
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర- ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. పెదబయలు అటవీ ప్రాంతంలో రెండు రోజుల క్రితం ఎన్‌కౌంటర్ జరిగిన పరిసరాల్లో రక్తపు మరకలు గుర్తించడంతో కూంబింగ్ ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కృష్ణారావు పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన పరిసర ప్రాంతాల్లో సీనియర్ మావోయిస్టు నేతల సమావేశం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పెదబయలు, రూడకోట, ముంచంగిపుట్లు పరిసర ప్రాంతాలను పోలీసుల బలగాలు జల్లెడ పడుతున్నాయి. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న వారిలో సీనియర్ మావోయిస్టు నాయకులున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు అదుపులో అమాయక గిరిజనులు ఉన్నారంటూ ఆంధ్రప్రదేశ్ హక్కుల సంఘం పత్రికా ప్రకటన ఇచ్చింది. అయితే మా అదుపులో అమాయకపు గిరిజనులు ఎవరూ లేరని జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు. (అడవిలో అలజడి)
Comments
Please login to add a commentAdd a comment