Maoist party
-
వరుస ఎదురుదెబ్బలు.. మావోయిస్టుల కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: దండకారణ్యంలో వరుసగా తగులుతున్న ఎదురుదెబ్బలు మావోయిస్టు పార్టీపై పెను ప్రభావం చూపుతున్నాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నుంచి మద్వీ హిడ్మాను ఆ పార్టీ అగ్రనాయకత్వం తొలగించింది. దండకారణ్యంలో కేంద్ర బలగాలను ఎదుర్కోవడంలో వైఫల్యం చెందారనే కారణంతోనే హిడ్మాను తొలగించినట్టు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ) స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి రామచంద్రారెడ్డి అలియాస్ చలపతితోపాటు 16 మంది మావోయిస్టులు ఇటీవల హతమైన నేపథ్యంలో హిడ్మాను తొలగించడం గమనార్హం.వాస్తవానికి చలపతి నాయకత్వంలోనే హిడ్మా మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ప్రధానంగా మిలటరీ ఆపరేషన్ల ప్రణాళిక, నిర్వహణ చలపతి నుంచే ఆయన నేర్చుకున్నారు. వారిద్దరిదీ గురుశిష్యుల బంధంగా చెబుతారు. 2017లో చత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో భద్రతా బలగాలపై దాడికి హిడ్మానే నేతృత్వం వహించారు. దాంతో ఆయనకు పదోన్నతి కల్పిస్తూ కేంద్ర కమిటీ సభ్యునిగా నియమించారు. 2022 తరువాత ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల నుంచి మావోయిస్టు అగ్రనేతలు చత్తీస్ఘడ్ సరిహద్దులకు తరలిపోయారు. అప్పటి నుంచే చలపతి, హిడ్మా మధ్య విభేదాలు ఏర్పడినట్టు తెలుస్తోంది. చలపతి దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉండటంతో ఒడిశాలోని మావోయిస్టు పార్టీ వ్యూహాలను హిడ్మానే పర్యవేక్షిస్తున్నారు.మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడి అరెస్ట్ ఎటపాక: చత్తీస్‌గఢ్‌కు చెందిన మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడిని అల్లూరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను ఎస్పీ అమిత్ బర్దర్ గురువారం ఎటపాకలో మీడియాకు వెల్లడించారు. మావోయిస్టు కార్యకలాపాలను అరికట్టడంలో భాగంగా కొన్ని రోజులుగా సీఆర్పీఎఫ్ బలగాలతో కలిసి పోలీసులు ఎటపాక మండలం విస్సాపురం పంచాయతీ చెరువుగుంపు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు సోడి పొజ్జి అలియాస్ లలిత్‌ను పోలీసులు పట్టుకున్నారు. పొజ్జి ఛత్తీస్‌గఢ్‌లోని గొండిగూడకు చెందిన వ్యక్తి అని ఎస్పీ చెప్పారు. చదవండి: ఓవర్ యాక్షన్ ఫలితం.. చిక్కుల్లో ఖాకీలు -
చేజారుతున్న కర్రిగుట్టలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఆపరేషన్ కగార్ ఫలితంగా.. దండకారణ్యంలో తమకు పట్టున్న ఒక్కొక్క ప్రాంతాన్ని మావోయిస్టులు (Maoists) కోల్పోతున్నారు. ఈనెల 16న జరిగిన ఎన్‌కౌంటర్‌తో తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రిగుట్టలు ప్రాంతం సైతం మావోయిస్టుల చేజారిపోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.జాయింట్ టాస్క్ ఫోర్స్ ..కర్రిగుట్టలు కేంద్రంగా మావోయిస్టులు తెలంగాణలో మళ్లీ ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ గతేడాది జూలై 4న సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit Shah) దృష్టికి తీసుకెళ్లారు. మావోయిస్టుల దూకుడుకు అడ్డుకట్ట వేసేలా.. ఈ గుట్టలకు సరిహద్దుగా ఉన్న ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక, భద్రాద్రి జిల్లా చర్ల మండలం కొండవాయిలో సీఆర్పీఎఫ్ (CRPF) జాయింట్ టాస్క్ ఫోర్స్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం జూలై 19న కర్రిగుట్టల్లోకి స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు చనిపోగా.. మిగిలిన దళ సభ్యులు తప్పించుకున్నారు. దీంతో గాలింపు ఉధృతం చేసే లక్ష్యంతో అదనపు బలగాలు ఈ గుట్టల్లోకి వెళ్లాయి. ఆ సమయాన వర్షాల కారణంగా పొంగిన వాగులు, వంకలతో స్పెషల్ పార్టీ పోలీసులంతా అడవిలో చిక్కుకుపోయారు. వీరికి వాయుమార్గంలో సాయమందించడం వీలు పడలేదు. దీంతో ప్రతికూల పరిస్థితుల నడుమ సుమారు 60 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ తెలంగాణ సరిహద్దుకు.. తెలంగాణ పోలీసులు చేరుకోగా.. చివరకు వారిని హెలీకాప్టర్ సాయంతో కాపాడారు.కర్రిగుట్టల్లో భద్రతా దళాలు కర్రిగుట్టల్లో ఛత్తీస్‌గఢ్ వైపు పూజారి కాంకేర్ – మారేడుబాక అటవీ ప్రాంతంలోని మావోయిస్టులు, భద్రతా దళాల నడుమ ఈనెల 16న ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో అధికారిక లెక్కల ప్రకారం 12 మంది మావోయిస్టులు చనిపోగా.. మిగిలిన వారు తప్పించుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ప్రస్తుతం కర్రిగుట్టల్లో సుమారు రెండు వేల మందికి పైగా సంయుక్త భద్రతా దళాల జవాన్లు కూంబింగ్ చేస్తూ.. ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. వచ్చే వేసవి చివరి నాటికి ఈ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి నామమాత్రం చేయాలని భద్రతా దళాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇప్పటికే ఈ దాడిలో మావోయిస్టుల ఆయుధాల తయారీ కేంద్రాన్ని భద్రతా దళాలు కనుగొన్నాయి. అయితే, ఇప్పటికీ మావోయిస్టు శిబిరాలు భద్రతా దళాలకు చిక్కకపోవడం.. ఈ గుట్టల్లో నెలకొన్న సంక్లిష్టతను చెబుతోంది.మావోయిస్టుల అడ్డా బస్తర్ దేశంలోనే మావోయిస్టులకు బస్తర్ ప్రాంతం అడ్డాగా ఉంది. ఇక్కడి నుంచే బస్తరేతర ప్రాంతాలకు చెందిన వివిధ రాష్ట్ర, డివిజన్, ఏరియా కమిటీలు పని చేస్తున్నట్టు సమాచారం. బస్తర్‌కు చెందిన కీలక కమిటీలైన దండకారణ్య స్పెషల్ జోనల్, దక్షిణ బస్తర్ జోన్ వంటి కమిటీలు సంచరిస్తూ పని చేస్తుంటాయి. కానీ, బస్తర్ బయటి ప్రాంతాలకు చెందిన కమిటీలు ఎక్కువగా శిబిరాల్లోనే షెల్టర్ తీసుకుంటాయి. ఈ కమిటీలకు చెందిన వివిధ దళాలు.. అప్పుడప్పుడు తమ సంబంధిత ప్రాంతాలకు వెళ్లి తిరిగి షెల్టర్ జోన్లకు చేరుకుంటున్నా యి. అందులో భాగంగానే తెలంగాణతో పాటు ఇతర డివిజన్, ఏరియా కమిటీలు కర్రిగుట్టలు కేంద్రంగా షెల్టర్ తీసుకున్నట్టు తెలుస్తోంది. పాల్వంచ – మణుగూరు, ఏటూరునాగారం – మహదేవపూర్ ఏరియా కమిటీల సభ్యులు కర్రిగుట్టల నుంచి తెలంగాణకు వచ్చి గతేడాది జరిగిన ఎన్కౌంటర్లలో 15 మంది చనిపోయారు.రాష్ట్రాలకు సహజ సరిహద్దుగా..తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు సహజ సరిహద్దుగా కర్రిగుట్టలు ఉన్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులో.. ఇంద్రావతి నది గోదావరిలో కలిసే చోటునుంచి ప్రారంభమయ్యే కర్రిగుట్టలు.. చర్ల మండలంలో తాలిపేరు వాగు గోదావరిలో కలిసే వరకు ఇంచుమించు 100 కిలోమీటర్ల పొడవుతో వ్యాపించి ఉంటాయి.చదవండి: వరుస ఎదురుదెబ్బలు.. మావోయిస్టుల సంచలన నిర్ణయం గుట్టలకు ఆవలి వైపు బీజాపూర్ జిల్లా ఉండగా.. తెలంగాణ వైపు ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో కొద్ది భాగం ఉంటాయి. ఈ గుట్టల మధ్య పుష్కలమైన జలవనరులు ఉన్నాయి. దీంతో ఏళ్ల తరబడి ఈ ప్రాంతం మావోయిస్టులకు షెల్టర్ జోన్‌గా ఉపయోగపడుతోంది. తెలంగాణలో పట్టు కోసం మావోయిస్టులు ఇక్కడి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. -
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ..ఎన్కౌంటర్లో అగ్రనేత మృతి
సాక్షి,హైదరాబాద్:మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రటరీ దామోదర్ అలియాస్ బడే చొక్కారావు ఎదురు కాల్పుల్లో మృతిచెందారు.ఛత్తీస్‌గఢ్‌లో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ఆయన మృతిచెందినట్లు మావోయిస్టు పార్టీ శనివారం(జనవరి18) ఓ లేఖను విడుదల చేసింది.దామోదర్ స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి. దాదాపు 30 ఏళ్లుగా ఆయన మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా ఆయన పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. ఆయనపై ఛత్తీస్‌గఢ్‌లో50 లక్షల రివార్డు కూడా ఉంది. తెలంగాణలోనూ 25లక్షల రివార్డు ఉంది.ఆరు నెలల క్రితమే ఆయన తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు.మావోయిస్టు యాక్షన్ టీమ్‌లకు ఆయన ఇన్చార్జిగానూ ఉన్నారు.తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్‌లో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో 17 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరో ఘటన.. బిజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధి అటవీ ప్రాంతంలో మావో యిస్టులు అమర్చిన మందుపాతర పేలిన ఘటనలో కోబ్రా బెటాలియన్ కానిస్టేబుళ్లు మృదుల్ బర్మన్, మహ్మద్ ఇషాఖ్ గాయపడ్డారు. తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం(కే) మండల సరిహద్దులోని మారేడుబాక –ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల శిబిరం ఉన్నట్టు సమాచారం అందుకున్న బలగాలు గురువారం ఉదయం కూంబింగ్ ప్రారంభించాయి. మొత్తం రెండు వేల మంది జవాన్లు అడవులను జల్లెడ పడుతుండగా మావోయిస్టులు ఎదురుపడడంతో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల్లో దామోదర్ కూడా ఉన్నట్లు మావోయిస్టు పార్టీ తాజాగా ప్రకటించింది. -
మావోయిస్టు పార్టీ అగ్రనేత సుజాత అరెస్టు?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాత అలియాస్ మైనా అలియాస్ కల్పన అలియాస్ ఝాన్సీ అలియాస్ పద్మను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 67 ఏళ్ల సుజాత వైద్య చికిత్స నిమిత్తం బస్తర్ అడవులను వీడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీదుగా హైదరాబాద్ వెళ్తుండగా పక్కాగా అందిన సమాచారంతో జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. పోలీసు అధికారులు మాత్రం ఈ విషయం ధ్రువీకరించడం లేదు. తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని, అదంతా మీడియాలో వస్తున్న ప్రచారమని చెబుతున్నారు. దీంతో సుజాత నిజంగానే అరెస్టయ్యారా? లేక లొంగిపోయారా? అనే అంశంపై స్పష్టత కరువైంది. ఈమెపై కేంద్ర ప్రభుత్వం రూ.కోటి రివార్డు ప్రకటించింది. లొంగుబాటుకు ప్రయత్నాలు? సుజాత వయోభారంతో లొంగిపోవాలని నిర్ణయించుకున్నారని, సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్‌కు చేరుకుని అక్కడ తనకున్న పరిచయాల ద్వారా లొంగిపోయేందుకు ప్రయత్నించారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. మరోవైపు ఇటీవల దండకారణ్యం, అబూజ్‌మఢ్ అడవుల్లో పోలీసులు, భద్రతా దళాల నిర్బంధం పెరిగిపోయింది. ఇంకోవైపు వయోభారం, అనారోగ్యం సమస్యలతో సుజాత ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మెరుగైన వైద్యం కోసం తెలంగాణలోకి వస్తుండగా పోలీసులు అరెస్టు చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండురోజుల కిందటే సుజాతకు సంబంధించిన పక్కా సమాచారం పోలీసులకు అందినట్టు సమాచారం. కిషన్జీతో వివాహం? మహబూబ్‌నగర్‌కు చెందిన సుజాత డిగ్రీ చేయడానికి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు రాడికల్ స్టూడెంట్ యూనియన్‌తో పరిచయం అయింది. క్రమంగా విప్లవ భావాల వైపు ఆకర్షితురాలైంది. ఆమెతో పాటు మరో ఇద్దరు కూడా విప్లవ బాట పట్టి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరు మహిళలు ఇప్పటికే వివిధ ఎన్కౌంటర్లలో చనిపోయారు. సుజాత దాదాపు 43 ఏళ్లు నక్సలైట్/మావోయిస్టు పార్టీల్లో పని చేశారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీతో సుజాతకు వివాహం జరిగినట్టు తెలుస్తోంది. కిషన్‌జీ పదిహేనేళ్ల కిందట అప్పటి కేంద్ర ప్రభుత్వానికి, హోంమంత్రి చిదంబరానికి నేరుగా సవాల్ విసిరిన మావోయిస్టుగా సంచలనం సృష్టించారు. పదమూడేళ్ల కిందట ఎన్కౌంటర్లో చనిపోయారు. -
ప్రొఫెసర్ సాయిబాబా మృతిపై మావోయిస్టుల సంతాపం
సాక్షి,హైదరాబాద్: ప్రొఫెసర్ సాయిబాబా మృతిపై మావోయిస్టు పార్టీ సంతాపం ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి మంగళవారం( అక్టోబర్ 15) ఒక ప్రకటన విడుదల చేశారు. ‘బడుగు బలహీన వర్గాల గొంతును సాయిబాబా వినిపించాడు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సాయిబాబా కీలక పాత్ర పోషించాడు.జైలులో సుదీర్ఘకాలం దుర్భర పరిస్థితులను సాయిబాబా అనుభవించాడు. జైలులో ఉన్న పరిస్థితుల కారణంగానే సాయిబాబా ఆరోగ్యం క్షీణించింది. సాయిబాబా మృతికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలి’అని జగన్ పేర్కొన్నారు. కాగా, ప్రొఫెసర్ సాయిబాబా ఇటీవలే హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇదీ చదవండి: ప్రొఫెసర్ సాయిబాబాకు కన్నీటి వీడ్కోలు -
అంత పెద్ద ఎన్కౌంటర్ జరిగినా.. మౌనం వీడని మావోయిస్టులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తుల్తులీ–గవాడీ ఎదురుకాల్పులపై మావోయిస్టుల నుంచి ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. ఎదురుకాల్పుల ఘటన చోటు చేసుకొని ఆరు రోజులు గడుస్తున్నా మావోయిస్టు పార్టీ మౌనం వీడలేదు. దీంతో ఆ పార్టీకి తాజా ఎన్కౌంటర్లో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టుగా భావిస్తున్నారు. ఎన్కౌంటర్ జరిగిన తీరుపై పోలీసు వర్గాలు చెప్పే వివరణను విశ్లేషిస్తూ.. కొన్నిసార్లు విమర్శలు చేస్తూ, మరికొన్నిసార్లు అన్ని అబద్ధాలే అంటూ మావోయిస్టులు లేఖలు విడుదల చేస్తుంటారు. తాజా ఎన్కౌంటర్ ఎలా జరిగింది, దానికి కారణాలు ఏంటనే అంశాలపై మావోలకే ఇంకా స్పష్టత రాలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. నక్సలైట్ల అంచనాలకు అందని రీతిలో భద్రతా దళాలు, పోలీసులు సంయుక్తంగా మెరుపుదాడి చేయడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెద్ద లీడర్లు ఉంటారని ప్రచారం జరిగినా.. ఈ నెల 4న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు చనిపోయారని పోలీసులు ప్రకటించారు. ఇందులో రాష్ట్ర కమిటీ సభ్యురాలు నీతి అలియాస్ ఊరి్మళ సహా 22 మంది పేర్లు, మావోయిస్టు పారీ్టలో వారి హోదాలు, వారిపై ప్రభుత్వం ప్రకటించిన రివార్డు వంటి వివరాలను పోలీసులు వెల్లడించారు. మరో తొమ్మిది మంది ఎవరనేది గుర్తించలేకపోయారు. పైగా ఎన్కౌంటర్ జరిగిన రోజు మృతుల్లో నంబాళ్ల కేశవరావు, తక్కెళ్లపల్లి వాసుదేవరావు వంటి టాప్‌మోస్ట్ లీడర్లు ఉన్నారనే పుకార్లు షికారు చేశాయి. రోడ్డు పనులు అడ్డుకోండి.. ఎన్కౌంటర్ చోటుచేసుకున్న తుల్తులీ–గవాడీ గ్రామాల నుంచి 30 కి.మీ. దూరంలో ఓర్చా పోలీస్‌స్టేషన్ ఉంది. అక్కడి నుంచి తుల్తులీ– గవాడీలకు చేరుకోవాలంటే దట్టమైన అడవిలో కొండలు, గుట్టలు ఎక్కుతూ.. దిగుతూ, ఎనిమిది వాగులను దాటాలి. ఓర్చా వరకు యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ చేపడుతున్న పారామిలిటరీ బలగాలు క్యాంపులను ఏర్పాటు చేశాయి. తదుపరి లక్ష్యంగా తుల్తులీ ఉంది. దీంతో తొలిసారిగా ఆ గ్రామానికి రోడ్డు వేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. చదవండి: సేఫ్ జోన్ ఎక్కడ?.. తెలంగాణవైపు మళ్లీ వచ్చేందుకు మావోయిస్టుల ప్రయత్నాలుఅయితే రోడ్డు నిర్మాణ పనులు అడ్డుకోవాలంటూ ఊర్మిళ నేతృత్వంలో గవాడీ గ్రామంలో ఈనెల 2న పీఎల్జీఏ కంపెనీ 6కు చెందిన మావోయిస్టులు సమావేశం నిర్వహించినట్టు అక్కడి గ్రామస్తులు తెలిపారు. ‘రోడ్డు నిర్మాణం జరిగితే మన భూమి, మన నీరు, మన అడవిని దోచేస్తార’ని ఆ సమావేశంలో ఊర్మిళ మాట్లాడిందని చెప్పారు. ఆ తర్వాత రెండు రోజులకే జరిగిన ఎదురుకాల్పుల్లో ఆమె చనిపోయారు. దళంలో 30 ఏళ్ల పాటు పనిచేసిన అనుభవం ఊర్మిళకు ఉంది. -
పిట్టపడా ఎన్‌కౌంటర్‌కు సీఎందే బాధ్యత
సాక్షి, హైదరాబాద్/చర్ల: విప్లవ పోరాటాలపై తె లంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసా గిస్తున్న హత్యాకాండను ప్రజలంతా ఖండించా లని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ములు గు జిల్లా వెంకటాపురం మండలంలో పిట్టపడా వద్ద గ్రేహౌండ్స్ పోలీసు లు చేసిన ఎన్‌కౌంటర్‌కు కాంగ్రెస్ పార్టీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినే బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు మావో యిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ శనివారం ఓ లేఖను విడుదల చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణలోకి కూలీ పనుల కోసం వస్తున్న ఆదివాసీలను ఎస్ఐబీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి మావో యిస్టుల సమాచారం చెప్పాలని వేధిస్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకే గ్రేహౌండ్స్ బలగాలు ఏప్రిల్ 6న మధ్య రీజనల్ కంపెనీ–2కి చెందిన కమాండర్ అన్నె సంతోష్ శ్రీధర్, సాగర్, అదే కంపెనీకి చెందిన ప్లటూన్ పార్టీ కమిటీ సభ్యుడు ఆస్మా మణిరామ్, సభ్యుడు పూనెం లక్ష్మణ్ అమరులయ్యారని పేర్కొన్నారు. నిరాయుధులైన వారిని శారీరకంగా ఎంతో హింసించి చంపి మృగాల మాదిరిగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా ఈ నెల 15న బంద్‌కు పిలుపు ఇచ్చినట్లు వెల్లడించారు. -
అన్నల ఇలాఖాలో.. ఎన్నికల సందడి
కాజీపేట: ఎన్నికలు వచ్చాయంటే హనుమకొండ జిల్లాలోని అనేక గ్రామాల్లో గతంలో భయం భయంగా ఉండేది. ఒకవైపు ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్ట్ నక్సలైట్ల పిలుపు. ఎన్నికల్లో పాల్గొనా లని పోలీసుల కవాతుల మధ్య పల్లె జనాల వెన్నులో వణుకు పుట్టేది. ఎన్నికలు జరగనీయొద్దని నక్సల్స్.. ఎలాగైనా ఎన్నికలు జరిపించాలని పోలీ సుల పట్టు మధ్య గ్రామస్తులు నలిగిపోయే వారు. ఎన్నికలు ముగిసి ప్రశాంతత ఏర్పడే వరకు బిక్కుబిక్కుమంటూ కాలంగడిపే పరిస్థితులు ఉండేవి. తుపాకుల నీడన ఎన్నికలు.. నగరానికి కూతవేటు దూరంలోనే ఉన్న అనేక గ్రామాలు నక్సల్స్ ప్రభావితంగా ఉండేవి. కాజీపేట పట్టణానికి చెందిన క్రాంతిరణదేవ్ అలియాస్ బక్కన్న, మాచర్ల ఏసోబు, కడారి రాములు తదితరుల నేతృత్వంలో శివారు గ్రామాలన్నీ ఎన్నికలకు దూరంగానే ఉండేవి. కాజీపేటకు చుట్టూ పది కిలోమీటర్ల దూరంలోనే ఉన్న పల్లెల్లో ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చి విజయవంతం చేయాలని అన్నలు ప్రయత్నించేవారు. భట్టుపల్లి, తరాలపల్లి, రాంపేట, అయోధ్యపురం, టేకులగూడెం, దర్గా కాజీపేట, కొండపర్తి తదితర గ్రామాల్లో చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా నక్సల్స్‌కు అండగా నిలిచేవారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో రాష్ట్ర కమిటీలో కీలకంగా వ్యవహరిస్తున్న మాచర్ల ఏసోబు అలియాస్ కైలాసం స్వగ్రామం టేకులగూడంలో పరిస్థితులు భయానకంగా ఉండేవి. నక్సల్స్‌కు షెల్టర్ జోన్లుగా పిలిచే ఈ గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించడమంటే పోలీసులు, అధికారులకు సాహసమనే చెప్పాలి. పోలింగ్ బూతుల వద్ద గ్రామ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరింపజేసి ఎన్నికలను నిర్వహించిన సందర్భాలు అనేకం. కొన్ని సమయాల్లో సాయుధ పోలీసులు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను పోలీంగ్ కేంద్రాలకు తరలించేవారంటే పరిస్థితి ఏవిధంగా ఉండేదో.. అర్ధం చేసుకోవచ్చు. ఎన్నికల సమయంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు గ్రామాల్లో ప్రచారం చేసిన దాఖలాలు కనిపించేవి కావు. పోలీసులు ఎన్నికలకు నెలరోజుల ముందుగా నక్సల్స్ ప్రభావిత గ్రామాల్లో భారీగా కూంబింగ్ నిర్వహించి ఒకే.. అన్న తర్వాతే ఎన్నికల నిర్వాహణకు గ్రీన్ సిగ్నల్ పడేది. నక్సల్స్ ప్రభావిత గ్రామాల్లోని కొన్ని పోలింగ్ బూతుల్లో ఎన్నికల ఏజెంట్‌గా ఉండేందుకు పలాన పార్టీకి ఓటు వేయాలని ఓటర్లకు చెప్పేందుకు ఇంటింటికీ తిరిగి ఓట్లు అడిగేందుకు సాహసించేవారు కాదంటే అతిశయోక్తికాదు. -
అన్నలకే ‘పెద్దన్న’.. నిజాం వెంకటేశం..!
సిరిసిల్ల: మావోయిస్టు అగ్రనేతలకు ఆత్మీయుడు నిజాం వెంకటేశం. ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని మావో యిస్టు అగ్రనేతలు ఆయన మరణించే దాకా బయటపెట్టలేదు. సిరిసిల్ల పట్టణానికి చెందిన నిజాం వెంకటేశం(74) గతేడాది సెప్టెంబరు 18న హైదరాబాద్‌లో గుండెపోటుతో మరణించాడు. ఆయన మరణించిన విషయం తెలిసి..సరిగ్గా పది రోజులకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ ఓ వ్యాసం రాశారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు అగ్రనేత మల్లోజుల రాసిన వ్యాసం ఏడాది కిందట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చర్చనీయాంశమైంది. ఎవరీ నిజాం వెంకటేశం.. ఏమిటీ ఆయన చరిత్ర అని ఆరా తీశారు. ఆయన మరణించిన ఏడాది పూర్తి అయిన సందర్భంగా ‘అన్నలకే పెద్ద న్న’ అయిన నిజాం వెంకటేశం అడుగుజాడలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఎవరీ నిజాం వెంకటేశం.. కల్లోల సిరిసిల్లలో 1948 నవంబరు 14న వైశ్య కుటుంబంలో పుట్టి పెరిగిన నిజాం వెంకటేశం ట్రాన్స్‌కో ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించారు. ఆయన మూలాలు పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో ఉన్నాయని తెలుసుకున్న పలువురు సాహితీవేత్తలు ఉద్వేగానికి గురయ్యారు. సమసమాజ స్థాపనకు జరుగుతున్న ప్రజా యుద్ధంలో తన వంతు శక్తికి మించి సాయాన్ని అందించారని నిజాం వెంకటేశం నిజాల గురించి మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రాసిన వ్యాసంతో వెల్లడైంది. పెద్దపల్లిలోని తన చిన్ననాటి మిత్రులు ఒకసారి పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. ‘అవును వెంకటేశం సార్ ఇక్కడే ఉండేవారు. ఇక్కడి నుంచి బదిలీ అయిన తర్వాత తిరిగి పెద్దపెల్లికి రాలేదు’ అంటూ 42 ఏళ్ల క్రితం తనతో ఉన్న అనుబంధాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ఐదారేళ్లు పెద్దపల్లిలోనే ఉద్యోగం చేశారు. కరెంటు పవర్ హౌస్ (రాఘవపూర్ సబ్ స్టేషన్) లో ఉద్యోగం చేస్తూ ఓ సాహితీవేత్తగా విప్లవానికి అందించాల్సిన సేవలు అందించారు. ఆయన విద్యుత్ సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూనే.. గుట్టలు సమీపంలో ఉండడంతో పెద్దపల్లిలో ఐటీఐ చదివే వారు, విప్లవకారులు ఆయన ఇంటిని షెల్టర్‌గా చేసుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా వారికి భోజనం పెట్టి ఆత్మీయంగా ఉండేవారని మల్లోజుల తన వ్యాసంలో వెల్లడించారు. తన కంటే ముందు తన సోదరుడు మల్లోజుల కోటేశ్వర్రావుకు వెంకటేశం అత్యంత సన్నిహితుడని వివరించారు. తనను సైకిల్‌పై కూర్చోబెట్టుకుని డబుల్ సవారీ చేస్తూ తనకు ప్రపంచాన్ని పరిచయం చేశాడని వేణుగోపాల్ చెప్పడం విశేషం. అగ్రనేతలకు ఆత్మీయుడు.. పశ్చిమబెంగాల్లో అమరుడైన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ మొదలుకొని ఇప్పటికీ సజీవంగా కేంద్ర కమిటీలో ఉన్న గణపతి అలియాస్ ముప్పళ్ల లక్ష్మణ్‌రావు, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావుపల్లెకు చెందిన కడారి సత్యనారాయణరెడ్డి (కోసా), మంథనికి చెందిన మల్లా రాజిరెడ్డి, ప్రభుత్వంతో శాంతి చర్చల ప్రతినిధి గణేష్ ఇలా.. ఓ పదిపదిహేను మంది మావోయిస్ట్ అగ్రనేతలకు నిజాం వెంకటేశం సార్ ఇల్లు ప్రధాన షెల్టర్ అని రాఘవపూర్ గ్రామస్తులు తెలిపారు. వామ్మో సార్ ఇంటికి అప్పట్లో పెద్ద పెద్దోళ్లు (పెద్దన్నలు) వచ్చేవారని అంటున్నారు. ఇక ఉత్తర తెలంగాణ కార్యదర్శి సాగర్ అలియాస్ దుగ్గు రాజ లింగం ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడు. రాజలింగంకు నిజాం వెంకటేశం అత్యంత సన్నిహితుడిగా మల్లోజుల వేణుగోపాల్ పేర్కొన్నారు. నిజాం వెంకటేశం విప్లవ కార్యాచరణకు అందించిన సహకారాన్ని వివరిస్తూ రాసిన లేఖ పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల ప్రాంతాల్లో ఒక సంచలనం రేపింది. విప్లవ ఉద్యమానికి ఆయన నిర్వర్తించిన పాత్ర అనిర్వచనమని మల్లోజుల పేర్కొన్నారు. ఆశ్రయం కల్పించడం, సాహిత్యాన్ని అందించడం, వచ్చినవారిని కడుపులో దాచుకోవడం, ఉద్యమంలో పాల్గొన్నవారిని, వారి ఆర్థిక అవసరాలను తీర్చి, ప్రోత్సహించేవారిని నాటి వెంకటేశం మిత్రులు పేర్కొంటున్నారు. ఇలా ఉద్యమానికి అక్షరమై, ఆయుధాన్ని అందించిన వెంకటేశం సిరిసిల్ల ప్రాంత వాసి కావడం విశేషం. నిజానికి నిజాం వెంకటేశం గురించి సిరిసిల్ల ప్రాంత వాసులకు చాలా తక్కువే తెలుసు కానీ, ఆయనతో సన్నిహితంగా ఉండేవారికి అపర మేధావి, ధైర్యవంతుడు, పెద్ద యుద్ధానికి అగ్రనేతలను సంసిద్ధులను చేసిన పెద్దన్నగా పేరు సంపాదించినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో స్థిరపడి.. సిరిసిల్లకు చెందిన నిజాం విశ్వనాథం, సత్తమ్మ దంపతుల కొడుకు వెంకటేశం. భార్య పేరు మాధవి. ఒక్క కొడుకు, ఇద్దరు కూతుర్లు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 1966లో పాలిటెక్నిక్ చేసిన వెంకటేశం, చదువు పూర్తికాగానే 1968లో తొలిసారి ట్రాన్స్‌కోలో ఉద్యోగిగా జగిత్యాలలో విధుల్లో చేరారు. 1972 నుంచి 1978 వరకు పెద్దపల్లిలో పని చేశారు. అనంతరం 1978 నుంచి 1990 వరకు జగిత్యాల ప్రాంతంలో పని చేశారు. 1997లో ఉద్యోగ విరమణ చేశారు. ఇంగ్లిష్‌పై పట్టున్న ఆయన అనేక పుస్తకాలను తెలుగు నుంచి ఇంగ్లిష్‌లోకి, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చేశారు. సిరిసిల్ల శివారులోని రంగినేని ట్రస్ట్‌లో జరిగే సాహిత్య వేడుకలకు ఆయన తరచూ వచ్చేవారు. సిరిసిల్లలో అనేక మంది కవులు, సాహిత్యకారులు నిజాం వెంకటేశం సన్నిహితులుగా ఉన్నారు. కవిగా, విమర్శకులుగా పలు సాహిత్యకార్యక్రమాల్లో పాల్గొన్నారు. ‘అజాత శత్రువు’గా పుస్తకం వెంకటేశం సాహిత్యం.. వ్యక్తిత్వాన్ని ‘అజాత శత్రువు నిజాం వెంకటేశం’ పేరుతో పుస్తకాన్ని వెలువరించారు. తెలంగాణ జిల్లాలోని ప్రముఖ రచయితలు, కవులు, సాహిత్యకారులు ఈ పుస్తకంలో ఆయనతో ఉన్న అనుబంధాలను రాశారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఆయన ఎదుటివారికి సాయం చేయడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేవారు కాదు. తన సంపాదనలో ఎక్కువగా పుస్తకాల కొనుగోలుకు వెచ్చించినట్లు పలువురు తమ వ్యాసాల్లో వెల్లడించడం విశేషం. తను మరణించిన ఏడాది పూర్తి అయిన సందర్భంగా సిరిసిల్ల ప్రాంతంలోని సాహిత్యకారులు ఆయన సేవలను యాది చేసుకున్నారు. -
గద్దర్ చేసిన ఆ పనులు విస్మయం కలిగించాయి.. ఎందుకిలా?
జనం గుండె చప్పుడులా మోగిన ఆ పాట దరువు ఆగింది. మద్దెల మోతల్ల విరబూసిన ఆ పదాల తోట వాడింది. ఉద్యమంలా జనాన్ని చైతన్యంవైపు నడిపించిన ఆ పాట పడమటి దిక్కున అస్తమించింది. కామ్రేడు గద్దరన్నా! కానరాని లోకాలకు పోయిండు, తన పాటను మన యాదిలో వదిలేసి! -సాక్షి, హైదరాబాద్ ప్రజా బాహుళ్యాన్ని తన పాటలతో ఉర్రూతలూగించిన ప్రజా గాయకుడు గుమ్మడి విఠల్ అలియాస్ గద్దర్ ఆదివారంనాడు అనారోగ్య కారణాలతో దివికేగారు. తొలి నుంచి పూర్తిస్థాయి మావోయిస్టుగా, సానుభూతిపరుడిగా ఉన్న గద్దర్.. జీవిత చరమాంకంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు, చేసిన పనులు విస్మయం కలిగించాయి. తన కర్రకు కట్టిన ఎర్ర జెండాను విప్పేయడం, సూటూబూటు ధరించడం, అచ్చమైన కమ్యూనిస్టు అయి ఉండీ.. ఎన్నికల్లో ఓటు వేయడం, గుళ్లకు, స్వామీజీల వద్దకు వెళ్లడంపై ఆశ్చర్యం వ్యక్తమైంది. మావోయిస్టులు తీవ్రంగా వ్యతిరేకించే చంద్రబాబు కడుపులో తలపెట్టడం, కాంగ్రెస్ వారి వేదిక ఎక్కడం, ప్రధాని మోదీ సభకు ఆహ్వానం లేకున్నా వెళ్లడం వంటివీ చర్చనీయాంశంగా మారాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గద్దర్ పెద్దపల్లి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం కూడా జరిగింది. -
మావోయిస్టులకు చెందిన రూ.10 లక్షలు స్వాధీనం
బిజాపూర్: నిషేధిత మావోయిస్టు పార్టీ నేతలకు చెందినట్లుగా భావిస్తున్న రూ.10 లక్షల విలువైన రూ.2 వేల నోట్లను పోలీసులు పట్టుకున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిజాపూర్‌లో చోటుచేసుకుంది. గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్నార్ గ్రామానికి చెందిన దినేశ్ తాటి(23) శుక్రవారం స్థానిక ట్రాక్టర్ షోరూంకు వచ్చాడు. పోలీసులు అతడిని అనుమానంతో ప్రశ్నించగా గంగలూర్ ఏరియా కమిటీ మావోయిస్టులు ఆ నోట్లను మార్చాలంటూ తనకు ఇచ్చారని వెల్లడించాడు. రూ.2 వేల నోట్లతో ట్రాక్టర్ కొనేందుకు వచ్చానన్నాడు. ఇటీవల రూ.2 వేల నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన ఆర్బీఐ.. సెప్టెంబర్ 30ని ఆఖరు తేదీగా నిర్ణయించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఛత్తీస్‌గఢ్ పోలీసులు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గట్టి నిఘా ఉంచారు. మే 25న మావోయిస్టు కమాండర్ ఇచ్చిన రూ.6 లక్షల విలువైన 2 వేల నోట్లను పట్టుకుని, బిజాపూర్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ నెల 10న దంతెవాడ జిల్లాలోనూ రూ.1 లక్ష విలువైన రెండు వేల నోట్లను పట్టుకుని, ముగ్గురు మావోయిస్టు సానుభూతి పరులను అదుపులోకి తీసుకున్నారు. -
నాడు దళంలో.. నేడు సమస్యల్లో.. కేసీఆర్‌కు కామ్రేడ్ రమాకాంత్ వేడుకోలు
ఓదెల(పెద్దపల్లి): సమసమాజ నిర్మాణం కోసమంటూ మావోయిస్టు పార్టీలో చేరి, నాలుగేళ్లు పని చేశాడు. ఆ తర్వాత అనుకోకుండా అరెస్టయ్యి, జైలు జీవితం గడిపాడు ఓదెల గ్రామానికి చెందిన కోండ్ర నాగరాజు అలియాస్ రమాకాంత్. ప్రస్తుతం అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఓదెలలో దళిత సామాజికవర్గానికి చెందిన నాగరాజు ఐదోతరగతి వరకు చదువుకున్నాడు. జీతానికి పశువుల కాపరిగా పనిచేస్తున్న సమయంలో మావోయిస్టులతో పరిచయం ఏర్పడింది. వారి పాటలకు, కార్యకలాపాలకు ఆకర్షితుడై, 2006లో మావోయిస్టు పార్టీలో చేరాడు. తర్వాత ఏటూరునాగారం, మహదేవపూర్, గుండారం, నర్సంపేట్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలలో దళ నేతగా, ఏరియా కమిటీ బాధ్యుడిగా పని చేశాడు. ప్రభుత్వం నాగరాజు తలపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించింది. మావోయిస్టు పార్టీలో చురుగ్గా పనిచేస్తున్న అతనికి మహారాష్ట్రలో పార్టీ నిర్మాణ బాధ్యతలను పైస్థాయి నాయకులు అప్పగించారు. 2010 జనవరి 27న మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్పీ శివశంకర్ ఆధ్వర్యంలో పోలీసులు నాగరాజును అరెస్టు చేశారు. రెండేళ్లు జైలు జీవితం గడిపిన అనంతరం స్వగ్రామం ఓదెలకు వచ్చాడు. అప్పటినుంచి ఇక్కడే జీవిస్తున్నాడు. గ్రామంలో ఎలాంటి ఆస్తిపాస్తులు లేని నాగరాజు బీపీ, గుండె సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ప్రస్తుతం ద్విచక్రవాహనంపై ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో ఐస్‌క్రీం అమ్ముతున్నాడు. తాను అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నానని, ఇంట్లో తనతో భార్య, తల్లి, తమ్ముడు ఉన్నాడని తెలిపాడు. ప్రభుత్వం కనికరించి, దళితబంధు పథకం మంజూరు చేస్తే సీఎం కేసీఆర్‌కు, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిలకు జీవితాంతం రుణపడి ఉంటానని వేడుకుంటున్నాడు. -
TS: 15మంది సర్పంచ్‌లకు మావోయిస్టుల హెచ్చరిక
సారంగాపూర్(జగిత్యాల): మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాల లక్ష్మణ్‌రావు ఉరఫ్ గణపతి సొంత జిల్లాలో ఒకేసారి 15మంది సర్పంచ్‌లకు ఆ పార్టీ పేరిట లేఖలు విడుదల కావడం కలకలం రేపింది. శుక్ర, శనివారాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు ఈ లేఖలు అందినట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని 15 గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులతో పాటు, ఎంపీపీ, తహసీల్దార్, ఎంపీడీవోలు, నర్సింహులపల్లె గ్రామంలోని మరో 12 మందికి మావోయిస్టు గోదావరి బెల్ట్ ఏరియా కమిటీ కార్యదర్శి మల్లికార్జున్ పేరిట లేఖలు అందాయి. అటవీ భూములు ఆక్రమిస్తూ, అక్రమంగా పట్టాలు జారీచేస్తున్నారని, ఇందుకోసం రూ.కోట్లు దండుకున్నారని లేఖల్లో ఆరోపించింది. గ్రామాల్లో నిర్వహించాల్సిన పంచాయితీలను పోలీసుస్టేషన్ల దాకా తీసుకెళ్తున్నారని ధ్వజమెత్తారు. నర్సింహులపల్లెలో అక్రమంగా నిర్మించిన ఓ దుకాణాన్ని కూలి్చవేయాలని హెచ్చరించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారు తమ పద్ధతులు మార్చుకోకుంటే ప్రజాకోర్టులో శిక్షించాల్సి వస్తుందన్నారు. అయితే, ఒకేరోజు 15మంది సర్పంచ్‌లు, అధికారులు, గ్రామస్తులకు లేఖలు పోస్టు ద్వారా పంపించడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇవి మావోయిస్టులు జారీచేసినవా లేక, కావాలనే కొందరిలా చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, బాధితులు ఎస్పీతోపాటు సీఐ, ఎస్సైలను ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకున్నట్లు తెలిసింది. ఈ లేఖల విషయాన్ని ఎస్పీ భాస్కర్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈవిషయంపై బీర్పూర్ ఎస్సై అజయ్‌ను వివరణ కోరగా పోలీస్ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందని చెప్పారు. ఇది కూడా చదవండి: ఇంగ్లండ్ ఎన్నికల్లో ఖమ్మం వాసి నాగేంద్ర విజయం -
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్
-
మావోయిస్టు కీలకనేత రైనో అరెస్ట్
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): మావోయిస్టు పార్టీ ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు (డీసీఎం) జనుమూరి శ్రీనుబాబు అలియాస్ సునీల్ అలియాస్ రైనోను ఏవోబీలో అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సీలేరు పోలీసు స్టేషన్ పరిధి, ఆంధ్ర, ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల సమయంలో రైనోను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. రైనో ఏవోబీ టెక్నికల్ టీమ్‌లో, సీఆర్సీ 3వ కంపెనీలో కమాండర్‌గా, మావోయిస్టు నేత ఆర్కేకు ప్రొటెక్షన్ స్క్వాడ్ కమాండర్‌గా, ఏవోబీలో మిలిటరీ ప్లటూన్ కమాండర్‌గా వివిధ హోదాల్లో పనిచేశాడని తెలిపారు. 2018లో అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేల హత్యకేసులోనూ రైనో ప్రధాన నిందితుడని పేర్కొన్నారు. ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా పోలీసుశాఖ రికార్డుల్లో ఉన్నాడని తెలిపారు. అరెస్టయిన శ్రీనుబాబు అలియాస్ రైనోపై ప్రభుత్వం రూ.5 లక్షల రివార్డును గతంలో ప్రకటించిందని పేర్కొన్నారు. రైనోను న్యాయస్థానంలో హాజరుపరిచామని ఎస్పీ తెలిపారు. -
మావోయిస్టు అగ్రనేతల అమ్మ.. మధురమ్మ కన్నుమూత
పెద్దపల్లిరూరల్: మావోయిస్టు పార్టీ అగ్రనేతలు మల్లోజుల కోటేశ్వర్రావు (కిషన్‌జీ), వేణుగోపాల్‌రావుల మాతృమూర్తి మధురమ్మ (96) మంగళవారం తుదిశ్వాస విడిచారు. మూడునెలల క్రితం ఇంటి ఆవరణలో జారిపడగా తుంటి ఎముక విరిగింది. వైద్యులు సర్జరీ చేసి ఇంటికి పంపించారు. వారం క్రితం మళ్లీ అనారోగ్యానికి గురవ్వడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. ఇంటి ఆవరణలోనే తుదిశ్వాస విడవాలన్న ఆమె కోరికపై వెంటిలేటర్‌పైనే పెద్దపల్లిలోని సొంతింటికి తీసుకొచ్చారు. మధురమ్మను పరీక్షించిన వైద్యులు శ్వాస ఆగిపోయిందని ధ్రువీకరించారు. ఆమె మరణవార్త తెలుసుకున్న పలువురు ప్రజాసంఘాల నాయకులు, గ్రామ ప్రజలు తరలివచ్చి నివాళులర్పించారు. పోరాట కుటుంబం.. మావోయిస్టు అగ్రనేతలు కోటేశ్వర్రావు, వేణుగోపాల్‌రావుది పోరాట కుటుంబం. తండ్రి మల్లోజుల వెంకటయ్య తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా ప్రభుత్వ గుర్తింపు పొందారు. తామ్రపత్ర గ్రహీత. అదే పోరాట పటిమను పుణికిపుచ్చుకున్న కోటేశ్వర్రావు 1975లో అడవిబాట పట్టారు. మరో ఐదేళ్ల తరువాత వేణుగోపాలరావు సైతం కోటన్న బాటనే అనుసరించారు. 11ఏళ్ల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో.. కిషన్‌జీ పీడిత, తాడిత ప్రజలకోసం సుదీర్ఘకాలం పనిచేశారు. మావోయిస్టు పార్టీ అగ్రనేతగా ఎదిగారు. ఆ పోరాటం పాలకులకు కంటగింపుగా మారింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని మిడ్నాపూర్ జిల్లాలో 2011 నవంబర్ 25న జరిగిన ఎన్కౌంటర్లో కోటేశ్వర్రావు అమరుడయ్యారు. వేణుగోపాల్‌రావు ప్రస్తుతం కేంద్రకమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మొదట పోలీసులు ఒత్తిడి పెంచినా.. పీపుల్స్‌వార్ గ్రూప్‌లో కోటేశ్వర్రావు, వేణుగోపాల్‌రావు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న కాలంలో మల్లోజుల కుటుంబంపై పోలీసుల ఒత్తిడి పెరిగింది. 1986లో అప్పటి డీఎస్పీ బుచ్చిరెడ్డిని నక్సల్స్ కాల్చిచంపారు. ఆ కోపంతో పోలీసులు వెంకటయ్య, మధురమ్మల ఇంటిని కూల్చివేశారు. ఆ తర్వాత తాటికమ్మలతో గుడిసె వేసుకుని వారు కొంతకాలం జీవనం సాగించారు. 1997 డిసెంబర్ 26న మల్లోజుల వెంకటయ్య మరణించారు. మధురమ్మకు ముగ్గురు కొడుకులు. పెద్దకొడుకు ఆంజనేయరావు కేడీసీసీ బ్యాంకులో పనిచేసి విరమణ పొందారు. మిగిలిన ఇద్దరు ‘కోటేశ్వర్రావు, వేణుగోపాల్‌రావు జనం కోసం పోరాడుతున్నారు.. అలాంటి కొడుకుల కన్నందుకు గర్వంగా ఉంది’ అని మధురమ్మ చెప్పేదని జనం గుర్తు చేసుకుంటున్నారు. -
అట్టుడుకుతున్న అడవి పల్లెలు!
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ పల్లెలు అట్టుడుకుతున్నాయి. మావోయిస్టులు, పోలీసుల పోటా పోటీ సభలు, ప్రచారం, కూంబింగ్‌లతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మావోయిస్టు పార్టీ ఈ నెల 21 నుంచి 27 వరకు 18వ అమరవీరుల వారోత్సవాలను నిర్వహించనున్నట్టు మూడు రాష్ట్రాల సరిహద్దులో వారం ముందు నుంచే విస్తృత ప్రచారం చేసింది. గోదావరి పరీవాహక అటవీ ప్రాంతంలో నక్సల్స్ కదలికలున్నట్టు ఇంటెలిజెన్స్ అధికారులు పోలీసులను అప్రమత్తం చేశారు. దీనితో పోలీసు ఉన్నతాధికారులు గ్రేహౌండ్స్‌తోపాటు ప్రత్యేక సాయుధ పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. మూడు రాష్ట్రాల సరిహద్దులోని కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అడవులను సాయుధ బలగాలు జల్లెడ పడుతున్నాయి. క్షణక్షణం భయం భయం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సాయుధ బలగాలతో కలిసి తెలంగాణ సరిహద్దులో ఓవైపు పోలీసులు అడవులను జల్లెడ పడుతుండగా.. మరోవైపు మావోయిస్టు పార్టీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను చేపట్టింది. జన చేతన నాట్య మండలి నిర్వహించిన ఈ కార్యక్రమానికి మావోయిస్టు నాయకులతోపాటు 10, 12 గ్రామాల ప్రజలు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను పోలీసులు కూడా విడుదల చేశారు. ఇదే సమయంలో పోలీసులు వాల్ పోస్టర్లు, కరపత్రాల ద్వారా మావోయిస్టుల తలలకు వెల ప్రకటించి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుండటంతో అడవుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మావోయిస్టు స్థావరాలపై కన్ను కొంతకాలం నుంచి కూంబింగ్ ముమ్మరం చేసిన పోలీసులు.. మావోయిస్టు స్థావరాల సమాచారం సేకరించి దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ తాల్మెంద్రి అటవీ ప్రాంతంలో ఇటీవల నేషనల్ పార్క్ ఏరియా కమిటీ డీసీఎం దిలీప్ ఆధ్వర్యంలో మావోయిస్టులు సమావేశం అయ్యారనే సమాచారం అందింది. డీఆర్జీ పోలీస్ ఫోర్స్ దాడి చేయగా.. ఇరువురి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కానీ మావోయిస్టులు తప్పించుకున్నారు. -
తెలంగాణ మావోయిస్టు పార్టీకి భారీ షాక్
సాక్షి, హైదరాబాద్/ మద్దూరు: మావోయిస్టు పార్టీ కీలక నేత, ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ సభ్యురాలు రావుల సావిత్రి అలియాస్ మాధవి హెడెమె (46) డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. తొలితరం పీపుల్స్‌వార్ నాయకుడు, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా పనిచేసి 2019లో గుండెపోటుతో చనిపోయిన రావుల రామన్న అలి యాస్ శ్రీనివాస్ భార్య సావిత్రి. ఆమె లొంగిపోయిన విషయాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి బుధవారం మీడియాకు వెల్లడించారు. సావిత్రి 13 ఏళ్ల వయసులోనే మావోయిస్టు ఉద్యమంలో చేరారు. రావుల రామన్న 1992లో మావోయిస్టు పార్టీ (పీపుల్స్‌వార్)లో చేరిన సావిత్రిని 1994లో వివాహం చేసుకున్నారు. జనజీవన స్రవంతిలో కలిసినందుకు సావిత్రికి తక్షణ సాయం కింద రూ.50 వేల నగదును అందించారు. తెలంగాణలో లొంగిపోయిన సావిత్రికి రూ. 5 లక్షల చెక్‌ను అందజేయనున్నట్లు చెప్పారు. లొంగిపోతామంటే బెదిరిస్తున్నారు ‘మావోయిస్టు అగ్రనేతలు తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. మావోయిజానికి ఆదరణ తగ్గింది. మావోయిస్టులు బలవంతపెట్టి కొంతమందిని దళంలో చేర్చుకుంటున్నారు. లొంగిపోతామంటే బెదిరిస్తున్నారు. నేను ఎవరికి తెలియకుండా వచ్చి తెలంగాణ రాష్ట్రంలో లొంగిపోయానని సావిత్రి చెప్పారు’అని డీజీపీ వివరించారు. పోలీసులపై జరిగిన తొమ్మిది దాడుల్లో సావిత్రి పాల్గొన్నారని, ఛత్తీస్‌గఢ్‌లో ఆమెపై రూ. 10లక్షల రివార్డు ఉందని తెలిపారు. కేంద్ర కమిటీలో 13 మంది తెలుగోళ్లే.. ‘మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఉన్న 20 మందిలో 13 మంది తెలుగువాళ్లే. అందులో తెలంగాణ వాళ్లు 11 మంది కాగా, ఇద్దరు ఏపీకి చెందినవారు. ఛత్తీస్‌గఢ్ నుంచి వాళ్లు తెలంగాణలోకి ఎప్పుడైనా ప్రవేశించే అవకాశం ఉంది. వారు ఎప్పుడు తెలంగాణలోకి వచ్చినా.. వెంటనే పట్టుకుంటాం. లొంగిపోయే వారికి పునరావాసం కల్పిస్తాం. 135 మంది తెలంగాణకు చెందిన వాళ్లు బస్తర్‌లో అజ్ఞాతంలో ఉన్నారు. మహిళా నాయకుల్లో గణపతి భార్య సుజాతక్క, కోటేశ్వర్ రావు భార్యతోపాటు మరో మహిళ మావోయిస్టు రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్నారు’అని డీజీపీ వివరించారు. కాగా, పోలీసులకు లొంగిపోయినందున ఎలాంటి ఆంక్షలు లేకుండా సావిత్రిని కుటుంబంలోకి ఆహ్వానిస్తామని రామన్న పెద్దన్నయ్య రావుల చంద్రయ్య పేర్కొన్నారు. -
సరిహద్దుల్లో మావోల అలజడి.. పుంజుకోకముందే కట్టడి చేయాలని పోలీసుల అలర్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సరిహద్దుల్లో కొన్నేళ్ల తర్వాత మళ్లీ మావోయిస్టు పార్టీ కదిలికలు కనిపిస్తుండటంతో నిఘా వర్గాలతోపాటు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మావోల కార్యకలాపాలు పుంజుకోకముందే వారిని నియత్రించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలోని మంగి, తిర్యాణి అటవీ ప్రాంతాల్లో గ్రామ రక్షక దళాలను పునర్నిర్మించే పనిలో స్థానిక దళాలు ఉన్నట్లు వార్తలు రావడం, కొత్తగూడెం జిల్లా చర్ల పరిధిలో ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు తాజాగా ఇద్దరిని హతమార్చిన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు నేరుగా రంగంలోకి దిగారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తూ స్థానికులతో సమావేశమై మావోయిస్టు పార్టీ వైపు ఎవరూ వెళ్లకూడదని, పార్టీకి సహకరించరాదని సూచిస్తున్నారు. అలాగే గ్రేహౌండ్స్ పార్టీలను కూంబింగ్‌లో నిమగ్నం చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మరోవైపు కొత్తగూడెం జిల్లా చర్ల పరిధిలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దు మీదుగా గోదావరి దాటి మావోయిస్టులు భారీగా సమీప అటవీ ప్రాంతాల్లోకి వచ్చారన్న సమాచారం నిఘా వర్గాలకు అందినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యకలాపాలను ఏకకాలంలో విస్తృతపరిచేందుకు మావోయిస్టులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారన్న అనుమానంతో ఈ మొత్తం సరిహద్దు ప్రాంతాల్లో గ్రేహౌండ్స్‌తోపాటు సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలను ఉన్నతాధికారులు కూంబింగ్‌లోకి దించినట్లు సమాచారం. మాజీల సహకారంపై అనుమానం వాస్తవానికి ఆదిలాబాద్‌లో 2011 వరకు మావోయిస్టు పార్టీ విస్తృతంగా కార్యకలాపాలు కొనసాగించింది. రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, గ్రేహౌండ్స్ సంయుక్త ఆపరేషన్లలో కీలక నేతలు ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోవడంతో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లకు మకాం మార్చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు పెద్దగా కదలికలు, కార్యకలాపాలు లేవు. గతంలో తిర్యాణి, మంగి ప్రాంతంలో ఐరీ దళం నాయకుడు శ్రీనివాస్ నాయకత్వం వహించాడు. తర్వాత దళం అంతరించిపోవడం, మిగతా సభ్యులంతా లొంగిపోవడంతో కార్యలాపాలు లేవు. అయితే అప్పుడు దళంలో పనిచేసిన పాత సభ్యులెవరైనా మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్నారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఉన్నతాధికారుల ధీమా.. మావోయిస్టు పార్టీకి గతంలో మాదిరిగా రిక్రూట్మెంట్ జరిగే అవకాశమే లేదని, ప్రస్తుతమున్న టెక్నాలజీ యుగంలో ఎవరూ మావోయిస్టు పార్టీ వైపు అడుగులు వేయబోరని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. పైగా ఎవరైనా అలా పార్టీలో చేరే ప్రయత్నం చేస్తే తమకున్న ‘నెట్వర్క్’ద్వారా గంటల వ్యవధిలోనే ఆ సమాచారం తెలుస్తుందని... అలాంటి వారిని వెనక్కి తెచ్చి కౌన్సెలింగ్ సైతం ఇస్తామని చెబుతున్నారు. -
పాండు నరేటి మృతిపై మావోయిస్టు పార్టీ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న గడ్చిరోలికి చెందిన పాండు నరేటి మృతిపై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రొఫెసర్ సాయిబాబా కేసులో అరెస్టయిన ఐదుగురిలో పాండు నరేటి ఒకరని, ఈ నెల 26నే నాగ్‌పూర్ జైల్లో పాండు నరేటి మృతిచెందిన వార్తను బీజేపీ ప్రభుత్వం దాచిపెట్టిందని ఆరోపించింది. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ మంగళవారం ఈ మేరకు లేఖ విడుదల చేశారు. తప్పుడు కేసుకు, శిక్షకు వ్యతిరేకంగా మానవ హక్కుల సంఘాలు పోరాడుతున్నాయని, ఆరోగ్యం సరిగాలేని పాండు స్వైన్ ఫ్లూతో మరణించినట్టు అభయ్ తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులకు గానీ, ఆయన తరపు లాయర్‌కు తెలియజేయలేదని ఆరోపించారు. పాండును చికిత్స నిమిత్తం మెరుగైన ఆస్పత్రికి తీసుకెళ్లాలని జైలు అధికారులకు డాక్టర్లు సూచించినా పట్టించుకోలేదని మండిపడ్డారు. పాండు మరణం ప్రభుత్వ హత్య అని, ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని అభయ్ స్పష్టంచేశారు. ముంబయి జైల్లో ఉన్న మావోయిస్టు కిరణ్ క్యాన్సర్ చికిత్స పొందుతున్నారని, ఆయన భార్య నర్మద ఆరోగ్యం విషమించిందని తెలిసినా కనీసం చూసేందుకు ఆయన్ను తీసుకెళ్లలేదని ఆరోపించారు. తీరా ఆమె చనిపోయిన తర్వాత శవాన్ని చూపించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రొఫెసర్ సాయిబాబా ఆరోగ్యం కూడా క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. పౌరుల ప్రజాస్వామిక, మౌలిక హక్కులను ప్రభుత్వం హరిస్తోందని, ఈ చర్యలను యావత్ ప్రజానీకం ఖండించాలని పిలుపునిచ్చారు. ఐసీఎస్ పీడబ్ల్యూఐ పిలుపు మేరకు సెప్టెంబర్ 13నుంచి 19 వరకు జరగనున్న ఆక్షన్ వీక్‌లో ఈ విషయంపై ప్రశ్నించాలని అభయ్ కోరారు. చదవండి: వారిద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.. అయితేనేం వారి కనుసన్నల్లోనే.. -
మావోలకు గట్టి ఎదురుదెబ్బ
సాక్షి, పాడేరు: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతను పోలీసులు అరెస్టుచేశారు. అంతేకాక.. ఆ పార్టీలో పనిచేస్తున్న 60 మంది సభ్యులు, సానుభూతిపరులు మంగళవారం పాడేరులో విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎస్. హరికృష్ణ సమక్షంలో స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఒకేరోజు ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టు పార్టీ సభ్యులు, సానుభూతిపరులు లొంగిపోవడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బే. ఇంజరికి వస్తుండగా ప్రభాకర్ అరెస్టు మావోయిçస్టు పార్టీలో కీలకంగా ఉన్న పెదబయలు–కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి వంతాల రామకృష్ణ అలియాస్ ప్రభాకర్ అలియాస్ అశోక్ అలియాస్ గొడ్డలి రాయుడు కోండ్రుం నుంచి ఇంజరి గ్రామానికి వస్తున్న సమయంలో పెదబయలు పోలీసులు అరెస్టుచేసినట్లు డీఐజీ హరికృష్ణ మీడియాకు వెల్లడించారు. ఆదివాసీ పీటీజీ కోందు కులానికి చెందిన వంతాల రామకృష్ణ పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ కోండ్రుం గ్రామానికి చెందినవాడు. మావోయిస్టు పార్టీ నేత భూపతి ప్రోద్బలంతో 2003లో మావోయిస్టు మిలీషియా సభ్యుడిగా చేరాడు. అప్పటి నుంచి దళ సభ్యుడిగా, పార్టీ మెంబర్‌గా, ఏరియా కమిటీ కార్యదర్శిగా అంచెలంచెలుగా ఎదిగాడు. అరెస్టయిన రామకృష్ణ ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ పరిధిలోని మల్కన్‌గిరి, కోరాపుట్టు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహించేవాడు. ప్రజాకోర్టులు పెట్టి అమాయక గిరిజనులను హత్యలు చేసేవాడని, ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేసేవాడని డీఐజీ తెలిపారు. ఆయనపై ఏఓబీ వ్యాప్తంగా సుమారు 124 కేసులున్నాయన్నారు. 14 హత్యలు, 13 ఎదురుకాల్పుల ఘటనలు, నాలుగు మందుపాతరలు పేల్చిన సంఘటనలు.. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినందుకు మరో ఆరు కేసులు ఆయనపై ఉన్నాయన్నారు. దివంగత అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమతోపాటు పలువురు గిరిజనుల హత్య కేసుల్లో వంతాల రామకృష్ణ నిందితుడు. అలాగే, అనేక ఎదురుకాల్పుల ఘటనలతో పాటు మందుపాతర్ల పేల్చివేతలు, పొక్లెయిన్లను తగులబెట్టిన సంఘటనలు, పలు కిడ్నాప్ కేసుల్లోను రామకృష్ణ ప్రముఖ పాత్ర వహించాడని డీఐజీ తెలిపారు. ఇక అరెస్టు అయిన రామకృష్ణ పేరుపై ప్రభుత్వం రూ.ఐదు లక్షల రివార్డును కూడా ప్రకటించిందని ఆయన తెలిపారు. రామకృష్ణ నుంచి రూ.39 లక్షల నగదు, ఐదు కిలోల మైన్, ఐదు డిటోనేటర్లు, 90 మీటర్ల పొడవు గల కరెంట్ వైరు, ఆరు బ్యాటరీలు, 9ఎంఎం పిస్టల్, ఎనిమిది 9ఎంఎం రౌండ్లు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నామని.. ఆయన్ను రిమాండ్‌కు తరలిస్తున్నామని చెప్పారు. 60 మంది లొంగుబాటు మరోవైపు.. మావోయిస్టు పార్టీ పెదబయలు–కోరుకొండ ఏరియా కమిటీకి చెందిన 33 మంది మావోయిస్టులు, 27 మంది మిలీషియా సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 33 మందిపై రూ.లక్ష చొప్పున రివార్డు ఉంది. వీరిలో ఇంజరి పంచాయతీ కోండ్రుం గ్రామానికి చెందిన కొర్రా చిన్నయ్య అలియాస్ శ్రీకాంత్ 95 నేరాల్లో నిందితుడిగా ఉన్నట్లు డీఐజీ తెలిపారు. ఏఓబీ వ్యాప్తంగా మావోయిస్టు పార్టీకి ఆదరణ పూర్తిగా తగ్గిపోయిందని, గత ఏడాది 135 మంది మావోయిస్టులు, సానుభూతిపరులు లొంగిపోగా.. ప్రస్తుతం 60 మంది ఒకేరోజు జనజీవన స్రవంతిలోకి రావడం శుభపరిణామమని డీఐజీ హరికృష్ణ తెలిపారు. వీరందరిపై అనేక కేసులున్నాయన్నారు. రూ.లక్ష రివార్డు ఉన్న సభ్యులకు ఆ నగదును వారికే అందజేయడంతో పాటు లొంగిపోయిన వారందరికీ పునరావాసం కల్పిస్తామన్నారు. గిరిజనులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి మావోయిస్టుల కార్యకలాపాలను నిరోధించడమే లక్ష్యంగా పోలీసు కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిరంతరం చేపడతామని.. ఇందుకు ఒడిశా పోలీసు యంత్రాంగం కూడా అన్నివిధాల సహకరిస్తోందని హరికృష్ణ వివరించారు. గంజాయి నిర్మూలన కార్యక్రమాలు చేపడుతూ గిరిజనులకు ప్రత్యామ్నాయ పంటల సాగుతో జీవనోపాధి కార్యక్రమాలు అమలుచేస్తున్నామన్నారు. మారుమూల గ్రామాల్లో రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని.. నిరుద్యోగ యువతకు ప్రేరణ కార్యక్రమాలను అమలుచేస్తున్నామని డీఐజీ తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ సతీష్‌కుమార్, ఏఎస్పీ అడ్మిన్ తుసీన్ సిన్హా, సీఆర్పీఎఫ్ 284 బెటాలియన్ కమాండెంట్ ఆశీష్ విశ్వకర్మ, అసిస్టెంట్ కమాండెంట్ అరుణ్‌కుమార్, డీఎస్పీ వెంకట్రావు, పాడేరు సీఐ సుధాకర్ పాల్గొన్నారు. -
మావోయిస్టులతో లింకులపై... ఎన్ఐఏ సోదాలు
సాక్షి, హైదరాబాద్: నిషేధిత మావోయిస్టు పార్టీ భావజాలాన్ని వ్యాప్తిజేస్తూ యువత మావోయిస్టుల్లో చేరేలా ప్రోత్సహిస్తున్నారన్న అభియో గంపై చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) నాయకులు డొంగరి దేవేంద్ర, దుబాసి స్వప్న, చుక్కా శిల్పను జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఏ) గురువారం అరెస్టు చేసింది. వారిలో శిల్ప హైకోర్టు న్యాయవాది. ఏపీలోని విశాఖపట్నంలో 2017 డిసెంబర్లో అదృశ్యమైన రాధ అనే నర్సింగ్ విద్యార్థిని కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ బృం దాలు సికింద్రాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఉన్న నిందితుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేశాయి. దాదాపు 4 గంటలపాటు సోదాలు చేపట్టి కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నాయి. అనంతరం వారిని అరెస్టు చేశాయి. ఇదీ కేసు... పోలీసుల కథనం ప్రకారం కాప్రాలోని సాయిబాబా కాలనీకి చెందిన పల్లెపాటి పోచమ్మ చిన్న కుమార్తె రాధ నర్సింగ్ విద్యార్థిని. మావోయిస్టు పార్టీకి అనుబంధంగా పని చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) నాయకులు డొంగరి దేవేంద్ర, దుబాసి స్వప్న, చుక్క శిల్ప తదితరులు తరచూ రాధను కలిసేవారు. 2017 డిసెంబర్లో రాధను కలిసిన దేవేంద్ర... కొందరికి వైద్యం చేయాల్సి ఉందంటూ బలవంతంగా ఆమెను తీసుకుకెళ్లాడు. అప్పటి నుంచి రాధ తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఆమె కోసం పోచమ్మ అనేక ప్రాంతాల్లో గాలించి చివరకు తన కుమార్తె మావోయిస్టు పార్టీలో చేరిందని... విశాఖపట్నం జిల్లా పెద్దబయలు అటవీ ప్రాంతంలో అగ్రనేతలు ఉదయ్, అరుణలతో కలసి పనిచేస్తున్నట్లు తెలుసుకుంది. రాధ అదృశ్యంపై ఈ ఏడాది జనవరిలో విశాఖ జిల్లాలోని పెద్దబయలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదృశ్యమైన సమయంలో రాధ మైనర్ కావడంతో దీన్ని కిడ్నాప్ కేసుగా పోలీసులు నమోదు చేసుకున్నారు. బలహీన వర్గాల కేసులు వాదిస్తున్న శిల్ప... హైకోర్టు అడ్వొకేట్‌గా పని చేస్తున్న శిల్ప 6 నెలలుగా బోడుప్పల్‌లోని హేమానగర్లో భర్త కిరణ్, అత్త హేమతో కలసి అద్దెకు ఉంటోంది. పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన పలు కోర్టు కేసులను శిల్ప వాదిస్తోంది. కాగా, తన భార్యను ఎన్ఐఏ అక్రమంగా అరెస్టు చేసిందని శిల్ప భర్త కిరణ్ ఆరోపించారు. రంగంలోకి ఎన్ఐఏ... కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఈ కేసు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బదిలీ అయింది. దీంతో ఈ నెల 3న ఈ కేసును రీ–రిజిస్టర్ చేసిన ఎన్ఐఏ... సీఎంఎస్ నాయకులే కుట్రపూరితంగా రాధను మావోయిస్టు పార్టీలో చేర్చారని, అడవిలో ఆమెను నిర్బంధించి ఉంచారని ఆరోపించింది. మావోయిస్టు పార్టీ ఆంధ్రా–ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ ఉదయ్, అరుణ, దేవేంద్ర, స్వప్న, శిల్ప తదితరులను నిందితులుగా చేర్చింది. -
‘మానాల’ మళ్లీ పురుడు?
సాక్షి, హైదరాబాద్: సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఆ ప్రాంతంలో 16 మందిని పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో పీపుల్స్ వార్ ఊచకోత కోసింది. ఆ తర్వాత నాలుగేళ్లకు ఆ ప్రాంతానికి సమీపంలో 11 మంది పీపుల్స్ వార్ సభ్యులు పోలీస్ ఎన్కౌంటర్లో మృతిచెందారు. ఇప్పుడదే ప్రాంతంలో మానాలలో మళ్లీ పురుడుపోసుకునేందుకు నాటి పీపుల్స్‌వార్.. నేడు మావోయిస్టు పార్టీ.. తీవ్ర ప్రయత్నాలు చేస్తోందన్న వార్త సంచలనం రేపుతోంది. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల్లో కొత్త రక్తం కోసం ప్రయత్నాలు చేస్తున్న ముగ్గురు సానుభూతిపరులను పోలీసులు అరెస్ట్ చేయడం కలవరానికి గురిచేస్తోంది. అయితే ఒకవైపు ఈ రెండు జిల్లాల్లో మావోయిస్టు పార్టీ నియామకాలపై దృష్టి సారిస్తుంటే.. మరోవైపు జనశక్తి కూడా కార్యకలాపాలను విస్తృతంచేస్తోంది. బెదిరింపులు, వసూళ్లకు పాల్పడుతూ అటు వ్యాపారులను, ఇటు పోలీసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నలుగురు వెళ్లారు.. ఇద్దరు వచ్చారు.. నిజామాబాద్‌కు చెందిన ఇద్దరు, సిరిసిల్లకు చెందిన ఇద్దరు.. పట్టభద్రులు ఆరు నెలల క్రితం మావోయిస్టులో చేరేందుకు వెళ్లారు. ఇందులో ఇద్దరు వ్యక్తులు వాళ్ల వ్యక్తిగత కక్షలను తీర్చుకునేందుకే వెళ్లడంతో వారిని పార్టీ వెళ్లిపోవాలని సూచించగా తిరిగి వెనక్కు వచ్చినట్టు నిఘా వర్గాలు తెలిపాయి. మిగిలిన ఇద్దరు ఆ పార్టీ సిద్ధాంతాలతో ఇమడలేక ఇబ్బంది పడుతున్నారని, వారు కూడా త్వరలోనే తిరిగివస్తారని పేర్కొన్నాయి. ఈ నలుగురిని సానుభూతిపరులుగా మార్చడంలో క్రియాశీల పాత్ర పోషించింది మూడు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా పోలీసులు అరెస్టు చేసిన బుస జనార్ధన్, గంగాధర్, కమల్‌తో పాటు అండర్‌గ్రౌండ్‌లో ఉన్న మరో ఇద్దరు అని స్పష్టంచేశాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ఇస్రోజివాడకు చెందిన లోకేటీ చందర్ అలియాస్ స్వామి ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో దండకారుణ్య జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఇతడి సంప్రదింపులతో అరెస్టయిన ముగ్గురు తెలంగాణ మావోయిస్టు కమిటీలో కీలక సభ్యుడు ఆజాద్‌ను కలిసినట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఆజాద్ ఆదేశంతోనే ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న యువతను పార్టీలోకి తీసుకురావాలని ప్రయత్నించినట్టు వెల్లడించాయి. ఇలా ఉమ్మడి నిజామాబాద్, సిరిసిల్ల ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని నియామకాలు చేస్తున్నట్లు తెలిసింది. వసూళ్లలో జనశక్తి బిజీ... సిరిసిల్ల, వేములవాడ, కామారెడ్డి, జగిత్యాల.. ఈ ప్రాంతాల్లో నిషేధిత సంస్థ జనశక్తి ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది. సిరిసిల్లకు చెందిన కూర రాజన్న అగ్రనాయకత్వంగా పనిచేసిన ఈ సంస్థ మళ్లీ జవసత్వాల కోసం ఆరాటపడుతున్నట్లు తెలుస్తోంది. అండర్‌గ్రౌండ్‌లో ఉంటూ జనశక్తికి ఊపిరిపోయాలని భావిస్తున్న రాజన్న పాత అనుచరులతో మళ్లీ దందాలకు తెరలేపినట్లు పోలీసులు వెల్లడించారు. రెండు రోజుల క్రితం వేములవాడకు చెందిన వంగాల రాజమల్లయ్యని కొందరు హతమార్చేందుకు ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయారు. వీరిలో పోహునుక సురేష్ అలియాస్ మల్యాల సురేష్ అలియాస్ పీఎస్పీ రెడ్డి, చిట్టీ రాజేశ్వర్, నగురూరి రవీందర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జనశక్తి పేరు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారులను, భవన నిర్మాణ వ్యాపారులను, పెట్రోల్ బంక్ యజమానులను, చోటామోటా నేతలను.. బెదిరించి డబ్బులు వసూలు చేయడమే లక్ష్యంగా జనశక్తిని విస్తరించే ప్రయత్నం చేస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి వారందరికీ తుపాకులు అందిస్తోంది.. కార్యచరణ, కార్యాకలాపాల విస్తరణ ఐడియా మొత్తం రాజన్నదే అని పోలీసులు స్పష్టం చేశారు. -
హిడ్మా పోలీసులకు లొంగిపోలేదు
సాక్షి, అమరావతి: మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హిడ్మా పోలీసులకు లొంగిపోయినట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ ఖండించింది. కేంద్ర ప్రభుత్వంతోపాటు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు ఓ వ్యూహం ప్రకారం అసత్య ప్రచారం చేస్తున్నాయని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ గురువారం ఓ ప్రకటనలో విమర్శించారు. విప్లవోద్యమ ప్రాంతాలకు దూరంగా ఉండే మావోయిస్టు పార్టీ సానుభూతిపరులను తప్పుదోవ పట్టించేందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. పోలీసులు ఎవరో ఒకర్ని అరెస్టు చేసి తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారన్నారు. హిడ్మా దండకారణ్యంలో గెరిల్లా బేస్‌లో ప్రజల మధ్య ఉన్నారని ఆయన వెల్లడించారు. -
‘మావో’ళ్లు 4739 మంది మృతి!
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీకి ఆయువుపట్టు, ఆపరేషన్ కమాండ్ గ్రూప్ పీఎల్జీఏ(పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) ఏర్పాటై ఈ డిసెంబర్‌కు 20 ఏళ్లు. ఆ పార్టీ కేంద్ర కమిటీ ఒకప్పటి కార్యదర్శి ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి నేతృత్వంలో 2000లో ఏర్పాటు చేసిన పీఎల్జీఏను పీజీఏ (పీపుల్స్ గెరిల్లా ఆర్మీ) అని కూడా మావోయిస్టు పార్టీ పిలుస్తోంది. సెంట్రల్ మిలిటరీ కమీషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పీఎల్జీఏ ఏర్పా టై ఇరవై ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఆ పార్టీ కేంద్ర కమిటీ ఓ సావనీర్ విడుదల చేసింది. ఈ ఇరవై ఏళ్లలో పీఎల్జీఏ చేసిన ఆపరేషన్స్, మావోయిస్టులు, పోలీసులు ఎంతమంది చనిపోయారన్న పూర్తి వివరాలను అందులో పేర్కొంది. పీఎల్జీఏ రెండు దశాబ్దాల్లో సాగించిన ఆపరేషన్స్‌లో కేంద్రకమిటీ సభ్యులతోపాటు రాష్ట్ర కార్యదర్శులు, సభ్యు లు, డివిజన్ కమిటీ కార్యదర్శులు, మెంబర్లు, ఏరియా కమిటీ సభ్యులు, దళసభ్యులు మొత్తం 4,739 మందిని కోల్పోయినట్లు సావనీర్లో తెలిపింది. ఇందులో 909 మంది మహిళామావోయిస్టులుండగా, 16 మంది కేంద్రకమిటీ సభ్యులు, 44 మంది స్పెషల్ ఏరియా/స్పెషల్ జోన్/రాష్ట్ర కమిటీ సభ్యులు, 9 మంది రీజినల్ కమిటీ సభ్యులు, 168 మంది జోన్/డివిజన్/జిల్లా కమిటీ సభ్యులు మృతిచెందగా, మిగిలినవారిలో ఏరియా సభ్యులు, గ్రామదళ సభ్యులున్నట్టు పేర్కొంది. పీఎల్జీఏ ఆపరేషన్స్‌లో 3,054 పోలీసుల మృతి పీఎల్జీఏ 2000 నుంచి 2021 జూలై వరకు జరిపిన మిలటరీ ఆపరేషన్స్‌లో 3,054 మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని సాయుధ పోలీసు బలగాల సిబ్బంది, అధికారులు మృతి చెందినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. మరో 3,672 మంది పోలీస్ బలగాల సిబ్బంది క్షతగ్రాతులైనట్టు, 3,222 ఆయుధాలు, 1,55,356 తూటాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది. మొత్తం 4,572 ఆపరేషన్స్ నిర్వహించగా, వాటిల్లో భారీవి 210 కాగా, మధ్యస్థ 331, మైనర్ ఆపరేషన్స్ 4,031 ఉన్నట్టు వెల్లడించింది. సీఆర్పీఎఫ్ ఉపయోగించిన రక్షణ శాఖ హెలికాప్టర్లపై కూడా దాడులు నిర్వహించినట్టు తెలిపింది. 2008, 2010, 2011, 2012, 2013లో హెలికాప్టర్లపై తూటాల వర్షం కురిపించగా, కమాండర్ స్థాయి అధికారితోపాటు ముగ్గురు సిబ్బంది మరణించినట్టు పేర్కొంది. 2021 ఏప్రిల్ 19న సుక్మా–బీజాపూర్ అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ డ్రోన్ సహాయంతో బాంబుదాడులు చేసిందని, ప్రతిదాడి చేసి దానిని కూల్చివేసినట్టు తెలిపింది. ఇలా పలు డ్రోన్ దాడులను కూడా నిర్వీర్యం చేసినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. సింగిల్ యాక్షన్‌లో నేతల హతం సింగిల్ యాక్షన్‌లో భాగంగా 2007లో జార్ఖండ్ టాటానగర్ ఎంపీ సునీల్ మçహతోను, అతడి ముగ్గురు బాడీగార్డులు, ఇతరులను ఒకేసారి పీఎల్జీఏ హతమార్చినట్టు మావోయిస్టు పార్టీ తెలిపింది. సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మతోపాటు 13 మంది బాడీగార్డులను 2013 మే 25న నిర్మూలించినట్టు పార్టీ పేర్కొంది. ఏపీలో 2018, సెప్టెంబర్ 23న అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమాను హతమర్చినట్టు తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లో 2019 ఏప్రిల్ 9 దంతెవాడ ఎమ్మెల్యే భీమా మాండావితోపాటు అతడి నలుగురు బాడీగార్డులను బుల్లెట్ వాహనంతో సహా పేల్చివేసినట్టు తెలిపింది. -
‘పోరు’ ఎవరికోసం? మావోయిస్టులకు 25 ప్రశ్నలు ఎక్కుపెట్టిన ఆదివాసీలు
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా ఆదివాసీల సంఘాల పేరిట పలు గ్రామాల్లో ఆదివారం పెద్దఎత్తున కరపత్రాలు కనిపించాయి. మండల కేంద్రంతోపాటు ఆర్.కొత్తగూడెం, కుదునూరు, కలివేరు గ్రామాల్లో వెలసిన ఈ కరపత్రాలలో ఆదివాసీ సం ఘాలు 25 ప్రశ్నలను సంధించాయి. ‘మావోయిస్టులు ఉన్నది పేదలమైన ఆదివాసీల బతుకులు మార్చడం కోసమే అయితే, మీవల్ల మా బతుకులు ఏం మారాయి? రోడ్లు లేక వైద్యం చేయించుకునేందుకు ఆసుపత్రులకు వెళ్లలేక ఇంకా ఎంతమంది చనిపోవాలి? కరెంట్ లేక ఇంకెంతకాలం చీకటిలో మగ్గాలి? మా ఊళ్లకు రోడ్లు ఎందుకు వేయనియ్యరు? జల్ జంగిల్ జమీన్ మీ కోసమా.. మా కోసమా? అడవుల్లో బాంబులు పెడుతూ మమ్మల్ని తిరగనివ్వకుండా ఎందుకు చేస్తున్నారు? మీరు పెట్టే మీటింగులకు మమ్ముల్ని భయపెట్టి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమిటి? మీకు, మీ పార్టీకి ఇలా భయపడుతూ ఎంతకాలం బతకాలి? అంటూ కరపత్రాల్లో పలు ప్రశ్నలను సంధించాయి. (చదవండి: 51 కేసులు, నేరాలు చేయడంలో దిట్ట.. ఏడేళ్లుగా అజ్ఞాతంలో.. చివరికి..) -
మావోయిస్టుల ఫోన్లలో స్పైవేర్!
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులపై పోలీసులు గూఢచర్య ఆపరేషన్లు చేస్తున్నారని.. ఫోన్లలో స్పైవేర్ చొప్పించి లొకేషన్, ఫొటోలు సేకరిస్తున్నారని మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ పత్రికలో ఆరోపించింది. ఆ వివరాల ఆధారంగానే భారీగా ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారని పేర్కొంది. అంతేగాకుండా ఇన్ఫార్మర్లు, కొరియర్లను లోబర్చుకుని.. వారి ద్వారా మావోయిస్టులపై విష ప్రయోగాలు చేస్తున్నారని ఆరోపించింది. మావోయిస్టు పార్టీ ప్రతి ఆరు నెలలకోసారి అధికార పత్రికను విడుదల చేస్తుంది. అందులో భాగంగా తాజా పత్రికలో పలు సంచలన ఆరోపణలు చేసింది. హ్యాకర్లతో స్పైవేర్.. పోలీసులు హ్యాకర్ల సాయంతో తమ ఫోన్లలో రహస్యంగా నిఘా యాప్స్ (స్పైవేర్)ను ఇన్స్టాల్ చేస్తున్నారని మావోయిస్టు పార్టీ పేర్కొంది. లొకేషన్, ఫోటోలు, వీడియోలను సంగ్రహించి.. కూంబింగ్ బృందాలకు పంపి ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారని ఆరోపించింది. పార్టీ ఇన్ఫార్మర్లు, కొరియర్ల ఫోన్లలోనూ స్పైవేర్‌తో నిఘా పెట్టినట్టు తెలిపింది. కొరియర్లను భయపెట్టి.. మావోయిస్టు పార్టీకి కొరియర్లుగా పనిచేస్తున్న వారిని పోలీసులు రహస్యంగా అరెస్ట్ చేసి బెదిరిస్తున్నారని.. వారు ప్రాణభయంతో కోవర్టులుగా మారిపోతున్నారని మావోయిస్టు పార్టీ పేర్కొంది. కొరియర్లు మావోయిస్టుల కోసం తెచ్చే పళ్లు, డ్రైప్రూట్స్, మందులు, ఇతర ఆహార పదార్థాల్లో పోలీసులు విషం కలుపుతున్నారని ఆరోపించింది. దీనివల్ల మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారని, కొందరు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని తెలిపింది. గత ఏడాది అక్టోబర్‌లో వాజేడు– వెంకటాపురం దళంపై ఇలాంటి విష ప్రయోగమే జరిగిందని, దళంలోని కీలక నేతలు తీవ్ర అనారోగ్యానికి లోనయ్యారని వెల్లడించింది. పక్కా ప్రణాళికలతో దాడులు మావోయిస్టులను నిర్మూలించే ఉద్దేశంతో కేంద్ర హోంశాఖ పలు రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి సమాధాన్–2022ను చేపట్టిందని మావోయిస్టు పార్టీ పత్రికలో తెలిపింది. ఇందులో భాగంగా నిర్దిష్టమైన ప్రణాళికతో పదిరకాల ఎత్తుగడలకు శ్రీకారం చుట్టిందని వెల్లడించింది. ఆ వ్యూహాలను మొదట తెలంగాణ నుంచే అమల్లోకి తెచ్చారని. ఈ క్రమంలోనే గత ఏడాది అక్టోబర్ 4న ములుగులో ఛత్తీస్గడ్, తెలంగాణ డీజీపీలతోపాటు కేంద్ర హోంశాఖ సలహాదారు విజయ్‌కుమార్, సీఆర్పీఎఫ్ డీజీ, ఆ జోన్ ఐజీల, ఇతర కీలక అధికారులు సమావేశమయ్యారని పేర్కొంది. ప్రధానంగా గెరిల్లా బేస్‌గా ఉన్న దండ కారణ్యాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో.. దానికి ఆనుకుని ఉన్న మావోయిస్టు మద్దతు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారని తెలిపింది. అందులో భాగంగానే తెలంగాణ–ఛత్తీస్గడ్ సరిహద్దు గ్రామమైన భట్టిగూడెం వద్ద 5వేలమంది కోబ్రా, డీఆర్జీ, గ్రేహౌండ్స్ బలగాలతో దాడికి పాల్పడ్డారని.. కానీ తెలంగాణ కమిటీ తప్పించుకోగలిగిందని వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెన్నాపురం అడవుల్లో కూంబింగ్ చేస్తున్న ఓ గ్రేహౌండ్స్ టీమ్‌ను చూసిన మరో గ్రేహౌండ్స్ గ్రూప్.. మావోయిస్టులు అనుకుని కాల్పులు జరిపిందని గుర్తుచేసింది. ఆ ఘటనలో ఓ ఎస్సై మృతిచెందాడని, మరో హెడ్ కానిస్టేబుల్ దాడి భయంతో గుండెపోటుతో చనిపోయాడని పేర్కొంది. మావోయిస్టుల కోసమే ఆ ఓఎస్డీలు! గతంలో మావోయిస్టులపై దాడుల్లో కీలకంగా వ్యవహరించిన రిటైర్డ్ అధికారులను కీలక విభాగాల్లో ఓఎస్డీలుగా నియమిస్తున్నారని మావోయిస్టు పార్టీ పేర్కొంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ కార్యాలయాల ఏర్పాటు, అధికారుల నియామకాలను వేగవంతం చేశారని.. అందులో సాంకేతిక నైపుణ్యం ఉన్నవారే ఎక్కువగా ఉన్నారని తమ పత్రికలో వెల్లడించింది. మావోయిస్టు పార్టీని పూర్తిగా నియంత్రించాలనే లక్ష్యంతోనే.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలంటూ పోలీస్ శాఖలో వేలాది మందిని నియమిస్తున్నట్టు ఆరోపించింది. -
హిడ్మా ఎక్కడ? ఏదైనా వ్యూహం ఉందా?
సాక్షి, అమరావతి/ఏటూరునాగారం: మావోయిస్టు పార్టీలో మరో అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ–1 కమాండర్ హిడ్మా దండకారణ్యం దాటి బయటకు వచ్చారన్న సమాచారంతో మూడు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన అనారోగ్యానికి గురై వైద్యం కోసం వచ్చారని భావిస్తున్నా.. దీని వెనుక మరేదైన వ్యూహం ఉందా అన్న కోణంలోనూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా పోలీసులు ఆరా తీస్తున్నారు. కరోనా సోకడంతో ఆయన చికిత్స కోసం తెలంగాణలోని ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతాల్లోకి వచ్చినట్లు ప్రాథమిక సమాచారం. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వెంకటాపురం, వాజేడు అడవుల్లోకి వచ్చి చికిత్స పొందుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఏజెన్సీలోని పోలీసులు ఏటూరునాగారం ఏఎస్పీ గౌస్ ఆలం నేతృత్వంలో అడవులబాట పట్టారు. హిడ్మా ఏజెన్సీలోని అడవుల్లో, గొత్తికోయగూడేల్లో తలదాచుకొని చికిత్స పొందుతున్నారనే కోణంలో ఆయా ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. స్పెషల్ పార్టీ పోలీసులతోపాటు గ్రేహౌండ్స్ బలగాలు అడుగడుగునా తనిఖీలు చేస్తున్నాయి. హిడ్మా ఆచూకీ కోసం జాగిలాలు, డ్రోన్ కెమెరాలను రంగంలోకి దింపాయి. ఈ ఏడాదిన్నరలో కరోనా, తదనంతర అనారోగ్య సమస్యలతో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు హరిభూషణ్, పూర్ణేందు ముఖర్జీలతోపాటు ఇటీవల ఆర్కే మృతిచెందారు. ఇప్పుడు హిడ్మా అనారోగ్య సమస్య మావోయిస్టు పార్టీని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఏదైనా వ్యూహం ఉందా? దండకారణ్య ప్రాంతంలో ఆరు నెలలుగా హిడ్మా కదలికలపై ఎలాంటి సమాచారం లేదు. ఆపరేషన్ సమాధాన్లో భాగంగా దండకారణ్య ప్రాంతాన్ని చుట్టుముట్టిన పోలీసు బలగాల దృష్టి మళ్లించేందుకు హిడ్మా బయటకు వచ్చారా.. ఎక్కడైనా మెరుపుదాడి చేసి ఉనికి చాటుకోవాలని భావిస్తున్నారా.. ఆర్కే మృతి తరువాత ఏవోబీలో మావోయిస్టు పార్టీని మళ్లీ బలోపేతం చేసే సన్నాహాల్లో భాగంగా వచ్చారా.. ఇలా పలు కోణాల్లో పోలీసులు విశ్లేషిస్తున్నారు. -
ఏజెన్సీలో హిడ్మాకు కరోనా చికిత్స?
ఏటూరునాగారం: ఛత్తీస్‌గఢ్ లోని అటవీ ప్రాంతాల్లో తలదాచుకుంటున్న మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ–1 కమాండర్ హిడ్మాకు కరోనా సోకడంతో చికిత్స కోసం ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతాల్లోకి వచ్చినట్లు సమాచారం. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వెంకటాపురం, వాజేడు అడవుల్లో చికిత్స పొందుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఏజెన్సీలోని పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఏటూరునాగారం ఏఎస్పీ గౌస్ ఆలం నేతృత్వంలో పోలీసులు అడవులబాట పట్టారు. హిడ్మా ఏజెన్సీలోని అడవుల్లో, గొత్తికోయగూడేల్లో తలదాచుకొని చికి త్స పొందుతున్నారనే కోణంలో ఆయా ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. స్పెషల్ పార్టీ పోలీసులతోపాటు గ్రేహౌండ్స్ బలగాలు అడుగడుగునా తనిఖీలు చేస్తున్నాయి. హిడ్మా ఆచూకీ కోసం జాగిలాలు, డ్రోన్ కెమెరాలను రంగంలోకి దింపాయి. ఇటీవల అగ్రనేత ఆర్కేను కోల్పోయిన మావోయిస్టు పార్టీకి ఇప్పుడు హిడ్మా అనారోగ్య సమస్య మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఛత్తీస్‌గఢ్ అడవుల్లో చికిత్స అందకనే తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతాలకు వచ్చి ఉంటాడని నిఘా వర్గాలు తెలిపాయి. పోలీసులు తనిఖీలు ముమ్మరం చేయడం తో ఏజెన్సీ అంతా హైఅలర్ట్‌గా మారింది. -
ఆర్కేను రక్షించుకోలేకపోయాం: కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి
సాక్షి, అమరావతి/టంగుటూరు/చర్ల (ఖమ్మం)/కొరాపుట్ (ఒడిశా): సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ (63) అలియాస్ రామకృష్ణ, ఆర్కే, సాకేత్, మధు, శ్రీనివాస్‌కు వైద్యం అందించినప్పటికీ రక్షించుకోలేకపోయామని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ స్పష్టం చేశారు. ఆర్కే మరణాన్ని ధృవీకరిస్తూ శుక్రవారం ఓ ప్రకటన, అంత్యక్రియలకు సంబంధించిన ఫొటోలను శనివారం విడుదల చేశారు. ఆర్కేకు అకస్మాత్తుగా కిడ్నీల సమస్య మొదలుకాగా, వెంటనే డయాలసిస్ ప్రారంభించినప్పటికీ.. కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తాయని, పర్యవసానంగా ఈ నెల 14న ఉదయం 6 గంటలకు అమరుడయ్యారని అభయ్ పేర్కొన్నారు. ఆర్కేకు విప్లవ శ్రేణుల మధ్య అంత్యక్రియలు నిర్వహించామని, ఆయన మృతి పార్టీకి తీరనిలోటని చెప్పారు. సాధారణ జీవితం, అకుంఠిత దీక్ష, ప్రజల పట్ల ప్రేమ, కామ్రెడ్స్‌తో ఆప్యాయతలు, విప్లవ గమనంపై స్పష్టతతో విప్లవోద్యమానికి నిస్వార్థంగా సేవలు అందించారని కొనియాడారు. ఆర్కే ఆశయాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అంత్యక్రియలకు భారీగా హాజరైన ఆదివాసీలు ► ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడు – కొండపల్లి మధ్య అటవీ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ శ్రేణుల సమక్షంలో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించారు. ► ఈ సందర్బంగా ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండాను ఉంచి మావోయిస్టులు నివాళులు అర్పించారు. ఆర్కే అంత్యక్రియల్లో బీజాపూర్, సుకుమా జిల్లాల్లోని పాలగూడ, గుండ్రాయి, కంచాల, మీనగట్ట, దామారం, జబ్బగట్ట తదితర గ్రామాల నుంచి సుమారు 2 వేల మందికిపైగా ఆదివాసీలతో పాటు పెద్ద ఎత్తున మావోయిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. భారీ ర్యాలీ నిర్వహించినట్లు సమాచారం. ఆలకూరపాడులో ఆర్కే చిత్రపటానికి నివాళులర్పిస్తున్న భార్య శిరీష, కుటుంబ సభ్యులు లొంగిపోయుంటే బతికుండేవారు ఆర్కే మృతి విషయాన్ని ఒడిశాలోని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ పిళ్లై ఓ వీడియో ద్వారా వెల్లడించారు. పోలీసులకు లొంగిపోయుంటే ఆర్కేకు నాణ్యమైన వైద్యం అందేదని, బతికేవాడన్నారు. సకాలంలో వైద్యం అందకపోవడంతో గతంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు రామన్న, హరి భూషణలతో పాటు దండకారణ్యం జోనల్ స్పెషల్ కమిటీ సభ్యులు శోభరాజ్, గంగా, వినోద్‌లు సైతం ప్రాణాలు విడిచారని ఐజీ గుర్తు చేశారు. ఆర్కేకు ఘన నివాళి ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఆర్కే భార్య శిరీష, కుటుంబ సభ్యులు, అమరుల బంధుమిత్రుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఆర్కే చిత్రపటానికి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ‘ఆర్కే అమర్ రహే.. అమరవీరులకు జోహార్లు’ అంటూ నినాదాలు చేశారు. ఉద్యమ గీతాలు ఆలపించారు. ‘నా భర్తతో పాటు కుమారుడు వీరత్వం పొందాడని గర్వంగా భావిస్తున్నాను. ఆర్కే మృతితో ఉద్యమం ఆగిపోదు. ఆయనలాంటి గెరిల్లా యుద్ధ వీరులు ఇంకా పుట్టుకొస్తారు’ అని శిరీష అన్నారు. ‘ప్రజల కోసం జీవిస్తాం.. ప్రజల కోసమే మరణిస్తాం’ అన్న మాటను ఆర్కే నిలబెట్టుకున్నాడని అమరవీరుల బంధుమిత్రుల సంఘం స్టేట్ సెక్రటరీ భవాని పేర్కొన్నారు. ‘ఆర్కే ప్రజల మనిషి. ప్రజల హృదయాల్లో ఉంటాడు. ఆయన ప్రజల కోసమే అమరుడయ్యారు’ అని విరసం నేత కళ్యాణరావు పేర్కొన్నారు. కాగా, శుక్రవారం ఆర్కే మరణ వార్తను ధ్రువీకరించుకుని శిరీష, బంధుమిత్రులు విలపించారు. శిరీషను విరసం అధ్యక్షుడు అరసవెల్లి కృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పినాకపాణి, సహాయ కార్యదర్శి రివేరా, అమరుల బంధు మిత్రుల సంఘం సభ్యురాలు శోభా తదితరులు పరామర్శించారు. -
ఆర్కే అంత్యక్రియలు.. ఫొటోలు విడుదల చేసిన మావోయిస్టు పార్టీ
సాక్షి, అమరావతి: మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే అంత్యక్రియలు ముగిశాయి. మావోయిస్టు లాంఛనాలతో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించినట్టు మావోయిస్టు పార్టీ తెలిపింది. ఈ సందర్భంగా ఆర్కే అంత్యక్రియల ఫొటోలు విడుదల చేసింది. తెలంగాణ సరిహద్దులో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించినట్టు తెలిపింది. పామేడు-కొండపల్లి సరిహద్దులో నిర్వహించిన ఈ అంత్యక్రియలకు మావోయిస్టులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా ఉంచి నివాళులర్పించారు. గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు పూర్తిచేసినట్టు తెలిసింది. -
ఆర్కే మృతిని ధ్రువీకరించిన మావోయిస్టులు
సాక్షి, అమరావతి: మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ సాకేత్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే మృతిని మావోయిస్టులు ధ్రువీకరించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 14న ఆర్కే మృతి చెందినట్లు మావోయిస్టులు ప్రకటించారు. కిడ్నీలు విఫలమై ఆయన మరణిచారని తెలిపారు. పార్టీ శ్రేణుల సమక్షంలో ఆర్కే అంత్యక్రియలు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. చికిత్స అందించినా ఆర్కేను కాపాడలేకపోయామని తెలిపారు. గురువారం ఆర్కే మృతి చెందారని మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ వెల్లడించారు. డయాలసిస్ కొనసాగుతుండగా కిడ్నీలు విఫలమై ఆర్కే మరణించారని తెలిపారు. చదవండి: ఆర్కే కన్నుమూత ఆర్కే తండ్రి, ఎన్టీఆర్ మంచి స్నేహితులు Akkiraju Rama Krishna: నాన్న బాటలోనే మున్నా -
‘ఆర్కే మృతిపై మావోయస్టుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదు’
సాక్షి, ప్రకాశం: మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ సాకేత్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే మృతి చెందిన విషయం పార్టీ ప్రకటించిన తర్వాతే నిజమని భావిస్తామని ఆయన భార్య శిరీష తెలిపారు. ఆర్కే మృతిపై ఆయన భార్య శిరీష శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆర్కే మృతి చెందినట్టుగా మీడియాలో వచ్చే వార్తలే చూస్తున్నామని అన్నారు. ఆయన మృతి చెందారని ఛత్తీస్‌గఢ్ డీజీపీ ప్రకటించారని, కానీ ఆయనకు ఎవరు సమాచారం ఇచ్చారో చెప్పలేదని తెలిపారు. ఆర్కే 40 ఏళ్లు జీవితాన్ని ప్రజలకోసం ధారపోశారని తెలిపారు. ప్రజా ఉద్యమంలో ఆర్కే ఒక యోధుడు, నిస్వార్థ విప్లవకారుడు అని తెలిపారు. ఉద్యమంలో బిడ్డను కూడా పోగొట్టుకున్నారని, ఒకవేళ ఆర్కే మృతి నిజమైతే పార్ధీవదేహం తాము తెచ్చుకునేలా అక్కడి ప్రభుత్వం, గ్రామ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్కే భార్య శిరీష ప్రస్తుతం అలకూరపాడులో నివాసం ఉంటున్నారు. -
ఆర్కే కన్నుమూత
సాక్షి, అమరావతి: మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ సాకేత్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే (66) మృతిచెందారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని దక్షిణ బస్తర్ అటవీప్రాంతంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆయన బుధవారం మృతిచెందినట్టు ఛత్తీస్‌గఢ్ పోలీసులకు గురువారం తెలిసింది. ఆర్కే మృతిచెందినట్టు తమకు సమాచారం అందిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ పోలీసు ఉన్నతాధికారి ‘సాక్షి’తో చెప్పారు. ఆర్కే మృతిపై తమకు సమాచారం లేదని ఆయన కుటుంబసభ్యులు చెబుతున్నారు. దేశంలోనే మావోయిస్టు కీలక అగ్రనేతల్లో ఒకరుగా ఉన్న గుర్తింపు పొందిన ఆర్కే దీర్ఘకాలంగా మధుమేహం, కీళ్ల నొప్పులు, స్పాండిలైటిస్, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. అయినప్పటికీ బీజాపూర్ జిల్లా అటవీప్రాంతంలో ఉంటూ స్థానికంగా వైద్యం చేయించుకున్నారుగానీ బయటకు వచ్చేందుకు సుముఖత చూపలేదు. మూడురోజుల కిందట పరిస్థితి విషమించిన ఆయన మూత్రం కూడా బంద్ అవడంతో బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. బీజాపూర్ అటవీప్రాంతంలోనే గురువారం అంత్యక్రియలు కూడా నిర్వహించినట్టు పోలీసువర్గాలు తెలిపాయి. ఆర్కే స్వస్థలం గుంటూరు జిల్లా రెంటచింతల మండలంలోని తుమృకోట. ఆయనకు భార్య కందుల నిర్మల అలియాస్ శిరీష అలియాస్ పద్మ ఉన్నారు. ఆయన కుమారుడు శివాజి అలియాస్ పృథ్వి అలియాస్ మున్నా 2016లో రామగూడ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందాడు. మావోయిస్టు ఉద్యమంలో నాలుగు దశాబ్దాల పాటు కీలకనేతగా ఉన్న ఆర్కేపై దేశవ్యాప్తంగా 200కిపైగా కేసులున్నాయి. 2003లో అలిపిరిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై క్లెమోర్‌మైన్స్‌తో దాడి కేసు కూడా ఆయనపై ఉంది. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంతో చర్చలు జరిపిన మావోయిస్టు ప్రతినిధి బృందానికి ఆయన నేతృత్వం వహించారు. గతంలో ఎన్నోసార్లు పోలీసు కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్నారు. కొన్నేళ్లుగా బలహీనపడిన మావోయిస్టు పార్టీకి ఆర్కే మృతి తీవ్రనష్టమని పరిశీలకులు చెబుతున్నారు. నల్లమల, ఏవోబీ కార్యక్షేత్రాలు గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమృకోటకు చెందిన ఆర్కే 1975లో అప్పటి పీపుల్స్‌వార్ ఉద్యమంవైపు ఆకర్షితులయ్యారు. 1977 నుంచి పీపుల్స్‌వార్ పార్టీలో అత్యంత క్రియాశీలంగా వ్యవహరించారు. నాలుగు దశాబ్దాల ఉద్యమ జీవితంలో ఆర్కే ప్రధానంగా నల్లమల, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లను కేంద్రస్థానాలుగా చేసుకుని పీపుల్స్‌వార్/మావోయిస్టు పార్టీని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఆర్కే 1977లో పీపుల్స్‌వార్ పార్టీలో నల్లమల దళం ఏర్పాటు చేసి 1982 వరకు ఉద్యమాన్ని బలోపేతం చేశారు. గుంటూరు జిల్లాలోని వెల్దుర్తి నుంచి నాగార్జునసాగర్ వరకు నల్లమల దళాన్ని విస్తరించారు. స్థానికుల మద్దతు కూడగట్టి నాగార్జున బ్యాక్‌వాటర్ గుండా రాకపోకలు సాగిస్తూ చాపకింద నీరులా ఉద్యమాన్ని బలోపేతం చేశారు. 1984 నుంచి కొన్నేళ్లు నల్లమల దళం కార్యకలాపాలు తగ్గి, నక్సలైట్ ఉద్యమం నెమ్మదించింది. మళ్లీ 1990 నుంచి నల్లమలలో నక్సలైట్ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. 1999–2000లో ఆర్కేను పీపుల్స్‌వార్ పార్టీ దండకారణ్యం పంపించింది. ఏవోబీ కార్యదర్శిగా ఆర్కే భారీగా రిక్రూట్మెంట్లు చేసి 2003 నాటికి దాదాపు 500 మందితో ఏవోబీ దళాన్ని పటిష్టం చేశారు. పీపుల్స్‌వార్, మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా (ఎంసీసీఐ) పార్టీలు విలీనమై 2004లో మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించడంలో ఆర్కే కీలకపాత్ర పోషించారు. అనంతరం కూడా ఆయన ఆంధ్ర–ఒడిశా–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టు పార్టీని బలోపేతం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ఏవోబీ కార్యదర్శిగా, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. మావోయిస్టు కేంద్ర కమిటీని కూడా శాసించేస్థాయికి ఎదిగారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా గణపతి ఉన్నప్పటికీ ఆర్కేదే పైచేయిగా ఉండేదని చెబుతారు. ఒకానొక సమయంలో ఆర్కేను మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి అవుతారని భావించారు. అనారోగ్య కారణాలతో ఆయన అందుకు సుముఖత చూపలేదని చెబుతారు. 2009 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు పార్టీ బాగా బలహీనపడటంతో ఆర్కే ప్రధానంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ మావోయిస్టు పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు పార్టీ వ్యవహారాల నుంచి 2020లో పూర్తిగా దూరం జరిగిన ఆయన ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకే పరిమితమయ్యారు. రూ.కోటిన్నరకుపైగా రివార్డు పార్టీని బలోపేతం చేసేందుకు కొత్త రిక్రూట్మెంట్లు, మిలటరీ ఆపరేషన్లలో ఆర్కే ఆరితేరారు. చుండూరు మారణహోమానికి ప్రతీకారంగా దగ్గుబాటి చెంచురామయ్యను పీపుల్స్‌వార్ నక్సలైట్లు హత్యచేసిన దాడికి నేతృత్వం వహించారు. 2003లో తిరుపతిలోని అలిపిరిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై క్లెమెర్మైన్స్తో దాడి వెనుక మాస్టర్ బ్రెయిన్ ఆర్కేనే. ఆ కేసులో ప్రధాన నిందితుల్లో ఆయన ఒకరు. 2003 ఏప్రిల్ 2న జరిగిన అప్పటి పెద్దారవీడు ఎస్ఐ, ఏఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్ల కిడ్నాప్‌లో ఆర్కే ప్రమేయం ఉందని చెబుతారు. 2005లో ప్రకాశం జిల్లా ఎస్పీ మహేశ్‌చంద్ర లడ్హాపై హత్యాయత్నం, 2008లో ఒడిశాలోని బలిమెల రిజర్వాయర్‌లో గ్రేహౌండ్స్ దళాలపై కొండలపై నుంచి కాల్పులు జరిపి 37 మందిని బలిగొన్న కేసులో నిందితుడు. 2011లో ఒడిశాలోని మల్కనగిరి కలెక్టర్ వినీల్‌కృష్ణ కిడ్నాప్ వెనుక ఉన్నదీ ఆర్కేనే. ఇలా దాదాపు 200కిపైగా కేసుల్లో నిందితుడైన ఆర్కేపై పలు రాష్ట్రాల్లో రివార్డులున్నాయి. మహారాష్ట్రలో రూ.50 లక్షలు, ఛత్తీస్‌గఢ్‌లో రూ.40 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.25 లక్షలు, ఒడిశాలో రూ.20 లక్షలు, జార్ఖండ్‌లో రూ.12 లక్షల వంతున.. ఇతరత్రా మొత్తంగా రూ.1.52 కోట్ల రివార్డు ఉంది. నల్లమల నుంచి బయటకు వచ్చి ప్రభుత్వంతో చర్చలు 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని నిర్ణయించింది. అప్పుడు ప్రభుత్వంతో చర్చలు జరిపిన మావోయిస్టుల ప్రతినిధి బృందానికి ఆర్కే నేతృత్వం వహించారు. దీంతో ఆయన దేశవ్యాప్తంగా ఒక్కసారిగా గుర్తింపు పొందారు. పీపుల్స్‌వార్ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన నల్లమల ప్రాంతం నుంచే ఆర్కే నేతృత్వంలో మావోయిస్టులు బయటకు వచ్చారు. 2004 సెప్టెంబర్ 14న దోర్నాల మండలం చిన్నారుట్ల నుంచి బయటకు వచ్చారు. అనంతరం గురజాల నియోజకవర్గంలోని గుత్తికొండ బిలం వద్ద బహిరంగసభ నిర్వహించారు. తరువాత హైదరాబాద్ వెళ్లి ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఎన్నోసార్లు.. ప్రాణాలతో బయటపడిన ఆర్కే నాలుగు దశాబ్దాల మావోయిస్టు ఉద్యమంలో ఆర్కే ఎన్నోసార్లు ఎన్కౌంటర్ల నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆర్కే చుట్టూ బలమైన అంగరక్షక వ్యవస్థ ఉండేది. 1991లో నల్లమలలో ఎన్కౌంటర్ నుంచి 2016లో రామగూడ ఎన్కౌంటర్ వరకు ఆయన దాదాపు 20 ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్నారు. నల్లమల, లందుల, దొరగూడ, దల్దాలి, టక్కరపడ, బెజ్జంగి, బడ్జేడు, రామగూడ తదితర ఎన్కౌంటర్ల నుంచి ఆయన బయటపడ్డారు. 2006 జూలై 23న యర్రగొండపాలెం మండలం చుక్కలకొండ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అప్పటి రాష్ట్ర కార్యదర్శి మాధవ్, మరో ఏడుగురు చనిపోగా ఆర్కే తప్పించుకున్నారు. ప్రకాశం జిల్లాలో పాలుట్ల అటవీ ప్రాంతం దగ్గర, పెద్దదోర్నాల మండలంలోని చిన్నారుట్ల అటవీ ప్రాంతం దగ్గర జరిగిన ఎదురు కాల్పుల్లో కూడా తప్పించుకున్నారు. 2008లో నల్లమలలో పోలీసు బలగాలు ఆయన్ని దాదాపు చుట్టుముట్టాయి. కనుచూపుమేరలో ఉన్న ఆర్కే ఇక దొరికిపోవడమో.. ఎన్కౌంటరో.. అనే సమాచారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా గుప్పుమంది. కానీ చివరి నిమిషంలో ఆశ్చర్యకరంగా ఆయన తప్పించుకున్నారు. అప్పటినుంచి కొన్ని పదులసార్లు ఎన్కౌంటర్లో ఆర్కే చనిపోయారని వార్తలు గుప్పుమనడం, తరువాత అది అవాస్తవమని తేలడం పరిపాటిగా మారిపోయింది. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం నరాజముల తండా వద్ద 2010 మార్చి 12న జరిగిన ఎన్కౌంటర్ నుంచి ఆర్కే తప్పించుకోగా రాష్ట్ర కమిటీ సభ్యుడు శాఖమూరి అప్పారావు ప్రాణాలు కోల్పోయాడు. 2016లో రామగూడ ఎన్కౌంటర్లో బుల్లెట్ గాయాలైన ఆర్కేని అంగరక్షకులు సురక్షితంగా తప్పించారు. ఆర్కే ఏకైక లక్ష్యంగా ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ పోలీసులు లెక్కకుమించి ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించారు. కానీ అవేవీ ఫలించలేదు. పలుమార్లు ఎన్కౌంటర్లలో ఆయన అంగరక్షకులు మృతిచెందారు. ఆయన మాత్రం దొరకలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్కేతో సంప్రదింపులు జరిపి ఆయన లొంగిపోయేలా చేసేందుకు నాలుగు రాష్ట్రాల పోలీసులు ప్రయత్నించారు. ప్రధానంగా గత ఏడాది కరోనా వ్యాప్తి తదనంతర పరిస్థితుల్లో ఈ దిశగా ప్రయత్నాలు వేగవంతం చేశారు. ఆయన లొంగిపోతే మెరుగైన వైద్యం అందిస్తామని కూడా చెప్పారు. కానీ లొంగిపోయేందుకు ఆర్కే సమ్మతించ లేదు. ఎన్కౌంటర్లో కుమారుడు మృతి ఆర్కే ఒకే ఒక కుమారుడు పృథ్వి అలియాస్ మున్నా పోలీసుల ఎన్కౌంటర్లో మృతిచెందారు. 2004లో ప్రభుత్వంతో చర్చల తరువాత ఆర్కే కుమారుడు పృథ్వి అలియాస్ మున్నా కూడా మావోయిస్టు ఉద్యమంలో చేరారు. ఆయన 2016లో రామగూడ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందారు. ఆ ఎన్కౌంటర్ సమయంలో ఆయన తన తండ్రి ఆర్కే అంగరక్షక దళ సభ్యుడిగా ఉన్నారు. ఆ ఎన్కౌంటర్లో బుల్లెట్ గాయమైన ఆర్కే తప్పించుకోగా.. మున్నా ప్రాణాలు కోల్పోయారు. -
మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి?
రాయ్‌పూర్: మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్.కె అనారోగ్యంతో మృతి చెందినట్టు వార్తలు వెలువడుతున్నాయి. అక్కి రాజు రామకృష్ణ అలియాస్ ఆర్కే అనారోగ్య కారణాలతో బీజాపూర్ అడవుల్లో మృతిచెందినట్టుగా ఛత్తీస్‌గఢ్ పోలీసులు చెప్తున్నారు. గత మూడేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆర్కే తుదిశ్వాస విడవడంతో మావోయిస్టు పార్టీ పెద్ద దిక్కును కోల్పోయింది. నాలుగు దశాబ్దాలుగా పార్టీకి సేవలందించిన ఆర్కే అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలో జరిగిన శాంతి చర్చల్లో కీలక పాత్ర వహించారు. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఆర్కే తలపై రూ.కోటి రివార్డు కూడా ఉంది. దేశవ్యాప్తంగా పలు కేసుల్లో ఆయన కీలక సూత్రధారిగా ఉన్నారు. ఆర్కే స్వస్థలం గుంటూరు జిల్లా తుమృకోట. ఎన్నోసార్లు ఇలాంటి వార్తలే.. ఆర్కే చాలాసార్లు పెద్ద పెద్ద ఎన్కౌంటర్ల నుంచి చివరి నిమిషంలో తప్పించుకున్నారు. భారీ ఎన్కౌంటర్ జరిగిన ప్రతీసారి ఆర్కే చనిపోయారా? లేదా బతికే ఉన్నారా? అనే చర్చ కూడా నడుస్తూ ఉండేది. కానీ, మళ్లీ ఆయన కదలికలు మొదలయ్యేవి. అయితే, ఆయన కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో తాజాగా వెలువడుతున్న వార్తలు ఆ పార్టీ సానుభూతిపరులను నైరాశ్యంలో ముంచాయి. అయితే, ఆర్కే మరణ వార్తపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలాఉండగా.. కీలక నేతల వరుస మరణాలు మావోయిస్ట్ పార్టీ ని అయోమయంలో పడేశాయి. కరోనాతో పాటు అనారోగ్య సమస్యల తో ఒక్కొక్కరు గా నేతలు చనిపోతూ ఉండటం ఆ పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తోంది. (చదవండి: అమీర్‌పేట్‌లో ఉద్రిక్తత.. ప్రోటోకాల్ రగడ) (చదవండి: సాంబారు రుచిగా లేదని తల్లి, సోదరిని చంపిన కిరాతకుడు) -
ఏవోబీలో మావోయిస్టుల ఆవిర్భావ దినోత్సవ సభ
ముంచంగిపుట్టు: ఆంధ్ర ఒడిశా సరిహద్దులో మావోయిస్టుల ఆవిర్భావ దినోత్సవాన్ని మావోయిస్టుల మిలీషియా కమాండర్లు, సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈనెల 21 నుంచి 28 వరకు నిర్వహిస్తున్న మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ముంచంగిపుట్టు మండలం రంగబయలు పంచాయతీలోని అత్యంత మారుమూల, దట్టమైన అటవీ ప్రాంతంలో గురువారం మావోయిస్టు మిలీషియా కమాండర్లు, గ్రామ కమిటీల సభ్యుల ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. మావోయిస్టుల స్తూపం వద్ద ఉద్యమంలో అమరులైన మావోయిస్టులకు నివాళులర్పించారు. అనంతరం తెలుగు, ఒడియా భాషలలో రాసిన బేనర్లు పట్టుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. గిరిజన హక్కుల కోసం పోరాటం చేస్తున్న మావోయిస్టులపై అణచివేత చర్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని నినాదాలు చేశారు. అనంతరం భారీ సభను ఏర్పాటు చేశారు. జననాట్య మండలి ఆధ్వర్యంలో తెలుగు, ఒడియా భాషలలో విప్లవ గీతాలను ఆలపించారు. సభా ప్రాంగణం అంతా ఎర్ర జెండాలు, బ్యానర్లతో నిండిపోయింది. సభలో ఆంధ్ర ఒడిశా గ్రామాలకు చెందిన గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
నేటి నుంచి మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు.. ఆదివాసీలకు ఆహ్వానం
చర్ల/దుమ్ముగూడెం: మావోయిస్టు పార్టీ ఆవిర్భవించి నేటికి 17 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఘనంగా వారోత్సవాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. దీంతో ఏజెన్సీలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ వేడుకలను విజయవంతం చేయాలంటూ వాల్‌పోస్లర్లు, కరపత్రాలు, లేఖల ద్వారా మావోయిస్టు పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అయితే మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని ప్రభావిత ప్రాంతాల పరిధిలోని పోలీస్ ఉన్నతాధికారులు సిబ్బందిని అప్రమత్తం చేశారు. సరిహద్దు అటవీ ప్రాంతాలకు భారీగా బలగాలను తరలిస్తున్నారు. వందల సంఖ్యలో దండకారణ్యానికి చేరుకుంటున్న సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. దీంతో సరిహద్దుల్లో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆదివాసీలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఆదివాసీలకు ఆహ్వానం.. వారోత్సవాలకు హాజరు కావాలని ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుకుమా, దంతెవాడ జిల్లాల్లో గల ఆదివాసీ ముఖ్యులను మావోయిస్టులు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే ఏ గ్రామం నుంచి ఎవరు వెళతారనే సమాచారాన్ని నిఘా వర్గాల ద్వారా తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. -
దండకారణ్యంలో యుద్ధ మేఘాలు.. పోలీసు బలగాల కూంబింగ్..
సాక్షి,చర్ల(ఖమ్మం): దండకారణ్యంలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. జూలై 28 నుంచి ఆగష్టు 3 వరకు మావోయిస్టులు పార్టీ అమరులకు నివాళులర్పించేందుకు వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో పోలీసులు సరిహద్దు ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసుశాఖ భారీగా బలగాలను తరలించింది. ఈ క్రమంలో కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్‌లో ఆదివారం ఉదయం చర్ల మండల శివారు అటవీ ప్రాంత గ్రామమమైన బోదనెల్లి–కొండెవాడ గ్రామాల మధ్యలోని కామరాజుగుట్ట సమీపంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. సరిహద్దు ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలోని బీజాపూర్, సుకుమా జిల్లాలతో పాటు దంతెవాడ జిల్లాలోని అటవీ ప్రాంతాలలోకి భారీగా చేరుకున్న సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్, కోబ్రా బలగాలు దండకారణ్య ప్రాంతంలో అణువణువునా గాలిస్తున్నారు. పెద్ద ఎత్తున దండకారణ్య ప్రాంతాలలోని గ్రామాలలో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుండడంతో ఏ క్షణంలో ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని సరిహద్దు ప్రాంతంలోని ఆదివాసీ ప్రజానీకం బిక్కుబిక్కుమంటున్నారు. సరిహద్దుల్లోని కొండెవాయి, బక్కచింతలపాడు, బోదనెల్లి, ఎర్రబోరు, కుర్నపల్లి, పులిగుండాల, నిమ్మలగూడెం, బత్తినపల్లి, ఎర్రంపాడు, చెన్నాపురం, రామచంద్రాపురం, కిష్ట్రారంపాడు, పూసుగుప్ప, దర్మపేట, ఎలకనగూడెం, డోకుపాడు, కర్రిగుండం, తెట్టెమడుగు, పాలచెలిమ, బీమారంపాడు, దర్మారం, యాంపురం, జెరుపల్లి తదితర గ్రామాలకు చెందిన కొంతమంది ఆదివాసీలు భయంతో ఇప్పటికే ఇళ్లను వదిలి వెళ్లారు. ఉన్న కొద్దిమంది కూడా తాజాగా బోదనెల్లి సమీపంలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనతో భయంతో ఇతర ప్రాంతాలకు వెళ్తేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. గత నెల 28న ప్రారంభమైన వారోత్సవాలు రేపటితో (ఆగష్టు 3) ముగియనున్న నేపధ్యంలో ఆగష్టు 3వ తేదీ ఎప్పుడు వెళ్లి పోతుందా అని ఆదివాసీలు ఎదురుచూస్తున్నారు. -
సంస్మరణంపై ‘డ్రోన్’ నిఘా
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులో పారా మిలటరీ, పోలీసు బలగాలు మళ్లీ అప్రమత్తమయ్యాయి. కరోనా, కోవర్టుల కారణంగా ఇటీవల మావోయిస్టు పార్టీ పలువురు ఉద్యమకారులను కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుందామని ఆ పార్టీ ప్రజలకు పిలుపునిచ్చింది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో గతంలో ఏటా రెడీమేడ్ స్థూపాలు ఏర్పాటు చేసి వారోత్సవాలు ఘనంగా నిర్వహించేవారు. మావోయిస్టులు క్రమంగా ఈ ప్రాంతాల్లో పట్టు కోల్పోవడంతో కొన్నేళ్లుగా మైదాన ప్రాంతాల్లో నిర్వహించడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు, తర్వాత కూడా నక్సల్స్‌పై ప్రభుత్వాల వైఖరి మారలేదు. ఓ వైపు పోలీస్ ఎన్కౌంటర్లు, మరోవైపు కరోనా మావోయిస్టు పార్టీ కీలక నేతలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు తప్పకుండా నిర్వహించాలని పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. ఘనంగా నిర్వహించేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తుండగా, అడ్డుకునేందుకు పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండటంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. డేగ కన్ను, ‘డ్రోన్’నిఘా... మూడు రాష్ట్రాల్లో సాయుధ పోలీసు బలగాలు మావోయిస్టు వారోత్సవాలపై డేగకన్ను వేశాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, గోదావరి తీరం వెంట పోలీసు క్యాంపులు ఏర్పాటు చేశారు. తూర్పు డివిజన్ సరిహద్దుల్లో పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో పోలీస్ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. మహాముత్తారం, మహదేవపూర్, ఏటూరునాగారం అటవీ ప్రాంతాలపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. అటవీ ప్రాంతాల్లో పోలీస్ బలగాలు నిరం తరం కూంబింగ్ నిర్వహిస్తున్నా యి. ఇటీవల ములుగు–భూపాలపల్లి–పెద్దపల్లి జిల్లాల మావోయిస్టు పార్టీ క మిటీ కార్యదర్శి కంక నాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్ పేరిట పలు ప్రజా సమస్యల విషయమై అధికార పార్టీ నేతలపై హెచ్చరి కలు జారీ చేయడంతో పోలీస్‌లు అప్రమత్తమ య్యారు. గిరిజన గ్రామాలపై ‘డ్రోన్’నిఘా కొనసాగుతోంది. -
పోలీసుల ఎదుట లొంగిపోయిన మావో అగ్రనేత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది.మావో అగ్రనేత, దండకారణ్య స్పెషల్ జోన్ కార్యదర్శి రామన్న అలియాస్ రావుల శ్రీనివాస్ కుమారుడు రావుల రంజిత్ బుధవారం రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ప్రస్తుతం రంజిత్ దండకారణ్యం బెటాలియన్ కమిటీ చీఫ్‌గా కొనసాగుతున్నాడు. కాగా రెండు సంవత్సరాల క్రితం తండ్రి రామన్న ఆనారోగ్య సమస్యతో రామన్న చనిపోయిన విషయం తెలిసిందే. కాగా రంజిత్ స్వస్థలం సిద్దిపేట జిల్లా ముగ్దుర్ మండలం బెక్కల్ గ్రామం.ఈ సందర్భంగా రావుల రంజిత్‌ను మీడియా ముందు ప్రవేశపెట్టిన అనంతరం డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడారు. '' మావోయిస్టు రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్ ప్రస్తుతం ప్లాటున్ కమిటి మెంబర్‌గా పనిచేస్తున్నాడు. వరంగల్ జిల్లా కు చెందిన మావోయిస్టు నేత రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న కుమారుడు రంజిత్ 1998లో జన్మించాడు. చిన్నప్పటి నుంచి మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరించాడు. తండ్రి రామన్న ఆధ్వర్యంలో రంజిత్ మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. 2017లో రామన్న సలహా మేరకు సెకండ్ బెటాలియన్ లో రంజిత్ జాయిన్ అయి 2019 వరకు మెంబర్‌గా వ్యవహరించాడు. అయితే తండ్రి మరణం తర్వాత రంజిత్ అనేక అవమానాలకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో పార్టీ మాత్రం అతని లొంగుబాటుకు అంగీకరించలేదు. ఈ మధ్యన అనారోగ్య సమస్యలు తలెత్తడంతో తనంతట తాను లొంగిపోవాలని రంజిత్ భావించాడు. 2017 నుండి 2019 ఆమ్స్ బెటాలియన్ లో పని చేసాడు.2018 కాసారం అటాక్ లో కీలక పాత్ర పోషించాడు..2021 లో జీరం అటాక్‌తో పాట 2020 మినప అటాక్‌లో సైతం రంజిత్ చురుగ్గా వ్యవహరించాడు. కరోనా పాండమిక్ సమయంలో మావోయిస్టు సెంట్రల్ కమిటీ లో మొత్తం 25 మంది మావోయిస్టులు ఉన్నారు. తెలంగాణ రాష్టం నుంచి 11 మంది, ఆంద్రప్రదేశ్ నుంచి 3 మంది సెంట్రల్ కమి ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల లో ఉన్న 14 మంది మావోయిస్టులు లొంగిపోవాలి. 4 లక్షల పరిహారం తో పాటు ప్రస్తుత ఖర్చులకు 5 వేలు అందజేస్తున్నాం.'' అంటూ తెలిపారు. -
Maoist Party : హిడ్మా, శారద క్షేమమే
సాక్షి, హైదరాబాద్/గంగారం: తమ పార్టీ అగ్రనేతలు మడవి హిడ్మా, శారద అలియాస్ జజ్జర్ల సమ్మక్కలు క్షేమంగానే ఉన్నారని మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ తెలిపారు. హిడ్మా, శారదక్కలు మరణించారంటూ పోలీసులు దుష్ప్రచారం చేస్తున్నారని, అందులో వాస్తవం లేదని ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. ఒకవేళ వారు మరణిస్తే తామే సమాచారం ఇస్తామని వెల్లడించారు. ఇటీవల మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్, మరో నేత భారతక్క కరోనా బారినపడిన సమయంలో పోలీసులు, గ్రేహౌండ్స్ జవాన్లు తమపై దాడికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. అందుకే పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో తమ అగ్రనేతలకు సరైన చికిత్స అందించలేకపోయామని పేర్కొన్నారు. ఎవరి మాటలు నమ్మాలి: లింగమ్మ కరోనా నేపథ్యంలో ఇటీవల తన అల్లుడు యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ మృతి చెందినట్లు ప్రచారం అయిందని, చివరికి ఇదే విషయాన్ని మావోయిస్టులు అధికారికంగా ప్రకటించారని శారదక్క తల్లి లింగమ్మ అన్నారు. అది జరిగాక నాలుగు రోజులకే తన కూతురు శారదక్క కూడా మృతి చెందిందని ప్రచారం జరగడంతో తామంతా దుఃఖ సాగరంలో మునిగి పోయామన్నారు. భార్యాభర్తలు చనిపోవడంతో ఇద్దరికీ కలిపి పెద్దకర్మ చేసేందుకు కార్డులను ముద్రించామని చెప్పారు. కానీ ఇప్పుడు శారదక్క బతికుందని మావోయిస్టు పార్టీ ప్రకటించడంతో కుటుంబసభ్యులమంతా అయోమయంలో పడిపోయామని తెలిపారు. ఎవరి మాట నమ్మాలో అర్థం కావడం లేదన్నారు. చదవండి: దళిత సాధికారత: మేధావులకు సీఎం కేసీఆర్ పిలుపు -
Maoist Party: హరిభూషణ్ స్థానంలో ఎవరు?
సాక్షి ప్రతినిధి, వరంగల్: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ స్థానంలో ఆ పార్టీ ఎవరిని నియమిస్తుందనే విషయం చర్చనీయాంశమైంది. విప్లవోద్యమంలో తుదకంటూ పోరాడిన హరిభూషణ్ ఈనెల 21న కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో ఆ పార్టీ కార్యకలాపాలు ఉధృతంగా సాగుతున్న సమయంలో కేంద్ర కమిటీ నాయకుడు కత్తి మోహన్‌రావు అలియాస్ ప్రకాశ్ గుండెపోటుతో మరణించగా, హరిభూషణ్, మహిళా నాయకురాళ్లు సమ్మక్క అలియాస్ భారతక్క, శారద కరోనాకు బలయ్యారు. హరిభూషణ్ స్థానంలో ఎవరిని నియమిస్తారనేది పోలీసు ఇంటెలిజెన్స్, మాజీ మావోయిస్టు వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెరపైకి లోకేటి చందర్ పేరు హరిభూషణ్ స్థానంలో రాష్ట్ర కార్యదర్శిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన లోకేటి చందర్ అలియాస్ స్వామిని నియమించవచ్చనే చర్చ జరుగుతోంది. నిజామాబాద్ జిల్లా కార్యదర్శిగా స్వామి చాలాకాలం పనిచేయగా, ఆయన సహచరి లోకేటి లక్ష్మి అలియాస్ సులోచన కూడా ఉద్యమంవైపే నడిచింది. మైదాన ప్రాంతాల నుంచి దళాలను ఎత్తివేసే సమయంలో దండకారణ్యానికి తరలివెళ్లినా.. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ (కేఏఎన్) కమిటీకి కూడా స్వామి సారథ్యం వహించా డు. మూడు దశాబ్దాలుగా ఉద్యమంలో పనిచేస్తున్న స్వామి ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కీలక బాధ్యతల్లో ఉండగా, ఉద్యమ అవసరాల రీత్యా ఆయనకు అవకాశం కల్పించవచ్చంటున్నారు. 1991 నుంచి పార్టీలో కీలకంగా ఉన్న కొంకటి వెంకట్ అలియాస్ రమేష్ పేరు కూడా ప్రచారంలో ఉంది. కరీంనగర్ జిల్లా కమిటీ సభ్యుడిగా, ఆనుపురం కొంరయ్య అలియాస్ సుధాకర్ (ఏకే) ఎన్కౌంటర్ తర్వాత జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేసిన ఆయన అప్పటి ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీలో సభ్యుడిగా వ్యవహరించాడు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ దండకారణ్యంలో కీలకంగా ఉన్న రమేష్ పేరు కూడా వినిపిస్తుంది. అలాగే రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్న బడే చొక్కారావు అలియాస్ దామోదర్, బండి ప్రకాశ్ పేర్లు కూడా రాష్ట్ర కార్యదర్శి కోసం పరిశీలించవచ్చంటున్నారు. కరోనా భయంతో మావోయిస్టు దంపతుల లొంగుబాటు కొత్తగూడెం టౌన్: మావోయిస్టు పార్టీ మణుగూరు ఓఎల్ఎస్ సభ్యులుగా పనిచేస్తున్న ఇడుమ సురేందర్, సోనీ దంపతులు శనివారం భద్రాద్రి ఎస్పీ సునీల్‌దత్ ఎదుట లొంగిపోయారు. శనివారం కొత్తగూడెంలో ఎస్పీ సునీల్‌దత్ విలేకరుల సమావేశంలో ఈమేరకు వెల్లడించారు. అగ్ర నాయకత్వం వేధింపులకు పాల్పడటం, పార్టీలోని నాయకులకు, కార్యకర్తలకు కరోనా సోకుతుండడంతో భయాందోళనకు గురై వీరు బయటకు వచ్చినట్లు తెలిపారు. మడివి ఇడుమ అలియాస్ సురేందర్, మడకం బుద్రి అలియాస్ సోని ఐదేళ్లుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నారని, వీరు రాష్ట్ర కమిటీ సభ్యుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రీజనల్ కార్యదర్శి ఆజాద్‌కు గార్డుగా పనిచేశారని చెప్పారు. మావోయిస్టులకు వ్యాపారులు, కాంట్రాక్టర్లు ఎవరూ సహాయ సహకారాలు అందించవద్దని ఎస్పీ కోరారు. లొంగిపోయిన మావోయిస్టులకు అండగా ఉంటామని, మెరుగైన వైద్య చికిత్సతోపాటు పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డులను అందజేశారు. కార్యక్రమంలో కొత్తగూడెం ఓఎస్డీ తిరుపతి, భద్రాచలం ఏఏస్పీ వినీత్, ప్రమోద్ పవార్, చర్ల సీఐ అశోక్ పాల్గొన్నారు. చదవండి: ముగిసిన 30 ఏళ్ల ప్రేమ ప్రయాణం -
నక్సల్స్‌కు భారీ దెబ్బ: అనారోగ్యంతో హరిభూషణ్ మృతి
1995లో దళంలోకి... మహబూబాబాద్ జిల్లా గంగారం మండ లం మరిగూడానికి చెందిన యాప నారాయణ 1995లో పీపుల్స్ వార్‌లో చేరాడు. అంచెలంచెలుగా ఎదిగి మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి స్థాయికి చేరాడు. కేడర్ నిర్మాణం కోసం... 2019 చివరి నుంచి మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కార్యకలాపాలు ముమ్మరం చేశాడు. తెలంగాణలో కేడర్ నిర్మాణం కోసం రిక్రూట్మెంట్ చేపట్టడమే గాక, పలు హింసాత్మక ఘటనలకు కారణమయ్యాడు. నలుగురు కీలక నేతలు.. అనారోగ్యంతో జూన్ 6న డివిజనల్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్, జూన్ 10న కత్తి మోహన్.. 16న విశాఖ ఎన్కౌంటర్లో పెద్దపల్లి జిల్లాకు చెందిన సందె గంగయ్యలను పార్టీ కోల్పోయింది. తాజాగా హరిభూషణ్ మరణం. సాక్షి, హైదరాబాద్/మహబూబాబాద్/ గంగారం/కొత్తగూడ: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ అలియాస్ లక్మూ అలియాస్ హెచ్చీ సోమవారం మరణించారు. ఇటీవల అనారోగ్యంతో మావో అగ్రనేత కత్తి మోహన్ అలియాస్ ప్రకాశ్ మరణం మరువకముందే.. మరో కీలకనేత మృతి చెందడం దండకారణ్యంలో కలకలం రేపుతోంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హరిభూషణ్ ఛత్తీస్‌గఢ్ సుకుమా జిల్లాలోని మీనాగుట్ట ప్రాంతంలో మరణించాడన్న వార్త మంగళవారం ఛత్తీస్‌గఢ్- తెలంగాణలో దావానంలా వ్యాపించింది. ఆయన అంత్యక్రియలను తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని అడవుల్లో నిర్వహించారని తెలిసింది. హరిభూషణ్ కరోనాతో లేదా ఫుడ్ పాయిజనింగ్తో మరణించి ఉంటారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్త నిజమా? కాదా? అన్న విషయాలను తొలుత బస్తర్ పోలీసులు ధ్రువీకరించలేదు. సాయంత్రానికి ఛత్తీస్‌గఢ్ పోలీసు ఉన్నతాధికారులు హరిభూషణ్ మరణవార్తను నిర్ధారించారు. 2018లో ఎన్కౌంటర్ నుంచి తప్పించుకుని.. హరిభూషణ్ దళంలో పని చేస్తున్న సమయంలోనే మేనమామ కూతురు జజ్జర్ల సమ్మక్క అలియాస్ శారదను వివాహం చేసుకున్నాడు. ఈమె ప్రస్తుతం శబరి–చర్ల ఏరియా కమిటీ సభ్యురాలిగా ఉంది. అనేక ఎన్కౌంటర్లలో త్రుటిలో తప్పించుకున్న హరిభూషణ్ చాలాసార్లు మరణించాడని ప్రచారం జరిగింది. 2018, మార్చిలో బీజాపూర్ జిల్లా పూజారి కంకెర అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. ఆసమయంలో హరిభూషణ్ దంపతులు సురక్షితంగా తప్పించుకున్నారు. అయితే అప్పుడు అతడు మరణించాడంటూ వార్తలొచ్చాయి. పలు కార్యకలాపాలకు మూలం ఇతనే.. గణపతి తరువాత మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను నంబాల కేశవరావు స్వీకరించినప్పటి నుంచి పార్టీలో హరిభూషణ్‌కు ప్రాధాన్యం పెరిగింది. తెలంగాణలో కేడర్ నిర్మించుకోవాలన్న కేశవరావు ఆదేశాలతో 2019 చివరి నుంచి కార్యక లాపాలు ముమ్మరం చేశాడు. రిక్రూట్మెంట్లకు, పలు హింసాత్మక ఘటనలకు కారణమయ్యాడు. గతేడాది లాక్డౌన్ సమయంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులతో కలసి ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్-భూపాలపల్లి, భద్రాద్రి-కొత్తగూడెం ప్రాంతాల్లో రిక్రూట్మెంట్లకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాలను పోలీసులు తిప్పికొట్టారు. వరుసగా ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు 10 మంది మావోలు మరణించారు. దీంతో హరిభూషణ్ అతని అనుచరులు వెనకడుగు వేశారు. పోలీసుల గాలింపు తీవ్రతరం కావడం, లాక్డౌన్ ఎత్తివేయడంతో హరిభూషణ్ అతని అనుచరులు తిరిగి దండకారణ్యానికి వెళ్లారు. గతే డాది చివర్లో కూడా ప్రాణహిత నది మీదుగా మహా రాష్ట్ర నుంచి పలుమార్లు హరిభూషణ్ తెలంగాణ లోకి ప్రవేశించాడని నిఘా వర్గాలు స్థానిక పోలీసులను హెచ్చరించాయి. దీంతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర ప్రాంతాల్లో గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టినా హరిభూషణ్ ఆచూకీ మాత్రం చిక్కలేదు. 3 వారాల్లో నలుగురు నేతలు.. మావోయిస్టుల్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర అలజడి సృష్టిస్తోంది. 3 వారాల్లోనే నలుగురు కీలక నేతలను కోల్పోయింది. ఈసారి వచ్చిన స్ట్రెయిన్ ప్రమాదకరంగా ఉండటం.. మావోయిస్టు అగ్రనేతలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుండటంతో అగ్రనేతలు మరణాల బారిన పడుతున్నారని బస్తర్ పోలీస్ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఏప్రిల్‌లో బీజాపూర్‌లో పోలీసులపై మావో అగ్రనేత హిడ్మా నేతృత్వంలో జరిగిన ఊచకోతకు ప్రతీకారం కోసం సీఆర్పీఎఫ్ కోబ్రా బలగాలు ఎదురుచూస్తున్నా యి. దండకారణ్యంలో మావోలకు పట్టున్న ప్రాం తాలను డ్రోన్ల ద్వారా తెలుసుకుంటున్నారు. మావోలను అష్టదిగ్బంధనం చేశారని అందుకే వారు బయటికి రాలేక, చికిత్స అందక మరణిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే, లొంగిపోతే తాము చికిత్స అందిస్తామని తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ పోలీసులు ప్రకటించినా.. అందుకు మావోలు సిద్ధంగా లేరు. పీపుల్స్ వార్‌లోకి ఇలా.. యాప పాపమ్మ, రంగయ్య దంపతుల ఏడుగురు సంతానంలో నారాయణ పెద్ద కుమారుడు. నర్సంపేటలో డిగ్రీ చదివిన ఆయన 1985 - 90 మధ్యకాలంలో ఎల్ఐసీ ఏజెంట్‌గా, ఐటీడీఏ మైనర్ ఇరిగేషన్లో వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేశాడు. అప్పటి పీపుల్స్‌వార్ అనుబంధ రాడికల్ స్టూడెంట్ యూనియన్ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యాడు. అయితే అప్పుడు కొత్తగూడ, ఇల్లందు, గుండాల ఏజెన్సీ ప్రాంతాల్లో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. అప్పటి నుంచే నారాయణ పీపుల్స్‌వార్ అనుబంధంగా పనిచేస్తూ మిత్రుడు రాజకోటితో కలసి న్యూడెమోక్రసీ పార్టీ విధానాలు, వారికి వ్యతిరేకంగా గ్రామాల్లో పనిచేశారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిని హత్య చేసేందుకు న్యూడెమోక్రసీ నేతలు వ్యూహం పన్నారు. 1991, మే 31న గ్రామంలో జరిగే వివాహానికి నారాయణ, రాజకోటి వస్తారని కాపుకాసిన ఎన్డీ నేతలకు రాజకోటి దొరకగా.. నారాయణ అక్కడి నుండి తప్పించుకున్నాడు. ఆ తర్వాత పీపుల్స్‌వార్ దళంలోకి వెళ్లాడు. పీపుల్వార్లో చేరిన హరిభూషణ్ అంచెలంచెలుగా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. దళసభ్యుడిగా, మిలిటరీ ప్లాటూన్ శిక్షణ కమాండర్‌గా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర కార్యదర్శి, తర్వాత కేంద్ర కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధిగా ఎదిగారు. హరిభూషణ్‌పై ప్రభుత్వం రూ.20లక్షల రివార్డు ప్రకటించింది. ఎలాంటి సమాచారం లేదు హరిభూషణ్ మృతి చెందాడనే వార్త సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో ఆయన స్వగ్రామం మడగూడెం విషాదఛాయలు అలముకొన్నాయి. అయితే ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం లేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. వారంతా మంగళవారం వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండటం కనిపించింది. గతంలోనూ హరిభూషణ్ చనిపోయాడని వార్తలు వచ్చాయని.. దీంతో తమ తండ్రి రంగయ్య మనోవేదనకు గురై మంచాన పడ్డారని హరిభూషణ్ సోదరులు అశోక్, రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కోలుకుంటున్న తమ తండ్రికి మళ్లీ హరిభూషణ్ మరణించాడని వార్తలు చేరడంతో ఆందోళనకు గురవుతున్నారన్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని హరిభూషన్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
బీజేపీలోకి ఈటల: మావోయిస్టు పార్టీ ఘాటు లేఖ
-
బీజేపీలోకి ఈటల: మావోయిస్టు పార్టీ ఘాటు లేఖ
సాక్షి, హైదరాబాద్: ఇటీవల బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంపై తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఘాటు లేఖ రాశారు. ఈటల రాజీనామాను తమ పార్టీ ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు... ‘‘కేసీఆర్- ఈటల మధ్య వ్యవహారం తెలంగాణ ప్రజలకు సంబంధించినది కాదు. కేసీఆర్, ఈటల రాజేందర్ ఒకే గూటి పక్షులు. ప్రజల ఆకాంక్షలకు కేసీఆర్, ఈటల తూట్లు పొడిచారు. ఈటల తన ఆస్తుల పెంపుదల కోసం ప్రయత్నించారు. పేదల భూములను ఈటల అక్రమంగా ఆక్రమించారు’’ అని జగన్ ఆరోపించారు. తెలంగాణలో ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తానని చెప్పిన ఈటల.. తన ఆస్తుల రక్షణ కోసం బీజేపీలో చేరారంటూ విమర్శించారు. చదవండి: క్షేమంగా ఇంటికి చేరిన ఈటల -
మావోయిస్టులపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: నిషేధిత మావోయిస్టు పార్టీపై మరో ఏడాదిపాటు నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. మావోయిస్టు పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న విరసం సహా 16 అనుబంధ సంఘాలపైనా వేటు వేసింది. పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ 1992 ప్రకారం వీటిపై మరో ఏడాదిపాటు నిషేధం కొనసాగుతుందని ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మార్చి 30న నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఈ విషయాన్ని శుక్రవారం వెల్లడించింది. అనుంబంధ సంఘాలివే.. తెలంగాణ ప్రజాఫ్రంట్ (టీపీఎఫ్), తెలంగాణ అసంఘటిత కార్మిక సమాఖ్య (టీఏకేఎస్), తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ), డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (డీఎస్‌యూ), తెలంగాణ విద్యార్థి సంఘం (టీవీఎస్), ఆదివాసీ స్టూడెంట్ యూనియన్ (ఏఎస్యూ), కమిటీ ఫర్ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్ (సీఆర్పీపీ), తెలంగాణ రైతాంగ సమితి (టీఆర్ఎస్), తుడుందెబ్బ (టీడీ), ప్రజాకళామండలి (పీకేఎం), తెలంగాణ డెమొక్రటిక్ ఫ్రంట్ (టీడీఎఫ్), ఫోరం అగైనెస్ట్ హిందూ ఫాసిజం అఫెన్సివ్ (ఎఫ్‌ఏహెచ్‌ఎఫ్‌వో), సివిల్ లి బర్టీస్ కమిటీ (సీఎల్సీ), అమరుల బంధు మిత్రుల సంఘం (ఏబీఎంఎస్), చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్), విప్లవ రచయితల సంఘం (విరసం).. ఈ 16 సంస్థలు ప్రజాసంఘాల ముసుగులో ప్రజల్లోకి వెళ్లి మావోయిస్టు పార్టీ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ప్రభుత్వం ఆరోపించింది. చదవండి: వినూత్నం.. ఎంపీ, ఎమ్మెల్సీ గుర్రమెక్కి మరీ.. చదవండి: తెలంగాణ ఆదర్శం: వాయువేగాన ఆక్సిజన్ -
ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్ : కలకలం రేపుతున్న ‘జంగ్ బుక్’
సాక్షి, హైదరాబాద్: గ్రేహౌండ్స్‌పై దాడికి హిడ్మా ప్రణాళికలు రచించాడా? మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు తెలంగాణలో దాడులకు ఆదేశాలిచ్చారా? ఇటీవల ఛత్తీస్‌గఢ్ పోలీసులకు దొరికిన ‘జంగ్ బుక్’లోని అంశాలు ఈ అనుమానాలకు తావిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ జిల్లా బీజాపూర్‌లో ఈనెల 3వ తేదీన జరిగిన ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) కమాండర్ హిడ్మా తన ఉనికిని ఉద్దేశపూర్వకంగా నిఘా వర్గాలకు అందజేసి, తమకు ప్రాబల్యం ఉన్న ప్రాంతంలోకి తెలివిగా రప్పించాక ఆకస్మికంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో సీఆర్పీఎఫ్ కోబ్రా, ఎస్టీఎఫ్, స్థానిక పోలీసులు కలిసి 22 మంది మరణించారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు కూడా మరణించారు. ఈ సందర్భంగా మావోయిస్టుల నుంచి ఒక ‘జంగ్ బుక్’ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. సాధారణంగా మావోయిస్టులు తాము చేయబోయే, చేసిన దాడుల గురించి, జయాపజయాలను విశ్లేషిస్తూ ఎప్పటికప్పుడు రాసుకునే పుస్తకాన్నే ‘జంగ్ బుక్’గా వ్యవహరిస్తారు. ఈ పుస్తకంలోని పలు సంచలనాత్మక విషయాలను చదివిన అక్కడి పోలీసులు.. ఇప్పుడు ఆయా అంశాలపై ఆరా తీసే పనిలో పడ్డారు. మావోల ఏరివేతలో గ్రేహౌండ్స్ ఫస్ట్ 2010 నుంచి సీఆర్పీఎఫ్పై వరుసగా దాడులు చేస్తూ వస్తోన్న హిడ్మా గెరిల్లా ఆపరేషన్లలో ఆరితేరాడు. సీఆర్పీఎఫ్, స్థానిక పోలీసులపై పదుల సంఖ్యలో దాడులు చేసిన హిడ్మా జాబితాలో గ్రేహౌండ్స్‌పై దాడికి సంబంధించిన వ్యూహం కూడా ఉండటం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. రాష్ట్రానికి చెందిన గ్రేహౌండ్స్ బలగాలు దేశంలోనే మావోల ఏరివేతలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఇప్పటికీ పలు రాష్ట్రాల పోలీసులు మావోల ఏరివేతకు అనుసరించాల్సిన వ్యూహాలకు గ్రేహౌండ్స్ అధికారులను ఆశ్రయించడం, వారి వద్ద శిక్షణ పొందడం చేస్తుంటారు. వాస్తవానికి హిడ్మా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యం ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందాడు. కానీ ఇతని ఫొటోలు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ సరిహద్దు ప్రాంతాల్లోని ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ఉండటం గమనార్హం. గ్రేహౌండ్స్‌కు సమాచారం గ్రేహౌండ్స్‌పై దాడి చేయాలన్న హిడ్మా ప్రణాళికలు చూసిన ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఈ విషయాన్ని వెంటనే గ్రేహౌండ్స్‌కు తెలియజేశారు. వాస్తవానికి గ్రేహౌండ్స్‌పై దాడి ప్రణాళికలు మావోయిస్టుల వద్ద ఉండటం కొత్తేమీ కాదు. కానీ ఛత్తీస్‌గఢ్ మావోయిస్టు నేత అయిన హిడ్మా వద్ద ఈ ప్రణాళికలు ఉండటం అంటే.. తెలంగాణలోనూ దాడులకు అతనికి మావో అగ్రనేతలు ఆదేశాలిచ్చారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఆ రాష్ట్ర పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారని సమాచారం. చదవండి: 'ప్లీజ్ అంకుల్.. మా నాన్నను విడిచిపెట్టండి' -
వైద్య సిబ్బందిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు
సాక్షి, చర్ల: సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ముగ్గురు వైద్య సిబ్బందిని కిడ్నాప్ చేశారు. గంగుళూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని కామకనార్ గ్రామంలో గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు మాస్టర్ ట్రైనర్ శారద వచ్చారు. ఈ క్రమంలో గురువారం రాత్రి హెల్త్ వర్కర్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మావోయిస్టులు అక్కడికి వచ్చారు. శారద, మరో ఇద్దరు హెల్త్ వర్కర్లను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఎస్పీ కమలోచన్ కాశ్యప్ ధ్రువీకరించారు. కాగా, వైద్య సిబ్బంది కిడ్నాప్‌తో బీజాపూర్‌లో కలకలం రేగింది. మావోయిస్టులను అరెస్టు చేయలేదు చర్ల: మావోయిస్టులను అరెస్టు చేసినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని బస్తర్ రేంజ్ ఐజీ సౌందర్‌రాజ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎదురుకాల్పుల తర్వాత కొందరు గ్రామస్తులు పోలీసులతో కలసి బేస్ క్యాంపు వరకు వచ్చారని, ఆ తర్వాత వారందరినీ వెంటనే తిరిగి వారి ఇళ్లకు పంపించామని తెలిపారు. ఎటువంటి ఆధారం లేకుండా ఇటువంటి తప్పుడు ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. చదవండి: రాకేశ్వర్ సింగ్ విడుదల అంత ఆషామాషీగా జరగలేదు -
రాకేశ్వర్ సింగ్ విడుదల.. 100కి.మీకు పైగా బైకుపై
సాక్షి, హైదరాబాద్/భద్రాద్రి–కొత్తగూడెం: మావోయిస్టుల వద్ద బందీగా ఉన్న సీఆర్పీఎఫ్ జవాను రాకేశ్వర్ సింగ్ విడుదల అంత ఆషామాషీగా జరగలేదు. అతన్ని విడిపించేందుకు మధ్యవర్తులు, విలేకరులు దండకారణ్యంలోకి 100 కిలోమీటర్లకుపైగా బైకుపై ప్రయాణించాల్సి వచ్చింది. ఆద్యంతం సినీఫక్కీలో జరిగిన ఈ ప్రత్యేక చర్చల ప్రక్రియ ఎట్టకేలకు సఫలం కావడంతో ఆరురోజుల తర్వాత రాకేశ్వర్ సింగ్ చెరవీడాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మావోలకు కేంద్రం, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మంగళవారం నాటికే సానుకూల సంకేతాలు పంపింది. కానీ అదే సమయంలో రాకేశ్వర్ క్షేమంపై ఆందోళన కూడా వ్యక్తం చేసింది. అయితే కేంద్రం హామీలపై సంతృప్తి చెందిన నేపథ్యంలోనే మావోలు బుధవారం రాకేశ్వర్ సింగ్ ఫొటోను మీడియాకు విడుదల చేశారు. ఇదే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ సందేశం మావోయిస్టులకు తెలియజేయడానికి నమ్మకస్తులు, తటస్థులైన ధర్మపాల్ షైనీ, తెల్లం బోరయ్యలను ఎంపిక చేసుకున్నాయి. జర్నలిస్టులకు ముందే సమాచారం: జర్నలిస్టులు తెలిపిన వివరాల ప్రకారం.. మావోయిస్టులు బుధవారమే మధ్యవర్తులతో పాటు ఏడుగురు విలేకరులకు అర్ధరాత్రి దాటాక ఫోన్ చేస్తామని చెప్పి ఉంచారు. అదే ప్రకారం గురువారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఇద్దరు మధ్యవర్తులను తీసుకుని బీజాపూర్ నుంచి బైకులపై బయ ల్దేరాలని జర్నలిస్టులకు సూచించారు. దీంతో మొత్తం 9 మంది అటవీమార్గాన దాదాపు 90 కిలోమీటర్లు ప్రయాణించి ఎన్కౌంటర్ జరిగిన జొన్నగూడ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ.. వారి వెంట ఎవరూ ఫాలో కాలేదని మావోలు నిర్ధారించుకున్నారు. అక్కడి నుంచి లోపలికి మరో 15 కిలోమీటర్లు ఫోన్లో సూచనలు ఇస్తూ పిలిపించుకున్నారు. మొత్తానికి ఉదయం 9.30 గంటలకు దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టులు రాకేశ్వర్‌ను బంధించిన చోటుకు వీరంతా చేరుకున్నారు. అక్కడ వారికి కోడి, టమాట కూరలు, చపాతీలతో భోజనం పెట్టారు. మధ్యవర్తులతో మావోయిస్టులు ఏకాంతంగా గంటసేపు మాట్లాడారు. జొన్నగూడకు 40 మంది మావోయిస్టులు మధ్యాహ్నం 12 దాటగానే మధ్యవర్తులు, జర్నలిస్టులు జొన్నగూడ వైపు బయల్దేరారు. రాకేశ్వర్ సింగ్‌తో పాటు 40 మంది మావోయిస్టులు వారిని అనుసరిస్తూ వచ్చారు. తెర్రం పోలీస్‌స్టేషన్ పరిధిలోని జొన్నగూలో ఏర్పాటు చేసిన ప్రజాకోర్టులో అందరిముందు రాకేశ్వర్ తాళ్లు విప్పి బంధ విముక్తుణ్ణి చేసిన మావోయిస్టులు అతన్ని మధ్యవర్తులకు అప్పగించారు. మావోయిస్టులు తమను బాగా చూసుకున్నారని, ఎక్కడా బెదిరింపులకు పాల్పడటం కానీ, దురుసుగా ప్రవర్తించటం కానీ చేయలేదని చర్చల్లో పాల్గొన్న ముఖేశ్ చంద్రాకర్ ‘సాక్షి’కి వివరించారు. చదవండి: (రాకేశ్వర్‌సింగ్ విడుదల వెనుక అసలు గుట్టేమిటి..?) -
రాకేశ్వర్‌సింగ్ విడుదల వెనుక అసలు గుట్టేమిటి..?
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఏప్రిల్ 3వ తేదీన మావోయిస్టులు సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడి చేసి కిడ్నాప్ చేసిన జవాను రాకేశ్వర్‌సింగ్‌ను మావోయిస్టులు ఎట్టకేలకు విడుదల చేశారు. రాకేశ్వర్‌సింగ్‌ను కిడ్నాప్‌చేసి 6 రోజుల పాటు తమ చెరలో ఉంచుకున్న మావోయిస్టులు మొదటి నుంచి అతనిపై సానుకూల ధోరణితోనే వ్యవహరించారు. అతని ప్రాణానికి ఎలాంటి హామీ తలపెట్టబోమని, ప్రభుత్వం వెంటనే చర్చల ప్రక్రియ ప్రారంభించాలని, మధ్యవర్తిత్వం వహించే వారి పేర్లు ప్రకటిస్తే రాకేశ్వర్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నం ఒక పాకలో ఏ విధమైన ఆందోళన లేకుండా కూర్చుని ఉన్న రాకేశ్వర్‌సింగ్ చిత్రాన్ని సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. మధ్యవర్తుల పేర్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇంతలోనే అనూహ్యంగా గురువారం మధ్యాహ్నమే రాకేశ్వర్‌సింగ్‌ను మావోలు విడుదల చేసినట్టుగా బస్తర్ ఐజీ ప్రకటించడం అం దరినీ విస్మయానికి గురిచేసింది. రాకేశ్వర్ సింగ్ కుటుంబ సభ్యులను ఆనందంలో ముంచెత్తింది. ఎలా విడుదల చేశారు? రాకేశ్వర్‌ను బందీగా పట్టుకుని చర్చలకు రావాలని ప్రభుత్వానికి డిమాండ్లు విధించిన మావోయిస్టులు అకస్మాత్తుగా అతన్ని విడుదల చేయడం వెనుక ఏం జరిగి ఉంటుందన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది. ఛత్తీస్‌గఢ్ పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం ఏం చేశాయన్నది ఆసక్తికరంగా మారింది. మావోయిస్టులు ప్రభుత్వాధికారులను అపహరించడం, తమ డిమాండ్లు, నెరవేర్చుకోవడం, తమవారిని విడిపించుకోవడం కొత్త విషయమేమీ కాదు.. దశాబ్దాలుగా జరుగుతున్నదే. ఇప్పుడు కూడా పోలీసులు అన్యాయంగా అరెస్టు చేసిన 150 మంది అమాయక గిరిజనులను విడుదల చేయాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. అదే విధంగా మావోల ఏరివేత కోసం కేంద్రం చేపట్టిన ‘‘ఆపరేషన్ ప్రహార్’’ను నిలిపివేయాలని కూడా డిమాండ్ చేశారు. అయితే ప్రస్తుతం మావోయిస్టులు పైకి చెబుతున్నట్టుగానే ఎలాంటి డిమాండ్లు, షరతులు లేకుండానే జవానును వదిలేశారా? లేక తెరవెనుక ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుంచి ఏమైనా హామీలు లభించాయా? లావాదేవీలు నడిచాయా? అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. రాకేశ్వర్ విడుదలతో కుటుంబ సభ్యుల ఆనందోత్సాహం.. కూంబింగ్ నిలిపివేతకు ఇటాలియన్ల కిడ్నాప్ 2012 మార్చి14న కోరాపూట్‌లో ఎమ్మెల్యే జినా హికాకాతో పాటు ఇద్దరు ఇటాలియన్ టూరిస్టులు క్లాంజియో కొలాంటిడియో, బసుస్కో పౌలోను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. దీంతో సీఎం నవీన్ పట్నాయక్ ప్రభుత్వం వెంటనే వారితో చర్చలు జరిపింది. మావోయిస్టుల కోసం ఒరిస్సా అడవుల్లో జరుగుతున్న కూంబింగ్‌ను వెంటనే ఆపేయాలన్న డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించడంతో మావోలు ఎమ్మెల్యేతో పాటు ఇద్దరు ఇటాలియన్లకు ఎలాంటి హానీ తలపెట్టకుండా విడుదల చేశారు. అయితే దాని వెనుకా వేరే కారణం ఉందన్న ప్రచారం జరిగింది. ఒకేసారి ఏడుగురు ఐఏఎస్ అధికారులను..! 1987లో తూర్పుగోదావరి జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరైన ఏడుగురు ఐఏఎస్ అధికారులను మావోలు కిడ్నాప్ చేయడం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. ఐఏఎస్‌లను బందీలుగా చేసుకుని మావోలు అప్పట్లో వారి డిమాండ్లు నెరవేర్చుకున్నారు. అనంతరం వారిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే రాకేశ్వర్ సింగ్ విడుదల వెనుక ఏం జరిగిందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రహార్ నిలిపివేతకు, గిరిజనులకు హామీ లభించిందా? ఇతరత్రా అంశాలేమైనా ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా రాకేశ్వర్ సింగ్ సురక్షితంగా విడుదల కావడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఆర్కే కోసం కలెక్టర్ కిడ్నాప్ 2011 ఫిబ్రవరి 17. మల్కన్‌గిరి జిల్లా బడ పాడ గ్రామం. ఇది ఏపీ సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జిల్లా కలెక్టర్ వినీల్ కృష్ణ, జేఈ పబిత్రా మోహన్‌తో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. దారికాచిన మావోలు వారిని కిడ్నాప్ చేసి చిత్రకొండ అడవుల్లో బంధించారు. ఏపీ నుంచి పలువురు పౌరహక్కుల నేతలు మధ్యవర్తిత్వం వహించి వారిని విడుదల చేయించారు. దీనికి ప్రతిగా ఒరిస్సా ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేత నిలిపివేసి, అరెస్టు చేసిన ఆదివాసీలను విడుదల చేసింది. ఇదంతా బయటికి కనిపించింది. కానీ అసలు విషయం ఏంటంటే.. మావో అగ్రనేత ఆర్కే అలియాస్ అక్కిరాజు హరగోపాల్‌ను ఓ రహస్య ప్రాంతంలో భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. అతన్ని అరెస్టు లేదా ఎన్కౌంటర్ చేస్తారన్న విషయం తెలుసుకున్న మావోయిస్టులు వెంటనే మల్కన్‌గిరి కలెక్టర్‌ను కిడ్నాప్ చేశారు. ఆర్కేను అరెస్టు చేయకుండా భద్రతా బలగాలు వెనక్కి వచ్చేయాలని షరతు విధించారు. విధిలేని పరిస్థితుల్లో భద్రతాదళాలు ఆర్కేను విడిచిపెట్టగా, మావోలు కలెక్టర్, జేఈలను విడుదల చేశారు. బయటి ప్రపంచానికి మాత్రం అదంతా గిరిజనుల విడుదల కోసం జరిగిన కిడ్నాప్‌గా ప్రచారం జరిగింది. చదవండి: (వీడిన ఉత్కంఠ: మావోయిస్టుల నుంచి రాకేశ్వర్ విడుదల) -
మావోయిస్టుల నుంచి రాకేశ్వర్ విడుదల
-
వీడిన ఉత్కంఠ: మావోయిస్టుల నుంచి రాకేశ్వర్ విడుదల
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ దండకారణ్యంలో తమ వద్ద బందీగా ఉన్న సీఆర్పీఎఫ్ (కోబ్రా) జవాను రాకేశ్వర్ సింగ్ మన్హాన్‌ను మావోయిస్టులు గురువారం విడుదల చేశారు. ఈ మేరకు బస్తర్ ఐజీ సుందర్రాజ్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు ఈ నెల 3న బీజాపూర్ జిల్లాలోని తెర్రెం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎదురుకాల్పులు జరిగిన సమయంలో 22 మంది జవాన్లను మావోయిస్టులు హతమార్చారు. ఇదే క్రమంలో కోబ్రా 210 బెటాలియన్‌కు చెందిన రాకేశ్వర్ సింగ్‌ను తమ బందీగా పట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా జవాన్‌ను విడుదల చేసేందుకు ప్రభుత్వం మధ్యవర్తులను పంపించాలని మావోయిస్టు పార్టీ కోరిన నేపథ్యంలో.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఆ రాష్ట్రానికి చెందిన పద్మశ్రీ ధర్మపాల్ షైనీ, గోండ్వానా సమాజ్ అధ్యక్షుడు తెల్లం బోరయ్యలను మధ్యవర్తులుగా పంపించింది. వీరితోపాటు బస్తర్‌కు చెందిన గణేష్ మిశ్రా, రంజన్‌దాస్, ముఖేష్ చంద్రాకర్, యుగేష్ చంద్రాకర్, చేతన్ కుకేరియా, శంకర్, రవి అనే మరో ఏడుగురు జర్నలిస్టుల బృందం కూడా దండకారణ్యంలోకి వెళ్లింది. భారీ ప్రజా కోర్టు జొన్నగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భారీ స్థాయిలో ప్రజాకోర్టు ఏర్పాటు చేశారు. వారి సమక్షంలోనే రాకేశ్వర్ సింగ్‌ను తాళ్లు విప్పి విడుదల చేశారు. మధ్యవర్తులకు అతన్ని అప్పగించారు. వారు రాకేశ్వర్‌ను ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని నేరుగా బాసగూడ సీఆర్పీఎఫ్ క్యాంపునకు తీసుకెళ్లారు. అనంతరం అంబులెన్స్‌లో బీజాపూర్ ఆస్పత్రికి తరలించగా, అతనికి పరీక్షలు చేశారు. కాగా మావోయిస్టులకు, ప్రభుత్వానికి మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరిందనే వివరాలు మాత్రం బయటకు రాలేదు. కుటుంబసభ్యుల హర్షం జమ్మూకశ్మీర్‌కు చెందిన రాకేశ్వర్ సింగ్ విడుదల పట్ల అతని భార్య మీనూ, కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మీనూ మాట్లాడుతూ.. తన భర్త మావోల వద్ద బందీగా ఉన్న సమయంలో చాలా భయమేసిందన్నారు. వారు ఎలాంటి హానీ తలపెట్టకుండా విడుదల చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనకు ఎలాంటి హామీ ఇవ్వలేదని చెప్పారు. కేంద్ర హోం మంత్రి ఫోన్ మావోయిస్టుల చెర నుంచి విడుదలైన రాకేశ్వర్ సింగ్‌తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడినట్లు ఆ శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. సింగ్ యోగక్షేమాలను అమిత్ షా అడిగి తెలుసుకున్నారని తెలిపాయి. చదవండి: రాకేశ్వర్‌ను విడిచిపెడతాం -
ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్: రాకేశ్వర్ క్షేమం, ఫొటో విడుదల
చత్తీస్‌గఢ్: మావోయిస్టులు బందీగా తీసుకెళ్లిన సీఆరీ్పఎఫ్ కోబ్రా జవాన్ రాకేశ్వర్‌సింగ్ క్షేమంగానే ఉన్నారు. ఈ మేరకు ఆయన క్షేమ సమాచారాన్ని తెలియజేస్తూ మావోయిస్టులు రాకేశ్వర్ ఫొటోను మీడియాకు విడుదల చేశారు. ఫొటోలో ఆయన సాధారణంగానే ఉన్నారు. ఎలాంటి భయం, దిగులు లేకుండా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలోని తెర్రెం పోలీస్‌స్టేషన్ పరిధి జొన్నగూడెం అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది జవాన్లు మృతి చెందగా.. ఒక జవాన్‌ను మావోయిస్టులు బందీగా తీసుకెళ్లిన విషయం విదితమే. అనంతరం ఆయన తమవద్ద క్షేమంగా ఉన్నారని.. ఎలాంటి హానీ తలపెట్టబోమని మావోయిస్టులు ప్రకటించారు. ప్రభుత్వం మధ్యవర్తుల పేర్లు చెబితే జవాన్‌ను అప్పగిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ మంగళవారం లేఖ విడుదల చేశారు. అయితే, ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం స్పందించలేదు. ఈ నేపథ్యంలో జవాన్ విడుదలపై ఉత్కంఠ నెలకొంది. ఆ బాధ్యత మీదే: రాకేశ్వర్ భార్య మీనూ జవాన్ ఒక్కరోజు ఆలస్యంగా డ్యూటీకి వెళితే యాక్షన్ తీసుకునే ఆర్మీ.. అదే జవాను విధుల్లో అదృశ్యమైతే ఏం యాక్షన్ తీసుకుంటోందని రాకేశ్వర్‌సింగ్ భార్య మీనూ కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రాకేశ్వర్‌సింగ్ విడుదలకు చర్యలు చేపట్టాలని కోరారు. రాకేశ్వర్ ఓ తల్లికి కొడుకు, తన భర్త అనే విషయాలు పక్కనబెట్టాలని.. మీ జవాన్‌ను సురక్షితంగా తీసుకురావాల్సిన బాధ్యత మీదే అని స్పష్టంచేశారు. ఈ మేరకు ఆమె మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. కాగా, పాక్‌కు బందీగా చిక్కిన పైలెట్ అభినందన్‌ను విడిపించినట్టే.. రాకేశ్వర్‌ను విడుదల చేయించాలని అతని సోదరుడు విజ్ఞప్తి చేశారు. రాకేశ్వర్‌ని విడుదల చేయాలి: ప్రొ.హరగోపాల్ మావోయిస్టుల ఆధీనంలో ఉన్న రాకేశ్వర్‌సింగ్‌ను వెంటనే విడుదల చేయాలని నిర్బంధ వ్యతిరేక వేదిక విజ్ఞప్తి చేసింది. ఆయన్ను విడుదల చేస్తామన్న మావోయిస్టులు తమ మాట నిలబెట్టుకోవాలని కోరింది. ఈ విష యంలో ప్రభుత్వాలు ముందడుగు వేయాలని వేదిక తరఫున ప్రొ.జి.హరగోపాల్, కనీ్వనర్, కోకనీ్వనర్లు ప్రొ.జి.లక్ష్మణ్, ఎం.రాఘవాచారి, కె.రవిచందర్ ఓ ప్రకటనలో కోరారు. చదవండి: మావోయిస్టుల కీలక ప్రకటన: రాకేశ్వర్‌ను విడిచిపెడతాం -
మన్యంలో మావోయిస్టుల ఘాతుకం
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని సింహాచలం ప్రాంతంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీస్ ఇన్ఫార్మర్గా అనుమానించి గెమ్మెలి కృష్ణారావు అనే గిరిజనుడిని దారుణంగా హతమార్చారు. ఈ ఘటన జి.మాడుగుల మండలం వాక పల్లె గ్రామం సోమవారం జరిగింది. కృష్ణారావును హత్య చేసి మావోయిస్టులు అక్కడ ఒక లేఖనును వదిలి వెళ్లారు. ఏ పాపం ఎరుగని తన భర్తను ఈ తెల్లవారుజామున ఇంటి నుంచి ఇద్దరు మావోయిస్టులు లాక్కెళ్లి, చంపేశారని మృతుని భార్య భోరున విలపించింది. ముక్కుపచ్చలారని తన ముగ్గురు పిల్లలు, తాను అనాధగా మిగిలిపోయామని కన్నీరుమున్నీరైంది. కాగా, ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఇద్దరు మావోయిస్టులను పోలీసులు హతమార్చిన గంటల వ్యవధిలోనే ఇన్ఫార్మర్ పేరిట గిరిజనుడిని హతమార్చడంతో మన్యంలో అలజడి మొదలైంది. పోలీసు ఇన్ఫార్మర్లుగా ఉంటూ ఆదివాసీల హక్కుల్ని కాలరాస్తున్నారని, కృష్ణారావు వైఖరిపై మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. -
సుక్మాలో ఎదురు కాల్పులు
సాక్షి, ఛత్తీస్‌గఢ్: సుక్మాలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఐదుగురు మావోయిస్టులను పట్టుకున్న పోలీసులు.. వారి నుంచి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల ఏరివేత చర్యల్లో భాగంగా పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అటవీ ప్రాంతంలో పెద్దసంఖ్యతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మావోయిస్టులు కోసం అడుగడుగునా జల్లెడ పడుతున్నారు. ఆ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతుంది. -
అడవంతా జల్లెడ!
సాక్షి, హైదరాబాద్/ మల్హర్: తెలంగాణలో గెరిల్లా ఆర్మీ (మెరుపుదాడులకు దిగే ప్రత్యేక దళాలు)ని బలోపేతం చేయాలని మావోయిస్టులు నిర్ణయించా రనే సమాచారంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమ య్యారు. దండకారణ్యం సరిహద్దుల్లో మావోల వేటను ముమ్మరం చేశారు. అణువణువూ జల్లెడ పడు తున్నారు. గతకొంత కాలంగా తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో మావోయిస్టుల కదలికలు క్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. దానికి తోడు డిసెం బరు 2 నుంచి 8వ తేదీ వరకు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) వారోత్సవాలు ఉండటంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. అడవుల్లో మావోలు సభలు, సమావేశాలు నిర్వహించకుండా అడ్డుకోవాలని భావిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఓవైపు ప్రతిష్టాత్మకమైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల కోసం నగరంలో 52 వేల మంది పోలీసులను బందోబస్తులో ఉంచినప్పటికీ... మరోవైపు సరిహద్దులను డేగ కళ్లతో పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఇటీవల పోలీసుశాఖలో కొత్తగా చేరిన దాదాపు 10 వేల మంది పోలీసుల్లో మెరికల్లాంటి యువకులను మావోల వేటకు వినియోగిస్తున్నారు. మావోల అన్వేషణలో తలపండిన సీనియర్లు, రిటైర్డ్ పోలీసు ఆఫీసర్ల పర్యవేక్షణలో సరిహద్దుల్లో అణువణువూ గాలిస్తున్నారు. వీరికితోడుగా సీఆర్పీఎఫ్ బలగాలు కూడా కూంబింగ్‌లో పాల్గొంటున్నాయి. రాష్ట్రాల సరిహద్దులపై నిఘా.. పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ సరిహద్దులపై పోలీసులు నిఘా పెంచారు. ముఖ్యంగా ప్రాణహిత, గోదావరి నదులపై అత్యాధునిక డ్రోన్లతో పర్యవేక్షణ జరుపుతున్నారు. రాత్రిపూట మావోయిస్టులు నదులను దాటుకుని రాకపోకలు సాగించే అవకాశాలు ఉండటంతో ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇక సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో పగలు, రాత్రి నిర్విరామంగా కూంబింగ్ కొనసాగిస్తున్నారు. ఏజెన్సీ మండలాలకు వెళ్లే అన్ని మార్గాల్లో తనిఖీలు విస్తృతం చేశారు. ఇదేవిధంగా మారుమూల గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు మైదాన ప్రాంతాలకు వెళ్లాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. పీఎల్జీఏది ప్రత్యేకస్థానం మావోయిస్టు పార్టీలో పీఎల్జీఏకు ప్రత్యేకస్థానం ఉంది. ఈ ఏడాది ఘనంగా వారోత్సవాలు నిర్వహించాలని, తెలంగాణలో ఈ విభాగాన్ని పటిష్టం చేయాలని అగ్రనాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కాల్పులు, బాంబు పేలుళ్లు, ఆంబుష్ దాడులు నిర్వహించడంలో ఈ విభాగానికి ప్రావీణ్యం ఉంది. చత్తీస్‌గఢ్, ఒడిషా అరణ్యాలలో ఎంతో పటిష్టంగా ఉన్న పీఎల్జీఏ విభాగాన్ని తెలంగాణలో బలోపేతం చేయాలని, కొత్త యువకులను ఆకర్షించాలని మావోయిస్టు కేంద్ర కమిటీ ఇటీవల ఆదేశించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రా, ఒడిషా, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని అడవుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు పీఎల్జీఏ వారోత్సవాల్లో పాల్గొంటారని, ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో పార్టీ బలోపేతానికి సంబంధించి ఎలాంటి పంథా అనుసరిస్తారన్న విషయంలో పోలీసులు ఉత్కంఠతో ఉన్నారు. ఈ సమావేశాలకు సంబంధించి ఇంటిలిజెన్స్ విభాగం ఇప్పటికే సమాచార సేకరణలో నిమగ్నమైంది. తృటిలో తప్పించుకున్న కంకణాల తెలంగాణలో వేళ్లూనుకునేందుకు యత్నిస్తోన్న మావోయిస్టులు గోదావరి, ప్రాణహిత పరిసరాల్లోని కొన్ని ప్రాంతాల్లో పట్టు సాధించగలిగారు. ఆదివాసీల సాయంతో ఆశ్రయం పొందగలుగుతున్నారు. ఇలాంటి వారిలో మావోయిస్టు కొత్తగూడెం డివిజన్ కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి కూడా ఒకరు. ఇతని దళం గతవారం కూంబింగ్ చేస్తోన్న పోలీసుల నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకుంది. పక్కా సమాచారంతో కూంబింగ్‌లోకి దిగిన పోలీసులకు కాటారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని సింగారం రిజర్వ్‌ఫారెస్ట్‌లో రాజిరెడ్డి దళం ఎదురుపడింది. పోలీసులను చూస్తూనే వారు కాల్పులు జరిపి తప్పించుకున్నారు. ఈ ఎన్కౌంటర్లో ఇరుపక్షాల్లో ఎవరికీ గాయాలు కాలేదు. వీరు గోదావరి నది దాటి చత్తీస్‌గఢ్‌కు వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్లా, ఎర్రం, శీలంల... యాదిలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొయ్యూర్ ఎన్‌కౌంటర్‌కు బుధవారంతో 21 ఏళ్లు నిండుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మల్హర్ మండలం కొయ్యూర్ అటవీ ప్రాంతంలో 2 డిసెంబర్ 1999న జరిగిన ఎన్కౌంటర్లో అప్పటి పీపుల్స్‌వార్ కేంద్ర కమిటీ సభ్యులు నల్లా ఆదిరెడ్డి అలియాస్ శ్యాం, ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి అలియాస్ మహేష్, ఉత్తర తెలంగాణ కార్యదర్శి శీలం నరేష్ అలియాస్ మురళి నేలకొరిగారు. అప్పట్లో ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో నక్సల్స్ ప్రాబల్యం బలంగా ఉండేది. అలాంటి సమయంలో ముఖ్యనేతలు మరణించడం ఉద్యమానికి పెద్ద ఎదురుదెబ్బగా పరిగణిస్తారు. ఈ ముగ్గురు నేతలు మరణించాక సరిగ్గా ఏడాదికి డిసెంబరు 2, 2000న పీఎల్జీఏను ఏర్పాటు చేశారు. వారికి నివాళిగా ఏటా డిసెంబర్ 2 నుంచి మావోయిస్టులు పీఎల్జీఏ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అలాగే మృతుల స్మారకంగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామంలో మావోయిస్ట్ నాయకులు 53 అడుగుల ఎత్తయిన స్థూపాన్ని నిర్మించారు. దీన్ని 2005 నవంబర్ 13న కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఆవిష్కరించారు. -
మావోయిస్టు మిలీషియా సభ్యుడు అరెస్ట్
సాక్షి, ములుగు : సిపిఐ మావోయిస్టు మిలీషియా సభ్యుడు లక్ష్మయ్య శనివారం అరెస్ట్ అయ్యారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని అలుబాక, కొండాపూర్ బ్రిడ్జి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులను చూసి పారిపోతున్న వ్యక్తిని పట్టుకొని విచారించగా మావోయిస్టు మిలీషియన్ సభ్యుడైన లక్ష్మయ్యగా గుర్తించారు. లక్ష్మయ్యను అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి కార్డేక్స్ వైర్,జిలిటెన్ స్టిక్స్ లు 2, 2 టిఫిన్ బాక్సులు 2 డిటోనేటర్,1 తూటలు స్వాధీనం చేసుకన్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. -
కాల్చి చంపారు: మావోయిస్టు భాస్కర్ ఆగ్రహం
సాక్షి, మంచిర్యాల: మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, కుమురం భీం, మంచిర్యాల (కేబీఎం) డివిజన్ కమిటీకి సారథ్యం వహిస్తున్న మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ పేరిట ఓ లేఖ విడుదలైంది. కాగజ్ నగర్ మండలం కందంబ అడవుల్లో ఎన్కౌంటర్ బూటకమని లేఖలో భాస్కర్ పేర్కొన్నారు. దానిని ఖండిస్తున్నామని తెలిపారు. తమ దళ సభ్యులను పోలీసులు పట్టుకొని కాల్చిచంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన చుక్కాలు, బాజీరావును పోలీసులు చుట్టిముట్టి కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. బూటకపు ఎన్కౌంటర్లకు బాధ్యులైన టీఆర్ఎస్, బీజేపీ నేతలకు ప్రజల చేతిలో శిక్షలు తప్పవ భాస్కర్ హెచ్చరించారు. తెలంగాణలో ప్రజలపై జరుగుతున్న పాశవిక అనుచివేతకు తాజా ఎన్‌కౌంటరే ఉదాహరణ అని అన్నారు. 2022 నాటికి విప్లవోద్యమాన్ని అణిచివేసే ఉద్దేశ్యంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. కామ్రేడ్ చుక్కాలు, బాజీరావ్‌లు అమరులయ్యారని, ఇంతటితో విప్లవోద్యమం ఆగదని చెప్పారు. తెలంగాణ విప్లవోద్యమంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. నూతనంగా పార్టీలో చేరిన బాజీరావు నింపిన పోరాటపటిమ ఉమ్మడి ఆదిలాబాద్‌లో చిరస్థాయిగా నిలుస్తుందని భాస్కర్ లేఖలో పేర్కొన్నారు. కామ్రేడ్స్ చుక్కాలు, బాజీరావు అమరత్వం, త్యాగం వృధా కానివ్వమని అన్నారు. కాగా, కాగజ్‌నగర్ మండలంలోని కదంబ అడవుల్లో శనివారం రాత్రి పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్టు వార్తలు వెలుడిన సంగతి తెలిసిందే. ఆ ఎన్కౌంటర్ నుంచి కేబీఎమ్ డివిజన్ కమిటీ నాయకుడు భాస్కర్ తృటిలో తప్పించుకున్నాడని సమాచారం. (చదవండి: కదంబా అడవుల్లో ఎన్కౌంటర్) -
మావోయిస్టుల పలాయనం
బరంపురం: కొందమాల్ జిల్లాలో రెండు రోజులుగా మావోయిస్టులు, సీఆర్పీఎఫ్, ఎస్ఓజీ జవాన్ల మధ్య రెండు వేర్వేరు అటవీ ప్రాంతాల్లో జరిగిన ఎదురు కాల్పుల సంఘటనలలో రెండు మావోయిస్టుల శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేసి భారీగా సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు కొందమాల్ ఎస్పీ వినీత్ అగర్వాల్ తెలియజేశారు. శనివారం సాయంత్రం జిల్లా హెడ్‌క్వార్టర్ పుల్బణిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వినీత్ అగర్వాల్ మాట్లాడుతూ జిల్లాలోని బల్లిగుడ పోలీస్‌స్టేషన్ పరిధి కలహండి జిల్లా సరిహద్దు పంగిబాజు అటవీ ప్రాంతంలో గురువారం మావోయిస్టులు, ఎస్ఓజీ, సీఆర్పీఎఫ్ జవాన్ల మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు జరగడంతో తాళలేక మావోయిస్టులు తప్పించుకున్నారు. పంగిబాజు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు విడిచి వెళ్లిన శిబిరాన్ని పోలీసులు ధ్వంసం చేసి భారీగా మావోయిస్టు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అలాగే శుక్రవారం తుమ్ముడిబొంద పోలీస్ స్టేషన్ పరిధిలో గల బురానహి దక్షిణ రిజర్వ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పులతో తట్టుకోలేక మావోయిస్టులు తప్పించుకున్నట్లు చెప్పారు. బురానహి దక్షిణ రిజర్వ్ శిబిరాన్ని వీడి మావోయిస్టులు పారిపోవడంతో పోలీసులు శిబిరాన్ని ధ్వంసం చేశారు. అయితే వేర్వేరు కాల్పుల సంఘటనలలో మావోయిస్టులు ఎవరూ మృతి చెందలేదని తెలియజేశారు. తప్పించుకున్న మావోయిస్టుల శిబిరంలో సిపిఐ మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకుడు మురళి ఉన్నట్లు ఎస్పీ తెలియజేశారు. మావోయిస్టులు వీడి పారిపోయిన శిబిరాల్లో భారీ విస్ఫోటక సామగ్రితో పాటు మూడు విదేశీ తుపాకులు, రెండు ప్లాస్టిక్ పెట్టెలు, ఔషధాలు, ప్లాస్టిక్ కవర్లు, విప్లవ సాహిత్యం, మావోయిస్టు దుస్తులు, వాటర్ బాటిల్స్, విద్యుత్ తీగలు, సిరంజిలు, నిత్యావసర సామగ్రి ఉన్నట్లు ఎస్పీ వివరించారు. కొనసాగుతున్న కూంబింగ్ కొందమాల్–కలహండి జిల్లాల సరిహద్దులకు మోహరించిన అదనపు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. స్థాని క పోలీసుల సహకారంతో మావోయిస్టుల అచూకీ కోసం దట్టమైన అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. -
అసలీ గణపతి అవతారం నేపథ్యమేమిటి?
గణపతి... భారత మావోయిస్టు పార్టీకి సుదీర్ఘకాలం దళపతిగా పనిచేసిన వ్యక్తి. ఆ పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎల్లలు దాటించి జాతీయస్థాయి కల్పించిన వ్యూహకర్తల్లో ప్రథముడు. ప్రపంచంలో టాప్ టెన్ తిరుగుబాటు గెరిల్లా సైన్యాల్లో ఒకటైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) మావోయిస్టు పార్టీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నది. అటువంటి గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు అనారోగ్య కారణాలతో ప్రభుత్వానికి లొంగిపోబోతున్నాడని కొన్ని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. మావోయిస్టు పార్టీ ఈ వార్తలను అధికారికంగా ఖండించింది. ప్రభుత్వాలు, పోలీసుల కుట్రలో భాగమే ఇటువంటి వార్తలని ఆ పార్టీ ఆరోపించింది. అసలీ గణపతి అవతారం నేపథ్యమేమిటి? ఈ అవతారంతో ప్రస్తుత సమాజానికి ఉపయోగం ఏదైనా ఉన్నదా? ఆయన లొంగిపోతే ఎవరికి నష్టం.. ఎవరికి లాభం?. ఈ సందర్భంలో తలెత్తే ఇటువంటి సహజమైన సందేహాలు తీరాలంటే ఈ దేశంలో గడిచిన యాభయ్యేళ్లలో సంభవించిన కొన్ని పరిణామాలపై కనీసం ఒక విహంగ వీక్షణం అవసరం. తన యవ్వన తేజస్సుతో సమస్త భూమండలాన్ని వెలిగించిన కాలం మన చరిత్రలో ఒకటుంది. అది ఒక దశాబ్దకాలం. ఇరవయ్యో శతాబ్దంలోని అరవయ్యో దశకం. ఐదు ఖండాల్లోని యువతరం సకల జీవన రంగాల్లోని సంప్రదాయ పోకడలపై ధిక్కారస్వరం వినిపించిన కాలం అది. బ్రిటన్ ఆ కాలాన్ని ‘స్వింగింగ్ సిక్ట్సీస్’ అని పిలిచింది. ఫ్రాన్స్‌లో విద్యార్థుల ఉద్యమ తాకిడికి ఛార్లెస్ డిగాల్ ప్రభుత్వం గడగడలాడింది. యూరప్ అంతటికీ ఆ ఉద్యమం వ్యాపించింది. అమెరికాలో పౌరహక్కుల కోసం మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్ ఆధ్వర్యంలో ఉద్యమాలు నడిచిన కాలం. ఆఫ్రికాలోని కాంగో నుంచి లాటిన్ అమెరికాలో బొలీవియా వరకు చేగువేరా విప్లవ శంఖారావాలు చేసిన కాలం. సంగీత ప్రపంచంలో ధిక్కార స్వరం బీటిల్స్. సంప్రదాయ జీవన విధానాలపై అభిశంసన, అవిశ్వాస ప్రకటనగా వెలుగులోకి వచ్చిన హిప్పీ సంస్కృతి ఈ కాలం వేసిన చిగుళ్లే. ఈ స్థాయిలో యువతరం కాలగమనాన్ని శాసించిన సందర్భం మరొకటి లేదు. అరవయ్యో దశకం ఉద్యమాల ప్రభావం ఆ తర్వాత దశాబ్దంలో కూడా కొనసాగింది. ప్రపంచమంతటా వీస్తున్న కొత్త గాలులు భారతదేశంలో కూడా వ్యాపించాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో రకరకాల సమస్యలపై విద్యార్థులు ఉద్యమించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని విద్యార్థులే నిర్మించి 350 మంది ప్రాణత్యాగం చేశారు. వీటితోపాటు గణపతి అవతారానికి దారితీసిన పూర్వరంగం కూడా సిద్ధమైంది. ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీది వందేళ్ల చరిత్ర. 1920లో ఏర్పడింది. ఈ వందేళ్ల చరిత్రలో వ్యూహాత్మక తప్పిదాలు చేయడంలో తన రికార్డులను తనే అనేకసార్లు బద్దలుకొట్టుకున్నది. స్వాతంత్య్రం కోసం దేశ ప్రజలంతా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొంటున్న సమయంలో ఆ ఉద్యమాన్ని వ్యతిరేకించి కమ్యూనిస్టు పార్టీ ప్రజలకు దూరమైంది. ఆ తర్వాత కాలంలో నిజాం సంస్థానంలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాల ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో, ట్రావెన్కోర్ సంస్థానంలో ఉన్న పున్నప్రా – వాయిలార్ పోరాటాల ఫలితంగా కేరళలోను, ‘తెభాగా’ రైతు ఉద్యమం కారణంగా బెంగాల్లోనూ, బట్టల మిల్లుల కార్మికులను సమీకరించి బొంబాయిలోనూ ఆ పార్టీ నిలదొక్కుకోగలిగింది. భారత్‌కు మిత్రుడిగా నటిస్తూ వెన్నుపోటు పొడిచిన చైనా మన దేశ భూభాగాలను దురాక్రమణ చేసిన సందర్భంలోనూ కమ్యూనిస్టు పార్టీలోని ఒక వర్గం చైనాకు మద్దతుగా మాట్లాడింది. వీళ్లందరినీ భారత ప్రభుత్వం జైళ్లలో పెట్టింది. బయటకు వచ్చిన తర్వాత వీళ్లంతా పార్టీని చీల్చి సీపీఎంగా ఏర్పడ్డారు. ప్రపంచవ్యాప్త తిరుగుబాటు గాలుల ప్రభావం సీపీఎంను నిలువునా చీల్చింది. బెంగాల్లో చారుమజుందార్, కానూ సన్యాల్‌ల నాయకత్వంలో నక్సల్బరీ విప్లవ పార్టీ ఆవిర్భవించింది. వీళ్లు నక్సలైట్లుగా వాడుకలోకి వచ్చారు. ఈ ప్రభావంతో శ్రీకాకుళంలో గిరిజన పోరాటాలు మొదలయ్యాయి. ఉస్మానియాలో జార్జిరెడ్డి అనే ఉద్యమ కెరటం ఎగసిపడింది. అతిచిన్న వయసులోనే ఆయన హత్యకు గురైనప్పటికీ, ఆ తర్వాత రెండు దశాబ్దాలపాటు విద్యార్థి ఉద్యమాలను జార్జిరెడ్డి నామస్మరణే శాసించింది. అనంతర కాలంలో వందలాదిమంది విద్యార్థులు నక్సల్స్ బలగాల్లో చేరిపోయారు. దేశవ్యాప్తంగా వందకు పైగా గ్రూపులుగా ఈ నక్సల్స్ చీలిపోయారు. అనేకమార్లు కూడికలు, తీసివేతలు జరిగిన అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పీపుల్స్‌వార్ గ్రూప్, బిహార్‌లో పనిచేస్తున్న మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ (ఎంసీసీ) రెండు బలమైన గ్రూపులుగా నిలదొక్కుకున్నాయి. పీపుల్స్‌వార్ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య నిష్క్రమణ అనంతరం ఆ పార్టీ నాయకునిగా గణపతి ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీకి ముందు కరీంనగర్ జిల్లాలో స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న ముప్పాళ్ల లక్ష్మణరావు, గ్రామసీమల్లో భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న విప్లవ కమ్యూనిస్టు పార్టీల పట్ల ఆకర్షితుడయ్యాడు. విద్యార్థులు, యువకులతో కలిసి గ్రామీణ పేదలను ఆర్గనైజ్ చేసి భూస్వామ్య వ్యతిరేక పోరాటాల్లో పాల్గొన్నారు. ఈ పోరాటాలు ఎంత బలమైన ముద్ర వేశాయంటే 1978లో జరిగిన ‘జగిత్యాల జైత్రయాత్ర’ సభకు లక్షల సంఖ్యలో గ్రామీణ పేదలు హాజరయ్యేంతగా. ఈ పరిణామంతో ఉత్తర తెలంగాణలోని భూస్వాములంతా గ్రామాలను వదిలేసి పట్టణాలకు వెళ్లిపోయారు. ఈ ప్రాంతంలో కొంతకాలం పీపుల్స్‌వార్ సమాంతర పాలన నడిచింది. గణపతి నాయకత్వంలో మరింత మిలిటెంట్ సంస్థగా పీపుల్స్‌వార్ తయారైంది. నక్సల్స్ – పోలీసు ఎన్కౌంటర్లు, దాడులు, ప్రతిదాడులతో దాదాపు దశాబ్దకాలంపాటు ఉత్తర తెలంగాణ పల్లెలు దద్దరిల్లిపోయాయి. ప్రత్యేకంగా యాంటీ–నక్సల్స్ దళాలను ఏర్పాటు చేసుకుని చివరకు పోలీసులు పైచేయి సాధించారు. పీపుల్స్‌వార్ దళాలు గోదావరి నదిని దాటి దండకారణ్యం వైపు, బస్తర్ అడవులు, చంద్రాపూర్ అడవుల వైపు సాగిపోయాయి. ఇంద్రావతి పరీవాహక ప్రాంతంలో ప్రధాన స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గణపతి చొరవతో మరో బలమైన నక్సల్స్ పార్టీగా ఉన్న ఎంసీసీలో పీపుల్స్‌వార్ విలీనమై మావోయిస్టు పార్టీగా అవతరించింది. ఈ ఐక్య పార్టీలోను కీలకమైన నాయకత్వ స్థానాలు పాత పీపుల్స్‌వార్ నేతలకే దక్కాయి. కార్యదర్శిగా గణపతి కొనసాగారు. రెండేళ్ల క్రితం అనారోగ్య కారణాలతో కార్యదర్శి బాధ్యతల నుంచి గణపతి తప్పుకున్నారు. ఆ స్థానంలో మరో తెలుగువాడైన శ్రీకాకుళం జిల్లాకు చెందిన నంబాల కేశవరావు వ్యవహరిస్తున్నారు. మావోయిస్టు పార్టీని బెంగాల్ దాకా విస్తరింపజేసిన వ్యూహకర్త కిషన్‌జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వరరావు కూడా తెలుగువాడే. కరీంనగర్ జిల్లా స్వస్థలం. మూడున్నర దశాబ్దాలుగా పాతుకుపోయిన సీపీఎం సర్కార్‌ను కూకటివేళ్లతో సహా పెకిలించిన నందిగ్రామ్ పోరాట రూపశిల్పి కిషన్‌జీ. తాను అధికారంలోకి రావడానికి పరోక్ష కారణమైన కిషన్‌జీని అనంతర కాలంలో మమతా బెనర్జీ ప్రభుత్వం ఎన్కౌంటర్ చేసి చంపడం కొసమెరుపు. ప్రస్తుతం గంగాతీరం నుంచి గోదావరి తీరం వరకు విస్తరించిన బిహార్, జార్ఖండ్, బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర అటవీ ప్రాంతాల మీదుగా తెలంగాణ, ఆం్ర«ధా సరిహద్దుల వరకు మావోయిస్టు పార్టీ ప్రభావం కనబడుతున్నది. ఇప్పుడు దేశంలో ఎన్ని కమ్యూనిస్టు గ్రూపులు పనిచేస్తున్నప్పటికీ మూడు మాత్రమే ప్రధానమైనవి. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిధిలో పనిచేస్తూ, ఎన్నికల్లో పాల్గొంటున్న సీపీఐ, సీపీఎం, సాయుధ పోరాట మార్గాన్ని అనుసరిస్తున్న మావోయిస్టు పార్టీ. అజ్ఞాతంలో పనిచేసే రెండు సాయుధ పార్టీలు విలీనం కాగలిగాయి కానీ, రెండు ఎన్నికల పార్టీలు మాత్రం విలీనం కాలేకపోయాయి. ఇక్కడే బ్యాలెట్ కమ్యూనిస్టులపై బుల్లెట్ కమ్యూనిస్టులు ఒక పాయింట్ స్కోర్ చేశారు. ఒక మనిషిని మరో మనిషి దోపిడీ చేసే ఆస్కారం లేని సోషలిస్టు సమాజ స్థాపన తమ లక్ష్యమని కమ్యూనిస్టులందరూ చెప్పుకుంటారు. అందువలన అణచివేతకు గురయ్యే పీడితవర్గాల ప్రజలు ఈ పార్టీలకు ప్రధాన బలగంగా ఉండాలి. కానీ, నిరుపేద వర్గాలైన దళితులూ, గిరిజనులు, వెనుకబడిన కులాల ప్రజలు మొదలైన పునాది వర్గాల్లో బ్యాలెట్ కమ్యూనిస్టులు నామమాత్రపు ఉనికిని కూడా కాపాడుకోలేకపోతున్నారు. మావోయిస్టు పార్టీ ప్రభావిత అటవీ ప్రాంతాల్లో కనీసం గిరిజన పునాదినైనా మావోయిస్టు పార్టీ కొంతమేరకు ఇంకా నిలబెట్టుకోగలిగింది. ఇక్కడ రెండో పాయింట్‌ను బుల్లెట్ కమ్యూనిస్టులు స్కోర్ చేశారు. దేశంలోని ఖనిజ సంపదలో 75 శాతం మావోయిస్టు ప్రభావిత అటవీ ప్రాంతంలోనే ఉంది. మావోయిస్టులు లేకుంటే మైనింగ్ మాఫియా తమను అడవుల నుంచి గెంటివేస్తుందనే అభద్రతాభావం గిరిజనుల్లో నెలకొని ఉన్న కారణంగా మావోయిస్టుల ప్రభావం ఇంకా అంతో ఇంతో కొనసాగుతున్నది. అయితే మైదాన ప్రాంత పీడిత వర్గాల్లో వారి పలుకుబడి శూన్యం. పేదవర్గాల ప్రజల అస్తిత్వ ఆకాంక్షలను గుర్తించడంలో, బలపరచడంలో సీపీఐ, సీపీఎంలు పూర్తిగా విఫలమయ్యాయి. ఫలితంగా పేదవర్గాల మద్దతును కోల్పోయి నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఏర్పడింది. దళిత పోరాటాల వెనుక, వెనుకబడిన వర్గాల ఆకాంక్షల వెనుక, స్త్రీవాద ఉద్యమాల వెనుక, వెనుకబడిన ప్రాంతాల డిమాండ్ల వెనుక కమ్యూనిస్టులు గట్టిగా నిలబడలేకపోయారు. అంతెందుకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో 50 వేలమంది పేదవారికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వతలపెట్టిన ఇళ్ల స్థలాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ధనిక రైతుల పక్షాన ప్రస్తుతం మైదాన కమ్యూనిస్టులు నిలబడ్డారు. వారి భాషలోనే చెప్పాలంటే పీడితవర్గాలను వదిలేసి పెటీ బూర్జువా వర్గాల అధికార ప్రతినిధులుగా వ్యవహరించే పరిస్థితి ఏర్పడింది. భారత కమ్యూనిస్టు ఉద్యమాల చరిత్రలో నక్సల్స్ దశ ప్రారంభమై యాభై ఏళ్లు దాటుతున్నది. ఈ యాభయ్యేళ్లలో ప్రపంచంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆర్థిక సంస్కరణలు, సాంకేతిక పురోగతి కారణంగా గతితార్కికవాదం, వర్గ పోరాటమూ, సాయుధ విప్లవం వంటి అంశాల ఔచిత్యం ప్రశ్నార్థకంగా మారింది. తర్వాత కాలంలో వచ్చిన యూరో కమ్యూనిజం, న్యూలెఫ్ట్, లాటిన్ అమెరికా బ్రాండ్ సోషలిస్టు ఉద్యమాలు ఈ భావజాలం నుంచి బయటకు వచ్చాయి. యాభై ఏళ్ల కింద ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రారంభమైన మావోయిస్టు సేనలు చాలావరకు సాయుధ పోరాటానికి స్వస్తి చెప్పాయి. భారత మావోయిస్టు పార్టీ కంటే పెద్దదయిన కొలంబియా ఎఫ్ఏఆర్సీ రెండేళ్ల కిందనే సాధారణ జనజీవితంలోకి వచ్చేసింది. ఇందుకు ప్రభుత్వం చిత్తశుద్ధి కూడా దోహదపడింది. పట్టుమని పదివేలమంది గెరిల్లాలు లేని మావోయిస్టులు అత్యంత బలోపేతమైన లక్షలాదిమంది సైనికుల బలం కలిగిన భారత ప్రభుత్వంతో సాయుధ పోరాటం చేయడం అసంభవం. మైదాన ప్రాంతాల్లో పార్టీ పలుకుబడి పెరిగే అవకాశాలు మృగ్యం. ఇటువంటి పరిస్థితుల్లో కొలంబియా మాదిరిగా ఆయుధాలు అప్పగించి ప్రజాస్వామ్య వ్యవస్థల్లో విలీనం కావడమే తెలివైన మార్గం. అయితే ఇందుకు ప్రభుత్వాల చిత్తశుద్ధి అవసరం. ప్రభుత్వాలకు మావోయిస్టులను వేటాడటమే లక్ష్యంగా ఉన్నంతకాలం ఈ పరిణామం సంభవించదు. ఈ దశలో గణపతి, మరికొందరు అగ్రనేతలు లొంగిపోతున్నారనే ప్రచారంపై మావోయిస్టుల అధికార ప్రకటనే నిజం కావచ్చు. అలాకాకుండా వేలాదిమంది సహచరులను వదిలేసి కొద్దిమంది అగ్రనేతలు మాత్రమే లొంగిపోతే యాభయ్యేళ్ల విప్లవ పోరాటానికి విషాదకరమైన ముగింపుగానే భావించాలి. వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
‘గణపతిని మావోయిస్టు పార్టీ వదులుకోదు’
హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు లొంగుబాటు వార్తల్లో నిజం లేదని మావోయిస్టు పార్టీ మాజీ సభ్యుడు జినుగు నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న స్పష్టం చేశారు. పోలీసులకు గణపతి లొంగిపోతున్నాడని, ఆ క్రమంలోనే సంప్రదింపులు జరిపినట్లు వస్తున్న వార్తలు అవాస్తమన్నారు. ఈ మేరకు ‘సాక్షి’తో మాట్లాడిన జంపన్న.. ‘గణపతికి అనారోగ్యం సమస్యలుంటే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ చూసుకుంటుంది. పోలీసుల స్టేట్మెంట్లో కూడా వాళ్లు వస్తే మేము సహకరిస్తామని మాత్రమే చెప్పారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో ఎలాంటి ప్రాంతీయ విభేదాలు లేవు. గణపతిని మావోయిస్టు పార్టీ వదులుకోదు.మావోయిస్ట్ పార్టీ ఎదుగుదలకు గణపతి ఎంతో కృషిచేశాడు. గణపతి లొంగుబాటు కేవలం ప్రచారం మాత్రమే. డీజీపీ ఏజన్సీ పర్యటనకు గణపతి లొంగుబాటుకు సంబంధం లేదు. తెలంగాణలో మావోయిస్ట్ పార్టీ ఉనికి కారణంగానే డీజీపీ పర్యటన ఉండొచ్చు. గణపతికి విదేశాల్లో చికిత్స అవాస్తవం. గణపతి లొంగిపోతాడని నేను అనుకోవడం లేదు’ అని జంపన్న తెలిపారు. గణపతి ఆచూకీపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఆయన ఆరోగ్యం క్షీణించిందని, త్వరలో లొంగిపోతాడని వస్తున్న వార్తలపై ఏపీ– తెలంగాణతోపాటు జాతీయ మీడియాలోనూ వరుస కథనాలు వస్తున్నాయి. తెలంగాణ పోలీసుల సహకారం మేరకు గణపతి లొంగుబాటుకు కేంద్రంతో చర్చలు జరుపుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, లొంగుబాటులోని సాధ్యాసాధ్యాలపై అనేక ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. ఓవైపు గణపతి ఇప్పటికే లొంగిపోవడానికి అంగీకరించాడని, మరికొన్ని రోజుల్లో లొంగుబాటు చూపుతారంటూ సాగుతున్న ప్రచారంపై పోలీసులు పెదవి విప్పడంలేదు. ఆయన లొంగిపోతే మాత్రం స్వాగతిస్తామని, ఎలాంటి ఇబ్బంది పెట్టబోమని భరోసా మాత్రమే ఇస్తున్నారు. -
మావో గణపతి.. ఎప్పుడొచ్చారు?
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత గణపతి ఆరోగ్యం క్షీణించిందని, ఆయన త్వరలోనే జన జీవన స్రవంతిలో కలుస్తారన్న ప్రచారం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. అసలు ఆయన విదేశాలకు దేని కోసం వెళ్లారు?.. అక్కడి నుంచి ఎప్పుడొచ్చారు?.. ఎందుకు వచ్చారు?.. అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానాలు దొరకడంలేదు. మావోయిస్టు కేంద్ర కార్యదర్శి పదవి నుంచి 2018 నవంబర్‌లో తప్పుకున్నాక గణపతి ప్రస్థానం సందేహంలో పడింది. ఆయన స్థానంలో నంబాల కేశవరావు కేంద్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ సీనియర్ పోలీసు ఉన్నతాధికారి గణపతి ఆచూకీపై సంచలన విషయం వెల్లడించారు. గణపతి ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం నుంచి బిహార్ మీదుగా నేపాల్ వెళ్లాడని, అక్కడ నుంచి ఫిలిప్పీన్స్‌కు వెళ్లిపోయాడని తమ వద్ద సమాచారం ఉందని పేర్కొన్నారు. మావోయిస్టుల టెలిఫోన్ సంభాషణలపై నిఘా ఉంచగా తమకు ఈ విషయం తెలిసిందని ఆయన అన్నారు. చివరిసారిగా కనిపించింది అక్కడే..! ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి కోసం పలు రాష్ట్రాల పోలీసులే కాకుండా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కూడా అన్వేషిస్తోంది. చివరిసారిగా 2017లో బిహార్‌లోని గయ ప్రాంతంలో సంచరించినట్లుగా నిఘా వర్గాలు అప్పట్లో పేర్కొన్నాయి. నేపాల్ మీదుగా ఫిలిప్పీన్స్‌కు వెళ్లడం కోసమే ఆయన అక్కడ ఉన్నట్లు విశ్లేషణలు ఉన్నాయి. గణపతిపై ఎన్ఐఏ రూ.15 లక్షల రివార్డు ప్రకటించింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిపితే ఆయన తలపై రూ.3.6 కోట్ల వరకు రివార్డు ఉంది. ఒకవేళ గణపతి విదేశాలకు వెళ్లిపోయేందుకు ప్రయత్నించి ఉంటే.. సదరు పోలీసు అధికారి కథనం నమ్మదగినదే అని పలువురు అంగీకరిస్తున్నారు. భారతీయులంతా బిహార్ ద్వారా రోడ్డు మార్గంలో నేపాల్‌కు వెళ్లడం సర్వసాధారణమే. అక్కడి నుంచి విమానాల్లో పలు దేశాలకు వెళ్లడం పెద్ద విషయమేమీ కాదు. భారతదేశంలో అశాంతికి పాల్పడే అంతర్జాతీయ ఉగ్ర సంస్థల సభ్యులు ఇదే పంథాను అనుసరిస్తారు. (చదవండి: కీలక నిర్ణయం తీసుకోనున్న మావో గణపతి) నేడు గణపతి.. నాడు కత్తుల సమ్మయ్య గతంలో లొంగిపోయిన కరీంనగర్ జిల్లా కాచాపూర్‌కు చెందిన కత్తుల సమ్మయ్య కూడా నక్సలైట్లలో ఉండగా పలుమార్లు విదేశాలకు వెళ్లిన దాఖలాలు ఉన్నాయి. అదే క్రమంలో 1993లో దళంతో విభేదించి.. తోటి సభ్యులను కాల్చిచంపిన అనంతరం అతడు పోలీసులకు లొంగిపోయాడు. తరువాత హైదరాబాద్‌లో కొందరు అవినీతి ఉన్నతాధికారుల పరిచయాలతో రియల్ ఎస్టేట్ వ్యవహారాలతో పాటు అనేక దందాలు నడిపాడు. 2001లో కొలంబోలో జరిగిన విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించాడు. ఫిలిప్పీన్స్‌కు ఎందుకు వెళ్లాడు? గణపతి.. ఫిలిప్పీన్స్‌కు వెళ్లి ఉంటే.. ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అనారోగ్యంతో ఉన్న ఆయన చికిత్స కోసమే వెళ్లారా? అక్కడ ఆయనకు ఆశ్రయం కల్పించిందెవరు? అన్న విషయాలు ఆసక్తికరంగా మారాయి. జీవితంలో అధిక భాగం దండకారణ్యంలో ఉన్న గణపతికి.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చక్కటి సంబంధాలు ఉన్నాయన్న పేరుంది. పార్టీకి పలువురు ప్రవాసీయుల నుంచి రూ.కోట్ల చందాలు తీసుకురావడంలో ఆయనది కీలకపాత్రగా పలువురు పేర్కొంటారు. నేపాల్, ఫిలిప్పీన్స్‌లోనూ మావోయిస్టు పార్టీ క్రియాశీలకంగా ఉండటం ఆయనకు కలిసి వచ్చిన అంశాలుగా పరిశీలకులు భావిస్తున్నారు. మంచి వ్యూహకర్త, సిద్ధాంతకర్త అయిన గణపతి.. మావోయిస్టు పార్టీకి అంతర్జాతీయ సంబం ధాల బలోపేతం కోసం ఫిలిప్పీన్స్ వెళ్లి ఉండొచ్చన్న ఊహాగానాలు ఉన్నాయి. (చదవండి: గణపతి లొంగుబాటుకు లైన్‌క్లియర్..!) -
మావోయిస్టు గణపతి లొంగుబాటుకు లైన్‌క్లియర్
-
గణపతి లొంగుబాటుకు లైన్‌క్లియర్..!
సాక్షి, హైదరాబాద్ : మావోయిస్టు పార్టీ అగ్రనేత ముపాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగుబాటుకు పోలీసుల నుంచి లైన్‌క్లియర్ అయ్యింది. 74 ఏళ్ల గణపతి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో ఉద్యమం నుంచి బయటకు వచ్చిపోలీసులకు లొంగిపోతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్పందించిన పోలీసు శాఖ గణపతి సహా ఎవరు లొంగిపోయినా స్వాగతిస్తామని ప్రకటించారు. గణపతి లొంగిపోవాలి అనుకుంటే కుటుంబసభ్యుల, బంధువులతో సంప్రదించవచ్చని తెలిపారు. పోలీసు వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. రానున్న రెండురోజుల్లో లొంగిపోయే అవకాశం ఉంది. ఆయనతో పాటు మరికొంతమంది సీనియర్ నేతలు, ఆయన అంగరక్షకులు కూడా లొంగిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లా బీర్పూర్ గ్రామానికి చెందిన గణపతి 40 ఏళ్ల పాటు విప్లయోధ్యమంలో కీలక పదవులు అనుభవించారు. అనారోగ్య కారణాలతో 2018 లో కేంద్ర కమిటీ కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన అనంతరం నంబాల కేశవరావు కేంద్ర కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. అయితే లొంగుబాటుపై ఆయన తీసుకునే అనూహ్య నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సుదీర్ఘకాలంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శిగా పనిచేసిన గణపతి వయసురిత్యా పోరాటానికి స్వస్తి పలికే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
కీలక నిర్ణయం తీసుకోనున్న మావో గణపతి
సాక్షి, కరీంనగర్: మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోయేందుకు యత్నిస్తున్నట్టు వార్తలు రావడం సంచలనంగా మారింది. సుదీర్ఘకాలంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శిగా పనిచేసిన గణపతి వయసురిత్యా పోరాటానికి స్వస్తి పలికే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన లొంగుబాటుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం. కుటుంబ సభ్యులతో మంతనాలు జరుపుతున్న ఆయన కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయి. కాగా, 74 ఏళ్ల గణపతి తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. మోకాళ్ల నొప్పులు, మధుమేహంతో సమస్యలు ఆయనను వెంటాడుతున్నాయి. గణపతి స్వస్థలం జగిత్యాల జిల్లా బీర్పూర్ గ్రామం. ఇక ఎంపీసీ, నక్సలైట్ పార్టీల విలీనం తర్వాత కేంద్ర కార్యదర్శిగా గణపతి పనిచేశారు. అనారోగ్య కారణాలతో 2018 లో ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన అనంతరం నంబాల కేశవరావు కేంద్ర కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. అనారోగ్య సమస్యలతో సతమవుతున్న గణపతి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి రాగానే లొంగుబాటుకు సిద్ధమవుతారని గత రాత్రి నుంచి కరీంనగర్ వ్యాప్తంగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన లొంగుబాటు నిజమే అయితే విప్లవోద్యమ చరిత్రలో పెద్ద కుదుపుగానే భావించాలి. మరోవైపు గణపతితోపాటు మరో నలుగురు మవోయిస్టు నేతలు కూడా లొంగుబాటు దిశగా పయనిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. (చదవండి: మావోయిస్టు కేంద్ర కమిటీ.. 10 మంది వారే..!) -
సరిహద్దు ప్రాంతాల్లో విస్తృతంగా కూంబింగ్
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర- ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. పెదబయలు అటవీ ప్రాంతంలో రెండు రోజుల క్రితం ఎన్కౌంటర్ జరిగిన పరిసరాల్లో రక్తపు మరకలు గుర్తించడంతో కూంబింగ్ ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కృష్ణారావు పేర్కొన్నారు. ఎన్కౌంటర్ జరిగిన పరిసర ప్రాంతాల్లో సీనియర్ మావోయిస్టు నేతల సమావేశం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పెదబయలు, రూడకోట, ముంచంగిపుట్లు పరిసర ప్రాంతాలను పోలీసుల బలగాలు జల్లెడ పడుతున్నాయి. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో తప్పించుకున్న వారిలో సీనియర్ మావోయిస్టు నాయకులున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు అదుపులో అమాయక గిరిజనులు ఉన్నారంటూ ఆంధ్రప్రదేశ్ హక్కుల సంఘం పత్రికా ప్రకటన ఇచ్చింది. అయితే మా అదుపులో అమాయకపు గిరిజనులు ఎవరూ లేరని జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు. (అడవిలో అలజడి) -
అడవిలో అలజడి
పాడేరు: ఏవోబీలో యుద్ధవాతావరణం నెలకొంది. మూడు రోజుల వ్యవధిలో రెండు సార్లు పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటనల్లో మావోయిస్టులు తప్పించుకోవడంతో వారి కోసం పోలీసులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో ఏక్షణంలో ఏం జరుగుతుందోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. పెదబయలు మండలంలోని గిన్నెలకోట పంచాయతీ లండులు, మెట్టగుడ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల సంచారాన్ని గుర్తించిన పోలీసు పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఇరు వర్గాల మధ్య ఆదివారం ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టులు తప్పించుకున్నారు. తుపాకీలు, కిట్ బ్యాగులను వదిలి తప్పించుకున్నట్టు తెలిసింది.ఈ ఎదురు కాల్పుల్లో ఇరు వర్గాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని సమాచారం. తప్పించుకున్న వారికోసం ఏవోబీని పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ నెల 16న ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా బలిమెల కటాఫ్ ఏరియాలోని ముకుడుపల్లి అటవీ ప్రాంతంలో ఒడిశా డీవీఎఫ్, ఎస్‌వోజీ బలగాలు, విశాఖ జిల్లా పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో తారసపడిన మావోయిస్టు దళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇరు పారీ్టల మధ్య 15 నిమిషాల పాటు కాల్పులు జరిగినప్పటికీ ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఎప్పటికప్పుడు సమీక్ష ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగంతో సమీక్షిస్తున్నారు. విశాఖ ఏజెన్సీతో పాటు సరిహద్దులోని ఒడిశా అటవీ ప్రాంతాల్లో ఇరురాష్ట్రాల పోలీసులు విస్తృత కూంబింగ్ నిర్వహిస్తున్నారు. లాక్డౌన్ తర్వాత తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని పోలీసులు, మావోయిస్టులు గతంలో ప్రకటించారు. అయితే ఇటీవల మావోయిస్టు పార్టీ ఏవోబీలో తమ కార్యకలాపాలను విస్తృతం చేయడంతో పాటు ఎక్కడికక్కడ గిరిజనులతో సమావేశాలు నిర్వహిస్తూ కొత్త రిక్రూట్‌మెంట్‌ను చేపడుతోందనే నిఘా వర్గాల సమాచారంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఏవోబీ వ్యాప్తంగా ఇరు రాష్ట్రాల పోలీసు బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. విశాఖ ఏజెన్సీకి సరిహద్దులో ఉన్న మల్కన్‌గిరి, కోరాపుట్టు జిల్లాలకు చెందిన పోలీసు పార్టీలు అటువైపు నుంచి కూంబింగ్ నిర్వహిస్తుండగా.. విశాఖ ఏజెన్సీ పోలీసుపారీ్టలు జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు, చింతపల్లి, జీకే వీధి మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో కూంబింగ్‌ను విస్తృతం చేశాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. -
విశాఖ ఏజెన్సీలో కాల్పులు కలకలం
సాక్షి, విశాఖపట్నం : ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో తుపాకులు మోతలు మోగుతున్నాయి. తాజాగా విశాఖ ఏజెన్సీలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. జిల్లాలోని పెదబయలు మండలం లండులు అటవీ ప్రాతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. గత కొంత కాలంగా మావోయిస్టులు సంచరిస్తున్నారని సమాచారం అందుకున్న బలగాలు.. ఆదివారం సాయంత్రం రెక్కీ నిర్వహించాయి. ఆ సమయంలోనే లండులు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారస పడటంతో పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య కొంత సమయం పాటు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. (మావోయిస్టు భాస్కర్ దశాబ్దాల అజ్ఞాతం) ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు వర్గాలు ప్రకటించాయి. అయితే సంఘటనా స్థలంలో మావోయిస్టులకు చెందిన సామాగ్రీ లభించినట్లు సమాచారం. కాగా గతకొంత కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్యక్రమాలను మావోయిస్టు పార్టీ వేగవంతం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలోని ఆదిలాబాద్, అసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో మావోయిస్టుల కార్యకలపాలపై పోలీసులు బలగాలు నిఘా పెట్టాయి. -
మావోయిస్టు భాస్కర్ దశాబ్దాల అజ్ఞాతం
సాక్షి,ఆదిలాబాద్: మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ ఉమ్మడి జిల్లా అడవుల్లో సంచారం తెలంగాణ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. భాస్కర్ దళాన్ని పట్టుకోవడమా లేదా తెలంగాణ నుంచి తరమికొట్టడమా అనే లక్ష్యంగా పోలీసుల కూంబింగ్ సాగుతోంది. అయితే ఈ మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్‌ది ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర సొంత గ్రామం. దళ సభ్యుడిగా నక్సల్ బరిలోకి దిగి దండకారణ్యంలో పని చేసి ప్రస్తుతం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కీలక బాధ్యతలు వహిస్తున్నాడు. దీంతో పోలీసులు ఆపరేషన్ భాస్కర్ లక్ష్యంగా ముందుకు కదులుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. భాస్కర్ నేపథ్యం.. బోథ్ మండలం పొచ్చెర గ్రామంలో జన్మించిన భాస్కర్ 10వ తరగతి వరకు బోథ్‌లోనే చదివారు. ఆ తర్వాత 1989–91 మధ్యలో నిర్మల్‌లో ఇంటర్ చేశారు. ఆ సమయంలో ర్యాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ) ప్రెసిడెంట్‌గా పని చేశారు. అభ్యుదయ భావాలు కలిగిన భాస్కర్ ఆ సమయంలోనే నక్సల్ బరి వైపు ఆకర్షితులయ్యారు. అంతకు ముందు విద్యార్థి దశలోనే 1989 కాలంలో భూపోరాటాలు విస్తృతంగా సాగుతున్న సమయంలో తానుకూడా అందులో పాల్గొన్నాడు. 1994–95 లో దళంలోకి ప్రవేశించాడు. బోథ్ దళ సభ్యుడిగా పని చేసి అక్కడి నుంచి ఇంద్రవెల్లి దళం డిప్యూటీ కమాండర్‌గా ఎదిగాడు. అక్కడి నుంచి కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు చత్తీస్ఘడ్ దండకారణ్యంలోకి వెళ్లాడు. 25 ఏళ్ల వయసులో భాస్కర్ దళంలో చేరినట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తోంది. ప్రసుతం 50 ఏళ్లు ఉంటాయని వారు చెబుతున్నారు. తల్లిదండ్రులు చనిపోయారు. భాస్కర్‌కు ముగ్గురు సోదరులు ఉండగా వారు ప్రస్తుతం పొచ్చెరలోనే వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. భాస్కర్ దళంలో పని చేస్తున్న సమయంలోనే సహచరురాలు కంతి లింగవ్వను వివాహం చేసుకున్నట్లు చెప్తారు. అయితే దళంలోకి వెళ్లిన తర్వాత సోదరులకు భాస్కర్‌తో సంబంధాలు దూరమయ్యాయి. రెండున్నర దశాబ్దాలుగా ఆయన అజ్ఞాతం కొనసాగుతోంది. రిక్రూట్మెంట్ కోసం.. కేంద్రం ఆపరేషన్ గ్రీన్ హంట్ విస్తృతంగా నిర్వహించడంతో ఛత్తీస్‌ఘడ్ దండకారణ్యం నుంచి బయటకు వచ్చినట్లు ప్రచారం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మార్చిలోనే ప్రవేశించినట్లుగా అనుమానిస్తున్నారు. బోథ్, సిరికొండ అటవీ ప్రాంతాల్లో సంచరించినట్లు పోలీసుల దృష్టిలో ఉంది. ప్రస్తుతం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో పోలీసులకు దళం తారస పడటంతో ఎదురు కాల్పులు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలోని ఓ మండలం నుంచి కొంత మంది యువకులు మిస్సింగ్ ఉండడంతోనే పోలీసులు దీన్ని సవాలుగా తీసుకుని ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. మావో రిక్రూట్మెంట్ అనుమానాలు పోలీసుల్లో బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పట్టుకోవడమో లేని పక్షంలో తరిమికొట్టడమో అనే రీతిలో అడవులను జల్లెడ పడుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కడే కాదు.. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్ సంచారం నేపథ్యంలో మరోసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకప్పటి నక్సల్ ఉద్యమాన్ని గుర్తుకు తెస్తున్నాయి. మంగీ, ఇంద్రవెల్లి, బోథ్, చెన్నూర్, సిర్పూర్, పిప్పల్‌ధరి, ఖానాపూర్ దళాలు ఒకప్పుడు అడవుల్లో అలజడి సృష్టించినవి. ఇదిలా ఉంటే ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికీ దళంలో సుమారుగా 20 మంది ఉన్నట్లు ప్రచారంలో ఉంది. అందులో కొంత మంది కీలక పదవుల్లో ఉండటం గమనార్హం. మే నెలలో బోథ్ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో వాల్‌పోస్టర్లు వెలిశాయి. ప్రజాపోరాట ముసుగులో నరహంతక నక్సలైట్లు అనే శీర్షికతో ఉన్నటు వంటి ఆ పోస్టర్లలో మావోయిస్టులకు సహకరించవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. భాస్కర్ తలపై ప్రస్తుతం రూ.20 లక్షల రివార్డు ఉంది. అయితే పోస్టర్లో రూ.8లక్షలుగా ఉండటం గమనార్హం. -
మావోయిస్టు గ్రామ కమిటీ లొంగుబాటు
భద్రాద్రి కొత్తగూడెం, చర్ల: మండలంలోని సరిహద్దు ప్రాంతంలో ఉన్న కుర్నవల్లి గ్రామ పంచాయితీకి మావోయిస్టు పార్టీ గ్రామ కమిటీకి చెందిన ఆరుగురు సభ్యులు ఆదివారం చర్ల పోలీస్ స్టేషన్లో భద్రాచలం ఏఎస్పీ రాజేశ్చంద్ర ముందు లొంగిపోయారు. ఈ సందర్భంగా ఏఎస్పీ రాజేశ్చంద్ర మాట్లాడుతూ మావోయిస్టుల వల్ల ప్రజలకు జరిగే లాభం ఏమీ లేదని, వారి వల్ల ప్రజలకు అన్ని విధాలుగా నష్టాలే జరుగుతుండటంతో గ్రామస్తులంతా ఏకమై గ్రామంలోని మావోయిస్టు పార్టీ గ్రామ కమిటీని రద్దు చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. సుమారు 200 కుటుంబాల వారు కలిసి గ్రామ కమిటీని రద్దు చేశారని, ఈ కమిటీలో కోరం నాగేశ్వరరావు, కొమరం రమేశ్, సోందె రమేశ్, కోరం సత్యం, ఇర్పా వెంకటేశ్వర్లు, వాగే కన్నారావు ఉన్నారని పేర్కొన్నారు. మావోయిస్టులకు ఎట్టి పరిస్థితిల్లోనూ సహకరించబోమని స్పష్టమైన హామీ ఇచ్చిన కుర్నపల్లి గ్రామస్తులకు పోలీసు శాఖతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు. గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చి గ్రామ కమిటీని రద్దు చేయడంతో పాటు ఇక నుంచి తామంతా ఐక్యంగా ఉండి మావోయిస్టులకు సహకరించబోమని ప్రకటించడం యావత్ రాష్ట్రంలోనూ సంచలమన్నారు. కుర్నపల్లి గ్రామస్తులను మిగిలిన అన్ని గ్రామాల వారు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చర్ల సీఐ తాళ్లపల్లి సత్యనారాయణ, సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ డీఎస్పీ ఎస్కే మండల్, ఎస్సైలు వెంకటప్పయ్య, రాజువర్మ తదితరులు పాల్గొన్నారు. -
దాడులు ఆపకపోతే..మినఫా తరహా ఘటనలే!
చర్ల: దండకారణ్యంలో పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేసి.. అమాయక ఆదివాసీలపై చేస్తున్న దాడులను ఆపకపోతే మినఫా తరహా ఘటనలకు పాల్పడక తప్పదని సీపీఐ మావోయిస్టు పార్టీ సౌత్ సబ్ జోనల్ బ్యూరో హెచ్చరించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ పేరిట ఒక లేఖను విడుదల చేశారు. అలాగే.. ఈ నెల 21న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలోని చింతుప్ప పోలీస్‌స్టేషన్ పరిధిలో గల మినఫా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల వివరాలు, ఆ సందర్భంలో మృతి చెందిన పోలీసు బలగాల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలకు సంబంధించి వివరాలు, పార్టీ వివరాలను వెల్లడించింది. సరిహద్దుల్లో ఉన్న సంపదను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నట్లు పార్టీ ఆరోపించింది. ఈ క్రమంలో మినఫాలో ఆదివాసీలతో మాట్లాడుతున్న పార్టీ కార్యకర్తలు, నాయకులపై పోలీసులు కాల్పులకు దిగడంతో సరైన రీతిలో బుద్ధి చెప్పి 19 మందిని మట్టుబెట్టడంతోపాటు 20 మందిని గాయపరిచి వెళ్లగొట్టామని తెలిపారు. ఈ క్రమంలో తమ పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు కూడా మృతి చెందారని పార్టీ పేర్కొంది. మృతి చెందిన వారిలో బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి ఏరియాలోని గోండుమెట్టకు చెందిన పార్టీ ప్లాటూన్ కమిటీ సభ్యుడు సక్రు, గంగులూరు ఏరియాలోని బుర్కేల్‌గ్రామానికి చెందిన పార్టీ సభ్యుడు రాజేష్, బైరంఘడ్ ఏరియాలోని గానార్ గ్రామానికి చెందిన సుక్కు మృతి చెందారని, వీరందరికి పార్టీ ఘనంగా నివాళులర్పించి అంత్యక్రియలు నిర్వహించిందని పార్టీ పేర్కొంది. ఈ దాడిలో చనిపోయిన జవాన్ల నుంచి 11 ఏకే 47 తుపాకులు, 2 ఇన్శాస్ తుపాకులు, ఒక ఎస్ఎల్ఆర్ అండ్ ఎల్ఎంజీ, 2 యూబీజీఎల్‌తోపాటు 1,550 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు లేఖలో వివరించింది. దండకారణ్యంలోని బస్తర్, రాజ్‌నందిగావ్, గడ్చిరోలి తదితర జిల్లాల్లో ఉన్న పోలీస్స్టేషన్లు, క్యాంపులను వెంటనే ఎత్తివేయాలని, లేకుంటే మినఫా తరహా దాడులకు దిగుతామంటూ పార్టీ ఈ లేఖలో హెచ్చరించింది. -
ఏవోబీలో భారీ డంప్ స్వాధీనం
సీలేరు (పాడేరు):విశాఖ ఏజెన్సీ ఆంధ్రా, ఒడిశా సరిహద్దు కటాఫ్ ఏరియాలో మావోయిస్టు పార్టీకి చెందిన భారీ డంప్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండేళ్లుగా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతలు, మిలీషియా సభ్యులు ఎదురు కాల్పుల్లో చనిపోవడం, కొందరు పోలీసులకు లొంగిపోతున్నారు. ఈ తరుణంలో మరో ఎదురు దెబ్బ తగిలింది. మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ పోలీసుస్టేషను పరిధిలో మావోయిస్టు పార్టీకి చెందిన భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ఇతర సామగ్రిని ఏపీ, ఒడిశా పారామిలటరీ జాయింట్ ఆపరేషన్ భారీ డంప్‌ను శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. లైట్ మెషీన్ గన్, 3 ఇన్సాస్ 3 కార్బన్, 1 ఎస్ఎల్ఆర్, 303– పిస్టల్, భారీగా బుల్లెట్లు, వీహెచ్ఎఫ్ సెట్, టిఫిన్ క్యారియర్ బాంబు, గన్ ఫౌడర్, పలు పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయి. అగ్రనేతల కోసం ముమ్మర గాలింపు ఆంధ్రా, ఒడిశా సరిహద్దు కటాఫ్ ఏరియాలో మావో యిస్టు అగ్రనేతలు తలదాచుకున్నట్లు పోలీసుల వద్ద పక్కా సమాచారం ఉంది. మావోయిస్టు అగ్రనేత ఆర్కే సైతం ఈ ప్రాంతంలో ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నివేదిక ద్వారా ఒడిశా పోలీసులు పది రోజుల కింద పత్రిక ప్రకటన చేశారు. అలాగే దళపతి, అరుణ తదితరులు ఉన్నారని, ఎలాగైనా వారిని పట్టుకోవాలని ఇరు రాష్ట్రాల బలగాలు ముమ్మర గాలింపు చేపడుతూ కూంబింగ్ చేపడుతున్నారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న డంప్‌ను కూడా ఇటీవల లొంగిపోయిన మాజీ మావోయిస్టుల ద్వారానే తెలుసుకున్నట్లు సమాచారం ఉంది. భారీగా లభ్యమైన పేలుడు పదార్ధాలు గతంలో ఒడిశా ప్రాంతంలోని పోలీసు స్టేషన్లపై దాడి చేసి స్వాధీనం చేసుకున్న సామాగ్రి అని భావిస్తున్నప్పటికి వాటిని పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. మరోసారి మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ తగలడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపధ్యంలో సరిహద్దుల్లో పోలీసులు అప్రమత్తమై ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
మావోయిస్టు కేంద్ర కమిటీ.. 10 మంది వారే..!
సాక్షి, హైదరాబాద్ : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో భారీ సంస్థాగత మార్పులు జరిగినట్టు తెలిసింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా నంబాల కేశవరావు (69) అలియాస్ బస్వరాజ్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి కావడంతో కేంద్ర కమిటీలో భారీ ప్రక్షాళన చేసినట్టు సమాచారం. 21 మంది సభ్యులతో నూతన కేంద్రకమిటీ ఏర్పాటైందని.. కమిటీలో తెలంగాణకు చెందిన 10 మంది, జార్ఖండ్ నుంచి నలుగురు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ నుంచి ఇద్దరు చొప్పున, బీహార్ నుంచి ఒకరికి అవకాశం కల్పించినట్టు వెల్లడైంది. తెలంగాణా నుంచి 10మంది.. 1. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, కరీంనగర్. 2. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ వివేక్, కరీంనగర్. 3. కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, ఆదిలాబాద్. 4. మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, కరీంనగర్. 5. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, కరీంనగర్. 6. కడారి సత్యనారాయణ అలియాస్ కోసా, కరీంనగర్. 7. మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్ , హైదరాబాద్. 8. పుల్లూరి ప్రసాద రావు అలియాస్ చంద్రన్న, కరీంనగర్. 9. గాజర్ల రవి అలియాస్ గణేష్, వరంగల్. 10. పాక హనుమంతు అలియాస్ ఉకే గణేష్, నల్గొండ. -
గుంత రేణుక అరెస్ట్
గద్వాల క్రైం/ఆత్మకూర్: నిషేధిత మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్నారనే నెపంతో గుంత రేణుక (ఏ6)ను బుధవారం గద్వాలలోని రామిరెడ్డి స్మారక గ్రంథాలయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆత్మకూర్ కోర్టుకు తరలించారు. జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఎల్కూర్కు చెందిన టీవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగన్న (నాగరాజు) నిషేధిత మావోయిస్టు పార్టీలోకి యువతను నియమిస్తున్నారన్న సమాచారం అందడంతో గత అక్టోబర్ 5న అతడిని అరెస్టు చేశారు. అదే నెల 7, 11న టీవీవీ బలరాం, ఓయూ ప్రొఫెసర్ జగన్‌ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. యువతను చేర్చుకుంటున్నారు.. నిషేధిత మావోయిస్టు పార్టీలోకి యువతను చేర్చుకుంటున్నారన్న సమాచారంతో ఈ కేసులోని ఆరుగురు సానుభూతిపరులను అరెస్టు చేశామని జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ అపూర్వరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు, విధ్వంసకర కార్యకలాపాలను నిర్వహించడానికి, మావోయిస్టు పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రమంతా వారు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. శిల్ప, రమేశ్‌లకు 14 రోజులు రిమాండ్.. హైదరాబాద్‌లో ఈ నెల 17న అరెస్టయిన చైతన్య మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చుక్కల శిల్ప, తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంచు రమేశ్‌లను కోర్టు 14 రోజుల రిమాండ్‌కు ఆదేశించింది. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆత్మకూర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో గద్వాల పోలీసులు వారిని హాజరుపర్చా రు. న్యాయమూర్తి జీవన్ సూరజ్‌సింగ్ 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో మహబూబ్‌నగర్ జిల్లా జైలుకు తరలించినట్లు సమాచారం. -
బాల నాయకుడుగా వెళ్లి.. బడానేతగా ఎదిగి
సాక్షి, సిద్దిపేట/ మద్దూరు: మావోయిస్టు పార్టీకి గుండెకాయలాంటి దండకారణ్యంలో పార్టీ విస్తరణలో కీలక భూమిక పోషించిన రామన్న అలియాస్ రావుల శ్రీనివాస్ అనారోగ్యంతో ఆదివాసీల మధ్య కన్నుమూశారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం బెక్కల్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ నాలుగు దశాబ్దాల క్రితం పదిహేనేళ్ల వయసులోనే ప్రజలకోసం ఆడవి బాటపట్టారు. దూల్మిట్టలో ఏడవ తరగతి చదువుతున్న సమయంలో ఆర్ఎస్యూ (రాడికల్ స్టూడెంట్స్ యూనియన్) భావాలకు ఆకర్షితుడయ్యారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో సాధారణ దళ సభ్యునిగా చేరారు. అప్పట్లో ఆయన వయసు 15 సంవత్సరాలే. పార్టీ నిర్మాణంలో చురుగ్గా పాల్గొని ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్.. ఇలా ఐదు రాష్ట్రాల్లో రామన్న కీలక నాయకుడిగా ఎదిగారు. 2010లో జరిగిన మవోయిస్టు పార్టీ సమావేశాల్లో రామన్నను కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమించారు. ఆయన తలపై వివిధ రాష్ట్రాలు రూ.1.5 కోట్ల రివార్డు ప్రకటించాయి. బీపీ షుగర్‌లతోనే.. తీవ్రమైన బీపీ, షుగర్ సమస్యలతో రామన్న తరచుగా ఆనారోగ్యానికి గురయ్యేవారు. రామన్న ఈనెల 10వ తేదీన అనారోగ్యంతో దండకారణ్యంలో కన్నుమూసినట్లు ఆ పార్టీ ప్రతినిధి వికల్ప్ ప్రకటించారు. -
భీతిల్లుతున్న మన్యం
గూడెంకొత్తవీధి(పాడేరు):మావోయిస్టు పార్టీలో 12 ఏళ్లపాటు వివిధ స్థాయిల్లో పనిచేసి, చాలాకాలం అజ్ఞాతంలో గడిపాడు, అరెస్ట్ అయ్యి మూడేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చి చివరకు వారి చేతుల్లో బలయ్యాడు. జీకే వీధి మండలం పెదపాడు గ్రామానికి చెందిన తాంబేలి లంబయ్య అలియాస్ దివుడును పోలీస్ ఇన్ఫార్మర్ పేరుతో మావోయిస్టులు హతమార్చడంతో ఏజెన్సీలో కలకలం రేగింది. ఇన్ఫార్మర్ల నెపంతో మావోయస్టుల చేతిలో హత్యకు గురైన వారిలో దివుడు మూడో వ్యక్తి. వరుస హత్యలతో ఏజెన్సీ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇన్ఫార్మర్లుగా ముద్రపడిన వారు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఎవరిని మావోయిస్టులు హత్య చేస్తారో తెలియక భీతిళ్లుతున్నారు. సంఘటన స్థలం వద్ద లభ్యమైన తూటా ఉద్యమం కోసం పుష్కర కాలం శ్రమించి, ఇప్పుడు కుటుంబ సభ్యులతో జీవనం గడుపుతున్న లంబయ్య(48)ను హత్య చేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టుల ఉద్యమంవైపు ఆకర్షితుడైన లంబయ్య ఆ పార్టీలో చేరి,వివిధ స్థాయిల్లో పనిచేసి గాలికొండ దళ సభ్యునిగా ఎదిగాడు. సుమారు 12ఏళ్ల పాటు దళంలో చురుగ్గా వ్యవహరించి అనేక సంఘటనల్లో పాల్గొన్నాడు. చాలా కాలం అజ్ఞాతంలో గడిపాడు. 2011లో చెరుకుంపాకల ఎదురుకాల్పుల ఘటనలో పోలీసులకు ఆయుధాలతో పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు లంబయ్యను అరెస్టు చేసి జైలుకు పంపారు. మూడేళ్ల పాటు విశాఖ కారాగారంలో శిక్ష అనుభవించి, 2013లో లంబయ్య బెయిల్‌పై విడుదలై గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బెయిల్‌పై వచ్చిన లంబయ్య తరచూ కోర్టు వాయిదాల నిమిత్తం విశాఖ, నర్సీపట్నం ప్రాంతాలకు వెళ్లివస్తుండేవాడు. ఈ ఆరేళ్ల కాలంలో మన్యంలోని మావోయిస్టులకు పోలీసుల మధ్య ఎదురుకాల్పులు, లొంగుబాటులు, అరెస్టుల వంటి సంఘటనలు జరిగాయి. జైలుకెళ్లివచ్చిన లంబ య్య, పోలీసులతో లోపాయికారిగా ఒప్పం దాలు కుదుర్చుకుని మావోయిస్టుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నాడన్నది వారి అభియోగం. ఈ క్రమంలోనే పలు సంఘటనలకు బాధ్యుడిగా చేస్తూ మావోయిస్టులు లంబయ్యను మంగళవారం రాత్రి తుపాకీతో కాల్చి చంపారు. 12ఏళ్ల పాటు పార్టీకి సేవలందించిన లంబయ్యను దారుణంగా కాల్చిచంప డంపట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని డోలీలో తరలిస్తున్న బంధువులు దిక్కెవరు... లంబయ్యను మావోయిస్టులు ఇన్ఫార్మర్ నెపంతో హతమార్చడంతో అతని కుటుంబ సభ్యులు భోరున విలపించారు. లంబయ్యకు భార్య జీమొ, కుమారులు రాంబాబు, దాసు, నాగేష్, మంగుడు, కుమార్తెలు సీతమ్మతో పాటు కోడలు ఉన్నారు. వీరంతా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. లంబయ్యను మావోయిస్టులు పొట్టనపెట్టుకోవడంతో తమకు దిక్కెవరంటూ వారు రోదించారు. పెదపాడు గ్రామంలో ఉంటున్న వీరంతా బుధవారం తెల్లవారు జామున సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. లంబయ్య హత్యతో పెదపాడు గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. దుర్భర పరిస్థితుల మధ్య మృతదేహం తరలింపు మావోయిస్టుల చేతిలో హతమైన లంబయ్య మృతదేహాన్ని దుర్భర పరిస్థితుల మధ్య పోస్టుమార్టం నిమిత్తం ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు తరలించారు. సంఘటన జరిగిన ప్రాంతం మండల కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. కుంకుంపూడి సమీపంలో ఉన్నప్పటికీ కనీసం ద్విచక్ర వాహనం కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది. భారీ వర్షం కారణంగా మృతదేహం తరలింపునకు ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది.నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న తీములబంధ వరకు లంబయ్య మృతదేహాన్ని డోలీలో తరలించి, అక్కడి నుంచి ఆటోలో చింతపల్లి ఆస్పత్రికి తరలించారు. అనంతరం పెదపాడు గ్రామానికి మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు కుటుంబ సభ్యుకులు, గ్రామస్తులు నరకయాతన పడ్డారు. -
‘నక్సలిజాన్ని రూపుమాపేందుకు ఏం చేస్తున్నారు?
సాక్షి, అమరావతి: నక్సలిజం సమస్యను రూపుమాపేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని హైకోర్టు మంగళవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో జరిపిన సంప్రదింపుల వివరాలను ఓ నివేదిక రూపంలో తమ ముందుంచాలని రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీని ఆదేశించింది. ఈ సమస్యకు ఓ పరిష్కారం కనుగొనాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని పేర్కొంది. ఇటీవల విశాఖ జిల్లా మాదినమల్లు అటవీ ప్రాంతంలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో గాయపడి, కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న మావోయిస్టు భవానీని మెరుగైన చికిత్స నిమిత్తం మంచి వైద్య సదుపాయాలున్న ఆసుపత్రికి తరలించాలని హోంశాఖను ఆదేశించింది. ఈ విషయంలో తీసుకున్న చర్యలను కూడా వివరించాలని సూచించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఎదురు కాల్పుల్లో ఎంతమంది పోలీసులు.. ఎంతమంది నక్సలైట్లు చనిపోయారో తెలియచేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ‘పిల్’గా హెబియస్ కార్పస్ పిటిషన్ మాదినమల్లు అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిన తరువాత మావోయిస్టు పార్టీ అగ్రనేత అరుణ, భవానీ, గుమ్మిరేవుల మాజీ సర్పంచి నారాయణరావు ఆచూకీ తెలియడం లేదని, పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోందని, అందువల్ల వారిని కోర్టులో హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ పౌర హక్కుల సంఘం నేత చిలుకా చంద్రశేఖర్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ హెబియస్ కార్పస్ వ్యాజ్యాన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యంగా(పిల్) మారుస్తున్నామని స్పష్టం చేసింది. -
ఓయూ ప్రొఫెసర్‌కు రిమాండ్
గద్వాలటౌన్/గద్వాల క్రైం: మావోయిస్టు పార్టీకి సహకరిస్తూ, పార్టీ కేడర్ నియామకాలు చేసేందుకు యత్నిస్తున్నారంటూ ఉస్మానియా వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జగన్‌ను అరెస్టు చేసిన పోలీసులు శుక్రవారం గద్వాల కోర్టులో హాజరుపర్చారు. ఆయనకు 14 రోజుల రిమాండ్‌ను విధిస్తూ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. జగన్‌ను మహబూబ్‌నగర్ జైలుకు తరలించారు. ఈ నెల 5న గద్వాల మండలం మేళ్లచెర్వులో అదుపులోకి తీసుకున్న తెలంగాణ విద్యార్థి వేదిక నేత నాగరాజును కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు పంపారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో పోలీసులు అందించిన సమాచారం మేరకు మావోయిస్టుల రిక్రూట్మెంట్కు సహకరిస్తున్నారన్న అభియోగంతో 8 మందిపై కేసులు నమోదు చేశారు. నాగరాజును ఏ1గా, జగన్‌ను నాలుగో నిందితుడిగా నమోదు చేశారు. కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపిన పోలీసులు మిగతా వారి ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నారు. యురేనియం తవ్వకాలతో జరిగే నష్టాలను సమాజానికి తెలియజేస్తూ వ్యతిరేకించడం వల్లే మావోయిస్టులకు మద్దతు ఇస్తున్నారన్న ముద్ర వేస్తున్నారని తెలుగు అధ్యాపకురాలు, జగన్ భార్య రజని ఆరోపించారు. -
మావోయిస్టులకు సపోర్ట్..! పోలీసుల అదుపులో ఓయూ ప్రొఫెసర్
సాక్షి, హైదరాబాద్ : మావోయిస్టులకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జగన్ ఇంట్లో ఎస్ఐబీ పోలీసులు గురువారం సోదాలు నిర్వహించారు. సోదాలో జగన్ ఇంట్లో మావోయిస్టు లేఖలు, ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై మహబూబ్‌నగర్‌లో ఇంతకు ముందే నమోదైన కేసులో మహబూబ్‌నగర్ పోలీసులు జగన్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
ప్రభుత్వమే బాధ్యత వహించాలి
సాక్షి, కొత్తగూడెం: ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకే సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం లేదని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు డిమాండ్లు సాధించుకునే వరకు సమ్మె విరమించవద్దని పిలుపునిచ్చారు. కార్మికుల మౌలిక సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఖాళీగా ఉన్న డ్రైవర్, కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని, ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తక్షణం విడుదల చేయాలని, మోటారు వాహన పన్ను మినహాయించాలని కోరారు. సంస్థకు పూర్తి స్థాయి మేనేజింగ్ డైరెక్టర్‌ను నియమించాలని, సంస్థను అభివృద్ధి పథంలో నడపాలని కార్మికులు కోరుకుంటుంటే.. ప్రభుత్వం వారిని బెదిరింపులకు గురి చేయడం తగదని హితవు పలికారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోయిందని విమర్శిం చారు. కొత్త వాహనాల కొనుగోలు, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ, ఖాళీ పోస్టుల భర్తీ వంటివి చేపట్టకుండా కార్మికులనే బదనాం చేస్తూ ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోవాలని ప్రయత్నిస్తోందని జగన్ పేర్కొన్నారు. -
మావోయిస్టు పార్టీకి 15 ఏళ్లు
పెద్దపల్లి: పీపుల్స్‌వార్ పార్టీ, బిహార్‌కు చెందిన కమ్యూనిస్టు సెంటర్ మావోయిస్టు (ఎంసీసీ) పార్టీలు విలీనమై సెప్టెంబర్ 21కి 15 ఏళ్లు నిండనున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీపుల్స్‌వార్ పార్టీగా కొండపల్లి సీతరామయ్య నాయకత్వంలో అవతరించిన ఆ పార్టీ 2004, సెప్టెంబర్ 21న బిహార్ ఎంసీసీని తనలో విలీనం చేసుకొని మావోయిస్టు పార్టీగా అవతరించింది. 1979లో జగిత్యాల జైత్రయాత్ర అనంతరం మావోయిస్టు పార్టీని కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దుల్లో ఏర్పాటైంది. అప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు మహారాష్ట్ర, చత్తీశ్గఢ్, తమిళనాడు రాష్ట్రాలకు విస్తరిస్తూ వివిధ రాష్ట్రాలకు పాకింది. అప్పటికే బీహర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో పీపుల్స్‌వార్ పేరిట నక్సలైట్ల కార్యకలపాలు కొనసాగుతుండగా కిషన్‌దా నాయకత్వంలోని ఎంసీసీ ఆ రాష్ట్రాల్లో పనిచేస్తుంది. ఎంసీసీ, పీపుల్స్‌వార్ పార్టీల మధ్య చర్చలు ముగిసి ఏకాభిప్రాయానికి రావడంపై ఎంసీసీని పీపుల్స్‌వార్‌లో కలుపుకుని మావోయిస్టు పార్టీగా ప్రకటించారు. సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2004లో శాంతి చర్చలను జరుపుకున్నారు. ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్న సమయంలోనే నక్సల్స్ అగ్రనేతలు రామకృష్ణ, సుధాకర్ హైదరాబాద్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి తమ పార్టీ ఇకపై మావోయిస్టు పార్టీగా కొనసాగుతుందని ప్రకటించారు. ఎంసీసీ కంటే ముందు బీహర్, బెంగాల్, శ్రీకాకుళంలలో పార్టీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. సీపీఐఎంఎల్ పార్టీ యూనిటీ సైతం మావోయిస్టుపార్టీలో అప్పటికే విలీనమైనట్లు చర్చల సందర్భంగా రామకృష్ణ వెల్లడించారు. మొదటి దఫా శాంతి చర్చలు ముగిసిన అనంతరం మావోయిస్టులు తిరిగి అజ్ఞాతవాసం వెళ్లారు. శాంతిచర్చలకు సైతం 15ఏళ్లు నిండినట్లు చెప్పుకోవచ్చు. మావోయిస్టులపై సర్కార్ ముప్పేట దాడి.. పీపుల్స్‌వార్‌పార్టీగా కార్యకలాపాలు కొనసాగించిన సమయంలో కంటే మావోయిస్టు పార్టీగా ఏర్పాటైన తర్వాత ఏకంగా అన్ని రాష్ట్రాల నుంచి నిఘా వర్గాలు మావోయిస్టు పార్టీపై ఒత్తిడి పెంచాయి. జాతీయస్థాయిలో మావోయిస్టుల బలం పెరుగుతుందనే సాంకేతం బయటకు రావడంతో మావోయిస్టుల కట్టడికి అన్ని రాష్ట్రాలతోపాటు కేంద్రం సైతం బలగాలను రాష్ట్రాలకు పంపించే ప్రక్రియను వేగవంతం చేశాయి. ఇందులో భాగంగానే అప్పటివరకు తెలంగాణలో బలంగా ఉన్న పీపుల్స్‌వార్ పార్టీ (మావోయిస్టులు) కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ లాంటి జిల్లాలతోపాటు నల్లమలను సైతం మావోయిస్టులు కొల్పోయారు. అప్పటి నుంచే క్రమంగా పోలీసులు మావోయిస్టు పార్టీ అగ్రనేతల పై గురిపెట్టి ఒక్కొక్కరినీ ఎన్కౌంటర్లతో మట్టుబెట్టారు. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీకి అనేక ఎదురుదెబ్బలు తగిలాయి. మావోయిస్టు పార్టీ కార్యదర్శి రామకృష్ణ బదిలీ తర్వాత ఆయన స్థానంలో వచ్చిన బుర్ర చిన్నన్న, శాఖమూరి అప్పారావు, పటేల్ సుధాకర్‌రెడ్డి, నల్లమల్ల సాగర్, దేవేందర్ ఇలా వరుసగా రాష్ట్ర పార్టీ కార్యదర్శులంతా ఎన్కౌంటర్లలో హతమయ్యారు. క్రమంగా తెలంగాణ మైదాన ప్రాంతం నుంచి మావోయిస్టు పార్టీ ఉనికి దెబ్బతీశామని పోలీసు యంత్రాంగం భావిస్తోంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ తలపెట్టిన ఆవిర్భావ వారోత్సవాలు తెలంగాణలోని మైదాన ప్రాంతాల్లో ప్రభావం ఉండదని, అటవీ ప్రాంతాల్లో మాత్రమే అంతంత మాత్రమే వారోత్సవాల నేపథ్యంలో కదలికలు ఉంటాయన్న అభిప్రాయంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. -
‘మోదీ ప్రభుత్వ చర్యను వ్యతిరేకిద్దాం’
సాక్షి, విశాఖపట్నం : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన చేస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ పేరిట బ్యానర్లు వెలిశాయి. కశ్మీర్లో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్న కేంద్ర ప్రభుత్వ వాదనను ఎండగడుతూ... ‘కశ్మీర్ ప్రజలకు మద్దతుగా నిలుద్దాం. కశ్మీర్ పోరాటం గురించి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్న ఫాసిస్టు మోడి ప్రభుత్వ చర్యను వ్యతిరేకిద్దాం’ అంటూ జి.మాడుగుల, మద్దిగురువుల్లో మల్కాన్ గిరి-విశాఖ బోర్డర్ డివిజన్ కమిటీ పేరిట వెలసిన బ్యానర్లు కలకలం రేపుతున్నాయి. ‘స్వయం నిర్ణయాధికారం కశ్మీర్ ప్రజల జన్మహక్కు. బ్రాహ్మణీయ హిందూ ఫాసిజం నశించాలి. నరహంతక మోదీ ఫాసిస్టు ప్రభుత్వ చర్యను వ్యతిరేకిద్దాం. కశ్మీర్ ప్రజలపై అమలు జరుపుతున్న దారుణ మారణకాండను వ్యతిరేకించుదాం’ అంటూ మావోయిస్టు పార్టీ(సీపీఐ) నేతలు బ్యానర్లలో పిలుపునిచ్చారు. -
తీవ్రవాదంపై ఉమ్మడి పోరు
న్యూఢిల్లీ: ఉమ్మడి పోరాటం, వ్యూహాలతో వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలను దీటుగా ఎదుర్కోవాలని కేంద్రం, మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు నిర్ణయించాయి. 10 మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు ఇతర రాష్ట్రాల సీఎంలు నితీష్ కుమార్ (బిహార్), నవీన్ పట్నాయక్ (ఒడిశా), యోగి ఆదిత్యనాథ్ (యూపీ), కమల్‌నాథ్ (మధ్యప్రదేశ్), రఘుబర్ దాస్ (జార్ఖండ్), భూపేష్ భఘేల్ (ఛత్తీస్‌గఢ్), ఉన్నతాధికారులు హాజరయ్యారు. మావోయిస్టుల ఏరివేతకు తీసుకుంటున్న చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఇందులో సమీక్షించారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశం ఫలప్రదమైంది. భద్రత, అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించాం. ప్రజాస్వామ్య విధానాలకు తీవ్రవాదం విఘాతం కలిగిస్తుంది. ప్రధాని మోదీ నాయకత్వంలో తీవ్రవాదం నిర్మూలనకు కట్టుబడి ఉన్నాం’అని సమావేశం అనంతరం అమిత్ షా ట్విట్టర్లో పేర్కొన్నారు. అమిత్ షా హోంశాఖ పగ్గాలు చేపట్టిన అనంతరం ఇలాంటి సమావేశం జరగడం ఇదే తొలిసారి. హోంశాఖ, పారా మిలటరీ బలగాల ఉన్నతాధికారులు కూడా దీనికి హాజరయ్యారు. తీవ్రవాదం తగ్గుముఖం ► కేంద్ర హోంశాఖ గణాంకాల ప్రకారం 2009–13లో మావోయిస్టు హింసాత్మక చర్యలకు సంబంధించి 8,782 కేసులు నమోదు కాగా 2014–18లో 43.4 శాతం తగ్గిపోయి 4,969 కేసులు నమోదయ్యాయి. ► 2009–13 మధ్య కాలంలో మావోయిస్టుల హింసకు 3,326 మంది (భద్రతా సిబ్బందితో కలిపి) బలయ్యారు. 2014–18లో తీవ్రవాదుల చేతుల్లో 1,321 మంది మృతి చెందారు. ► 2009–18 వరకు 1,400 మందికిపైగా మావోయిస్టులు మరణించారు. ► ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో దేశవ్యాప్తంగా మావోయిస్టుల హింసకు సంబంధించి 310 ఘటనలు నమోదు కాగా 88 మంది ప్రజలు చనిపోయారు. -
ఎన్కౌంటర్లో మావోయిస్టు మృతి
మణుగూరురూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బుగ్గ గ్రామ పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో బుధవారం ఉయదం జరిగిన ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు దళ సభ్యుడు మృతి చెందాడు. మణగూరు డీఎస్పీ సాయిబాబా కథనం ప్రకారం.. మావోయిస్టు పార్టీ విస్తరణలో భాగంగా దళాలు అటవీ ప్రాంతాల్లోని వలస గొత్తికోయ గ్రామాల్లో సంచరిస్తున్నాయనే సమాచారం మేరకు స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులకు తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో గుండాల మండలం దామరతోగు గ్రామానికి చెందిన మావోయిస్టు దళ సభ్యుడు జాడి వీరస్వామి అలియాస్ రఘు(25) మృతి చెందగా, మిగిలిన వారు పారిపోయారు. మృతుడి వద్ద రెండు తపంచాలు, 17 బుల్లెట్లు, రెండు కిట్‌బ్యాగ్‌లు, విప్లవ సాహిత్యం లభించినట్లు డీఎస్పీ వివరించారు. మణుగూరు తహసీల్దార్ మంగీలాల్ పంచనామా చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఆగస్టు 15న బ్లాక్‌డేగా పాటించాలి
సాక్షి, చర్ల : కశ్మీర్‌కు రాజ్యాంగం కల్పించిన స్వయం ప్రతిపత్తి అధికారాలైన ఆర్టికల్ 370, 35ఏ లను రద్దు చేయడాన్ని, కశ్మీర్ రాష్ట్రాన్ని విభజించడాన్ని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఖండించాలని, అక్కడి ప్రజలకు మద్దతుగా పోరాడాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధి కార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన పత్రికలకు ఒక లేఖను విడుదల చేశా రు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15న బ్లాక్‌డేగా పాటించాలని కోరారు. జమ్మూ కశ్మీర్లో తీవ్ర నిర్బంధం విధించిన తర్వాతే బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇందుకు సంబంధించిన బిల్లులను రాజ్యసభ, లోక్‌సభలలో ప్రవేశ పెట్టిందని ఆరోపించారు. సంఘ్ పరివార్, బ్రాహ్మణీయ హిందూ మతోన్మాదుల బీజేపీ ప్రభుత్వం తమ పథకంలో భాగంగానే కేంద్ర హోమంత్రి అమిత్‌షా నాయకత్వంలో జమ్మూ కశ్మీర్లో సైన్యాన్ని మోహరించారని అన్నారు. శాంతి భద్రతల పేరుతో బీజేపీ ప్రభుత్వం ఇంటర్నెట్లను, ఎలక్టానిక్ మీడియాలను బంద్ చేయించిందని, పచ్చి బ్రాహ్మణీయ మతోన్మాది గవర్నర్ సత్యపాల్ కశ్మీర్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. భారతదేశం బహు ళ జాతులు, బహుళ బాషలు, అనేక సంస్కృతులు గల దేశమని, ఈ జాతులను అభివృద్ధి చెందకుండా భారత దళారీ పాలక వర్గాలు, సామ్రాజ్యవాదులకు ఊడిగం చేస్తూ, జాతులను దోపిడీ చేస్తూ ఐక్యత, సమగ్రత పేరుతో దేశాన్ని జాతుల బందీఖానాగా మార్చివేశారని పేర్కొన్నారు. తమ పార్టీ జాతుల న్యాయమైన పోరాటాన్ని సమర్థిస్తున్నదని, విడిపోయే హక్కు ను గుర్తిస్తున్నదని, స్వయం ప్రతిపత్తి కోసం న్యాయమైన పోరాటం కొనసాగిస్తున్న కశ్మీర్ ప్రజలకు మావోయిస్టు పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తోందని ఆ లేఖలో పేర్కొన్నారు. 370, 35ఏల రద్దుపై బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు, పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు సంబురాలు జరుపుకోవడాన్ని వ్యతిరేకించాలని కోరారు. -
మావోయిస్టు పార్టీపై మరో ఏడాది నిషేధం
సాక్షి, అమరావతి: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మావోయిస్టు పార్టీపై మరో ఏడాది పాటు నిషేధాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా భద్రతా చట్టం 1992 కింద ఆగస్టు 17, 2019 నుంచి ఏడాది పాటు మావోయిస్టు పార్టీపై నిషేధం పొడిగించారు. మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థలైన రైతు కూలీ సంఘం, ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్, విప్లవకార్మిక సమాఖ్య, సింగరేణి కార్మిక సమాఖ్య , ఆల్ ఇండియా రివల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్, ర్యాడికల్ యూత్ లీగ్, రివల్యూషనరీ డెమాక్రాటిక్ ఫ్రంట్ తదితర సంస్థలపై నిషేధం ప్రకటించారు. ఈ నేపథ్యంలో 1991 నుంచి ఈ సంస్థలపై ప్రతీ ఏటా నిషేధాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. -
చదువులమ్మ ఒడిలో ‘మావో’ల కలకలం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్‌లోని శాతవాహన వర్సిటీలో మావోయిస్టు కార్యక్రమాల పేరిట సామాజిక మాధ్యమాల్లో సాగిన ప్రచారం వివాదాస్పదమవుతోంది. ‘నక్సలైట్ కార్యకలాపాలపై శాతవాహన యూనివర్సిటీలో పోలీసుల ఆరా’శీర్షికన రాసిన లేఖ సోమవారం ఉదయం నుంచి వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయింది. ‘నక్సలైట్ బాధిత కుటుంబాల సంక్షేమ సంఘం, కరీంనగర్’పేరిట ఈ లేఖ వాట్సాప్ గ్రూపుల్లో మీడియాతో పాటు విద్యార్థులు, యూనివర్సిటీ అధికారులు, ప్రొఫెసర్ల ఫోన్లలో చక్కర్లు కొట్టింది. అయితే మీడియా గ్రూపులకు స్వయంగా పోలీసుశాఖ పంపించడం గమనార్హం. దీంతో పోలీస్ శాఖ తరఫున అధికారికంగా నక్సలైట్ బాధితులు లేఖ విడుదల చేసినట్లు భావించారు. దీనిపై పోలీసు శాఖ అధికారులను ‘సాక్షి’సంప్రదించగా, యూనివర్సిటీలో రెండు విద్యార్థి సంఘాల మధ్య జరుగుతున్న గొడవల నేపథ్యంలో వచ్చిన పోస్టును సమాచారం కోసం షేర్ చేశామే తప్ప, అధికారికంగా కాదని వెల్లడించారు. కాగా సాయంత్రం ఇదే సంఘం తరఫున వచ్చిన మరో పోస్టును గ్రూపులో కాకుండా విడిగా జర్నలిస్టులకు పోస్టు చేశారు. తెలంగాణ విద్యార్థి వేదికకు తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనేందుకు సాక్ష్యాలుగా టీవీవీ అనుకూల విద్యార్థులు ప్రొఫెసర్ సాయిబాబా, వరవరరావుల అరెస్టును వ్యతిరేకిస్తూ నల్ల జెండాలు ప్రదర్శించిన ఫొటోను, విడుదల చేసిన పోస్టర్‌ను పంపించారు. టీవీవీ, ప్రొఫెసర్‌కు వ్యతిరేకంగా పోస్టు నిషేధిత మావోయిస్టు తీవ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) సంఘంలో సభ్యత్వాలు నమోదవుతున్నాయని ఆ పోస్టులో పేర్కొన్నారు. కొరివి సూర్యుడు, కరికె మహేశ్, దొగ్గల రాజు అనే టీవీవీ నాయకులు మరికొందరితో కలసి ఇటీవల ఛత్తీస్‌గఢ్ వెళ్లి మావోయిస్టు చంద్రన్నను కలసి తీవ్రవాదుల నుంచి పెద్ద ఎత్తున నిధులు తెచ్చారని ఆరోపించారు. ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఉన్న సూరేపల్లి సుజాత స్టడీటూర్ల పేరుతో విద్యార్థులను ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లి తీవ్రవాదులను కలిపిస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారు చేయిస్తున్నట్లు ఆరోపించారు. తీవ్రవాద సంస్థలకు అనుకూలంగా పనిచేసే విద్యార్థి సంఘాల్లో చేరకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ వాట్సాప్ లేఖను పోలీస్ శాఖ మీడియా గ్రూపుల్లో పంపించింది. నక్సలైట్లకు వ్యతిరేకంగా ఏబీవీపీ ధర్నా యూనివర్సిటీలో మావోయిస్టు అనుకూల విద్యార్థి సంఘం కార్యకలాపాలు సాగిస్తుందని ఓ వైపు మీడియా, పోలీసు, ప్రొఫెసర్, విద్యార్థుల గ్రూపుల్లో వీడియో వైరల్ అవుతున్న సమయంలో మధ్యాహ్నం ఏబీవీపీ విద్యార్థి సంఘం స్పందించింది. యూనివర్సిటీ పరిపాలన విభాగంలోకి వెళ్లిన విద్యార్థి సంఘం నాయకులు తెలంగాణ విద్యార్థి వేదికకు, నక్సలైట్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రిజిస్ట్రార్ చాంబర్ ముందు బైఠాయించారు. రిజిస్ట్రార్ ఉమేష్ కుమార్‌కు వినతిపత్రం ఇచ్చి వెళ్లారు. తీవ్రవాద కార్యకలాపాలు లేవు యూనివర్సిటీలో చోటు చేసుకున్న పరిణామాలపై రిజిస్ట్రార్ ఉమేష్ కుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ వర్సిటీలో ఎలాంటి తీవ్రవాద కార్యకలాపాలు సాగడం లేదని స్పష్టం చేశారు. ఒకటి రెండు విద్యార్థి సంఘాల తీరులోనే తెలంగాణ విద్యార్థి వేదిక అనేది కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. అది నిషేధిత సంఘమో కాదో తనకు తెలియదని పేర్కొన్నారు. రెండు నెలల క్రితం స్టడీ టూర్ కింద యూనివర్సిటీ నుంచి అధికారికంగానే భద్రాచలం వెళ్లినట్లు తెలిపా రు. ప్రొఫెసర్ సూరెపల్లి సుజాతతోపాటు ఇతర స్టాఫ్ కూడా ఉందని, తనకు భద్రాచలం అనే చెప్పారని, ఛత్తీస్‌గఢ్ వెళ్లారో లేదో తెలియదని అన్నారు. పెంచల శ్రీనివాస్ అనే కాంట్రాక్టు లెక్చరర్ లైంగిక వేధింపుల ఆరోపణలపై కమిటీ నివేదిక ఇచ్చారని, వీసీ పరిధిలో ఉందని చెప్పారు. వాట్సాప్ పోస్టులో ఉన్నవన్నీ తప్పులేనని అంగీకరించారు. టీవీవీ మావోయిస్టు అనుబంధ సంస్థే: మరో ప్రకటన సోమవారం ఉదయమే తెలంగాణ విద్యార్థి వేదిక లక్ష్యంగా కరీంనగర్ నక్సలైట్ బాధిత కుటుంబాల సంక్షేమ సంఘం పేరుతో వాట్సాప్ పోస్టు రాగా, మధ్యాహ్నం మూడు గంటలకు మరో ప్రకటన వెలువడింది. టీవీవీ మావోయిస్టు అనుబంధ సంస్థ అని చెప్పడానికి ఆధారాలు ఇవి కావా? అంటూ కొన్ని సాక్ష్యాలను విడుదల చేశారు. ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా, వరవరరావుల అరెస్టుకు నిరసనగా తెలంగాణ విద్యార్థి వేదిక తరఫున మే 17న ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను, శాతవాహన యూనివర్సిటీలో కొందరు విద్యార్థులు నల్లజెండాలు ప్రదర్శిస్తున్న ఫొటోలను విడుదల చేశారు. వీటిని కూడా పోలీస్ పీఆర్ఓ జర్నలిస్టులకు తన ఫోన్ ద్వారా పంపించడం గమనార్హం. -
ఆ చేత్తో ఇచ్చి.. ఈ చేత్తో లాక్కున్నారు
పెద్దపల్లి: ‘స్వాతంత్య్ర పోరాటం చేసిన నా భర్త వెంకటయ్యకు ప్రభుత్వం ఎనిమిది ఎకరాల భూమిని ఇచ్చింది. ఆ భూమిని ఎనిమిదేళ్లు సాగు చేసుకున్నం.. పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వమంటే రామగుండం రెవెన్యూ అధికారులు అప్పు డు రూ.10 వేల లంచం అడిగిండ్రు. లంచం ఇవ్వలేక పట్టాదారు పాసుపుస్తకం తీసుకోలేదు. 30 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన భూమిని ప్రాజెక్టు పేరిట తీసుకున్నరు’ అని స్వాతం త్య్ర సమరయోధుడు వెంకటయ్య భార్య, మావోయిస్టు అగ్రనేతలు కిషన్‌జీ, వేణు తల్లి మల్లోజుల మధురమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆమె తన గోడు వెల్లబోసుకుంది. రజాకార్లతో పోరాడిన తన భర్తను ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధుడిగా గుర్తించి రామగుండం మండలం ఎల్లంపల్లిలో ఎనిమిది ఎకరాల భూమి ఇచ్చిందన్నారు. అయితే కొంతమంది రెవెన్యూ అధికారులు లంచం అడిగినందుకు ఆగ్రహంతో పాసు పుస్తకం తీసుకోలేదని తెలిపారు. సర్వే నంబర్ 126లోని ఎనిమిది ఎకరాల భూమి ఎల్లంపల్లి ప్రాజెక్టులో మునిగిపోయిందని అధికారులు చేతులెత్తేశారని చెప్పారు. ఈ విషయమై పలుమార్లు స్థానిక అధికారులను కలిస్తే ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని దాటవేస్తున్నారని తెలిపారు. భూమికి ప్రతిఫలంగా మరోచోట భూమిని కేటాయించాలని వేడుకుంది. -
మావోయిస్టు సానుభూతిపరుల అరెస్ట్
సాక్షి, కొత్తగూడెం: ముగ్గురు మావోయిస్టు సానుభూతిపరులను దుమ్ముగూడెం పోలీసులు అరెస్టు చేసి విప్లవ సాహిత్యంతో పాటు పలు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్ తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మార్చి 31న దుమ్ముగూడెం ఎస్సై ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది, 141 సీఆర్పీఎఫ్ బెటాలియన్, స్పెషల్ పార్టీ పోలీసులతో గ్రామంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో లక్ష్మీనగరంలోని యాసిన్ ఫుట్‌వేర్, హార్డ్‌వేర్ దుకాణం వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. వీరిలో ఒకరు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా జొన్నగుడా గ్రామానికి చెందిన సవలం సోమా, మరొకరు సుకుమా జిల్లా పాలొడీ గ్రామానికి చెందిన మడివి ఉంగా అని గుర్తించినట్లు చెప్పారు. కాగా సోమా మావోయిస్టు పార్టీకి సంబంధించిన మొదటి బెటాలియన్ కమాండర్ ఇడుమా వద్ద హెడ్‌క్వార్టర్ ప్లాటూన్‌లో సెక్షన్ డిప్యూటీ కమాండర్‌గా పనిచేస్తున్నాడని, ఇడుమాకు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ గన్‌మెన్‌గా, కొరియర్‌గా పనిచేస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా మడివి ఉంగా మూడేళ్లుగా మా వోయిస్టు బెటాలియన్ కమాండర్ ఇడుమా పార్టీకి సానుభూతిపరుడిగా పనిచేస్తూ అవసరమైన సామాన్లు, మందుగుండు సామగ్రి, యూనిఫామ్, క్లాత్, చెప్పులు, బూట్లు సరఫరా చేస్తూ ఉండేవారని తెలిపారు. అరెస్టుచేసిన వారిలో మూ డవ వ్యక్తి దుమ్ముగూడెం మండలం లక్ష్మీపురం లో ని యాసిన్ ఫుట్‌వేర్, హార్డ్‌వేర్ యజమాని ఎండీ. ఖాదర్ యాసిన్బేగ్గా చెప్పారు. యాసిన్‌బేగ్ మావోయిస్టు పార్టీకి కావాల్సిన వస్తువులను భద్రాచలం, విజయవాడ వెళ్లి కొనుగోలు చేసి సోమా, ఉంగాల ద్వారా మావోయిస్టు పార్టీకి చేరవేసేవాడు. సోమా, ఉంగాల నుంచి డబ్బులు తీసుకుని, వారు అడిగిన పేలుడు పదార్థాలు, మందుపాతరలు, గ్రనేడ్ లాంచర్లు ఇతర పరికరాలు, జనరేటర్, వెల్డింగ్ మిషన్, ఐరన్ రాడ్స్ తెప్పించేవా డని వివరించారు. ఆదివారం యాసిన్ తెప్పించిన సామగ్రిని తీసుకువెళ్లేందుకు సోమా, ఉంగా వచ్చి పట్టుబడినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి పేలుడు పదార్థాలు, క్లేమోర్ పైపులు, ఇతర పరికరాలతో పాటు భద్రాచలంలోని ప్రజా సంఘాల నాయకులకు అందజేసేందుకు తీసుకొచ్చిన విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పలు విధ్వంస ఘటనల్లో పాల్గొన్న సోమా సోమా ఐదేళ్లుగా ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన పలు విధ్వంసకర సంఘటనలతో పాటు సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్ పోలీస్ సిబ్బందిపై దాడిచేసి హతమార్చిన ఘటనల్లో నిందితుడిగా ఉన్నాడని ఎస్పీ వివరిం చారు. 2014లో సుకుమా జిల్లాలోని చింతగుప్ప పోలీస్ స్టేషన్ పరిధిలోని కసళ్లపాడు వద్ద కూంబింగ్ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ పార్టీలపై బెటాలియన్ కమాండర్ ఇడుమా ఆధ్వర్యంలో దాడి చేయగా 14మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణించారని, ఈ ఘటనలో సీఆర్పీఎఫ్కు సంబంధించిన పలు ఆయుధాలను లూటీ చేసినట్లు తెలిపారు. 2015లో సుకుమా జిల్లాలో పిడమేలు వద్ద బెటాలియన్ కమాండర్ ఇడుమా ఆధ్వర్యంలో అంబుష్ చేసి కూంబింగ్ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ పార్టీలపై దాడిచేయగా ఏడుగురు ఎస్టీఎఫ్ సిబ్బంది చనిపోయారని, ఈ దాడిలో ఎస్టీఎఫ్ కు సంబంధించిన పలు ఆయుధాలను లూటీ చేసిన ఘటనలో సోమా పాల్గొన్నాడు. 2017లో సుకుమా జిల్లా కొత్తచెరువు వద్ద బెటాలియన్ కమాండర్ ఇడుమా ఆధ్వర్యంలో అంబుష్ చేసి, రోడ్డు తనిఖీ చేస్తున్న సీఆర్పీఎఫ్ పార్టీలపై దాడి చేయగా 22 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణించారని, ఈ దాడిలోనూ ఆయుధాలను లూటీ చేయడం జరిగిందన్నారు. 2017లో సుకు మా జిల్లాలోని బుర్కాపాల్ వద్ద బెటాలియన్ కమాండర్ ఇడుమా ఆధ్వర్యంలో అంబుష్ చేసి రోడ్ తనిఖీ చేస్తున్న సీఆర్పీఎఫ్ పార్టీలపై దాడిచేయగా 24 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మృతి చెందగా, 20 తుపాకులు, ఇతర ఆయుధాలను మావోయిస్టులు లూటీ చేసిన ఘటనలో సోమా పాలుపంచుకున్నారన్నారు. 2018 డిసెంబర్లో జారపల్లి వద్ద పామేడు పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో కూడా సోమా నిందితుడిగా ఉన్నట్లు ఎస్పీ సునీల్‌దత్ వివరించారు. అరెస్టు చేసిన సోమా, ఉంగా, యాసిన్‌లను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. -
పోలీసుల కాల్పుల్లో ఇద్దరు గిరిజనుల మృతి
అరకులోయ/పెదబయలు: విశాఖ ఏజెన్సీలో పోలీసు కూంబింగ్ పార్టీల కాల్పులకు ఇద్దరు గిరిజనులు మృతి చెందారు. మరో ఇద్దరు పరుగులు తీసి తృటిలో ప్రాణాలను కాపాడుకున్నారు. మృతి చెందిన గిరిజనులు మావోయిస్టు పార్టీ పెదబయలు ఏరియా కమిటీ సభ్యులని పోలీసులు ప్రకటించారు. వేటకు వెళ్లిన ఇద్దరిని దారుణంగా తుపాకులతో కాల్చి చంపారని పెదకోడాపల్లి గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెదబయలు మండలంలోని పెదకోడాపల్లి మెట్టవీధికి చెందిన బట్టి భూషణ్‌రావు (50), సిదేరి జమదరి (35) నాటు తుపాకులను వెంటబెట్టుకుని శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుంచి అరనంబయలు కొండ, గంగోడిమెట్ట కొండలపైకి బయల్దేరారు. వారికి సహాయంగా కోడా బొంజుబాబు, సిదేరి రాంబాబు ఉన్నారు. కుందేళ్లు, ఇతర అడవీ జంతువుల వేట కోసం వెళ్లారు. అయితే వారి వేట సాగకపోవడంతో, అర్ధరాత్రి ఒంటిగంటన్నర సమయంలో గ్రామానికి కాలినడకన బయల్దేరారు. నాటు తుపాకులు కలిగి ఉన్న భూషణ్‌రావు, జమదరి ముందు నడుస్తుండగా, వారి వెనుకన బొంజుబాబు, రాంబాబు వెళ్తున్నారు. పెదకోడాపల్లి గ్రామానికి సమీపంలోని బురదమామిడి పంట భూముల సమీపంలోకి రాగానే పోలీసు పార్టీలు వారిపై కాల్పులు జరిపారు. దీంతో ముందు నడుస్తున్న బట్టి భూషణ్‌రావు, సిదేరి జమదరి అక్కడికక్కడే మృతి చెందగా, వెనుక ఉన్న బొంజుబాబు, రాంబాబు తప్పించుకుని సురక్షితంగా గ్రామానికి చేరుకున్నారు. అయితే పోలీసులు మాత్రం ఎన్కౌంటర్ నిజమేనని, సుమారు 20 మంది మావోయిస్టులు సంచరిస్తుండడంతో వారిపై కాల్పులు జరిపామని ప్రకటించారు. భగ్గుమన్న గిరిజనులు కాల్పుల్లో మృతి చెందిన బట్టి భూషణ్‌రావు, సిదేరి జమదరి మావోయిస్టు సభ్యులని పోలీసులు చెప్పడంపై పెదకోడాపల్లి గిరిజనులంతా భగ్గుమన్నారు. దకోడాపల్లి పంచాయతీలోని గిరిజనులంతా శనివారం మధ్యాహ్నం పాడేరుకు చేరుకుని పోలీసుల తీరుపై నిరసన ప్రదర్శన చేశారు. పాడేరు సబ్‌కలెక్టర్ వెంకటేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. పోలీసులు కాల్పులు జరపడంపై న్యాయ విచారణ చేసి, బాధిత గిరిజనుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి నుంచే పెదకోడాపల్లి అటవీ ప్రాంతంలో పోలీసు కూంబింగ్ పార్టీలు అధికంగా సంచరించాయి. నాటు తుపాకులు కలిగిన ఉన్నందున వారిని మావోయిస్టులు అనుకుని కాల్పులు జరిపి ఉంటారని భావిస్తున్నారు. మృతదేహాలను అంబులెన్స్ ద్వారా పాడేరు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. -
‘కిడారికి పట్టిన గతే నీకూ పడుతుంది’
సాక్షి, గుంటూరు : పల్నాడులో మరోసారి మావోయిస్టు పార్టీకి చెందిన లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. అవినీతి, భూకబ్జాదారులు తమ పద్ధతి మార్చుకోవాలని మావోయిస్టులు లేఖలో హెచ్చరించారు. కిడారి సర్వేశ్వర రావుకు పట్టిన గతే గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావుకు పడుతుందని హెచ్చరించారు మావోయిస్టులు. యరపతినేనితో పాటు పలువురు టీడీపీ నేతలను హెచ్చరిస్తూ లేఖలు విడుదల చేశారు. ఈ లేఖలు దాచేపల్లి మోడ్రన్ స్కూల్ దగ్గర వెలిశాయి. ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో మావోయిస్టు పార్టీకి చెందిన లేఖలు దర్శనమివ్వడం చర్చనీయంశంగా మారింది. -
పరిటాల సునీతపై మండిపడ్డ జ్యోతక్క
‘‘పరిటాల కుటుంబం ఉద్యమాన్ని స్వార్థానికి వాడుకుంటోంది. అణగారిన వర్గాల ప్రజల కోసం పనిచేస్తున్నామని నమ్మిస్తూ రాజకీయంగా ఎదగాలని చూస్తోంది. ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు...రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెబుతారు’’ అని మాజీ నక్సలైటు, 2004లో పోలీసుల తూటాలకు బలైన నక్సల్ ఉద్యమ నేత ఎర్రసత్యం సతీమణి అరుణక్క అలియాస్ జ్యోతక్క అభిప్రాయపడ్డారు. నక్సల్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆమె...ఆ తర్వాత వైఎస్సార్ పిలుపు మేరకు జనజీవన స్రవంతిలో కలిసి పోయారు. రెండు రోజుల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె... బుధవారం తనకల్లు మండలం ఉస్తినిపల్లిలోని తన స్వగృహంలో ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన మనోభావాలను పంచుకున్నారు. అనంతపురం, కదిరి: నక్సల్ ఉద్యమం...ప్రస్తుత రాజకీయాలపై జ్యోతక్క తన అభిప్రాయాలను సాక్షితో ఇలా పంచుకున్నారు. ‘సాక్షి’: నక్సల్ ఉద్యమానికి ఎలా ఆకర్షితులయ్యారు..? జ్యోతక్క: మా పుట్టిల్లు తాడిపత్రి. మా నాన్న నక్సల్ ఉద్యమంలో రైతు కూలీ సంఘ నాయకుడిగా ఉండేవారు. అలా నేను కూడా ఆకర్షితురాలినై చిన్నప్పుడే జననాట్య మండలిలో చేరి ఉద్యమంలోకి వెళ్లాను. గణపతి వర్గంలో జిల్లా కమిటీలో పనిచేశాను. నా భర్త ఎర్రసత్యం ఎంఏ గోల్డ్‌మెడలిస్ట్. ఆయన ఎస్కేయూలో విద్యార్థి సంఘం నాయకుడిగా ఉంటూ.. నక్సల్ ఉద్యమంలో చేరి రాష్ట్ర కమిటీలో చురుగ్గా ఉండేవారు. ‘సాక్షి’: పరిటాల కుటుంబీకులు కూడా నక్సల్ ఉద్యమంలో పనిచేశారు కదా..! జ్యోతక్క: రవి తండ్రి శ్రీరాములు, రవి సోదరుడు హరి వీరిద్దరూ పనిచేశారు. వారి గురించి ప్రస్తావించలేము. కానీ పరిటాల రవితో పాటు ఆయన సతీమణి సునీత చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకున్నట్లు...మా కుటుంబం అణగారిన వర్గాల కోసం పనిచేస్తోందని ప్రజల్ని నమ్మిస్తూ రాజకీయంగా ఎదగాలని చూస్తున్నారు. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నక్సల్ ఉద్యమాన్ని కూడా రాజకీయ స్వార్థం కోసం వాడుకున్నారు. వారికి రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. ‘సాక్షి’: వైఎస్సార్, చంద్రబాబు..వీరిద్దరిలో ఎవరు ప్రజల మనిషి..? జ్యోతక్క: వైఎస్ రాజ శేఖరరెడ్డికి, చంద్రబాబుకు నక్కకూ, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. చంద్రబాబు ఏమీ లేకపోయినా హంగామా ఉంటుంది. కానీ వైఎస్సార్ ప్రజల మనిషి. ఆయన అన్ని వర్గాల ప్రజల కోసం కష్టపడ్డారు. ఆఖరుకు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే వెళ్తూ ప్రాణాలు కోల్పోయారు. చంద్రబాబు ఎక్కువ రోజులు పరిపాలించినా ప్రజలకు ఒరిగిందేమీ లేదు. అదే వైఎస్సార్ ఎక్కువ రోజులు పరిపాలించినట్లయితే ఈ రాష్ట్రానికి ఎంతో మేలు జరిగేది. ‘సాక్షి’: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే ఎందుకు ఎంచుకున్నారు? జ్యోతక్క: ఇప్పుడున్న పార్టీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే కాస్త బెటర్ అన్పించింది. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు. గత ఎన్నికల్లోనే ఆయన ఒక్క అబద్ధం చెప్పింటే అధికారంలోకి వచ్చేవారు. విలువలకు, విశ్వసనీయతకు మారు పేరు వైఎస్ జగన్ అని చెప్పచ్చు. ఆయనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరం. అన్ని వర్గాల ప్రజలకూ న్యాయం జరగాలంటే జగనన్నే కరెక్ట్. అందుకే నేను కూడా ఎంతో కొంత ప్రజలకు నా వంతు ప్రజా సేవ చేయాలని భావించే వైఎస్సార్సీపీలో చేరాను.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్రలో ప్రజలను పలకరించిన తీరుగానీ..ప్రజల కోసం ఆయన పడుతున్న తపన గానీ చూస్తే ఆయన జనం కోసమే పుట్టారేమో అనిపిస్తోంది -
ఇమడలేకే లొంగిపోయాను!
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు గతి తప్పాయని, ప్రజలకు దూరమైన మావోయిస్టులు వారిపైనే దాడులకు పాల్పడుతూ, అక్రమ వసూళ్లకు తెగబడుతున్నారని ఆ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు సత్వాజీ అలియాస్ సుధాకర్, అలియాస్ కిరణ్ అలియాస్ శశికాంత్ పేర్కొన్నారు. బుధవారం సుధాకర్ ఆయన భార్య అరుణ (అలియాస్ నీలిమ అలియాస్ మాధవి)తో కలసి డీజీపీ మహేందర్‌రెడ్డి ఎదుట లొంగిపోయాడు. తాము లొంగిపోవడానికి కారణాలను సుధాకర్ మీడియాకు వివరించారు. ‘బిహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో ప్రజలకు పార్టీ పూర్తిగా దూరమైంది. అక్కడి పార్టీ శ్రేణుల్లో కుటుంబ పాలన, బంధుప్రీతి, అక్రమ వసూళ్లు పెరిగిపోయాయి. తెలంగాణలో మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పని చేసిన నాకు ఎక్కడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు కానరాలేదు. సెంట్రల్ కమిటీ సభ్యుడిగా బిహార్, జార్ఖండ్‌లో పనిచేసిన సమయంలో అడుగడుగునా సిద్ధాంతాల ఉల్లంఘన కన్పించింది. తొలుత ఇది కిందిస్థాయి వరకే పరిమితమైందనుకున్నా.. అగ్రనాయకుల దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లా. వారికి కూడా అక్కడి అకృత్యాలపై నియంత్రణ లేదన్న సంగతి చాలా ఆలస్యంగా నాకు అర్థమైంది. పార్టీ విధానం మారాలని, ప్రజలకు దూరమవుతున్నామని పలుమార్లు సీనియర్లకు చెప్పి చూశాను. అయినా లాభం లేకపోయింది. పైగా ప్రజలపైనే దాడులు, వారి వద్దే అక్రమ వసూళ్లు నాలో కలత రేపాయి. పార్టీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల్లో శారీరక వేధింపుల్లేవు. కానీ సంప్రదాయ సమాజంలో అనాదిగా వస్తున్న పితృస్వామ్యమే అక్కడా తిష్టవేసింది. దీనివల్ల మహిళా సభ్యులకు వివిధ రూపాల్లో ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా వాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పోలీసులకు పట్టుబడ్డ సమయంలో మా సోదరుడి వద్ద దొరికిన రూ.25 లక్షలు పార్టీవే. దానికి అన్ని లెక్కలు పార్టీ అకౌంట్స్ వద్ద ఉన్నాయి. నేనెప్పుడూ నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం డబ్బు వసూళ్లకు పాల్పడలేదు. నన్ను పార్టీ సస్పెండ్ చేయలేదు. పార్టీ విధానాలు నచ్చకే తప్పుకొంటున్నట్లు ఏడాదిగా చెబుతున్నా. నా భార్యతో కలిసి బయటకి వస్తున్నట్లు లేఖ రాసి వచ్చా’అని వివరించారు. అనారోగ్యం, విభేదాలే కారణం: అరుణ పార్టీలో పలువురి ఆధిపత్య ధోరణి నచ్చకే తాము బయటికి వచ్చామని అరుణ వివరించారు. వాస్తవ సిద్ధాంతాలకు పూర్తి వ్యతిరేకంగా పార్టీ నడుచుకుంటోందని, దీనిపైనే విభేదించే పార్టీని వీడినట్లు తెలిపారు. పార్టీలో మహిళలపై శారీరకంగా అఘాయిత్యాలు జరగట్లేదని, అయితే ఆధిపత్యం చెలాయించడం, ఒత్తిళ్లు చేయడం వల్లే పలువురు మహిళా మావోయిస్టులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. వేధింపులతోనే మహిళా మావోలు ఆత్మహత్యలు: డీజీపీ మావోయిస్టు పార్టీ బలహీనపడిందని, మిలీషియా సంఖ్య 500కు పడిపోయిందని డీజీపీ మహేందర్‌రెడ్డి చెప్పారు. అగ్రనేతల్లో విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయని పేర్కొన్నారు. మహిళా దళ సభ్యులపై అకృత్యాలు పెరిగిపోయినట్లు తమకు సమాచారం ఉందని చెప్పారు. ఈ కారణంగానే పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అయితే ఇవేమీ ఇంతకాలం వెలుగుచూడలేదన్నారు. ‘సత్వాజీ లొంగుబాటు వెనుక చాలా పెద్ద తతంగమే నడిచింది. ఏడాది కింద అతడి సోదరుడు లొంగిపోయిన సమయంలోనే పార్టీ తీరుపై సెంట్రల్ కమిటీ సభ్యుడు సత్వాజీ అలియాస్ సుధాకర్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుసుకున్నాం. ఈ క్రమంలోనే ‘ఇంటర్ స్టేట్ పోలీస్ కో–ఆర్డినేషన్ అండ్ కో–ఆపరేషన్’లో భాగంగా తెలంగాణ పోలీసులు జార్ఖండ్ పోలీసులకు ఈ సమాచారాన్ని చేరవేసి వారి సహకారంతో సత్వాజీ లొంగుబాటు సఫలీకృతం చేయగలిగాం. మావోయిస్టు పార్టీ అధినాయకత్వంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. కీలకమైన దండకారణ్యంలోనూ ముఖ్యనేతలు సోనూ, దేవూజీల మధ్య, స్థానిక గిరిజన నేతలకు తెలంగాణ నాయకులకు మధ్య విభేదాలున్నాయి. మావోయిస్టు అగ్రనేత సంబాల కేశవరావు భార్య రామక్క (అలియాస్ శారద) 2010లో వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంది. బస్తర్‌కు చెందిన డీవీసీఎం చందన, కమాండర్ చుక్కీ, కోదాడకు చెందిన దళ సభ్యురాలు గడ్డం భాగ్యలక్ష్మి ఆత్మహత్య చేసుకున్న వారిలో ఉన్నారు. పార్టీ విధానాలు గతి తప్పుతున్న క్రమంలో చాలామంది పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకా మావోయిస్టుల్లో కొనసాగుతున్న వారు లొంగిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. సుధాకర్ దంపతులపై ఉన్న రివార్డు (సుధాకర్‌పై రూ.25 లక్షలు, అరుణపై రూ.10 లక్షలు) మొత్తం రూ.35 లక్షలను వీరికే ఇస్తాం. ఆ డబ్బుతో వీరు కొత్త జీవితం మొదలుపెట్టొచ్చు. ఇక ఇతనిపై ఉన్న ఎన్ఐఏ కేసు మాత్రం సుధాకర్ న్యాయపరంగా ఎదుర్కోవాల్సిందే’అని డీజీపీ వివరించారు. సమావేశంలో ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్‌చంద్, అడిషనల్ డీజీపీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు. అరుణ నేపథ్యమిదీ.. బిహార్, జార్ఖండ్ స్టేట్ కమిటీ సభ్యురాలుగా కొనసాగిన వైదుగుల అరుణ (అలియాస్ మాధవి, నీలిమ)ది వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం మామడపురం గ్రామం. 3వ తరగతి చదువుతున్నపుడే ఈమెకు బాల్య వివాహం జరిగింది. ఆ పెళ్లి అరుణకు ఇష్టం లేదు. 8వ తరగతిలో తమ గ్రామానికి వచ్చి విప్లవపాటలు పాడే మావోయిస్టు దళానికి ఆకర్షితురాలై దళంలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. 1998లో సుధాకర్‌ను వివాహం చేసుకున్నారు. సుధాకర్ ప్రస్థానం ఇదీ! నిర్మల్ జిల్లా సారంగపూర్ గ్రామానికి చెందిన సుధాకర్‌ది బీద కుటుంబం. 7వ తరగతి వరకు గ్రామంలోనే చదువుకున్న సుధాకర్.. నిర్మల్‌లో 8 నుంచి ఇంటర్‌వరకు చదివాడు. 1983లో ఇంటర్ చదువుతున్న క్రమంలోనే రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ)లో చేరి చదువు ఆపేశారు. ఆర్ఎస్యూ జిల్లా కమిటీ కార్యదర్శి కటకం సుదర్శన్ వద్ద చేరి దళంలో కొరియర్‌గా చేరారు. ఇర్రి మోహన్‌రెడ్డి వద్ద ఆయుధాల తయారీలో శిక్షణ పొందాడు. బెంగళూరులోని స్థావరంలో ఆయుధాలు తయారుచేసి దేశంలోని పలు దళాలకు చేరవేసేవాడు. 1986లో అరెస్టయి 1989 వరకు జైలు శిక్ష అనుభవించారు. జైలులో ఉన్న సమయంలో వరవరరావుతో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటి కొచ్చాక వరవరరావుతో కలసి రైతు కూలీ సంఘంలో పనిచేశారు. 1990లో చెన్నారెడ్డి హయాంలో మావోలపై నిషేధం ఎత్తివేసినపుడు అజ్ఞాతం నుంచి బయటకొచ్చారు. ఇంద్రవెల్లి అమరుల స్మారక స్తూపం నిర్మాణంలో కీలకంగా వ్యవహరించాడు. పోలీసుల ఒత్తిడితో తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లారు. అక్కడి నుంచి 1990లో దళంలో సభ్యుడిగా చేరిన సుధాకర్ 1999 నాటికి ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీలో, సబ్ కమిటీ ఆన్ మిలిటరీ అఫైర్స్‌లో సభ్యుడిగా ఎదిగాడు. 2001–03లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఛత్తీస్‌గఢ్‌లో, 2003–13 వరకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా మిలిటరీ కమిషన్‌లో పనిచేశారు. 2013లో పదోన్నతిపై సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఈస్టర్న్ రీజనల్ బ్యూరో (ఈఆర్బీ)కి బదిలీ అయి బిహార్ రీజినల్ కమిటీలో పనిచేశారు. -
మావోయిస్టుల బంద్ ప్రశాంతం
విశాఖపట్నం, అరకులోయ,పాడేరు: కేంద్రప్రభుత్వం సమాధాన్ పేరిట నిర్భందం అమలుజేస్తోందని నిరసిస్తూ మావోయిస్టు పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం నిర్వహించిన భారత్‌బంద్ మన్యంలో ప్రశాంతంగా, పాక్షికంగా జరిగింది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఒడిశా సరిహద్దులో ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలు మండల కేంద్రాలలో ఉదయం నుంచి 11గంటల వరకు వ్యాపారులు దుకాణాలను మూసివేశారు.పెదబయలు మండల కేంద్రంలో కొన్ని దుకాణాలు తెరిచారు. పోలీసులు జోక్యం చేసుకుని మిగిలిన దుకాణాలను కూడా తెరిపిం చారు.ముంచంగిపుట్టులో ఉదయం 11గంటల వరకు దుకాణాలను మూసివేశారు.పోలీసుల ఆదేశాలతో వ్యాపారులు మధ్యాహ్నం నుంచి తమ దుకాణాలను తెరిచారు.డుంబ్రిగుడ మండలంలో మాత్రం బంద్ ప్రభావం కనిపించింది.ఉదయం నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు డుంబ్రిగుడ,అరకుసంత ప్రాంతాలలో దుకాణాలు మూతపడ్డాయి.హుకుంపేట,అరకులోయ,అనంతగిరి, కొయ్యూరు మండలాల్లో దుకాణాలు,ప్రభుత్వ కార్యాలయాలు యథావిథిగా తెరుచుకున్నాయి. ఈ మండలాల్లో మావోయిస్టుల బంద్ ప్రభావం కానరాలేదు. పాడేరు నియోజకవర్గంలో చింతపల్లి,జి.మాడుగుల, జీకే వీధిలో బంద్‌పాక్షికంగా జరిగింది. స్తంభించిన రవాణా మావోయిస్టుల బంద్ కారణంగా మన్యంలోని మారుమూల ప్రాంతాలకు రవాణా సేవలు స్తంభించాయి. ముంచంగిపుట్టు,పెదబయలు మండల కేంద్రాల వరకే పాడేరు డిపో నుంచి ఆర్టీసీ బస్సులు నడిచాయి.ఒడిశాకు ఆనుకుని ఉన్న జోలాపుట్,డుడుమ ప్రాంతాలకు పూర్తిగా బస్ సర్వీసులను రద్దు చేశారు.ఈ మండలాల్లోని మారుమూల ప్రాంతాలకు బస్సులు,ఇతర ప్రైవే ట్ వాహనాల సర్వీసులు నిలిచిపోయాయి.ముంచంగిపుట్టు మండలంలోని మారుమూల గ్రామా ల నుంచి ఒడిశాలోని మల్కన్‌గిరి,కోరాపుట్ జిల్లాలోని గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.విశాఖ నుంచి జైపూర్,ఒనకఢిల్లీ ప్రాంతాల బస్సు సర్వీసులను కూడా నిలిపివేశారు.దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పాడేరు, చింతపల్లి, జి.కె వీధి, జోలాపుట్టు ప్రాంతాలకు వచ్చే నైట్‌హాల్ట్ సర్వీసుల్ని బుధవారం, గురువారం రాత్రి కూడా నిలిపివేశారు. పాడేరు ఆర్టీసీ డిపో నుంచి కొండవంచుల, జోలాపుట్టు, గోమంగి, లక్ష్మిపేట, లోతేరు, గుంట సీమ, రూడకోట, మూలకొత్తూరు, ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసుల్ని నిలిపివేశారు. విస్తృతంగా తనిఖీలు మావోయిస్టుల బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసుశాఖ అప్రమత్తమైంది.ఒడిశా నుంచి ముంచంగిపుట్టు మండల కేంద్రం వరకు ఉన్న ప్రధాన రోడ్డులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మండల కేంద్రంలో ఎస్ఐ అరుణ్‌కిరణ్,ఇతర పోలీసు పార్టీలు తనిఖీలు నిర్వహించారు. పెదబయలు మండల కేంద్రంతో పాటు,పాడేరు నుంచి అరకులోయ రోడ్డులో హుకుంపేట,డుంబ్రిగుడ ప్రాంతాలలో పోలీసులు వాహనాల తని ఖీలు జరిపారు.హుకుంపేట ఎస్ఐ నాగకార్తీక్,ఇతర సిబ్బంది ఆర్టీసీ,ప్రైవేట్ వాహనాలలో ప్రయాణికుల లగేజీ బ్యాగులను సోదా చేశారు.అనుమానిత వ్యక్తుల సమాచారం సేకరించి వదిలిపెటా ్టరు.హుకుంపేట నుంచి కామయ్యపేట మీదుగా ఒడిశాలోని పాడువా ప్రాంతానిక వెళ్లే రోడ్డులో కూడా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈజంక్షన్‌లోను పోలీసులు పహారా కాశారు. -
కూంబింగ్ ముమ్మరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యా ప్తంగా మూడు దఫాలుగా జరుగనున్న పంచాయతీ ఎన్నికలపై పోలీస్ శాఖ దృష్టి సారించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా పలు జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతోపాటు అటవీ ప్రాంతాల్లో కూంబింగ్‌ను ముమ్మరం చేసింది. ఇటీవల జరి గిన అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని అలజడి సృష్టించేందుకు మావోయిస్టు ప్రయత్నాలు చేసినా, రాష్ట్ర స్పెషల్ ఇంటలిజెన్స్ బ్యూరో పోలీ సులు ఎప్పటికప్పుడు వారి చర్యలను పసిగట్టి వాటిని నిర్వీర్యం చేస్తూ వచ్చారు. తాజాగా జరుగనున్న పంచాయతీ ఎన్నికలను అడ్డుకునేందుకు మావోయిస్టు పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్టు నిఘా బృందాలు గుర్తించాయి. మంచి ర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, మహ బూబాబాద్‌లోని కొన్ని గ్రామాల్లో స్థానిక దళాలు సంచరిస్తున్నట్టు తెలిసింది. దీనితో అక్కడ పోటీచేస్తున్న అభ్యర్థులు భయాందోళనకు గురైనట్టు సమాచారం. ఆయా జిల్లాల ఎస్పీలు గ్రేహౌండ్స్ బలగాలతో పాటు ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలో టీఎస్ఎస్పీ(స్పెషల్‌పోలీస్)బృందాలను రంగం లోకి దించారు. ఆయా గ్రామపంచాయతీలు పూర్తి స్థాయిలో అటవీ ప్రాంతంలో ఉండటంతో కూంబింగ్ విస్తృతంచేయాలని ఉన్నతాధికారులు సైతం ఆదేశించారు. దీనితో ప్రజలు అనుమానితులు కనిపిస్తే తమకు సమాచారం అందించాలని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరి గేలా వ్యవహరించాలని సూచించార -
మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా
విజయనగరం, రామభద్రపురం: విశాఖపట్నం రేంజ్ పరిధిలో మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా సారిస్తున్నట్లు డీఐజీ సీహెచ్ శ్రీకాంత్ తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ, జిల్లాలో మాఓయిస్టుల కదలికలు లేవన్నారు. అయితే ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో కదలికలు ఉన్నట్లు చెప్పారు. పాడేరు మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య తర్వాత ఆయన కుమారుడుకి ఆక్టోపస్ భద్రత కల్పించినట్లు తెలిపారు. పోలీస్‌శాఖలో ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేస్తున్నామన్నారు. పోస్టులు భర్తీ కాగానే పోలీస్స్టేషన్లను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. మహిళలపై దాడులు జరగకుండా ముఖ్య కూడళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈవ్‌టీజింగ్‌లు జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. పెండిగ్ కేసులు అధికంగా ఉన్న చోట వెంటవెంటనే సాక్ష్యాధారాలు సేకరించి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఇంతవరకు 8,436 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని.. వారికి జైలు శిక్షలతో పాటు అపరాధరుసుం విధించినట్లు తెలిపారు. ఆయనతో పాటు ఎస్పీ పాలరాజు, ఏఎస్పీ గౌతమీశాలి, సీఐ ఇలియాస్ అహ్మద్, ఎస్సై బి. లక్ష్మణరావు ఉన్నారు. ప్రమాదాల నివారణకు చర్యలు దత్తిరాజేరు : జాతీయ రహదారి పరిధిలో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని డీఐజీ శ్రీకాంత్ సిబ్బందికి సూచించారు. పెదమానాపురం పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన ఆయన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం శిథిలమైన క్వార్టర్స్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్పీ పాలరాజు, ఏఎస్పీ గౌతమీశాలి, సీఐ విద్యాసాగర్, ఎస్సై కాంతికుమార్, తదితరులు ఉన్నారు. -
ఏవోబీలో అలజడి.. కూంబింగ్ ముమ్మరం
సాక్షి, శ్రీకాకుళం : నేటి నుంచి మావోయిస్టుల పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో ఆంధ్రా-ఒడిషా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పార్టీ వారోత్సవాలు సందర్భంగా మావోయిస్టులు ఘాతుకాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ఏవోబీలో భారీగా పోలీసులు మోహరించారు. ఇటీవల జరిగిన పలు ఘటనలను దృష్టిలో ఉంచుకుని ప్రజా ప్రతినిధులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. శ్రీకాకుళం జిల్లాలోని కోండ్రుం-ఇంజరి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు శనివారం భారీ మందుపాతరలను పేల్చిన విషయం తెలిసిందే. వారోత్సవాలకు మావోయిస్టులు పెద్ద సంఖ్యలో హాజరవుతారనే పక్కా సమాచారంతో బలగాలు గత రెండురోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వారిని లక్ష్యంగా చేసుకుని మందుపాతరలను పేల్చినట్లు తెలిసింది. కూంబింగ్ నిర్వహిస్తున్న బలగాలకు హెచ్చరికగా ఒడిషాలో మావోయిస్టులు రోడ్డు నిర్మాణం జరుపుతున్న వాహానాలకు దహనం చేశారు. దీంతో ఏవోబీ ప్రాంతంలో ప్రజలకు భయాందోళలకు గురవుతున్నారు. ఆంధ్రా, ఒడిషా, ఛత్తీసగఢ్, ప్రాంతాల్లో బలగాలు గాలింపు ముమ్మరం చేశారు. -
భయం గుప్పిట్లో మన్యం
విశాఖ, అరకులోయ, కొయ్యూరు: పీఎల్జీఏ(ప్లాటున్ లీబరేషన్ గెరిల్లా ఆర్మ్డ్) వారోత్సవాలను ఆదివారం నుంచి నిర్వహించేందుకు మావోయిస్టులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ మారుమూల ప్రాంతాలలో కరపత్రాలు, బ్యానర్లు వెలిశాయి.మరోపక్క వీటిని భగ్నం చేసేందుకు పోలీసు యంత్రాంగం వ్యూహరచన చేస్తోంది. విశాఖ రూరల్ ఎస్పీ అట్టాడ బాబూజీ రెండు రోజుల నుంచి ఏజెన్సీలోని పోలీసు యంత్రాం గంతో సమీక్షిస్తున్నారు. దీంతో ఏవోబీలో యుద్ధవాతావరణం నెలకొంది. ఒడిశాలోని రామ్‌గుడ ఎన్కౌంటర్ ఘటనతో తీవ్రంగా నష్టపోయిన మావోయిస్టు పార్టీ రెండేళ్ల వ్యవధిలో బలం పుంజుకుంది.కొత్త రిక్రూట్మెంట్తో పోలీసులకు సవాల్ విసురుతోంది. డుంబ్రిగుడ మండలంలో లివిటిపుట్టు వద్ద అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చిచంపిన ఘటన సంచలనం సృష్టించింది.ఈ సంఘటనతో మావోయిస్టులు ఏవోబీలో బలపడ్డారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. 1999లో ఆదిలాబాద్ జిల్లా కొయ్యూరు ఎన్కౌంటర్లో నరేశ్, ఆది,శ్యాం అనే ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు మరణించారు. దీనికి గుర్తుగా 2001 నుంచి పీఎల్జీఏ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. విశాఖ మన్యంలో మొదటి పీఎల్జీఏ వారోత్సవాల సమయంలో కొయ్యూరు పోలీసుస్టేషన్‌పై కాల్పులు జరిపారు.అప్పటి చింతపల్లి మాజీ ఎమ్మెల్యే దివంగత ఎం.వి.వి సత్యనారాయణకు చెందిన రెండు ఇళ్లను,తహసీల్దారు కార్యాలయాన్ని పేల్చివేశారు. దీని తరువాత ప్రతీ ఏడాది డిసెంబర్2–8 వరకు ఏవోబీలోనే వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. విధ్వంసాలకు వ్యూహాలు రచించే నంబళ్ల కేశవరావు అలియస్ బసవరాజ్ అలియాస్ గంగన్నకు ఏవోబీలో పట్టుంది. దీంతో విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వారోత్సవాలభగ్నానికి పోలీసుల వ్యూహం మావోయిస్టుల పీఎల్జీఏ వారోత్సవాలను భగ్నం చేసేందుకు ఆంధ్రా,ఒడిశా పోలీసు అధికారులు పకడ్బంధీగా వ్యూహ రచన చేశారని సమాచారం. ఒడిశా పోలీసు బలగాలతో పాటు,విశాఖ జిల్లాకు చెందిన పోలీసుపార్టీలుఉమ్మడిగాఏవోబీలోకూంబింగ్కుసిద్ధమయ్యాయి.ఇప్పటికేవిశాఖ ఏజెన్సీలోని మావోయిస్టు ప్రభావిత కొయ్యూరు,సీలేరు, జీకేవీధి,చింతపల్లి,అన్నవరం,జి.మాడుగుల,పెదబయలు,ముంచంగిపుట్టు పోలీసు స్టేషన్ల పరిధిలో అదనపు పోలీసు బలగాలను అందుబాటులో ఉంచారు. రాళ్లగెడ్డ,కోరుకొండ,నుర్మతి,రూడకోట అవుట్ పోస్టుల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అరకులోయ,డుంబ్రిగుడ పోలీసు స్టేషన్ల పరిధిలో పోలీసు బలగాలను అప్రమత్తం చేశారు. ఒడిశాలోని మల్కన్‌గిరి,కోరాపుట్ జిల్లాలకు చెందిన ప్రత్యేక పోలీసు పార్టీలతో విశాఖ జిల్లా పోలీసు పార్టీలు సమన్వయం చేసుకుని ఉమ్మడి కూంబింగ్‌కు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది.ఇప్పటికే మారుమూల ప్రాంతాలలో పోలీసు పార్టీలు సంచరిస్తున్నాయి. హిస్ట్ లిస్టులో ఉన్న నేతలు మైదానప్రాంతాలకు తరలివెళ్లాలని పోలీసులు సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి మావోయిస్టుల రాక విశాఖమన్యానికి ఎక్కువగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గుత్తికోయలు వస్తారు.వారు వచ్చేరంటే పెద్ద ఎత్తున ఏదో విధ్వంసానికి వ్యూహ రచన చేసి ఉంటారన్న అనుమానం కలుగుతుంది. కొద్దిరోజుల నుంచి గుత్తికోయల ఆనవాళ్లు కనిపిస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం అందుతోంది. సంతలో బ్యానర్లు కొయ్యూరు మండలం పలకజీడి వారపు సంతలో శుక్రవారం సీపీఐ మావోయిస్టుల పేరిట కరపత్రాలు,బ్యానర్లు వెలిశాయి. గ్రామగ్రామాన పీఎల్జీఏ వారోత్సవాలను నిర్వహించాలని సీపీఐ మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ పేరిట ఆ బ్యానర్లో పేర్కొన్నారు. కరపత్రాలు, బ్యానర్లు దర్శనమివ్వడంతో సంతబోసిపోయింది. వ్యాపారులు తగ్గిపోయారు. మందుపాతరల భయం మందుపాతరల భయం పోలీసు పార్టీలను వెంటాడుతోంది. గత ఏడాది పీఎల్జీఏ వారోత్సవాల సందర్భంగా పెదబయలు మండలం ఇంజరి అటవీ ప్రాంతంలో మందుపాతరలను పేల్చేందుకు మావోయిస్టులు భారీ వ్యూహం పన్నారు. అయితే పోలీసు పార్టీలు ముందుగానే గుర్తించి,వాటిని నిర్వీర్యం చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. జి.మాడుగుల మండలం నుర్మతి అవుట్ పోస్టుకు సమీపంలోని గాదిగుంట రోడ్డులో మావోయిస్టులు బుధవారం మందుపాతరలు పేల్చిన ఘటనలో తేలికపాటి గాయాలతో ఇద్దరు పోలీసులు సురక్షితంగా బయటపడ్డారు.దీంతో విశాఖ జిల్లా పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. రూరల్ ఎస్పీ అట్టాడ బాబూజీ రంగంలోకి దిగారు.నుర్మతి అవుట్ పోస్టును సందర్శించడంతో పాటు,చింతపల్లి,పాడేరు సబ్డివిజన్ల పోలీసు అధికారులు,ఇతర పోలీసు పార్టీలను అప్రమత్తం చేశారు. -
ఉనికి కోసమే అలజడులు
విశాఖక్రైం: ఏజెన్సీ ప్రాంతంలో తమ ఉనికిని కాపాడుకోడానికే మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహిస్తూ అలజడి సృష్టిస్తున్నారని ఎస్పీ అట్టాడ బాబూజీ అన్నారు. మావోయిస్టు వారోత్సవాల వల్ల గిరిజనులకు ఒరిగేది ఏమి లేదని చెప్పారు. అమాయక గిరిజన యువతను బలవంతంగా తమ వైపు తిప్పుకోవడానికి, వారిని భయపెట్టి బలిచేయడానికి మావోయిస్టులు పీఎల్జీఏ వారోత్సవాలు నిర్వహిస్తుంటారని చెప్పారు. ఈ మధ్య కాలంలో అత్యంత కీలకమైన వ్యక్తులను మావోయిస్టు పార్టీ కోల్పోయిందని, పలువురిని అరెస్టు చేశామని తెలిపారు. మావోయిస్టు ఉదయ్ భార్య మీనా ఎదురుకాల్పుల్లో చనిపోవడం, మావోయిస్టునేత నూనే నర్సింహరెడ్డి (అలియాస్ గోపాల్) భార్య బూతం అన్నపూర్ణ, పెదబయలు ఏరియా కమిటీ సభ్యుడు ముదలి సోనా(అలియాస్ కిరణ్)తో పాటు పలువురు అరెస్టు అయిన నేపథ్యంలో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బతగిలిందని తెలిపారు. దీంతో బలాన్ని పెంచుకోడానికి వారోత్సవాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. అమాయక గిరిజనులను మాయ మాటలు, పాటలతో ఆకట్టుకుని పార్టీలో చేర్చుకుంటున్నారని, పోలీసుల సమాచారం చేరవేయడానికి, చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ప్రేరేపిస్తున్నారని తెలిపారు. మావోయిస్టులు నిత్యం రకరకాల పేర్లతో వారోత్సవాలను నిర్వహిస్తున్నారని, దీంతో గిరిజనులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. వారోత్సవాల పేరుతో ప్రభుత్వ ఆస్తులైన సమాచార వ్యవస్థలు, కార్యాలయాలను ధ్వంసం చేయడం, ప్రజల ఆస్తులపై కరువుదాడులు చేస్తున్నారని తెలిపారు. తమ మాట వినని గిరిజనులను ఇన్ఫార్మర్ల పేరుతో హత్యలు చేస్తున్నారని చెప్పారు. వారోత్సవాలపై పూర్తి స్థాయిలో నిఘా కొనసాగిస్తున్నామన్నారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు సంచరించినా, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు తెలిసినా దగ్గరలో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నుర్మతి ఔట్‌పోస్టును సందర్శించిన ఎస్పీ విశాఖక్రైం,జి.మాడుగుల: జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీలో పోలీసులు లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర పేల్చిన ప్రాంతాన్ని ఎస్పీ అట్టాడ బాబూజీ సందర్శించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన నుర్మతి పంచాయతీ గాదిగుంట రోడ్డులో నిర్మాణదశలో ఉన్న వండ్రంగుల బ్రిడ్జి సమీపంలో బుధవారం ఉదయం మావోయిస్టులు రెండు చోట్ల మందుపాతరలను పేల్చారు. ఈ ఘటనలో కేంద్ర బలగాలకు చెందిన ఇద్దరు పోలీసులు, ఒక గిరిజనుడు గాయపడిన విషయం తెలిసిందే. సమాచారం తెలిసిన వెంటనే బుధవారం సాయంత్రం నుర్మతి ఔట్‌పోస్టును ఎస్పీ సందర్శించారు. ఏ ప్రాంతంలో మందుపాతర పేల్చారు, ఆ సమయంలో ఎంతమంది పోలీసులు ఉన్నారు తదితర వివరాలను తెలుసుకున్నారు. నుర్మతి ఔట్‌పోస్టు వద్దే ఎస్పీ, నర్సీపట్నం ఓఎస్డీ రాత్రి బస చేశారు. గురువారం ఉదయం మందుపాతర పేలిన ప్రదేశాన్ని పరిశీలించారు. స్థానిక గిరిజనులతో మాట్లాడారు. మావోయిస్టుల దాడులను తిప్పికొట్టే విధంగా పోలీసుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపారు. గురువారం మధ్యాహ్నం వరకు అక్కడే ఉన్నారు. నుర్మతి పోలీస్ ఔట్‌పోస్టుకు మరింత భద్రత పెంచినట్టు తెలిసింది. -
ఏపీఎఫ్డీసీ అధికారులు కాఫీ తోటలను వదిలివెళ్లాలి
విశాఖపట్నం , గూడెంకొత్తవీధి(పాడేరు): కాఫీ తోటలను గిరిజనులకు అప్పగించి ఏపీఎఫ్డీసీ అధికారులు ఏజెన్సీ ప్రాంతాన్ని వదిలివెళ్లాలని మావోయిస్టుపార్టీ గాలికొండ ఏరియా కమిటీ పేరుతో గురువారం బ్యానర్లు , కరపత్రాలు వెలిశాయి. వివరాలు ఇలా ఉన్నాయి. తాము పంచిపెట్టిన కాఫీతోటలను గిరిజనులు సాగు చేసుకుంటున్నారని, అడవిపై హక్కు ఆదివాసీలదేనని, గ్రామరాజ్యం కమిటీలతో సర్వ అధికారం పొందారని అందువల్ల కాఫీ తోటలను వదిలి ఏపీఎఫ్డీసీ అధికారులు వెళ్లిపోవాలని పేర్కొంటూ మండలంలోని కుంకుంపూడి ఘాట్‌రోడ్డులో గురువారం తెల్లవారు జామున గాలికొండ ఏరియా కమిటీ పేరిట బ్యానర్లు వెలిశాయి. జి.మాడుగుల మండలం నుర్మతి సమీపంలో పోలీసులను లక్ష్యంగా చేసుకుని మందుపాతర పేల్చి అలజడి సష్టించిన మావోయిస్టులు, ఇప్పుడు కాఫీతోటల వివాదం తెరపైకి తేవడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. -
దళపతిగా గణపతి పదవీ విరమణ
సాక్షి, హైదరాబాద్ : సీపీఐ (మావోయిస్టు) పార్టీ ప్రధాన కార్యదర్శి గణపతి (ముప్పాళ్ల నాగేశ్వరరావు) పదవీ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఆయన స్థానంలో పార్టీ సీనియరైన బసవరాజు (నంబాళ్ల కేశవరావు)ను ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటించింది. ఆయన ఎన్నికపై ఇదివరకే కేంద్ర కమిటీలో చర్చజరగగా నేడు (బుధవారం) ప్రధాన కార్యదర్శిగా బసవరాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ బహిరంగ లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీలో సుదీర్ఘ అనుభవం కలిగిన గణపతి వయోభారంతో, ఆరోగ్య సమస్యలతో పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర కమిటీని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో నూతన నాయకత్వానికి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు కేంద్ర కమిటీ తెలిపింది. 1992 జూన్‌లో మావోయిస్టు పార్టీకి గణపతి జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. పార్టీ కష్టకాలములో ఉన్న సమయంలో కీలక బాధ్యతలు స్వీకరించిన గణపతి.. పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేసే పనిని తన భుజాలకెత్తుకున్నారు. ఆ సమయంలో కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న కొండపల్లి సీతారామయ్య కమిటీకి నాయకత్వం వహిస్తూ సమస్యలు పరిష్కరించగలిగే స్థితిలో లేరు. ఆ సమయంలో కేంద్రకమిటీలో అంతర్గత సవాళ్లు, కొన్ని అవకాశవాద ముఠాలు పార్టీని చీల్చడానికి ప్రయత్నించాయి. వాటిన్నింటిని తిప్పికొట్టేందుకు కేంద్ర కమిటీ గణపతిని ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 1998లో సీపీఐ (ఎంఎల్) పీపుల్స్, సీపీఐ (ఎంఎల్, యూనిట్) విలీనమై సీపీఐ (ఎంఎల్) పీపుల్స్ వార్‌గా ఆవిర్భవించింది. ఈ పరిణామంతో పార్టీ అనేక రాష్ట్రాలకు విస్తరించి మరింత బలంగా మారింది. ఈ సందర్భంగా ఏర్పడిన నూతన కమిటీకి గణపతి నూతన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2000 నాటికి మిలటరీ పంథాను అభివృద్ధి చేసుకుని ప్రజావిముక్తి గెరిల్లా సైన్యాన్ని నిర్మించుకుంది. అనేక పరిణామాల నేపథ్యంలో 2004లో సీపీఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్, కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా (ఎంసీపీఐ)లు విలీనమై సీపీఐ (మావోయిస్టు)గా ఆవిర్భవించింది. రెండు పార్టీలు విలీనం కావడంతో భారత విప్లవోద్యమంలో మావోయిస్టు పార్టీ మహా స్రవంతిగా మారింది. ఈ పార్టీలో ఎంతో కీలకమైన నేతలతో సహా, నక్సల్బరీ తరం నాయకులు కూడా ఉన్నారు. 1992 నుంచి 2018 వరకు దాదాపు 26 ఏళ్లు గణపతి ప్రధాన కార్యదర్శి బాధ్యతలను నిర్వహించిన కాలమంతా ఉద్యమం అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ కేంద్ర నాయకత్వంలో పురోగమించింది. ఈ నేపథ్యంలో నూతన నాయకత్వాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా బసవరాజును కేంద్రకమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. ఆయన 17 ఏళ్లకు పైగా కేంద్రకమిటీ సభ్యుడుగా కొనసాగుతూ వస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వ నిర్భందం మరోవైపు విప్లవ బాటలో అనేక సవాళ్లను ఎదుర్కొని ముందుకు వెళ్లటం నూతన నాయకత్వం ముందు ఉన్న పరీక్ష అని మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది. -
దాచేపల్లిలో మావోయిస్టుల పోస్టర్ల కలకలం
గుంటూరు, దాచేపల్లి(గురజాల): మావోయిస్ట్ పార్టీ పల్నాడు రీజియన్ కమిటీ పేరుతో దాచేపల్లిలో వెలసిన పోస్టర్లు కలకలం సృష్టించాయి. దాచేపల్లిలోని ముత్యాలంపాడు రోడ్డులో ఉన్న ప్రభుత్వ బీసీ బాలుర వసతిగృహం గోడకు అధిక వడ్డీ, రేషన్ బియ్యం వ్యాపారులను హెచ్చరిస్తూ వెలసిన ఈ పోస్టర్లు చర్చనీయాంశమయ్యాయి. మావోయిస్ట్ పార్టీ పల్నాడు రీజియన్ కమిటీ పేరుతో వెలసిన ఒక పోస్టర్లో ‘‘రోజువారీ, వారాలవారీ, నెలవారీ వడ్డీలు, తాకట్టు రిజిస్ట్రేషన్లు, అధిక వడ్డీ వ్యాపార మార్గాల ద్వారా అక్రమ వ్యాపారం చేస్తున్న వారికి హెచ్చరిక. అధిక వడ్డీల ద్వారా ప్రజల శ్రమను దోచుకునే వారందరి వివరాలు మా దగ్గర ఉన్నాయి. ఇది చివరి అవకాశంగా భావించి ఒక నెల రోజులలో మీరు మీ అక్రమ వడ్డీ వ్యాపారాలు అన్నీ మానేసి సక్రమ పద్ధతిలో జీవనం సాగించాల్సిందిగా కోరుతున్నాం. లేకపోతే ప్రజా కోర్టులో తీవ్రమైన శిక్ష అనుభవించాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించారు. మరో పోస్టర్లో.. ‘‘రేషన్ బియ్యం దొంగ రవాణా చేస్తున్న మందపాటి నరసింహారావు, దొంగ బియ్యం రవాణాకు నెలవారీ లంచాలు, మామూళ్లు తీసుకుని సహకరిస్తున్న రాజకీయ నాయకులకు, పత్రికా విలేకరులకు ఇదే మా మొదటి, చివరి హెచ్చరిక. ఒక నెల రోజుల్లో మీ అక్రమ వ్యాపారాన్ని మానివేయాలి. లేకపోతే ప్రజాకోర్టులో తీవ్రమైన శిక్షను అనుభవించాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించారు. గోడపై వెలసిన ఈ పోస్టర్లను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్టర్లు నిజంగా మావోయిస్టులు అంటించారా.. లేకపోతే స్థానికుల ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ షేక్ మహ్మద్ రఫీ చెప్పారు. ఒకప్పుడు మావోయిస్ట్‌ల ప్రభావం అధికంగా ఉన్న పల్నాడులో తాజాగా పోస్టర్లు వెలియటంతో స్థానికులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. దాచేపల్లిలోని మన్నెంవారి కుంటలో జరుగుతున్న ఇళ్ల స్థలాల అక్రమాలపై ముగ్గురు వ్యక్తులను హెచ్చరిస్తూ 2017 ఫిబ్రవరి 2న దాచేపల్లిలోని షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మావోయిస్ట్ పార్టీ పేరుతో ఒక పోస్టర్‌ను వేశారు. ఈ పోస్టర్ అప్పట్లో తీవ్ర సంచలనమైంది. -
‘రిగ్గింగ్ కోసమే భారీ బలగాలు’
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం 18 నియోజకవర్గాల్లో జరగనున్న మొదటి దఫా ఎన్నికల్లో పోలీస్ సిబ్బంది ద్వారా రిగ్గింగ్‌కు పాల్పడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ సంయుక్తంగా ఆరోపించాయి. భారీ ఎత్తున పోలీస్ బలగాలను, హెలికాప్టర్లను ఏర్పాటుచేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని ఈ రెండు కమిటీల కార్యదర్శులు వికల్ప్, జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. పోలీసులతో జర్నలిస్టులు, ఎన్నికల సిబ్బంది కలిసి రావద్దని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలను బహిష్కరించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, బలవంతంగా ఓట్లు వేయించడం, రిగ్గింగ్‌కు పాల్పడే విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీనికి ప్రభుత్వాలు, పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరించారు. -
ముందస్తు ఎన్నికలను బహిష్కరించండి
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ సోమవారం ఓ లేఖలో డిమాండ్ చేసింది. సరైన కారణాలు చెప్పకుండా ప్రభుత్వాన్ని రద్దు చేసి కేసీఆర్ ప్రజలను మోసం చేశారని మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ శక్తులను ఏకం కాకుండా చేసి ముందస్తు ఎన్నికల్లో నెగ్గేందుకు ఎత్తుగడ వేశారని విమర్శించారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దేశరాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్నారని, బీజేపీతో చేసుకున్న లోపాయికారీ ఒప్పందం బట్టబయలుకావడంతో ఆశించిన రీతిలో ఫ్రంట్‌కు అడుగులు పడలేదన్నారు. ఇతర పార్టీల్లో గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులు చేసి ప్రతిపక్షాలను బలహీనపరిచారన్నారు. నీళ్లు నిధులు నియామకాలతో ప్రభుత్వంలోకి వచ్చి 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని ఆరోపించారు. తెలంగాణ వ్యతిరేకులకు పదవులు.. ఏనాడూ ఉద్యమం చేయని, తెలంగాణ వ్యతిరేకులుగా ముద్రపడ్డ వారిని మంత్రి మండలిలోకి చేర్చుకొని లక్షల కోట్లు కాంట్రాక్టుల పేరుతో కొల్లగొట్టారన్నారు. టీపాస్ పేరుతో పారిశ్రామికవేత్తలకు దోచిపెడుతున్నారని, నీళ్లు, ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించి కోట్ల రూపాయల్లో లాభాలు కల్పించినట్టు హరిభూషణ్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో 4 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాటి నియంత్రణకు చర్యలు చేపట్టకపోవడం, రైతులకు బేడీలు వేసిన ఘనత దేశంలో కేసీఆర్‌కే దక్కుతుందని ఆరోపించారు. రైతుబంధు పథకం ద్వారా భూస్వాములకే ఆర్థిక సహాయం చేస్తూ నిరుపేద రైతులను కేసీఆర్ మోసం చేశారన్నారు. మహాకూటమి పేరుతో కొత్త డ్రామా దేశ రాజకీయాలను భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్తగా మహాకూటమి పేరుతో డ్రామా మొదలుపెట్టి ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని హరిభూషణ్ విరుచుకుపడ్డారు. సీపీఐ, సీపీఎంలు పాలక పార్టీలతో అంటకాగుతూ ఏదో ఒక దోపిడీ వర్గానికి బలం చేకూర్చేలా వ్యవహరిస్తూ ప్రజలను విప్లవోద్యమంలోకి రాకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలతో పనిచేసిన కోదండరాం ఇప్పుడు దోపిడీ వర్గ పార్టీలకు మేలు చేసేలా వ్యవహరించడం సరైంది కాదని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రజలు ఈ బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని హరిభూషణ్ పిలుపునిచ్చారు. -
దాడి మీడియా లక్ష్యంగా కాదు: మావోలు
రాయ్‌పూర్: దూరదర్శన్ కెమెరామన్ అచ్యుతానంద్ సాహు, మరో ఇద్దరు మీడియా సిబ్బందితో పాటుగా పోలీసులపై ఈ నెల 30న జరిగిన దాడికి బాధ్యత వహిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. మావోయిస్టు దర్భా డివిజన్ కమిటీ కార్యదర్శి సాయినాథ్ పేరుతో రెండు పేజీల లేఖను ఆ పార్టీ వెల్లడించింది. ఆ దాడి మీడియా లక్ష్యంగా జరిగింది కాదని, పోలీసుల లక్ష్యంగానే దాడి జరిగినట్లు పేర్కొన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోకి మీడియా వ్యక్తులు వచ్చేటప్పుడు పోలీసులను వెంటపెట్టుకురావొద్దని ఆ పార్టీ కోరింది. అక్టోబర్ 30న నక్సల్స్ జరిపిన దాడిలో ముగ్గురు పోలీసులు, దూరదర్శన్ కెమెరామన్ అచ్యుతానంద్ సాహు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పోలీసులే లక్ష్యంగా దాడి చేస్తే చేతిలో కెమెరా పట్టుకున్న అచ్యుతానంద్ సాహుపై కూడా మావోయిస్టులు కాల్పులెందుకు జరిపారని ఆ రాష్ట్ర స్పెషల్ డైరెక్టర్ జనరల్ డీఎం అవస్థి తీవ్రంగా స్పందించారు. -
రాష్ట్రంపై మావోయిస్టుల గురి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ గుర్తింపు చాటుకునేందుకు మావోయిస్టు పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. సీఆర్పీఎఫ్–గ్రేహౌండ్స్ కూంబింగ్‌లో రెండు రోజులక్రితం బయటపడ్డ ల్యాండ్‌మైన్లే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చని ఇంటెలిజెన్స్ అధికారులు అభిప్రాయపడ్డారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హతమార్చి గుర్తింపు చాటుకున్న మావోయిస్టు పార్టీ, ఎన్నికలు జరగబోతున్న తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో అలజడి సృష్టించేందుకు పథకం రూపొందించినట్టు తెలిసింది. అయితే ముందస్తు భద్రతా చర్యలను చేపట్టిన తెలంగాణ పోలీస్, సీఆర్పీఎఫ్ మావోయిస్టులు పాతిపెట్టిన ల్యాండ్మైన్లను నిర్వీర్యం చేస్తోంది. మూడు నెలల క్రితమే.. ఈ ఏడాది మార్చిలో ఖమ్మం జిల్లా వెంకటాపురం, వాజేడు ప్రాంతాల్లో రోడ్డుకిరువైపులా పాతిపెట్టిన ల్యాండ్మైన్లను బలగాలు కూంబింగ్‌లో భాగంగా నిర్వీర్యం చేశాయి. అయితే భారీ స్థాయిలో ఒక వైపు సీఆర్పీఎఫ్, మరోవైపు గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీలు అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నప్పటికీ మావోయిస్టు పార్టీ మళ్లీ ల్యాండ్మైన్లను అమర్చడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సరిగ్గా రెండురోజుల క్రితం చర్ల ప్రాంతంలోని తాలిపేరు ప్రాజెక్టు దగ్గర్లో మావోయిస్టులు అమర్చిన రెండు ల్యాండ్మైన్లను నిర్వీర్యం చేశారు. వీటిని ఈ ఏడాది ఆగస్టులో అమర్చినట్టు బలగాలు గుర్తించాయి. ఛత్తీస్‌గఢ్ సరిహద్దు నుంచి తెలంగాణ ప్రాంతంలోకి మావోయిస్టులు అడుగుపెట్టడం, ల్యాండ్మైన్లు అమర్చడం ఎన్నికల సందర్భంలో మరింత ఆందోళన కలిగిస్తోంది. గతంలో చర్ల మండలం ఉంజుపల్లిలో 2009 ఎన్నికల సందర్భంగా ఈవీఎం కంట్రోల్ యూనిట్‌ను టార్గెట్‌గా చేసుకొని ల్యాండ్మైన్లను పేల్చేందుకు మావోయిస్టులు ప్రయత్నించారు. అయితే అది కుదరకపోవడంతో ఈవీఎం కంట్రోల్ యూనిట్లను తీసుకొని సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సును తగులబెట్టారు. గెరిల్లా దాడులకు వ్యూహం ఎన్నికల సందర్భంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని నేతలను టార్గెట్ చేస్తూ విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రతిసారీ హెచ్చరికలు చేస్తాయి. అయితే ఈసారి గెరిల్లా దాడులకు మావోయిస్టు పార్టీవ్యూహం పన్నేలా కనిపిస్తోందన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీ నేతలే టార్గెట్ అనుకొని కేవలం ఆ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులకే భద్రత కట్టుదిట్టం చేస్తే, మిగిలిన పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులపై మావోయిస్టులు గెరిల్లా దాడులకు పాల్పడే అవకాశం లేకపోలేదని కేంద్ర నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. రాష్ట్రంలోని టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలను టార్గెట్‌గా చేసుకొని తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ కార్యకలాపాలు వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఎన్నికలను టార్గెట్‌గా చేసుకొని వి«ధ్వంసాలకు పాల్పడే ప్రమాదం ఉందని రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తం అయ్యాయి. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు అటవీ ప్రాంతం మొత్తం జల్లెడ పట్టేందుకు ఇప్పటికే బలగాలను రంగంలోకి దించారు. ఒకవైపు సీఆర్పీఎఫ్, మరోవైపు రాష్ట్ర గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్‌ను విస్తృతం చేసినట్టు తెలిసింది. ఎన్నికల సమయానికి ముందే మావోయిస్టుల వ్యూహాలను తిప్పికొట్టేందుకు రాష్ట్రపోలీస్ శాఖ పనిచేస్తోందని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అందులో భాగంగా ముందస్తు చర్యలు చేపట్టి, ఎక్కడెక్కడ సున్నితమైన పోలింగ్ కేంద్రాలున్నాయో ఆప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకొనిసోదాలు, కూంబింగ్, రోడ్ పార్టీ తనిఖీలు వేగవంతం చేస్తున్నామని తెలిపారు. -
కిడారి హత్యలో ఆ ఇద్దరూ ఉన్నారా?
సాక్షి, అమరావతి/ఏలూరు, సాక్షి ప్రతినిధి: ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి హత్యలో మావోయిస్టులు రైను, స్వరూప ఉన్నారా? లేదా అనేదానిపై సందిగ్ధం కొనసాగుతోంది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లోని జంత్రి వద్ద 2016, అక్టోబర్ 24న జరిగిన కోవర్టు దాడిలో రైను, స్వరూపలతోపాటు 27మంది కామ్రేడ్స్ అమరులయ్యారంటూ 2016, అక్టోబర్ 26న సీపీఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ప్రకటించారు. ఇదిలా ఉంటే పోలీసులు మాత్రం రైను, స్వరూపలు ఈ నెల 23న లివిటిపుట్టు ఆపరేషన్‌కు నేతృత్వం వహించారని వారి ఫొటోలతో సహా అధికారిక ప్రకటన చేశారు. అటు జగన్ ప్రకటన, ఇటు పోలీసుల ప్రకటన అయోమయానికి గురిచేసేలా ఉండటం గమనార్హం. హత్యల్లో పాల్గొన్న మావోయిస్టుల్లో ముగ్గురిని గుర్తించినట్టు పోలీసులు ప్రకటించారు. వారిలో భీమవరానికి చెందిన కామేశ్వరి అలియాస్ స్వరూప అలియాస్ సింద్రి అలియాస్ చంద్రి అలియాస్ రింకీ, తూర్పుగోదావరి జిల్లా దుబ్బపాలెంకు చెందిన జలుమూరి శ్రీనుబాబు అలియాస్ సునీల్, అలియాస్ రైను, విశాఖ జిల్లా కరకవానిపాలెం గ్రామానికి చెందిన వెంకట రవి చైతన్య అలియాస్ అరుణల ఫొటోలు, వివరాలతో సహా పోలీసులు విడుదల చేశారు. 2016లో మావోయిస్టు జగన్.. ఆంధ్రా, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన 27 మంది కామ్రేడ్స్‌ను కోల్పోయామని వారి పేర్లతో సహా ప్రకటించారు. వీరిలో స్వరూప, రైను కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారు ఉన్నారో? లేదో? పోలీసులు లేదా మావోయిస్టులైనా నిర్ధారించాల్సి ఉంది. -
హింసపై మావోయిస్టులు పునరాలోచించాలి
సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నం జిల్లా అరకులో ఆదివారం జరిగిన హింసపై మావోయిస్టు పార్టీ పునరాలోచించుకోవాలని సామాజిక ఉద్యమకారుడు ప్రొఫెసర్.హరగోపాల్ సోమవారం సూచించారు. హింస ద్వారా వ్యవస్థలు మారవని, ప్రజల భాగస్వామ్యం, చైతన్యంతో కూడిన పోరాటాల ద్వారానే మార్పు సాధ్యమని ఆయన పేర్కొన్నారు. వ్యక్తుల నిర్మూలన ప్రజల్ని.. హింస–ప్రతిహింసా వలయంలోకి నెడుతుందని హరగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య, మానవీయ విలువల ఆధారంగానే ఉద్యమాలు ఉండాలని అభిలాషించారు. మనుషుల ప్రాణాలను తీయడం మార్పునకు ఎంతవరకు దోహదపడుతుందో ఉద్యమకారులు ఆలోచించాలని చెప్పారు. మరోవైపు ప్రభుత్వాలు కూడా ఖనిజ వనరులను జాతీయం చేసి, ఆ సంపదను సామాజిక ప్రయోజనాలకు ఉపయోగపడేలా చూడాలని కోరారు. -
అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు..!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులు ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను కాల్చి చంపిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, మావోయిస్టుల కదలికలపై డీజీపీ మహేందర్‌రెడ్డి ఇంటెలిజెన్స్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులతో సమీక్షించారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ కార్యకలాపాలు, కదలికలపై నుంచి ఆరా తీశారు. గతంలో జరిగిన దాడులు, సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను సమీక్షించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న జిల్లాలతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని తాజా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర నేతలకు భద్రత కట్టదిట్టం చేయాలని ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. 2012 వరకు రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు అక్కడక్కడా కొనసాగాయి. అయితే పోలీసుశాఖ ఆ తర్వాత నుంచి వ్యూహాత్మక చర్యలు చేపట్టడంతో మావోయిస్టు పార్టీ ఛత్తీస్‌గఢ్‌కే పరిమితమైంది. గోదావరి దాటి రాష్ట్ర సరిహద్దుల్లోకి రాకుండా గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ బలగాలు మావోయిస్టు పార్టీని నియంత్రించడంతో తెలంగాణ మావోయిస్టు పార్టీ కమిటీ ఇప్పటివరకు పెద్దగా కార్యకలాపాలు సాగించలేదు. ఎన్నికల వేళ కలవరం... రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో నేతలంతా నియోజకవర్గాల్లోనే మకాం వేశారు. మారుమూల గ్రామాలకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. దీంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని నియోజకవర్గాలైన ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, చెన్నూర్, మంథని, భూపాలపల్లి, అటవీ ప్రాంతంగా ఉన్న ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, భద్రాద్రి నేతలను పోలీస్‌శాఖ çఅప్రమత్తం చేసింది. అధికార పార్టీతోపాటు ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా సంబంధిత డీఎస్పీ లేదా ఎస్పీ అధికారికి సమాచారం ఇవ్వాలని, పోలీసు భద్రతతోనే వారు పర్యటనలు సాగించేలా చూడాలని సిబ్బందిని ఆదేశించింది. నేతల హెచ్చరికలు పట్టించుకోని సమయంలో ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని పోలీస్‌శాఖ అత్యవసర సర్క్యులర్‌లో ఆదేశించింది. మంథని, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం జిల్లాల్లో కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు మావోయిస్టు పార్టీ ప్రయత్నిస్తున్న సమాచారం నేపథ్యంలో అక్కడ అదనపు బలగాలను రంగంలోకి దించాలని, కూంబింగ్ పెంచాలని ఎస్పీలను పోలీసుశాఖ ఆదేశించింది. ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఉన్న సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపులతో సమన్వయం చేసుకుంటూ మావోయిస్టుల కదిలకలను నియంత్రించాలని సూచించినట్లు తెలుస్తోంది. శబరితోనే భయం... మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీకి అనుబంధంగా పనిచేస్తున్న శబరి కమిటీతో అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ ఎస్పీలను పోలీసుశాఖ ఆదేశించింది. మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులను టార్గెట్ చేసి దాడులు చేయడం, సెల్‌ఫోన్ టవర్లు పేల్చేయడం వంటి ఘటనలకు అప్పుడప్పుడు ఈ కమిటీ పాల్పడుతోంది. ఈ కమిటీ నేతృత్వంలో నడుస్తున్న మణుగూరు కమిటీ ఏకంగా ల్యాండ్మైన్లను పెట్టడం, టిఫిన్ బాక్స్ బాంబులను తయారు చేసి అమర్చడంలో దిట్టగా పేరుగాంచింది. వాజేడు, వెంకటాపురం, చర్ల, పినపాక ప్రాంతాల్లో కార్యకలాపాలు విస్తృతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. పశ్చిమ, తూర్పు గోదావరి, ఖమ్మం ప్రాంతాలను శబరి కమిటీ పర్యవేక్షిస్తోంది. దీంతో కూంబింగ్ కోసం గ్రేహౌండ్స్ పార్టీలను ఆదివారం మ«ధ్యాహ్నమే రంగంలోకి దించినట్లు నిఘా వర్గాల ద్వారా తెలిసింది. -
4న మావోయిస్టుల రాష్ట్ర బంద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో పోలీస్ శాఖ అప్రకటిత హైఅలర్ట్ ప్రకటించింది. వారం నుంచి తెలంగాణ–మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాల్లో తుపాకుల మోత మోగుతోంది. పోలీసుల ఎన్కౌంటర్లో 49 మంది మావోయిస్టులు మృతి చెందారు. దీంతో ప్రతీకారం దిశగా మావోయిస్టు పార్టీ కార్యాచరణ రూపొందించినట్లు ఎస్ఐబీ వర్గాల సమాచారంతో జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. అటు మావోయిస్టు పార్టీ సైతం దెబ్బకు దెబ్బ తప్పదంటూ హెచ్చరిక జారీచేసింది. దీనితో పోలీస్‌శాఖ అప్రమత్తమైంది. ప్రజల చేతిలో శిక్ష తప్పదు: మావోయిస్టు పార్టీ అమాయక గిరిజన మహిళలపై మావోయిస్టుల నెపం మోపి అత్యంత కిరాతకంగా కాల్చి చంపుతున్నారంటూ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు. వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లన్నీ బూటకమని, ఏకపక్షంగా కాల్పులు జరిపి రోజుకో ఎన్కౌంటర్ పేరుతో మృతదేహాలను చూపిస్తున్నారంటూ జగన్ మండిపడ్డారు. ఇంతటి దారుణకాండకు పాల్పడ్డ పాలకులకు, పోలీస్ బలగాలకు ప్రజల చేతిలో శిక్ష తప్పదంటూ.. దెబ్బకు దెబ్బ తీస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో జరుగుతున్న మారణకాండకు నిరసనగా మావోయిస్టు పార్టీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చినట్టు పార్టీ వెల్లడించింది. ఇందులో భాగంగా మే 4న తెలంగాణ రాష్ట్ర బంద్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఎమ్మెల్యే మధు టార్గెట్‌గా లేఖలు.. మంథని ఎమ్మెల్యే పుట్టా మధుకర్‌ను టార్గెట్ చేస్తూ మావోయిస్టు పార్టీ కొద్ది రోజులుగా కదలికలు చేపట్టినట్లు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) భావి స్తోంది. దీనికి బలం చేకూర్చేలా మావోయిస్టు పార్టీ కొద్దిరోజుల క్రితం మధుకర్‌కు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదంటూ రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజాప్రతినిధులకు భద్రత పెంపు... గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులకు పోలీస్ శాఖ భద్రత పెంచినట్లు తెలుస్తోంది. ఏడాది నుంచి పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం తదితర ప్రాం తాల్లోని ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు హెచ్చరికలు జారీచేస్తున్నారు. వారం నుంచి వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో గోదావరి పరీవాహక ప్రాం తాల్లో హైఅలర్ట్ ప్రకటించినట్లు వారు తెలిపారు. ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు లేకుండా మారుమూల ప్రాంతాల పర్యటనకు వెళ్లవద్దని సంబంధిత ఎస్పీలు ప్రజాప్రతినిధులకు సూచిస్తున్నారు. అటు గ్రేహౌండ్స్, జిల్లాల పార్టీలను రంగంలోకి దించిన పోలీస్ శాఖ కూంబింగ్‌ను వేగవంతం చేసింది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల నుంచి మావోయిస్టులను రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకునేందుకు భారీ స్థాయి లో ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలిసింది. -
మావోల కొత్త కమిటీలు !
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో పూర్వవైభవం కోసం మావోయిస్టు పార్టీ ప్రయత్నిస్తోంది. కమిటీల పునర్వ్యవస్థీకరణ, కొత్త కమిటీలకు శ్రీకారం చుడుతోంది. ఈ మేరకు పోలీసులకు కీలక సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో మార్చి 2న జరిగిన భారీ ఎన్కౌంటర్ తర్వాత పోలీసులకు ఆపార్టీకి చెందిన కీలక సమాచారం చిక్కినట్లు చెబుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపూర్ తడపలగుట్ట, ఛత్తీస్‌గఢ్‌లోని పూజారి కాంకేడ్ సమీపంలో జరిగిన ఎన్కౌంటర్ల అనంతరం పోలీసులు ఆ పార్టీ కార్యకలాపాలపై మరింత దృష్టి సారించారు. మూడు జిల్లాలకో డివిజన్ కమిటీ ఉత్తర తెలంగాణలో కొత్తగా మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీలను పునరుద్ధరించింది. పూర్వ కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కొత్త గా ఏర్పడిన జిల్లాలను కలుపుకొని ఈ కమిటీలు వేసినట్లు పోలీసువర్గాలు నిర్ధారించాయి. పెద్దపల్లి–కరీంనగర్–భూపాలపల్లి జయశంకర్–వరంగల్ జిల్లాలు కలిపి ఓ డివిజన్ కమిటీ కాగా, ఆ కమిటీకి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీ కింద ఏటూరునాగారం–మహదేవ్పూర్ ఏరియా కమిటీ, ఇల్లెందు–నర్సంపేట ఏరియా కమిటీలు వేయగా, ఆ కమిటీలు సుధాకర్, కూసం మంగు అలియాస్ లచ్చన్న ఏరియా కమిటీ కార్యదర్శులుగా వ్యవహరిస్తున్నారు. మంచిర్యాల–కొమురంభీం(ఎంకేబీ) డివిజనల్ కమిటీకి ఇంతకు ముందు ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా ఉన్న మైలారపు ఆదెల్లు అలియాస్ భాస్కర్‌కు నాయకత్వం అప్పగించారు. ఇంద్రవెల్లి, మంగి, చెన్నూర్–సిరిపూర్ ఏరియా కమిటీలు ఏర్పాటైనట్లు సమాచారం. భద్రాద్రి కొత్తగూడెం–తూర్పుగోదావరి డివిజనల్ కమిటీ కొత్తగా ఏర్పడగా దీనికి కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ కార్యదర్శిగా ఉన్నారు. దీని కింద చర్ల–శబరి ఏరియా కమిటీ, లోకే సారమ్మ అలియాస్ సుజాత నేతృత్వంలో మణుగూరు ఏరియా కమిటీ, కుంజా లక్షణ్ అలియాస్ లచ్చన్న నేతృత్వంలో స్పెషల్ గెరిల్లా స్వా్కడ్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. చర్ల–శబరి ఏరియా కమిటీ కింద కోసీ అలియాస్ రజిత నేతృత్వంలో చర్ల లోకల్ ఆర్గనైజింగ్ స్వా్కడ్, ఉబ్బ మోహన్ నేతృత్వంలో శబరి లోకల్ ఆర్గనైజిగ్ స్క్వాడ్లు పనిచేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర కమిటీ పునర్వ్యవస్థీకరణ మావోయిస్టు పార్టీ గతలలో ఉన్న కమిటీలకు స్వస్తి పలికింది. రాష్ట్ర విభజన తర్వాత ఎన్‌టీఎస్‌జడ్‌సీని తెలంగాణ రాష్ట్ర కమిటీ (టీఎస్సీ) గా మార్చారు. ఆంధ్ర రాష్ట్ర కమిటీ కనుమరుగు కాగా ఏవోబీ కొనసాగుతోంది. కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో మావోయిస్టు పార్టీ కూడా రాష్ట్ర కమిటీని పునర్ వ్యవస్థీకరించింది. కేకేడబ్ల్యూను ఎత్తివేసి దాని స్థానంలో కొత్తగా 3 డివిజన్ కమిటీలు వేసింది. తెలంగాణ రాష్ట్ర కమిటీకి కార్యదర్శిగా యాప నారాయణ అలియాస్ లక్మ అలియాస్ హరిభూషణ్ నియమితులు కాగా.. సభ్యులుగా బండి ప్రకాశ్ అలియాస్ క్రాంతి, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, మైలారపు ఆదెల్లు అలియాస్ భాస్కర్‌ను నియమించినట్లు సమాచారం. ఈ మేరకు పోలీసుశాఖ మావోయిస్టుల వివరాలతో కూడి న వాల్‌పోస్టర్లను ఉత్తర తెలంగాణలోని పలు చోట్ల వేయడం చర్చనీయాంశంగా మారింది. -
ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరి హత్య
చర్ల: పోలీసు ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు ఇద్దరు యువకులను హతమార్చారు. గతంలో మావోయిస్టు పార్టీ లో పని చేసి జనజీవన స్రవంతిలో కలసిన ఈ ఇద్దరిని ఇన్ఫార్మర్లుగా అనుమానిస్తూ ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో బుధవారం హతమార్చారు. వివరాలు.. భద్రాద్రి జిల్లా చర్ల మండలం పూసుగుప్ప గ్రామానికి చెందిన ఇర్పా లక్ష్మణ్ అలియాస్ భరత్ (30) నాలుగేళ్ల పాటు మావోయిస్టు పార్టీ లో దళ సభ్యుడిగా పని చేసి గత మే నెలలో లొంగిపోయాడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా చినఊట్లపల్లి గ్రామానికి చెందిన సోడి అందాల్ అలియాస్ నందా (20) కొంతకాలం మావోయిస్టు పార్టీలో పని చేసి గత జూన్‌లో లొంగిపోయి కూలీ పనులు చేసుకుంటున్నాడు. కాగా, ఇర్పా లక్ష్మణ్ కూరగాయలు అమ్ముకునేందుకు వెళ్లగా ఈనెల 24న మావోలు పట్టుకున్నారు. సోడీ అందాల్ను ఈనెల 18న కిడ్నాప్ చేశారు. వీరిద్దరినీ బుధవారం చినఊట్లపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజాకోర్టులో విచారించి హతమార్చారు. ఈ నెల 2న పూజారికాంకేర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌కు వీరే కారకులని, అందుకు వీరికి ఈ శిక్ష విధించామని భద్రాద్రి కొత్తగూడెం–తూర్పు గోదావరి (బీకే–ఈజీ) డివిజన్ కమిటీ పేరిట లేఖలు వదిలారు. -
9న మావోయిస్టుల రాష్ట్ర బంద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని అటవీప్రాంతంలో గత శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసగా మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నెల 9 న (శుక్రవారం) రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తూ మవోయిస్టు పార్టీ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మావోయిస్టులపై బూటకపు ఎన్‌కౌంటర్‌కు పాల్పడ్డారని.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలను చేపడుతున్నారన్నారు. బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ బంద్‌కు పిలుపునిచ్చామన్నారు. బంద్‌ను విజయవంతం చేయాలని మావోయిస్టులు ప్రజలను కోరారు. కాగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం సమీపంలోని తడపలగుట్టల్లో భారీ ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో పది మంది మావోయిస్టులు మృతి చెందారు. -
నేతల్లో దడ!
సాక్షి, కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్ సరిహద్దు దాటి వచ్చి రాష్ట్రంలో గత మూడు నెలలుగా కార్యకలాపాలు ముమ్మరం చేస్తున్న మావోయిస్టులకు తాజా ఎన్‌కౌంటర్‌తో భారీ దెబ్బ తగిలింది. వారి కార్యకలాపాలను ఆదిలోనే అడ్డుకునేందుకు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం దండకారణ్యాన్ని జల్లెడ పడుతోంది. అయినా మావోయిస్టులు గోదావరి పరీవాహక ప్రాంతం ద్వారా మరిన్ని జిల్లాల్లోకి విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కూంబింగ్ వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో మావోయిస్టులను నిలువరించేందుకు పోలీసులు మరింత వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. అయితే ప్రస్తుత ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ విడుదల చేసిన ప్రకటనతో మరింత టెన్షన్ నెలకొంది. దీంతో సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో అనే ఉత్కంఠ రాజ్యమేలుతోంది. గిరిజన గూడేలతోపాటు ఛత్తీస్‌గఢ్‌కు సరిహద్దులో ఉన్న భద్రాచలం, పినపాక, ములుగు నియోజకవర్గాల పరిధిలోని టీఆర్ఎస్ నాయకులు హడలిపోతున్నారు. అధికార పార్టీ నేతలే టార్గెట్ అని జగన్ ప్రకటించడంతో వారిలో అలజడి రేకెత్తుతోంది. మావోయిస్టు అగ్రనేతలే లక్ష్యంగా పోలీసులు.. మూడేళ్లుగా తెలంగాణలో మావోయిస్టుల కార్యకలాపాలు నామమాత్రమే. ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలోకి చొచ్చుకొచ్చేందుకు మావోయిస్టు అగ్రనేతలే నేరుగా భద్రాద్రి, భూపాలపల్లి జిల్లాల సరిహద్దులోని బీజాపూర్, దంతెవాడ, సుక్మా జిల్లాల్లోని దండకారణ్యాన్ని షెల్టర్‌జోన్‌గా చేసుకుని తెలంగాణ ప్రాంతంలో కార్యకలాపాలు విస్తరిస్తున్నట్లు తెలిసింది. భద్రాచలం, పినపాక, ఏటూరు నాగారం ఏజెన్సీల్లో రిక్రూట్మెంట్లు సైతం భారీగా చేసుకుంటున్నట్లు సమాచారం. దీంతో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ పోలీసులతో కలిసి భారీగా కూంబింగ్ ఆపరేషన్లు చేపడుతున్నారు. మావోయిస్టు పార్టీ కేడర్‌కు దిశా నిర్దేశం చేస్తున్న అగ్రనేతలే లక్ష్యంగా పోలీస్ బలగాలు ముందుకు కదులుతున్నాయి. ఈ క్రమంలో మావోయిస్టులు రెండు రాష్ట్రాల్లో పలు విధ్వంసక చర్యలకు పాల్పడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా జిల్లాల్లో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్‌లపై దాడులకు పాల్పడడంతో అనేకసార్లు మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో ఛత్తీస్‌గఢ్‌తో పాటు చర్ల, వెంకటాపురం, పినపాక మండలాల్లో పలువురు పౌరులను హత్యచేశారు. రెండు రాష్ట్రాల్లో పలు విధ్వంసాలకు పాల్పడ్డారు. వారిని అడ్డుకునే యత్నాల్లో భాగంగా తాజా ఎన్కౌంటర్ చోటు చేసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ఆపరేషన్ మొత్తం భద్రాచలం నుంచి జరగడంతోపాటు తెలంగాణ పోలీసులు కీలకపాత్ర పోషించడంతో మావోయిస్టు పార్టీ నేరుగా ప్రకటన చేసింది. ఇకపై అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు వ్యూహాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అధికారపార్టీ నాయకులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరిహద్దులో మరింత ఉద్రిక్తం... బీజాపూర్ జిల్లాలో తడపలగుట్ట అడవుల్లో మావోయిస్టులు పెద్దఎత్తున సమావేశమైనట్లు పక్కా సమాచారం అందడంతో పోలీస్ బలగాలు వేగంగా ముందుకు కదిలాయి. ఆ ప్రాంతంలో 150 నుంచి 200 మంది వరకు మావోయిస్టులు ఉన్నారని, అందులో అగ్రనేతలు ఉంటారనే లక్ష్యంతో గ్రేహౌండ్స్ బలగాలు చుట్టుముట్టడంతో ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. మిగిలిన మావోయిస్టు సభ్యులు, అగ్రనేతలు ఆ ప్రాంతాల్లోనే ఉన్నట్లు పోలీసులు ఇప్పటికీ భావిస్తూ అదనపు బలగాలను దింపి దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు. దీంతో సరిహద్దు జిల్లాల్లో ఎప్పుడేం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. ఏజెన్సీ ప్రాంత నేతల్లో మరింత దడ... మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ప్రకటన నేపథ్యంలో వారు ప్రతీకార చర్యలకు దిగడం ఖాయమని భావిస్తున్న టీఆర్ఎస్ నేతల్లో మరింత దడ నెలకొంది. ముఖ్యంగా భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు, పినపాక నియోజకవర్గంలోని పినపాక, కరకగూడెం, అశ్వాపురం మండలాల నాయకులు భయంతో ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. -
అడవుల్లో మళ్లీ తుపాకుల మోత
సాక్షి, జయశంకర్ జిల్లా : తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని అటవీప్రాంతంలో శుక్రవారం జరిగిన భారీ ఎన్కౌంటర్ మరవకముందే మరో సారి ఆ ప్రాంతం కాల్పులతో దద్దరిల్లుతోంది. పక్కా సమాచారంతో పోలీసులు మావోయిస్టుల కదలికలను గుర్తించి దాడి చేయడంతో కాల్పుల మోత మోగుతోంది. పూజారి కాకేరు తడపాల అడవుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. దీంతో కోడిపుంజుల గుట్ట కాల్పులతో దద్దరిల్లుతోంది. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం సమీపంలోని తడపలగుట్టల్లో భారీ ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో పది మంది మావోయిస్టులు, ఒక గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ చనిపోయారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు హరిభూషణ్ అలియాస్ యాప నారాయణ, ఆయన భార్య సమ్మక్క, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, కొయ్యాడ గోపన్న అలియాస్ సాంబయ్య ఆలియాస్ ఆజాద్, కంకణాల రాజిరెడ్డి ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ ఎన్కౌంటర్లో తప్పించుకున్న అగ్రనేతలను మట్టుబెట్టేందుకు పోలీసులు ఈ కాల్పులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం వరకు ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరణించిన గ్రేహౌండ్స్ జవాన్ సుశీల్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. -
ఒక ద్రోహి సమాచారం వల్లే ఆ ఎన్కౌంటర్
సాక్షి, హైదరాబాద్ : తడపలగుట్టల్లో పోలీసులు శుక్రవారం జరిపిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు ఎవరూ మరణించలేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో మృతిచెందిన వారిలో ఇద్దరు తెలంగాణకు చెందిన వారు.. మిగతావారు ఛత్తీస్‌గఢ్ దంతేవాడ జిల్లాకు చెందినవారని ఆయన వెల్లడించారు. ఎన్కౌంటర్లో మృతిచెందిన దబోయిన స్వామి అలియాస్ ప్రభాకర్, కడిపికొండ జిల్లా కమిటీ కార్యదర్శి రత్న తెలంగాణ వారని వివరించారు. కార్పొరేట్ శక్తులను కాపాడేందుకు ఈ ఎన్కౌంటర్ జరిగిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరిహద్దులైన.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం సమీపంలో ఉన్న తడపలగుట్టల్లో శుక్రవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో పది మంది మావోయిస్టులు, ఒక గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ చనిపోయారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు హరిభూషణ్ అలియాస్ యాప నారాయణ, ఆయన భార్య సమ్మక్క, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, కొయ్యాడ గోపన్న అలియాస్ సాంబయ్య ఆలియాస్ ఆజాద్, కంకణాల రాజిరెడ్డి ఉన్నట్లు అనుమానాలు రాగా.. ఈ వార్తలను సీపీఐ (మావోయిస్టు పార్టీ) తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ ఖండించారు. ఆయన ఏమన్నారంటే.. ‘ప్రజలతో మాట్లాడుతూ సేదదీరుతున్న సమయంలో ఒక ద్రోహి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి ఏకపక్షంగా కాల్పులు జరిపారు. పోలీసులు ప్రచారం చేస్తున్నట్లు ఈ ఎన్కౌంటర్లో హరిభూషణ్, బడే చొక్కారావు, కంకణాల రాజిరెడ్డి చనిపోలేదు. ఈ ఎన్కౌంటర్లో చనిపోయిన 10 మందిలో జిల్లా కమిటీ సభ్యుడు హన్మకొండ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన దడబోయిన స్వామి అలియాస్ ప్రభాకర్, రత్న ఉన్నారు. మిగతా కామ్రేడ్స్ అంతా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా, దంతెవాడ జిల్లాలకు చెందిన వారు’ అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కార్పొరేట్ శక్తులకు నీళ్లు, భూమిని ధారాదత్తం చేసేందుకే కేసీఆర్ ఈ విధమైన బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇకపై తాము టీఆర్ఎస్ నేతలపై దాడులను ముమ్మరం చేస్తామని హెచ్చరించారు. హిందుత్వ నాయకుడు రమణ్‌సింగ్, నియంత కేసీఆర్‌లు కలిసికట్టుగా ఆదివాసీలను, ప్రశ్నించే వారిని నిర్మూలించేందుకు దుర్మార్గమైన దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్కౌంటర్ జరిగిన తర్వాత చనిపోయింది ఎవరనేది తెలిసినప్పటికీ పోలీసులు ప్రజల్లో కన్ఫ్యూజన్ సృష్టించడం కోసం అబద్ధాలు ప్రచారం చేశారని, ముఖ్యనాయకులు చనిపోయారని ప్రచారం చేసి ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారని అన్నారు. కార్పొరేట్లకు వనరులు దోచిపెట్టడం కోసం తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా దాడులు చేస్తోందని, ప్రజల సహకారంతో ఈ దాడులన్నింటినీ తిప్పికొడతామని తెలిపారు. -
భద్రాచలం ఏరియా ఆసుపత్రికి మావోయిస్టు మృతదేహాలు
-
పెద్ద తలలే టార్గెట్!
పెద్దపల్లి: మావోయిస్టు పార్టీని బలహీనం చేసేందుకు పోలీసుశాఖ పెద్ద తలలపైనే గురిపెట్టింది. సాధారణ మిలిటెంట్ల కంటే.. రాష్ట్ర కార్యదర్శులు, అగ్రనేతలను టార్గెట్ చేసింది. అందులో భాగంగా మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ అలియాస్ యాప నారాయణపై గురిపెట్టింది. తాజాగా ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో తడపలగుట్ట వద్ద జరిగిన ఎన్కౌంటర్లో ఆయన మృతి చెందినట్లు ప్రచారం జరుగుతోంది. అసలు పీపుల్స్‌వార్‌గా ఉన్నప్పుడు, మావోయిస్టు పార్టీగా మారిన తర్వాత కలిపి.. 1979 నుంచి ఇప్పటివరకు 12 మంది రాష్ట్ర కార్యదర్శులుగా పనిచేశారు. అందులో ముగ్గురు మినహా అందరూ ఎన్కౌంటర్లలోనే మరణించారు. కొందరు రాష్ట్ర కార్యదర్శులుగా ఉండగా.. మరికొందరు కేంద్ర కమిటీ సభ్యులుగా ఎదిగాక తూటాలకు బలయ్యారు. వరుసగా పెద్దలంతా.. పీపుల్స్‌వార్ ప్రారంభమైన తొలినాళ్లలో పెద్దపల్లికి చెందిన మల్లోజుల కోటేశ్వర్రావు ప్రహ్లాద్ పేరిట రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగారు. తర్వాత 1985లో రఘు పేరిట నల్లా ఆదిరెడ్డి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ.. హైదరాబాద్‌లో అరెస్టయ్యారు. ఆ స్థానంలో ఇన్చార్జి రాష్ట్రకార్యదర్శిగా ప్రస్తుత కేంద్ర కమిటీ కార్యదర్శి గణపతి కొంతకాలం ఉన్నారు. అయితే నల్లా ఆదిరెడ్డి ఆదిలాబాద్ జైలు నుంచి తప్పించుకుని వెళ్లి.. తిరిగి రాష్ట్ర కార్యదర్శిగా 1989 వరకు పనిచేశారు. నల్లా ఆదిరెడ్డి, గణపతిలు కేంద్ర కమిటీకి వెళ్లిన తర్వాత పులి అంజయ్య రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పనిచేస్తూ.. ఎన్కౌంటర్లో హతమయ్యారు. తర్వాత నియమితులైన ఎర్రం సంతోష్‌రెడ్డి.. కేంద్ర కమిటీ సభ్యుడు నల్లా ఆదిరెడ్డి, ఉత్తర తెలంగాణ కమిటీ సెక్రటరీ శీలం నరేశ్‌లు 1999లో మంథని ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. దాంతో పీపుల్స్‌వార్ పార్టీకి తొలిసారిగా భారీ నష్టం జరిగింది. తెలంగాణ మైదాన, దండకారణ్యంలో ప్రభావం చూపించగల ముగ్గురు నాయకులు ఒకేసారి మృతి చెందడాన్ని పార్టీ జీర్ణించుకోలేకపోయింది. వేర్వేరు కమిటీలుగా నియమించినా.. 1999 ఎన్కౌంటర్ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు వేరుగా రెండు రాష్ట్రాల కమిటీలను పీపుల్స్‌వార్ నియమించింది. ఏపీ కమిటీకి నియమించిన చింతల వెంకటస్వామి ఎన్కౌంటర్ కావడంతో ఆ స్థానంలో బుర్ర చిన్నన్న అలియాస్ మాధవ్‌కు, తెలంగాణ రాష్ట్ర కమిటీకి పుల్లూరి ప్రసాద్ అలియాస్ చంద్రన్నకు బాధ్యతలు అప్పగించారు. బుర్ర చిన్నన్న కూడా ఎన్కౌంటర్ కాగా.. తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సాంబశివుడు పోలీసులకు లొంగిపోయారు. కడారి రాములు, ఓబులేసులు సైతం ఏపీ రాష్ట్ర కమిటీ కార్యదర్శులుగా పనిచేస్తూ ఎన్కౌంటర్లో హతమయ్యారు. మరోవైపు ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీకి జంపన్న అలియాస్ జీనుగు నర్సింహారెడ్డికి బాధ్యతలు ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటు వరకు కూడా చంద్రన్న, జంపన్నలే పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రాష్ట్ర మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా యాప నారాయణను నియమించారు. జగన్ అలియాస్ హరిభూషణ్ల పేరిట మూడున్నరేళ్లకుపైగా కొనసాగుతున్నారు. తాజా ఎన్కౌంటర్లో ఆయన మరణించినట్లు ప్రచారం జరుగుతోంది. మూడేళ్ల కిందట గ్రేహౌండ్స్‌లోకి సుశీల్ మోమిన్‌పేట: ఎన్కౌంటర్లో మృతి చెందిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ సుశీల్‌కుమార్ స్వస్థలం కర్ణాటక రాష్ట్రంలోని బీదర్. ఆయన తల్లి శారదాకుమారి, తండ్రి విజయ్‌కుమార్ ఉద్యోగరీత్యా కొన్ని సంవత్సరాల క్రితం వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం మేకవనంపల్లికి వచ్చారు. సుశీల్‌కుమార్ తల్లి శారద ఇక్కడ ఐసీడీఎస్ సూపర్వైజర్గా విధులు నిర్వహించి రిటైర్‌అయ్యారు. సుశీల్ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మేకవనంపల్లిలోనే చదువుకున్నారు. 6 నుంచి నుంచి 9వ తరగతి వరకు చిల్కూర్ రెసిడెన్షియల్ స్కూల్లో చదివి, 10వ తరగతి మేకవనంపల్లిలోనే పూర్తి చేశారు. సదాశివపేటలో ఇంటర్ పూర్తి చేసుకొని.. 2004లో సివిల్ కానిస్టేబుల్‌కు ఎంపికయ్యారు. మూడేళ్ల క్రితం డిప్యూటేషన్‌పై గ్రేహౌండ్స్ వెళ్లారు. నాలుగేళ్ల క్రితమే వివాహమైంది. ఓ కూతురు ఉంది. -
వరుసగా ఎదురుదెబ్బలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కొన్నేళ్లుగా వరుసగా జరిగిన ఎన్కౌంటర్లతో దెబ్బతిన్న మావోయిస్టు పార్టీకి తాజా ఎన్కౌంటర్ శరాఘాతంలా పరిణమించింది. ఛత్తీస్‌గఢ్–తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఏకంగా 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. దాదాపు ఏడాదిన్నర కింద దేశంలోనే భారీ ఎన్కౌంటర్ అయిన ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)ల్లో మల్కన్‌గిరి ఎన్కౌంటర్ జరిగింది. అందులో 26 మంది మావోయిస్టులు మరణించారు. మావోయిస్టు పార్టీగా మారకముందు, తర్వాత కూడా జరిగిన ఎన్కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. 1996లో ఖమ్మం జిల్లా పగిడేరు వద్ద జరిగిన ఎన్కౌంటర్లో 16 మంది పీపుల్స్‌వార్ సభ్యులు చనిపోయారు. ఆ 16 మంది సభ్యులు కూడా కొత్తగా రిక్రూటైన వారే. వారిని ఖమ్మం జిల్లా నుంచి ఛత్తీస్‌గఢ్ ప్రాంతానికి వాహనాల్లో తీసుకెళుతుండగా.. పోలీసులు అదుపులోకి తీసుకుని కాల్చి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. 1998లో ఒడిశాలో పీపుల్స్‌వార్ ప్లీనరీపై పోలీసులు దాడి చేసిన ఎన్కౌంటర్లో 17 మంది నక్సలైట్లు మరణించారు. అందులో నలుగురు జిల్లా కమిటీ స్థాయి నాయకులున్నారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్ర చిన్నన్న ఎన్కౌంటర్ జరిగిన నల్లమల ఘటనలో 11 మంది మరణించారు. వరంగల్ జిల్లా కౌకొండ ఘటనలో సుధాకర్ సహా 9 మంది, కరీంనగర్ జిల్లా అచ్చంపల్లిలో రామన్నతో పాటు 12 మంది, పాలకుర్తిలో 9 మంది, సింహాచలం కొండల్లో ఓబులేసు సహా 14 మంది, ఎర్రగుంటపాలెంలో సుదర్శన్‌తోపాటు 12 మంది, నల్లమల సున్నిపెంటలో మట్ట శ్రీధర్ సహా 11 మంది, గాజుల నర్సాపూర్‌లో సిటి ప్రభాకర్‌తోపాటు 13 మంది, మానాలలో రమేశ్‌తోపాటు 12 మంది, నేరెళ్ల పద్మక్క ఎన్కౌంటర్లో ఆరుగురు.. ఇలా పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. ఇవేగాకుండా ఇద్దరి నుంచి ఐదారుగురి వరకు మావోయిస్టులు, ముఖ్య నాయకులు మృతిచెందిన ఎన్కౌంటర్లు ఎన్నో ఉన్నాయి. -
తడపలగుట్టల్లో తుపాకులమోత
సాక్షి ప్రతినిధి, వరంగల్/హైదరాబాద్/భద్రాచలం : తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని అటవీప్రాంతం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. శుక్రవారం ఉదయం 6 గంటలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం సమీపంలోని తడపలగుట్టల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో పది మంది మావోయిస్టులు, ఒక గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ చనిపోయారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు హరిభూషణ్ అలియాస్ యాప నారాయణ, ఆయన భార్య సమ్మక్క, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, కొయ్యాడ గోపన్న అలియాస్ సాంబయ్య ఆలియాస్ ఆజాద్, కంకణాల రాజిరెడ్డి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం వరకు ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరణించిన గ్రేహౌండ్స్ జవాన్ సుశీల్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. రాత్రే చుట్టుముట్టిన పోలీసులు ఎన్కౌంటర్ ప్రాంతం ఛత్తీస్‌గఢ్‌లోని పూజారి కాంకేడ్ సరిహద్దుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. మావోయిస్టులు విడిది చేసిన ప్రదేశానికి సంబంధించి పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసినట్లు తెలుస్తోంది. రాత్రి సమయంలో మావోయిస్టుల బస ప్రాంతాన్ని చుట్టుముట్టిన పోలీసులు ఉదయం మెరుపుదాడికి దిగినట్లు సమాచారం. మావోయిస్టు మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మరణించిన జవాన్‌తో పాటు ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను ఉదయం 10 గంటల సమయంలో హెలికాప్టర్ ద్వారా భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మృతదేహాలను బట్టి వీరిని బుద్రి ఆలియాస్ రేణుకా, సంజీవ్‌గా భావిస్తున్నారు. కాల్పుల్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ బి.సుశీల్ కుమార్ మరణించగా మరో ఇద్దరు జవాన్లకు గాయాలైనట్లు సమాచారం. తెలంగాణ నుంచి జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన నాలుగు గ్రేహౌండ్స్ దళాలు ఎన్కౌంటర్లో పాల్గొన్నట్లు సమాచారం. డ్రోన్లను రంగంలోకి దింపారా? 24 నిమిషాలపాటు గాల్లో ఉంటూ 7 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అత్యాధునిక టెక్నాలజీ కల్గిన డ్రోన్లను గ్రేహౌండ్స్ బలగాలు ఛత్తీసగఢ్ సరిహద్దు ప్రాంతంలో రంగంలోకి దించారు. 2.5 కిలోమీటర్ల పై నుంచి 24 మెగాపిక్సల్ ఫొటోలు, వీడియోలు తీసే కెపాసిటీ ఉన్న ఈ డ్రోన్ల సహాయంతో మావోయిస్టుల కదలికలను గుర్తించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మృతుల్లో అగ్రనేతలు! ఎన్కౌంటర్లో మరణించిన పది మంది మావోయిస్టులు ఎవరన్నది శనివారం రాత్రి వరకు పోలీసులు వెల్లడించలేదు. మృతుల్లో రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్ (మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని మడగూడెం), రాష్ట్ర కమిటీ సభ్యుడు బడే చొక్కారావు ఆలియాస్ దామోదర్ (జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం కాల్వపల్లి), ఖమ్మం జిల్లా కమిటీ కార్యదర్శి కొయ్యడ గోపన్న ఆలియాస్ ఆజాద్ (జయశంకర్ భూపాలపల్లి జిల్లా పస్రా మండలంలోని మొద్దులగూడెం)తో పాటు కేకేడబ్ల్యూ డివిజన్ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి (కాల్వశ్రీరాంపూర్ మండలం కిష్టంపేట) ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై పోలీసుల నుంచి స్పష్టత రాలేదు. చనిపోయిన ఆరుగురు మహిళా మావోయిస్టుల్లో హరిభూషణ్ భార్య ఉన్నట్లు సమాచారం. మరోవైపు హరిభూషణ్ బంధువులు భద్రాచలం ఆస్పత్రిలో ఇద్దరి మృతదేహాలను చూసి.. అందులో అతడు లేడని నిర్ధారణకు వచ్చారు. మిగతా మృతదేహాలు వస్తే తప్ప చెప్పలేమన్నారు. ఎన్కౌంటర్ నుంచి హరిభూషణ్ తప్పించుకున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి కానీ పోలీసులు దాన్ని ధ్రువీకరించడం లేదు. ఘటనా స్థలంలో ఏకే 47, ఇన్సాన్ రైఫిల్స్ 5, ఓ ఎస్ఎల్ఆర్ , రెండు సింగిల్ బోర్ రైఫిళ్లు, ఒక 303 తుపాకీ, ఒక పిస్టోల్, ఒక సోనీ రేడియో, మూడు క్లెమోర్ మైన్స్, ఆరు రాకెట్ బాంబులు, రెండు సోలార్ ప్లేట్స్, రూ.41,000 నగదు, విప్లవ సాహిత్యం లభించాయి. ఏకే 47 ఆయుధం లభించడంతో అగ్రనేత ఎవరైనా ఎన్కౌంటర్లో మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు. ఇటీవల పెరిగిన అలజడి ఇటీవల ఛత్తీస్‌గఢ్–తెలంగాణ సరిహద్దులో మావోయిస్టుల అలజడి పెరిగింది. ముఖ్యంగా వెంకటాపురం, చర్ల మండలాల పరిధిలో వరుస ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మావోయిస్టులు అమర్చిన బాంబులను పోలీసులు ఐదుసార్లు నిర్వీర్యం చేశారు. ఏడాది వ్యవధిలో వెంకటాపురం మండలం పరిధిలో మావోయిస్టులు నాలుగుసార్లు వాల్ పోస్టర్లు వేశారు. ఫిబ్రవరి 4న వెంకటాపురం మండలం వెదిర గ్రామంలో బీఎస్ఎన్ఎల్ సెల్‌టవర్ పేల్చి వేశారు. అంతకు ముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో జనవరి 26న దాడి చేసి వాహనాలు దగ్ధం చేశారు. ఈ ప్రాంతంలో హరిభూషణ్ పార్టీ కార్యకలాపాలను, రిక్రూట్మెంట్ భారీ స్థాయిలో నిర్వహిస్తున్నాడు. మావోయిస్టు పార్టీ గతేడాది నవంబర్ నుంచి పినపాక, చర్ల, వాజేడు, వెంకటాపురం తదితర ప్రాంతాల్లో 500 మందికిపైగా రిక్రూట్మెంట్ చేసినట్టు తెలిసింది. దీంతో ఈ ప్రాంతంలో కూంబింగ్ పెరిగింది. సరిహద్దు అడవులను అనువుగా మార్చుకుని తెలంగాణలో ప్రభావం చూపేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారనే సమాచారం పోలీసులకు ఉంది. దీనికితోడు ఐదు రోజుల కిందట ఐదుగురు సానుభూతిపరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరి వద్ద నుంచి రాబట్టిన సమాచారంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. మృతులపై స్పష్టత రావాలి ఉంది: ఎస్పీ కిశోర్ ఝా ఛత్తీస్‌గఢ్‌లోని పూసూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు కూంబింగ్‌కు వెళ్లినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. కాంకేర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు బస చేశారని తెలియటంతో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్‌ను నిర్వహించామన్నారు. మావోయిస్టులు తమపై కాల్పులు జరిపారని ప్రతిగా పోలీసులు కూడా కాల్పులు జరిపారన్నారు. కొందరు మావోయిస్టులు తప్పించుకుపోవడంతో ఇంకా ఆపరేషన్ జరుగుతోందన్నారు. ఇద్దరు మావోయిస్టులు, ఒక కానిస్టేబుల్ మృతదేహాన్ని భద్రాచలం ఆసుపత్రికి తరలించామని, మిగిలిన మృత దేహాలను శనివారం తీసుకొస్తామన్నారు. ఘటన జరిగిన స్థలం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పూసురు పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తున్నందున కేసును అక్కడికి బదిలీ చేస్తామన్నారు. మృతదేహాలను కుళ్లబెడతారా? ఎన్కౌంటర్ మృతదేహాలను సకాలంలో బంధువులకు అప్పగించకపోవటం సరికాదని మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ సోదరి యాప భారతి అన్నారు. హరిభూషణ్ మృతి చెందారన్న ప్రచారం నేపథ్యంలో తమ్ముడు అశోక్‌తో కలసి ఆమె మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మడగూడెం నుంచి శుక్రవారం భద్రాచలం వచ్చారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రికి ఆవేదనతో వచ్చామని, కానీ మృతదేహాలను తరలించటంలో అధికారులు ఇలా వ్యవహరించటం సరైంది కాదన్నారు. చంపేసిన రెండు రోజులకు శవాలను కుళ్లబెట్టి వాటిని బంధువులకు అప్పగిస్తారా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మృతుల్లో అన్నయ్య లేడనే అనుకుంటున్నాం. లేకపోతే బాగుంటుందని ఆశ పడుతున్నాం. నాలుగో తరగతి చదువుతున్నప్పుడు ఎత్తుకొని జోలపాడిన గుర్తులే తప్ప.. అప్పట్నుంచి ఇప్పటి వరకూ ఎలా ఉంటాడో కూడా తెలియదు’’అన్నారు. – హరిభూషణ్ సోదరి భారతి -
‘ఆపరేషన్’ ఇంకా కొనసాగుతోంది: ఎస్పీ
-
‘ఆపరేషన్’ ఇంకా కొనసాగుతోంది: ఎస్పీ
సాక్షి, భద్రాద్రి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ప్రాంతంలో రాష్ట్ర గ్రేహౌండ్స్ బలగాలకు మావోయిస్టు బలగాలకు మధ్య శుక్రవారం ఉదయం ఎదురుకాల్పులలో 10మంది మావోయిస్టులతో పాటు ఒక గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మృతి చెందినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ అంబర్ కిశోర్ ఝ తెలిపారు. ఎన్‌కౌంటర్‌పై ఆయన శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో నిఘా పెట్టామని తెలిపారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. మృతి చెందిన మావోయిస్టుల్లో ఇద్దర్ని గుర్తించామని, బూద్రి అలియాస్ రేణుక, సంజీవ్ ఛత్తీస్‌గఢ్‌కు చెందినవాళ్లుగా ఎస్పీ వెల్లడించారు. మిగిలిన మృతదేహాలను ఇవాళ రాత్రికి భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలిస్తామన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పోస్ట్‌మార్టం నిర్వహిస్తామని అన్నారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47తో పాటు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. కాగా ఎన్కౌంటర్లో మృతి చెందిన కమెండో సుశీల్ కుమార్ మృతదేహానికి ఎస్పీ అంబర్ కిషోర్ ఝా నివాళులు అర్పించారు. చర్ల ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ మృతి చెందారు. మరో కీలక నేత బడే చొక్కారావు కూడా నేలకొరిగారు. పోలీసులు సైతం వీరి మరణాలను ధృవీకరించారు. నిషేధిత సీపీఐ -మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలతో పాటు ఆరుగురు మహిళలు, ఓ కమెండో సహా మొత్తం 11 మంది ఈ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. -
మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ మృతి
సాక్షి, హైదరాబాద్ : నిషేధిత సీపీఐ -మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ మృతిచెందారు. మరో కీలక నేత బడే చొక్కారావు కూడా నేలకొరిగారు. పోలీసులు సైతం వీరి మరణాలను ధృవీకరించారు. కీలక నేతలు, ఆరుగురు మహిళలు సహా మొత్తం 12 మంది ఈ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన మమిళల్లో హరిభూషణ్ సహచరి సమ్మక్క కూడా ఉన్నారు. ఎదురుకాల్పుల్లో పోలీస్ కమాండో సుశీల్ కూడా చనిపోయారు. ఇదే ఘటనలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్‌కు గాయపడినట్లు సమాచారం. ఆయనపై రూ.30లక్షల క్యాష్ రివార్డు : రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా హరిభూషణ్ నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆయన ఉత్తర తెలంగాణాలోని కెకెడబ్ల్యు(ఖమ్మం, కరీంనగర్, వరంగల్) డివిజన్లో కార్యకలాపాలను పెంచడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేసినట్లు నిఘా వర్గాలకు సమాచారం ఉంది. అగ్రనేతగా ఎప్పటి నుంచో హిట్ లిస్టులో ఉన్న హరిభూషణ్ కోసం పలుమార్లు ప్రత్యేక ఆపరేషన్లు కూడా జరిగాయి.హరిభూషణ్‌పై దాదాపు 50 కేసులున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆయనపై రూ.30లక్షల క్యాష్ రివార్డు కూడా ఉంది. పట్టుకుని చంపేశారా? : సరిగ్గా రెండేళ్ల కిందట (2016, మార్చి 2న) ఇదే భద్రాద్రిజిల్లా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో సౌత్ సెంట్రల్ జోన్ కార్యదర్శి లచ్చన్న సహా ఏడుగురు దళ సభ్యులు చనిపోయారు. ఆ ఎన్కౌంటర్లో హరిభూషణ్ కూడా మృ తి చెందారని ఛత్తీస్‌గఢ్ పోలీసు వర్గాలు ప్రకటించాయి. కానీ తెలంగాణ పోలీసులు మాత్రం ఆ ప్రకటనను కొట్టిపారేశారు. అదే సమయంలో హరిభూషణ్ దొరికిపోయినట్లు, కీలక నేత కావడంతో ఆయనను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఏళ్ల తరబడి ప్రయత్నించిన పోలీసులు ఎట్టకేలకు చర్ల ఎన్కౌంటర్లో హరిభూషణ్‌ను హతం చేసినట్లు ప్రకటించారు. కాగా, చర్ల ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు సానుభూతిపరులు కొందరు హైకోర్టును ఆశ్రయించారు. నాయకులను పోలీసులు ముందే పట్టుకుని, చిత్రహింసలకు గురిచేసి చంపేశారని, ఈ విషయంలో న్యాయవిచారణకు ఆదేశించాలని శుక్రవారం లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలుచేశారు. ఏం జరిగింది? : పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తొండపాల్ సమీపంలో మావోయిస్టులు సమావేశం జరుపుతున్నారన్న సమాచారంతో గ్రేహౌండ్స్-ఈవోఎస్ బలగాలు అటుగా కదిలాయి. బలగాల రాకను గుర్తించిన మావోయిస్టులు.. ఒక్కసారిగా కాల్పులు మొదలుపెట్టారు. పోలీసు బలగాలు కూడా ఎదురుకాల్పులు చేశాయి. ఈ క్రమంలో 12 మంది మావోయిస్టులు, గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ సుశీల్ కుమార్ మరణించారు. ఘటనా స్థలి నుంచి ఆయుధాలు, ఇతర సామాగ్రిని స్వాదీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఎన్కౌంటర్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మృతి
-
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్
-
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో శుక్రవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్ల మండలంలోని అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో సుమారు 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. చనిపోయినవారిలో ఆ పార్టీ కీలక నేత హరిభూషణ్ కూడా ఉన్నారు. ఇప్పటివరకు పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. చర్ల మండలం తొండపాల్ సమీపంలో మావోయిస్టులు సమావేశం జరుపుతున్నారన్న సమాచారంతో గ్రేహౌండ్స్-ఈవోఎస్ బలగాలు అటుగా కదిలాయి. బలగాల రాకను గుర్తించిన మావోయిస్టులు.. ఒక్కసారిగా కాల్పులు మొదలుపెట్టారు. పోలీసు బలగాలు కూడా ఎదురుకాల్పులు చేశాయి. ఈ క్రమంలో 12 మంది మావోయిస్టులు చనిపోగా, ఒకరిద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఘటనా స్థలి నుంచి ఆయుధాలు, ఇతర సామాగ్రిని స్వాదీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది డిసెంబర్లో ఇదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో చండ్ర పుల్లారెడ్డి బాట దళానికి చెందిన ఎనిమిది మంది నక్సల్స్ చనిపోయిన సంగతి తెలిసిందే. -
సెల్ టవర్ పేల్చేసిన మావోయిస్టులు
వెంకటాపురం(కె): జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం(కె) మండలం ఎదిరలో మావోయిస్టులు ఆదివారం అర్ధరాత్రి బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్‌ను పేల్చివేశారు. ప్రభుత్వ నిర్బంధానికి వ్యతిరేకంగా ఈ నెల 5న మావోయిస్టు పార్టీ దండ కారణ్యం– తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఆర్అండ్ బీ ప్రధాన రహదారి పక్కన ఉన్న సెల్‌టవర్‌ను అర్ధరాత్రి 11.40 గంటలకు పేల్చివేశారు. 60 మంది సాయుధులైన మావోయిస్టులతో పాటు 150 మందికిపైగా గొత్తికోయలు విల్లంబులు ధరించి పాల్గొన్నట్లు తెలిసింది. గ్రామంలోకి రాత్రి ప్రవేశించిన మావోయిస్టులు గంటకుపైగా హల్చల్ చేసినట్లు సమాచారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలాల మధ్య వచ్చివెళ్లే వాహనాలను గంటపాటు నిలిపివేసి రోడ్డును దిగ్బంధించినట్లు తెలిసింది. ఆరోగ్య ఉపకేంద్రం వద్ద బ్యాటరీతో టవర్‌ను పేల్చివేశారు. గ్రామస్తులతో సమావేశం నిర్వహించి నినాదాలు చేస్తూ అర్ధరాత్రి 12.30 గంటలకు అడవిలోకి వెళ్లిపోయారు. -
నిర్బంధాలకు నిరసనగా 5న బంద్
చర్ల(భద్రాచలం): మావోయిస్టుల నిర్మూలన పేరుతో పాలకులు ప్రజలపై చేస్తున్న ఫాసిస్టు నిర్బంధానికి వ్యతిరేకంగా దండకారణ్యం, తెలంగాణలో ఈనెల 5న బంద్ పాటించాలని సీపీఐ(మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు స్పెషల్ జోనల్ కమిటీ, రాష్ట్ర అధికార ప్రతినిధులు వికల్స్, జగన్ పేరిట బుధవారం లేఖ విడుదలైంది. అడవుల్లోని సహజ వనరులను దోచుకునేందుకు ఆదివాసీలను ఖాళీ చేయించాలని కేంద్రం కుట్ర పన్నిందని, ‘సమాధాన్ 2022’పేరుతో కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో 2 లక్షల మంది పోలీసు, పారామిలటరీ బలగాలను మోహరించి దాడులకు పాల్పడుతున్నాయని ఆ లేఖలో ఆరోపించారు. ఈ క్రమంలో జరిగిన ఆపరేషన్ ప్రహార్–2లో 2017 ఆగస్టు 16 నుంచి 2018 జనవరి 10 వరకు దండకారణ్యంలో 60 మందిని బూటకపు ఎన్కౌంటర్ చేశారని పేర్కొన్నారు. మెట్టగూడెం గ్రామం వద్ద పొలంలో పని చేస్తున్న మడవి సోమ్డా అనే రైతును ఎటువంటి హెచ్చరిక లేకుండా కాల్చి చంపారని, కన్నెమరక గ్రామస్తులపై విచ్చలవిడిగా కాల్పులు జరిపారని తెలిపారు. పలు ప్రాంతాల్లో 20 మందిని అక్రమంగా అరెస్టు చేసి తప్పుడు కేసులు బనాయించి జైలులో పెట్టారని విమర్శించారు. పశ్చిమ బస్తర్ డివిజన్లోని గంగులూరు ఏరియాలో కేంద్ర, రాష్ట్ర బలగాలు ఇటీవల దాడి చేసి ముగ్గురిని మావోయిస్టుల పేరుతో కాల్చి చంపాయని, అందులో ఓ 13 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడని పేర్కొన్నారు. తెలంగాణలో నిర్బంధం.. తెలంగాణలో గోదావరిపై కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌లకు మావోయిస్టుల వల్ల ముప్పు ఉందని ప్రభుత్వం బూటకపు ప్రచారం చేస్తూ గోదావరి తీరమంతటా పోలీసు క్యాంపులు ఏర్పాటు చేసి నిర్బంధాన్ని పెంచిందని లేఖలో విమర్శించారు. తుపాకులగూడెం, మేడిగడ్డ నుంచి గోలివాడ వరకు పోలీసు క్యాంపులు వెలిశాయని, గోదావరి వెంట డ్రోన్ల సహాయంతో నిఘా కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న ఈ చర్యలకు నిరసనగా తాము పిలుపునిచ్చిన బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు. -
ఆదివాసీల పోరుకు మావోయిస్టు పార్టీ మద్దతు
సాక్షి, హైదరాబాద్: ఎస్టీల్లోంచి లంబాడీలను తొలగించాలని ఆదివాసీలు చేస్తున్న ఆందోళనకు మావోయిస్టు పార్టీ మద్దతు ప్రకటించింది. అవసరమైతే ఇంద్రవెల్లి.. మరో జగిత్యాల జైత్రయాత్రలాగా మారి జల్ జంగిల్, జమీన్ కోసం ఉద్యమించేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన లంబాడీలను ఎస్టీల్లో చేర్చి ఓట్లు పొందేందుకు 1976లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపించారు. లంబాడీలు మహారాష్ట్ర లో బీసీలుగా, రాజస్తాన్‌లో ఓసీలుగా పరిగణించబడుతున్నారన్నారు. గత పాలకులతోపాటు సీఎం కేసీఆర్ లంబాడీలకు పెద్దపీట వేస్తూ వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. ఆదివాసీ పోరాటయోధుడు కొమురం భీం విగ్రహం(జోడేఘాట్) పక్కన లంబాడీల సూంకీమాత విగ్రహాన్ని ప్రభుత్వం ప్రతిష్టించడమే ఘర్షణకు ప్రధాన కారణమని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఆదివాసీలైన కోయ, గొత్తికోయలు, కోయ కమ్మరి, చెంచు, గోండు, కోలామ్, నాయక్‌పోడ్, ధోయిటీ, పరధానులు సూం కీమాత విగ్రహాన్ని ధ్వంసం చేసి తమ నిరసనను ప్రభుత్వానికి తెలిపారని వెల్లడించారు. ఆదివాసీలకు ప్రోత్సాహం అందించాల్సిన ప్రభుత్వం వారిని మావోయిస్టుల ని ముద్రవేసి బూటకపు ఎన్కౌంటర్లలో చంపుతోందని ఆరోపించారు. నీటి పారుదల ప్రాజెక్టులు, గనులు, ఓపెన్‌కాస్ట్ పేరుతో ఆదివాసీలను సమాధి చేసి ఘర్షణ వాతావరణాన్ని ప్రేరేపిస్తున్నదని విమర్శించారు. ఆదివాసీల అనాగరికతను ఆసరా చేసుకొని ఎస్టీ రిజర్వేషన్ పేరుతో 90 శాతం ఉద్యోగాలు, సౌకర్యాలను లంబాడీలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎస్టీ రిజర్వేషన్లను ఏ, బీ, సీ, డీ లుగా వర్గీకరించాలని, లేకపోతే ఆదివాసీల తరఫున మావోయిస్టు పార్టీ ఉద్యమాన్ని నడుపుతుందని వెల్లడించారు. లంబాడీలు సైతం ఆదివాసీలకు న్యాయం జరిగేలా వర్గీకరణ కోసం పోరాడాలని, ఘర్షణలు మానుకొని ఐక్యంగా ఉండాలని జగన్ కోరారు. -
ఐలయ్యకు మావోయిస్టు పార్టీ మద్దతు
సాక్షి, హైదరాబాద్: వైశ్యులను కించపరిచారనే నెపంతో ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై జరుగుతున్న దాడిని మావోయిస్టు పార్టీ ఖండిస్తోందని రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని, సంఘ్‌పరివార్ నేతృత్వంలోనే దేశంలో ఇలాంటి దాడులు జరుగుతున్నాయని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. కులం గురించి మాట్లాడటాన్ని నేరంగా చిత్రీకరిస్తూ బెదిరింపులకు పాల్పడటం వెనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర ఉందని జగన్ ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి ఐలయ్య పుస్తకాలను నిషేధించాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనని పేర్కొన్నారు. అభిప్రాయాలను, అక్షరాలను నిషేధించాలనుకునే నియంతృత్వ వైఖరి అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు. ఐలయ్య రాసిన అంశాలపై కౌంటర్ వాదన చేయొచ్చని, అయితే బెదిరించడం అప్రజాస్వామ్యమని అభిప్రాయపడ్డారు. ఐలయ్యకు అన్నిరకాలుగా తమ పార్టీ మద్దతిస్తోందని, ప్రజాస్వామ్యవాదులంతా ఐలయ్యకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. -
ఐలయ్యకు మావోయిస్టుల మద్దతు
సాక్షి, హైదరాబాద్: వైశ్యులను కించపరిచాడనే పేరిట ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై జరుగుతున్న దాడిని మావోయిస్టు పార్టీ ఖండిస్తోందని రాష్ట్ర కమిటీ అధికారి ప్రతినిధి జగన్ మంగళవారం ఒకప్రకటనలో తెలిపారు. భావ ప్రకటనా స్వేచ్చను ఎవరూ అడ్డుకునే హక్కు లేదని, దేశంలో సంఘ్‌పరివార్ నేతృత్వంలోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని మావోయిస్టు పార్టీ అభిప్రాయపడింది. కులం గురించి మట్లాడటాన్ని నేరంగా చిత్రీకరిస్తూ బెదిరింపులకు పాల్పడ్టం వెనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర ఉందని ప్రతినిధి జగన్ ఆరోపించారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో అడుగు ముందుకు వేసి ఐలయ్య పుస్తకాలపై నిషేదం తీసుకురావడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనని పార్టీ అభిప్రాయపడుతోందని వెల్లడించారు. చంద్రబాబు వ్యవహారం అభిప్రాయాలని, అక్షరాల్ని నిషేదించాలనుకునే నియంతృత్వం వైఖరి అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు. ఐలయ్య రాసిన అంశాలపై కౌంటర్ వాదన చేయవచ్చని, కానీ బెదిరించడం అప్రజాస్వామ్యమని, కంచె ఐలయ్యకు అన్నిరకాలుగా తమ పార్టీ మద్దతునిస్తోంది, ప్రజాస్వామ్య వాదులంతా ఐలయ్యకు అండగా నిలవాలని అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవించాల్సిన అవసరం ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హత్యా రాజకీయాలకు వ్యతిరేకంగా బ్రాహ్మణీయ, హిందూ మనోత్మాదానికి వ్యతిరేకంగా సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. -
ఏవోబీలో భయం.. భయం
♦ నేటి నుంచి మావోయిస్టు పార్టీ వార్షికోత్సవం ♦ తనిఖీలు, కూంబింగ్ ముమ్మరం ముంచంగిపుట్టు(అరకులోయ) : ఆంధ్ర–ఒడిశా సరి హద్దు ప్రాంతంలో మరోమారు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నెల 21 నుంచి 28 వరకు మావోయిస్టు పార్టీ 13వ వార్షికోత్స వం నేపథ్యంలో ఏవోబీ వేడెక్కింది. పోలీసు బలగాలన్నీ ఏవోబీ వైపు కదిలాయి. మండల కేంద్రంలో ఎస్ఐ అరుణ్కిర ణ్ ఆధ్వర్యంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. కుమడ, జోలాపుట్టు, డుడుమ ప్రాంతాల నుంచి వాహనాలను తనిఖీలు కొనసాగాయి. ముందస్తు చర్యల్లో భాగంగా మవోయిస్టు పార్టీ హిట్‌లిస్టులో ఉన్నా ప్రజా ప్రతినిధులకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద సాయుధ పోలీసులతో నిఘా కట్టుదిట్టం చేశారు. సరిహద్దుల్లో పోలీసు బలగాలతో కూంబింగ్ ముమ్మరం చేశారు. సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు కొన్ని రోజులుగా బ్యానర్లు కట్టి, కరపత్రాలు వెదజల్లుతున్నారు. ఏవోబీలో ఎప్పుడు ఎటువంటి సంఘటన చోటు చేసుకుంటుందోనని మారుమూల గిరి గ్రామల గిరిజనులు భయాందోళనకు గురువుతున్నారు. -
బస్తర్‌లో ఖాకీ రాజ్యం
-
బస్తర్‌లో ఖాకీ రాజ్యం
హక్కుల ఊసెత్తితే జైలే! ⇒ ఛత్తీస్‌గఢ్ జైల్లో మూడు నెలలుగా తెలంగాణ హక్కుల నేతల బృందం ⇒ ఎన్కౌంటర్లు, అత్యాచారాలపై నిజనిర్ధారణ కోసం పయనం.. ⇒ భద్రాచలంలోనే అరెస్ట్.. ఛత్తీస్‌గఢ్ పోలీసులకు అప్పగింత! సాక్షి నాలెడ్జ్ సెంటర్: తెలంగాణకు చెందిన న్యాయవాదులు, పాత్రికేయులతో కూడిన ఏడుగురు హక్కుల కార్యకర్తలు గత మూడు నెలలుగా ఛత్తీస్‌గఢ్ జైల్లో మగ్గుతున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్కౌంటర్లు, అత్యాచారాల ఘటనలపై నిజనిర్ధారణ కోసం తెలంగాణ ప్రజాస్వామిక వేదిక(టీడీఎఫ్)కు చెందిన ఈ ప్రతినిధి బృందం డిసెంబర్ 24న ఛత్తీస్‌గఢ్ బయల్దేరింది. అయితే 26వ తేదీన వారిని ఛత్తీస్‌గఢ్ పోలీసులు నిర్బంధించారు. మావోయిస్టులకు సాయం చేస్తున్నారన్న ఆరోపణలతో కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించి సుక్మా జైలుకు పంపింది. బెయిల్ దరఖాస్తులనూ తిరస్కరించింది. జనవరిలో కూడా వారి బెయిల్ దరఖాస్తులను దంతెవాడ జిల్లా కోర్టు తిరస్కరించింది. మరోవైపు ఎఫ్ఐఆర్ నకలు కానీ, వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్తున్న వస్తువుల వివరాలు, పంచనామా నివేదికలు కానీ డిఫెన్స్ న్యాయవాదులకు ఇవ్వలేదు. ప్రస్తుతం హైకోర్టులో వారి బెయిల్ పిటిషన్ విచారణలో ఉంది. ఎవరు వారు? ఛత్తీస్‌గఢ్ జైల్లో ఉన్నవారిలో హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త దుర్గాప్రసాద్ (36), ఆదివాసీ తుడుం దెబ్బ ఖమ్మం కార్యదర్శి ఆర్.లక్ష్మయ్య (45), హైదరాబా ద్‌కు చెందిన పాత్రికేయులు బి.ప్రభాకర్ రావు (52), రాజేంద్రప్రసాద్ (28), హైకోర్టు న్యాయవాదులు చిక్కుడు ప్రభాకర్‌రావు (48), బి.రవీంద్రనాథ్ (42), ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్, తెలంగాణ విద్యార్థి వేదిక నాయకుడు మొహమ్మద్ నిజాం ఉన్నారు. నిజానికి.. హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఈ బృందాన్ని 25న భద్రాచలం జిల్లా దుమ్ముగూడెం గ్రామంలో తెలంగాణ పోలీసులే నిర్బంధించారని, తర్వాత వారిని ఛత్తీస్‌గఢ్ పోలీసులకు అప్పగించారని తెలంగాణ పౌర హక్కుల సంఘాలు ఆరోపించాయి. వీరు ఏడుగురూ మావోయిస్టు పార్టీకి సాయం చేస్తున్నారని, వాళ్లు ప్రయాణిస్తున్న నాలుగు మోటారు సైకిళ్లు, రూ.లక్ష విలువైన రద్దు చేసిన నోట్లు, మొబైల్ ఫోన్లు, మావోయిస్టు సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఆరోపించారు. నక్సలైట్ల కోసం పాత కరెన్సీని మార్చి ఇస్తున్నారని, మావోయిస్టులకు సాయం చేయాలని స్థానికులపై ఒత్తిడి తెస్తు న్నారని అభియోగాలు మోపారు. బస్తర్‌లో హక్కుల గురించి మాట్లాడినా, అత్యాచారాల గురించి కథనాలు రాసినా.. హక్కుల నేతలు, పాత్రికేయులపై తప్పుడు కేసులు మోపడం పరిపాటిగా మారిందని పలు సంఘటనలను ఉదహరిస్తూ కేంద్ర మానవ హక్కుల కమిషన్, సుప్రీంకోర్టులకు కూడా లేఖలు రాశాయి. ప్రొఫెసర్లు, జర్నలిస్టులకు వేధింపులు డిసెంబర్ మొదటి నెలలో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ నందినీ సుందర్, జేఎన్‌యూ ప్రొఫెసర్ అర్చనాప్రసాద్ తదితరులపై సుక్మా జిల్లాలో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. నవంబర్ 4న రాష్ట్రంలో హత్యకు గురైన ఒక గిరిజనుడి భార్య ఫిర్యాదు మేరకు ఈ హత్య కేసు నమోదు చేసినట్లు చెప్పారు. బస్తర్‌లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నందినీ సుందర్ ఎంతో కాలంగా హక్కుల విషయాలపై పని చేస్తున్నారు. ఆమె వేసిన పిటిషన్ వల్లనే మావోయిస్టు వ్యతిరేక సాల్వాజుడుంను సుప్రీంకోర్టు రద్దు చేసింది. సామాజిక కార్యకర్త డాక్టర్ బినాయక్‌సేన్, ఆదివాసీ హక్కుల కార్యకర్త సుకుల్ ప్రసాద్ బార్సే, గిరిజన కార్యకర్త, లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థిగా పోటీ చేసిన సోనీ సోరి, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మాలినీ సుబ్రమణ్యం, టీవీ విలేకరి ప్రభాత్సింగ్, పత్రిక విలేకరి దీపక్ జైశ్వాల్‌లను కూడా పోలీసులు ఇలాగే వేధించారు. కొందరు పాత్రికేయులు పోలీసుల కేసులు, వేధింపులకు భయపడి ఆ ప్రాంతాలను వీడి వెళ్లిపోయారు. 13 ఏళ్ల బాలుడి ‘ఎన్కౌంటర్’ కేసు కిందటేడాది ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాల ‘ఎన్కౌంటర్’లలో 134 మంది చనిపోయారు. ఆ బలగాలు లైంగిక హింసకు పాల్పడిన మూడు ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. టీడీఎఫ్ నిజనిర్ధారణ పర్యటనలో భాగంగా.. బీజాపూర్ జిల్లా మెటపల్ గ్రామానికి చెందిన పదమూడేళ్ల బాలుడు సోమారు పొట్టం ‘ఎన్కౌంటర్’ ఘటనను కూడా పరిశీలించనుంది. ఛత్తీస్‌గఢ్ పోలీసులు డిసెంబర్ 16న ఈ బాలుడిని పట్టుకొని చంపేసి, మావోయిస్టుగా ముద్రవేశారని బిలాస్పూర్ హైకోర్టులో బాలుడి తండ్రి పిటిషన్ వేశారు. అతడిని పోలీసులు చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారని, గ్రామస్తులందరూ చూస్తుండగా అతి సమీపం నుంచి కాల్చి చంపారని ఆరోపించారు. దీంతో ఆ బాలుడి మృతదేహాన్ని బయటికి తీసి మళ్లీ శవపరీక్ష నిర్వహించాలని బిలాస్పూర్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో డిసెంబర్ 25, 26 తేదీల్లో శవపరీక్ష చేశారు. ఈ కేసులో నిజనిర్ధారణ చేయనున్న టీడీఎఫ్ బృందాన్ని ముందుగానే అరెస్ట్ చేసి జైలుకు పంపారు. వీరిని అరెస్ట్ చేసిన సమయంలోనే జగదల్పూర్ న్యాయ సహాయ బృందానికి చెందిన శాలినీ గేరా అనే న్యాయవాది.. మావోయిస్టులకు రూ.10 లక్షల కొత్త నోట్లు మార్చి ఇచ్చారని, దంతెవాడ అడవుల్లో ఆమె మావోయిస్టులను కలిసినట్లు తమకు ఫిర్యాదు అందిందంటూ బస్తర్ ఎస్పీ ఆర్.ఎన్.దాష్ ఆరోపించారు. ఈ మేరకు ఆమెకు ఫోన్ చేసి బెదిరించారు. ఆమె గదిని సోదా చేయాలని, విచారణకు స్టేషన్‌కు రావాలని బెదిరించారు. ఇంతకూ ఆమె ఎవరో కాదు.. పోలీసుల చేతుల్లో హతమైన 13 ఏళ్ల బాలుడి ఎన్‌కౌంటర్‌పై అతడి తల్లిదండ్రుల తరఫున హైకోర్టులో పిటిషన్ వేసిన న్యాయవ్యాది కావడం గమనార్హం! ఛత్తీస్‌గఢ్‌లో మహిళా మావోయిస్టుల ర్యాలీ మల్కన్‌గిరి: మహిళా దినోత్సవం సందర్భంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమ జిల్లా అడవిలో బుధవారం మహిళా మావోయిస్టులు ర్యాలీ నిర్వహించారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణకు చెందిన సభ్యులు స్థానిక గిరిజన మహిళలతో కలిసి భారీగా ప్రదర్శన నిర్వహించారు. మహిళలు హక్కుల కోసం పోరాడాలని, గిరిజన మహిళల్లో చైతన్యం రావాలని వారు కోరారు. ఈ సందర్భంగా జననాట్యమండలి ఆధ్వర్యంలో గీతాలాపనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆత్మరక్షణ విధానాలపై వారికి అవగాహన కల్పించారు. -
9 మంది సామాన్య పౌరులను చంపారు!
-
9 మంది సామాన్య పౌరులను చంపారు!
- హత్యకు గురైన వారిలో 22 మంది మావోలే! - ఏపీ డీజీపీ రాకకు స్వాగతంగా నలుగురు పౌరుల హత్య - మావోయిస్టు పార్టీ ఏఓబీ అధికార ప్రతినిధి జగబంధు పేరిట ఆడియో టేపుల విడుదల హుకుంపేట: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోని మల్కన్‌గిరి జిల్లా, రామగూడ గ్రామం సమీపంలో అక్టోబర్ 24వ తేదీన జరిగిన పోలీసు కాల్పులల్లో మొత్తం 31 మంది చనిపోయారని వీరిలో 22 మంది మావోయిస్టులు కాగా, మరో తొమ్మిది మంది సాధారణ పౌరులని మావోయిస్టు పార్టీ తెలిపింది. మావోయిస్టు పార్టీ ఏఓబీ అధికార ప్రతినిధి జగబంధు పేరిట బుధవారం ఆడియో టేపులు విడుదలయ్యాయి. పోలీసులు ఏవోబీలో కూంబింగ్ చర్యలు ఆపని పక్షంలో మావోయిస్టు పార్టీ నుంచి ప్రతిఘటన తప్పదని జగబంధు హెచ్చరించారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘31 మంది కామ్రేడ్స్ హత్యపై పోలీసులు పూర్తి అవాస్తవాలు చెబుతున్నారు. పోలీసుల దిగ్బంధం వల్ల ప్రజలకు వాస్తవాలు చెప్పడంలో ఆలస్యం జరిగింది. వాస్తవమేమంటే.. 23న రామగూడకి చేరుకొని రాత్రికి అక్కడే పడుకున్నాం. 24న ఉదయం ప్రజలు మాకు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నిం చగా పోలీసులు వారిని అడ్డుకొని నిర్బంధిం చారు. ఉదయం 6 గంటల సమయంలో రెండు వైపుల నుంచి పోలీసులు అతి సమీపానికి రాగా, అప్రమత్తమైన పీఎల్సీఏ కాల్పులు ప్రారంభించింది. ఆ సమయంలో మాతో పాటు ఉన్న చుట్టుపక్క గ్రామాల నిరాయుధులైన యువతీ యువకులు పక్క గ్రామానికి పరిగెత్తారు. వారిపైనా, పక్కనే నది వద్ద ప్రయాణికులపైనా పోలీసులు విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. ఘటనలో అనేక మంది గాయపడ్డారు. వారిలో కొందరిని సజీవంగా పట్టుకున్నారు. అయితే అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. మైదానంలో విచ్చలవిడి కాల్పులు వారిని ప్రతిఘటిస్తూనే పక్కనే ఉన్న కొండలపైకి మేం సురక్షితంగా చేరాం. అప్పటికే మా మకాంను రెండు వలయాల పోలీసులు చుట్టివేశారు. ఒక వలయాన్ని ఛేదించి సురక్షితంగానే బయటపడ్డాం. తర్వాత మరో వలయం చుట్టివేసింది. వారంతా కొండలను ఆక్రమించుకొని మా దిశను గుర్తించి అన్ని దిశల్లో కాల్పులు ప్రారంభించారు. అప్పటికే కాల్పులు ప్రారంభమై గంట గడిచింది. చివరి వలయాన్ని ఛేదించే క్రమంలో ఒక కొండ నుంచి మరో కొండకు వెళ్లేటప్పుడు చిన్న మైదానాన్ని దాటాల్సి వచ్చింది. వందలాది మంది పోలీసు లు అనుకూల రక్షణ ఉండే కొండలపైకి చేరి మమ్మల్ని చుట్టుముట్టి, విచ్చలవిడిగా కాల్పు లు జరిపారు. దీంతో కొంత మంది కామ్రేడ్స్ అమరులై అనేక మంది గాయపడ్డారు. గాయాలైన వారిని హతమార్చారు గాయపడి కదల్లేని స్థితిలో ఉన్న కొంతమంది కామ్రేడ్స్‌ను వందలాది బలగాలు చుట్టుముట్టి హతమార్చాయి. 27వ తారీఖున అదనపు బలగాలను రప్పించి ఆ ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధించి గాయపడి ఉన్న కామ్రేడ్స్‌ను తప్పించుకోనీయకుండా వెతికారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాకకు స్వాగతంగా అప్పటికే వారి చేతుల్లో ఉన్న నలుగురు సాధారణ యువతీ యువకులైన కుదిరిగుడ కొమలి, శ్యామల పిల్లిపొదిరి, కావేరి ముదిలి-లచ్చ ముదిలి, డక్క ముదిలినిలను కాల్చి చంపి మరో ఎన్కౌంటర్ కథనాన్ని అల్లారు. గాయపడి శత్రు వలయంలో చిక్కిన మరో మహిళా కామ్రేడ్‌ను 26న రామగూడ ప్రజలు చూస్తుండగానే కాల్చి చంపారు. అలాగే గాయపడి కదల్లేని స్థితిలో ఉన్న మరో ఇద్దరు కామ్రేడ్లు గౌతమ్, నరేశ్‌లను 27 ఉదయం 7 గంటలకు గ్రామ ప్రజలు చూస్తుండగానే కాల్చి చంపి ఎన్కౌంటర్ కథను అల్లారు. మా కామ్రేడ్స్ ఈ ఎన్కౌంటర్ ఎదుర్కోవడంతో అత్యంత ధైర్యాన్ని, సాహసాన్ని, త్యాగాన్ని ప్రదర్శించారు. వారు అమరులవుతూ కూడా వారి చేతుల్లోని ఆయుధాలను శత్రువుల చేతికి చిక్కకుండా సహచర కామ్రేడ్లకు అందిస్తూ అమరులయ్యారు. ఈ హత్యా ఘటనలో 24వ తే దీ నుంచి 27వ తేదీ వరకు మొత్తం 31 మంది కామ్రేడ్స్ అమరులయ్యారు. అందులో 9 మంది నిరాయుధులైన సాధారణ యువతీ యువకులే. రాజ్యంపై ప్రతీకారం తీర్చుకుంటాం మా అమరుల శవాల పట్ల కూడా పోలీసులు అభ్యంతర వైఖరి ప్రదర్శించారు. వారు కుటుంబ సభ్యులు గుర్తుపట్టకుండా చేసి, పెట్టెల్లో పెట్టారు. మా కామ్రేడ్స్‌ను హత్య చేసిన రాజ్యంపై ప్రతీకారం తీర్చుకుంటాం. ప్రభుత్వం చెబుతున్నట్లు ఇది శాంతి భద్రతల సమస్య కాదు. నూటికి 90 మందిగా ఉన్న పేదల సమస్య. మా పార్టీకి త్యాగాలు కొత్త కాదు. ఈ హత్య కాండను ప్రజలు, పౌర సంఘాలు ఖండించాలి. దున్నేవారికే భూములు అన్న దానిపై పోరాటాలు జరిపాం. ఈ ఘటనకు మా లోపాలు ఉన్నాయి. వాటిని పునఃసమీక్షించుకుంటాం. అలాగే ఈ హత్యాకాండకు లొంగిపోయిన మాజీల (మాజీ మావోయిస్టులు) సహకారం కూడా తీసుకున్నారు. ప్రజల సహకారంతోనే విప్లవ ద్రోహులను శిక్షిస్తాం.’’ అని ఆడియో టేపులో జనబంధు పేర్కొన్నారు. ఏఓబీలో వెంటనే కూంబింగ్‌ను ఆపాలని ఆమె డిమాండ్ చేశారు. లేకుంటే తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. -
ఆర్కే మా కస్టడీలో లేరు
- కస్టడీలోకి తీసుకునే అవకాశం కూడా లేదు - హైకోర్టుకు నివేదించిన ఏపీ పోలీసులు - పోలీసుల అదుపులోనే ఉన్నారనేందుకు ఆధారాలున్నాయి - పిటిషనర్ తరఫు న్యాయవాది స్పష్టీకరణ - ఆధారాల సమర్పణకు రెండు వారాల గడువిచ్చిన ధర్మాసనం సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే తమ కస్టడీలో లేరని ఏపీ పోలీసుల తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ గురువారం హైకోర్టుకు నివేదించారు. ఎన్‌కౌంటర్‌పై ఒడిశాలో కేసు నమోదై దర్యాప్తు జరుగుతోందని, అందువల్ల ఆర్కేను తాము అదుపులోకి తీసుకునే అవకాశం కూడా లేదని తెలిపారు. ఈ వాదనలను పిటిషనర్ అయిన ఆర్కే సతీమణి శిరీష తరఫు న్యాయవాది రఘునాథ్ తోసిపుచ్చారు. తమకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆర్కే ఏపీ పోలీసుల కస్టడీలోనే ఉన్నారని నొక్కి చెప్పారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం, ఆర్కే పోలీసుల కస్టడీలోనే ఉన్నారని చెప్పేందుకు నిర్దిష్టమైన ఆధారాలను కోర్టు ముందుంచాలని రఘునాథ్‌కు తేల్చి చెప్పింది. ఆ ఆధారాలు విశ్వసనీయంగా ఉంటే తాము తప్పక విచారణకు ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. దీంతో రఘునాథ్ కోర్టు హాలులోనే ఉన్న విరసం నేత వరవరరావును సంప్రదించారు. తప్పకుండా ఆధారాలు సమర్పిస్తామని, అందుకు పది రోజుల గడువు కావాలని కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరిస్తూ ఆధారాల సమర్పణకు రెండు వారాల గడువునిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉభయులూ పారదర్శకంగా వ్యవహరించాలి ఈ మొత్తం ఘటనతో ఏపీ పోలీసులకు సంబంధం లేదంటారా? అని అడ్వొకేట్ జనరల్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. తాను అలా అనడం లేదని, ఏపీ, ఒడిశా పోలీసులు, గ్రేహౌండ్స్ దళాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించాయని, అందువల్ల ఏపీ పోలీసులకు సంబంధం లేదని చెప్పడం లేదన్నారు. ఆర్కేను ఏపీ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకునే అవకాశం లేదంటారా? అని ధర్మాసనం తిరిగి ఏజీని ప్రశ్నించింది. అవునన్న ఏజీ, ఆర్కే పలు కేసుల్లో నిందితునిగా ఉన్నారని, తాము అతడిని అరెస్ట్ చేస్తే తప్పకుండా చట్టం ముందు నిలబెడతామని చెప్పారు. ‘‘ఇంత పెద్ద ఎన్కౌంటర్ జరిగినప్పుడు భయాందోళనలు సహజం. ఇలాంటి సమయంలోనే ఉభయులూ పారదర్శకంగా వ్యవహరించాలి’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒక్క పేజీ.. ఒక్క పేరాతో కౌంటర్ తన భర్త ఆర్కేను ఏపీ పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయనను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ శిరీష హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు విశాఖ రూరల్ ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ గురువారం కేవలం ఓ పేరా.. ఓ పేజీ కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా శిరీష తరఫు న్యాయవాది రఘునాథ్ వాదనలు వినిపిస్తూ... పోలీసులు దాఖలు చేసిన కౌంటర్ నామమాత్రంగా ఉందని తెలిపారు. అక్రమ నిర్బంధం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని, అందువల్ల దీనిపై విచారణ జరిపేలా జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను (ఎన్హెచ్ఆర్సీ) ఆదేశించాలని కోరారు. ఇంతకీ మీరు ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘మీరు ముందు ఎన్హెచ్ఆర్సీ వద్దకు వెళ్లండి. ఆ తరువాత కావాలంటే మా వద్దకు రండి. అప్పుడు మేం తప్పకుండా విచారణ జరపాలని కమిషన్‌ను ఆదేశిస్తాం’’ అని స్పష్టం చేసింది. ఇంతటితో ఈ వ్యాజ్యంపై ముగించమంటారా? అని అడిగింది. వద్దని, పెండింగ్‌లోనే ఉంచాలని రఘునాథ్ కోరారు. -
ఆర్కే జాడ పోలీసులకు తెలుసు
వైద్యం అందకుండా చేస్తున్నారు - ఎన్‌కౌంటర్‌పై సుప్రీం జడ్జితో విచారణ జరిపించాలి - వెంటనే కోర్టులో హాజరుపర్చాలి - విరసం నేత వరవరరావు వరంగల్: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబీ ఇన్చార్జి రామకృష్ణ సమాచారం మావోయిస్టులకు, ప్రజలకు తెలియడం లేదంటే కచ్చితంగా పోలీసులకు తెలిసి ఉంటుందని విరసం నేత వరవరరావు పేర్కొన్నారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏఓబీ)లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా.. రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. హన్మకొండలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్కే ఉమ్మడి రాష్ట్రంలోని ప్రజలకు సుపరిచితుడని, శాంతి చర్చల్లో ఆయన సుమారు పది రోజల పాటు ప్రభుత్వంతో చర్చలు జరపడం మీడియా, పత్రికల ద్వారా ప్రజలు వీక్షించారని తెలిపారు. ఆర్కే ఏ గ్రామంలోని వీధుల్లో తిరిగినా సులువుగా ప్రజలు గుర్తుపడతారని తెలిపారు. పోలీసులు, ఏపీ ప్రభుత్వం సాంకేతికంగా తమ అదుపులో లేడని చెబుతున్నారని, అది నిజం కాదన్నారు. ఆర్కే గాయపడినట్లు, ఆయనతో పాటు మరో 9మంది ఆదివాసీలు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. వారంతా ప్రస్తుతం పోలీసుల అదుపులో లేకున్నప్పటికీ వారు ఆశ్రయం పొందిన ప్రాంతం మాత్రం పోలీసుల కనుసన్నల్లోనే ఉందన్నారు. వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు అదుపులోకి తీసుకునే విధంగా పోలీసులు నిఘా ఏర్పాటు చేసుకున్నట్లు వరవరరావు ఆరోపించారు. ఆర్కే ఎన్కౌంటర్లో గాయపడి కటాఫ్ ఏరియా, బలిమెల రిజర్వాయర్ ప్రాంతంలో ఏదో ఒక చోట ఉండి ఉండవచ్చన్న అభిప్రాయాన్ని వరవరరావు వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న 148 ఇళ్ల ప్రాంతంలో ఆర్కేతో పాటు ఆదివాసీలు ఉంటారన్న అనుమానం వ్యక్తం చేశారు. ఆర్కే, ఆదివాసీలు ఉన్న ప్రాంతం కచ్చితంగా పోలీసులకు తెలిసి ఉంటుందన్నారు. ఆర్కేకు వైద్య సహాయం అందకుండా చేసి అంతమొందించాలని పోలీసులు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకోసమే ఆ ప్రాంతంలోని ఆర్ఎంపీలను పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారని, మెడికల్ షాపులపై నిఘా పెట్టారని అన్నారు. పోలీసుల కనుసన్నల్లో ఉన్న ఆర్కేను కోర్టులో హాజరుపర్చాలని ఆయన కుటుంబీకులు హైకోర్టులో వేసిన పిటీషన్‌పై ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చిందన్నారు. ఏకపక్షంగా కాల్పులు జరిపినందున హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని కోర్టు సూచించినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అలాగే, ఈ ఎన్కౌంటర్ పూర్తిగా కోవర్టు ఆపరేషన్ అని, ఈ ఆపరేషన్‌కు సహకరించిన వ్యక్తికి జీపీఎస్ చిప్ ఏర్పాటు చేసినట్లు సమాచారం ఉందన్నారు. ఒక వేళ కోవర్టు చనిపోయినప్పటికీ అతని శరీరంలో బిగించిన చిప్‌తో ఎక్కడున్నారు.. అక్కడ ఏం జరుగుతుంది అన్న విషయాలు తెలుసుకునే అవకాశాలున్నాయన్నారు. గతంలో బిజాపూర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో నాలుగు వైపుల నుంచి కాల్పులు జరపడంతో ఎదురుగా ఉన్న పోలీసులు చనిపోయిన ఘటనను దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్కౌంటర్ వ్యూహాన్ని మార్చినట్లు ఓ ప్రముఖ ఇంగ్లిషు దినపత్రిక వెబ్సైట్లో మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాల్లో పనిచేస్తున్న ఒక సీనియర్ పోలీసు ఉన్నతాధికారి పేర్కొన్నట్టు ఉందన్నారు. మూడు వైపులా బలగాలు చుట్టుముట్టే విధంగా ‘వి’ ఆకారంలో చుట్టుముట్టి ఒకసారి ఏకపక్షంగా కాల్పులు జరిపినట్లు ఉన్నతాధికారితో పాటు గ్రేహౌండ్స్‌లో పనిచేస్తున్న కమెండో దినపత్రికకు తెలిపినట్లు ఆయన వివరించారు. -
అగ్ర నేతలేమయ్యారు?
- ఆర్కే తదితరుల ఆచూకీపై కొనసాగుతున్న అనిశ్చితి - రిజర్వాయరులో పడి చనిపోయి ఉంటారని పోలీసుల కొత్త వాదన సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) మల్కన్‌గిరి అడవుల్లో గత నెల 24న జరిగిన ఎన్కౌంటర్ తర్వాత జాడలేకుండా పోయిన మావోయిస్టు అగ్రనేతల ఆచూకీపై అనిశ్చితి కొనసాగుతోంది. ఎన్కౌంటర్ జరిగి వారం రోజులు దాటినా మావోయిస్టు పార్టీ అగ్రనేతలు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, గాజర్ల రవి అలియాస్ గణేష్, రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి, అరుణ అలియాస్ చైతన్య తదితరులు ఏమయ్యారన్న దానిపై స్పష్టత లేదు. వీరంతా పోలీసుల చెరలో ఉన్నారని మావోయిస్టు పార్టీ నాయకులు, విరసం, పౌరహక్కుల సంఘాల నేతలు అనుమానిస్తున్నారు. వీరిని పోలీసులు హతమార్చి ఉంటారని మావోయిస్టు పార్టీలోనే మరికొందరు నాయకులు చెబుతున్నారు. దీంతో మావోయిస్టు పార్టీలోనూ అస్పష్టత ఉందని స్పష్టమవుతోంది. అయితే తమ వద్ద మావోయిస్టు నేతలెవరూ లేరని విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్దేవ్శర్మతోపాటు డీజీపీ సాంబశివరావు కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. తన భర్తను కోర్టులో హాజరు పరచాలంటూ ఆర్కే సతీమణి శిరీష సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. ఒకవేళ ఆర్కే పోలీసు కస్టడీలో ఉంటే హాజరు పరచాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆర్కేపై పోలీసు వర్గాలు సరికొత్త ప్రచారానికి తెరతీశాయి. ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఆర్కే తదితరులు అక్కడ నుంచి తప్పించుకుని పోతూ ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న బలిమెల రిజర్వాయరులో పడి చనిపోయి ఉంటారన్నది వారి వాదన. ఆర్కేను కోర్టులో హాజరు పరచాలని హైకోర్టు ఆదేశించడంతో పోలీసులు వ్యూహాత్మకంగా ఈ తరహా ప్రచారానికి తెరతీశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్కే ఆచూకీపై స్పష్టత వస్తే జాడలేకుండా పోయిన మిగతా వారి సమాచారం కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది. -
ఎన్కౌంటర్లో మరణించింది వీరే..
- మృతుల పేర్లు వెల్లడించిన మావోయిస్టు పార్టీ - 30 మందిలో 27 పేర్ల వివరాలతో జాబితా సాక్షి, విశాఖపట్నం: ఏవోబీలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టు నేతల పేర్లను ఆ పార్టీ ప్రకటించింది. ఆ ఘటనలో 30 మంది మృతి చెందగా వారిలో 27 మంది పేర్లను మావోయిస్టు పార్టీ ఏవోబీ కమిటీ పేరిట ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ జాబితాలో ఆర్కే, గాజర్ల రవి, అరుణ వంటి అగ్రనేతలెవరూ లేరు. వీరెక్కడున్నది పార్టీ ప్రకటించలేదు. మల్కన్‌గిరి అటవీ ప్రాంతం జంత్రి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నెల 24, 25, 26వ తేదీల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మొత్తం 30 మంది మృతిచెందినట్లు పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిలో పోలీసులు 18 మందినే గుర్తించారు. కాగా ఆదివారం మావోయిస్టు పార్టీ ప్రకటించిన జాబితాతో కొంతమేర సందిగ్ధత వీడింది. మిగిలిన ముగ్గురు గిరిజనులై ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్పెషల్ జోన్ కమిటీ సభ్యులు ► బాకూరి వెంకటరమణ అలియాస్ గణేష్ (బాకూరు గ్రామం, విశాఖ జిల్లా), ► చామళ్ల కిష్ణయ్య అలియాస్ దయా (శ్రీకాకుళం-కోరాపూట్ డీవీసీఎస్-స్వస్థలం- నల్లగొండ,) డివిజన్ కమిటీ సభ్యుడు ► జలుమూరి శ్రీనుబాబు అలియాస్ రైనో (డీసీఎం, థర్డ్ సీఆర్సీ,) జిల్లా కమిటీ సభ్యులు ► అక్కిరాజు పృధ్వీ అలియాస్ మున్నా (ఆర్కే కుమారుడు, డీసీఎం, స్వస్థలం ప్రకాశం జిల్లా) ఇనపర్తి దాసు అలియాస్ మధు (డీసీఎం ఏవోబీ టెక్ టీం, స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా) ► బోడు కుందనాలు అలియాస్ మమత (చెల్లూరి నారాయణరావు భార్య, డీసీఎం, స్వస్థలం- శ్రీకాకుళం) లత అలియాస్ పద్మ (దుబాసీ శంకర్ భార్య), డీసీఎం స్వస్థలం హైదరాబాద్ ► యామలాపల్లి సింహాచలం అలియాస్ మురళి అలియాస్ హరి (జిల్లా కమిటీ సభ్యుడు, డీసీఎం, విజయనగరం) ► కామేశ్వరి అలియాస్ స్వరూప అలియాస్ రిక్కీ (డీసీఎం, ఆర్టీసీ మాజీ కండక్టర్, స్వస్థలం పశ్చిమగోదావరి) ► రాజేష్ అలియాస్ బిమల్ (డీసీఎం-ఫస్ట్ సీఆర్సీ, స్వస్థలం ఛత్తీస్‌గఢ్) ► గెమ్మిలి కేశవరావు అలియాస్ బిరుసు (డీసీఎం, స్వస్థలం తాడపాలెం, విశాఖ జిల్లా) రుప్పీ, (డీసీఎం-కోరాపుట్) ఏరియా కమిటీ సభ్యులు ► బుద్రి (ఏసీఎం-ఆర్కే రక్షణ కమిటీ సభ్యురాలు, స్వస్థలం - ఛత్తీస్‌గఢ్) ► శ్వేత (విశాఖ ఏజెన్సీ పెదబయలు ఏరియా కమిటీ సభ్యురాలు) ► మురాయ్ ►దినేష్ (ఏసీఎం, ఏవోబీ) ► రామ్కీ(ఏసీఎం, ఛత్తీస్‌గఢ్) ►గంగాల్ ►మల్లేష్ ►లత ► రాజన్న►సుధీర్ ►ఎర్రాలు ►రమేష్ ► జ్యోతి►జరీనా ► సురేష్ -
‘చంద్రబాబు, కేసీఆర్‌లకు ప్రజల చేతిలో శిక్ష తప్పదు’
సాక్షి, వరంగల్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ప్రజా ఉద్యమాలను అణచివేస్తూ సహజ వనరులను కార్పొరేట్ పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారని మావోయిస్టు పార్టీ పేర్కొంది. ఇద్దరు సీఎంలు పిరికిపందల యుద్ధనీతిని అమలు చేస్తున్నారని.. వెంటనే దీన్ని మార్చుకోవాలని హెచ్చరించింది. మావోయిస్టు పార్టీ ఖమ్మం-కరీంనగర్-వరంగల్ జిల్లాల కార్యదర్శి దామోదర్ పేరుతో శుక్రవారం ‘సాక్షి’ కార్యాలయానికి లేఖ వచ్చింది. ఏఓబీ ఎన్కౌంటర్ బూటకమని, ఇది మావోయిస్టు పార్టీకి నష్టమేనని, కానీ కొద్దిరోజుల్లోనే నిలదొక్కుకుని తిరిగి విస్తరిస్తామని, ప్రజాద్రోహులను ఖతం చేస్తామని లేఖలో ఆయన పేర్కొన్నారు. -
ఆపరేషన్ ‘ఆర్కే’!
మరోసారి విఫలమైన పథకం ఏవోబీ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక బృందం ‘ఆర్కే’.. రెండక్షరాల ఈ పేరు వింటే చాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ముచ్చెమటలు పోస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఏవోబీలో మావోయిస్టు ఉద్యమాన్ని ఉచ్ఛస్థితికి తీసుకెళ్లిన ఈ మావో అగ్రనేత అసలు పేరు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ(ఆర్కే)ను లక్ష్యంగా చేసుకునే పోలీసు ఉన్నతాధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారని తెలుస్తోంది. దాని ఫలితమే సోమవారం తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్కౌంటర్. అసలు లక్ష్యమైన ఆర్కే ఈ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకోగలిగినా.. పలువురు కీలకనేతలు సహా 24 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఒకప్పుడు ఏవోబీ కార్యదర్శిగా పనిచేసిన ఆర్కే ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం జరిపిన శాంతిచర్చల్లో పాల్గొన్న మావోయిస్టుల బృందంలో ఆర్కే కూడా ఉన్నారు. ఆ తర్వాత పలుమార్లు జరిగిన ఎన్కౌంటర్ల నుంచి ఆయన తప్పించుకున్నారు. ఆర్కే లక్ష్యంగా ఎప్పటినుంచో పని చేస్తున్న పోలీసు బలగాలు ఆ మధ్య గాలికొండ ఏరియా, దంతెవాడ ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆర్కే హతమయ్యాడని తొలుత వార్తలు వచ్చినా.. తర్వాత అవి వాస్తవం కాదని తేలింది. తాజాగా ఏవోబీలో జరిగిన ఎన్కౌంటర్ లక్ష్యం కూడా ఆర్కేయేనని పోలీసు వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ఆర్కే లక్ష్యంగానే ఆపరేషన్ ‘ఆపరేషన్ ఆర్కే’ పేరుతోనే రంగంలోకి దిగినట్టు ఓ పోలీస్ ఉన్నతాధికారి అంతర్గత సంభాషణల్లో స్పష్టం చేశారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా జంత్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని కుడుములగుమ్మ సమితి పనసపుట్టు పంచాయతీలోని కటాఫ్ ఏరియాలోని అటవీ ప్రాంతంలో మావోల ప్లీనరీ జరుగుతోందని.. అందులో ఆర్కే ఉన్నాడన్న పక్క సమాచారంతోనే ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు తెలుస్తోంది. ఇటీవల పోలీసులకు చిక్కిన మిలీషియా సభ్యుల్లో పలువురు గతంలో మావో కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వీరిలో కొంతమందిని షెల్టర్ జోన్ ఏరియాకు పంపి అక్కడ మావోల ఆనుపానులు గుర్తించారు. గత వారం రోజులుగా వీరు అదే పనిలో ఉంటూ ఎప్పటికప్పుడు మావోల క దలికలపై పోలీసులకు సమాచారం ఇస్తున్నట్టు తెలిసింది. డిసెంబర్లో జరగనున్న పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో ఈ ప్లీనరీలో అగ్రనేతలంతా సమావేశమవుతున్నట్టు పక్కా సమాచారం అందింది. వ్యూహకర్త జయరామిరెడ్డి తాజా ఎన్కౌంటర్ వెనుక ప్రధాన వ్యూహకర్త గ్రేహౌండ్స్ కమాండెంట్ జయరామిరెడ్డి అని తెలిసింది. ఏవోబీలో మావోయిస్టు కార్యకాలాపాలకు పూర్తిగా చెక్‌పెట్టాలన్న లక్ష్యంతో తాజా ఆపరేషన్‌కు ఆయనేస్కెచ్ వేయడంతోపాటు.. మొత్తం పర్యవేక్షించారని పోలీసు అధికారులు చెబుతున్నారు. మూడువైపుల నుంచి ఇరు రాష్ట్రాల పోలీసులు బలగాలను రంగంలో దింపారు. సాధారణంగా ప్లీనరీ వంటి ముఖ్యమైన సమావేశాలు జరిగినప్పుడు మావోయిస్టులు మూడంచెల భద్రత ఏర్పాటు చేసుకుంటారు. అయితే ప్రస్తుత ప్లీనరీ జరుగుతున్న కటాఫ్ ఏరియా పూర్తిగా లోయ ప్రాంతం కావడంతో మూడంచెల భద్రతను ఛేదించే పని లేకుండా ఎత్తయిన ప్రదేశం నుంచి దాడి జరిపేలా వ్యూహరచన చేశారు. ఆపరేషన్ ఆర్కే పేరుతో శుక్రవారం రాత్రి నుంచి మొదలు పెట్టిన కూంబింగ్ చేపట్టిన దళాలు ఆదివారం సాయంత్రానికి మావో శిబిరానికి సుమారు పది కిలోమీటర్లదూరానికి చేరుకున్నాయి. విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలం బూసిపూట్ వద్ద వాహనాలతో పాటు సెల్ఫోన్లను పూర్తిగా బంద్ చేశారు. ఎటువంటి సిగ్నల్స్ పనిచేయకుండా జామర్లు ఏర్పాటు చేసుకుంటూ ముందుకుసాగారు. ఆ తర్వాత సుమారు 9 కిలోమీటర్లు పూర్తిగా కాలినడకనే లక్ష్యం వైపు సాగారు. సోమవారం తెల్లవారుజామున చీకటి తెరలు వీడకముందే కొండపై నుంచి ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టారు. మావోలు వారిని గుర్తించినా అప్పటికే ఆలస్యమైంది. రెండు శిబిరాల్లో 40 మంది మావోలు ఉండగా.. గ్రేహౌండ్స్ దళాలు మాత్రం ఒక శిబిరం మాత్రమే ఉందన్న ఆలోచనతో దానిపై దృష్టి పెట్టాయి. ఈ శిబిరంలో ఉన్న ఆర్కే తనయుడు ఫృద్వీ అలియాస్ మున్నాతో సహా పలువురు మావో కీలకనేతలు నేలకొరిగారు. కాగా రెండో శిబిరంలో ఉన్న ఆర్కేతోపాటు మరికొందరు అగ్రనేతలు తప్పించుకున్నారు. ఆర్కే చిక్కక పోయినప్పటికీ ఆర్కే తనయుడు మున్నాతో సహా చలపతి, రవి, దయా తదితర ముఖ్యనేతలు చనిపోయారు. -
టార్గెట్ టాప్ కేడరే!
అగ్రనేతలను మట్టుబెడితే ఉద్యమాన్ని నీరుగార్చవచ్చనే యోచన - వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న ఎస్ఐబీ విభాగం - ఒక్కో కీలక నేత వేట కోసం ఒక్కో బృందం - ప్రధానంగా పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీల సభ్యులపై దృష్టి - బలమైన ఇన్ఫార్మర్ వ్యవస్థ.. భారీగా నజరానాలు సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరోతోపాటు కేంద్ర, రాష్ట్ర కమిటీల్లోని కీలక నేతలను పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారా.. వారిని మట్టుబెట్టేందుకు ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టారా.. ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమే వస్తోంది. మావోయిస్టు అగ్రనేతల్ని హతమార్చడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీ సులు ప్రత్యేక దళాలను రంగంలోకి దింపారని సమాచారం. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు ఉదయ్ సహా పలువురు కీలక నేతలు ఏవోబీలో ఎన్కౌంటర్ అయ్యారు. మావోయిస్టు పార్టీకి తెలుగువారు నేతృత్వం వహిస్తున్నట్లుగానే ఆ పార్టీ అగ్రనేతలను పట్టుకోవడంలో తెలుగు రాష్ట్రాల పోలీసులదే కీలక భూమిక. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో మావోయిస్టు నేతలను అరెస్టు చేసినా.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక పోలీసుల పాత్ర ఉంటోంది. ఎస్ఐబీ కీలకం..: మావోయిస్టు వ్యతిరేక చర్యల్లో గ్రేహౌండ్స్ పేరుగాంచిన విధంగానే సమాచార సేకరణలో స్పెషల్ ఇంటలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) కీలకంగా వ్యవహరిస్తోంది. మావోయిస్టు పార్టీలోని మొదటి తరం నేతలను మట్టుపెట్టడం ద్వారా ఆ ఉద్యమాన్ని కూకటివేళ్లతో పెకలించవచ్చనేది ఎస్ఐబీ వ్యూహంగా కనిపిస్తోంది. అందువల్లే మావోయిస్టు అగ్ర, కీలక నేతల వేట కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. మావోయిస్టు పార్టీ రాజకీయ విభాగాలైన పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీల్లో ఉన్న నేతల కోసం నిఘా పెట్టింది. ఒక మావోయిస్టు నేత కోసం ఏర్పాటు చేసిన బృందం ఆ నేత ఎన్కౌంటర్ అయ్యేవరకు ఆ ఒక్క పనిమీదే ఉంటోందని తెలుస్తోంది. ఎన్కౌంటర్ లేదా అరెస్టు జరిగితేనే ఆ ప్రత్యేక బృందం ఆపరేషన్ పూర్తయినట్లుగా పరిగణిస్తున్నారు. ఈ ప్రత్యేక బృందాల కారణంగానే పలువురు మావోయిస్టులు లొంగిపోతున్నారనే వాదన కూడా ఉంది. బలమైన ఇన్ఫార్మర్ వ్యవస్థ మావోయిస్టు నేతల వేటలో భాగంగా వారి షెల్టర్/శిక్షణ జోన్లుగా ఉన్న ప్రాంతాల్ని ఎస్ఐబీ పోలీసులు ఇప్పటికే గుర్తించారని తెలిసింది. బలమైన ఇన్ఫార్మర్, కోవర్టు వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడంలోనూ పోలీసులు సఫలమయ్యారు. షెల్టర్లు, శిక్షణ ప్రాంతాల్లోని నేతలను కలిసే కొరియర్లను గుర్తించడం ద్వారా నీడలా వెంబడిస్తున్నారు. ముఖ్య నేతల కదలికల సమాచారాన్ని ఇస్తున్న ఇన్ఫార్మర్లకు రూ.లక్ష నుంచి రూ.పది లక్షల దాకా నజరానా అందిస్తున్నారని తెలుస్తోంది. ఆయా విభాగాలను పర్యవేక్షించే కీలక అధికారులకు మినహా ఇన్ఫార్మర్ల సమాచారాన్ని ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మావోయిస్టు పార్టీతో గతంలో సంబంధాలు కలిగి ఉన్న వారు, ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో చిన్నచిన్న స్థాయిల్లో పనిచేస్తున్న వారు కూడా పోలీసు ఇన్ఫార్మర్లుగా పనిచేస్తుండడంతో నేతల కదలికలను పసిగట్టడం సులువవుతోంది. వీటన్నింటికీ మించి సాంకేతిక నిఘా కోసం ఎస్ఐబీ పోలీసులు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారని తెలిసింది. ఈ చర్యలన్నింటి ఫలితంగానే మావోయిస్టు పార్టీని వరుసగా దెబ్బకొడుతున్నారు. అరెస్టయిన కీలక నేతలు మావోయిస్టు పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులు కోబాడ్ గాంధీ అలి యాస్ అరవింద్, బి.ప్రసాద్‌సింగ్ అలియాస్ బాల్‌రాజ్, అమిత్ బాగ్చి అలియాస్ సుమితి, కేంద్ర కమిటీ సభ్యులు పంకజ్, బన్సీధర్ సింగ్ అలియాస్ చింతన్‌దా, తుషార్‌కాంత్ భట్టాచార్య, రాజిరెడ్డి అలియాస్ సత్త న్న, వారణాసి సుబ్రమణ్యం అలియాస్ శ్రీకాంత్. గత కొన్నేళ్లలో మరణించిన మావో అగ్ర నేతలు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి ఆజాద్, కేంద్ర కమిటీ సభ్యులు శాఖమూరి అప్పారావు, పటేల్ సుధాకర్‌రెడ్డి, వడ్కాపూర్ చంద్రమౌళి, సందె రాజమౌళి, కిషన్‌జీ, రాష్ట్ర కమిటీ సభ్యుడు సోలిపేట కొండల్‌రెడ్డి అలియాస్ రమణ. -
ఇదే అతిపెద్ద ఎన్కౌంటర్
- మావోయిస్టు ఉద్యమ చరిత్రలో భారీ నష్టం - వరుసగా మరణిస్తున్న కీలక నేతలు - యాక్షన్ టీమ్‌లకు నేతృత్వం వహించగల నేతలంతా మృతి సాక్షి, హైదరాబాద్, పెద్దపల్లి: ఏఓబీలో సోమవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. మావోయిస్టు ఉద్యమ చరిత్రలోనే అతిపెద్ద ఎన్‌కౌంటర్‌గా నమోదైంది. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు కొనసాగుతుండగా.. ఇప్పటికి కొన్ని వందల సంఖ్యలో ఎన్కౌంటర్లు జరిగాయి. కానీ ఎప్పుడూ ఇంత మంది మావోయిస్టులు, అందులోనూ అగ్రనేతలు మరణించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్లలో పదుల సంఖ్యలో కీలక నేతలను మావోయిస్టులు కోల్పోయారు. బీహార్, జార్ఖండ్‌లలో భారీ ఎన్కౌంటర్లు జరిగినా ఇంత నష్టం ఎన్నడూ లేదు. పెద్ద సంఖ్యలో ఎన్కౌంటర్లు.. 1996లో ఖమ్మం జిల్లా పగిడేరు వద్ద 16 మంది పీపుల్స్‌వార్ సభ్యులు ఎన్కౌంటర్ అయ్యారు. అయితే ఆ 16 మంది సభ్యులు కూడా కొత్తగా రిక్రూటైనవారే. వారిని ఖమ్మం జిల్లా నుంచి ఛత్తీస్‌గఢ్‌కు తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని కాల్చి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. 1998లో ఒడిశాలో పీపుల్స్‌వార్ ప్లీనరీపై పోలీసులు చేసిన దాడిలో 17 మంది నక్సలైట్లు మరణించారు. అందులో నలుగురు జిల్లా కమిటీ స్థాయి నాయకులు ఉన్నారు. పీపుల్స్‌వార్ పార్టీ చరిత్రలో గిరాయిపల్లి ఎన్కౌంటర్లో జనార్దన్, మురళీమోహన్‌లాంటి నలుగురు అగ్రనేతలను కోల్పోయింది. కరీంనగర్ జిల్లా కొయ్యూరులో జరిగిన ఎన్కౌంటర్లో నల్లా ఆదిరెడ్డి, ఎర్రం సంతోశ్‌రెడ్డి, శీలం నరేశ్ వంటి ముగ్గురు కీలక నాయకులను ఒకేసారి కోల్పోయింది. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్ర చిన్నన్న ఎన్కౌంటర్ జరిగిన నల్లమలలో 11 మంది మరణించారు. వరంగల్ జిల్లా కౌకొండలో సుధాకర్ సహా 9 మంది, కరీంనగర్ జిల్లా అచ్చంపల్లిలో రామన్నతో పాటు 10 మంది, పాలకుర్తిలో 9 మంది, సింహాచలం కొండల్లో ఓబులేసు సహా 14 మంది, వరంగల్ జిల్లా తుపాకులగూడెంలో 13 మంది, ఖమ్మం జిల్లా పువ్వర్తిలో 11 మంది, ఛత్తీస్‌గఢ్ కంచెల్లో 18 మంది, ఎర్రగుంటపాలెంలో సుదర్శన్‌తోపాటు 12 మంది, నల్లమల సున్నిపెంటలో మట్ట శ్రీధర్ సహా 11 మంది, గాజుల నర్సాపూర్‌లో సిటి ప్రభాకర్ వెంట 13 మంది, మానాలలో రమేశ్‌తోపాటు 12 మంది, పద్మక్క ఎన్కౌంటర్లో ఆరుగురు... ఇలా భారీ ఎన్కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. అయితే ఆ ఎన్కౌంటర్లలో ఒకరిద్దరు అగ్రనేతలు మాత్రమే ఉండగా.. మిగతా వారంతా సాధారణ కేడరే. అదే ప్రస్తుత ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కన్నుమూశారు. సంఖ్యాపరంగా కూడా దేశంలోనే ఇది పెద్ద ఎన్కౌంటర్. కోలుకోలేని దెబ్బ.. కొన్నేళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తీవ్ర ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో మావోయిస్టులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలను వదిలి ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు వెళ్లిపోయారు. అయితే వారు తిరిగి సరిహద్దుల్లోకి ప్రవేశించినప్పుడల్లా కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. 2009 మేలో వరంగల్ సమీపంలోని తాడ్వాయి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ మిలటరీ వ్యూహకర్త, కేంద్ర మిలటరీ కమిషన్ బాధ్యుడు పటేల్ సుధాకర్‌రెడ్డి మరణించారు. తర్వాత శాఖమూరి అప్పారావు, సోలిపేట కొండలరెడ్డి, ఆజాద్ వంటి కీలక నేతలు ఎన్కౌంటర్లలో చనిపోయారు. ఇప్పుడు ఏఓబీ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్‌తో పాటు ఆయన దళం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఇలా వ్యూహాత్మకంగా దాడులు చేసే సత్తా కలిగిన నేతలు మరణిస్తుండడం మావోయిస్టు పార్టీని కలవరపెడుతోంది. ఇప్పుడు యాక్షన్ టీమ్‌లకు నేతృత్వం వహించే సామర్థ్యమున్న నేతల్లో నంబాల కేశవరావు అలియాస్ ఆశన్న ఒక్కరే మిగిలారని సమాచారం. అనుకూలమైన కాలంలోనూ.. సాధారణంగా ఎన్కౌంటర్లు ఎక్కువగా వేసవికాలంలోనే జరుగుతుంటాయి. ఎందుకంటే చెట్లు, నీటి వనరులన్నీ ఎండిపోయి ఉంటాయి. పోలీసు బలగాలు అడవులను గాలించడం కూడా సులువు. శీతాకాలం, వర్షాకాలాల్లో మావోయిస్టులకు భద్రత ఎక్కువ. కానీ ప్రస్తుతం వర్షాలతో అడవులు దట్టంగా మారిన సమయంలో ఏవోబీలో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి మావోయిస్టులను దెబ్బతీశారు. -
తొలి తూటాకు ఏడాది
మెుద్దులగుట్ట ఎన్కౌంటర్ జరిగి సంవత్సరం తెలంగాణలో తొలి ఎన్కౌంటర్ మావోయిస్టు పార్టీకి చెందిన శృతి, సాగర్ మృతి అప్పటి నుంచి పూర్తిగా తగ్గిన మావోయిస్టు కార్యకలాపాలు ఎన్‌కౌంటర్‌పై ఇంకా ముగియని మెజిస్ట్రీయల్ విచారణ ములుగు : తెలంగాణ రాష్ట్రంలో తొలి ఎన్కౌంటర్ జరిగి ఏడాది గడిచింది. సరిగ్గా ఏడాది క్రితం(2015, సెప్టెంబరు 15) వరంగల్ జిల్లా తాడ్వాయి అడవుల్లో మొద్దులగుట్ట వద్ద ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టు పార్టీకి చెందిన తంగెళ్ల శృతి(27) అలియాస్ మహిత, మణికంటి విద్యాసాగర్‌రెడ్డి(27) అలియాస్ సాగర్ ఈ ఎన్కౌంటర్లో చనిపోయారు. వీరిద్దరు వరంగల్ జిల్లాకు చెందిన వీరు ఎన్‌కౌంటర్‌కు కొన్ని నెలల ముందే మావోయిస్టు పార్టీలో చేరారు. ఛత్తీస్‌గఢ్ నుంచి గోదావరి తీరం దాటి వరంగల్ జిల్లాలోకి వచ్చిన ఇద్దరినీ కొన్ని రోజుల్లోనే ఎన్కౌంటర్ చేసినట్లు పోలీసు వర్గాలు అప్పట్లో తెలిపాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి ఎన్కౌంటర్ కావడంతో ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మావోయిస్టు పార్టీకి సంబంధించి రాష్ట్రంలో పూర్తిగా కోలుకోలేని దెబ్బ తగిలింది. వరంగల్ జిల్లాలో గతంలో 2009 అక్టోబరులో ఎన్కౌంటర్ జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే చివరి ఎన్కౌంటర్. గత ఏడాది జరిగిన ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టు కార్యకలాపాలు మళ్లీ మొదలయ్యాయని భావించారు. ఆ తర్వాత ఎలాంటి కార్యకలాపాలూ జరగకపోవడంతో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని ప్రజల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ప్రశాంతం... వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మొద్దులగుట్ట ఎన్కౌంటర్ తర్వాత ఏజెన్సీ ప్రాంతం కొన్ని నెలలపాటు స్తబ్ధత నెలకొంది. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో తాడ్వాయి మండల కేంద్రంలోని అటవీశాఖ కుటీరాన్ని, జీపు దగ్ధం చేశారు. ఇది తామే చేశామని మావోయిస్టుల పేరుతో అక్కడ లేఖ దొరికింది. మే నెలలో ములుగు మండలం మల్లంపల్లి ఎర్రమట్టి క్వారీలో జేసీబీని దగ్ధం చేశారు. మావోయిస్టు పార్టీ ఖమ్మం–కరీంనగర్–వరంగల్(కేకేడబ్ల్యూ) కార్యదర్శి దామోదర్ పేరుతో వాల్‌పోస్టర్లు వెలిశాయి. తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు. మావోయిస్టు యాక్షన్ టీం దళకమాండర్ బుట్టాయిగూడెంకు చెందిన మధు అలియాస్ కుమ్మరి సడవలయ్యను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఎలాంటి సంఘటనలూ జరగలేదు. కొనసాగుతున్న విచారణ... మొద్దులగుట్ట ఎన్‌కౌంటర్‌పై రాష్ట్ర ప్రభుత్వం మెజిస్ట్రీయల్ విచారణకు ఆదేశించింది. ములుగు రెవెన్యూ డివిజనల్ అధికారి నేతృత్వంలో ఈ విచారణ జరుగుతోంది. ఇప్పటికి రెండుసార్లు ఈ కేసును విచారించారు. శృతి తల్లిదండ్రులు తంగెళ్ల సుదర్శన్–రమాదేవి, విద్యాసాగర్ తండ్రి మణికంటి సుధాకర్‌రెడ్డి, పలువురు ప్రజాసంఘాల నేతలు విచారణకు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. త్వరలో పూర్తి : చీమలపాటి మహేందర్‌జీ, ములుగు ఆర్డీవో. మొద్దుగుట్ట ఎన్‌కౌంటర్‌పై విచారణ కొనసాగుతోంది. మృతుల తల్లిదండ్రులు, మానహక్కుల సంఘాలు, ప్రజాస్వామిక సంఘాల సభ్యులు, ఇద్దరు తహసీల్దార్లలోపాటు రంగాపురం, చల్వాయి గ్రామస్తులు, ఇద్దరు పోలీసులను రెండుసార్లు విచారించాం. శృతి, విద్యాసాగర్‌రెడ్డి మృతదేహాలను పోస్టుమార్టం చేసిన వైద్యులను, పంచనామా నిర్వహించిన రెవెన్యూ సిబ్బందిని, పోలీస్ అధికారులను విచారిచాల్సి ఉంది. ఇద్దరు వైద్యుల్లో ఒకరు అందుబాటులో లేరు. 15 రోజుల్లో విచారణ పూర్తి చేస్తాం. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి : తంగెళ్ల సుదర్శన్, శృతి తండ్రి శృతిని పట్టుకుని క్రూరంగా హింసించి హత్య చేశారు. హింసించక పోతే శరీరంపై గాయాలు ఎలా ఏర్పడుతాయి? చేయి ఎలా విరిగింది? ఇవన్నీ ప్రజలకు తెలియాల్సిన అవసరముంది. సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపితేనే వాస్తవాలు బయటకు వస్తాయి. మన రాష్ట్రం... మన ప్రభుత్వం అనుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో శృతి చురుకుగా పాల్గొన్నది. రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా ప్రజలను ఉద్యమంలో పాల్గొనేలా చేసింది. సాధించుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని తపించింది. ఈ దిశగా ముందుకు పోతున్న శృతిని అకారణంగా హత్య చేశారు. ఎలాంటి కార్యకలాపాలకూ పాల్పడకపోయినా శృతిని, సాగర్‌ను క్రూరంగా చంపారు. వీరిద్దరిని చంపిన వారిని నరహంతక ప్రభుత్వం ఇప్పటికీ శిక్షించలేదు. ప్రభుత్వంలో మార్పు లేదు. ప్రజలు కోరుకునే విధంగా నడుస్తామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో భిన్నంగా నడుచుకుంటోంది. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతోంది. శృతి, సాగర్ ఎన్కౌంటర్లపై ప్రజలకు జవాబు చెప్పాలి. కొడుకును శవంగా అప్పజెప్పిండ్రు : మణికంటి సుధాకర్‌రెడ్డి, సాగర్ తండ్రి నాకొడుకు సాగర్ పేదలకు ఒక న్యాయం పైసలు ఉన్నోల్లకు ఒక న్యాయం జరుగుతుందనిlఎప్పటికీ అనేటోడు. రెండుమూడు సార్లు ఈ విషయంపై గ్రామంలోని కొంతమందికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు గొడవపడ్డారు. ఎప్పుడూ ఎటోపోయోటోడో... వచ్చేటోడు. ఎందిబిడ్డా అంటే నాకేంగాదు బాపు నువ్వు ఊకో అనేటోడు. సాగర్ ఎన్కౌంటర్ కన్నా ముందు ఎనిమిది నెలల కిందనే దళంకు పోయిండని తెలిసింది. తరువాత ఆరోగ్యం సక్కగ ఉంటలేదని లొంగిపోయిండు. తరువాత కొన్ని రోజులు ఫర్టిలైజర్ షాపు పెట్టుకుని ఉన్నడు. కొన్ని నెలల తరువాత తిరిగి దళంలకు పోయిండని తెలువంగనే చాలాసార్లు ఫోన్ చేసినా కలువలేదు. అప్పటి నుండి రెండున్నర నెలల తరువాత శవంగా ఇంటికి వచ్చిండు. నా కొడుకు నాకు తలకొరివి పెడుతడనుకుంటే... నాతోనే తలకొరివి పెట్టించుకున్నడు. నా కొడుకును పోలీసులు చిత్రహింసలు పెట్టి సంపిండ్రు. అప్పుడు శవాన్ని చూసేందుకు పోలీసులు పోస్ట్‌మార్టం రూంలకు పోనియ్యలే. పోస్ట్‌మార్టం అయినంక చూస్తే శరీరం మొత్తం దెబ్బలే కనిపించినయి. అన్యాయంగా నాకొడుకును పోలీసులు, రాజకీయనాయకులు కలిసి పొట్టనబెట్టుకున్నరు. ఇక్కడున్న కొంతమంది స్థానిక నాయకులే... నాకొడుకు దళంలకు పోవటానికి కారణమయ్యారు. నాకు ఎటువంటి ఆధారమూ లేదు, రెండు బర్లు ఉన్నాయి. వాటి పాలపై వచ్చే ఆదాయంతో నేను, నా తల్లి బతుకుతున్నాము. సాగర్ ఎన్కౌంటర్లో మృతి చెందిన ఐదు నెలల తర్వాత నా భార్య లత గుండెపోటుతో మృతిచెందింది. -
కోవర్టులుగా వచ్చి.. మాఫియాగా మారి
మావోయిస్టు పార్టీలో పనిచేసి అదే పార్టీకి చెందిన ముఖ్యులను హతమార్చి కోవర్టులుగా మారిన పలువురు మాజీ నక్సలైట్లు మాఫియాగా, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నారు. చివరికి పోలీసుల చేతుల్లో హతమవుతున్నారు. గ్రీన్ టైగర్స్, బ్లాక్ టైగర్స్ పేరిట సంఘ వ్యతిరేక కార్యకలాపాలు నడిపినవారు, పోలీసు అధికారుల మెప్పుకోసం మావోయిస్టుల కుటుంబ సభ్యులను సైతం హతమార్చి కలకలం సృష్టించిన వారు ఇలాగే అంతమవుతున్నారు. మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తించి కోవర్టులుగా మారిన శంకర్‌నాయక్, కత్తుల సమ్మయ్య, సోమ్లానాయక్, బయ్యపు సమ్మిరెడ్డి, శివకుమార్.. తాజాగా నయీమ్ మృతి చెందగా.. జడల నాగరాజు, గోవిందరెడ్డి జాడలేకుండా పోయారు. ఇందులో ఎక్కువ మంది కరీంనగర్ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. - పెద్దపల్లి పోలీసుల చేతిలో హతమవుతున్న మాజీ నక్సలైట్లు ♦ మావోయిస్టు పార్టీని దెబ్బతీసి కోవర్టులుగా మారిన వారిలో కత్తుల సమ్మయ్యను మొదటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. కరీంనగర్ జిల్లా కాచాపూర్ గ్రామానికి చెందిన సమ్మయ్య హుస్నాబాద్ దళంలో పనిచేస్తూ 1991లో కోవర్టుగా మారాడు. హిమ్మత్‌నగర్‌లో సేద తీర్చుకుంటున్న భూపతి దళంపై కాల్పులు జరపడంతో కమాండర్ భూపతి సహా మరో ఇద్దరు సభ్యులు చనిపోయారు. అలాగే హైదరాబాద్‌లో డీఐజీ వ్యాస్‌ను హతమార్చిన వారిలో కత్తుల సమ్మయ్య, నయూమ్ ప్రధాన పాత్రధారులు. వీరిద్దరూ పార్టీతో విభేదించి కోవర్టులుగా మారి పౌరహక్కుల సంఘాల నాయకులను హతమార్చారు. రాజధానిలో గ్యాంగ్‌లను నడుపుతూ సెటిల్మెంట్లు చేశారు. 1996లో కొలంబోకు వెళ్లిన కత్తుల సమ్మయ్య విమాన ప్రమాదంలో చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. ♦ కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం రాణాపూర్‌కు చెందిన మరో కోవర్టు బయ్యపు సమ్మిరెడ్డి 1999లో పోలీసులకు లొంగిపోయి అప్పటి జిల్లా కార్యదర్శి అనుపురం కొమురయ్య ఎన్‌కౌంటర్‌కు సహకరించాడు. పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం, కనకాచారి హత్యల్లో పాల్గొన్నాడు. రాష్ట్రవ్యాప్తంగా పలు సంఘటనల్లో పాల్గొన్న సమ్మిరెడ్డి పేరు చెబితే చాలు.. ఎన్నో కేసులు పరిష్కారమయ్యేవి. కానీ సమ్మిరెడ్డి గుంటూరు జిల్లాలో దారుణహత్యకు గురయ్యాడు. నాలుగు రోజుల తర్వాత కుళ్లిపోయిన శవం దొరికింది. తన కుమారుడిని పోలీసులే చంపారని, పార్టీలో ఉండి చనిపోయినా తమ కుటుంబానికి గౌరవం దక్కేదని సమ్మిరెడ్డి తండ్రి రాఘవరెడ్డి చేసిన ప్రకటన సంచలనం రేపింది. ♦ కరీంనగర్ జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన శివకుమార్ ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల కోల్‌బెల్ట్ ప్రాంతంలో సింగరేణి కార్మిక సంస్థ (సికాస) సానుభూతిదారుడుగా పనిచేశాడు. తర్వాత అదే పార్టీపై తిరుగుబాటు చేసి పోలీసులకు సహకరించాడు. పాతికేళ్ల పాటు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన సికాస నేత రమాకాంత్, మరో ఇద్దరు సభ్యుల ఎన్‌కౌంటర్‌కు శివకుమారే కారణమని ప్రచారం జరిగింది. దానికి సంబంధించిన రివార్డు పంపకాల్లో విభేదాలు రావడంతో పోలీసులు శివకుమార్‌ను ఎన్కౌంటర్ చేసినట్లు కోల్‌బెల్ట్ ప్రాంతంలో ప్రచారమైంది. ♦ కరీంనగర్ జిల్లా మంథని మండలం ఖమ్మంపల్లికి చెందిన జడల నాగరాజు 1999లో పీపుల్స్‌వార్‌లో దళ సభ్యుడిగా చేరాడు. అప్పటి ఆ పార్టీ జిల్లా కార్యదర్శి విజయ్ అలియాస్ కొట్టె పురుషోత్తంను కాల్చిచంపి పోలీసులకు లొంగిపోయాడు. 2008 వరకు పలు వివాదాస్పదమైన కేసులతో సంబంధం కలిగిన నాగరాజు.. తర్వాత రెండు మూడేళ్ల పాటు మౌనంగానే ఉన్నాడు. 2011 డిసెంబర్ 26న మూడు నెలల్లో తిరిగి వస్తానని భార్య రాణికి చెప్పి వెళ్లిపోయాడు. ఇప్పటివరకు నాగరాజు జాడ లేదు. ♦ పీపుల్స్‌వార్ కేంద్ర కమిటీ నాయకులు నల్ల ఆదిరెడ్డి, శీలం నరేశ్, ఎర్రం సంతోష్‌రెడ్డిలను పోలీసులకు పట్టించిన ఆ పార్టీ అగ్రనేత గోవిందరెడ్డి ఆ తర్వాత జాడ లేకుండా పోయూడు. నల్లగొండ జిల్లాకు చెందిన గోవిందరెడ్డిని ప్రభుత్వమే విదేశాలకు పంపించినట్లు ప్రచారం జరిగింది. అతని తల్లిదండ్రులు చివరి దశలో భిక్షాటన చేస్తూ విషాదకర స్థితిలో మరణించారు. గోవిందరెడ్డి ఆచూకీ ఇప్పటికీ తెలియదు. ♦ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన శంకర్‌నాయక్ కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో మావోయిస్టు పార్టీని దెబ్బతీస్తానని, దళాలను మట్టుపెడతానని అంటూ కోవర్టుగా మారాడు. అతను పోలీసులకు సవాలుగా మారడంతో చివరకు పోలీసులే ఎన్కౌంటర్లో చంపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ♦ నల్లగొండ జిల్లా పావురాల గుట్ట వద్ద మావోయిస్టు పార్టీ అప్పటి రాష్ట్ర కార్యదర్శి చిన్నన్నపై కాల్పులు జరిపిన సోమ్లానాయక్.. చివరికి గిరిజనుల చేతిలోనే మరణించాడు. ప్రకాశం, నల్లగొండ జిల్లాల్లో ఆయనకు గతంలో తిండిపెట్టిన వారినే వేధించడంతో మట్టుబెట్టారు. ఇక హైదరాబాద్‌లో మాఫియా రాజ్యాన్ని ఏలిన నయూమ్ వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారడంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి మట్టుబెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు, కోవర్టులు ఒకటేనంటూ పలు సందర్భాల్లో హక్కుల సంఘాల నాయకులు ఆరోపణలు చేశారు. అవసరమైతే కోవర్టులను సైతం ఎన్కౌంటర్ చేస్తామని నయీమ్ సంఘటనతో మరోసారి పోలీసులు రుజువు చేశారు. -
నేపాల్ ప్రధానిపై అవిశ్వాసం
కఠ్మాండు : నేపాల్ ప్రధాని ఓలిపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. మావోయిస్టు పార్టీ మద్దతు ఉపసంహరించిన నేపథ్యంలో సీపీఎన్-యూఎంఎల్ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభంలోపడడం తెలిసిందే. దీంతో మావోయిస్టు సెంటర్ మంత్రులు కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఓలి తాను పదవి నుంచి వైదొలగనని, పార్లమెంటులోనే తేల్చుకుంటానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు సెంటర్, నేపాలీ కాంగ్రెస్ (ఎన్సీ), సీపీఎన్ (యునెటైడ్).. ఓలీపై నేపాల్ పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. దీనిపై ఓటింగ్ వచ్చే వారం జరిగే అవకాశం ఉంది. కాగా 601 మంది సభ్యులు గల పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలు మూడింటికి కలిపి 292 మంది సభ్యులున్నారు. ఓలికి పార్టీ యూఎంఎల్‌కి 175 మంది సభ్యులున్నారు. తీర్మానం గట్టెక్కడానికి 299 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే 50 మంది సభ్యులు గల ఆరు మధేసి పార్టీలు అవిశ్వాసానికి మద్దతిస్తామన్నాయి. -
సంక్షోభంలో నేపాల్ ప్రభుత్వం
-
సంక్షోభంలో నేపాల్ ప్రభుత్వం
మద్దతు ఉపసంహరించుకున్న మావోయిస్టు పార్టీ కఠ్మాండు : ప్రధాని కేపీ ఓలి సారథ్యంలోని నేపాల్ సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. భాగస్వామి పక్షమైన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు సెంటర్) ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. అంతేకాదు ప్రధాన విపక్షం నేపాలీ కాంగ్రెస్(ఎన్సీ) మద్దతుతో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది. సీపీఎన్-యూఎంల్(యూనిఫైడ్ మార్క్సిస్టు-లెనినిస్టు) పార్టీల మధ్య మేలో జరిగిన తొమ్మిది సూత్రాల ఒప్పందం, ప్రభుత్వ నాయకత్వ మార్పు ఒప్పందాల అమల్లో ఓలి విఫలమయ్యాని సీపీఎన్ చైర్మన్ ప్రచండ ఆరోపించారు. అందుకే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు ప్రధానికి లేఖ రాశారు. ప్రచండ సన్నిహితుల కథనం ప్రకారం.. ఓలి, ప్రచండ మధ్య అధికార మార్పిడికి సంబంధించి మేలో ఒప్పందం జరిగింది. పార్లమెంటు కొత్త బడ్జెట్‌ను ఆమోదించిన తర్వాత అధికారం ప్రచండకు అప్పగిస్తానని ఓలి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒప్పందాన్ని విస్మరించి వచ్చే ఏడాదిన్నర పాటు అధికారంలో కొనసాగడానికే నిర్ణయించుకోవడం వల్లే ప్రచండ నిర్ణయానికి కారణమం టున్నారు. కాగా, సంకీర్ణ ప్రభుత్వంలో తమది రెండో పెద్ద పార్టీ అని.. తమ మంత్రులందరితో రాజీనామాలు చేయిస్తామని సీపీఎన్ నాయకుడు కృష్ణ బహదూర్ మహరా చెప్పారు. ప్రచండ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీ ఒప్పుకుందన్నారు. -
మంత్రులపై మావోయిస్టుల గురి?
- ఛత్తీస్‌గఢ్ పోలీసుల నుంచి రాష్ట్ర పోలీసులకు సమాచారం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనాత్మక సంఘటనలకు పాల్పడడం ద్వారా తమ ఉనికి చాటుకునేందుకు మావోయిస్టు పార్టీ వ్యూహం రచించిందా.. ఇందుకోసం నలుగురు మంత్రులను, మరికొందరు అధికారులను టార్గెట్ చేసిందా... వారిని మట్టుబెట్టేందుకు యాక్షన్ టీమ్‌లను కూడా రంగంలోకి దించిందా... ఈ ప్రశ్నలకు విశ్వసనీయ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నా యి. ఈ మేరకు కొద్దిరోజుల కింద సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్ పోలీసు ఉన్నతాధికారుల నుంచి రాష్ట్ర పోలీసు అధికారులకు సమాచారం అందినట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి తెలంగాణ ఏర్పాటయ్యాక ఇక్కడ తమ కార్యకలాపాలను విస్తృతపర్చుకోవాలన్న మావోయిస్టుల ప్రయత్నాలను రాష్ట్ర పోలీసులు సమర్థంగా తిప్పికొట్టారు. యూనివర్సిటీస్థాయిలో జరిగిన రిక్రూట్మెంట్ సమాచారాన్ని సేకరించి, అడ్డుకోగలిగారు. మరోైవెపు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర పోలీసులను సమన్వయం చేసుకుని మావోయిస్టులు సరిహద్దు దాటి తెలంగాణలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగానే ఖమ్మం జిల్లా సరిహద్దులో, వరంగల్ జిల్లా ఏటూరునాగారం, ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో ఎన్కౌంటర్లు జరిగాయని విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడి కొత్త రాష్ట్రంలో ఉనికి చాటుకునేందుకు మావోయిస్టు పార్టీ వ్యూ హం రచించిందని, ఛత్తీస్‌గఢ్ పోలీసుల నుంచి రాష్ట్ర పోలీసు అధికారులకు సమాచారం అందిందని తెలుస్తోంది. నలుగురు మంత్రులు టార్గెట్?: మావోయిస్టుల ఎజెండాను అమలు చేస్తామని టీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక జరిగిన ఎన్కౌంటర్లు, పోలీసు శాఖ ఆధునీకరణకు తీసుకున్న చర్యలతో మావోయిస్టులు ఉనికి చాటుకునే ప్రయత్నం చేశారు. వరంగల్ జిల్లా ములుగు మండలం మల్లంపల్లి వద్ద మైనింగ్ వాహనాలను దహనం చేశారు. ఆ తర్వాత 2, 3 రోజులకే తాడ్వా యి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులు శృతి, సాగర్ చనిపోయారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఉనికి చాటుకునేందుకు మంత్రులను టార్గెట్ చేసేం దుకు యాక్షన్ టీమ్‌లను పంపినట్లు అనుమానిస్తున్నారు. ప్రధానంగా నలుగురు మంత్రులను టార్గెట్‌గా ఎంచుకున్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్ పరిధిలోని ఒక మంత్రిని, దక్షిణ తెలంగాణకు చెందిన ఇద్దరు, ఉత్తర తెలం గాణకు చెందిన ఒక మంత్రి ఉన్నారని అంటున్నారు. ఈ సమాచారం అందిన వెంటనే ఆయా మంత్రులను అప్రమత్తం చేసిన పోలీసు ఉన్నతాధికారులు... వారి పర్యటనల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిం చినట్లు చెబుతున్నారు. దీనివల్లే ఉత్తర తెలంగాణకు చెందిన ఒక మంత్రి ఇటీవల తన పర్యటనలు పూర్తిగా తగ్గించుకుని, పట్టణ ప్రాంతానికే పరిమితమయ్యారని పేర్కొంటున్నారు. గతంలో తన శాఖ పనులను పరిశీలించేందుకు ఆ మంత్రి గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారని, ఇటీవల పూర్తిగా తగ్గించుకున్నారని అంటున్నారు. మరో ముగ్గురిపైనా..: రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించడానికి కృషి చేసిన ఇద్దరు ఐపీఎస్ అధికారులపైనా వారు దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇందులో ఒకరు మాజీ డీజీపీ కాగా.. మరో అధికారి ఇంకా సర్వీసులో ఉన్నారని చెబుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులకు పూర్తి స్థాయిలో సహకరించి ఎప్పటికప్పుడు మావోయిస్టుల సమాచారాన్ని చేరవేస్తున్న ఓ మాజీ నక్సలైట్‌ను కూడా హతమార్చేందుకు యాక్షన్ టీమ్‌లు రంగంలోకి దిగాయని అంటున్నారు.