
రాయ్‌పూర్: దూరదర్శన్ కెమెరామన్ అచ్యుతానంద్ సాహు, మరో ఇద్దరు మీడియా సిబ్బందితో పాటుగా పోలీసులపై ఈ నెల 30న జరిగిన దాడికి బాధ్యత వహిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. మావోయిస్టు దర్భా డివిజన్ కమిటీ కార్యదర్శి సాయినాథ్ పేరుతో రెండు పేజీల లేఖను ఆ పార్టీ వెల్లడించింది. ఆ దాడి మీడియా లక్ష్యంగా జరిగింది కాదని, పోలీసుల లక్ష్యంగానే దాడి జరిగినట్లు పేర్కొన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోకి మీడియా వ్యక్తులు వచ్చేటప్పుడు పోలీసులను వెంటపెట్టుకురావొద్దని ఆ పార్టీ కోరింది. అక్టోబర్ 30న నక్సల్స్ జరిపిన దాడిలో ముగ్గురు పోలీసులు, దూరదర్శన్ కెమెరామన్ అచ్యుతానంద్ సాహు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పోలీసులే లక్ష్యంగా దాడి చేస్తే చేతిలో కెమెరా పట్టుకున్న అచ్యుతానంద్ సాహుపై కూడా మావోయిస్టులు కాల్పులెందుకు జరిపారని ఆ రాష్ట్ర స్పెషల్ డైరెక్టర్ జనరల్ డీఎం అవస్థి తీవ్రంగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment