మావోయిస్టుల బ్యానర్
విశాఖపట్నం , గూడెంకొత్తవీధి(పాడేరు): కాఫీ తోటలను గిరిజనులకు అప్పగించి ఏపీఎఫ్‌డీసీ అధికారులు ఏజెన్సీ ప్రాంతాన్ని వదిలివెళ్లాలని మావోయిస్టుపార్టీ గాలికొండ ఏరియా కమిటీ పేరుతో గురువారం బ్యానర్లు , కరపత్రాలు వెలిశాయి. వివరాలు ఇలా ఉన్నాయి. తాము పంచిపెట్టిన కాఫీతోటలను గిరిజనులు సాగు చేసుకుంటున్నారని, అడవిపై హక్కు ఆదివాసీలదేనని, గ్రామరాజ్యం కమిటీలతో సర్వ అధికారం పొందారని అందువల్ల కాఫీ తోటలను వదిలి ఏపీఎఫ్‌డీసీ అధికారులు వెళ్లిపోవాలని పేర్కొంటూ మండలంలోని కుంకుంపూడి ఘాట్‌రోడ్డులో గురువారం తెల్లవారు జామున గాలికొండ ఏరియా కమిటీ పేరిట బ్యానర్లు వెలిశాయి. జి.మాడుగుల మండలం నుర్మతి సమీపంలో పోలీసులను లక్ష్యంగా చేసుకుని మందుపాతర పేల్చి అలజడి సష్టించిన మావోయిస్టులు, ఇప్పుడు కాఫీతోటల వివాదం తెరపైకి తేవడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment