వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సమైక్య శంఖారావం’ సభకు పార్టీ నాయకులు జిల్లా నుంచి భారీగా జనాన్ని సమీకరించారు.
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సమైక్య శంఖారావం’ సభకు పార్టీ నాయకులు జిల్లా నుంచి భారీగా జనాన్ని సమీకరించారు. సంగారెడ్డి, పటాన్‌చెరు, జహీరాబాద్, మెదక్, నర్సాపూర్, అందోలు తదితర నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియానికి బయలుదేరి వెళ్లారు. మెదక్ నియోజకవర్గం నుంచి పార్టీ జిల్లా కన్వీనర్ బట్టి జగపతి, సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పార్టీ యువత విభాగం జిల్లా అధ్యక్షులు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.
జి.శ్రీధర్‌రెడ్డి సుమారు వంద వాహనాల్లో కార్యకర్తలు, ప్రజలను శంఖారావానికి తీసుకెళ్లారు. జిల్లా నాయకుడు పి.మనోజ్‌రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు నారాయణరెడ్డి ఆధ్వర్యంలోనూ సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి నుంచి వాహనాల్లో భారీగా వెళ్లారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, పటాన్ చెరు నియోజకవర్గ సమన్వయకర్త గూడెం మహీపాల్‌రెడ్డి, కార్మిక విభాగం జిల్లా నేత నర్రా భిక్షపతి, అందోలు నుంచి బీసీ సెల్ కన్వీనర్ డీబీ మల్లయ్య, జహీరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి మాణిక్‌రావు నేతృత్వంలో జహీరాబాద్ నియోజకవర్గం నుంచి 25 వాహనాల్లో, నర్సాపూర్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ నుంచి పార్టీ నాయకుడు హబీబ్ ఆధ్వర్యంలో ప్రజలు, కార్యకర్తలు సభకు తరలివెళ్లారు.