పేదవాడి మనసెరిగిన నేత వైఎస్: జగన్ | poor people leader YSR : ys Jagan | Sakshi
Sakshi News home page

పేదవాడి మనసెరిగిన నేత వైఎస్: జగన్

Published Sat, Feb 8 2014 7:17 PM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

చోడవరంలో ప్రసంగిస్తున్న వైఎస్ జగన్ - Sakshi

చోడవరంలో ప్రసంగిస్తున్న వైఎస్ జగన్

విశాఖపట్నం: ప్రతి పేదవాడి మనసెరిగిన నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. చోడవరంలో జరిగిన సమైక్యశంఖారావం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రతి గుండెలో ఆ మహానేత బతికే ఉన్నారని చెప్పారు.

చంద్రబాబు భయానక పాలన మరచిపోలేమన్నారు. ఆయన పాలనలో పేదవాడు పడ్డబాధలు తనకు ఇంకా గుర్తున్నాయని చెప్పారు. ఆయన ఎప్పుడూ పేద విద్యార్థి గురించి పట్టించుకోలేదన్నారు. అదే వైఎస్ అయితే ప్రతి పేద విద్యార్థి ఇంజనీర్ కావాలని కలలుగన్నారని చెప్పారు.  రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటే, తిన్నది అరగక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చంద్రబాబు అవహేళన చేశాన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గీసిన గీత దాటరని విమర్శించారు.

ఇసుకవేస్తే రాలని విధంగా బహిరంగ సభకు జనం తరలి వచ్చారు. చోడవరం జనసంద్రమైంది. వీధులన్నీ జనంతో నిండిపోయాయి.  దాదాపు అయిదు గంటలు ఆలస్యమైనప్పటికీ జనం కదలకుండా జగన్ రాకకోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. జగన్ ప్రసంగానికి విశేష స్పందన లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement