సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులు ప్రశాంత్ బోస్, ఆయన భార్య శీలా మరాండిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మావోయిస్టు సీనియర్ నాయకులలో ఒకరైన ప్రశాంత్ బోస్‌ను జార్ఖండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దా మావోయిస్టు నాయకుల్లో నెంబర్2గా ఉన్నారు. గణపతి తరువాత మావోయిస్టుల్లో అత్యంత పలుకుబడి ఉన్న వ్యక్తి. ప్రశాంత్ బోస్‌పై గతంలో కేంద్రం కోటి రూపాయల రివార్డు ప్రకటించింది.
చదవండి: ఇద్దరు ఉద్యోగులను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు
కాగా మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా( ఎమ్‌సీసీఐ) చీఫ్‌గా ప్రశాంత్ బోస్ పనిచేశారు. ప్రశాంత్ బోస్ భార్య షీలా మరాండీ కూడా సీనియర్ మావోయిస్టు నాయకురాలు. ఇదిలా ఉండగా 75 ఏళ్ల ప్రశాంత్ బోస్ కొంత కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. కిషన్ దా ప్రస్తుతం సీపీఐ మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్, పొలిట్‌బ్యూరో, సెంట్రల్ మిలటరీ కమిషన్, ఈస్ట్రన్ రీజినల్ బ్యూరో సెక్రటరీగా కొనసాగుతున్నారు.
చదవండి: 23 కోట్ల బీమా సొమ్ము కోసం రైలు పట్టాలపై పడుకుని రెండు కాళ్లు..!!
Comments
Please login to add a commentAdd a comment