
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హిడ్మా పోలీసులకు లొంగిపోయినట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ ఖండించింది. కేంద్ర ప్రభుత్వంతోపాటు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు ఓ వ్యూహం ప్రకారం అసత్య ప్రచారం చేస్తున్నాయని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ గురువారం ఓ ప్రకటనలో విమర్శించారు.
విప్లవోద్యమ ప్రాంతాలకు దూరంగా ఉండే మావోయిస్టు పార్టీ సానుభూతిపరులను తప్పుదోవ పట్టించేందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. పోలీసులు ఎవరో ఒకర్ని అరెస్టు చేసి తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారన్నారు. హిడ్మా దండకారణ్యంలో గెరిల్లా బేస్‌లో ప్రజల మధ్య ఉన్నారని ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment