విశాఖపట్నం జిల్లా చోడవరంలోని ఆంధ్రాబ్యాంక్ శాఖలో గత అర్థరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది.
విశాఖపట్నం జిల్లా చోడవరంలోని ఆంధ్రాబ్యాంక్ శాఖలో గత అర్థరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో బ్యాంక్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి పోలీసులకు, అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
అలాగే పోలీసులు కూడా సంఘటన ప్రదేశానికి చేరుకున్నారు. ఆంధ్రబ్యాంక్లో సంభవించిన ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు భావిస్తున్నారు. అగ్నిప్రమాదంలో బ్యాంక్లోని కంప్యూటర్లు, ఫర్నీచర్లు దగ్దమైనాయి. రూ.20 లక్షల మేరు ఆస్తి నష్టం సంభవించిందని బ్యాంక్ అధికారులు అంచనా వేస్తున్నారు. అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.