gurla mandal
-
గుర్ల బాధిత కుటుంబాలకు అండగా వైఎస్సార్సీపీ.. చెక్కులు అందజేత
సాక్షి, విజయనగరం: ఏపీలో కూటమి ప్రభుత్వ నేతల్లో ప్రజల పట్ల బాధ్యత లేదన్నారు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. చంద్రబాబు సర్కార్ డయేరియా బాధితులను పట్టించుకోలేదన్నారు. డయేరియా మరణాలు ఎంతో బాధాకరమని చెప్పారు.విజయనగరంలోని గుర్ల మండలంలో డయేరియాతో మృతి చెందిన 13 కుటుంబాలకు వైఎస్సార్సీపీ తరఫున ఒక్కొక్కరికి రెండు లక్షలు ఆర్ధిక సాయం అందించారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ..‘డయేరియాతో మరణించడం బాధాకరం. అసెంబ్లీలో ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా సమాధానం చెప్పింది. ప్రభుత్వాన్ని ఎన్ని అడిగినా వాళ్లు సక్రమంగా సమాధానం చెప్పలేదు. సీఎం చంద్రబాబు.. ఎనిమిది మంది అని, డిప్యూటీ సీఎం పది మంది మృతి చెందారని చెప్పారు. ప్రభుత్వం ఒక్కరే అని చెప్పిందని మండిపడ్డారు.గతంలో నేను ఎప్పుడూ విజయనగరంలో ఇంత మంది డయేరియాతో చనిపోవడం చూడలేదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్లు బాధ్యతగా వ్యవహరించడం లేదు. డయేరియా బాధితుల విషయంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ వెంటనే స్పందించారు. ప్రజల పట్ల బాధ్యత వహించారు. బాధితులకు అండగా నిలిచారు. వైఎస్సార్సీపీ తరఫున ఒక్కో కుటుంబానికి రెండు లక్షలు ఆర్ధిక సాయం అందించారు. గుర్ల మండలానికి మేము వచ్చి చూసే వరకు ప్రభుత్వం బాధితులను పట్టించుకోలేదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
జగన్ మామయ్య ఉన్నప్పుడే బాగుంది
-
నీ కూతురికి అండగా నేనుంటా.. చిన్నారి కుటుంబానికి జగన్ భరోసా
-
ఓదార్చి.. ధైర్యం చెప్పి.. వైఎస్ జగన్ గుర్ల పర్యటన (ఫొటోలు)
-
డైవర్ట్ చేయొద్దు.. గుర్లలో YS జగన్ పరామర్శ..
-
ఎల్లో మీడియాకు గూబగుయ్ మనేలా జగన్ కౌంటర్
-
గుర్ల గ్రామంలో అడుగుపెట్టిన జగన్..
-
వైఎస్ జగన్ గుర్ల పర్యటనలో భద్రతా వైఫల్యం
సాక్షి, విజయనగరం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం విజయనగరం జిల్లా గుర్లలో పర్యటించారు. అక్కడ డయేరియా సోకి మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.అయితే వైఎస్ జగన్ గుర్ల పర్యటనలో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. వైఎస్ జగన్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరాగా.. వారిని అదుపు చేయడంలో పోలీసులు చేతులెత్తేశారు. జనాల తోపులాటలో షామియానాలు చిరిగిపోయాయి. జనాల తోపులాటతో వైఎస్ జగన్ మీడియా సమావేశానికి కొంత సేపు అంతరాయం ఏర్పడించింది. దీంతో పోలీసులు వైపల్యంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చిన జనాలను పోలీసులు కంట్రోల్ చేయలేకపోతే ఎలా అని మండిపడ్డారు. పోలీసుల నుంచి సహకారం లేదని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు మీడియాతో మాట్లాడుతుంటే.. కనీసం భద్రత కల్పించపోతే పోలీసులు ఎలా పనిచేస్తుస్తున్నారని ప్రశ్నించారు. చదవండి: కుటుంబ వ్యవహారాలను రాజకీయం చేస్తారా?: వైఎస్ జగన్ -
ఈసారి అమ్మ, చెల్లి ఫొటో పెట్టి రాజకీయం చేస్తున్నారు: వైఎస్ జగన్
సాక్షి, విజయనగరం: కూటమి సర్కార్ ఎన్నికల హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు వైఎస్ జగన్. టీడీపీ అక్రమాలు, అన్యాయాలు బయటపెడుతున్నామని మళ్లీ డైవర్షన్స్ మొదలుపెట్టారని చెప్పుకొచ్చారు. ఈసారి అమ్మ, చెల్లెలు ఫొటో పెట్టి రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్ గుర్లలో డయేరియాతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. అనంతరం, వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. జగన్ గుర్లకు వస్తున్నాడని తెలిసి మళ్లీ రాజకీయం చేస్తున్నారు. మా కుటుంబ విషయాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు. వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకే లడ్డూ అంశం తెరపైకి తెచ్చారు. టీడీపీ అక్రమాలు, అన్యాయాలు బయటపెడుతున్నామని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈసారి అమ్మ, చెల్లెలు ఫొటో పెట్టి రాజకీయం మొదలు పెట్టారు. కుటుంబ వ్యవహారాలను రాజకీయం చేస్తారా?. ఈనాడు, ఏబీఎన్, టీవీ-5, దత్తపుత్రుడు ఇప్పటికైనా మారాలి. మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా.. మీ కుటుంబాల్లో ఇలాంటి గొడవలు లేవా?. ఇలాంటివి ప్రతీ ఇంట్లోనూ ఉండే విషయాలే. నిజాలు లేకున్నా వక్రీకరించడం ఇప్పటికైనా మానుకోండి. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టండి. ప్రజల కష్టాల్లో పాలు పంచుకోండి. రాష్ట్రంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి వాటిని అరికట్టేందుకు దృష్టిసారించండి అని హితవు పలికారు. ఇదే సమయంలో విజయనగరంలో డయేరియాతో చనిపోయిన కుటుంబానికి రెండు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నట్టు వైఎస్ జగన్ ప్రకటించారు. డయేరియాతో ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. బాధితులకు ప్రభుత్వం సాయం అందిస్తుందా? లేదా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీనే ఇంత సాయం చేస్తుంటే.. బాధితులను పరామర్శిస్తుంటే.. ప్రభుత్వం నిద్ర మత్తులో ఉందా? అని మండిపడ్డారు. -
తమ ఆవేదనను జగన్ తో పంచుకున్న చిన్నారి
-
బాబు.. స్కూల్ బెంచ్‌లపై వైద్యం చేస్తారా?: వైఎస్ జగన్
సాక్షి, విజయనగరం: కూటమి ప్రభుత్వంలో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయని అన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. డయేరియా బారినపడిన వారిని మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రులకు ఎందుకు తరలించలేదు?. స్కూల్ బెంచ్‌లపై వైద్యం చేస్తారా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.గుర్లలో డయేరియా బాధితులను వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ క్రమంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం గుర్లలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ హయాంలో గ్రామస్వరాజ్యం తీసుకొచ్చాం. గ్రామాలను సస్యశ్యామలం చేశాం. కూటమి ప్రభుత్వంలో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. ఈరోజు పరిస్థితులు చూస్తే దారుణంగా ఉన్నాయి. వైఎస్సార్సీపీ హయంలో గ్రామ సచివాలయం ద్వారా సేవలు అందించాం. వివిధ శాఖలకు చెందిన సేవలు సత్వరమే అందించగలిగాం. అన్ని డిపార్టమెంట్ల సిబ్బంది అందుబాటులో ఉండేవారు...గ్రామ సచివాలయాల్లో వివిధ శాఖ ఉద్యోగులు కనిపించేవారు. విలేజ్ క్లినిక్‌ల ద్వారా 24/7 వైద్య సేవలు అందుబాటులో ఉండేవి. విలేజ్ క్లినిక్‌లను పీహెచ్‌సీలతో అనుసంధానం చేశాం. ఏఎన్ఎంలు కనిపించేవారు. ప్రతీ గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఉండేది. ప్రభుత్వం అలసత్వం కారణంగా గుర్లలో డయేరియాతో 14 మంది చనిపోయారు. ఇంత మంది చనిపోయినా ప్రభుత్వంలో చలనం లేదు. నేను ప్రశ్నించే వరకు డయేరియాపై ప్రభుత్వం స్పందించ లేదన్నారు.వైఎస్ జగన్ ఏమన్నారంటే..నాడు గ్రామ స్వరాజ్యం. మరి నేడు?ఈరోజు గుర్ల గ్రామం, మండలంలో ప్రత్యేక పరిస్థితులు చూసి, గమనిస్తే, చాలా ఆశ్చర్యం కలిగించే విషయాలు కళ్లెదుటే కనిపిస్తాయి. మా ప్రభుత్వ హయాంలో గ్రామ స్వరాజ్యం తీసుకొస్తే, ఆ గ్రామ స్వరాజ్యం ద్వారా గ్రామాలన్నీ సస్యశ్యామలంగా ఉంటే, ఈరోజు పరిస్థితి ఏమిటన్నది గమనించండి.నాడు వైఎస్సార్సీపీ హయాంలో గ్రామాలు చూస్తే.. ప్రతి గ్రామంలో సచివాలయాలు కనిపించేవి. అక్కడే వివిధ శాఖల వారు పని చేస్తూ కనిపించే ఉద్యోగులు ఉండేవారు. బడి పిల్లలు చక్కగా నవ్వుతూ కనిపించేవారు. మన గ్రామంలో డిజిటల్ లైబ్రరీలు కనిపించేవి. సచివాలయాల్లో పంచాయతీరాజ్ శాఖలో పని చేసే వాళ్లు కనిపించే వాళ్లు. అక్కడే విద్యా శాఖ చూసే వాళ్లు కూడా కనిపించేవారు.ఈరోజు గుర్ల మండలం, గ్రామంలో జరిగింది ప్రజలంతా గమనించమని కోరుతున్నాను. రాష్ట్రంలో పరిస్థితి గమనించమని కోరుతున్నాను.ఇదీ ఆ గ్రామ స్వరాజ్య స్వరూపంగ్రామంలో నాలుగు అడుగులు వేస్తే, విలేజ్ క్లినిక్స్ కనిపించేవి. అక్కడే రోజంతా, వారంలో ఏడు రోజుల పాటు, అక్కడే నివాసం ఉండే సీహెచ్‌ఓలు కనిపించేవారు, వారికి అనుసంధానంగా ఏఎన్ఎంలు, వారికి రిపోర్ట్ చేస్తూ ఆశా వర్కర్లు కనిపించేవారు. విలేజ్ క్లినిక్స్‌తో పాటు, ఒక పటిష్టమైన వ్యవస్థ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నడిచేది. పీహెచ్‌సీలు, విలేజ్ క్లినిక్స్‌ను అనుసంధానం చేసి, పీహెచ్‌సీల్లో డాక్టర్ల సంఖ్యను పెంచి, ప్రతి గ్రామానికి 15 రోజులకు డాక్టర్లు వచ్చే వ్యవస్థ.అదే గ్రామంలో నాడు–నేడుతో బాగుపడిన స్కూళ్లు. రైతన్నలను చేయి పట్టించుకుని నడిపించే వ్యవస్థ రైతు భరోసా కేంద్రాలు కనిపించేవి.చక్కగా ఈ–క్రాపింగ్ జరిగేది. రైతులకు ఉచిత పంటల బీమా అందేది. రైతులకు సకాలంలో పెట్టుబడి సహాయం అందేది.ఈరోజు గ్రామ స్వరాజ్యం ఎలా తయారైంది అని చెప్పడానికి గుర్ల గ్రామం ఒక ఉదాహరణ.జగన్ అనే వ్యక్తి ట్వీట్ చేస్తే తప్ప..ఇక్కడ డయేరియాతో ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఏకంగా 14 మంది చనిపోయిన పరిస్థితి. నీరు బాగాలేక, డయేరియా వచ్చి చనిపోయారు. ఇదే గ్రామానికి సంబంధించి, జగన్ అనే వ్యక్తి అక్టోబరు 19న ట్వీట్ చేస్తే తప్ప, ఇక్కడ 14 మంది చనిపోయారని చెప్పని పరిస్థితి.ఇదే గ్రామంలో సెప్టెంబరు 20వ తారీఖున, అంటే 35 రోజుల కిందట, ఇదే మండలంలోని పెనుబర్తిలో ఒక వ్యక్తి చనిపోయాడు. తొలి డయేరియా కేసు నమోదైంది. అయినా ఎవరూ పట్టించుకోని పరిస్థితి. ఎవరూ స్పందించని పరిస్థితి. అక్టోబరు 12 వచ్చేసరికి డయేరియా మరింత విజృంభించింది. గుర్ల, కోట గుండ్రేడు, గోషాడ, నగలవలస గ్రామంలో డయేరియా ఉధృతంగా ప్రబలింది. డయేరియా వల్ల ఏకంగా 14 మంది చనిపోయారు. అక్టోబరు 19న జగన్ ట్వీట్ చేస్తే తప్ప, ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఆ తర్వాత ప్రభుత్వం కదిలిందా? అంటే అదీ లేదు.తప్పుడు లెక్కలు. తక్కువ చూపే ప్రయత్నంకలెక్టర్ అంటాడు, ఇక్కడ కేవలం ఒకరే చనిపోయాడని. అలా దీన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారు. మంత్రులు, అధికారులు ఆ ప్రయత్నం చేశారు. ఎవరూ డయేరియాతో చనిపోలేదని చెప్పే కార్యక్రమం చేశారు. తీరా చూస్తే, అక్టోబరు 24 వచ్చేసరికి చూస్తే, 14 మంది చనిపోయారని తేలింది.ఇష్యూ పెద్దది కావడంతో, సీఎం చంద్రబాబు కూడా ఒప్పుకోక తప్పలేదు. ఇక్కడ డయేరియాతో 8 మంది చనిపోయారని చెప్పారు. ఇక్కడికి వచ్చిన డిప్యూటీ సీఎం 10 మంది చనిపోయారని చెప్పారు.తీరా, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజలకు కనీసం క్షమాపణ చెప్పి, జరిగిన తప్పును సరిదిద్దడం లేదు.ఈ దారుణ పరిస్థితికి కారణం?ఇక్కడ జరిగిన తప్పు గమనిస్తే.. పక్కనే చంపానది ఉంది. దాంట్లో నీళ్లు దారుణ పరిస్థితిలో ఉన్నాయి. చంపానది మీద ఈ మండలానికి సంబంధించి సమగ్ర సురక్షిత మంచినీటి సరఫరా (సీపీడబ్ల్యూఎస్) పథకం. చంద్రబాబు వచ్చిన తర్వాత, ఈ 5 నెలల్లో కనీసం మెయింటెనన్స్ రెన్యూవల్ కూడా చేయలేదు. దాని ఫిల్టర్లు మార్చారా? లేదా? కనీసం క్లోరినేషన్ జరిగిందా? అన్న కనీసం ఆలోచన కూడా చేయలేదు.శానిటేషన్ లేదు. గ్రామంలో సచివాలయం ఉంది. వారి సహాయ, సహకారంతో గ్రామంలో శానిటేషన్ చేయాలన్న ఆలోచన కూడా చేయలేదు.ఈ మండలానికి సంబంధించి 345 మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో అంత కంటే ఎక్కువగా దాదాపు 450 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటికీ విజయనగరం జిల్లాలో గరివిడి, గజపతినగరం, దత్తిరాజేరు మండలాల్లో డయేరియా కేసులు నమోదవుతున్నాయి. ఇంకా 62 మంది చికిత్స పొందుతున్నారు.ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు.ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాలిఇంతటి దారుణమైన పరిస్థితి ఉంటే, ప్రభుత్వం ఏం చేస్తోంది? కనీసం ప్రజలను పట్టించుకోవడం లేదు. ఏదైనా ఇష్యూ జరిగితే, ఆ ఇష్యూను ఎలా డైవర్ట్ చేయాలి? ఎలా కవరప్ చేయాలి? అది అసలు జరగనట్లు ఎలా చూపించాలి? అన్న దిక్కుమాలిన ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. అందుకు ప్రభుత్వ పెద్దలు సిగ్గుతో తల దించుకోవాలి.ఇది గుర్ల మండల కేంద్రం. ఇక్కడే 9 మంది చనిపోగా, మండలంలో మొత్తం 14 మంది చనిపోయారు. ఇక్కడి నుంచి జిల్లా కేంద్రం కేవలం 17 కి.మీ దూరంలో ఉంది. మరి ఇక్కడి వారిని ఎందుకు విజయనగరం తీసుకోలేకపోయారు. ఇక్కడి నుంచి విశాఖపట్నం కేవలం 80 కి.మీ దూరంలో ఉంది. ఒక 10 అంబులెన్సులు ఏర్పాటు చేసి, డయేరియా బారిన పడిన వారిని మెరుగైన చికిత్స కోసం ఎందుకు తీసుకుపోలేదు?స్కూళ్లే ఆస్పత్రులు. బెంచీలే బెడ్లునాడు–నేడు మనబడి కార్యక్రమంలో బాగు చేసిన స్కూళ్లలో డయేరియా వ్యాధిగ్రస్తులకు చికిత్స చేశారు. బెంచీలపై వారిని పడుకోబెట్టారు. అంటే స్కూళ్లలో వైద్యం చేసే పరిస్థితి. ఒకవేళ మా ప్రభుత్వ హయాంలో ఇలా స్కూళ్లు బాగు చేసి ఉండకపోతే, పరిస్థితి ఏమిటి?. ఇక్కడ మా ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజ్ కూడా వచ్చింది.17 కి.మీ దూరంలోని విజయనగరం, 80 కి.మీ దూరంలో ఉన్న విశాఖపట్నంకు రోగులను తరలించక పోవడంతో, గ్రామంలో 9 మంది, మండలంలో 14 మంది చనిపోయారు. ఇది దారుణం. మరి ప్రభుత్వానికి బాధ్యత లేదా?సాయం చేయకపోగా, అబద్ధం చెప్పమన్నారుచివరికి వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కూడా అందలేదు. అదే విషయం వారంతా చెప్పారు. సహాయం చేయకపోగా, ఆస్పత్రులకు పోతే.. ‘డయేరియాతో చనిపోయారని చెప్పొద్దని, అలా చెబితే గ్రామంలో దాని వల్ల భయాందోళన పరిస్థితి ఏర్పడుతుందని, అందువల్ల గుండెపోటుతో చనిపోయారని చెప్పమని’.. ఉచిత సలహాలు ఇస్తున్నారు.ప్రభుత్వం అలా చెప్పమని చెబుతోంది అంటే, ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉందో ఆలోచన చేయమని కోరుతున్నాను.వైద్య రంగాన్ని భ్రష్టు పట్టించారుఇక్కడి గ్రామాల్లో పరిస్థితి బాగుపర్చకపోగా, విలేజ్ క్లినిక్స్, పీహెచ్‌సీలను బాగు పర్చకపోగా, సీహెచ్‌సీల్లో స్పెషలిస్టు డాక్టర్లను తీసేశారు. వైద్య శాఖలో జీరో వెకెన్సీ పాలసీ మేము తీసుకొస్తే, దాన్ని రద్దు చేశారు. ఆరోగ్యశ్రీ బకాయిలు మార్చి నుంచి కట్టడం లేదు. దాంతో దాదాపు రూ.1800 కోట్లు బకాయిలు పేరుకుపోయి, రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు పోలేని పరిస్థితి. మెరుగైన వైద్యం అందేలా మా ప్రభుత్వం ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు మొదలుపెట్టి, వాటిలో 5 కాలేజీలను గత ఏడాది ప్రారంభించాం. మిగిలిన 12 మెడికల్ కాలేజీల్లో పూర్తి చేసి, వాటిని కూడా నడపాల్సిన ప్రభుత్వం.. వాటిలో 5 కాలేజీల్లో సీట్లు కూడా మంజూరైతే, వాటిని నిర్వహించలేమని లేఖ రాసింది. ఆ తర్వాత ఈ 12 మెడికల్ కాలేజీలతో పాటు, గత ఏడాది మొదలైన 5 మెడికల్ కాలేజీలు.. మొత్తం 17 మెడికల్ కాలేజీలను తమకు అనుకూలమైన వారికి అమ్మేయడానికి, స్కామ్వైపు అడుగులు వేస్తోంది.ఆరోగ్యశ్రీని నీరు గార్చారు. గతంలో కేవలం 1000 ప్రొసీజర్లకు మాత్రమే పథకాన్ని పరిమితం చేస్తే, మా ప్రభుత్వం వచ్చాక, 3300 ప్రొసీజర్లకు తీసుకుపోయాం. ఇంకా రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం చేసే ప్రక్రియకు మా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీతో పాటు, ఆరోగ్య ఆసరాను çపూర్తిగా నీరుగార్చిన పరిస్థితి కనిపిస్తోంది.మా పార్టీ నుంచి రూ.2 లక్షల చొప్పున. మరి ప్రభుత్వం?మేము విపక్షంలో ఉన్నా, పార్టీ నుంచి ఆదుకుంటాం. డయేరియాతో చనిపోయిన 14 మంది కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తాం. ప్రతిపక్షంలో ఉన్నా మేమే ముందుకు వచ్చాం. అధికారంలో ఉన్న మీకు మరింత బాధ్యత ఉంటుంది. మరి మీరు ఎంత ఇవ్వబోతున్నారో చెప్పండి. సూటిగా ప్రశ్నిస్తున్నాం.ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ ఆపి, వాస్తవాలను ప్రజలతో పంచుకుని, వారికి క్షమాపణలు చెప్పి, వారికి సహాయం చేసేందుకు అడుగులు ముందుకు వేయాలి. ఇకనైనా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని పైన ఉన్న దేవుడిని ప్రార్థిస్తున్నాను.డైవర్షన్ పాలిటిక్స్. అదే చంద్రబాబు రాజకీయంప్రతి అడుగులో ఈ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స చేస్తోంది. ఏదైనా ఇష్యూ వస్తే, దానిపై స్పందించాల్సి వస్తే, ప్రభుత్వం స్పందించకపోగా, ఇష్యూను డైవర్ట్ చేసేలా అడుగులు వేస్తోంది.ఈ ప్రభుత్వం తీరుపై మేము ఢిల్లీలో ధర్నా చేస్తే, ఆరోజు మదనపల్లెలో ఏదో అగ్నిప్రమాదం జరిగితే, ఏకంగా హెలికాప్టర్లో డీజీపీని, అధికారులను పంపారు. అదే ఇక్కడ 14 మంది చనిపోతే, హెలికాప్టర్ కాదు కదా.. కనీసం మంత్రులు కూడా వచ్చి పలకరించలేదు.ఈ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది. ఎన్నికల ముందు సూపర్‌సిక్స్ అన్నారు. ఎన్నికల ముందు ప్రతి ఇంటికి వెళ్లి.. చిన్న పిల్లలు కనబడితే నీకు రూ.15 వేలు అని, ఆ పిల్లల తల్లులు కనబడితే నీకు రూ.18 వేలు అని, ఆ ఇంట్లో పిల్లల పెద్దమ్మలు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని, ఇంకా ఆ ఇంట్లో 20 ఏళ్ల వయసున్న వారు కనబడితే నీకు రూ.36 వేలు అని, ఆ ఇంట్లో ఎవరైనా కండువా వేసుకున్న రైతు కనిపిస్తే నీకు రూ.20 వేలు అని చెప్పి నమ్మించి మోసం చేశారు.100 రోజుల పాలన మీద ప్రజలు ఇవన్నీ నిలదీస్తారని చెప్పి, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ.. తిరుపతి లడ్డూపై ప్రచారం చేశారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ప్రజలకు అండగా నిలబడాల్సి ప్రతి సందర్భంలోనూ, చంద్రబాబుగారు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ప్రతి దాంట్లోనూ డైవర్షన్. అదే చంద్రబాబు రాజకీయం.ఈరోజు కూడా ఆశ్చర్యం కలిగించే విషయాలు. రాష్ట్రవ్యాప్తంగా అక్కచెల్లెమ్మల జీవితాలు చెల్లాచెదురు అవుతున్నాయి. చిన్న పిల్లల జీవితాలు చెల్లాచెదురవుతున్నాయి. శాంతి భద్రతలు కుదేలైపోయాయి.ప్రభుత్వం మాది అని చెప్పి, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు విచ్చలవిడిగా అక్కచెల్లెమ్మల మీద దాడులు చేస్తున్నారు. చిన్న పిల్లల మీద దాడులు చేస్తున్నారు.ఇప్పుడూ అదే. నా తల్లి, చెల్లి ఫోటోలుమరోవైపు జగన్ అనే వ్యక్తి పర్యటిస్తున్నాడు. గుంటూరు వస్తున్నాడు. గుర్లకు వస్తున్నాడు అనేసరికి, మళ్లీ టాపిక్ డైవర్ట్. అలా టాపిక్ డైవర్ట్ చేసి ఏమంటారు?మా చెల్లెలు ఫోటో పెడతారు. మా అమ్మ ఫోటో పెడతారు. అయ్యా చంద్రబాబు, అయ్యా రాధాకృష్ణ. అయ్యా ఆంధ్రజ్యోతి. అయ్యా ఈనాడు. అయ్యా టీవీ5. మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నాను. మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు ఏం లేవా? అని అడుగుతున్నాను.అయ్యా, ఇవన్నీ ఘర్ ఘర్కీ కహానీలు. ప్రతి ఇంట్లో ఉన్న విషయాలే. వీటని మీ స్వార్థం కోసం వీటిని పెద్దవి చేసి చూపడం, నిజాలను వక్రీకరించి చూపడం.ఇవన్నీ మానుకుని ప్రజల మీద ధ్యాస పెట్టండి. ప్రజల కష్టాల్లో పాలు పంచుకోవాలని ఈరోజు చంద్రబాబును అడుగుతున్నాను. మీడియా ముసుగులో చంద్రబాబును మోస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో పాటు, దత్తపుత్రుణ్ని కూడా అడుగుతున్నానంటూ వైఎస్ జగన్ చురకలంటించారు. -
డయేరియా తీవ్రతను జగన్ కు వివరించిన గుర్ల బాధితులు
-
డయేరియా బాధితులకు వైఎస్ జగన్ భరోసా
-
నేను చూసుకుంటా చెల్లి! జగన్ భరోసా..
-
జగన్‌తో గుర్ల డయేరియా బాధితులు
-
గుర్లలో డయేరియా మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ
గుర్లలో వైఎస్ జగన్ పరామర్శ అప్డేట్స్.. 👉గుర్లలో డయేరియా మృతుల కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారిని ఓదార్చి.. ధైర్యం చెప్పారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 👉గుర్ల చేరుకున్న వైఎస్ జగన్👉రాష్ట్రంలో సెప్టెంబర్‌లోనే డయేరియా ప్రమాద ఘంటికలు మోగించించింది. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో, వ్యాధి బారినపడి 14 మంది చనిపోయారు. 👉ఈ సందర్బంగా వైఎస్ జగన్‌కు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్ వద్దకు భారీ సంఖ్యలో మద్దతుదారులు వైఎస్ జగన్ కోసం వచ్చారు. 👉వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు విజయనగరం జిల్లా గుర్లలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా డయేరియా మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు.👉వైఎస్ జగన్ విజయనగరం బయలుదేరారుు. మరికాసేపట్లో గుర్ల చేరుకుంటారు. అక్కడ డయేరియా సోకి మృతి చెందిన వారి కుటుంబాలను, చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు.👉కాగా, కొద్దిరోజులుగా గుర్లలో డయేరియా కారణంగా పదుల సంఖ్యలో మరణాలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆసుపత్రుల్లో పలువురు చికిత్స పొందుతున్నారు. -
నేడు విజయనగరంలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు (గురువారం) విజయనగరం జిల్లా గుర్లలో పర్యటించనున్నారు. డయేరియా మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటల ప్రాంతంలో గుర్ల చేరుకుంటారు. అక్కడ డయేరియా సోకి మృతి చెందిన వారి కుటుంబాలను, చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు.కాగా, వైఎస్ జగన్ బుధవారం గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించారు. గుంటూరు జీజీహెచ్‌కు చేరుకున్న ఆయన.. టీడీపీ కార్యకర్త, రౌడీషీటర్ పైశాచిక దాడిలో మృతి చెందిన తెనాలి యువతి సహానా కుటుంబసభ్యులను పరామర్శించారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం వైఎస్సార్ జిల్లా బద్వేలుకు చేరుకున్న వైఎస్ జగన్.. ప్రేమోన్మాది దాడిలో మృతి చెందిన దస్తగిరమ్మ కుటుంబాన్ని పరామర్శించారు.ఇదీ చదవండి: చంద్రబాబుకు ఇదే నా హెచ్చరిక: వైఎస్ జగన్ -
పవన్ పర్యటనలో మంత్రి కొండపల్లికి అవమానం
గుర్ల: విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా మృతుల సంఖ్యను ప్రభుత్వం దాచిపెట్టే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికి పోయింది. డయేరియాతో పది మంది చనిపోయినా ఒక్కరే అంటూ చేసిన ప్రకటన తప్పని తేలింది. ఇప్పటికే డయేరియా మరణాలపై ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతుండగా.. జిల్లా కలెక్టర్ డాక్టర్.బీ.ఆర్ అంబేద్కర్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ డయేరియా కారణంగా ఒకరు మృతి చెందారని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం గుర్లలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. అనంతరం మీడియా సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ చేసిన ప్రకటనలు తప్పని తేల్చారు. గుర్లలో 10 మంది డయేరియా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా రూ.లక్ష ఇస్తామని పవన్ ప్రకటించారు. దీంతో పక్కనే ఉన్న మంత్రి, కలెక్టర్ అవాక్కయ్యారు. ఒక్కరే చనిపోయారంటూ కలెక్టర్ ప్రకటించి మృతుల సంఖ్యను దాచి పెట్టే ప్రయత్నం చేశారు. కానీ పదిమంది చనిపోయారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది.పవన్ పర్యటనలో మంత్రి కొండపల్లికి అవమానంమరోవైపు గుర్లలో పవన్ పర్యటనలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కి ఘోర అవమానం జరిగింది. గుర్ల పీహెచ్సీలో డయేరియా రోగులను పరామర్శించడానికి పవన్‌తో పాటు వెళ్లేందుకు మంత్రి కొండపల్లిని పవన్ సెక్యూరిటీ సిబ్బంది అనుమతించ లేదు. దీంతో పవన్ ఆస్పత్రిలో వున్నంత సేపు కొండపల్లి మెయిన్ డోర్ బయటే నిలబడడ్డారు. దీంతో పవన్ తీరుపై జిల్లా టీడీపీలో చర్చ జరుగుతుండగా.. తమ మంత్రినే అవమానిస్తారా’ అంటూ కొండపల్లి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పవన్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు
సాక్షి,హైదరాబాద్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. తిరుమల లడ్డూ విషయంలో పవన్ వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, సాంకేతిక ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు చేశారని పిటిషనర్ రామారావు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పాటు అయోధ్యకు పంపిన లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడినట్లు పవన్ వ్యాఖ్యలు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలని పిటిషనర్ రామారావు కోరారు. పవన్‌తో పాటు తెలంగాణ సీఎస్‌కూ, హోం ప్రిన్సిపల్ సెక్రటరీకి నోటీసులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో పవన్ వ్యాఖ్యలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ కోరారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సిటీ సివిల్ కోర్టు పవన్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. -
డయేరియా కేసులు కారణం ఇదే.. పద్ధతి మార్చుకోవాలి
-
విజయనగరం జిల్లాలో తగ్గని డయేరియా తీవ్రత
-
‘బాబు.. సారా మత్తు కాదు.. డయేరియా గురించి ఆలోచించండి’
విజయనగరం,సాక్షి: గుర్ల మండలంలోని డయేరియా వైద్య శిబిరంలో సౌకర్యాలు లేవని మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు అన్నారు. దేశం ఉలిక్కిపడిన సంఘటన ఇదని తెలిపారు. ఆయన శనివారం గుర్లలో డయేరియా వైద్య శిబిరంలో రోగులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘నాలుగు రోజులుగా వైద్య శిబిరం నడుస్తోంది. ప్రభుత్వం అవసరమైన సదుపాయాలు కల్పించలేదు. దయనీయమైన పరిస్థితి వుంది. బెంచీలు, కుర్చీలు మీద పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. తాము విద్యా , వైద్యం మెరుగుపరిచి చంద్రబాబు ప్రభుత్వానికి అప్పగించాం. వైఎస్ జగన్ స్కూల్లో బెంచీలు, కుర్చీలు సమకూర్చపోయి ఉంటే.. నేల మీద పడుకోబెడతారా? పీహెచ్‌సీల నుంచి బెడ్స్ సేకరించి వైద్య శిబిరంలో ఎందుకు ఏర్పాటు చేయలేదు? సీఎం చంద్రబాబు సారా మత్తు నుంచి బయటకు రండి.ఇసుకమత్తు నుంచి బయటకు రండి.ఈ రాష్ట్రంలో ఎంత దారుణ పరిస్థితులు వున్నాయో చూడండి. ఇదేనా ప్రజా వైద్యం తీరు. వైద్యం హక్కుగా ఉన్న స్థితి నుంచి ఆడుకున్నే స్థితికి తీసుకువచ్చారు. ఈ దుర్భర పరిస్థితులను నేషనల్ మీడియా చూస్తే రాష్ట్ర పరువు పోతుంది. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, మంత్రి వచ్చి చూసి వెళ్లి.. ఏం చర్యలు తీసుకున్నారు?’’ అని అన్నారు. గుర్ల మండలంలో డయేరియా పంజా విసురుతోంది. గోషాడ, కెల్ల, కోటగండ్రేడు, పెనుబర్తిల్లో 450 మందికిపైగా డయేరియా బారినపడ్డారు. ఇప్పటివరకు 8 మంది మృత్యువాత పడ్డారు. -
మందు గుండు సామాగ్రి కంపెనీలో పేలుడు.. ఎగిసిపడుతున్న మంటలు
సాక్షి, విజయనగరం: గుర్ల మండలం దేవుని కనపాక పంచాయతీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గవిపేట సమీపంలోని మందు గుండు సామాగ్రి కంపెనీలో పేలుడు సంభవించింది. కంపెనీలోని ఆరు గోడౌన్లకు నిప్పు అంటుకోవడంతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. మంటల్లో ఇద్దరు వ్యక్తులు చిక్కుకున్నట్లు సమాచారం.కీలోమీటరు దూరం వరకు మంటలు వ్యాపించినట్లు కనిపిస్తున్నాయి. అగ్నికీలలు, పేలుడు ధాటికి పరిసర గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. -
బడాయి మాటల బాబు
సాక్షి, గుర్ల: ఎన్నికల ముందు, సమావేశాల్లో, పార్టీ కార్యక్రమాల్లో, పర్యటనల్లో ఏదైతేనేం తెలుగుదేశం ప్రభుత్వం నాయకుల ఊకదంపుడు ఉపన్యాసాల కు ప్రజలు బలైపోతున్నారు. సందర్భం వస్తే చా లు హామీలు ఉచితంగా ఇచ్చేయడం వాటిని అమలు చేయడానికి మాత్రం కొంటె సాకులు చెప్పి తప్పించుకోవడం టీడీపీ నాయకులకు ఆనవాయితీగా వస్తుంది. ఇలా హామీలిచ్చి తప్పించుకోవడంలో అగ్రగణ్యుడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. సరిగ్గా నాలుగున్నరేళ్లు క్రితం హుద్‌హుద్ తుఫాన్ దాటికి నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో పంటలకు నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఈ పంటలను పరిశీలించడానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గుజ్జింగవలస గ్రామానికి వచ్చా రు. ఈ సందర్భంగా మండలానికి, గుజ్జింగవలస గ్రామానికి అనేక వరాల జల్లు కురిపించారు. బాబు ఇచ్చిన హామీలివే... మండల కేంద్రంలో ఆరు పడకల ఆస్పత్రిని 30 పడకల ఆస్పత్రిగా మార్చుతామని హామీ ఇచ్చా రు. డిగ్రీ కాలేజ్ లేదా అగ్రికల్చర్ కాలేజ్‌ని మం జూరు చేస్తామన్నారు. గుజ్జింగివలస గ్రామానికి కోటి రూపాయలు మంజూరు చేస్తామని, యువతకు జిమ్ ఏర్పాటుచేస్తానని హామీ ఇచ్చారు. హుద్‌హుద్ తుఫాన్లో నష్టపోయిన రైతులకు ఆర్థికసాయం అందిస్తానని చెప్పారు. అయితే వీటిలో ఏ ఒక్క హామీని అమలుచేయకపోవడంతో మండల ప్రజలు సీఎంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు పలుమార్లు ప్రశ్నించినా... ఈ హామీలపై మండల సర్వసభ్య సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు టీడీపీ నాయకులను పలుమార్లు ప్రశ్నించినా వారి దగ్గర నుంచి సమాధానం రావడం లేదు. దీనికి తోడు ఏదో ఒక కుంటి సాకు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మండల కేంద్రంలోని ఆస్పత్రికి రోగుల సంఖ్య పెరుగుతున్నా ఇప్పటివరకు 30 పడకల ఆస్పత్రిగా మార్చలేదు. రెండో వైద్యాధికారిని నియమించాలని స్థానికులు కోరుతున్నా అధికార పార్టీ నాయకులు పట్టించుకోలేదు. నియోజకవర్గ కేంద్రంలో తప్ప మిగతా మండలాల్లో డిగ్రీ కాలేజీ లేదు. దీంతో పేద విద్యార్థులు ఫీజులు చెల్లించలేక మధ్యలోనే ఆపేస్తున్నారు. స్థానిక జూనియర్ కళాశాలలో డిగ్రీ కాలేజీకి సరిపడా స్థలం ఉందని, అక్కడ డిగ్రీ కాలేజీని ఏర్పాటుచేయాలని వైఎస్సార్సీపీ నాయకులు సూచన చేసినా పట్టించుకోలేదు. పోనీ కనీసం రైతులకు పంట నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేసినా కనీసం స్పందించలేదంటే టీడీపీ ప్రభుత్వం తీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నేను గెలిచిన వెంటనే నిర్మాణాలు చేపడతాం అన్న హామీ ఎక్కడుందో.. టీడీపీ చీపురుపల్లి ఎమ్మేల్యే అభ్యర్థిగా 2014లో కిమిడి మృణాళిని పోటీచేశారు. ఆమె ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యేగా గెలిపిస్తే మొదటిగా ఆనందపురం, నడుపూరు రోడ్డును బీటీ రోడ్డు చేస్తామని ఆయా గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ఆమె ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు, రాష్ట్ర మంత్రిగా కూడ పనిచేశారు. కాని ఆ ఇరుగ్రామాలకు మధ్య బీటీ రోడ్డు నిర్మించలేకపోయారు. హామీని ఆమలు చేయకపోవడంతో ఇరుగ్రామాల ప్రజలు ఆమె పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఇచ్చిన హామీ నేరవేర్చాలి గుర్ల ఆస్పత్రిని 30 పడకల ఆస్పత్రిగా మార్చుతానని గుజ్జింగవలసలో సీఎం పర్యటనలో భాగంగా హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి మూడు ఏళ్లు గడుస్తున్నా వాటి అమలుకు మాత్రం నోచుకోలేదు. గుర్ల పీహెచ్సీలో రోగులు తాకిడి అధికంగా ఉన్నప్పుడు వారికి సెలైన్ ఎక్కిం చాలంటే ఆరుబయట లేదా బెంచీలపై ఉంచి ఎక్కిస్తున్నారు. – రోగాన అప్పలనాయుడు, గుర్ల డిగ్రీ కాలేజీని మంజూరు చేయాలి సీఎం హామీ మేరకు మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ, అగ్రికల్చర్ కళాశాలను ఏర్పాటు చేయాలి. డిగ్రీ కళాశాల మంజూరు చేస్తారని ఎంతో సంబరంపడ్డాం. కానీ ఆశలన్నీ అడియాసలయ్యాయి. ప్రైవేట్ కాలేజ్‌ల్లో ఫీజులు భారం మోయలేక విద్యార్థులు చదువును ఆపేస్తున్నారు. – సారిక దివాకర్, గుర్ల పరికరాలు మరిచిపోయారు గుజ్జింగివలస గ్రామంలో సీఎం పర్యటనలో భాగంగా గ్రామంలోని యువకుల కోసం జిమ్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన నాలు గేళ్లు తరువాత భవన నిర్మాణాలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు ఆ భవనాల్లో వ్యాయామ పరికరాలను అమర్చలేదు. భవనాలు ఉన్నప్పటికీ అవి మంజూరు కాలేదు. సీఎం హామీలకే దిక్కులేకపోతే ఎమ్మెల్యే హామీలకు దిక్కెవరు. – అట్టాడ అప్పలరాజు, గుజ్జింగివలస, గుర్ల హామీలు అమలుచేయడంలో విఫలం నడుపూరు, ఆనందపురం మధ్య రోడ్డు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఈ రెండు గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణాలు చేపడతామని ఎమ్మెల్యే మృణాళిని ఐదేళ్ల క్రితం హామీ ఇచ్చారు. ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత బీటీ రోడ్డు నిర్మాణంపై పట్టించుకోలేదు. ఎన్నికల ముందు ఓట్లు కోసం హామీలివ్వడం, ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత వాటిని మరిచిపోవడం ఆనవాయితీగా వస్తుంది. – నడుపూరు అప్పలనాయుడు, ఆనందపురం -
అక్రమ సంపాదన బయట పడుతుందనే ఉలిక్కిపడుతున్నారు