గుర్ల: విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా మృతుల సంఖ్యను ప్రభుత్వం దాచిపెట్టే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికి పోయింది. డయేరియాతో పది మంది చనిపోయినా ఒక్కరే అంటూ చేసిన ప్రకటన తప్పని తేలింది. ఇప్పటికే డయేరియా మరణాలపై ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతుండగా.. జిల్లా కలెక్టర్ డాక్టర్.బీ.ఆర్ అంబేద్కర్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ డయేరియా కారణంగా ఒకరు మృతి చెందారని ప్రకటించారు.
ఈ నేపథ్యంలో సోమవారం గుర్లలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. అనంతరం మీడియా సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ చేసిన ప్రకటనలు తప్పని తేల్చారు. గుర్లలో 10 మంది డయేరియా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా రూ.లక్ష ఇస్తామని పవన్ ప్రకటించారు. దీంతో పక్కనే ఉన్న మంత్రి, కలెక్టర్ అవాక్కయ్యారు. ఒక్కరే చనిపోయారంటూ కలెక్టర్ ప్రకటించి మృతుల సంఖ్యను దాచి పెట్టే ప్రయత్నం చేశారు. కానీ పదిమంది చనిపోయారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది.
పవన్ పర్యటనలో మంత్రి కొండపల్లికి అవమానం
మరోవైపు గుర్లలో పవన్ పర్యటనలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కి ఘోర అవమానం జరిగింది. గుర్ల పీహెచ్‌సీలో డయేరియా రోగులను పరామర్శించడానికి పవన్‌తో పాటు వెళ్లేందుకు మంత్రి కొండపల్లిని పవన్ సెక్యూరిటీ సిబ్బంది అనుమతించ లేదు. దీంతో పవన్ ఆస్పత్రిలో వున్నంత సేపు కొండపల్లి మెయిన్ డోర్ బయటే నిలబడడ్డారు. దీంతో పవన్ తీరుపై జిల్లా టీడీపీలో చర్చ జరుగుతుండగా.. తమ మంత్రినే అవమానిస్తారా’ అంటూ కొండపల్లి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment