Batti Jagapathi
-
కారెక్కనున్న బట్టి
సాక్షి, మెదక్ : మెదక్ జిల్లాలో బట్టి జగపతి అంటే తెలియనివారు ఉండరు. ఆయన రాజకీయ ప్రస్థానం సుమారు నాలుగు దశాబ్దాలుగా వివిధ పార్టీల్లో కొనసాగుతూ వస్తోంది. మూడు సార్లు మున్సిపల్ చైర్మన్‌గా.. మరో రెండు పర్యాయాలుగా కౌన్సిలర్‌గా కొనసాగిన ఆయన టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా మూడుసార్లు, పీఆర్పీ, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగా నాలుగేళ్ల పాటు పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున మెదక్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అనంతరం తెలంగాణలో టీడీపీ కనుమరుగు కావడంతో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీ సైతం ఆయనకు టీపీసీసీలో చోటు కల్పించింది. ఆయన రాజకీయ వారసుడు, ఆయన కుమారుడు బట్టి ఉదయ్ యువత నాయకుడిగా కొన్నేళ్లుగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు రావడంతో బట్టి జగపతితోపాటు ఆయన కుమారుడు ఉదయ్ సైతం టికెట్ ఆశించినట్లు సమాచారం. ఉదయ్‌కు టికెట్ ఇవ్వడం కుదరదని కాంగ్రెస్ నాయకులు చెప్పడంతో నిరాశకు లోనయ్యారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు .. ఉదయ్‌కు ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో బట్టి జగపతి తన కుమారుడు ఉదయ్‌తోపాటు కారెక్కి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ముహూర్తం మాత్రం ఇంకా తెలియ రాలేదు. -
‘శంఖారావా’నికి తరలిన జిల్లా జనం
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సమైక్య శంఖారావం’ సభకు పార్టీ నాయకులు జిల్లా నుంచి భారీగా జనాన్ని సమీకరించారు. సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్, మెదక్, నర్సాపూర్, అందోలు తదితర నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియానికి బయలుదేరి వెళ్లారు. మెదక్ నియోజకవర్గం నుంచి పార్టీ జిల్లా కన్వీనర్ బట్టి జగపతి, సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పార్టీ యువత విభాగం జిల్లా అధ్యక్షులు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. జి.శ్రీధర్‌రెడ్డి సుమారు వంద వాహనాల్లో కార్యకర్తలు, ప్రజలను శంఖారావానికి తీసుకెళ్లారు. జిల్లా నాయకుడు పి.మనోజ్‌రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు నారాయణరెడ్డి ఆధ్వర్యంలోనూ సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి నుంచి వాహనాల్లో భారీగా వెళ్లారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, పటాన్ చెరు నియోజకవర్గ సమన్వయకర్త గూడెం మహీపాల్‌రెడ్డి, కార్మిక విభాగం జిల్లా నేత నర్రా భిక్షపతి, అందోలు నుంచి బీసీ సెల్ కన్వీనర్ డీబీ మల్లయ్య, జహీరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మాణిక్‌రావు నేతృత్వంలో జహీరాబాద్ నియోజకవర్గం నుంచి 25 వాహనాల్లో, నర్సాపూర్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ నుంచి పార్టీ నాయకుడు హబీబ్ ఆధ్వర్యంలో ప్రజలు, కార్యకర్తలు సభకు తరలివెళ్లారు. -
తెలంగాణకు మేం వ్యతిరేకం కాదు: మరోసారి స్పష్టం చేసిన వైఎస్సార్ సీపీ నేతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని, ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ అగ్రనాయకత్వం స్థానిక నాయకత్వానికి సూచించింది. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జిల్లాకు చెందిన పార్టీ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ పట్ల పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చాలా స్పష్టంగా ఉన్నారని ప్లీనరీలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నట్లు పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. తెలంగాణలో కూడా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డిని అభిమానించే కార్యకర్తలు, నేతలు చాలామంది ఉన్నారని, వారిని సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరింది. తెలంగాణ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుని కాంగ్రెస్, టీడీపీలు కుట్ర పన్నుతూ దుష్ర్పచారం చేస్తున్న విషయాన్ని ప్రతీ నాయకుడు గుర్తించాలని వివరించింది. పార్టీలో క ష్టపడి పనిచేసే కార్యకర్త ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని జగన్మోహన్రెడ్డి సందేశం పంపినట్లు సమావేశంలో పాల్గొన్న అగ్రనేతలు స్థానిక నాయకత్వానికి వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గకుండా పార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. ప్రతీ నాయకుడు కార్యకర్తలను కాపాడుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా కన్వీనర్ బట్టి జగపతి, జహీరాబాద్, మెదక్ పార్లమెంటు పరిశీలకులు ఎస్. నారాయణరెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు నల్లా సూర్యప్రకాష్‌రావు, శ్రీధర్‌రెడ్డి, దేశ్‌పాండే, రామాగౌడ్, మాణిక్యరావు, బి.హనుమంతు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు శ్రీధర్‌గుప్తా, మనోజ్‌రెడ్డి, కూర జైపాల్‌రెడ్డి, మెట్టపల్లి నారాయణరెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటరెడ్డి, బీసీ విభాగం రాష్ట్ర కమిటీ నేత సతీష్ గౌడ్, రైతు విభాగం జిల్లా కన్వీనర్ పి.ప్రతాప్‌రెడ్డి, బీసీ సెల్ కన్వీనర్ మల్లయ్య, జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు నర్రా బిక్షపతి, మైనారిటీ విభాగం కన్వీనర్ మహ్మద్ ఫరూక్ ఆలీ, జిల్లా అధికార ప్రతినిధులు టి. ప్రభుగౌడ్, ఎస్.హనుమంతరావు పాల్గొన్నారు.