జమ్మూ కశ్మీర్: భారత్-చైనా సరిహద్దు ప్రతిష్టంభన కొనసాతున్న నేపథ్యంలో డ్రాగన్ దేశం దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. లద్దాఖ్ సరిహద్దు వద్ద భారత వ్యకతిరేక కార్యకాలాపాలు, అశాంతిని రెచ్చగొట్టడానికి పాకిస్తాన్‌తో పన్నాగం పన్నుతున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. జమ్మూ కశ్మీర్‌లో పెద్ద ఎత్తును ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పెలుడు పదార్థాలను మోహరించాలని చైనా పాకిస్తాన్‌కి ఆదేశించినట్లు తెలిపారు. జమ్మూకు పెద్ద ఎత్తును ఆయుధాలు తరలించాలనే ప్రణాళికను అమలు చేయాలని డ్రాగన్ దేశం పాక్‌కి సూచించిందని భారత ప్రభుత్వానికి ఇంటలిజెన్స్ వర్గాలు నివేదికలు అందించాయి. ఇటీవల భద్రతా ధళాలు స్వాధీనం చేసుకున్న ఆయుధాల ద్వారా భారత్‌లో హింస, ఆశాంతిని పెంచడానికి చైనా పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐకి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ ఆయుధాలపై చైనా దేశానికి సంబంధించిన గుర్తులు ఉన్నట్లు గుర్తించారు. (దక్షిణ కొరియాకు సారీ చెప్పిన కిమ్)
భారత భద్రతా దళాలు ఏర్పాటు చేసిన చొరబాటు నిరోధక గ్రిడ్ కారణంగా కశ్మీర్ లోయలో పాకిస్తాన్ ఉగ్రవాదులు, ఆయుధాల మోహరింపు తగ్గిందని తెలిపారు. ఇంటలిజెన్స్ నివేదికలు వెలువడిన నేపథ్యంలో భారత భద్రతా దళాలు నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు నిరోధక గ్రిడ్‌ను మరింత బలోపేతం చేశాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చీఫ్ రాకేశ్ అస్థానా, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ చీఫ్ ఏపీ మహేశ్వరి, భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించి గత పది రోజుల నుంచి చోటుచేసున్న పరిస్థితులను సమీక్షించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆర్మీ చీఫ్ ఎంఎం నారావణే ఆదేశించారు. (భారత్‌కు భయపడుతున్న చైనా జవాన్లు!)
రెండు రోజుల క్రితం జమ్మూ నుంచి దక్షిణ కాశ్మీర్‌కు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అనుమానితులను భద్రతా దళాలు అరెస్టు చేశారు. వారి వద్ద చైనా గుర్తులు ఉన్న నోరిన్కో / ఈఎంఇఐ టైప్ 97 ఎన్ఎస్ఆర్ రైఫిల్, 190 రౌండ్లతో నాలుగు మ్యాగజైన్స్, 21 ఎ రౌండ్లు, మూడు గ్రెనేడ్లతో నాలుగు మ్యాగజైన్స్ కలిగిన ఏకే 47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత భద్రతా బలగాలు సరిహద్దు వద్ద అప్రమత్తమైనట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment