colleges bandh
-
తెలంగాణ వ్యాప్తంగా కాలేజీల సమ్మె! ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు డిమాండ్
-
ముంబైను వణికించిన భారీ వర్షాలు.. 6 గంటల్లో 300 మి. మీ వర్షం
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో ముంబైతోపాటు పక్కనే ఉండే థానే, పాల్ఘర్, రాయ్ గడ్ ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. నడుములోతు నీళ్లలో పలువురు ప్రయాణిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కేవలం ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ఏకధాటిగా 300 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసింది. దీంతో భారత వాతావరణ శాఖ ముంబై,, థానే, పాల్ఘర్, కొంకణ్ బెల్ట్‌కు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ముంబైలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ము, న్సిపల్ పాఠశాలలతోపాటు కళాశాలలకు సెలవులు ప్రకటించారు.#WATCH | Maharashtra: The traffic slows down on Western Express Highway near Vile Parle as heavy rain lashes Mumbai city. pic.twitter.com/aAzQaayTqO— ANI (@ANI) July 8, 2024 భారీ వర్షాలు, వరదల కారణంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, కుర్లా–విక్రోలీ, బంధూప్ స్టేషన్లలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు సెంట్రల్ రైల్వే పేర్కొంది. డోంబివిలీ స్టేషన్లో ప్రజలు నీట మునిగిన ట్రాక్‌లపై రైళ్ల కోసం వేచి ఉన్నారు. వర్లీ, బుంటారా భవన్, కుర్లా ఈస్ట్, ముంబైలోని కింగ్స్ సర్కిల్ ప్రాంతం, దాదర్, విద్యావిహార్ రైల్వే స్టేషన్లలో నీరు నిలిచిపోయింది. కాగా ముంబై, థానే, పాల్ఘర్, రాయ్‌గడ్‌లలో ప్రతిరోజూ 30 లక్షల మంది ప్రయాణికులు సబర్బన్ లోకల్ రైలు సేవలను ఉపయోగిస్తుంటారు.'బెస్ట్' బస్ ట్రాన్స్ పోర్ట్ సైతం భారీ వర్షాల కారణంగా ముంబైలోని వివిధ ప్రాంతాల్లో బస్సులను దారిమళ్లించినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఒక జాబితాను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఇక థానే, వసాయ్ (పాల్ఘర్), మహద్ (రాయ్ గడ్), చిప్లున్ (రత్నగిరి), కొల్హాపూర్, సంగ్లీ, సటారా, ఘట్కోపర్, కుర్లా, సింధుదుర్గ్ లలో వరద సహాయ చర్యలను చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ప్రభుత్వం మోహరించింది. ముంబైలోని అంధేరీలో మూడు బృందాలతోపాటు నాగ్ పూర్ లో అదనపు బృందాలను సిద్ధంగా ఉంచింది.ఒక్క రోజు వర్షానికే ముంబై వణికిపోగా.. వచ్చే మూడు రోజులపాటు ముంబైతోపాటు మహారాష్ర్టలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబైలో సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 4.4 మీటర్ల ఎత్తులో సముద్రపు అలలు ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది. -
రీయింబర్స్ విడుదల చేయాలని డిగ్రీ కాలేజీల బంద్
శంషాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు వెంటనే బకాయిలను విడుదల చేయాలని ఆందోళన శంషాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలంటూ గురువారం శంషాబాద్‌లోని డిగ్రీ కళాశాలల బంద్ నిర్వహించారు. విద్యార్థులు పట్టణంలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కళాశాలల యజమానులు మాట్లాడుతూ.. కోట్లాది రూపాయల ఫీజులు బకాయిలు ఉండడంతో కళాశాలల మనుగడకు ప్రమాదం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేవారు. ఈనేపథ్యంలో విద్యార్థులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ప్రబుత్వం రెండేళ్లుగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయడంలో తాత్సారం చేస్తుందని మండిపడ్డారు. సర్కార్ రాష్ట్రంలో విద్యార్థులకు చదువులపై భరోసా లేకుండా వ్యవహరిస్తుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం వెంటను బకాయిలను విడుదల చేసి విద్యాసంస్థలతో పాటు విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అంతకుముందు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. జాతీయ రహదారిపై ఆందోళనకు దిగడంతో పోలీసులు విద్యార్థులను వారించారు. ఈనేపథ్యంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కొందరు విద్యార్థులను ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్‌కు తరలించి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాలల యజమానులు సతీష్, బుచ్చిరెడ్డి, జనార్దన్, సంతోష్‌కుమార్, నర్సింహా, విద్యార్థులు ఉన్నారు. -
మూడు రోజులు కాలేజీలు బంద్
ఫీజు బకాయిలు, డిగ్రీ ప్రవేశాల్లో గందరగోళానికి నిరసనగా.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ కాలేజీలను గురువారం నుంచి శనివారం వరకు (మూడు రోజులు) బంద్ చేయాలని తెలంగాణ ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజ్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ నిర్ణయించింది. దీంతో ఆదివారం కలుపుకొని నాలుగు రోజులపాటు కాలేజీలు బంద్ కానున్నాయి. ప్రభుత్వం ఫీజు బకాయిలను విడుదల చేయనందుకు నిరసనగా, డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల కారణంగా 20 వేల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందలేని పరిస్థితి కల్పించిన అధికారుల వైఖరిని నిరసిస్తూ బంద్‌కు పిలుపునిచ్చినట్లు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 2014-15, 2015-16 విద్యా సంవత్సరాలకు సంబంధించి కాలేజీ యాజమాన్యాలకు రావాల్సిన ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం హామీ ఇచ్చినా బకాయిలు విడుదల కాకపోవడం దారుణమన్నారు. 2016-17 విద్యా సంవత్సరానికి ఈ-పాస్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. డిగ్రీ ప్రవేశాల్లో ఆన్లైన్ విధానంపై అవగాహన లేక వేల మంది విద్యార్థులు కాలేజీల్లో సీట్లు రాక నష్టపోయారని, వారికి మళ్లీ ప్రవేశాలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. -
కాలేజీల బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు
పోలీసుల లాఠీఛార్జ్‌ను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు శనివారం కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చాయి. కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదువుతున్న రవళి అనే విద్యార్థిని అనుమానస్పద స్థితిలో శుక్రవారం రాత్రి మృతిచెందింది. ఆమె మృతిపై విద్యార్థి సంఘాలు పలు అనుమానాలు వ్యక్తం చేశాయి. అనంతరం విద్యార్థి నాయకులు కళాశాల వద్దకు చేరుకుని విద్యార్థిని మృతిపై విచారణ జరిపించాలని ధర్నా చేశారు. ఆందోళన చేస్తూ కాలేజీలోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో విద్యార్థి సంఘాల నాయకులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీలు ఝుళిపించారు. అందుకు నిరసనగా విద్యార్థి సంఘాలు కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చాయి.