అధికారంలోకి రాగానే చోడవరం చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తాం.. | Chodavaram Sugar factory Will Be Opened Says YS jagan | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 1 2018 7:48 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

చోడవరం ఫ్యాక్టరీపై దాదాపు 20వేల మంది రైతులు ఆధారపడ్డారు. గతంలో ఇదే చంద్రబాబు పాలనలో ఈ ఫ్యాక్టరీ 45 కోట్ల నష్టాల్లోకి వెళ్లింది. ఆయన కోఆపరేటివ్‌ ఫ్యాక్టరీలను బతకనివ్వడు. తెలిసిన వారికి వాటిని శనక్కాయపుట్నాల్లా అంటగడుతాడు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఫ్యాక్టరీలకు పునర్వైభవం తీసుకొచ్చారు. సబ్సిడీ కూడా ఇచ్చారు. 45 కోట్ల నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీని లాభాల్లోకి తీసుకొచ్చారు. మళ్లీ బాబు సీఎం అయ్యాడు. ఆ ఫ్యాక్టరీ 100 కోట్ల నష్టాల్లోకి వెళ్లింది. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జగన్‌ అనే నేను మీ అందరికి విశాఖ జిల్లాలో ఉన్న అన్ని ఫ్యాక్టరీలను తెరిపిస్తానని హామీ ఇస్తున్నాను. 100 కోట్ల నష్టాల్లో ఉన్న చోడవరం ఫ్యాక్టరీకి పూర్వవైభవం తీసుకొస్తామని తెలుపుతున్నాను. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement