ఎడతెరిపి లేకుండా ప్రయోగిస్తున్న డ్రోన్లు, క్షిపణులను అమెరికా, ఇజ్రా యెల్ అడ్డుకోగలుగుతున్నాయి. కానీ ఎక్కడో తేడా కొట్టి అడపా దడపా నౌకలు బుగ్గిపాలవుతున్నాయి. గత నెల 10న అసంఖ్యా కంగా ఒకేసారి వదిలిన డ్రోన్లలో కొన్ని రక్షణ వ్యవస్థల్ని తప్పించుకెళ్లి అమెరికా యుద్ధ నౌకలోని ముగ్గురు నౌకాదళ సభ్యుల ప్రాణాలు తీశాయి. అమెరికా కూటమి దేశాలు సాగిస్తున్న దాడులు వృథా ప్రయాసగా మిగలటమే కాదు... చివరకు ప్రపంచయుద్ధానికి కూడా దారితీసే ప్రమాదం వుంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆగేదాకా ఎర్రసముద్రం ప్రశాంతంగా ఉండబోదని హౌతీలు చేసిన ప్రకటనను ప్రపంచదేశాలు సకాలంలో పట్టించుకోవాలి. 2004 మొదలుకొని గత రెండు దశాబ్దాలుగా నిత్యమూ యుద్ధరంగంలో నిలిచిన హౌతీలను తక్కువ అంచనా వేస్తే చేజేతులా వారిని హీరోలను చేసినట్టే! యెమెన్‌లో ఇరాన్–సౌదీ అరేబియాలు సాగించిన ఆధిపత్య పోరు నుంచి పుట్టుకొచ్చిన సంస్థ ‘హౌతీ’. మొదట్లో ఒక ముఠా నాయకుడి జేబుసంస్థగా మొదలైన ఈ సంస్థ షియాల్లోని ‘జైదీ’ తెగ పరిరక్షకురాలిగా అవతరించింది. దక్షిణ, తూర్పు యెమెన్ ప్రాంతాల్లో ప్రాబల్యం ఉన్న సున్నీలపై ఎడ తెగని దాడులు చేసి రాజధాని సానాను చేజిక్కించుకున్నారు. ఈలోగా ఇజ్రాయెల్ దుందుడుకు చర్యలు, అందుకు అమెరికా వత్తాసుగా నిలిచిన వైనాలను హౌతీలు స్వీయ ఎదుగుదలకు వాడుకున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ నాశనమే తమ ధ్యేయ మనీ, వారివల్ల అన్యాయానికి గురవుతున్న ముస్లింలు ఏ వర్గంవారైనా అండగా ఉంటామని హౌతీలు తమ చర్యల ద్వారా ప్రకటిస్తున్నారు. పాలస్తీనాలో సున్నీలు, షియాలు, క్రిస్టియన్లతో సహా భిన్న వర్గాలున్నా అక్కడ సున్నీలదే మెజారిటీ. హౌతీల ఎత్తుగడలను అమెరికా సరిగానే గ్రహించింది. అందుకే జనవరి నెలనుంచి ఇజ్రాయెల్‌కు సామరస్యత, శాంతి ప్రబోధిస్తోంది. కానీ ఆ దేశం వింటే కదా! హౌతీలు ప్రపంచంలో ఒంటరివారు కారు. వారికి ఇరాన్ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అలాగని వారు ఇరాన్ చెప్పుచేతల్లో ఉండే అవకాశం లేదు. ఎవరైనా తమ ఎదుగు దలకు తోడ్పడే వరకే వారికి మిత్రులు. నచ్చనిది చెప్పిన మరు క్షణం వారు శత్రువుతో సమానం. ఇరాన్‌పై ఎన్ని రకాల ఆంక్షలు విధించినా నానావిధ ఎత్తుగడలతో తనకంటూ మిత్రుల్ని పోగేసుకుంటోంది. హౌతీలకు అది అండదండలు అందివ్వటం వెనక రష్యా, చైనాలు లేకపోలేదు. అందుకే ఆ రెండు దేశాలూ చోద్యం చూస్తూ నిలబడ్డాయి. ఇప్పుడు హౌతీల దుందుడుకు తనాన్ని కట్టడి చేయాలన్నా, కనీసం వారి చర్యల తీవ్రతను తగ్గించాలన్నా ఇరాన్ సాయం అవసరం. రష్యా, చైనాల జోక్యం తప్పనిసరి. ఈ దశలో ప్రతిష్ఠకు పోతే మున్ముందు మరిన్ని పరాభవాలు తప్పవనీ, ఇది మరో ప్రపంచయుద్ధానికి దారి తీస్తుందనీ అమెరికా, మిత్రదేశాలు గుర్తించాలి. బి.టి. గోవిందరెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
టీడీపీ నేత ఇంటిని ముట్టడించిన టైలర్లు
డోన్ టౌన్: తమ సొంతింటి కల సాకారం కాకుండా అడ్డుపడుతున్న టీడీపీ నేత కన్నపకుంట గోవిందరెడ్డి ఇంటిని టైలర్లు ఆదివారం ముట్టడించారు. టీడీపీ హయాంలో డోన్ పట్టణ టైలర్ల సంఘం అధ్యక్షుడిగా కన్నపకుంట గోవిందరెడ్డి వ్యవహరించారు. టైలర్లకు టీడీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించింది. ఆ స్థలాల్లో కొంతమంది బేస్మట్టం వరకు ఇళ్ల నిర్మాణం చేపట్టగా.. మరికొందరు తమ స్థలాలను అమ్ముకున్నారు. ఇలా జరిగిన అమ్మకాల్లో గోవిందరెడ్డి పాత్ర ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వం ఆ స్థలాల్లో టిడ్కో ఇళ్లు కట్టిస్తామని స్థలాలను తీసేసుకుంది. అప్పటికే నిర్మించిన బేస్‌మట్టాలను తొలగించారు. టిడ్కో ఇళ్లు ప్రభుత్వం నిర్మించి నిజమైన లబ్దిదారులకే ఇస్తుంది. దీంతో అనధికారికంగా వాటిని కొనుగోలు చేసినవారు ఆందోళన వ్యక్తంచేశారు. అయితే వారికి కూడా టిడ్కో ఇళ్లు కేటాయిస్తామని చెప్పి వారి వద్ద నుంచి కూడా గోవిందరెడ్డి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం నిజమైన టైలర్లకు మాత్రమే టిడ్కో గృహాలు కేటాయిస్తూ జీవో జారీ చేయడంతో రూ.లక్షలు చెల్లించిన వారు గోవిందరెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో గోవిందరెడ్డి కోర్టుకు వెళ్లడంతో టిడ్కో గృహాల పంపిణీ వాయిదాపడింది. దీంతో టైలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన ఇంటిని ముట్టడించారు. -
సీఎం జగన్ సంక్షేమ పాలనకు పట్టం కట్టిన బద్వేల్ ప్రజలు
-
విశాఖ జిల్లాలో టీడీపీకి షాక్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి పదవికి కాకి గోవింద్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు పంపారు. ఇటీవల పరిపాలన రాజధానిగా విశాఖపట్టణాన్ని చంద్రబాబు, లోకేష్ అడ్డుకోవడంపై అసంతృప్తిగా ఉన్నారు. కొంతకాలంగా చంద్రబాబు, లోకేష్ వ్యవహరిస్తున్న తీరుపై అసహనంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదు -
ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం అభినందనీయం
-
అభ్యర్థులను ప్రకటించే దమ్ము ఉందా?
సాక్షి, వైఎస్సార్ : సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా అభివృద్ది కోసం కాదని, పార్టీ అంతర్గత కలహాలను అరికట్టేందుకు మాత్రమే కడప వస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డి, మేయర్ సురేష్ బాబు మండిపడ్డారు. చంద్రబాబు కడప పర్యటనకు వస్తున్న నేపథ్యంలో మంగళవారం వైఎస్సార్సీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఇప్పటి వరకు 25 సార్లు జిల్లాకు వచ్చారు. నాలుగేళ్లలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలైనా చేశారా? అభివృద్ది కాలేదు కాని అప్పులు మాత్రం అయ్యాయి. నెల్లూరు ప్రజలు ఛీ కొడితే దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ జిల్లాపై పెత్తనం చెలాయించడం దుర్మార్గం. రైతులను మంత్రి సోమిరెడ్డి నిలువునా మోసం చేశారు. రాయలసీమ పట్ల చంద్రబాబు ఎందుకంత వివక్ష చూపుతున్నారు. ఇప్పటికిప్పుడు జిల్లాలోని జమ్మలమడుగు టీడీపీ అభ్యర్థిని ప్రకటించే దమ్ము చంద్రబాబుకు ఉందా? తెలంగాణలో సీఎం కేసీఆర్ సెప్టెంబర్‌లోపు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తామని అంటున్నారు. ఆ ధైర్యం మన సీఎంకి ఉందా?’ అని పేర్కొన్నారు. -
ఇక్కడ దొర.. అక్కడ దొంగ
► చోరీ కేసులో శ్రీరాంపురం పీఏసీఎస్ అధ్యక్షుడు గోవిందరెడ్డి అరెస్టు ► గతంలోనూ పలు కేసుల్లో నిందితుడు ► టీడీపీ నేత కావడంతో కంగుతిన్న పచ్చ నేతలు విస్తుపోయిన రైతులు పాయకరావుపేట: ఇక్కడ దొర.. అక్కడ దొంగగా చెలామణి అవుతున్న ప్రజాప్రతినిధి భాగోతం బయటపడటంతో రైతులు విస్తుపోయారు. విశాఖ స్టీల్ ప్లాంట్ స్టోర్స్‌లో రాగి ప్లేట్లు అపహరించిన కేసులో ఈనెల9న మండలంలోని శ్రీరాంపురం పీఏసీఎస్ అధ్యక్షుడు రావాడ గోవిందరెడ్డిని స్టీల్‌ప్లాంట్ పోలీసులు అరెస్టు చేశారు. రూ.5.82 లక్షలు విలువచేసే ఎనిమిది కాపర్ దిమ్మలు తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. పాయకరావుపేట మండలం రాజగోపాలపురం గ్రామానికి చెందిన గోవిందరెడ్డి గాజువాకలో ఉంటూ పాత ఇనుము వ్యాపారం చేస్తున్నాడు. అధికారపార్టీకి చెందిన ఈయన ప్రస్తుతం పాయకరావుపేట మండలంలో శ్రీరాంపురం పీఏసీఎస్ అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. ఈయనపై గాజువాక పోలీసుస్టేషన్లో 2012,2013లో వివిధ సెక్షన్ల కింద దొంగతనం కేసులు నమోదయ్యాయి. వీటిలోని ఒక కేసులో నేరం రుజువుకావడంతో జైలుశిక్ష అనుభవించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. తాజాగా స్టీల్ ప్లాంట్ స్టోర్స్‌లో రాగా ప్లేట్లు దొంగతనం కేసులో ఆరో ముద్దాయిగా పోలీసులు అతనిని అరెస్టు చేయడం మండలంలో చర్చనీయాంశమైంది. ఈవిషయం తెలుసుకున్న చాలామంది రైతులు ముక్కున వేలేసు కుంటున్నారు. రైతులనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రైతు ప్రతినిధిగా ఉన్న ఇవేమి పనులంటూ ఆయనను నిలదీసేందుకు సిద్ధమయ్యారు. ఇలావుండగా గోవిందరెడ్డి అరెస్టు అధికారపార్టీలో కలకలం రేపింది. ఆయన వర్గీయులు డైలమాలో పడ్డారు. ఈవిషయంపై వైఎస్సార్సీపీ జెడ్పీ ప్లోర్ లీడర్ చిక్కాల రామారావు మాట్లాడుతూ పీఏసీఎస్ అధ్యక్షుడు అయి ఉండి దొంగతనం కేసుల్లో పట్టుబడటం సిగ్గు చేటన్నారు. రైతులు తలదించుకునేలా ఆయన వ్యవహరించారని ధ్వజమెత్తారు. -
'మాట మీద నిలబడే వ్యక్తి వైఎస్ జగన్'
-
'ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి వైఎస్ జగన్'
హైదరాబాద్ : ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్ సీపీ తరపున ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన గోవిందరెడ్డి అన్నారు. ఆయన బుధవారం అసెంబ్లీ సెక్రటరీకి నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖరెడ్డి ఆశీస్సులతో గతంలో ఎమ్మెల్యేగా గెలిచానని, వైఎస్ఆర్ సీపీ ఆవిర్భావం నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేశానని గోవిందరెడ్డి అన్నారు. తన సేవలను గుర్తించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ఖరారు చేశారని ఆయన తెలిపారు. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గోవిందరెడ్డి
అధికారికంగా ప్రకటించిన పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి హైదరాబాద్: ఏపీ శాసనమండలికి ఎమ్మెల్యేల కోటాలో జూన్ ఒకటిన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటిం చింది. ఎన్నికలు జరిగే నాలుగు స్థానాల్లో పార్టీకి దక్కే అవకాశమున్న ఒక్క స్థానానికి వైఎస్సార్ జిల్లా బద్వేలుకు చెందిన మాజీ ఎమ్మెల్యే దేవసాని చిన్న గోవిందరెడ్డి పేరును ఖరారు చేశారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యు డు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీలో సీనియర్ నాయకులు, శాసనసభ్యులతో చర్చించిన తరువాత అభ్యర్థి పేరును ఖరారు చేసినట్టు తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుంచి చురుకైన పాత్రే.. ఎంటెక్ పూర్తి చేసిన గోవిందరెడ్డి రోడ్డు రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌గా 2001 వరకు పనిచేశారు. అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2004-09 మధ్యకాలంలో బద్వేలు ఎమ్మెల్యేగా పనిచేశారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచీ పార్టీ లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. నెల్లూరు, ప్రకాశం చిత్తూరు జిల్లాల్లో పార్టీ పరిశీలకునిగా పనిచేశారు. -
టీడీపీ మరో రాజకీయ హత్య
గుంటూరు జిల్లా చినగార్లపాడులో పట్టపగలే దారుణం నడిరోడ్డుపై వైఎస్సార్ సీపీ నేతను నరికి చంపిన టీడీపీ వర్గీయులు గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో.. మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లాలో టీడీపీ సాగిస్తున్న హత్యా రాజకీయాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నేత బలయ్యాడు. గురువారం చినగార్లపాడు గ్రామంలో టీడీపీ వర్గీయులు పట్టపగలు కత్తులు, బరిసెలు, వేట కొడవళ్లతో స్వైర విహారం చేసి, వైఎస్సార్సీపీలో చురుగ్గా పనిచేసే వేంపాటి గోవిందరెడ్డి (45)ని హత్య చేశారు. ఆయన భార్యను, మరో ఇద్దరి పైన కూడా దాడిచేసి, తీవ్రంగా గాయపర్చారు. టీడీపీ వర్గీయుల దాడితో గ్రామం వణికిపోయింది. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన మృతుడి అక్క లక్ష్మమ్మ, గ్రామస్తుల కథనం ప్రకారం.. ఉదయం 11 గంటల సమయంలో 30 మంది టీడీపీ వర్గీయులు కత్తులు, బరిసెలు, వేటకొడవళ్లతో ఒక ట్రాక్టర్, రెండు ఆటోలు, ద్విచక్ర వాహనాలపై పెద్దగా కేకలు వేస్తూ చినగార్లపాడు గ్రామ కూడలికి వచ్చారు. వెంటనే సెంటర్లో నిల్చుని ఉన్న ఈవూరి శివారెడ్డిపై దాడి చేశారు. దీంతో అక్కడున్న వారు, దుకాణాల యజమానులు భయాందోళనకు లోనై పరుగులు తీశారు. ఆ తర్వాత అక్కడికి సమీపంలోని వైఎస్సార్సీపీ నేత వేంపాటి గోవిందరెడ్డి ఇంటిపై దాడి చేశారు. ఇది గమనించిన గోవిందరెడ్డి పారిపోయేందుకు ప్రయత్నించగా అందరూ చూస్తుండగానే నడి బజారులో ఆయన్ని అతి కిరాతకంగా పొడిచి చంపారు. అడ్డు వచ్చిన ఆయన భార్య కోటేశ్వరమ్మపై దాడి చేయగా తీవ్ర గాయాలతో కుప్పకూలిపోయింది. ఆ సమయంలో పొలం నుంచి ఇంటికి వస్తున్న చింతలచెర్వు కోటిరెడ్డిని కూడా కత్తులు, బరిసెలతో విచక్షణారహితంగా పొడిచారు. అనంతరం నిందితులు గ్రామంలో ఎవరైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే నరికేస్తామని హెచ్చరిస్తూ వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన కోటిరెడ్డి పిడుగురాళ్లలోని ప్రైవేటు ఆస్పత్రిలో ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు. పోలీసులు పెద్ద సంఖ్యలో గ్రామానికి చేరుకున్నారు. అయితే, నిందితులందరి ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. విషయం తెలిసిన వెంటనే వైఎస్సార్ సీపీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ నాయకులు గ్రామానికి వెళ్లి, వివరాలు తెలుసుకున్నారు.