చోడవరం (విశాఖపట్నం) : చక్కెర బస్తాలు లోడ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు బస్తాలు జారిపడటంతో.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్లను ఆస్పత్రికి తరలించగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా చోడవరం లోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో శుక్రవారం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో చక్కెర బస్తాలను లారీలో లోడ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు జారి కూలీలపై పడ్డాయి. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.