చోడవరం(విశాఖపట్నం జిల్లా): చోడవరం మండలం గంధి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చంద్రశేఖర్(26), సునీత(24)లు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. చంద్రశేఖర్ ఎంఎస్సీ, సునీత బీఈడీ చదువుకున్నారు. ఒకరు అనకాపల్లి, మరొకరు చోడవరంలో టీచర్లుగా పనిచేస్తున్నారు. జాబ్ వచ్చాక పెళ్లి చేసుకుందామనుకున్నారు. సునీత ఇంట్లో పెళ్లి సంబంధం చూసి మేనెలలో ముహూర్తాలు పెట్టుకున్నారు. దీంతో ఇద్దరూ చోడవరం వచ్చి ఈ విషయం గురించి చర్చించుకున్నారు. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భావించిన ఇద్దరూ తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగారు. ఇది గమనించిన స్థానికులు వారిని వెంటనే చోడవరం ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ శేఖర్ మరణించాడు. సునీత పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.