మావోయిస్టుపార్టీపై నిషేధం పొడిగింపు | Maoist party ban extends to next year | Sakshi
Sakshi News home page

మావోయిస్టుపార్టీపై నిషేధం పొడిగింపు

Published Fri, Aug 9 2013 6:44 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM

Maoist party ban extends to next year

సాక్షి, హైదరాబాద్: కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(మావోయిస్టు)పై నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 17తో ఆ పార్టీపై ఉన్న నిషేధం పూర్తవుతుండగా, తాజా నిర్ణయంతో నిషేధం మరో ఏడాదిపాటు కొనసాగుతుంది. ప్రజా భద్రతా చట్టం కింద మావోయిస్టు పార్టీతోపాటు దాని అనుబంధంగా పనిచేస్తున్న మరో 7 ప్రజాసంఘాలపై కూడా ఏడాది పాటు నిషేధం పొడిగించారు. 2005 ఆగస్టు 15న మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డితోపాటు తొమ్మిది మందిని మావోయిస్టులు దారుణంగా కాల్చిచంపారు. ఈ దాడి నేపథ్యంలో మావోయిస్టు పార్టీతోపాటు దాని అనుబంధ సంస్థలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement