పోలీసుల లాఠీఛార్జ్ను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు శనివారం కాలేజీల బంద్కు పిలుపునిచ్చాయి. కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదువుతున్న రవళి అనే విద్యార్థిని అనుమానస్పద స్థితిలో శుక్రవారం రాత్రి మృతిచెందింది. ఆమె మృతిపై విద్యార్థి సంఘాలు పలు అనుమానాలు వ్యక్తం చేశాయి.
అనంతరం విద్యార్థి నాయకులు కళాశాల వద్దకు చేరుకుని విద్యార్థిని మృతిపై విచారణ జరిపించాలని ధర్నా చేశారు. ఆందోళన చేస్తూ కాలేజీలోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో విద్యార్థి సంఘాల నాయకులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీలు ఝుళిపించారు. అందుకు నిరసనగా విద్యార్థి సంఘాలు కాలేజీల బంద్కు పిలుపునిచ్చాయి.
కాలేజీల బంద్కు విద్యార్థి సంఘాల పిలుపు
Published Sat, Nov 8 2014 9:00 AM | Last Updated on Fri, Nov 9 2018 4:19 PM
Advertisement
Advertisement