
గుర్లలో వైఎస్ జగన్ పరామర్శ అప్‌డేట్స్..

👉గుర్లలో డయేరియా మృతుల కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారిని ఓదార్చి.. ధైర్యం చెప్పారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
👉గుర్ల చేరుకున్న వైఎస్ జగన్

👉రాష్ట్రంలో సెప్టెంబర్‌లోనే డయేరియా ప్రమాద ఘంటికలు మోగించించింది. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో, వ్యాధి బారినపడి 14 మంది చనిపోయారు.
👉ఈ సందర్బంగా వైఎస్ జగన్‌కు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్ వద్దకు భారీ సంఖ్యలో మద్దతుదారులు వైఎస్ జగన్ కోసం వచ్చారు.

👉వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు విజయనగరం జిల్లా గుర్లలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా డయేరియా మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు.

👉వైఎస్ జగన్ విజయనగరం బయలుదేరారుు. మరికాసేపట్లో గుర్ల చేరుకుంటారు. అక్కడ డయేరియా సోకి మృతి చెందిన వారి కుటుంబాలను, చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు.
👉కాగా, కొద్దిరోజులుగా గుర్లలో డయేరియా కారణంగా పదుల సంఖ్యలో మరణాలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆసుపత్రుల్లో పలువురు చికిత్స పొందుతున్నారు.

Comments
Please login to add a commentAdd a comment