ఉషోదయ కాలేజీ అవినీతిపై విచారణ జరపాలి | Fees reimbursement, students scholarship scam in ushodaya degree college, says ABVP | Sakshi
Sakshi News home page

ఉషోదయ కాలేజీ అవినీతిపై విచారణ జరపాలి

Published Sun, Sep 7 2014 12:48 PM | Last Updated on Fri, Nov 9 2018 4:51 PM

Fees reimbursement, students scholarship scam in ushodaya degree college, says ABVP

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా చోడవరం ఉపోదయ డిగ్రీ కాలేజీ యాజమాన్యం ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల పేరిట రూ. 9 కోట్లు స్వాహా చేసిందని ఏబీవీపీ ఆరోపించింది.  ఆ కాలేజీ యాజమాన్యం జరిపిన అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని ఏబీవీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆదివారం చోడవరంలో ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ... 2013 విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంతకాలను ఫోర్జరీ చేసి... ఏటీఎం కార్డుల ద్వారా వారికి అందవలసిన సొమ్మును డ్రా చేశారని తెలిపారు.

సీబీఐ విచారణతోనే కాలేజీ యాజమాన్యం జరిపిన దారుణం బయటపడుతుందని వారు స్పష్టం చేశారు. స్వాహా చేసి సొమ్మును యాజమాన్యం నుంచి రాబట్టి ... విద్యార్థులకు ఇప్పించి... నిందితులను కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement