విజయనగరం,సాక్షి: గుర్ల మండలంలోని డయేరియా వైద్య శిబిరంలో సౌకర్యాలు లేవని మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు అన్నారు. దేశం ఉలిక్కిపడిన సంఘటన ఇదని తెలిపారు. ఆయన శనివారం గుర్లలో డయేరియా వైద్య శిబిరంలో రోగులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘నాలుగు రోజులుగా వైద్య శిబిరం నడుస్తోంది. ప్రభుత్వం అవసరమైన సదుపాయాలు కల్పించలేదు. దయనీయమైన పరిస్థితి వుంది. బెంచీలు, కుర్చీలు మీద పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. తాము విద్యా , వైద్యం మెరుగుపరిచి చంద్రబాబు ప్రభుత్వానికి అప్పగించాం. వైఎస్ జగన్ స్కూల్‌లో బెంచీలు, కుర్చీలు సమకూర్చపోయి ఉంటే.. నేల మీద పడుకోబెడతారా? పీహెచ్‌సీల నుంచి బెడ్స్ సేకరించి వైద్య శిబిరంలో ఎందుకు ఏర్పాటు చేయలేదు? సీఎం చంద్రబాబు సారా మత్తు నుంచి బయటకు రండి.ఇసుకమత్తు నుంచి బయటకు రండి.
ఈ రాష్ట్రంలో ఎంత దారుణ పరిస్థితులు వున్నాయో చూడండి. ఇదేనా ప్రజా వైద్యం తీరు. వైద్యం హక్కుగా ఉన్న స్థితి నుంచి ఆడుకున్నే స్థితికి తీసుకువచ్చారు. ఈ దుర్భర పరిస్థితులను నేషనల్ మీడియా చూస్తే రాష్ట్ర పరువు పోతుంది. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, మంత్రి వచ్చి చూసి వెళ్లి.. ఏం చర్యలు తీసుకున్నారు?’’ అని అన్నారు.
గుర్ల మండలంలో డయేరియా పంజా విసురుతోంది. గోషాడ, కెల్ల, కోటగండ్రేడు, పెనుబర్తిల్లో 450 మందికిపైగా డయేరియా బారినపడ్డారు. ఇప్పటివరకు 8 మంది మృత్యువాత పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment