IKP employees
-
ఎక్కడున్నారో చెప్పేస్తుంది!
సాక్షి, ఇందూరు (నిజామాబాద్ అర్బన్): విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వారికి చెక్ పెట్టేందుకు, క్షేత్ర స్థాయిలో సిబ్బంది పనితీరు తెలుసుకునేందుకు అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఆయా మండలాల్లో పని చేస్తున్న ఐకేపీ సెర్ప్ ఉద్యోగుల పనితీరును ఇక నుంచి ‘ట్యాబ్’ ద్వారా తెలుసుకోనుంది. క్షేత్ర స్థాయికి వెళ్లి పని చేయకుండా ఎక్కడో ఉండి నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి నూతన విధానం చెక్ పెట్టనుంది. ఐకేపీలో సెర్ప్ శాఖ తెచ్చిన ఈ నూతన సంస్కరణతో ఇకపై డీపీఎం స్థాయి నుంచి ఎంఏ సీసీల వరకు కచ్చితంగా పని చేయాల్సి ఉంటుంది. క్షేత్ర స్థాయిలో ఉద్యోగుల పనితీరును మెరుగుపరచడమే కాకుండా మహిళా సంఘాలకు సులభతరమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ట్యాబ్‌లు మన జిల్లాకు చేరుకున్నాయి. జిల్లా ఐకేపీ కార్యాయలంలో మండలాల ఉద్యోగులకు వాటిని పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని ఆరుగురు జిల్లా ప్రాజెక్టు మేనేజర్(డీపీఎం)లు, 32 మంది అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ (ఏపీఎం)లు, 96 మంది కమ్యూనిటీ కో–ఆర్డినేటర్లు, 64 మంది క్లస్టర్ కో–ఆర్డినేటర్లు ఉన్నారు. డీపీఎంలు తప్ప మిగతా ఉద్యోగులు మండల సమాఖ్య కార్యాలయాల్లో పని చేస్తారు. మహిళా సంఘాల కార్యకలాపాలు, సమావేశాలు, బ్యాంకు లింకేజీ రుణాలు, వాటి రికవరీ, ఇతర వివరాల నమోదు, సేకరణ, తదితర పనులన్నీ కమ్యూనిటీ, క్లస్టర్ కో–ఆర్డినేటర్లు క్షేత్ర స్థాయికి వెళ్లి చేయాల్సి ఉంటుంది. అయితే, వీరిలో కొందరు క్షేత్ర స్థాయికి వెళ్లి పని చేయడం లేదనే ఆరోపణలున్నాయి. ఎక్కడో ఉండి పని చేస్తున్న వారున్నారు. దీంతో మహిళా సంఘాలకు సంబంధించిన కార్యక్రమాలు, పథకాల అమలులో ఆలస్యమతోంది. కాగా క్షేత్ర స్థాయికి వెళ్లి పని చేసినా కాగితాల రూపంలో చేయాల్సి ఉంటుంది. మళ్లీ మండల సమాఖ్య కార్యాలయాలకు వెళ్లి కంప్యూటర్లో నమోదు చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం ట్యాబ్‌లను అందజేయడంతో ఈ పనులన్నీ సులభంగా జరగనున్నాయి. గ్రామాలకు వెళ్లి మహిళా సంఘాల వద్దే వివరాల నమోదు, రుణాలకు దరఖాస్తుల నమోదు సీసీలే చేసుకోవచ్చు. ట్యాబ్‌లోనే సంఘాల పేర్లు, సభ్యురాలి పేరు వెబ్సైట్లోకి వెళ్లి చూడవచ్చు. ఒక విధంగా కాగిత రహిత పాలనగా చెప్పవచ్చు. ఇందుకు ట్యాబ్ వినియోగంపై సెర్ప్ అధికారులు ఐకేపీ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. ఒక్కో ట్యాబ్ విలువ దాదాపు రూ.8వేల వరకు ఉంది. జీపీఆర్ఎస్ అనుసంధానం ఉద్యోగులు సక్రమంగా పని చేయడానికి ట్యాబ్‌లకు జీపీఆర్ఎస్ సిస్టం ఏర్పాటు చేశారు. ఎక్కడుండి పని చేస్తున్నారో దీని ద్వారా ఇట్టే తెలిసి పోతుంది. క్షేత్ర స్థాయికి వెళ్లి పని చేస్తున్నారో లేదో స్పష్టంగా తెలుస్తుంది. జీపీఆర్ఎస్ సిస్టంను హైదరాబాద్ సెర్ప్ కార్యాలయానికి, అలాగే జిల్లా కార్యాలయానికి అనుసంధానం చేశారు. -
వందశాతం భూ రికార్డుల ప్రక్షాళన చేస్తాం
-
లక్ష రూపాయలు రుణ మాఫీ చేస్తాం : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగోరోజు ప్రారంభమయ్యాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సండ్ర వెంకటవీరయ్యతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించారు. అనంతరం ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశ పెట్టారు. తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మట్లాడారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను నెరవేర్చుతామని చెప్పారు. ఐదేళ్ల కాలంలో పూర్తి చేయాల్సి హామీలపై ఇప్పటినుంచి ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయొద్దని సూచించారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ కాలంలో రూ.17 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశామని, ఈ ప్రభుత్వ హయాంలో రూ.24 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని వెల్లడించారు. ఈ విషయంపై విధివిధానాల రూపకల్ప జరుగుతోందని తెలిపారు. ఆర్థిక శాఖ కార్యదర్శి బ్యాంకర్స్‌తో మాట్లాడుతున్నారని తెలిపారు. రైతుల అభివృద్ధే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఐకేపీ ఉద్యోగులను రెగ్యులర్ చేసి.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణ బాధ్యత వారికే అప్పగిస్తామని చెప్పారు. గత ప్రభుత్వ కాంలో మేనిఫెస్టోలో లేని 76 పథకాలను అమలు చేశామని చెప్పారు. కంటి వెలుగు పథకంలో కొందరికి కళ్లు పోయాయని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు కంటి వెలుగులో ఇంతవరకు ఆపరేషన్లే చేయలేదని వెల్లడించారు. 100 శాతం భూరికార్డుల ప్రక్షాళన చేస్తామని అన్నారు. ధరణి వెబ్సైట్లో భూముల వివరాలు పొందుపరుస్తామని తెలిపారు. 54 లక్షల మంది రైతులకు పాస్ పుస్తకాలు అందించామన్నారు. రైతు బీమా పథకంతో ఇప్పటివరకు 6,062 మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరిందని అన్నారు. లోక్‌సభ ఎన్నికలు పూర్తవగానే పంచాయతీ రాజ్ చట్టాన్ని వంద శాతం అమల్లోకి చేస్తామని అన్నారు. పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తామని, కలప స్మగ్లింగ్‌ను అరికడతామని చెప్పారు. -
ఐకేపీ ఉద్యోగుల వేతనాలు పెంపు
♦ ఉత్తర్వులు జారీ చేసిన గ్రామీణాభివృద్ధి శాఖ ♦ ఎంసీసీలకు వందశాతం పెరిగిన జీతం ♦ మిగతా ఉద్యోగులకు 30శాతం పెరుగుదల ♦ జిల్లాలో 403 ఉద్యోగులకు లబ్ధి ♦ ఆగస్టు నుంచే పెరుగుదల అమలు సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఇందిరా క్రాంతి పథం ఉద్యోగుల నిరీక్షణ ఫలించింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచాలనే డిమాండును ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదించింది. వారి వేతనాలను పెంచుతూ గురువారం పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్పీ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. మండల సమాఖ్య క్లస్టర్ కోఆర్డినేటర్ల వేతనాలను ఏకంగా రెట్టింపు చేసింది. ప్రస్తుతం వీరికి రూ.6,200 ఇస్తుండగా.. ఇకపై రూ.12,000 ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా ఇతర కేటగిరీల్లో పనిచేస్తున్న జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు, సహాయ ప్రాజెక్టు మేనేజర్ తదితరులకు వారి బేసిక్ వేతనంపై 30శాతం పెంచుతున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ పెంపును ఆగస్టు నుంచే అమలు చేయనున్నట్లు వివరించింది. ఈక్రమంలో వచ్చేనెల వేతనం నుంచే పెరిగిన మొత్తాన్ని ఉద్యోగులు తీసుకోనున్నారు. దీంతో జిల్లాలో పనిచేస్తున్న 403 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం జిల్లాలోని ఐకేపీ ఉద్యోగులకు నెలవారీగా రూ.66.84లక్షలు వేతనాల రూపంలో అందిస్తున్నారు. తాజా పెరుగుదలతో జిల్లాపై రూ.20లక్షల భారం పడనుంది. 50శాతం పెంచాలన్నాం.. ఇందిరా క్రాంతిపథంలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతన పెంపు కోసం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాం. అందరికీ 50శాతం పెంచాలని కోరాం. కానీ ఎంసీసీల వేతనాల్ని మెరుగ్గా పెంచినప్పటికీ.. మిగతా ఉద్యోగులకు బేసిక్పైన 30శాతం మాత్రమే పెంచారు. దీంతో ఇతర కేటగిరీల ఉద్యోగులు కొంత నిరుత్సాహంలోనే ఉన్నారు. అయినప్పటికీ భవిష్యత్తులో మరింత మెరుగ్గా వేతనాలు పెంచుతారని ఆశిస్తున్నా. ప్రస్తుత పెంపుపై ప్రభుత్వానికి కతజ్ఞతలు చెబుతున్నా. - సురేష్‌రెడ్డి, ఐకేపీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు -
ఐకేపీ సిబ్బంది జీతాల పెంపు!
ప్రతిపాదనలు పంపాలని పీఆర్ కమిషనర్‌ను ఆదేశించిన సీఎం సాక్షి, హైదరాబాద్ : ఐకేపీ సిబ్బందికి ఇచ్చే నెలసరి జీతాన్ని (రెమ్యూనరేషన్) పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని సీఎం కేసీఆర్ పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. రెండు రోజుల్లోనే పంచాయతీరాజ్ శాఖ మంత్రితో చర్చించి రెమ్యూనరేషన్ పెంపుపై సీఎం నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ నిరుపేద నిర్మూలన సొసైటీ (సెర్ప్) పరిధిలో దాదాపు 4,264 మంది సిబ్బంది పని చేస్తున్నారు. దాదాపు యాభై లక్షల మందికి పైగా మహిళా సభ్యులున్న ఐకేపీ సంఘాలను బలోపేతం చేయటంలో వీరిదే కీలకపాత్ర. పదిహేనేళ్లుగా పని చేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని ఐకేపీ ఉద్యోగులు కొంతకాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల తరహాలోనే ఐకేపీ సిబ్బందిని పరిగణిస్తూ అలవెన్సులు, హెచ్ఆర్ పాలసీ విధానాన్ని అమలు చేస్తూ 58 ఏళ్ల రిటైర్మెంట్ వరకు ఉద్యోగ భద్రత కల్పించింది. కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం మేరకు వేతన సవరణ చేసిన ప్రభుత్వం.. ఐకేపీ సిబ్బంది జీతాలను పెంచలేదు. ఈ నేపథ్యంలో ఐకేపీ సిబ్బంది జీతాన్ని పెంచేందుకు సీఎం చొరవ తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. -
మహిళలకు కేసీఆర్ చేసింది శూన్యం
దుబ్బాక రూరల్ : మహిళా సంఘాలు, వీఓఏలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసింది శూన్యమని ఐకేపీ వీఓఏల సంఘం జిల్లా అధ్యక్షుడు తలపాక కిష్టయ్య అన్నారు. పెండింగ్ వేతనాలు, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట మండల గ్రామాల వీఓఏలు, మహిళా సంఘాలు సీఐటీ యూ ఆధ్వర్యంలో గురువారం మండలంలోని హబ్షీపూర్ చౌరస్తాలోని సిద్దిపేట - రామాయంపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి గత ఎన్నికల్లో మహిళలకు అనేక రకాల హామీలు ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చాక వారికి రిక్త హస్తం ఇచ్చారని ఆరోపించారు. మిహళా సమాఖ్యలకు రావాల్సిన నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. దీంతో మహిళలు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. వీఓఏలకు నెలకు రూ. 2000లు అందజేస్తామని గత ప్రభుత్వం జీఓ జారీ చేసినా.. టీఆర్ఎస్ ప్రభుత్వం దానిని అమలు చేయడం లేదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే వీఓఏలకు రావాల్సిన పెండింగ్ వేతనాలు చెల్లించి డిమాండ్ చేశారు. సీఐటీయూ దుబ్బాక డివిజన్ ప్రధాన కార్యదర్శి జీ భాస్కర్ మాట్లాడుతూ వీఓఏల న్యాయమైన కోర్కెలు ప్రభుత్వం తీర్చాలన్నారు. దుబ్బాక పోలీసులు ఆందోళనకారులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు. కార్యక్రమంలో నాయకులు భిక్షపతి, శ్రీనివాస్, మహేష్, జమున, లక్ష్మణ్, సత్తిరెడ్డి, ఆంజనేయులు పాల్గొన్నారు. ఐకేపీ వీఓఏల సమస్యలు పరిష్కరించాలి జోగిపేట : ఐకేపీ వీఏఓల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మహిళలు గురువారం పట్టణంలో భారీ నిరసన ర్యాలీ, మానవహారం, రాస్తారోకోలు చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీపీ కార్యాలయం ఆవరణలోని శిబిరం నుంచి వందల సంఖ్యలో భారీ ర్యాలీని నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చే శారు. స్థానిక హనుమాన్ చౌరస్తా వద్ద మానవహారాన్ని నిర్వహించిన అనంతరం అరగంట పాటు జాతీయ రహదారిపై బైఠాయించారు. పీ మొగులయ్య మాట్లాడుతూ వీఓఏలకు రావాల్సిన 18 నెలల వేతనాలు చెల్లించాలని, వేతనం రూ.5 వేలకు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సహజ మరణానికి బీమా సౌకర్యం కల్పించాలని, పొదుపు సంఘాలకు వడ్డీలేని స్త్రీనిధి రుణాలు ఇవ్వాలని, ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు 12 నెలల పావలా వడ్డీలు ఇవ్వాలని అభయ హ స్తం పింఛన్ కొనసాగించాలని ఆయన డిమాండ్ చేసారు. కార్యక్రమంలో అందోలు మండల వీఓఏల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎం అశోక్, గొల్ల మల్లయ్య, నాయకులు అనుసూయ, అనిత, మానస, స్వప్న, అశోక్, సువర్ణ, అరేందర్, లక్ష్మయ్య, మల్లేశం, కిష్టయ్య, బాలయ్యలు పాల్గొన్నారు. -
17 నెలలుగా ఐకేపీ వీవోఏలకు వేతనాల్లేవు!
సంగారెడ్డి అర్బన్: ఐకేపీ వీవోఏలకు 17 నెలలుగా వేతనాలు చెల్లించడంలేదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కలెక్టరేట్ వద్ద ఐకేపీ వీవోఏల రిలే నిరాహరదీక్షలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్మిక సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవడంలేదన్నారు. వీవోఏలకు వెంటనే వేతనాలు చెల్లించాలని, వారికి కనీస వేతనంగా రూ.15వేలు చెల్లించాలని, పొదుపు సంఘాలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. దీక్షల్లో వీవోఏల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేష్, వెంకటేష్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సాయిలు, ిపీఎన్ఎం నాయకులు నాగభూషణం, శ్రామిక మహిళ సంఘం నాయకులు నర్సమ్మ, సీఐటీయూ నాయకులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. పేదలను దిక్కులేనివారిగా చేస్తారా.. ఉపాధి హామీ పథకానికి సవరణలు చేస్తే కేంద్ర ప్రభుత్వంపై తిరగబడతామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.రాజయ్య హెచ్చరించారు. ఉపాధి హామీలో తెస్తున్న సవరణలను వ్యతిరేకిస్తూ బుధవారం కలెక్టరేట్ ఎదుట సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్వో దయానంద్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకునేందుకు అన్ని సంఘాలు కలిసి రావాలన్నారు. పథకంలో యంత్రాలు ప్రవేశపెట్టడమంటే కూలీలను కూటికి దూరం చేయడమన్నారు. దేశ వ్యాప్తంగా మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని 6759 మండలాల నుంచి 2,500 మండలాలకు, రాష్ట్ర వ్యాప్తంగా 443 మండలాల నుంచి 78 మండలాలకు, జిల్లాలో 46 మండలాలకు గాను కేవలం 8 మండలాలకు మాత్రమే పరిమితం చేసేందుకు కేంద్రం పూనుకుంటోందన్నారు. ప్రభుత్వం కుదింపును తక్షణమే విరమించుకోవాలన్నారు. ధర్నాలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, జయరాజు, నాయకులు మాణిక్యం, సాయిలు, నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఐకేపీ ఉద్యోగుల కలెక్టరేట్ ముట్టడి
-
'హక్కు' అడిగితే...
* తీవ్ర ఉద్రిక్తత నడుమ * ఐకేపీ మహిళల ఆందోళన పలువురి అరెస్టు సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఐకేపీ ఉద్యోగులు తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వేతనాలను పెంచడంతో పాటు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఐకేపీ ఉద్యోగులు పెద్ద ఎత్తున కలెక్టరేట్‌కు చేరుకుని ర్యాలీగా కలెక్టరేట్ ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. ఒకవైపు మెట్రోరైలు పనులు సాగుతుండడంతో కలెక్టరేట్ రోడ్డు ఇరుకుగా మారింది. దీంతో కలెక్టరేట్ ఎదుట ఐకేపీ ఉద్యోగులు వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరుకురోడ్డు బైఠాయించడంతో లక్డీకాపూల్ రోడ్డు ట్రాఫిక్‌తో స్తంభించిపోయింది. ఈ సందర్భంగా ఉద్యోగులు పెద్ద ఎత్తు న నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడం తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమకిచ్చే వేతనాలు ఏ మూలకు సరిపోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వేత నాలను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు జయలక్ష్మి తదితరులున్నారు. -
ఐకేపీ ఉద్యోగుల కన్నెర్ర
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కేపీ ఉద్యోగులు తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వేతనాలను చెల్లించడంతో పాటు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఐకేపీ ఉద్యోగులు పెద్ద ఎత్తున కలెక్టరేట్‌కు చేరుకుని ర్యాలీగా కలెక్టరేట్ ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. ఒకవైపు మెట్రోరైలు పనులు సాగుతుండడంతో కలెక్టరేట్ రోడ్డు ఇరుకుగా మారింది. దీంతో కలెక్టరేట్ ఎదుట ఐకేపీ ఉద్యోగులు వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరుకురోడ్డు బైఠాయించడంతో లక్డీకాపూల్ రోడ్డు ట్రాఫిక్‌తో స్తంభించిపోయింది. ఈ సందర్భంగా ఉద్యోగులు పెద్ద ఎత్తు న నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడం తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమకిచ్చే వేతనాలు ఏ మూలకు సరిపోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు జయలక్ష్మి తదితరులున్నారు. -
గర్జించిన ఐకేపీ ఉద్యోగులు
-
సెక్రటేరియట్ ముట్టడికి ఐకేపీ ఉద్యోగుల యత్నం
-
సెక్రటేరియట్ ముట్టడికి ఐకేపీ ఉద్యోగుల యత్నం
హైదరాబాద్: వేతనాలు చెల్లించాలంటూ ఐకేపీ ఉద్యోగులు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు వేలమంది ఐకేపీ వాలంటీర్లు శనివారం హైదరాబాద్ తరలివచ్చారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఐకేపీ ఉద్యోగులు ఆగ్రహ్యం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా సెక్రటేరియట్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని ధర్నా చౌక్ వద్దే అడ్డుకున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ఐకేపీ ఉద్యోగులు సెక్రటేరియట్ వైపు రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఐకేపీ వాలెంటీర్లకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఐకేపీ ఉద్యోగులు బారికేడ్లు దాటేందుకు ప్రయత్నించగా, పోలీసులు స్వల్పంగా లాఠీచార్జీ చేశారు. -
మాటలతో మోసం చేస్తున్న సీఎం
హన్మకొండ : సీఎం కేసీఆర్ తన మాటలతో ప్రజలను మోసగిస్తున్నాడని తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కె.ధనలక్ష్మి మండిపడ్డారు. వీఓఏల సమస్య లు పరిష్కరించాలని కోరుతూ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 12న ఖమ్మంలో ప్రారంభించిన జీపుజాతా మంగళవారం జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా ఐకేపీ ఉద్యోగులు హన్మకొండలోని పబ్లిక్‌గార్డెన్ నుంచి కాళోజీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధనలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదున్నర నెలలు గడుస్తున్నా ఐకే పీ ఉద్యోగులకు వేతనాలు అందించేందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంద న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సమ్మె చేసినప్పుడు తమకు మద్దతు పలికిన టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు మంత్రులుగా వీఓ ల వేతనాల అంశాన్ని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వీఓఏలకు రావాల్సిన 17 నెలల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరా రు. అలాగే రూ.5 వేల వేతనం పెంచాలని, ఆహార భద్రత కార్డులివ్వాలని, సహజ మరణానికి బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈనెల 22న తలపెట్టిన చలో అసెంబ్లీ ముట్టడిని ఐకేపీ ఉద్యోగులు విజయవంతం చేయాలన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్కయ్య, తెలంగాణ ఐకే పీ వీఓఏల ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నగేష్, జిల్లా అధ్యక్షురాలు మాధవి, లావణ్య, రమేష్, మంగ, సరస్వతి, సుధాకర్, చక్రపాణి, సాయిలు, యాదానాయక్, శంకర్, విద్యాసాగర్, వెంకటేష్ పాల్గొన్నారు. -
చంద్రబాబు సభలో గందరగోళం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం పశ్చిమగోదావరి జిల్లా కలవపూడిలో పాల్గొన సభ గందరగోళంగా మారింది. తమకు జీతాలు చెల్లించాలని ఐకేపీ యానిమేటర్లు సభలో ఆందోళన చేపట్టారు. ఆందోళనకు దిగిన యానిమేటర్లపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు అంతకుముందు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. తీర ప్రాంత మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రతి గ్రామానికి తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీకి 10 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించనున్నట్టు చంద్రబాబు చెప్పారు. పంచాయతీల అభివృద్ధి కోసం 1300 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. -
ఐకెపి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం: జగన్
విశాఖపట్నం: తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరా క్రాంతి పదం(ఐకెపి) ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి హామీ ఇచ్చారు. చోడవరంలో జరిగిన సమైక్యశంఖారావం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఐకెపి మహిళలు వచ్చి జగన్‌ను కలిశారు. వారు తమ సమస్యలను ఆయనకు తెలిపారు. జగన్ వెంటనే స్పందించి 47వేల మంది ఐకెపి ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలిరోజునే ఆ ఫైలుపై సంతకం చేస్తానని చెప్పారు. అక్కా చెల్లెమ్మలకు వైఎస్ఆర్ సిపి తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. పార్టీకి అండగా ఉంటుంది అక్కచెల్లెమ్మలేనని, వారిని తప్పక ఆదుకుంటామని చెప్పారు. విఏఓలు, సంఘమిత్ర ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
ఐకేపీ ఉద్యోగుల సమ్మె విరమణ
ఖమ్మం ఖిల్లా, న్యూస్‌లైన్: డీఆర్డీఏ పీడీ పద్మజారాణి వైఖరికి నిరసనగా ఐకేపీ ఉద్యోగులు వారం రోజులుగా సామూహిక సెలవు పెట్టి చేస్తున్న సమ్మెను మంగళవారం విరమించారు. పీడీ వెంటనే రాజీనామా చేయాలని, ఉద్యోగుల పట్ల తన వైఖరి మార్చుకోవాలని వారు డిమాండ్ చేసినప్పటికీ ఆమె ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. ఎవరేం చేసుకున్నా తనకు నష్టం లేదన్నట్టుగా వ్యవహరించారు. దీంతో ఆమె ఇక మెట్టు దిగదని గ్రహించిన ఉద్యోగులు.. సెర్ప్ సీఈవో హామీతో పట్టువీడక తప్పలేదు. ఎట్టకేలకు బుధవారం నుంచి విధుల్లోకి చేరుతున్నట్లు ప్రకటించారు. సెర్ప్ సీఈఓ రాజశేఖర్ ఆహ్వానం మేరకు ఐకేపీ ఉద్యోగ సంఘాల నాయకులు సంపత్ తదితరులు సోమవారం హైదరాబాదుకు వెళ్లి చర్చలు జరిపారు. తాను ఉద్యోగులకు పూర్తిగా సహకరిస్తానని, వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించేలా చూస్తానని ఆయన ఇచ్చిన హామీ మేరకు సమ్మె విరమిస్తున్నామని ఉద్యోగులు తెలిపారు. రఘునాథపాలెంలోని స్త్రీశక్తి భవనంలో మంగళవారం జరిగిన డీఆర్డీఏ-ఐకేపీ ఉద్యోగుల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. సమస్య పరిష్కరించకుంటే మరో ఉద్యమం... ఐకేపీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే మరో ఉద్యమానికి సిద్ధం అవుతామని టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు, టీజీవో జిల్లా అధ్యక్షుడు ఖాజామియా, కార్యదర్శి రత్నాకర్ హెచ్చరించారు. ఐకేపీ ఉద్యోగుల సమావేశానికి హాజరైన వారు తొలుత సీపీవోతో జరిగిన చర్చల గురించి సంపత్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఉద్యోగులకు సీఈవో ఇచ్చిన హామీ అమలయ్యేలా చూడాలని కోరారు. లేకుంటే మళ్లీ ఉద్యమించక తప్పదన్నారు. ఐకేపీ ఉద్యోగులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఐకేపి, వివిధ సంఘాల నాయకులు దాసు, వెంకటేశ్వర్లు, అనూరాధ, జ్యోతి, సీతారాములు, లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
పట్టు వీడని ఉద్యోగులు..
ఖమ్మం ఖిల్లా, న్యూస్‌లైన్ : డీఆర్డీఏ పీడీ వైఖరిని నిరసిస్తూ వారం రోజులుగా 250 మంది ఐకేపీ ఉద్యోగులు సామూహికంగా సెలవు పెట్టి పట్టు విడవకుండా ఆందోళన చేస్తూనే ఉన్నారు. అయితే తాను కూడా మెట్టు దిగేది లేదనే రీతిలో పీడీ పద్మజారాణి వ్యవహరిస్తున్నారు. దీంతో జిల్లాలోని ఐకేపీ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఇటీవల సెర్ప్ సంస్థ నుంచి ఓ అధికారి వచ్చి ఉద్యోగులు, పీడీ మధ్య సయోధ్య కుదిర్చేం దుకు ప్రయత్నించినా.. అది సఫలం కాలేదు. దీంతో రుణాలందక డ్వాక్రా గ్రూపు మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యపై దృష్టి సారించాల్సిన జిల్లా ఉన్నతాధికారులు కూడా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మరో రెండు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ సమయంలో ఉద్యోగులు విధులకు హాజరు కాకుండా ఆందోళన చేస్తుండడంతో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం చేరుకునే అవకాశం లేదు. దీంతో ఇబ్బందులు తప్పేలా లేదు. ఏజెన్సీలోనూ సమ్మె ఉధృతం... ఐకేపీ సిబ్బంది సామూహిక సెలవులతో ఇప్పటికే సదరం, అభయహస్తం, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక వంటి పథకాలతో లబ్ధి పొందలేక పలువురు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకు మైదాన ప్రాంతానికే పరిమితమైన ఈ నిరసనకు మద్దతుగా ఏజెన్సీ మండలాల్లో పనిచేస్తున్న మిగిలిన ఐకేపి ఉద్యోగులు 150 మంది సైతం సోమవారం నుంచి సామూహిక సెలవులు పెట్టడంతో అక్కడ కూడా పాలన స్తంభించిపోయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ అంశంపై దృష్టిసారించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. -
రాజధానికి పంచాయితీ
ఖమ్మం ఖిల్లా, న్యూస్‌లైన్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ)లోని ఐకేపీ ఉద్యోగులకు, ఆ శాఖ ప్రాజెక్టు డెరైక్టర్ పద్మజారాణికి మధ్య ఏర్పడిన వివాదం హైదరాబాద్‌కు చేరింది. పీడీ వైఖరితో విసిగి సిబ్బంది సామూహిక సెలువులు పెట్టిన విషయం తెలిసిందే. పీడీ తమను వేధిస్తున్నారని, కించపరిచేలా మాట్లాడుతున్నారని ఉద్యోగుల ఆరోపణల నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించాలని సెర్ప్ సీఈవో రాజశేఖర్ సామాజిక భద్రత డెరైక్టర్ చిన్న తాతయ్యను ఆదేశించారు. దీంతో శుక్రవారం ఆయన జిల్లాకు వచ్చారు. డీఆర్డీఏ పీడీకి, సిబ్బందికి మధ్య సయోధ్య కుదిర్చేందుకు వారితో వేర్వేరుగా సమావేశమయ్యారు. ముందుగా స్థానిక టీటీడీసీలో మహిళా సమాఖ్య సభ్యులు, ఐకేపీ ఉద్యోగులు టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు సమక్షంలో డెరైక్టర్‌ను కలిసి పద్మజారాణి వల్ల తమకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. జిల్లాస్థాయి సమీక్ష సమావేశంలో ఐకేపీపై దుర్భాషలాడారని, జిల్లా సమాఖ్య ఏమైనా పార్లమెంటా అని వ్యాఖ్యానించారని, దళిత, గిరిజన మహిళలను అవమానపరిచేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇటీవల ఓ అధికారిణి రాజీనామాకు కూడా పీడీనే కారణమని అన్నారు. కింది స్థాయి ఉద్యోగులు మొదలు డీపీఎం స్థాయి అధికారుల వరకు ఆమె అసభ్య పదజాలంతో దూషిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణాలతోనే తాము సామూహిక సెలవులు పెట్టినట్లు ఆయనకు విన్నవించారు. అనంతరం ఆయన డీఆర్డీఏ పీడీతో సమావేశం అయ్యారు. అనంతరం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ.. ఇరుపక్షాల వారి వాదనలు విన్నామని, సిబ్బందితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారని, అయితే ఉద్యోగులే ఆమె వైఖరితో విసిగిపోయామంటున్నారని తెలిపారు. ఆమెను బదిలీ చేయాలని, లేదా విధుల నుంచి తొలగించాలని, అప్పటివరకు సామూహిక సెలవులు విరమించేది లేదంటున్నారని వివరించారు. చిన్నచిన్న లోపాలే వీరి మధ్య ఎడబాటుకు కారణమన్నారు. ఈ వివరాలన్నింటినీ సెర్ప్ సీఈవో దృష్టికి తీసుకె ళ్లి ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. డెరైక్టర్‌ను కలిసిన వారిలో ఐకేపీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కలకోటి సంపత్, ఆంజనేయులు, దాసు, దుర్గారావు, అనూరాధ, జ్యోతి, వెంకటమ్మ ఉన్నారు. రాజీపడే ప్రసక్తే లేదు... డీఆర్డీఏ పీడీకి వ్యతిరేకంగా ఆశాఖ ఉద్యోగులు సామూహిక సెలవులు పెట్టి కార్యాలయం ఎదుట చేస్తున్న ధర్నా శుక్రవారం మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా ఐకేపీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కలకోటి సంపత్ మాట్లాడుతూ తాము చేస్తున్న ఆందోళనను విరమించాలని సెర్ప్ డెరైక్టర్ సూచించారని, అయితే పీడీని మార్చేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాజీపడే ప్రసక్తే లేదని డెరైక్టర్‌కు తేల్చిచెప్పామన్నారు. బాధ్యతలు నుంచి తప్పుకునే యోచనలో పీడీ..? డీఆర్డీఏ పీడీ పద్మజారాణి తన బాధ్యతల నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక్కడ పీడీగా భాద్యతలు చేపట్టిన నాటి నుంచి ఉద్యోగులకు, తనకు ఎదో ఒక విషయంలో తరుచూ వివాదాలు జరుగుతున్నాయని, ఇక వారితో కలిసి పనిచేయలేననే ఆలోచనకు ఆమె వచ్చారని తెలిసింది. అంతేకాక ఇటీవల సిబ్బంది ఆందోళనలు కూడా ఉధృతం కావడంతో ఉన్నతాధికారుల నుంచి విమర్శలు వస్తాయని భావించి ముందుగానే తప్పుకునేందుకు సిద్ధమయ్యారని, తనకు డీపీవోగా పనిచేసిన అనుభవం ఉండటంతో అదే శాఖలో పూర్తిస్థాయి భాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఉన్నతాధికారులను కోరనున్నట్లు సమాచారం. -
డీఆర్డీఏ పీడీ వైఖరిపై నిరసన
ఖమ్మం ఖిల్లా, న్యూస్‌లైన్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో పని చేస్తున్న ఐకేపీ ఉద్యోగులు, మహిళా సంఘాలపై డీఆర్డీఏ పీడీ పద్మజారాణి అకారణంగా వేధింపులకు పాల్పడుతున్నారని, ఆమెను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఐకేపీ జిల్లా సంఘం ఆధ్వర్యంలో కిన్నెర జిల్లా సమాఖ్య సభ్యు లు, ఇతర ఉద్యోగులు మంగళవారం ఖమ్మంలో భారీ ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్‌ను ముట్టడిం చారు. తొలుత ఎనిమిది వందల మంది మహిళలు, వికలాంగులు డీఆర్డీఏ కార్యాలయం నుం చి ర్యాలీగా బయలుదేరి బస్‌డిపో రోడ్, పెవిలి యన్ గ్రౌండ్, మయూరీసెంటర్, బస్టాండ్, జడ్పీ సెంటర్ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఈ ర్యాలీనికి టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు కూరపాటి రంగరాజు ప్రారంభించారు. కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కూరపాటి రంగరాజు మాట్లాడుతూ కొంతకాలంగా పీడీ ఉద్యోగులను దుర్బాషలాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, తీరు మార్చుకుంటుందిలే అని ఊరుకుంటే రోజురోజుకు ఆమె వైఖరి మితిమీరిపోతోందని అన్నారు. ఇంకా టీఎన్జీఓస్ నగర అధ్యక్షుడు వల్లోజు శ్రీనివాస్, కోశాధికారి చంద్రకాని రమణయాదవ్, సీఐటీయు జిల్లా నాయకులు నరసింహారావు, లింగయ్యలు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఐకేపీ జిల్లా అధ్యక్షుడు కలకోట సంపత్ మాట్లాడుతూ పదినెలలుగా డీఆర్డీఏ పీడీ తమని మానసికంగా, నైతికంగా వేధిస్తున్నారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు మనస్తాపం చెంది డిసెంబర్ 31 నుంచి సామూహిక సెలవులు పెట్టాలని నిర్ణయించుకున్నామని అన్నారు. జిల్లాస్థాయి సమావేశాల్లో ఐకేపీ ఉద్యోగులపై అకారణంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ భయపెడుతోందని ఆరోపించారు. ఇటీవల ఎటువంటి కారణం లేకుండా ఉద్యోగులపై ఎస్సీ, ఎస్టీ కేసులను బనాయిస్తోందని పేర్కొన్నారు. పీఓపీ రవికుమార్‌ను, హెచ్ఆర్ ఏపీఎం సుభాష్‌ను ఎటువంటి కారణాలు లేకుండా కావాలనే సస్పెండ్ చేయించారని ఆరోపించారు. పీడీ వేధింపులు తాళలేకనే వికలాంగుల విభాగం ప్రాజెక్టు మేనేజర్ వసంతసేన రాజీనామా చేశారని అన్నారు. గతంలోనే ఆమె పనితీరుపై అప్పటి జిల్లాకలెక్టర్ సిదార్ధజైన్కు ఫిర్యాదు చేయగా పద్ధతి మార్చుకుంటానని సభాముఖంగా చెప్పిందని, కానీ మార్చుకోలేదని అన్నారు. అటెండర్లు , డ్రైవర్లును కూడా వ్యక్తిగతంగా అసభ్యపదజాలంతో దూషిస్తున్నారన్నారు. వెంటనే ఆమెని విధులనుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మహిళలు అని కూడా చూడడంలేదు. మహిళలు అని కూడా చూడకుండా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని కిన్నెర మహిళ సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు వెంకటమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ అధికారియే మహిళలను కించపరిస్తే ఇక సమాజంలో మహిళలకు న్యాయం ఎక్కడ జరుగుతుందని అధికారులను ప్రశ్నించారు. అనంతరం డీఆర్ఓ శివశ్రీనివాస్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సీతారాము లు, నాయకులు వెంకటేశ్వర్లు, దాసు, ఆంజనేయులు, దుర్గారావు, వంశీ, మహిళానాయకులు జ్యోతి, అనురాధ, నాగమణి పాల్గొన్నారు. -
ఐకేపీ అధికారుల నిర్బంధం
మధిర, న్యూస్‌లైన్: మండలంలోని మాటూరు ఎస్సీ కానీ లో ఐకేపీ అధికారులను గ్రామస్తులు మంగళవారం రాత్రి నిర్బంధించారు. అవకతవకలకు పాల్పడుతున్న గ్రామదీపిక వెంకట్రావమ్మ ఎందుకు తొలగించడం లేదంటూ గ్రామంలో నిర్వహించిన సమావేశం సందర్భంగా ఏపీఎం సురేంద్రబాబు, సీసీ చలమయ్యను నిలదీశారు. శ్రీనిధి, డ్వాక్రా రుణాలు, పలువురు విద్యార్థుల స్కాలర్షిప్లను గ్రామదీపిక వాడుకుందని, ఆమెను తొలగించాలని కొంతకాలంగా ఐకేపీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గ్రామదీపిక వెంకట్రావమ్మను తాత్కాలికంగా తొలగిస్తున్నామని ఏపీఎం సురేంద్రబాబు ప్రకటించడంతో గ్రామస్తులు శాంతించారు. అదేవిధంగా నూతన వీవోను ఎన్నుకున్నట్లు మెజార్టీ సభ్యుల తీర్మానంచేసి పంపితే గ్రామదీపిక గా పరిగణిస్తామని చెప్పారు. ఐకేపీ అధికారులను నిర్బంధించిన విషయాన్ని తెలుసుకున్న మధిర రూరల్ ఏఎస్సై చిట్టిమోదు వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకుని బందోబస్తు చేపట్టారు. -
'ఐకేపీ మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'
ఇల్లెందుఅర్బన్,న్యూస్‌లైన్: మహిళాలోకం కదం తొక్కింది.... ఐకేపీ మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇఫ్టూ, ఐకెపీ మెంబర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ (న్యూడెమోక్రసీ) ఆధ్వర్యంలో ఇల్లెందులో బుధవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. సబ్‌డివిజన్ పరిధిలోని మహిళలు వేలాదిగా పాల్గొన్న ఈ ప్రదర్శన మార్కెట్‌యార్డు నుంచి బయలుదేరి జగదాంబసెంటర్, పాతబస్టాండ్ ఏరియా, బుగ్గవాగుబ్రిడ్జి, కొత్తబస్టాండ్ ఏరియాల మీదుగా వెలుగు కార్యాలయం వరకు కొనసాగింది. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఆందోళనకారులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం వెలుగు కార్యాలయం ముట్టడించారు. ఈ సందర్భంగా డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఐకేపీ ఏరియా కోఆర్డినేటర్ చంద్రకళకు అందజేశారు. మహిళలను ఆదుకోవడంలో విఫలం: పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమ ప్రదర్శనకు ముందు కార్యక్రమాన్ని ఉద్దేశించి పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమ మాట్లాడుతూ....నిరుపేద మహిళలకు రుణాలు మంజూరు చేసి ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. మహిళల హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఐకేపీ గ్రూపులోని ప్రతి సభ్యురాలికి వడ్డీలేని రుణం లక్షరూపాయలు మంజూరు చేయాలని, బకాయి పడ్డ రుణాలను వడ్డీలు లేకుండా కట్టించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో సమావేశ సౌకర్యార్థం కమ్యూనిటీ హాలు నిర్మాణం చేయాలన్నారు. మండల సమాఖ్య ఆఫీసు బేరర్స్‌కు 5 వేలరూపాయల గౌరవ వేతనం చెల్లించాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక బిల్డింగ్, కంప్యూటర్ ఆపరేటర్ ఇవ్వాలని కోరారు. గ్రామ దీపికలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, హెచ్ఆర్సీ పాలసీ చేయాలన్నారు. నిధులు మంజూరు చేయాలి: ఎన్డీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు స్వయం సహాయక సంఘాల్లోని మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను ప్రభుత్వం ఇతర పనులకు వినియోగిస్తు దుర్వినియోగం చేస్తోందని న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. ఆందోళన చేస్తున్న మహిళలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... ఐకేపీ మహిళల అభివృద్ధికి కావాల్సిన నిధులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడినర్సయ్య, ఎన్డీ రాష్ట్ర నేత రాయలచంద్రశేఖర్, పీఓడబ్ల్యు జిల్లా నాయకురాలు చండ్ర అరుణ,నాయకులు ప్రసాద్, అయిలయ్య, కిన్నెరనర్సయ్య, రమణ, పూనెం కమల, ఉపేంద్ర, మాచర్ల సత్యం, సుభద్ర,సక్రు తదితరులు పాల్గొన్నారు.