
సాక్షి, విశాఖపట్నం : తప్పుడు రాతలు రాస్తున్న వ్యక్తులు ఎలాంటివారైనా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మండిపడ్డారు. విశాఖపట్నంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపడుతున్నఅభివృద్ధిని ఓర్వలేకే ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని ఆరోపించారు.విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పోలవరం టెండర్ల ద్వారా ప్రభుత్వం నిజాయితీ ప్రదర్శించిందని పేర్కొన్నారు. పోలవరంకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో నవయుగ కంపెనీ 4.8 శాతం ఎక్కువగా టెండర్లు వేసినట్లు నిపుణులు నిర్ధారించారు.
ఈ ప్రాజెక్టు టెండర్లను మేఘా ఇంజనీరింగ్ సంస్థ రూ. 4359 కోట్లకు దక్కించుకోవడం ద్వారా ప్రభుత్వానికి డబ్బు ఆదా అవుతోంది. దీంతో 2020 కల్లా పోలవరం పనులు పూర్తి కానున్నట్లు తెలిపారు. కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టును రూపొందించిన అనుభవం మెగా సంస్థకు ఉండడం కలిసొచ్చిన అంశమని వెల్లడించారు. పోలవరం పూర్తయితే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment