బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ ర్యాలీ | Students conduct rally against Bauxite mining | Sakshi
Sakshi News home page

బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ ర్యాలీ

Published Fri, Nov 20 2015 6:54 PM | Last Updated on Fri, Nov 9 2018 4:51 PM

Students conduct rally against Bauxite mining

చోడవరం (విశాఖపట్నం) : విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ శుక్రవారం విశాఖ జిల్లా చోడవరంలో భారీ సంఖ్యలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. సుమారు వెయ్యి మంది కళాశాల విద్యార్థులు గాంధీగ్రామ్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి మెయిన్ రోడ్డు, కొత్తూరు జంక్షన్, కాంప్లెక్స్ వరకూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లారు.

 

బాక్సైట్ తవ్వకాలకు ఉద్దేశించి జీవో 97ను తాత్కాలికంగా రద్దు చేయడం కాదని, పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బాక్సైట్ తవ్వకాలతో సాగు, తాగునీరు కలుషితం అవుతుందని, అటవీ ప్రాంతం అంతరించిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఇన్‌చార్జ్ తహశీల్దార్ రామారావుకు వినతిపత్రం ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement