తెలంగాణకు మేం వ్యతిరేకం కాదు: మరోసారి స్పష్టం చేసిన వైఎస్సార్ సీపీ నేతలు | We are not against for Telangana, says YSRCP Leaders of Medak Districts | Sakshi
Sakshi News home page

తెలంగాణకు మేం వ్యతిరేకం కాదు: మరోసారి స్పష్టం చేసిన వైఎస్సార్ సీపీ నేతలు

Published Thu, Aug 8 2013 2:13 AM | Last Updated on Tue, May 29 2018 2:26 PM

We are not against for Telangana, says YSRCP Leaders of Medak Districts

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని, ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ అగ్రనాయకత్వం స్థానిక నాయకత్వానికి సూచించింది. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జిల్లాకు చెందిన పార్టీ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ పట్ల పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చాలా స్పష్టంగా ఉన్నారని ప్లీనరీలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నట్లు పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. తెలంగాణలో కూడా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డిని అభిమానించే కార్యకర్తలు, నేతలు చాలామంది ఉన్నారని, వారిని సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరింది. తెలంగాణ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుని కాంగ్రెస్, టీడీపీలు కుట్ర పన్నుతూ దుష్ర్పచారం చేస్తున్న విషయాన్ని ప్రతీ నాయకుడు గుర్తించాలని వివరించింది. పార్టీలో క ష్టపడి పనిచేసే కార్యకర్త ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని జగన్‌మోహన్‌రెడ్డి సందేశం పంపినట్లు సమావేశంలో పాల్గొన్న అగ్రనేతలు స్థానిక నాయకత్వానికి వివరించారు.
 
 ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గకుండా పార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. ప్రతీ నాయకుడు కార్యకర్తలను కాపాడుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా కన్వీనర్ బట్టి జగపతి, జహీరాబాద్, మెదక్ పార్లమెంటు పరిశీలకులు ఎస్. నారాయణరెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు నల్లా సూర్యప్రకాష్‌రావు, శ్రీధర్‌రెడ్డి, దేశ్‌పాండే, రామాగౌడ్, మాణిక్యరావు, బి.హనుమంతు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు శ్రీధర్‌గుప్తా, మనోజ్‌రెడ్డి, కూర జైపాల్‌రెడ్డి, మెట్టపల్లి నారాయణరెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటరెడ్డి, బీసీ విభాగం రాష్ట్ర కమిటీ నేత సతీష్ గౌడ్, రైతు విభాగం జిల్లా కన్వీనర్ పి.ప్రతాప్‌రెడ్డి, బీసీ సెల్ కన్వీనర్ మల్లయ్య, జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు నర్రా బిక్షపతి, మైనారిటీ విభాగం కన్వీనర్ మహ్మద్ ఫరూక్ ఆలీ, జిల్లా అధికార ప్రతినిధులు టి. ప్రభుగౌడ్, ఎస్.హనుమంతరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement