ర్యాగింగ్ చట్ట రీత్యా నేరం
ర్యాగింగ్ చట్ట రీత్యా నేరం
Published Sat, Sep 3 2016 11:25 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM
చోడవరం : ర్యాంగింగ్‌కు పాల్పడడం చట్టరీత్యా నేరమని చోడవరం సివిల్ జడ్జి లక్ష్మి అన్నారు. చోడవరం కలాసీల కల్యాణ మండపంలో విద్యార్థి జూనియర్ కాలేజీ విద్యార్థులకు న్యాయవిజ్ఞాన సదస్సు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలేజీ వయస్సు మనిషి ఎదుగుదలకు చాలా కీలకమన్నారు. కాలేజీల్లో ర్యాగింగ్ చేయడం, తోటి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం చట్టరీత్యా నేరమని ఆమె అన్నారు. ఇంటర్మీడియట్ చదువు జీవితంలో ఎదుగుదలకు ఎంతో కీలకమన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యశించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ మూర్తి, గోతిరెడ్డి రాంబాబు పాల్గొన్నారు.
Advertisement
Advertisement