vizianagarm district
-
‘బాబు.. సారా మత్తు కాదు.. డయేరియా గురించి ఆలోచించండి’
విజయనగరం,సాక్షి: గుర్ల మండలంలోని డయేరియా వైద్య శిబిరంలో సౌకర్యాలు లేవని మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు అన్నారు. దేశం ఉలిక్కిపడిన సంఘటన ఇదని తెలిపారు. ఆయన శనివారం గుర్లలో డయేరియా వైద్య శిబిరంలో రోగులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘నాలుగు రోజులుగా వైద్య శిబిరం నడుస్తోంది. ప్రభుత్వం అవసరమైన సదుపాయాలు కల్పించలేదు. దయనీయమైన పరిస్థితి వుంది. బెంచీలు, కుర్చీలు మీద పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. తాము విద్యా , వైద్యం మెరుగుపరిచి చంద్రబాబు ప్రభుత్వానికి అప్పగించాం. వైఎస్ జగన్ స్కూల్లో బెంచీలు, కుర్చీలు సమకూర్చపోయి ఉంటే.. నేల మీద పడుకోబెడతారా? పీహెచ్‌సీల నుంచి బెడ్స్ సేకరించి వైద్య శిబిరంలో ఎందుకు ఏర్పాటు చేయలేదు? సీఎం చంద్రబాబు సారా మత్తు నుంచి బయటకు రండి.ఇసుకమత్తు నుంచి బయటకు రండి.ఈ రాష్ట్రంలో ఎంత దారుణ పరిస్థితులు వున్నాయో చూడండి. ఇదేనా ప్రజా వైద్యం తీరు. వైద్యం హక్కుగా ఉన్న స్థితి నుంచి ఆడుకున్నే స్థితికి తీసుకువచ్చారు. ఈ దుర్భర పరిస్థితులను నేషనల్ మీడియా చూస్తే రాష్ట్ర పరువు పోతుంది. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, మంత్రి వచ్చి చూసి వెళ్లి.. ఏం చర్యలు తీసుకున్నారు?’’ అని అన్నారు. గుర్ల మండలంలో డయేరియా పంజా విసురుతోంది. గోషాడ, కెల్ల, కోటగండ్రేడు, పెనుబర్తిల్లో 450 మందికిపైగా డయేరియా బారినపడ్డారు. ఇప్పటివరకు 8 మంది మృత్యువాత పడ్డారు. -
జ్యువెలరీ షాప్‌లో భారీ చోరీ..
-
జ్యువెలరీ షాప్‌లో భారీ చోరీ.. 5కేజీల బంగారు నగలు మాయం!
సాక్షి, విజయనగరం: విజయనగరంలోని జ్యువెలరీ షాప్‌లో భారీ చోరీ జరిగింది. జ్యువెలరీ షాప్ యజమాని పోలీసు ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 5 కేజీల బంగారు నగల్ని దొంగలు ఎత్తుకెళ్లారు. యజమాని ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. జ్యువెలరీ షాప్‌లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: సర్టిఫికెట్ కోసం వస్తే.. చాక్లెట్, గ్రీన్ ఇంక్ పెన్ను.. చివరకు గదిలోకి రమ్మని.. -
కోవిడ్ వ్యాక్సినేషన్ లో రాష్ట్రం లో మొదటి స్థానం లో నిలిచిన విజయనగరం
-
జనవరిలో ‘రామతీర్థం’ ఆలయం ప్రారంభం
నెల్లిమర్ల రూరల్/విజయనగరం గంటస్తంభం: విజయనగరం జిల్లా రామతీర్థంలోని బోడికొండపై శ్రీకోదండ రామాలయాన్ని పునర్నిర్మించి వచ్చే ఏడాది జనవరి నాటికి ప్రారంభిస్తామని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. బుధవారం రామతీర్థం, విజయనగరంలలో వేర్వేరుగా ఆయన మీడియాతో మాట్లాడారు. రామతీర్థంలోని బోడికొండపై కోదండరామాలయ నిర్మాణానికి రూ.3కోట్లు కేటాయించామని, టెండర్లు కూడా పూర్తయ్యాయని తెలిపారు. కొండపై ఆలయ నిర్మాణానికి అవసరమైన వసతులు సమకూర్చి అనుకున్న సమయానికి ఆలయాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. ఆగమశాస్త్రం ప్రకారం పండితులు, స్వామీజీల సూచనల మేరకే ఆలయాన్ని నిర్మిస్తున్నామన్నారు. చిలకలూరిపేట నుంచి పనివారిని రప్పించి పూర్తి రాతి కట్టడంగా ఆలయాన్ని రూపొందిస్తున్నట్టు చెప్పారు. అనంతరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుతో కలిసి ఆలయ నమూనాలను మంత్రి విడుదల చేశారు. దేవాలయాల పరిరక్షణే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు చేపడుతున్నారని విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. రాష్ట్రంలో దేవాలయాల పరిరక్షణలో భాగంగా 65 శాతం ఆలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తయిందని తెలిపారు. చంద్రబాబు 40 గుడులు కూల్చితే వాటి అభివృద్ధికి వైఎస్ జగన్ శంకుస్థాపనలు చేశారని పేర్కొన్నారు. చదవండి: ఏపీని తాకిన రుతుపవనాలు -
మావోయిస్టుల కాల్పులు: పెళ్లి ముచ్చట తీరకుండానే
డిగ్రీ వరకు చదివాడు. దేశ సేవలో తరించాలని తలచాడు. సీఆర్పీఎఫ్ జవాన్‌గా ఎంపికయ్యాడు. మంచి శరీరసౌష్టవం, చురుకుగా కదిలే నైజంతో కోబ్రాదళం లీడర్‌గా ఎంపికయ్యాడు. వివాహ వయస్సు రావడంతో వచ్చేనెలలో జీవితభాగస్వామితో ఏడుఅడుగులు నడిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో విధి కన్నెర్రచేసింది. పెళ్లి ముచ్చట తీరకుండానే మావోయిస్టుల రూపంలో మృత్యువు కాటేసింది. కుటుంబ సభ్యులకు దుఃఖాన్ని మిగిల్చింది. జవాన్ మృతితో విజయనగరం జిల్లా కేంద్రంలోని గాజులరేగ, మక్కువ మండలం కంచేడువలసలో విషాదం అలముకుంది. మక్కువ/విజయనగరం: చత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపుర్‌లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య శనివారం జరిగిన కాల్పుల్లో జిల్లా యువకుడు, సీఆర్పీఎఫ్ జవాన్ రౌతు జగదీష్ (27) వీరమరణం పొందాడు. జిల్లా పోలీస్ యంత్రాగం తెలిపిన వివరాల ప్రకారం...జగదీష్ స్వగ్రామం మక్కువ మండలం కంచేడువలస. ప్రస్తుతం ఆయన కుటుంబం విజయనగరం జిల్లా కేంద్రంలోని గాజులరేగలో నివసిస్తోంది. డిగ్రీ చదువుకున్న జగదీష్ 2010లో సీఆర్పీఎఫ్ జవాన్‌గా ఎంపికయ్యాడు. విధుల్లో చురుగ్గా మెలగడంతో కోబ్రాదళానికి లీడర్‌గా ఎంపికయ్యాడు. బీజాపూర్‌లో సీఆర్పీఎఫ్, కోబ్రా, డీఆర్జీ భద్రతా దళాలతో కలిసి కూంబింగ్ చేస్తున్న సమయంలో మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో మృతిచెందారు. కొద్దికాలంలోనే మంచిపేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. మృతుడి తండ్రి సంహాచలం కూలీకాగా, తల్లి రమణమ్మ గృహిణి. అక్క సరస్వతికి వివాహం అయ్యింది. జగదీష్ కూడా వచ్చేనెల 22న వివాహం చేసుకునేందుకు ముహూర్తం ఖరారైంది. మరో వారం రోజుల్లో సెలవుపై రావాల్సి ఉంది. కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లలో ఉన్నారు. ఇంతలో కొడుకు మృతిచెందాడన్న వార్తతో దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఆదుకుంటాడనుకున్న సమయంలో ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులిద్దరూ కన్నీరుమున్నీరవుతున్నారు. జగదీష్ మృతితో గాజులరేగ, కంచేడువలస వాసులు శోకసంద్రంలో మునిగిపోయారు. గాజులరేగలో బ్లాక్ డే పాటిస్తామని యువకులు తెలిపారు. మరో తెలుగు జవాన్ జగదీష్‌తో పాటు మరో తెలుగు జవాన్ మావోయిస్టుల చేతిలో మృతి చెందాడు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన శాఖమూరి మురళీకృష్ణ కూడా మరణించారు. విజయకుమారి, రవీంద్రబాబు దంపతుల రెండో సంతానం అయిన మురళీకృష్ణ ఆరేళ్ల క్రితం సైనిక దళంలో చేరారు. ప్రస్తుతం కోబ్రా టూ10 విభాగంలో విధులు నిర్వర్తిస్తూ మావోయిస్టుల తుపాకీ గుళ్లకు బలయ్యాడు. త్వరలో మురళీ వివాహం చేయాలని తల్లిదండ్రులు భావిస్తుండగా జరిగిన ఈ ఘటన ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఈ రోజు మధ్యాహ్నం జవాన్ మురళీ భౌతికకాయం గాజులరేగ గ్రామానికి చేరుకోనుంది. చదవండి: పవన్‌కల్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు -
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి.. ప్రకృతి వ్యవసాయం
ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం చేస్తున్నప్పటికీ కొందరు రైతులు మంచి ఆదాయాన్ని గడించలేకపోతున్నారు. రసాయనిక అవశేషాల్లేకుండా ఆరోగ్యదాయకంగా పండించిన పంట దిగుబడులను సైతం సాధారణ మార్కెట్లో మామూలు ధరకే అమ్మేసుకోవాల్సిన దుస్థితి ఎదురవుతోంది. ఈ సమస్యకు సరైన పరిష్కారం ‘దళారుల్లేని సొంత మార్కెటింగే’ అంటున్నారు యువ రైతు లింగాల శంకర్. మూడేళ్ల క్రితం సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి ప్రకృతి వ్యవసాయం చేపట్టిన శంకర్.. ప్రణాళికతో ముందడుగు వేస్తూ బాలారిష్టాలను అధిగమించి.. సత్ఫలితాలను అందుకుంటున్నారు. తన పంట దిగుబడులను తానే నేరుగా వినియోగదారులకు అమ్ముకోవటంతో పాటు ఇతర రైతుల ఉత్పత్తులను సైతం అమ్మిపెడుతున్నారు. యువరైతుగా శంకర్ సక్సెస్‌ను చూసి ముచ్చటపడిన పద్మావతి (ఎంఫార్మసీ) ఉద్యోగం వదలి వచ్చి ఆయనను పెళ్లాడి, వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతున్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు శ్రమపడి ఎంత మంచి దిగుబడి సాధించినా రసాయనిక వ్యవసాయం చేస్తున్న చాలా మంది రైతుల్లాగా గంపగుత్తగా దళారులకు అమ్మేస్తే తగినంత ఆదాయం పొందటం అసాధ్యం అంటున్నారు యువ రైతు లింగాల శంకర్. విశాఖపట్నం దగ్గరలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన శంకర్ వైజాగ్‌లో బీఈ చదివి, హైదరాబాద్‌లోని టీసీఎస్‌లో ఆరున్నరేళ్లు అసిస్టెంట్ సిస్టమ్స్ ఇంజినీర్‌గా పని చేశారు. సుభాష్ పాలేకర్, కర్రి రాంబాబు తదితరుల స్ఫూర్తితో ఉద్యోగానికి స్వస్తి చెప్పి 2017లో ప్రకృతి వ్యవసాయదారుడిగా మారారు. రెల్లి గ్రామంలో ఆరెకరాల సొంత భూమితో పాటు, భోగాపురం మండలం బసవపాలెంలో మరో 30 ఎకరాలను కౌలుకు తీసుకొని అనేక పంటలను పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. గోవులతో లింగాల శంకర్ వ్యాన్ ద్వారా విక్రయాలు రైతుమిత్ర పరస్పర సహకార సంఘంలో శంకర్ క్రియాశీల సభ్యుడు. తన 36 ఎకరాల్లో పండించిన పంటలతోపాటు సొసైటీలోని 89 మంది ప్రకృతి వ్యవసాయదారులు పండించిన పంటలను సైతం మార్కెట్ చేయటంలో శంకర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. వీరిలో 23 మంది కూరగాయలు, పండ్లు పండించే రైతులు. మిగతా వారు ధాన్యం, పప్పులు పండించేవారు. వీరంతా విశాఖకు దగ్గరలోని భోగాపురం, కొత్తవలస మండలాల్లోని రైతులే. వీరెవరూ సేంద్రియ సర్టిఫికేషన్ తీసుకోలేదు. వీరి నుంచి సేకరించిన కూరగాయలు, పప్పులు, బియ్యం తదితరాలను విశాఖపట్నం నగరంలో విక్రయిస్తున్నారు. ఒక్కచోట దుకాణం పెట్టేకన్నా రోజుకో చోట అమ్మకాలు చేపట్టడం ద్వారా అమ్మకాలు పెంచుకోవచ్చని భావించారు. శంకర్ మరో 8 మంది రైతులు సొంత డబ్బు పెట్టుబడి పెట్టి ఒక వ్యాన్‌ను కొనుగోలు చేశారు. ఈ మొబైల్ ఆర్గానిక్ స్టోర్ ద్వారా వారంలో 4 రోజుల పాటు విశాఖలో రోజుకో చోట (ఉ. 6.30 –10 గం. వరకు) తాము పండించిన, సేకరించిన 218 ప్రకృతి ఆహారోత్పత్తులను విక్రయిస్తున్నారు. తమకు 300 మంది నమ్మకమైన వినియోగదారులు ఉన్నారని శంకర్ తెలిపారు. వీలున్నప్పుడు తమ పొలాలకు వచ్చిపోతూ ఉండటంతో వీరికి నమ్మకం కలిగిందన్నారు. తమ రైతులపై ఉన్న నమ్మకమే సర్టిపికెట్ మాదిరిగా పనిచేస్తోందని ఆయన తెలిపారు. విశాఖపట్నంలో ప్రకృతి వ్యవసాయోత్పత్తులు విక్రయిస్తున్న రైతుమిత్ర వ్యాన్ రైతుబజార్ ధర కన్నా 25% అధిక ధర రైతుబజార్లో సాధారణ కూరగాయలు, పండ్లను ఆ రోజు విక్రయించే చిల్లర గరిష్ట ధరకు 25% అదనంగా చేర్చిన ధరను ప్రకృతి రైతుల ఉత్పత్తులకు తాము ధర చెల్లిస్తున్నామని శంకర్ తెలిపారు. కూరగాయలు, పండ్లకు ఏడాది పొడవునా ఒకే ధర ఇవ్వటం కన్నా ఈ పద్ధతే రైతులకు, తమకూ బాగుందన్నారు. ప్రకృతి వ్యవసాయదారులకు రసాయన వ్యవసాయదారులతో పోల్చితే సాగు ఖర్చులు సగానికి సగం తక్కువ. ఏక పంటలుసాగు చేసే రసాయనిక వ్యవసాయదారుల కన్నా.. సొంత విత్తనాలతో బహుళ పంటలు సాగు చేసి నేరుగా వినియోగదారులకు అమ్మే ప్రకృతి రైతులకు నికరాదాయం ఎక్కువగా వస్తోందన్నారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఎంత దిగుబడి తీసినా ఎవరి మార్కెటింగ్ వాళ్లే (సంఘంగా గాని లేదా వ్యక్తిగతంగా గాని) చేసుకుంటేనే నికరాదాయం పెరిగి ఆర్థికంగా కూడా సక్సెస్ కాగలుగుతారని శంకర్ స్వానుభవంతో చెబుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలిపెట్టి మట్టిలో కాలుపెట్టి ప్రకృతి వ్యవసాయం చేపట్టిన యువరైతుగా శంకర్ తాను సక్సెస్ కావటమే కాదు తోటి రైతులనూ వెలుగుబాటలో నడిపిస్తున్నారు. ఇది చూసి ముచ్చటపడిన పద్మావతి (ఎంఫార్మసీ) ఉద్యోగం వదలి వచ్చి, గత ఏడాది ఆయనను పెళ్లాడారు. తనూ సంతోషంగా ప్రకృతి వ్యవసాయంలో పాలుపంచుకుంటున్నారు! ఇన్పుట్స్ : విన్నుకొండ గౌతమ్, సాక్షి, కొత్తవలస రూరల్, విజయనగరం జిల్లా ఏడాదిలో ప్రకృతి సేద్యంపై పట్టు పూర్తి కాలం వెచ్చించి ప్రకృతి వ్యవసాయంపై శ్రద్ధగా దృష్టి పెట్టిన శంకర్ ఏడాదిలోనే సాగు మెలకువలను వంట పట్టించుకోగలిగారు. ఏకదళ, ద్విదళ పంటలను పక్కపక్కనే సాగు చేయటం, కచ్చితంగా పంటల మార్పిడి పాటించటం, పశువుల ఎరువులో జీవన ఎరువులు కలిపి మాగబెట్టి పొలానికి వెయ్యటం, డ్రిప్ ద్వారా 8 రోజులకోసారి జీవామృతాన్ని పారించటం, కాలానుగుణంగా మార్కెట్ అవసరాలకు తగిన విధంగా వివిధ రకాల కూరగాయలు, వరి, చిరుధాన్యాలు, పప్పుధాన్య పంటల ప్రణాళికను రూపొందించుకొని అనుసరించటం ద్వారా మంచి దిగుబడులను రాబట్టుకోగలుగుతున్నారు. శంకర్ ఆరు ఒంగోలు ఆవులను పోషిస్తున్నారు. పంటలకు తగినంత పోషకాలను అందించే క్రమంలో చేపల మార్కెట్ నుంచి వ్యర్థాలను సేకరించి అమినో ఆమ్లం తయారు చేసి వాడుతున్నారు శంకర్. వంగ సాగులో రెండేళ్ల పాటు పుచ్చుల సమస్యను ఎదుర్కొన్నారు. కాయ తొలిచే పురుగు, కాయతొలిచే పురుగులను అరికట్టడానికి సీవీఆర్ మట్టి పిచికారీ పద్ధతి బాగా ఉపకరించిందని శంకర్ తెలిపారు. గతంలో 60–70% వంకాయల్లో పుచ్చులు వచ్చేవని మట్టి ద్రావణం వల్ల ఇది 10%కి తగ్గిందన్నారు. అయితే, పెసరలో ఎల్లో మొజాయిక్ వైరస్ తెగులును అదుపు చెయ్యటం ఇంకా సమస్యగానే ఉందన్నారు. 400 నాటు కోళ్లు పెంచుతున్నారు. సజ్జలు, వడ్లతో కూడిన మేతను వేస్తూ గుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు. గౌరవం.. ఆర్థిక స్థిరత్వం.. కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చి మూడేళ్లు దాటింది. సాఫ్ట్వేర్ ఉద్యోగి కన్నా ప్రకృతి వ్యవసాయదారుడిగా రెట్టింపు గౌరవం పొందుతున్నా. పండించిన ఉత్పత్తుల్ని నేరుగా వినియోగదారుడికి అమ్మితేనే మంచి ఆదాయం వస్తుంది. మొదటి ఏడాది సాగులో, మార్కెటింగ్‌లో కూడా ఒడిదుడుకులను ఎదుర్కొన్నా. ఇప్పుడు స్థిమితత్వం వచ్చింది. ఆదాయంతో పాటు సమాజంలో మంచి రెస్పెక్ట్ కూడా ఉంది. – లింగాల శంకర్ (92933 34477), రెల్లి ,కొత్తవలస మండలం, విజయనగరం జిల్లా -
మహిళా సాధికారత మా తాతగారి ఆశయం
-
మండుటెండను సైతం లెక్కచేయకుండా...
విజయనగరం పూల్‌భాగ్: సాక్షరభారత్ కార్యక్రమాన్ని ఎత్తివేస్తూ విడుదల చేసిన జీఓను ఉపసంహరించుకోవాలని సాక్షరభారత్ సమన్వయకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఐ నేతృత్వంలో సుమారు వెయ్యి మంది సమన్వయకర్తలు బుధవారం స్థానిక మెసానిక్ టెంపుల్ నుంచి జిల్లా పరిషత్ వరకు ర్యాలీగా వెళ్లారు. ఒక్కసారిగా జెడ్పీ గేట్ వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు రెండు గంటల పాటు మండుటెండను సైతం లెక్కచేయకుండా సమన్వయకర్తలంతా రోడ్డుపైన కూర్చున్నారు. ఒక వైపు జిల్లా పరిషత్ జనరల్ బాడీ సమావేశం జరుగుతుండడంతో జెడ్పీలోకి ప్రవేశించేందుకు అధికారులు, రాజకీయనాయకులు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన ఎమ్మెల్యే పుష్పశ్రీవాణికి సమన్వయకర్తలు తమ సమస్యలు విన్నవించారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణిని అడ్డుకుని వినతిపత్రం అందజేశారు. దీనికి ఆమె స్పందిస్తూ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ, సాక్షరభారత్ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా సుమారు 1800 మంది సమన్వయకర్తలు పనిచేస్తున్నారన్నారు. వీరంతా ప్రత్యేక కమిటీల ద్వారా నియమించబడి గ్రామీణ ప్రాంతాల్లో వయోజనులైన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయడంతో పాటు విద్యాకేంద్రాలను నిర్వహిస్తున్నారని చెప్పారు. దీంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్వచ్ఛభారత్, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, జన్‌ధన్ ఖాతాలు ప్రారంభం, గ్యాస్ సబ్సిడీపై అవగాహన, ఎన్టిఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, బడి పిలుస్తోంది, వనం–మనం, ఓటర్ల నమోదు కార్యక్రమాలతో పాటు వివిధ సర్వేల నిర్వహణలో క్రియాశీలక పాత్ర పోషించే సమన్వయకర్తలను అకస్మాత్తుగా తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సాక్షరభారత్ కేంద్రాల ఎత్తివేత విషయంలో పునరాలోచించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘ నాయకులు ఎం. రమేష్, లక్ష్మణరావు, శ్రీనివాస్, గుర్ల శ్రీను, జిల్లా నలుమూలల నుంచి సమన్వయకర్తలు పాల్గొన్నారు. -
దొంగనోట్ల చలామనీపై అప్రమత్తం : ఏఎస్పీ
రామభద్రపురం: సాలూరు పరిధిలో దొంగనోట్లు చలామనీ అవుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం డివిజన్ ఏఎస్పీ దీపికాపాటిల్ సూచించారు. స్థానిక పోలీసుస్టేషన్లో గురువారం ఆమె మాట్లాడారు. ఇటీవల సాలూరు ప్రాంతంలో దొంగనోట్లు చలామనీ చేసిన ముఠాను పట్టుకొన్నామని, వారి నుంచి కొంత మొత్తాన్ని రికవరీ చేశామన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. దొంగనోట్లలో వాటర్ మార్క్ కనిపించదని, అటువంటి నోట్లు ప్రజలు గమనించి తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య ఉన్న అన్ని ప్రాంతాల్లో నియంత్రణ చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రామభద్రపురం, సాలూరు, పి.కోనవలస వద్ద ఘాట్ రోడ్డు, పార్వతీపురం, తోటపల్లి ప్రాజెక్టు, కొత్తవలస రైల్వేగేట్ తదితర ప్రాంతాల వద్ద ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని ఈ సమస్యను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రామభద్రపురంలో రహదారి విస్తరణపై ఎస్పీకి లేఖ రావామని, రోడ్లు భద్రతా కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా ఉన్నందున నిధులు సమకూర్చుతామని తెలిపినట్టు పేర్కొన్నారు. ఆమె వెంట ఎస్ఐ డీడీ నాయుడు ఉన్నారు. -
సజావుగా సాగని చివరి మజిలీ..
విజయనగరం, వేపాడ: శ్మశానానికి తీసుకెళ్తున్న మృతదేహాన్ని అడ్డుకున్న సంఘటన మండలంలోని చినగుడిపాలలో శుక్రవారం చోటుచేసుకుంది. దీంతో రెవెన్యూ, పోలీస్ సిబ్బంది గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి సమస్యను పరిష్కరించారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన వేచలపు అప్పారావు అనే వ్యక్తి అనారోగ్యంతో శుక్రవారం మృతిచెందారు. దీంతో మృతదేమాన్ని బంధువులు, కుటుంబ సభ్యులు శ్మశానవాటికకకు తరలిస్తుండగా, గ్రామానికి చెందిన శంకరవంశం సీతారామ్మూర్తిరాజు మృతదేహాన్ని తీసుకెళ్తున్న రస్తా తన సొంతమని, ఈ దారి గుండా మృతదేహాన్ని తీసుకెళ్లకూడదని అడ్డగించాడు. మృతుడి బంధువులు ఎంత ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. దీంతో మృతుడి కుటుంబీకులు గ్రామ పెద్దలు, పోలీస్, రెవెన్యూ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ పెంటయ్య తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. స్థలం ఎవరిదైనా శవాన్ని అడ్డుకోవడం నేరమని.. అంత్యక్రియలు జరిగేలా చూడాలని పోలీసులకు సూచించారు. దీంతో వీఆర్ఓ శ్రీను, హెచ్‌సీ శివకేశవరావు గ్రామానికి చేరుకుని ఇరువర్గాలతో సంప్రదింపులు చేసి సమస్య పరిష్కరించారు. తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకుంటే స్థల హద్దులు గుర్తిస్తారని గ్రామపెద్దలకు చెప్పారు. అడ్డుకోవడం బాధాకరం మృతదేహాన్ని అడ్డుకోవడం బాధకరమని గ్రామ పెద్దలు లండఅప్పడు, రామ్మూర్తి, బాలిబోయిన పెదకోనారి, జీరంరెడ్డి జగ్గునాయుడు, తదితరులు అన్నారు. పూర్వం నుంచి గ్రామస్తులందరూ ఇదే రహదారిని వినియోగిస్తున్నారని చెప్పారు. అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడెందుకు వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. అధికారులు స్పందించి శ్మశానవాటిక హద్దులు గుర్తించి సమస్య పరిష్కరించాలని కోరారు. -
ఏం కష్టమొచ్చిందో...
రిజర్వాయర్‌లో శవాలుగా తేలిన కాబోయే దంపతులు మెంటాడ: త్వరలోనే పెళ్లి చేసుకోవలసిన ఓ జంట రిజర్వాయర్‌లో శవాలై తేలారు. విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు... డెంకాడ మండలం మోదవలస గ్రామానికి చెందిన రెయ్యి సురేష్(28)కు బొండపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన వసంత సుబ్బలక్ష్మితో వివాహం నిశ్చయమైంది. ఈసంవత్సరం అక్టోబర్ 29వ తేదీన వివాహం జరిపించేందుకు ముహూర్తం కూడా నిర్ణయించారు. సురేష్ తన అమ్మమ్మ వద్ద మోదవలసలో ఉంటూ ఒక బేకరీలో పని చేస్తున్నాడు. సుబ్బలక్ష్మి గజపతినగరంలోని కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. సురేష్ శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో తన ద్విచక్రవాహనంపై అత్తారింటికి బొండపల్లి వచ్చి సుబ్బలక్ష్మిని బయటకు తీసుకు వెళ్లినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. శనివారం ఇంటికి రాకపోయేసరికి ఎక్కడికో వెళ్లి ఉంటారని అంతా భావించారు. అయితే మెంటాడ మండలం ఆండ్రలోని రిజర్వాయర్‌లో ఇద్దరు మృతి చెంది ఉన్నారని, సమీపంలో ఒక ద్విచక్రవాహనం కూడా ఉందని ఆండ్ర పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు సురేష్ జేబులో ఉన్న ఆధార్ కార్డు, సెల్‌ఫోన్, ద్విచక్రవాహనం లెసైస్స్ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు సమాచారం తెలియజేశారు. కుటుంబ సభ్యులు రిజర్వాయర్ ప్రాంతానికి చేరుకుని మృతులు సురేష్, సుబ్బలక్ష్మిలుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజపతినగరం ప్రభుత్వఆస్పత్రికి తరలించారు. పిల్లల ఇష్టప్రకారమే పెళ్లికి నిశ్చయించామని, తమకు ఎటువంటి అనుమానాలు లేవని ఇరువైపులా కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. -
'..ఉన్న ఉద్యోగాల్ని పీకేస్తున్నారు'
పార్వతీపురం: విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం వెంకంపేటగోరీలు వద్ద స్థానిక రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. కొత్త ప్రభుత్వం ఇప్పటివరకు పంటల పంటల రుణమాఫీ చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాలపై జగన్‌తో మహిళలు మాట్లాడారు. పార్వతీపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద వైఎస్ జగన్‌ను ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు కలిశారు. ఇంటికో ఉద్యోగమన్న చంద్రబాబు ఉన్న ఉద్యోగాల్ని తీసివేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, తమను ఎస్టీల్లో చేర్చాలంటూ జగన్ ను రజకులు కోరారు.