Ban Extend
-
సిమిపై మరో ఐదేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతూ శాంతి, మత సామరస్యానికి భంగం కలిగిస్తున్న స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సిమి)పై నిషేధాన్ని కేంద్ర ప్రభ్వుం మరో అయిదేళ్లు పొడిగించింది. ఈ విషయాన్ని హోం శాఖ మంత్రి అమిత్ షా సోమవారం ‘ఎక్స్’లో ప్రకటించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా)కింద సిమిని చట్టవ్యతిరేక సంస్థగా ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సహా సుమారు 10 రాష్ట్రాల వినతి మేరకు.. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా మొదటిసారిగా కేంద్రం 2001లో సిమిని నిషేధించింది. ఆ తర్వాత పొడిగిస్తూ వస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో 1977లో సిమి ఏర్పాటైంది. భారత్‌ను ముస్లిం దేశంగా మార్చాలన్న అజెండాతో పనిచేస్తున్నట్లు ఈ సంస్థపై ఆరోపణలొచ్చాయి. గత కొన్నేళ్లలో సిమి కార్యకర్తలపై ఉగ్రవాద సంబంధ 17 కేసులు నమోదు కాగా, 27 మంది సభ్యులను అరెస్ట్ చేసినట్లు హోం శాఖ తెలిపింది. -
ఆ దేశాలపై అమెరికా ఆంక్షలు
వాషింగ్టన్: గతంలో చెప్పినట్టుగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రతా నిబంధనలను పాటించడంలో విఫలమైన దేశాల పౌరుల వీసా అనుమతులపై ఆంక్షలు విధించే పత్రంపై సంతకం చేశారు. ఇవి అమెరికా భద్రతకు ప్రమాదకరంగా మారాయని ఆయన వైట్ హౌస్ వెల్లడించింది. ఇరాన్, లిబియా, ఉత్తర కొరియా, సిరియా, వెనెజులా, యెమన్, సోమాలియా పౌరుల అమెరికా ప్రవేశంపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తూ ప్రకటన విడుదల చేసింది. మయన్మార్, ఎరిట్రియా, కిర్గిజిస్తాన్, నైజీరియా వలసదారులకు వీసాల అనుమతిపై నిషేధం విధించింది. సూడాన్, టాంజానియా దేశాలు వీసా లాటరీలో పాల్గొనే అవకాశాన్ని రద్దు చేస్తూ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ స్టెఫానియా గ్రెషమ్ ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ ఆంక్షలేవీ పర్యాటకులకు, వ్యాపారస్తులకు, వలసేతర ప్రయాణికులకు వర్తించవనిన్నారు. అంతర్జాతీయ భద్రతా నిబంధనలను పాటించకుంటే ఎలా ఉంటుందో ఆయా దేశాలకు అర్థమయ్యేందుకే ఈ నిషేధమని యాక్టింగ్ సెక్రటరీ చాడ్ ఎఫ్ వోల్ఫ్ వెల్లడించారు. ‘దేశ భద్రత, ప్రజల రక్షణే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రథమ బాధ్యత అనీ, ఈ ఆంక్షలు ఆ లక్ష్యాన్ని చేరుకుంటాయని’ వోల్ఫ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
మావోయిస్టు పార్టీపై మరో ఏడాది నిషేధం
సాక్షి, అమరావతి: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మావోయిస్టు పార్టీపై మరో ఏడాది పాటు నిషేధాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా భద్రతా చట్టం 1992 కింద ఆగస్టు 17, 2019 నుంచి ఏడాది పాటు మావోయిస్టు పార్టీపై నిషేధం పొడిగించారు. మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థలైన రైతు కూలీ సంఘం, ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్, విప్లవకార్మిక సమాఖ్య, సింగరేణి కార్మిక సమాఖ్య , ఆల్ ఇండియా రివల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్, ర్యాడికల్ యూత్ లీగ్, రివల్యూషనరీ డెమాక్రాటిక్ ఫ్రంట్ తదితర సంస్థలపై నిషేధం ప్రకటించారు. ఈ నేపథ్యంలో 1991 నుంచి ఈ సంస్థలపై ప్రతీ ఏటా నిషేధాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. -
మావోయిస్టుపార్టీపై నిషేధం పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(మావోయిస్టు)పై నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 17తో ఆ పార్టీపై ఉన్న నిషేధం పూర్తవుతుండగా, తాజా నిర్ణయంతో నిషేధం మరో ఏడాదిపాటు కొనసాగుతుంది. ప్రజా భద్రతా చట్టం కింద మావోయిస్టు పార్టీతోపాటు దాని అనుబంధంగా పనిచేస్తున్న మరో 7 ప్రజాసంఘాలపై కూడా ఏడాది పాటు నిషేధం పొడిగించారు. 2005 ఆగస్టు 15న మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డితోపాటు తొమ్మిది మందిని మావోయిస్టులు దారుణంగా కాల్చిచంపారు. ఈ దాడి నేపథ్యంలో మావోయిస్టు పార్టీతోపాటు దాని అనుబంధ సంస్థలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
మావోయిస్టు పార్టీపై మరో ఏడాది నిషేధం
భారత కమ్యూనిస్టు(మావోయిస్టు)పార్టీతో పాటు, అనుబంధ ఆరు సంఘాలపై మరో ఏడాది నిషేధం పొడిగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది పొడిగించిన నిషేధ ఉత్తర్వుల గడువు ఈనెల 17వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరో ఏడాది నిషేధం పొడిగిస్తూ గురువారం గెజిట్ విడుదల చేసింది. ఈనెల 18 నుంచి 2014 ఆగస్టు 17 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. మావోయిస్టు పార్టీతోపాటు సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస), విప్లవ కార్మిక సమాఖ్య(వికాస), ఆలిండియా రివల్యూషనరీ స్టూడెంట్ ఫెడరేషన్ (ఏఐఆర్ఎస్ఎఫ్), రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ), రైతు కూలీ సంఘం(ఆర్సీఎస్), రాడికల్ యూత్ లీగ్(ఆర్‌వైఎల్)లపై నిషేధం విధిస్తూ ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ పీకే.మహంతి ఉత్తర్వులు జారీ చేశారు.