ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విశాఖపట్నం : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన చేస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ పేరిట బ్యానర్లు వెలిశాయి. కశ్మీర్‌లో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్న కేంద్ర ప్రభుత్వ వాదనను ఎండగడుతూ... ‘కశ్మీర్ ప్రజలకు మద్దతుగా నిలుద్దాం. కశ్మీర్ పోరాటం గురించి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్న ఫాసిస్టు మోడి ప్రభుత్వ చర్యను వ్యతిరేకిద్దాం’ అంటూ జి.మాడుగుల, మద్దిగురువుల్లో మల్కాన్ గిరి-విశాఖ బోర్డర్ డివిజన్ కమిటీ పేరిట వెలసిన బ్యానర్లు కలకలం రేపుతున్నాయి.
‘స్వయం నిర్ణయాధికారం కశ్మీర్ ప్రజల జన్మహక్కు. బ్రాహ్మణీయ హిందూ ఫాసిజం నశించాలి. నరహంతక మోదీ ఫాసిస్టు ప్రభుత్వ చర్యను వ్యతిరేకిద్దాం. కశ్మీర్ ప్రజలపై అమలు జరుపుతున్న దారుణ మారణకాండను వ్యతిరేకించుదాం’ అంటూ మావోయిస్టు పార్టీ(సీపీఐ) నేతలు బ్యానర్లలో పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment