అక్రమంగా సంపాదించిన సొమ్మును ఐటీ అధికారులు ఎక్కడ స్వాధీనం చేసుకుంటారోనని చంద్రబాబునాయుడు భయపడుతున్నారని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రజాసంకల్పయాత్ర 280వ రోజు పాదయాత్రలో భాగంగా ఆదివారం విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గుర్లలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. ఎన్నికల సమీపిస్తున్నందును ప్రతీ నియోజవర్గానికి రూ. 30 కోట్లు తరలించారని, వాటి వివరాలు బయటపడుతాయనే చంద్రబాబు భయాందోళనకు గురవుతున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. వైఎస్సార్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొన్నారని,