
కళాశాల బస్సులో ర్యాగింగ్
బీబీనగర్‌లోని టీడీఆర్ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన ఓ విద్యార్థి గురువారం ర్యాగింగ్‌కు గురయ్యాడు.
బాధితుడు తమ కుటుంబ సభ్యులకు విషయం తెలపడంతో వారు శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు ఎస్‌ఐ సురేష్‌కుమార్ తెలిపారు. ర్యాగింగ్‌కు పాల్పడినట్లు తేలితే సదరు విద్యార్థులను కళాశాల నుంచి సస్పెండ్ చేస్తామని కరస్పాండెంట్ దినేశ్‌రెడ్డి చెప్పారు. ఇదిలా ఉంటే ర్యాగింగ్‌ను నిరసిస్తూ కళాశాల ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.