రీయింబర్స్ విడుదల చేయాలని డిగ్రీ కాలేజీల బంద్
శంషాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు
వెంటనే బకాయిలను విడుదల చేయాలని ఆందోళన
శంషాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలంటూ గురువారం శంషాబాద్‌లోని డిగ్రీ కళాశాలల బంద్ నిర్వహించారు. విద్యార్థులు పట్టణంలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కళాశాలల యజమానులు మాట్లాడుతూ.. కోట్లాది రూపాయల ఫీజులు బకాయిలు ఉండడంతో కళాశాలల మనుగడకు ప్రమాదం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేవారు. ఈనేపథ్యంలో విద్యార్థులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ప్రబుత్వం రెండేళ్లుగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయడంలో తాత్సారం చేస్తుందని మండిపడ్డారు.
సర్కార్ రాష్ట్రంలో విద్యార్థులకు చదువులపై భరోసా లేకుండా వ్యవహరిస్తుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం వెంటను బకాయిలను విడుదల చేసి విద్యాసంస్థలతో పాటు విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అంతకుముందు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. జాతీయ రహదారిపై ఆందోళనకు దిగడంతో పోలీసులు విద్యార్థులను వారించారు. ఈనేపథ్యంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కొందరు విద్యార్థులను ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌కు తరలించి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాలల యజమానులు సతీష్, బుచ్చిరెడ్డి, జనార్దన్, సంతోష్‌కుమార్, నర్సింహా, విద్యార్థులు ఉన్నారు.