సంగారెడ్డి అర్బన్: ఐకేపీ వీవోఏలకు 17 నెలలుగా వేతనాలు చెల్లించడంలేదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కలెక్టరేట్ వద్ద ఐకేపీ వీవోఏల రిలే నిరాహరదీక్షలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్మిక సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవడంలేదన్నారు.
వీవోఏలకు వెంటనే వేతనాలు చెల్లించాలని, వారికి కనీస వేతనంగా రూ.15వేలు చెల్లించాలని, పొదుపు సంఘాలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. దీక్షల్లో వీవోఏల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేష్, వెంకటేష్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సాయిలు, ిపీఎన్‌ఎం నాయకులు నాగభూషణం, శ్రామిక మహిళ సంఘం నాయకులు నర్సమ్మ, సీఐటీయూ నాయకులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
పేదలను దిక్కులేనివారిగా చేస్తారా..
ఉపాధి హామీ పథకానికి సవరణలు చేస్తే కేంద్ర ప్రభుత్వంపై తిరగబడతామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.రాజయ్య హెచ్చరించారు. ఉపాధి హామీలో తెస్తున్న సవరణలను వ్యతిరేకిస్తూ బుధవారం కలెక్టరేట్ ఎదుట సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్వో దయానంద్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకునేందుకు అన్ని సంఘాలు కలిసి రావాలన్నారు.
పథకంలో యంత్రాలు ప్రవేశపెట్టడమంటే కూలీలను కూటికి దూరం చేయడమన్నారు. దేశ వ్యాప్తంగా మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని 6759 మండలాల నుంచి 2,500 మండలాలకు, రాష్ట్ర వ్యాప్తంగా 443 మండలాల నుంచి 78 మండలాలకు, జిల్లాలో 46 మండలాలకు గాను కేవలం 8 మండలాలకు మాత్రమే పరిమితం చేసేందుకు కేంద్రం పూనుకుంటోందన్నారు. ప్రభుత్వం కుదింపును తక్షణమే విరమించుకోవాలన్నారు. ధర్నాలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, జయరాజు, నాయకులు మాణిక్యం, సాయిలు, నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
17 నెలలుగా ఐకేపీ వీవోఏలకు వేతనాల్లేవు!
Published Thu, Nov 27 2014 12:21 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement