
కన్నడ నటుడు సిద్ధూకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే ధర్మశ్రీ
సాక్షి, రోలుగుంట (చోడవరం): ప్రముఖ కన్నడ సినీ నటుడు గొంది సిద్ధూ తన అనుచరులతో ఆదివారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయన సొంత ఊరు.. విశాఖ జిల్లా రోలుగుంట మండలం బీబీపట్నం. రత్నంపేటలో జరిగిన సభలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పార్టీ కండువా వేసి సిద్ధూను ఆహ్వానించారు. ఈ సందర్భంగా నటుడు సిద్ధూ మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ గ్రామానికి వచ్చిన కరణం ధర్మశ్రీ బోరు, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి ఎమ్మెల్యే అయిన వెంటనే నెరవేర్చారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీఎం వైఎస్ జగన్ ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ప్రశంసించారు. అంతేకాకుండా పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలుచేయడంలో ఆయనను మించిన సీఎం ఎవరూ ఉండరని, ఉండబోరని కొనియాడారు. (అవినీతిపై తిరుగులేని అస్త్రం)