హుజూరాబాద్ (కరీంనగర్) : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో పోలీసుల సాధారణ తనిఖీల్లో భాగంగా శనివారం భారీ ఎత్తున డిటోనేటర్లు, జిలిటెన్ స్టిక్స్ బయటపడ్డాయి. ఈ విషయాన్ని హుజూరాబాద్ సీఐ శనివారం మీడియాకు వెల్లడించారు.
ఎలాంటి అనుమతీ లేకుండా ఆటోలో 10 డిటోనేటర్లు, 400 జిలిటెన్ స్టిక్స్ తరలిస్తుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.