ప్రభుత్వానికి విద్యార్థులే బుద్ధి చెప్పాలి | students will be give answer to govt | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానికి విద్యార్థులే బుద్ధి చెప్పాలి

Published Wed, Jul 27 2016 7:58 PM | Last Updated on Fri, Nov 9 2018 4:46 PM

ప్రభుత్వానికి విద్యార్థులే బుద్ధి చెప్పాలి - Sakshi

ప్రభుత్వానికి విద్యార్థులే బుద్ధి చెప్పాలి

మాజీ హోం మంత్రి సబితారెడ్డి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో ధర్నా

శంకర్‌పల్లి : విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీ హోంమంత్రి సబితారెడ్డి అన్నారు. విద్యార్థుల పీజురీయింబర్స్‌ విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలపై ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శంకర్‌పలి్‍్ల ప్రధాన చౌరస్తాలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సబితారెడ్డితో పాటు చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ కార్తీక్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థి లోకం కదిలి వచ్చినప్పుడు వారిని ఉపయోగించుకొని ఇప్పుడు వారి సమస్యను తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి పేద విద్యార్థుల ఉన్నత చదువులు అందించేందుకు ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అమలు చేస్తే చాలా మంది నిరుపేద విద్యార్థులు నేడు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారన్నారు. గత రెండేళ్లుగా ప్రభుత్వం ఫీజులు విడుదల చేయకపోవడంతో కళాశాల యాజమాన్యం ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై వత్తిడి తెస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చాలా మంది ఫీజులు కట్టలేక చదువులకు దూరమై కూలీ పనులకు వెళుతున్నారని తెలిపారు.

             ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థులు పాల్గొనడం వల్లే  కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారని అదే యూనివర్సిటిలో విద్యార్థుల మెస్‌ బిల్లులు రూ.7 కోట్లు పెండింగ్‌లో ఉన్నా.. ఇంత వరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం అని ప్రచారం చేసి ఇప్పుడు నిరుద్యోగులను రోడ్డుకీడ్చి తన ఇంట్లో మాత్రం నలుగురికి ఉద్యోగాలు కల్పించుకొని కుటుంబపాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన అనేకంటే.. తుగ్లక్‌ పాలన కొనసాగుతుందని ఆరోపించారు. అనవసరమైన వాటికి కోట్ల ఖర్చు చేస్తూ నిరుపేద విద్యార్థుల చదువులకు డబ్బు ఇవ్వడం లేదన్నారు. కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని ప్రచారం చేసి ఇప్పుడు దానిపై కన్నెత్తి కూడా చూడడం లేదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు గోవర్దన్‌రెడ్డి, ఎంపీపీ నర్సింలు, జెడ్పీటీసీ కళావతి విఠలయ్య, వైస్‌ ఎంపీపీ శశిధర్‌రెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు పాండురంగారెడ్డి, భూషణం, నర్సింహారెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు ప్రశాంత్‌, విక్రాంత్‌సింగ్‌, శ్రీనివాస్‌రెడ్డి, టంగటూర్‌ సర్పంచ్‌ నర్సింహారెడ్డి, ఎంపీటీసీ యాదిరెడ్డి, జనవాడ ఎంపీటీసీ మైసయ్య, సీనియర్‌ నాయకులు విఠలయ్య, మాణిక్‌రెడ్డి, ప్రకాశ్‌, రవీందర్‌, పార్శిబాలకృష్ణ, గౌస్‌ఖురేషి, ఖాదర్‌పాష, మహిళ సంఘం నాయకులు నాగమణి, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement