చోడవరం (విశాఖపట్నం) : పొలంలో విద్యుత్ స్తంభం ఏర్పాటు కోసం రైతు నుంచి లంచం తీసుకుంటూ ఓ లైన్‌ఇన్‌స్పెక్టర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం...జిల్లాలోని కోటపాడు మండలం దాలివలస గ్రామానికి చెందిన బండారు శ్రీనివాసరావు అనే రైతు తన పొలంలో విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయాలంటూ లైన్ ఇన్‌స్పెక్టర్ అప్పాజీబాబును ఆశ్రయించారు. అయితే ఆయన రూ.10 వేలు డిమాండ్ చేశాడు. చివరికి రూ.8 వేలకు ఒప్పందం కుదిరింది.
దీనిపై ఆ రైతు అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) అధికారులకు ఉప్పందించారు. వారి సూచన మేరకు సోమవారం సాయంత్రం రైతు శ్రీనివాసరావు పొలంలో స్తంభం ఏర్పాటు చేసే చోటును పరిశీలించటానికి వచ్చిన అప్పాజీబాబుకు రూ.8 వేలు లంచం అందించారు. అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు లైన్ ఇన్‌స్పెక్టర్ అప్పాజీబాబును పట్టుకుని, కేసు నమోదు చేశారు.
ఏసీబీకి పట్టుబడ్డ లైన్‌ఇన్‌స్పెక్టర్
Published Mon, Sep 7 2015 8:02 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement