
సాక్షి, అనకాపల్లి జిల్లా: చోడవరం చక్కెర కర్మాగారం రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. షుగర్ ఫ్యాక్టరీకి గ్రాంట్ రూపంలో రూ.12 కోట్ల 30 లక్షల రూపాయల నిధులు ప్రభుత్వం విడుదల చేసింది.
చెరుకు రైతుల బాకీల నిమిత్తం రూ.9 కోట్ల 30 లక్షల రూపాయలు, కార్మికుల జీతాల పెండింగ్ బిల్లుల కోసం మూడు కోట్ల రూపాయలు గ్రాండ్ రూపంలో ప్రభుత్వం విడుదల చేసింది. నిధులు విడుదల పట్ల రైతులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment