ఇబ్రహీంపట్నం రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రజలకు సమన్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి నగరంలో శనివారం చేట్టిన ‘సమైక్య శంఖారావ’ బహిరంగ సభకు ఇబ్రహీంపట్నం నుంచి పార్టీ శ్రేణులు తరలివెళ్లాయి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ సమన్వయకర్త ఈసీ శేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు సభకు వెళ్లారు. నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులను, కార్యకర్తలను ఏకీకృతం చేసి శనివారం ఉదయం బొంగ్లూర్ ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి ర్యాలీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఈసీ శేఖర్‌గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు సమన్యాయం చేసేందుకు తమ అధినేత ఉద్యమం చేస్తున్నారన్నారు. ఇరు ప్రాంత ప్రజలకు న్యాయం చేయకుండా అడ్డగోలుగా రాష్ట్ర విభజన చేయడం తగదన్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం తమ స్వార్థ ప్రయోజ నాల కోసం విభజనకు సానుకూలంగా నిర్ణయం తీసుకుందే తప్ప ఈ ప్రాంత ప్రజల మీద ప్రేమతో కాదనేది ప్రజలు గుర్తించాలన్నారు. వరద బీభత్సంతో రాష్ట్రం అల్లకల్లోలమవుతున్నా నష్ట నివారణ చర్యల్లో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని శేఖర్‌గౌడ్ మండిపడ్డారు.
అటు ప్రజలకోసమే తన పార్టీ అని చెప్పుకునే చంద్రబాబు ప్రజల సమస్యలపై కాకుండా పార్టీ సమస్యలకే పెద్దపీట వేస్తున్నారని దుయ్యబ ట్టారు. ఒకవైపు టీటీడీపీ నేతలతో, ఇంకోవైపు సీమాంధ్ర టీడీపీ నేతలతో గిమ్మిక్కులు చేస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యలెరుగుని ఈ ప్రభుత్వానికి పాలించే హక్కులేదు.. రైతాంగం దండగ అన్న చంద్రబాబుకు వ్యవసాయం పేరెత్తే అర్హత లేదన్నారు. రాష్ట్రంలో రైతాంగం సుభిక్షంగా ఉండాలంటే మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల్ని సాకారం చేయాలన్నారు. అలా చేయడం కేవలం వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇబ్రహీం పట్నం, మంచాల, యాచారం, హయత్‌నగర్ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సమన్యాయం కోసమే జగన్ పోరాటం
Published Sun, Oct 27 2013 1:06 AM | Last Updated on Wed, Aug 8 2018 5:41 PM
Advertisement
Advertisement