సాక్షి, అమరావతి: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మావోయిస్టు పార్టీపై మరో ఏడాది పాటు నిషేధాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా భద్రతా చట్టం 1992 కింద ఆగస్టు 17, 2019 నుంచి ఏడాది పాటు మావోయిస్టు పార్టీపై నిషేధం పొడిగించారు. మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థలైన రైతు కూలీ సంఘం, ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్, విప్లవకార్మిక సమాఖ్య, సింగరేణి కార్మిక సమాఖ్య , ఆల్ ఇండియా రివల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్, ర్యాడికల్ యూత్ లీగ్, రివల్యూషనరీ డెమాక్రాటిక్ ఫ్రంట్ తదితర సంస్థలపై నిషేధం ప్రకటించారు. ఈ నేపథ్యంలో 1991 నుంచి ఈ సంస్థలపై ప్రతీ ఏటా నిషేధాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment