వడ్డీ వ్యాపారి వేధిస్తున్నాడంటూ ఇద్దరు మహిళల ఫిర్యాదు
చోడవరం : చోడవరంలో కాల్‌మనీ కేసు నమోదయింది. తమను వడ్డీ వ్యాపారి వేధిస్తున్నాడంటూ ఇద్దరు మహిళలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న మేరకు వివరాలు ఇలా ఉన్నాయి...కొత్తకోటకు చెందిన ఇసరపు రమణ అనే వడ్డీ వ్యాపారి వద్ద తాను రూ.4 లక్షలు అప్పుతీసుకున్నానని, ఆ సమయంలో కొన్ని ప్రాంసరీనోట్లు, నాలుగు చెక్కులు ఇచ్చానని ఉలికిరి లక్ష్మి అనే మహిళ తెలిపింది. అప్పు తీర్చినప్పటికీ ప్రాంసరీ నోట్లు, చెక్కులు తిరిగి ఇవ్వలేదని, ఎన్నిసార్లు అడిగినా ఇస్తానని చెప్పి వెళ్లిపోతున్నాడని వాపోయింది.
గట్టిగా అడిగితే వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే వడ్డీ వ్యాపారి వద్దే తాను కూడా రూ.5లక్షలు అప్పుతీసుకున్నాని మరో మహిళ సత్యవతి తన ఫిర్యాదులో పేర్కొంది. మొదట రూ.2 వడ్డీ అని చెప్పి ఇప్పుడేమో రూ.5 చొప్పున చెల్లించాలని డిమాండ్ చేస్తున్నార ని తెలిపింది. నాలుగు ప్రాంసరీ నోట్లు, నాలుగు చెక్కులు కూడా ఇచ్చానని, వడ్డీ గురించి అడిగితే వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె తెలిపింది. ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి, చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ రమణయ్య తెలిపారు.
చోడవరంలో మరో కాల్‌మనీ కేసు
Published Fri, Feb 5 2016 11:36 PM | Last Updated on Sun, Sep 3 2017 5:01 PM
Advertisement
Advertisement