
సాక్షి, విజయనగరం: గుర్ల మండలం దేవుని కనపాక పంచాయతీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గవిపేట సమీపంలోని మందు గుండు సామాగ్రి కంపెనీలో పేలుడు సంభవించింది. కంపెనీలోని ఆరు గోడౌన్‌లకు నిప్పు అంటుకోవడంతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి.
మంటల్లో ఇద్దరు వ్యక్తులు చిక్కుకున్నట్లు సమాచారం.కీలోమీటరు దూరం వరకు మంటలు వ్యాపించినట్లు కనిపిస్తున్నాయి. అగ్నికీలలు, పేలుడు ధాటికి పరిసర గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.