krishna rao
-
TG: ఎవరా పెద్ద సారు?
సాక్షి, హైదరాబాద్: పోలీసు విభాగంలో డీజీపీ కార్యాలయాన్ని మించిన ఉన్నత విభాగం (టాప్ ఆఫీస్) మరొకటి లేదు. ఆ కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలు ఎవరైనా పాటించాల్సిందే. కానీ గతంలో ఓ ఉన్నతాధికారి (హయ్యర్ అప్) ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారా? అంటే.. క్రియ హెల్త్ కేర్ డైరెక్టర్ వేణుమాధవ్ చెన్నుపాటి కిడ్నాప్ కేసును పరిశీలిస్తే అవుననే సమాధానమే లభిస్తోంది. అదే సమయంలో ఎవరా ఉన్నతాధికారి? అనే సందేహం కలుగుతోంది. కృష్ణారావు ద్వారా హయ్యర్ అప్ వద్దకు.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లో రిజిస్టర్ అయిన ఈ కేసులో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పి.రాధాకిషన్‌రావు, ఇన్స్పెక్టర్లు బి.గట్టుమల్లు, ఎస్.మల్లికార్జున్ తదితరులు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కిడ్నాప్ కేసులో ఐదో నిందితుడిగా ఉన్న కృష్ణారావు అలియాస్ కృష్ణ పాత్ర కీలకమని తెలుస్తోంది. ఈయన గతంలో ఓ మీడియా చానల్లో కీలక స్థానంలో పని చేశారు. అప్పట్లోనే పలువురు పోలీసు ఉన్నతాధికారులతో పరిచయాలు ఏర్పడ్డాయి. అలాంటి వారిలో ఈ ‘హయ్యర్ అప్’కూడా ఒకరని సమాచారం. వేణు మాధవ్‌ను కిడ్నాప్ చేసి, తీవ్ర స్థాయిలో బెదిరించి, పత్రాలపై సంతకాలు చేయించుకుని క్రియా హెల్త్ కేర్ సంస్థను చేజిక్కించుకోవాలని దాని పార్ట్‌టైమ్ డైరెక్టర్లు గోపాల్, రాజ్ తలసిల, నవీన్, రవి... గోల్డ్ ఫిష్ అబోడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ వేగేతో కలిసి కుట్ర పన్నారు. కృష్ణారావు అనేక మంది పోలీసు ఉన్నతాధికారులకు సన్నిహితుడని తెలిసిన చంద్రశేఖర్ ఆయన్ను సంప్రదించాడని, కృష్ణారావు ద్వారానే హయ్యర్ అప్ వరకు ఈ వ్యవహారం వెళ్లిందని సమాచారం. కాగా విషయం సెటిల్ చేయడానికి రూ.10 కోట్లకు డీల్ మాట్లాడుకున్న ఆ పెద్ద సారు.. పని పూర్తి చేసే బాధ్యతల్ని రాధాకిషన్‌రావు, గట్టు మల్లులకు అప్పగించినట్లు, దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. డీజీపీ కార్యాలయం గట్టు మల్లుకు ఫోన్ సిట్ సమాచారం మేరకు.. 2018 నవంబర్ 22న ఉదయం 5.30 గంటలకు అప్పట్లో టాస్క్‌ఫోర్స్ ఎస్సైగా పని చేస్తున్న మల్లికార్జున్.. వేణుమాధవ్‌ను తన బృందంతో కిడ్నాప్ చేసి సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించాడు. అక్కడ రాధాకిషన్‌రావు ప్రోద్భలంతో అప్పటి వెస్ట్‌జోన్ టాస్‌్కఫోర్స్ ఇన్స్పెక్టర్ గట్టు మల్లు తీవ్రస్థాయిలో వేణును బెదిరించాడు. అతి కష్టంమ్మీద తన ఫోన్ దక్కించుకున్న వేణుమాధవ్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయం నుంచే తొలుత తన న్యాయవాది శ్రీనివాస్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆయన కోర్టులో తేల్చుకుందాం అన్నారు. తర్వాత తన స్నేహితుడైన లహరి రిసార్ట్స్ యజమాని సంజయ్‌ను వేణు సంప్రదించారు. దీంతో డీజీపీ కార్యాలయానికి వెళ్లిన సంజయ్ అక్కడ నుంచి గట్టు మల్లుకు ఫోన్ చేయించారు. ఆ కాల్ అందుకున్న రాధాకిషన్ రావు మాటాడుతూ.. ఇది ఉన్నతాధికారే అప్పగించిన విషయని చెప్పడంతో డీజీపీ కార్యాలయం చేతులెత్తేసింది. దీంతో రాధాకిషన్‌రావు, గట్టు మల్లు, మల్లికార్జున్ తదితరులు వేణుమాధవ్‌తో పత్రాలపై సంతకాలు చేయించి క్రియా హెల్త్‌కేర్‌లో షేర్లు, ఆయన యాజమాన్యం మార్పు చేశారు. ఆ నలుగురి వాంగ్మూలాలు కీలకమే.. వేణును తీవ్రస్థాయిలో భయపెట్టడానికి ఉగ్రవాదం, మనీలాండరింగ్ కేసులు నమోదు చేస్తామంటూ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బెదిరించారు. ఇందుకు సంబంధించి రాధాకిషన్‌రావు సహా తొమ్మిది మందిపై కేసు నమోదైంది. వేణు మాధవ్ తన నలుగురు పార్ట్‌టైమ్ డైరెక్టర్ల వేధింపులపై 2018 అక్టోబర్ 3న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అదే నెల 12 నుంచి నలుగురి నుంచి వేణుకు వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఈ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో అప్పటి బంజారాహిల్స్ ఏసీపీని కలిసి న్యాయం చేయమని కోరినా ఫలితం దక్కలేదు. ఈ ఫిర్యాదు విషయంలో పోలీసుల ఉదాశీన వైఖరికి కారణం తెలియాలంటే నాటి బంజారాహిల్స్ ఏసీపీని పిలిచి విచారించాల్సి ఉంది. ముఖ్యంగా డీజీపీ కార్యాలయం, హయ్యర్ అప్‌తో పాటు న్యాయవాది శ్రీనివాస్, లహరి రిసార్ట్స్ యజమాని సంజయ్‌ల నుంచీ వాంగ్మూలాలు సేకరించాలి. అయితే డీజీపీ కార్యాలయం, ‘హయ్యర్ అప్ విషయంలో సిట్ అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారన్నది వేచి చూడాల్సి ఉంది. సిట్ అదుపులో ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ రాధాకిషన్‌రావు ఇప్పటికే అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టై, జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. దీంతో ఆయన్ను కిడ్నాప్ కేసులో పీటీ వారెంట్‌పై అరెస్టు చేసి, కోర్టు అనుమతితో పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని జూబ్లీహిల్స్ పోలీసులు, సిట్ అధికారులు నిర్ణయించారు. మరోపక్క ఇదే కేసులో నిందితుడిగా ఉన్న నాటి టాస్క్‌ఫోర్స్ ఎస్సై, ప్రస్తుతం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో (ఎస్ఐబీ) ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న మల్లికార్జున్‌ను సిట్ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
ప్రభుత్వం ప్రవేశపెట్టింది శ్వేతపత్రం కాదు ఫాల్స్ పేపర్: హరీష్
-
రేవంత్ అబద్దాలు కూకట్ పల్లి ప్రజలు ఊరుకోరు
-
సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావు కన్నుమూత
హఫీజ్‌పేట్/సాక్షి, హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సీహెచ్‌వీఎం కృష్ణారావు (64) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పత్రికా రంగంలో కొనసాగిన ఆయన వివిధ మీడియా సంస్థల్లో పనిచేశారు. రాజకీయ వర్గాల్లో ‘బాబాయ్’గా పేరుపొందిన ఆయన పూర్తిపేరు చిర్రావురి వెంకట మాణిక్య కృష్ణారావు. 1959 ఆగస్టు 9న ఆయన జన్మించారు. పాత్రికేయ రంగంలో కృష్ణారావు ప్రయాణం 1975లో ఒక రిపోర్టర్‌గా ప్రారంభమైంది. ఆతర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వచ్చారు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్, ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికల్లో పనిచేశారు. డెక్కన్ క్రానికల్ పత్రికలో న్యూస్ బ్యూరో చీఫ్‌గా సుదీర్ఘకాలం పనిచేశారు. గత ఏడాది ఆయన కేన్సర్ బారిన పడ్డారు, కృష్ణారావుకు భార్య లక్ష్మి, కుమారుడు కిరీటి, కూతురు కిన్నెర ఉన్నారు. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. కుమారుడు హైదరాబాద్‌లోనే పనిచేస్తుండగా కుమార్తె అమెరికాలో ఉన్నారు. కాగా, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కృష్ణారావు మృతి పట్ల సంతాపం ప్రకటించారు. గవర్నర్, ముఖ్యమంత్రి సంతాపం కృష్ణారావు మరణం పట్ల రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు , ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. కృష్ణారావు మరణం తెలుగు రాష్ట్రాల్లో పత్రికా రంగానికి తీరనిలోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రముఖుల నివాళి కృష్ణారావు మరణ వార్త తెలుసుకున్న పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టు ముఖ్యలు గోపన్‌పల్లిలోని జర్నలిస్ట్‌కాలనీలో ఆయన నివాసానికి చేరుకొని నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి హరీశ్‌రావు, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఇతర బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కేవీపీ రాంచందర్‌రావు, జూలూరి గౌరిశంకర్, కొమ్మినేని శ్రీనివాసరావు, దేవులపల్లి అమర్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు కృష్ణారావుకు నివాళులు అర్పించినవారిలో ఉన్నారు. కాగా, శుక్రవారం రాయదుర్గంలోని వైకుంఠ మహాప్రస్థానంలో కృష్ణారావు అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు తెలిసింది. -
సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్ వీఎం కృష్ణా రావు కన్నుమూత
-
సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావు కన్నుమూత
సాక్షి, అమరావతి: సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్‌వీఎం కృష్ణారావు(64) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణారావు గురువారం కన్నుమూశారు. కాగా, అనలిస్ట్‌గా నిక్కచ్చిగా వ్యవహరించారు కృష్ణారావు. ఆయన రాజకీయ వర్గాల్లో ‘బాబాయ్’గా సుపరిచితులు. చిర్రావురి వెంకట మాణిక్య కృష్ణారావు 1959లో ఏలూరు జన్మించారు. 1975లో ఒక స్ట్రింగర్‌గా నిరాడంబరమైన తన జర్నలిజం ప్రస్థానాన్ని ప్రారంభించి.. తన ప్రతిభతో అతి తక్కువ కాలంలో ఉన్నతస్థాయికి ఎదిగారు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్, ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సహా ఆయన పలు తెలుగు, తెలుగు దినపత్రికల్లో పనిచేసి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. డెక్కన్ క్రానికల్‌లో న్యూస్ బ్యూరో చీఫ్‌గా సుదీర్ఘకాలం ప్రయాణం సాగించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సీఎం జగన్ సంతాపం సీహెచ్‌వీఎం కృష్ణారావు మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ‘ తెలుగు, ఇంగ్లీషు జర్నలిజంలో కృష్ణారావు మంచి ప్రావీణ్యం పొందారు. కిందిస్థాయి నుండి మంచి జర్నలిస్టుగా ఉన్నతస్థాయికి ఎదిగిన వ్యక్తి కృష్ణారావు. కృష్ణారావు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని సీఎం జగన్ సంతాపం తెలిపారు. ఏపీ మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్.. కృష్ణారావు మృతికి సంతాపం తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సిహెచ్ ఎం వీ కృష్ణారావు మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. పలు రంగాల్లో లోతైన అవగాహనతో ప్రజా ప్రయోజనాల కోణంలో వారు చేసిన రచనలు, విశ్లేషణలు, కొనసాగించిన టీవీ చర్చలు ఆలోచన రేకెత్తించేవిగా ఉండేవని సీఎం తెలిపారు. నాలుగు దశాబ్దాలకు పైబడి జర్నలిజం రంగానికి నిజాయితీగా సేవలందించిన సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటని సీఎం అన్నారు. ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. ► సన్నిహితులు ప్రేమగా ‘బాబాయ్’ అని పిలుచుకునే ప్రముఖ జర్నలిస్ట్, సీనియర్ సంపాదకులు కృష్ణారావుమృతి బాధాకరం. కృష్ణారావు 47 ఏళ్లుగా పత్రిక రంగంలో వివిధ హోదాల్లో పనిచేసి, జర్నలిజంలో తనదైన ముద్ర వేశారు. ఆయన మరణం మీడియా రంగానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. - తెలంగాణ ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు. ► ఏపీ మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రగాఢ సానుభూతి ప్రముఖ జర్నలిస్ట్, సీనియర్ సంపాదకులు సిహెచ్ విఎం కృష్ణారావు గారి మృతి పట్ల ఏపీ బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ‘ దాదాపు 5 దశాబ్దాలుగా పత్రిక రంగంలో, రాజకీయ విశ్లేషణలో తనదైన ముద్ర వేసిన కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరని లోటు. 18 ఏళ్ల పాటు డెక్కన్ క్రానికల్ దిన పత్రికలో బ్యూరో చీఫ్ గా ఆయన సేవలు ఎనలేనివి.. ఆయన ప్రతిభ అసామాన్యమైనది’ అని తన సానుభూతి తెలిపారు. ప్రత్యేకంగా టీవీ డిబేట్లలో నిర్మాణాత్మక రాజకీయ విశ్లేషణలు చేయడంలో ఆయనకు ఆయనే సాటని, ఎందరో యువ జర్నలిస్టులకు కృష్ణారావు జీవితం ఆదర్శణీయమన్నారు. ► కృష్ణారావు మరణం అత్యంత బాధాకరం. తెలుగు రాష్ట్రాలలో కృష్ణారావు గారు సీనియర్ జర్నలిస్టుగా వారికున్న అవగాహన , పలు అంశాల్లో వారు చర్చలలో పాల్గోన్న తీరు, పలు అంశాల్లో విశ్లేషణలు, టీవీ చర్చలు వారి అభిప్రాయాలు అద్భుతం . నాలుగు దశాబ్దాలకు పైబడి జర్నలిజం రంగానికి నిజాయితీగా సేవలందించిన సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా :::ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్దన్‌రెడ్డి ► ఢిల్లీ: సీనియర్ పాత్రికేయులు గా కృష్ణారావు సేవలు చిరస్మరణీయం. రాజకీయ, సామాజిక అంశాలపై ఎంతో అవగాహనతో ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కృష్ణారావు చేసిన విశ్లేషణలు, టీవీ మాద్యమాల్లో జరిపిన చర్చలు ఎంతో ప్రేరణ కలిగించాయి. నిరాడంబరంగా, నిజాయితీగా సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు సాగించిన పాత్రికేయ జీవితం ఎంతో ఆదర్శప్రాయం. నాకు ఎంతో కాలంగా అత్యంత సన్నిహితుడైన జర్నలిస్ట్ సోదరుడు కృష్ణారావు మరణం నన్ను కలిచివేసింది. ఆయన మరణం పత్రికా రంగానికి తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నాను. :::మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సంతాపం ► పాత్రికేయ రంగంలో నేల కొరిగిన ధృవతార. సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సిహెచ్ ఎం వీ కృష్ణారావు ఇక లేరన్న విషయం అత్యంత బాధాకరం .సిహెచ్ ఎం వి కృష్ణారావు గారు సీనియర్ జర్నలిస్టుగా పలు అంశాల్లో విశ్లేషణలు, టీవీ చర్చల్లో నిష్పక్షపాతంగా ఆయన వెలుబుచ్చిన అభిప్రాయాలు అద్భుతం . పాత్రికేయు రంగం లో నిజాయితీగా సేవలందించిన సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను . ::: శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఇది కూడా చదవండి: చంద్రబాబు కొత్త డ్రామా.. సానుభూతి కోసం ఇంతకు దిగజారాలా? -
కుటుంబ కలహాలతో రాజకీయం దారుణం
మందస: కుటుంబ కలహాలను టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేశ్రాజ కీయ లబ్ధికి వాడుకుంటున్నారని శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో జరిగిన ఘటనకు సంబంధించి కొట్ర రామారావు సోదరుడు కృష్ణారావు ధ్వజమెత్తారు. బుధవారం ఆయన విలేకరుల తో మాట్లాడుతూ.. తమ కుటుంబ సమస్యగా ఉన్న భూ తగాదాపై అత్యుత్సాహంతో వారు ట్వీట్లు పెట్టాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు. తమ స్థల వివాదం కోర్టులో ఉందని, రాజకీయం చేయవద్దని ఆయన కోరారు. తమ కుటుంబంలో ఆస్తి తగాదాలకు తెలుగుదేశం పార్టీయే మూల కారణమని కృష్ణారావు ఆరోపించారు. తాను గౌరి అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకుంటానని చెప్పగా, తన తండ్రి దామోదరరావు వ్యతిరేకించి ఇంటి నుంచి వెళ్లగొట్టాడన్నారు. తండ్రి మరణానంతరం ఆస్తిలో వాటా కావాలని అడిగితే 2016–2018 మధ్య తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా రికార్డులను మార్చేశారన్నారు. పెద్దల రాజీ కూడా ఫలించలేదని చెప్పారు. ఈ వివాదం ముదిరి పిన తల్లి కొట్ర దాలమ్మ, చెల్లెలు మజ్జి సావిత్రిపై ఘటనా స్థలంలోనే కంకర మట్టి వేశారన్నారు. దీంతో మందస పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. -
సమగ్ర సమదర్శి... గాంధీజీ!
పుణ్యదంపతులు పుత్లీ బాయి, కరంచంద్ గాంధీలకు 1869 అక్టోబర్ 2న జన్మించిన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ మహాత్ముడై మన దేశానికి ఖ్యాతి తెచ్చిన వారిలో అగ్రగణ్యుడుగా నిలి చాడు. మానవాళికి ఎన్నో కొత్త మార్గాలతో తనదైన సరళిలో వెలుగు చూపిన పుణ్యపురుషుని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ మహాత్ముని జీవితం నుంచి మనం నేర్చుకోదగినవి ఎన్నో. జాతిని ఏకతాటిపై నడిపించే నాయకులకు ఆర్థిక, సామాజిక, నైతిక విధా నాలపై ఎంతటి అవగాహన ఉండాలో గమనిద్దాం. మహాత్మా గాంధీ అనగానే మనకి స్వతంత్ర సమరం గుర్తుకొస్తుంది. స్వాతంత్య్రమనగానే గాంధీజీ గుర్తుకొస్తారు. అన్ని మత ధర్మాలను చదివి, మంచి విషయాలను ఏరుకొని తనదైన సరళిలో కొత్త కొత్త మార్గాలను సృష్టించారు. వారి విధానాలకు ఎంతో ప్రభావితులమైన మనకు ‘ఒక చెంప కొడితే మరో చెంప చూపడమ’నేది సనాతన ధర్మంలో లేని విషయం అంటే ఆశ్చర్యమేస్తుంది. మన ఆలోచనా విధానాలను ఆయన అంతగా ప్రభావితం చేశారు. ఒక్క మనల్నే మిటి సమస్త ప్రపంచాన్నీ ఎంతో ప్రభావితం చేశారు. అందుకే ప్రముఖ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ ‘గాంధీజీ లాంటి వ్యక్తి రక్తమాంసాలతో ఈ నేలపై నడయాడారంటే ముందు తరాలవారు నమ్మలేకపోతారు’ అన్నారు. విదేశీ విశ్వవిద్యాలయా లలో గాంధీజీపై ఏకంగా కోర్సులే నిర్వహిస్తున్నారు (ఉదాహరణకు వర్జీనియా, కొలంబో, ఎడింబరో విశ్వవిద్యాలయాలు). ‘సత్యమేవ జయతే’ అన్నది ఎన్నోతరాలుగా తెలి సిన సత్యం. కానీ ఆచరణలో చూపి అది అందరికీ సాధ్యమని, సత్యాగ్రహం ఒక గొప్ప ఆయుధం అని నిరూపించారు గాంధీజీ. జీవన మార్గాలపై ఎన్నో ప్రయోగాలు చేసిన గాంధీజీ తన ఆత్మకథకు ‘మై ఎక్స్పరిమెంట్స్ విత్ ట్రూత్’ అని పేరుపెట్టారు. దానికి అదే సరైన పేరు. అప్పటికే మహాత్ముడిగా పేరొందిన గాంధీజీ (ఆ బిరుదును రవీంద్రనాథ్ టాగోర్ ఇచ్చారు), తన ఆత్మకథలో తన తప్పిదాలను ఎన్నో ప్రస్తావించారు. చిన్నప్పుడు పొగతాగుతూ పట్టుబడి తండ్రి చేతిలో దెబ్బలుతిన్న విషయం ప్రస్తావించారు. పెళ్ళైన తరువాత విదేశాలకు వెళ్తు న్నప్పుడు తల్లితో మద్యం, మాంసం, మగువలను ముట్టనని ఒట్టువేసి వెళ్ళారు. మద్యం ఒకసారీ, మాంసం ఒకసారీ రుచి చూడడం చేశానని రాసు కొన్నారు. మగువ విషయంలోనూ ఒకానొకప్పుడు ఎంతో ఉద్వేగానికి గురై త్రుటిలో తప్పించుకొన్నాననీ రాసుకొన్నారు. మామూలు మనుషులైతే తప్పి పోయిన ఒట్టు గురించి ప్రస్తావనే చేసేవారు కాదేమో. అంతటి సత్యవాది కనుకనే ఆయన మహాత్ము డైనాడు. అహింస గురించి బుద్ధుడు, అశోకుడు ఎంతో ప్రచారం చేశారు. కానీ అహంస ఒక తిరుగులేని గొప్ప ఆయుధం అని నిరూపించడం గాంధీకే సాధ్యమైంది. ఆయన చూపిన అహింస సత్యాగ్రహాలను వాడి మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా మహోన్నత చరితులుగా నిలిచారు. కొద్ది సంవత్సరాల క్రితం మండేలా కనుమూసినప్పుడు ఆయనను, ఆయన అనుసరించిన అహింసామార్గాన్ని శ్లాఘించని ప్రపంచ పత్రిక లేదు. అసంఖ్యాకులు పాల్గొనే ఉద్యమంలో అహింసా మార్గాన్ని మొదటిసారిగా ప్రయోగించి దానికి వెలుగు తెచ్చిన మహాత్ముడు మన గాంధీజీ. రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశ లింగం వంటి సంఘసంస్కర్తలు అంటరాని తనాన్ని ఖండించారు. ఐతే వారి ప్రభావం కేవలం విద్యా వంతుల మీద మాత్రమే వున్నది. కానీ గాంధీజీ అస్పృశ్యతా నివారణ చేపట్టిన తరువాత అంటరాని తనం అమానుషమని చాలామంది గమనించారు. బాల్యవివాహాలను ఖండించారు. బాలవితంతువుల పునర్వివాహాలను ప్రోత్సహించారు. బోధించిన ప్రతి విషయాన్ని ఆచరణలో చూపే గాంధీజీ తత్వం, ఆయన ఏ ఉద్యమం చేపట్టినా విజయవంతం చేసేది. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలని నినదించి పల్లెసీమల బడుగు వర్గాల అభివృద్ధికి పాటుబడ్డారు. పదిమందికీ మేలుజరగని దేశాభివృద్ధి అర్థరహితమైన అభివృద్ధని కుటీర పరిశ్రమలను ప్రోత్సహించారు. విదేశీ వస్తువులను బహిష్కరించి తన స్వహస్తాలతో రాట్నం తిప్పి నూలు వడికి ఖద్దరు ధరించి స్వాతంత్య్ర సమరానికి రాట్నాన్ని చిహ్నం చేశారు. దేశ ఆర్థిక, సామాజిక, నైతిక పరిస్థితుల గురించి ఆలోచించే సమగ్ర సమదర్శకులు ఆయన. అన్ని విషయాలనూ క్షుణ్ణంగా పరిశీలించే సంపూర్ణ మేధావిగా గాంధీజీ నిలిచారు. అనుక్షణం దైవస్మరణలో జీవితం గడిపే గాంధీజీకి తెలుగువారిలో ప్రముఖ నాస్తికవాదులుగా పేరొందిన గోరాకి సత్సంబంధాలుండేవి. మార్గాలు వేరైనా మానవతావాదులుగా ఒకటైన వారి స్నేహం ఎలాగుండేదంటే గోరా గారి పుత్రుడైన లవణంకు ప్రముఖ తెలుగుకవి గుర్రం జాషువా పుత్రిక హేమ లతతో వివాహం గాంధీ ఆశ్రమంలో వారి అభినం దనలతో జరిగింది. బాపూజీతో ఎన్నో అభిప్రాయ భేదాలున్న నేతాజీ గాంధీజీని అందరికన్నా ముందుగా జాతిపితగా అభివర్ణించారు. వ్యాసకర్త: ప్రొఫెసర్ ఎమ్ఆర్కే కృష్ణారావు, గాయత్రీ విద్యాపరిషత్, వైజాగ్, మొబైల్: 93924 81282 -
మహోజ్వల భారతి: కృష్ణారావు.. కృష్ణాపత్రిక.. కృష్ణాజిల్లా
కృష్ణారావు గారు రాతలో విశ్వరూపం చూపేవారు. మాటలో మాత్రం విదూషకుడి విన్యాసాలు చూపేవారు. కానీ ఆ హాస్యం వెనుక చెప్పలేనంత విషాదం ఉంది. కృష్ణారావుగారు పుట్టిన కొన్ని రోజులకే తల్లి చనిపోయారు. అందుకే అడపా దడపా తాను మాతృ హంతకుడినని అనుకుంటూ దీర్ఘ విచారంలో మునిగిపోయేవారు. ఆరో ఏట తండ్రి ఈ లోకాన్ని వీడారు. పినతండ్రి ఇంట పెరిగారాయన. పుట్టింది దివిసీమ ప్రాంతంలోని ముట్నూరు. కృష్ణారావు గారిపై బ్రహ్మసమాజం ప్రభావం ఉండేది. మచిలీపట్నంలో చదువుకునేటప్పుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు ఆయనకు గురువుగా ఉండేవారు. కృష్ణారావు గారికి ఇద్దరు కూతుళ్లు. ఒక కొడుకు. వారిలో ఒక కూతురు, ఒక్కగానొక్క కొడుకు, అల్లుడు కూడా ఆయన కళ్ల ముందే తనువు చాలించారు. చదవండి: స్వతంత్ర భారతి... భారత్–పాక్ యుద్ధం అయినా ఆయన స్వాతంత్యోద్య్రమానికి, పత్రికా రచనకు దూరం కాలేదు. చిత్రం, ఆ హాస్య ధోరణి కూడా తుదికంటా వెన్నంటే ఉంది. కృష్ణారావుగారి చివరి దశలో ఆస్పత్రిలో ఉన్నారు. ఆయన ఆస్పత్రిలో చేరిన వెంటనే భార్య వచ్చారు. అంత్యకాలాన్ని ఆయన ఎంతో మామూలు విషయంగా తీసుకున్నారు. పాపం, ఆ ఇల్లాలు దుఃఖం ఆపుకోలేక గొల్లుమన్నారు. కృష్ణాపత్రిక స్వాతంత్య్ర ఉద్యమకాలంలో, వలస పాలన తెచ్చిన చీకటియుగంలో ఒక కంచు కాగడా అయింది. కానీ చాలామంది భావిస్తున్నట్టు కృష్ణాపత్రిక కృష్ణారావు గారి పేరు మీద నెలకొల్పినది కాదు. అది ఆవిర్భవించే నాటికి కృష్ణారావు గారు ఆ పత్రికలో లేరు. ఇంకా చెప్పాలంటే కృష్ణానది పేరు మీద ఆ పత్రిక ఆవిర్భవించిందని చెప్పాలి. పత్రిక నెలకొల్పే సమయంలో ఉంటే తాను ‘కృష్ణవేణి’ అని నామకరణం చేయించి ఉండేవాడినని కృష్ణారావు అనేవారట. భారతదేశం పునరుజ్జీవనోద్యమం వైపు అడుగులు వేయడం నేరుస్తున్న సమయంలో, స్వాతంత్యోద్య్రమం రూపు కడుతున్న తరుణంలో 20వ శతాబ్దానికి కాస్త ముందు, అంటే 1892లో మచిలీపట్నంలో కృష్ణా జిల్లా సంఘం ఏర్పడింది. అయితే అది ఇప్పటి కృష్ణా జిల్లా కాదు. మొత్తం గుంటూరు ప్రాంతం కూడా కలసి ఉండేది. ఈ మొత్తం ప్రాంతం అభివృద్ధికీ, రాజకీయ చైతన్యానికీ పాటు పడడమే ఆ సంస్థ ఉద్దేశం. ఇందులో సభ్యులు కొండా వెంకటప్పయ్య తదితరులకు వచ్చిన ఆలోచనే కృష్ణాపత్రిక స్థాపన. వెంకటప్పయ్యగారు న్యాయవాది. మరొక న్యాయవాదీ, కవీ దాసు నారాయణరావుతో కలసి ఇలాంటి నిర్ణయానికి వచ్చారాయన. ఈ ప్రాంతంలో ఒక్క తెలుగు పత్రిక కూడా లేకపోవడం వారిని ఇలాంటి చరిత్రాత్మక నిర్ణయం తీసుకునేటట్టు చేసింది. పైగా రాజకీయ చైతన్యం రేకెత్తించే ధ్యేయంతో పత్రికలు ప్రారంభమవుతున్న కాలం కూడా అదే. వెంకటప్పయ్య, దాసు నారాయణరావు మొత్తానికి అనేక ఇక్కట్ల మధ్య కృష్ణాపత్రికను పక్షపత్రికగా ఫిబ్రవరి 1, 1902న ఆరంభించారు (తరువాత వారపత్రిక అయింది). అంతలోనే దాసు హఠాన్మరణం పాలయ్యారు. ఈ పత్రిక ఆనాడే తీవ్రవాద లక్షణాలు కలిగిన పత్రికగా ముద్ర పడిందని వెంకటప్పయ్య తన జీవిత చరిత్రలో రాసుకున్నారు. ఒక ఏడాది తరువాత కృష్ణారావు గారు సహాయ సంపాదకులుగా చేరారు. (ముట్నూరి కృష్ణారావునేడు వర్ధంతి) – డా. గోపరాజు -
పద్యశిఖరం ఒరిగిపోయింది!
పద్యం తెలుగువారి ఆస్తి. ఆ ఆస్తిని మరింత పెంచిన కొల్లా శ్రీకృష్ణారావు సోమవారం గుంటూరులోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 94 ఏళ్ల జీవితాన్ని సాహితీ సృజనలో గడిపిన కవితా తపస్వి మృతితో తెలుగు సాహిత్య లోకం... మరో పద్య కవితా శిఖరాన్ని కోల్పోయింది. గుంటూరు జిల్లా పెదకూరపాడులో మహాలక్ష్మి– సూరయ్య రైతు దంపతులకు జన్మించారు శ్రీకృష్ణారావు. బాల్యం నుండి కవిత్వం పట్ల మక్కువ ఉన్న కృష్ణారావు మహా కవులు గుర్రం జాషువా, ఏటుకూరి వెంకట నరసయ్యలను కవితా గురువులుగా ఎంచుకున్నారు. వారి నుంచి తెలుగు పద్యంలోని మెలకువలు గ్రహించారు. ‘విశ్వశాంతి’ కోసం పద్య ‘శంఖారావం’ పూరించారు. ‘రారాజు’ను తెలుగు పద్య సింహాసనంపై కూర్చో బెట్టి పద్యానికి పట్టాభిషేకం చేశారు. పద్యాల ‘పూదోట’లో విహరించారు. విలువైన పద్య కావ్యాలు రాసి పచ్చి పసుపులు పండించారు. ‘కవి బ్రహ్మ’ ఏటుకూరి వారి స్ఫూర్తితో పల్నాటి ‘పౌరుష జ్యోతి’ని వెలిగించారు. రైతు పక్షపాతిగా కర్షక సాహిత్యం వెలయించారు. జాషువాను గుండెలకు హత్తుకుని ‘మన కవి జాషువా’ పేరుతో విలువైన వ్యాస సంపుటిని రచించారు. ‘మఱుగు పడిన మహాకవి తురగా వెంకమరాజు’ అనే వీరి పరిశోధనాత్మక గ్రంథం తెలుగు సాహిత్య చరిత్రకు ఎంతో పనికొచ్చే పుస్తకం. (క్లిక్: నిష్కర్ష విమర్శకుడు!) ‘కవిబ్రహ్మ ఏటుకూరి’ పేరుతో గురువుకు అక్షర దక్షిణ సమ ర్పించారు. ‘నా సాహితీ యాత్ర’ పేరుతో స్వీయ చరిత్రను పాఠక లోకా నికి బహుకరించారు. ఛందో బద్ధ పద్యంలాగే నడకలోనూ, నడతలోనూ... వడీ, వంకా లేని నిరాడంబర జీవనం గడిపారు. ఆయన ఐదు దశాబ్దాలకు పైగా పత్రికా రంగంతో మమేకమయ్యారు. స్వీయ సంపాదకత్వంలో ‘స్వతంత్ర వాణి’, ‘భావ వీణ’ పత్రికలను నడిపారు. అవిశ్రాంత అక్షర తపస్వికి నిండు మనస్సుతో నివాళులు. – డాక్టర్ బీరం సుందరరావు, చీరాల -
పది పరీక్షలు ప్రారంభం.. వచ్చే నెలాఖరుకు ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి మొదలయ్యే పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమైంది. మొత్తం 2,861 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 5.08 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. క్షేత్ర స్థాయి ఏర్పాట్లపై పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఆదివారం వర్చువల్ పద్ధతిలో అధికారులతో సమీక్షించారు. విద్యార్థులకు సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు. మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని, అదనపు బల్లలు, ఇతర సౌకర్యాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని.. వాటికయ్యే ఖర్చు పరీక్షల విభాగం భరిస్తుందని తెలిపారు. తర్వాత ‘సాక్షి’ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. పరీక్షల ఫలితాలను ఎట్టి పరిస్థితుల్లో జూన్ నెలాఖరుకు వెల్లడించాలని నిర్ణయించామన్నారు. వీలైనంత త్వరగా మార్కుల మెమోలు కూడా అందే ఏర్పాటు చేస్తామన్నారు. జూన్ 2 నుంచి సమాధాన పత్రాల మూల్యాంకనం మొదలవుతుందని, పరీక్షలు జరుగుతుండగానే ఇందుకు కసరత్తు మొదలు పెట్టాలని భావిస్తున్నామని చెప్పారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా నిఘా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2,861 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేశారు. చీఫ్ సూపరింటెండెంట్ గదిలో సీసీ కెమెరాను ఏర్పాటు చేసి అక్కడ ప్రశ్నపత్రాల బండిల్‌ను ఓపెన్ చేస్తారు. సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక పోలీసుల పహారా ఉంటుంది. -
సరిహద్దు ప్రాంతాల్లో విస్తృతంగా కూంబింగ్
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర- ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. పెదబయలు అటవీ ప్రాంతంలో రెండు రోజుల క్రితం ఎన్కౌంటర్ జరిగిన పరిసరాల్లో రక్తపు మరకలు గుర్తించడంతో కూంబింగ్ ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కృష్ణారావు పేర్కొన్నారు. ఎన్కౌంటర్ జరిగిన పరిసర ప్రాంతాల్లో సీనియర్ మావోయిస్టు నేతల సమావేశం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పెదబయలు, రూడకోట, ముంచంగిపుట్లు పరిసర ప్రాంతాలను పోలీసుల బలగాలు జల్లెడ పడుతున్నాయి. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో తప్పించుకున్న వారిలో సీనియర్ మావోయిస్టు నాయకులున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు అదుపులో అమాయక గిరిజనులు ఉన్నారంటూ ఆంధ్రప్రదేశ్ హక్కుల సంఘం పత్రికా ప్రకటన ఇచ్చింది. అయితే మా అదుపులో అమాయకపు గిరిజనులు ఎవరూ లేరని జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు. (అడవిలో అలజడి) -
చెంచుల కోసం క్షీరసాగరం
‘నెల నెలా వెన్నెల’ పేరుతో ఔత్సాహిక కవుల వెన్ను తట్టి శెభాస్ అంటూ ప్రోత్సహించి ముందుకు నడిపించిన కవి.. గిరిజన బిడ్డల కడుపు నింపడమే ఉద్యోగధర్మంగా నిరంతరం వారి పూరిళ్లలో నివసిస్తూ గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్‌గా పదవీ విరమణ పొందిన ఉద్యోగి.. నేడు 94వ ఏట అడుగు పెడుతున్న నిబద్ధతా స్వరూపం.. శ్రీ సి.వి.కృష్ణారావు. గుంటూరు, బ్రాడీపేటలో సత్తెనపల్లి వెళ్లే రైలు పట్టాల పక్క ఖాళీ స్థలంలో నలుగురు చేరి కవిత్వాన్ని వినిపించడంతో ప్రారంభమైన కవితా గోష్ఠి కృష్ణారావు నేతృత్వంలో ‘నెల నెలా వెన్నెల’గా రూపుదిద్దుకొని ఇంచుమించు అరవై సంవత్సరాలు నిరంతరాయంగా కొనసాగింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఒక సంపన్న జమీందారీ కుటుంబంలో 1926 జూలై 3న జన్మించిన కృష్ణారావు మఖమల్ పరుపుల మీద పారాడే అదృష్టం వెనుక పుట్టినప్పుడే తల్లిని, తరువాత కొద్దికాలానికి మాతామహులను పోగొట్టుకోవడమనే దురదృష్టమూ వెన్నంటి ఉంది. గుంటూరులో కళాశాల విద్యనభ్యసించే కాలంలో నయాగరా కవుల (కుందుర్తి, ఏల్చూరి మొ) పరిచయం లభించింది. కవిత్వాన్ని ఆస్వాదించడం, విస్తృతంగా పుస్తక పఠనం, రచనలు చేయడం ప్రారంభమైంది. ‘వైతరణి’ మొదటి కవితా సంపుటి. ‘మాదీ మీ వూరే మహారాజ కుమారా’, ‘అవిశ్రాంతం’ మొదలైనవి ముద్రితాలు! లాతూరు భూకంపం సందర్భంగా కంపన కేంద్ర గ్రామమైన ‘కిల్లారి’లో స్వామీ రామానంద తీర్థ సంస్థ పనుపున సేవలు అందించిన సందర్భంగా ఆ బీభత్సానికి అచ్చుగుద్దిన ‘కిల్లారి’ అనే కావ్యం కృష్ణారావు కలం నుండి వెలువడి Fiery and Fierce పేరుతో తర్జుమా అయింది. రామారావు దానిని ఆంగ్లంలోనికి అనువదించారు. చిన్నతనంలో అలవడిన, నరనరాన జీర్ణించుకొన్న కమ్యూనిస్టు భావపరంపరను నిజ జీవితంలో అమలు పరిచే అదృష్టాన్ని ఆయన ఎంచుకున్న ఉద్యోగం అందించింది. గిరిజన ఆదివాసీ జనుల జీవనగతులను మార్చగలిగే అవకాశాన్నివ్వగల ఉద్యోగంలో కృష్ణారావు కుదురుకోవడం అంటే ఒక సిద్ధాంతాన్ని నిబద్ధతగా అమలు పరచే వ్యక్తిత్వం ఉండాలే గాని సిద్ధాంతం ఎప్పుడూ పేలవమైనదీ, నిరర్ధకమైనదీ కాదని నిరూపించడమే! వందలాది చెంచుల జీవన విధానాన్ని మెరుగు పరచిన ‘క్షీరసాగరం’ ప్రాజెక్టు సృష్టికర్త ఆయనే. అసిఫాబాద్ అడవులలో గాని, రంపచోడవరం మన్యంలో గాని తాను చూచిన సంఘటనలే ఆయన కవితా వస్తువులు! ప్రతి కవితలోను ఆ జీవుల రక్తాశువ్రులు దర్శనమిస్తాయి! – సి.బి.వి.ఆర్.కె.శర్మ -
కృష్ణారావును పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలు
-
స్వరాజ్య సమరం లోవెలుగు
‘భాష కేవలము మానవ కల్పితము కాదు. అచ్చటి వాయువుల సంచలనము, అచ్చటి కేదారముల రామణీయకము, అచ్చటి ఆకసము యొక్క దీప్తి, అచ్చటి శుక, సారికల ధ్వన్యనుకరణము, అచ్చటి భాషయందు ప్రతిబింబించి యుండును. అప్పుడే అది దేశభాష అగును... ఆ దేశములోని జనులెట్లు ఆ దేశ గర్భము నుండి పుట్టి పెరిగెదరో అటులనే ఆ దేశభాష కూడా ఆ దేశ గర్భము నుంచి పుట్టి పెరుగు భాషౖయె ఉండును... ఆంధ్ర మండలమున పరబాస మాట్లాడుడు. అప్పుడీ ప్రకృతి యంతయు మూకీ భావము వహించి స్తంభించును...’ (దేశ భాషలు–మత భేదములు, 1920, లోవెలుగులు)‘లోవెలుగులు’ పేరుతో కృష్ణాపత్రికలో ఒక శీర్షిక వెలువడేది. అది సాక్షాత్తు ఆ పత్రిక సంపాదకుడు ముట్నూరి కృష్ణారావుగారే రాసేవారు. నిద్రాణమై ఉన్న జాతీయ భావనల మీదనే కాదు, వాటి పునాదుల మీద కూడా కృష్ణారావుగారి అక్షరాలు వెలుగులు ప్రసరించాయి. ఆ అక్షరాల వెనుక ఉన్న అంతరాత్మ ఒకతరం స్వాతంత్య్ర సమరయోధులకీ, కవులకీ, కళాకారులకీ, జాతీయవాదులకీ లోవెలుగై దీప్తించింది. ముందుకు నడిపించింది. ఆ భాషలో తీవ్రత, అదే సమయంలో కనిపించే హుందాతనం ఇప్పటి తరాన్ని కూడా మంత్రముగ్ధులను చేస్తాయి. ‘శక్త్యుపాసన’ అన్న రచన కోసం కృష్ణారావుగారి(1879–1945) అంతరాత్మ ఎంతగా దహించుకుపోయి ఉంటుందో, మేధస్సులో ఎంత మథనం సాగి ఉంటుందో ఈ కొన్ని వాక్యాలు చూస్తే తెలుస్తుంది. ‘నీలో సంఘటనా శక్తి ఎక్కడ? స్వతంత్ర సంఘటన చేయలేక పోయినా, ప్రతిఘటన అయినా చేయలేవే. రాతిని కొట్టి చూడు, దానిలో నుంచి అగ్నికణాలు బయలుదేరతాయి. మందుగుండుకు చిచ్చు పెట్టామనుకో– అది ఎట్లా ప్రేలి, నీ గృహాన్ని మంటల్లో పడవేస్తుంది? ఒక ఎలక్ట్రిక్ బొత్తామును ఒత్తావనుకో– చూడు ఎన్ని బల్బులొక్కమారు వెలుగులు గ్రక్కుతాయో! నిన్ను ఒత్తినా, తన్నినా, చంపినా, ఒక అగ్నికణం గాని, ఒక్క ప్రేలుడు గాని, ఒక్క జ్యోతి గాని ప్రకాశించదే! మనం చచ్చుదద్దమ్మలమన్నమాట. మనలో రాతికున్న భౌతికశక్తి లేదు, పశువులకున్న ప్రాణశక్తి లేదు, మానవునకుండదగిన త్యాగశక్తి లేదు. శక్తి యొక్క అభావం మనలో గూడుకట్టుకొన్నది సోదరా. యంత్రాలను కొలుస్తావు, వాని హార్స్పవర్ యింత అని. నీటిని కొలుస్తావు, దాని ‘‘హైడ్రాలిక్ పవర్’’ ఇంత అని. నీ ‘పవర్’ కొలవడానికి ఏమైనా సాధనం ఉంటే బాగుండును. ఇప్పుడు యుద్ధాలు చేస్తున్నవారిని అడిగితే ఏమి చెబుతారు? ఇంగ్లాండుకు ‘‘నావల్ పవర్’’ ఉన్నదంటారు. అమెరికాకు ‘‘ఇండస్ట్రియల్ పవర్’’ ఉన్నదంటారు. రష్యాకూ, చీనాకూ ‘‘మేన్ పవర్’’ ఉన్నదంటారు. అయితే నీకూ, నీ దేశానికీ ఉన్న పవరేమిటి? మృత్యువంటే భయపడే పవర్– స్వాతంత్య్రమంటే వెనుకపడే పవర్– ఐకమత్యమంటే కళ్లు మూసుకునే పవర్. ఇంతేనా?’ అందుకే కృష్ణాప్రతిక స్వాతంత్య్ర ఉద్యమకాలంలో, వలస పాలన తెచ్చిన చీకటియుగంలో ఒక కంచు కాగడా అయింది. కానీ చాలామంది భావిస్తున్నట్టు కృష్ణాపత్రిక కృష్ణారావుగారి పేరు మీద నెలకొల్పినది కాదు. అది ఆవిర్భవించే నాటికి కృష్ణారావుగారు ఆ పత్రికలో లేరు. ఇంకా చెప్పాలంటే కృష్ణానది పేరు మీద ఆ పత్రిక ఆవిర్భవించిందని చెప్పాలి. పత్రిక నెలకొల్పే సమయంలో ఉంటే తాను ‘కృష్ణవేణి’ అని నామకరణం చేయించి ఉండేవాడినని కృష్ణారావు అనేవారట. భారతదేశం పునరుజ్జీవనోద్యమం వైపు అడుగులు వేయడం నేరుస్తున్న సమయంలో, స్వాతంత్య్రోద్యమం రూపు కడుతున్న సమయంలో 20వ శతాబ్దానికి కాస్త ముందు, అంటే 1892లో మచిలీపట్నంలో కృష్ణా జిల్లా సంఘం ఏర్పడింది. అయితే అది ఇప్పటి కృష్ణాజిల్లా కాదు. మొత్తం గుంటూరు ప్రాంతం కూడా కలసి ఉండేది. ఈ మొత్తం ప్రాంతం అభివృద్ధికీ, రాజకీయ చైతన్యానికీ పాటు పడడమే ఆ సంస్థ ఉద్దేశం. ఇందులో సభ్యులు కొండా వెంకటప్పయ్య తదితరులకు వచ్చిన ఆలోచనే కృష్ణాపత్రిక స్థాపన. వెంకటప్పయ్యగారు న్యాయవాది. మరొక న్యాయవాదీ, కవీ దాసు నారాయణరావుతో కలసి ఇలాంటి నిర్ణయానికి వచ్చారాయన. ఈ ప్రాంతంలో ఒక్క తెలుగు పత్రిక కూడా లేకపోవడం వారిని ఇలాంటి చరిత్రాత్మక నిర్ణయం తీసుకునేటట్టు చేసింది. పైగా రాజకీయ చైతన్యం రేకెత్తించే ధ్యేయంతో పత్రికలు ప్రారంభమవుతున్న కాలం కూడా అదే. వెంకటప్పయ్య, దాసు నారాయణరావు మొత్తానికి అనేక ఇక్కట్ల మధ్య ఆ పక్షపత్రికను ఫిబ్రవరి 1, 1902న ఆరంభించారు (తరువాత వారపత్రిక అయింది). అంతలోనే దాసు హఠాన్మరణం పాలయ్యారు. ఈ పత్రిక ఆనాడే తీవ్రవాద లక్షణాలు కలిగిన పత్రికగా ముద్ర పడిందని వెంకటప్పయ్య తన జీవిత చరిత్రలో రాసుకున్నారు. ఒక ఏడాది తరువాత కృష్ణారావుగారు సహాయ సంపాదకులుగా చేరారు. 1905లో బెంగాల్‌ను విభజిస్తూ నాటి వైస్రాయ్ కర్జన్ నిర్ణయం తీసుకున్నాడు. దేశం భగ్గుమంది. తెలుగు ప్రాంతం కూడా ఆ నిరసనలో గళం కలిపింది. కృష్ణారావుగారు బెంగాల్ వెళ్లి విభజన వ్యతిరేకోద్యమ నేత బిపిన్‌చంద్రపాల్‌ను కలుసుకున్నారు. ఆయనతో కలసి బెంగాల్లో పర్యటించారు. పాల్, చిత్తరంజన్‌దాస్, సుబోధచంద్ర మల్లిక్‌లు ఆరంభించిన ‘బందేమాతరం’ పత్రిక పని తీరును పరిశీలించారు. దీనికి అరవింద్‌ఘోష్ సంపాదకుడు. ఘోష్ పేరుతో వెలువడుతున్న వ్యాసాలు నిజానికి కృష్ణారావుగారే రాస్తున్నారని చాలాకాలం ఎందరో విశ్వసించేవారని పొత్తూరి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. 1907లో బెంగాల్ ఉద్యమం నుంచి తిరిగి వచ్చిన తరువాత కృష్ణారావు పత్రిక సంపాదక బాధ్యతలను తీసుకున్నారు. బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం బిపిన్‌పాల్ వంటి వారి నాయకత్వంలో జరిగితే, విభజనకు వ్యతిరేకంగా పాల్గారు జరిపిన దక్షిణ భారత యాత్ర ముట్నూరి వారి నాయకత్వంలో జరిగింది. బిపిన్‌పాల్‌ను వెంట తీసుకుని విజయనగరం నుంచి రాజమండ్రి, కాకినాడల నుంచి మద్రాస్ దాకా చేయించిన యాత్ర చరిత్రాత్మకమైనది. తరువాత కూడా కృష్ణాపత్రిక ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించేది. 1908లో కృష్ణాపత్రిక సంపాదకునిగా ముట్నూరి స్థిరపడుతున్నారు. అప్పుడే ‘తెల్లవారిని తుపాకులతో కాల్చుట’ శీర్షికతో ఒక వ్యాసం అచ్చయింది. కానీ ఎవరి సలహాయో, ఈ సంచికను విడుదల చేయలేదు. మొత్తం ప్రతులన్నీ తగులబెట్టారు. అయినా ఎలాగో ప్రభుత్వానికి తెలిసిపోయింది. వీటి కారణంగానే కృష్ణాజిల్లా కలెక్టర్ నాలుగేళ్ల పాటు ముట్నూరివారిని సంపాదకునిగా అనుమతించలేదు. 1912లో మళ్లీ కృష్ణారావు సంపాదకుడైనారు. ముట్నూరి వారు దూరంగా ఉన్న కాలంలో అవటపల్లి నారాయణరావు, భోగరాజు పట్టాభిసీతారామయ్య పత్రిక వ్యవహారాలను చూశారు. 1912 నుంచి 1945లో తుది శ్వాస విడిచేవరకు కృష్ణారావుగారే సంపాదక బాధ్యతలను నిర్వర్తించారు. ఆయన కలానికి పది పాళీలని అంటూ ఉండేవారు. ఆయన ప్రతి అంశాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. రాజకీయం, ఉద్యమం, జాతీయ భావాలు, కళలు, శాస్త్ర విజ్ఞానం, తత్వం, మార్మిక రచన అన్నింటిలోను ఆయన కలం విజయ విహారం చేసింది. కృష్ణారావు గొప్ప కళాహృదయుడు. మచిలీపట్నంలోని కృష్ణాపత్రిక కార్యాలయాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దుకున్నారని తెలిసినవారు చెబుతారు. ఆ కార్యాలయానికి చిన్న ఆవరణ ఉండేదట. అందులోనే అనేక రకాల మొక్కలను నాటారు. తోట మధ్యలో చిన్న జలాశయం. అందులో కార్యాలయం పక్కనే ఉన్న అమ్మవారి ఆలయం నీడ పడేదట. అలాగే ప్రతి మొక్క, లతలకు కుదుళ్ల దగ్గర గుండ్రంగా మట్టి అరుగులు కట్టించి, వాటికి రంగులు వేయించేవారట. కృష్ణారావుగారు అందరికంటే ముందు కార్యాలయానికి వచ్చి మొక్కల మధ్య విహరిస్తూ ఆనందించేవారట. అందుకే ‘తోటానందులు’ అన్న బిరుదు సన్నిహితుల నుంచి అందుకోవలసి వచ్చింది. కృష్ణారావుగారు రాతలో ఎంతో తీవ్రంగా, లోతుగా తన భావాలను వ్యక్తం చేయడం కనిపిస్తుంది. తెల్లని తలపాగాలో గంభీరంగా ఉండేవారాయన. పొడవైన అంగీ, పంచె, తెల్లని దేహచ్ఛాయతో ఉండే కృష్ణారావుగారి ఆకృతిని అడవి బాపిరాజు వంటి కళా మర్మజ్ఞుడు ఎంతో తన్మయంగా వర్ణించారు. కానీ ఆ మౌనం వెనుక సాగర ఘోష ఉండేదని తరువాత తెలిసింది. ఆయనను మౌనముద్రాలంకారుడు అనేవారు. కానీ నోరు విప్పితే, ఆయనలోని గొప్ప హాస్యప్రియుడే దర్శనమిచ్చేవాడు. అందుకు నిదర్శనం– కృష్ణాపత్రిక కార్యాలయంలో అసంఖ్యాకంగా జరిగిన ‘దర్బార్లు’. దీనికి అసంఖ్యాకంగా మహనీయులు హాజరయ్యేవారు. నిజానికి అదొక చిన్న పర్ణశాల. దానికి జమ్ము గడ్డితో కప్పు ఉండేదట. అందుకే దానిని జమ్మా మసీదు అని ముద్దుగా పిలుచుకుంటూ ఉండేవారట. దర్బారుకు అధ్యక్షులు కృష్ణారావుగారే. ఆయన్ని ‘గురు గ్రంథసాహెబ్’ అని గౌరవించుకుంటూ ఉండేవారు. దర్బారు శాయరు పింగళి కాటూరి కవిద్వయంలోని కాటూరి వెంకటేశ్వరరావు. భోగరాజు పట్టాభి వక్తగా తన పాత్రను నిర్వహిస్తూ ఉండేవారు. అడవి బాపిరాజు, కోలవెన్ను రామకోటేశ్వరరావు, దామరాజు పుండరీకాక్షుడు, భావరాజు నరసింహారావు, బెజవాడ గోపాలరెడ్డి, గొట్టిపాటి బ్రహ్మయ్య వంటివారంతా వచ్చేవారు. విశ్వకవి టాగోర్ రచన చిత్రాంగదకు గోపాలరెడ్డి చేసిన అనువాదాన్ని మొదట ఈ దర్బారులోనే చదివి వినిపించారు. పింగళి లక్ష్మీకాంతం, మునిమాణిక్యం నరసింహారావు, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి, దేవులపల్లి, విశ్వనాథ వంటి వారంతా కూడా దర్బారీయులే. రావూరి వెంకటసత్యనారాయణరావు (వంద చందమామలు సంకలనకర్త, పత్రికా రచయిత, కృష్ణాపత్రికలో వడగళ్లు పేరుతో శీర్షిక నిర్వహించారు), నార్ల వెంకటేశ్వరరావు హాజరయ్యేవారు. టంగుటూరి ప్రకాశం గారికి బిరుదు ఇచ్చిన దర్బారు ఇదే. చెరుకువాడ నరసింహంపంతులు ‘ఆంధ్ర సింహ’ అని బిరుదు ఇవ్వాలని మొదట సూచించారట. కానీ కృష్ణారావు సింహం కంటే కేసరి అనే మాటే అందంగా అమరుతుందనీ, ఆంధ్రకేసరి అంటేనే బాగుంటుందనీ సవరించారట. అభినవాంధ్ర వాగనుశాసన (గిడుగు రామమూర్తి), పరిహాస పారిజాత (భమిడిపాటి కామేశ్వరరావు), ప్రతివాద భయంకర (పట్టాభి), శోకరస గంగాధర (దేవులపల్లి) వంటి బిరుదులన్నీ అక్కడే పురుడు పోసుకుని, బాలసారె కూడా జరుపుకున్నాయి. కృష్ణారావు రసహృదయానికి ఎల్లలు లేవు. మృత్యువులో కూడా ఆయన సౌందర్యాన్ని చూశారు. అందుకే ఎవరైనా మరణిస్తే ఊరికే సందేశాలు ఇవ్వడం జరిగేది కాదు. ఒకసారి ఒక పెద్దాయన కన్నుమూశారు. ఆ రోజుల్లో పత్రికలో ఫొటో పడాలంటే ‘బ్లాకు’ పద్ధతి ఉండేది. ఒక్కొక్క ఫొటో ఒక్కొక్క బ్లాకు. తీరా కన్నుమూసిన పెద్దాయన బ్లాకు (అంటే ఫొటో అన్నమాట) కార్యాలయంలో లేదని తేలింది. ‘ఇంతమంది బ్లాకులు ఉన్నవాళ్లు ఉన్నారు కదా, వాళ్లలో ఎవరో మరణించకుండా, బ్లాకు లేని ఈయనే పోవాలా! బ్లాకు ఉన్నవాళ్లు పోతే మూడంగుళాల స్థలం కలిసొచ్చేది!’ అన్నారట కృష్ణారావు. మరొకసారి ఇంకొక పెద్దాయన తుదిశ్వాస విడిచారు. ‘మీరు విచారిస్తే చాలునా! లేకపోతే నేను కూడా విచారించాలా!’ అన్నారట, కృష్ణారావు. అంటే, వార్తతో సరిపెట్టవచ్చా? లేకపోతే సంపాదకీయం రాయాలా? అన్నదే ఆయన ఉద్దేశం. కృష్ణారావుగారి జ్ఞాన సంపద అమోఘం. గాంధీగారు ఒకసారి బందరు వచ్చినప్పుడు సభలో ప్రసంగిస్తున్నారు. ‘నూలు వడకడం ప్రతివ్యక్తికి ఒక మహా....’ అని మాట కోసం వెతుక్కుంటూ ఉంటే, అదే వేదిక మీద ఉన్న కృష్ణారావుగారు ట్చఛిట్చఝ్ఛn్ట (మతాదర్శం) అంటూ మాట అందించారు. గాంధీజీ ఆ పదాన్నే ప్రయోగించారు. కృష్ణారావుగారు రాతలో విశ్వరూపం చూపేవారు. మాటలో మాత్రం విదూషకుడి విన్యాసాలు చూపేవారు. కానీ ఆ హాస్యం వెనుక చెప్పలేనంత విషాదం ఉంది. కృష్ణారావుగారు పుట్టిన కొన్ని రోజులకే తల్లి చనిపోయారు. అందుకే అడపా దడపా తాను మాతృహంతకుడినని అనుకుంటూ దీర్ఘ విచారంలో మునిగిపోయేవారు. ఆరో ఏట తండ్రి ఈ లోకాన్ని వీడారు. పినతండ్రి ఇంట పెరిగారాయన. పుట్టింది దివిసీమ ప్రాంతంలోని ముట్నూరు. కృష్ణారావుగారిపై బ్రహ్మసమాజం ప్రభావం ఉండేది. మచిలీపట్నంలో చదువుకునేటప్పుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు ఆయనకు గురువుగా ఉండేవారు. కృష్ణారావుగారికి ఇద్దరు కూతుళ్లు. ఒక కొడుకు. వారిలో ఒక కూతురు, ఒక్కగానొక్క కొడుకు, అల్లుడు కూడా ఆయన కళ్ల ముందే తనువు చాలించారు. అయినా ఆయన స్వాతంత్య్రోద్యమానికి, పత్రికా రచనకు దూరం కాలేదు. చిత్రం, ఆ హాస్య ధోరణి కూడా తుదికంటా వెన్నంటే ఉంది. కృష్ణారావుగారి చివరి దశలో ఆస్పత్రిలో ఉన్నారు. ఆయన ఆస్పత్రిలో చేరిన వెంటనే భార్య వచ్చారు. అంత్యకాలాన్ని ‘మౌన ముద్రాలంకారుడు’ ఎంతో మామూలు విషయంగా తీసుకున్నారు. పాపం, ఆ ఇల్లాలు దుఃఖం ఆపుకోలేక గొల్లుమన్నారు. అందుకు కృష్ణారావుగారు అన్నమాట, ‘అప్పుడే రిహార్సల్స్ మొదలు పెట్టేశావా!’ - డా. గోపరాజు నారాయణరావు -
నా సంగతి తెలియదా.. జాగ్రత్తగా ఉండు
కాశీబుగ్గ : రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తెలుగుదేశం నాయకుడు, పలాస సామాజిక ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గాలి కృష్ణారావు అధికార జులుం ప్రదర్శించారు. ‘మేమంటే ఎవరనుకుంటున్నావు? మా సంగతి తెలియదా? నీ సంగతేంటో చూస్తాం. జాగ్రత్తగా ఉండు’ అంటూ వీరంగం సృష్టించారు. కాశీబుగ్గ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం జరిగిన సంఘన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారులు, రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బందిపై ఆయన విరుచుకుపడ్డ తీరు చూసి అంతా అవాక్కయ్యారు. ఎలా పనిచేస్తారో చూస్తా.. ట్రాన్స్ఫర్ చేయిస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని జిల్లా అధికారులకు ఇక్కడ తీరును వివరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పలాస నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో చోటా నాయకులు ఎమ్మెల్యే దన్ను చూసుకుని పేట్రేగిపొతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘ఆకాశం కోల్పోయిన పక్షి’
హైదరాబాద్: జర్నలిస్టు, కవి ఎ.కృష్ణారావు రచించిన ‘ఆకాశం కోల్పోయిన పక్షి’కవితా సంపుటి ఆవిష్కరణ సభ శనివారం హైదరాబాద్ నాంపల్లిలోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగింది. ఎమెస్కో విజయ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్యఅతిధిగా జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు చంద్రశేఖర కంబార హాజరై సంపుటిని ఆవిష్కరించి ప్రసంగించారు. రచయిత కృష్ణారావు గొప్ప కాల్పనిక కవి అన్నారు. జర్నలిస్టుగా ఉంటూ కవిత్వం రాసే కవులు చాలా అరుదుగా ఉంటారని అన్నారు. నగ్నముని మాట్లాడుతూ ఈ కవితా సంపుటికి తనకు ముందుమాట రాసే అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ, సాహిత్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కవులను ప్రోత్సహించడానికి ప్రైవేట్ పబ్లిషర్స్ ముందుకు రావాలని కోరారు. కవి, రచయిత దేవీప్రియ మాట్లాడుతూ సాహిత్య, సామాజిక విశ్లేషణలపైనే కాకుండా వర్తమాన చరిత్రపై చర్చ జరగాలని కోరారు. కవి కె.శివారెడ్డి మాట్లాడుతూ ఇండియాగేట్‌తో కవిత్వ సాగును ప్రారంభించిన కృష్ణారావు మరెన్నో సంపుటాలను తీసుకురావాలని కోరారు. -
'కమ్యూనిస్టు పార్టీ ఇకనైనా కళ్లు తెరవాలి'
సాక్షి, హైదరాబాద్: త్రిపురలో భాజపా విజయంపై తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణారావు సంతోషం వ్యక్తం చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వామపక్షానికి కంచుకోటగా ఉన్న త్రిపురలో బీజేపీకి చరిత్రాత్మక విజయమని ఆయన పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజల విజయంగా బీజేపీ భావిస్తోందని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీ ఇకనైనా కళ్లు తెరవాలని సూచించారు. దక్షిణాదిన బీజేపీకి స్థానం లేదనే ప్రాంతీయ పార్టీకు ఈ విజయం చెంపపెట్టు అని ఆయన వెల్లడించారు. -
సైన్స్ సిటీ సీఈవో కృష్ణారావుకు ఎల్లాప్రగడ అవార్డ్
నెల్లూరు: ప్రతిష్టాత్మకమైన డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు అవార్డుకు ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ సీఈవో, జీన్ ఎక్స్ప్రెషన్ సిస్టమ్స్‌కు చెందిన అమెరికన్ డాక్టర్ అప్పసాని కృష్ణారావు ఎంపికయ్యారు. ఈ మేరకు ఎల్లాప్రగడ సుబ్బారావు ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఎ.జగదీష్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బయాలజీ, కెమిస్ట్రీ, జెనటిక్స్, మెడికల్ సైన్స్‌లో విశేష కృషి చేసినందుకు గాను ఆయనకు ఈ అవార్డుని ఇవ్వనున్నట్లు జగదీష్ పేర్కొన్నారు. నోబెల్ అవార్డ్ గ్రహీత ప్రొఫెసర్ హర్ గోవింద్ ఖొరానా లేబొరేటరీలో సింతటిక్ రోడోస్పిన్ జీన్‌ను మెదటిసారిగా కృష్ణారావు కనుగొన్నారు. పలు వ్యాధులకు మందులను కనుగొన్న ఎల్లాప్రగడ సుబ్బారావు పేరిట ప్రతియేటా ఫౌండేషన్ అవార్డు అందజేస్తుంది.కాగా, ఈ అవార్డుని కృష్ణారావు మార్చి నెలాఖరులో నెల్లూరులో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అందుకోనున్నారు. -
ప్రభుత్వ పథకాలపై అవగాహన అవసరం
వయోజన విద్య ఉపసంచాలకులు జి.కృష్ణారావు శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ పథకాలపై షెడ్యూల్డు కులాల విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలని వయోజన విద్య ఉపసంచాలకులు జి.కృష్ణారావు పిలుపునిచ్చారు. స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో జిల్లా షెడ్యూల్డు కులాల సేవా సహకార సంస్థ ఎస్సీ వలంటీర్లతో శుక్రవారం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ శాఖలు, ఎస్సీ కార్పొరేషన్ అందించే పథకాలపై అవగాహన కల్పించారు. వయోజన విద్య కింద అందిస్తున్న పథకాలను వివరించారు. మత్స్యశాఖ ఉప సంచాలకులు వీవీ కృష్ణమూర్తి మాట్లాడుతూ జిల్లాలో షెడ్యూల్డు కులాల వారి కోసం ప్రభుత్వం అనేక రారుుతీలను ప్రకటించిందన్నారు. గతంలో మత్స్యశాఖ నుంచి తీసుకున్న సామగ్రిపై 50 శాతం రారుుతీ ఉండగా ప్రస్తుతం 90 శాతం రారుుతీ వర్తిస్తుందని చెప్పారు. రూ.10 లక్షల యూనిట్‌కు కేవలం లక్ష రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. ఎస్సీ మత్స్యకారులకు మూడు చక్రాల వాహనాలతో పాటు ద్విచక్ర వాహనాలను యూనిట్లుగా మంజూరుచేస్తామని వెల్లడించారు. ఐస్‌బాక్స్‌లు, సీడ్ ట్రాన్సపోర్టు వాహనాలు, సైకిల్ విత్ నెట్, టు వీలర్ విత్ ఐస్ బాక్స్, ఇన్సులేటెడ్ వెహికల్, మరబోట్లు వంటివి 90 శాతం రారుుతీపై మంజూరుచేస్తామని వివరించారు. ఎస్సీ మత్స్యకారులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా షెడ్యూల్డు కులాల సేవా సహకార సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు కేవీ ఆదిత్యలక్ష్మి మాట్లాడుతూ నిరుద్యోగ ఎస్సీ యువత కోసం ఆన్లైన్ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, దానిలో ప్రతి ఎస్సీ నిరుద్యోగి పేరు నమోదు చేసుకోవాలన్నారు. వీరికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్ ట్రైనింగ్, కోచింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, జనరల్ ఎంప్లాయ్ మెంట్ స్కిల్స్, జాబ్ ఓరియెంటెడ్ శిక్షణ, హోర్ సర్వీస్, బ్యూటీషియన్, ఫిట్నెస్, మాన్యుఫ్యాక్చరింగ్, కన్సల్టెన్సీ తదితర రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు. అనంతరం గృహనిర్మాణ, ఉద్యానవన శాఖల ప్రతినిధులు ఆయా శాఖలు అందిస్తున్న పథకాలను తెలియజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల ప్రతినిధులు, ఎస్సీ కార్పొరేషన్ సిబ్బంది, వలంటీర్లు, ఎస్సీ నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు. -
పాఠశాలను తనిఖీ చేసిన హైదరాబాద్ ఆర్జేడీ
అల్లాదుర్గం : అల్లాదుర్గం మండల పరిధిలోని చిల్వెర ప్రాథమిక పాఠశాలను బుధవారం హైదరాబాద్ ఆర్జేడీ కృష్ణారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రార్థన సమయానికి ఒక్క ఉపాధ్యాయుడు కూడా హాజరు కాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయుల్లో ఎవరూ ప్రార్థనకు హాజరు కాలేదని ఎంఈఓకు ఫోన్ చేసి మండిపడ్డారు. హెడ్మాస్టర్ గణపతి, ఉపాధ్యాయురాలు భానుకు సంబంధించి ఒక రోజు వేతనం కట్ చేయాలని ఆదేశించారు. ఇద్దరు ఉపాధ్యాయులకు నోటీసులు జారీ చేశారు. ఉపాధ్యాయులు సక్రమంగా విధులకు హాజరయ్యేలా పర్యవేక్షించి చర్యలు తీసుకోవాలని ఎంఈఓను ఆదేశించారు. -
కీలక శాఖలు సీఎం చేతికి..
కేసీఆర్‌కు అదనంగా ఆర్డబ్ల్యూఎస్, వాణిజ్య పన్నుల బాధ్యతలు మంత్రుల శాఖలు మార్చుతూ ఉత్తర్వులు జారీ కేటీఆర్‌కు మున్సిపల్, ఐటీలకుతోడు పరిశ్రమలు, గనులు, ఎన్నారై వ్యవహారాలు జూపల్లికి పంచాయతీరాజ్ శాఖతో సర్దుబాటు తలసానికి పశుసంవర్థకం, మత్స్య, డెయిరీ అభివృద్ధి శాఖలు పోచారం శ్రీనివాసరెడ్డికి సహకారం.. హరీశ్ శాఖల్లో కోత సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కీలకమైన శాఖల బాధ్యతలు నేరుగా సీఎం కేసీఆర్ పరిధిలోకి వెళ్లిపోయాయి. ఎంతో ప్రధానమైన ఆర్డబ్ల్యూఎస్, వాణిజ్య పన్నుల శాఖలను కేసీఆర్ తన పరిధిలోకి తీసుకున్నారు. దీంతోపాటు మంత్రులు కె.తారకరామారావు, హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీశ్‌రెడ్డిల శాఖల్లో మార్పులు చేశారు. ముఖ్యమంత్రి తుది ఆమోదం మేరకు సోమవారం అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ కేటాయింపులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ నోటిఫికేషన్ జారీ చేశారు. దీని ప్రకారం ముఖ్యమంత్రి తన దగ్గరున్న శాఖలకు అదనంగా గ్రామీణ నీటి సరఫరా, వాణిజ్య పన్నుల శాఖల బాధ్యతలు తీసుకున్నారు. తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కీలకమైన వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతల నుంచి తప్పించి.. పశు సంవర్థకం, మత్స్య, డెయిరీ అభివృద్ధి శాఖలను కేటాయించారు. ఇవన్నీ ప్రస్తుతం మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి దగ్గరున్నాయి. వీటిని తొలగించడంతోమిగిలిన వ్యవసాయ శాఖకు అదనంగా సహకార శాఖను పోచారానికి అప్పగించారు. మంత్రి కె.తారకరామారావుకు మరిన్ని కీలక బాధ్యతలు కట్టబెట్టారు. మున్సిపల్, ఐటీ శాఖలకు తోడుగా పరిశ్రమలు-వాణిజ్యం, ప్రభుత్వ రంగ సంస్థలు, గనులు-భూగర్భ వనరులు, ఎన్నారై వ్యవహారాల శాఖలను అప్పగించారు. పరిశ్రమలు-వాణిజ్య శాఖకు ఇప్పటివరకు జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఆయనకు కేటీఆర్ పరిధిలోని పంచాయతీరాజ్ శాఖను అప్పగించి సర్దుబాటు చేశారు. హరీశ్‌రావు విజ్ఞప్తి మేరకే.. మంత్రి హరీశ్‌రావుకు మొదట కేటాయించిన శాఖల్లో మరోసారి కోత పడింది. ఇప్పటికే జరిగిన స్వల్ప మార్పుల్లో ఆయన దగ్గరున్న సహకార శాఖను తొలగించగా... ఇప్పుడు గనులు, భూగర్భ వనరుల శాఖ బాధ్యతల నుంచి తప్పించారు. వాస్తవానికి సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మార్కెటింగ్, శాసనసభా వ్యవహారాల శాఖలతో తనపై పనిభారం పెరిగినందున... గనులు, భూగర్భ వనరుల శాఖను మరొకరికి అప్పగించాలని హరీశ్‌రావు స్వయంగా మూడు నెలల కింద సీఎంకు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. కొత్తగా గ్రామీణ నీటి సరఫరా శాఖ ప్రభుత్వం కొత్తగా గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) శాఖను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఈ విభాగం పంచాయతీరాజ్‌లో అంతర్భాగంగా ఉండేది. ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేసేందుకు చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని ఐదేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో... ముఖ్యమంత్రి ఈ శాఖను ప్రతిష్టాత్మకంగా స్వీకరించినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. దీంతోపాటు రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకుకీలకమైన వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతలు చేపట్టడం గమనార్హం. -
రోడ్డు ప్రమాదంలో నాట్కో అధికారి మృతి
శంషాబాద్ రూరల్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బూర్జుగడ్డ తండా సమీపంలోని పీ-వన్ రోడ్డుపై శుక్రవారం అర్థరాత్రి జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. నాట్కో కంపెనీలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్న పి.కృష్ణారావు(48) శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని కారులో వస్తుండగా రోడ్డుపైకి అడవి పందులు అడ్డుగా వచ్చాయి. వాటిని తప్పించబోయే క్రమంలో కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కృష్ణారావు అక్కడికక్కడే చనిపోయారు. శనివారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. -
11న ఏపీ, తెలంగాణ సీఎస్ల భేటీ
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు కృష్ణారావు, రాజీవ్ శర్మ త్వరలో సమావేశం కానున్నారు. ఈ నెల 11న వీరిద్దరూ భేటీకానున్నారు. శాఖల విభజన, కార్పొరేషన్ల విభజన, ఉమ్మడి సంస్థల విభజన తదితర అంశాలపై ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు చర్చిస్తారు. -
ప్రమాదానికి పాల్పడితే లైసెన్స్ రద్దు
సాక్షి, హైదరాబాద్: ఏపీలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఏడాదికి 8 వేల మందికిపైగా పౌరులు మృత్యువాత పడుతున్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రోడ్డు ప్రమాదాల కట్టడికి కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) కృష్ణారావు ఆధ్వర్యంలో శనివారం రహదారులు, రవాణా, హోం శాఖ ఉన్నతాధికారులతో హైదరాబాద్‌లో సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు లేదా మూడుసార్లు రోడ్డు ప్రమాదాలకు పాల్పడిన డ్రైవర్ల లెసైన్సులను రద్దు చేయాలని నిర్ణయించారు. -
చిరకాలపు కలకు.. గ్రీన్‌సిగ్నల్!
మెయిన్‌లైన్‌తో కాకినాడ అనుసంధానంపై చిరుకదలిక పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై భేటీలో ప్రస్తావన లాభదాయకతతో నిమిత్తం లేకుండాచేపట్టాలన్న సీఎస్ సానుకూలంగా స్పందించిన ఆ శాఖ ఉన్నతాధికారులు {పజాప్రతినిధుల కృషి తోడైతే కల సాకారమే.. కాకినాడ : కాకినాడను మెయిన్ రైల్వేలైన్‌తో అనుసంధానం చేయాలనేది జిల్లావాసుల చిరకాల స్వప్నం. ఈ కలను సాకారం చేస్తామంటూ నేతలు ప్రతి ఎన్నికల్లో ఊరించి, ఓట్లేయించుకోవడం, ఆనక ఆ ఊసే మరిచిపోవడం రివాజైంది. ఫలితంగా ఇంతకాలం మెయిన్‌లైన్‌లో విలీనం ఆచరణకు నోచని డిమాండ్‌గానే మిగిలిపోయింది. ఆ కల ఈసారైనా సాకారమవుతుందా అని ఎదురుచూస్తున్న జిల్లావాసులకు కొంత ఊరటనిచ్చే అంశం ఒకటి చోటుచేసుకుంది. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై రైల్వే ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు హైదరాబాద్‌లో గురువారం జరిపిన సమీక్షలో మెయిన్‌లైన్‌తో కాకినాడ అనుసంధానం డిమాండ్ కూడా చర్చకు వచ్చింది. సుమారు రూ.120 కోట్లు (గత అంచనాలు) ఖర్చుచేస్తే ఈ లైన్ ఆచరణ సాధ్యమయ్యేదే. కాకినాడ నుంచి పిఠాపురానికి కేవలం 21 కిలోమీటర్ల బ్రాడ్‌గేజ్ లైన్‌ను నాలుగు దశాబ్దాల క్రితమే ప్రతిపాదించారు. ఇందుకు 2012 బడ్జెట్లో రూ.12 కోట్లు, 2013 బడ్జెట్లో రూ.5 కోట్లు కేటాయించారు. కనీసం ఆ నిధులు కూడా పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేకపోయారు. నిధుల ఖర్చు మాట దేవుడెరుగు, ఆ రైల్వేలైన్ లాభదాయకం కాదంటూ రైల్వే బోర్డు తిరస్కరించడం పరిపాటిగా వస్తోంది. ఇదే కారణాన్ని చూపించి 2014 రైల్వే బడ్జెట్లో ఈ లైన్‌కు కేవలం రూ.కోటి కేటాయింపుతో సరిపుచ్చారు. ఎలా చూసినా కీలకమే.. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో కార్గో ద్వారా అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే ప్రాంతం కాకినాడ. ఆదాయపరంగా చూసినా కాకినాడ పోర్టు కార్యకలాపాలతో రైల్వేకి ఏటా సుమారు రూ.400 కోట్లు వస్తోందని అంచనా. ప్రస్తుతం ఆదాయపరంగా చూసినా లేదా కోటిపల్లి రైల్వేలైన్ నరసాపురం వరకు పొడిగిస్తే ప్రయాణికుల ప రంగా చూసుకున్నా మెయిన్‌లైన్‌తో కాకినాడ అ నుసంధానం ప్రాధాన్యం ఉన్నదే. కాగా నిన్న టి సమీక్షలో ప్రధాన కార్యదర్శి లాభదాయకతతో సంబంధం లేకుండా అనుసంధానాన్ని చేపట్టాలని సూచించారు. రైల్వేబడ్జెట్ ప్రవేశపెట్టనున్నవేళ రైల్వే అధికారులు సానుకూలత జిల్లావాసులకు ఉపశమనాన్నిస్తోంది. వైఎస్ హయాంలోనే చొరవ.. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే బీజం పడింది. ఆ ప్రాజెక్టుల వ్యయంలో కొంత రాష్ట్రం మో స్తుందని వైఎస్ కేంద్రానికి తెలిపారు. వాటిలో కాకినాడ మెయిన్ లైన్ అనుసంధా నం కూడా ఒకటి. ఇప్పుడు సీఎస్ సూచనను రైల్వేశాఖ ఆమోదిస్తే నాలుగు దశాబ్దాల కల సాకారమయ్యే శుభఘడియలు దగ్గరపడ్డట్టే. అందుకు తగ్గట్టు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టాల్సి ఉంది. ఎన్నికలప్పుడు కాకినాడ మెయిన్‌లైన్ సాధిస్తానని హామీ ఇచ్చిన కాకినాడ ఎంపీ తోట నరసింహంపై ప్రస్తుతం ఆ దిశగా చిత్తశుద్ధితో గట్టి ప్రయత్నమే చేయాల్సిన బాధ్యత ఉంది. అంతకు ముందు కాకినాడ ఎంపీగా ఉన్న ఎంఎం పళ్లంరాజు కేంద్ర మంత్రిగా పదోన్నతి పొందినా రైల్వే లైన్ సాకారం చేయలేక చేతులెత్తేశారు. అదే నిర్వాకాన్ని నరసింహం పునరావృతం చేస్తారో లేక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారో వేచి చూస్తామని ఈ ప్రాంతవాసులంటున్నారు. ఈ ప్రాజెక్టు కోసం మూడుదశాబ్దాలు పోరాడి, అసువులుబాసిన రైల్వే ప్రయాణికుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్.రత్నాజీ స్ఫూర్తితోనైనా తోట ఆ దిశగా కృషి చేయాలంటున్నారు. రైలు కూత వినాలనుకుంటున్న ‘కోనసీమ’ మరోవైపు తమ చిరకాల ఆకాంక్ష అయిన కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ కూడా సాకారమైతే రైలు కూత వినాలని కోనసీమ వాసులు గంపెడాశతో ఉన్నారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఈ రైల్వేలైన్‌ను సాధిస్తానని పండుల రవీంద్రబాబు కోనసీమవాసులకు హామీ ఇచ్చారు. అనుకున్నట్టే ప్రజలు ఆయనను అమలాపురం ఎంపీని చేశారు. మరి ఆయన ఏమి చేస్తారో వేచిచూడాల్సిందే. -
అవినీతిరహిత పాలనే ధ్యేయం
బల్మూర్: నిజాయితీతో స్వచ్ఛమైన పాలన అందించి, ఉద్యమంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారుమయంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఆదివారం బల్మూరు మండలంలోని మంగళకుంటపల్లిలో ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్‌తో కలిసి టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టోను ముఖ్యమంత్రి పవిత్ర గ్రంథంగా భావిస్తూ అందులో పొందుపరిచిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకుంటున్నారని చెప్పారు. గతంలో నియోజకవర్గంలో ఏపార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టినా 10వేలకు మించేది కాదని, ప్రస్తుతం టీఆర్ఎస్ సభ్యత్వాలు ప్రతి నియోజకవర్గంలో 60వేలు కానున్నాయని చె ప్పారు. 65ఏళ్ల పాలనలో అన్నిరకాలుగా వివక్షకు గురై అభివృద్ధికి నోచుకోని తెలంగాణ కేసీఆర్ పాలనతో ఏడు మాసాల్లోనే అభివృద్ధి దిశగా రూపు దిద్దుకుంటుందన్నారు. నాలుగేళ్లలో ఇంటింటికి తాగునీరందించకుంటే ఎన్నికల్లో ఓట్లే అడగమని సీఎం ప్రకటించారని, చెప్పిన ప్రతి మాటను ఆచరణలో రూపుదాల్చడమే దిద్దడమే ధ్యేయమన్నారు. అనంతరం మంత్రి చేతుల మీదుగా గ్రామంలోని పలువురికి టీఆర్ఎస్ సభ్యత్వా నమోదు పత్రాలను అందించారు. కార్యక్రమంలో నాయకులు పోకల మనోహర్, వెంకట్‌రెడ్డి, రాంమోహన్‌రావు, వంగబాల్ నారాయణగౌడ్, గోపాల్‌రావు, కొండల్రావు, గురుగౌడ్, నాగేశ్వర్రావు, తిరుపతయ్య, పాల్గొన్నారు. -
మున్సిపాలిటీ మాజీ చైర్మన్ దుర్మరణం
-
మున్సిపాలిటీ మాజీ చైర్మన్ దుర్మరణం
మెదక్: మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కృష్ణారావు దుర్మరణం చెందారు. వివరాలిలా ఉన్నాయి... చిన్నకోడూరు మండలం అనంతసాగర్ వద్ద కారును లారీ ఢీకొనడంతో కృష్ణారావు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గతంలో కృష్ణారావు మూడు పర్యాయాలు మంచిర్యాల మున్సిపాలిటీకి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. -
బొమ్మల కొలువులో చూసి.. సరేనన్నా!
చీకటిలో దారి చూపేది.. నిరాశలో ఆసరా ఇచ్చేది చల్లని సాహచర్యం. జీవితమంతా ఒకరి వెంట ఒకరిగా నిలచే ఆలుమగల అనుబంధం ఆ ఆత్మీయతను పంచి ఇస్తుంది.. కష్టాలకు ఎదురీది గట్టెక్కే బలాన్నిస్తుంది. పరస్పర విశ్వాసం, అవధుల్లేని అభిమానం వల్ల జీవితం మధురాతిమధురమవుతుంది. ఆ అనుబంధానికి నిదర్శనంగా నిలిచే కాట్రగడ్డ లక్ష్మీ వెంకట కృష్ణారావు, సునీతలే ఈ వారం యూ అండ్ ఐ. కట్టుబట్టలతో వైజాగ్ వచ్చినా తన భార్య సునీత అందించిన సహకారంతోనే ఇంతవాడినయ్యానని చెప్పారు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ (యూత్ ఎక్స్చేంజ్) కాట్రగడ్డ లక్ష్మీ వేంకట కృష్ణారావు. భార్యను తనతో సమానంగా గౌరవించే భర్త దొరకడం అదృష్టమని, ఆయన ప్రోత్సాహంతోనే లయన్ క్లబ్ విశాఖపట్నం గ్రేటర్ ప్రెసిడెంట్‌ను కాగలిగానని చెప్పారు సునీత. ఇగోలకు, ఫాల్స్ ప్రిస్టేజీకి పోకుండా ఉంటేనే దాంపత్యం చిరకాలం వర్థిల్లుతుందన్నారు ఇద్దరూ. తమ వివాహం, వైజాగ్‌లో సెటిల్ కావడం గురించి ఇలా వివరించారు. కృష్ణారావు : మాది విజయవాడ. ఎస్ఆర్ఆర్ కళాశాలలో బీఏ చేశాను. చిన్నప్పటి నుంచి అన్నిట్లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసేవాడిని. స్కూల్లో, కాలేజ్‌లో స్టూడెంట్ లీడర్‌గా చేశాను. మా నాన్నగారు లయన్స్ క్లబ్ సభ్యుడు. నన్ను లయన్స్ క్లబ్‌లోని యూత్ వింగ్ లియోలో సభ్యుడిగా చేర్చి సేవాపథం వైపు నడిపించారు. 1989లో ప్రెసిడెంట్ అయ్యాను. సునీత : నేను మాంటిస్సోరీలో చదివాను. స్కూలు, కాలేజ్ చదువు అక్కడే. గేమ్స్, వక్తృత్వం వంటి పోటీల్లో పాల్గొనేదాన్ని. కృష్ణారావు : సునీత మా బంధువులమ్మాయే. విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో ఎగ్జిబిషన్లో, మా బంధువులింట్లో బొమ్మలకొలువులో చూసేవాడిని. సునీత : మా పెద్దమ్మ ద్వారా ఈ సంబంధం వచ్చింది. బంధువులం కావడంతో ఇక అభ్యంతరమేముంటుంది. మరుసటిరోజే నిశ్చితార్థం అయింది. కృష్ణారావు : నేను ఊరినుంచి వచ్చేసరికి నాన్నగారు వాళ్లు అమ్మాయిని చూసి వచ్చినట్లు చెప్పారు. పెళ్లికూతురు సునీతేనని తెలిసి వెంటనే ఓకే చెప్పేశాను. నిశ్చితార్థం అయ్యాక తను స్కూలుకు వెళ్తున్నప్పుడు, వచ్చేటప్పుడు రిక్షాలో తీసుకెళ్లి తీసుకు వచ్చేవాడిని. సునీత : ఈయన ప్రేమలేఖలు కూడా రాశారు. ఒకటి, రెండు ఉత్తరాలకు మాత్రం బదులిచ్చానంతే. 1989లో ఆగస్టు 20న మా పెళ్లయింది. మా అత్తగారు చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. వంటలన్నీ ఆవిడ దగ్గరే నేర్చుకున్నాను. పెళ్లయ్యాక లయన్స్ క్లబ్‌కు అనుబంధంగా ఉండే లయనెస్ క్లబ్‌కు ప్రెసిడెంట్నయ్యాను. కృష్ణారావు : పెళ్లయ్యాక జీవనమార్గం కోసం ఆలోచిస్తున్న సమయంలో ఫ్రెండ్స్ వైజాగ్ వచ్చేయమనడంతో ఇద్దరం వచ్చేశాం. ఒక స్నేహితుడి దగ్గర రూ.30,000 తీసుకుని ప్రింటింగ్ ప్రెస్ స్టార్ట్ చేశాను. సునీత ప్రెస్‌కు వచ్చి నాకు సహాయపడేది. తర్వాత ‘రావు టూర్స్ అండ్ ట్రావెల్స్’ స్టార్ట్ చేశాను. సునీత : తర్వాత ద్వారకానగర్‌లో ‘ది నెస్ట్’ విమెన్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ స్టార్ట్ చేశాం. కృష్ణారావు : మాకు ఇద్దరు పిల్లలు. ఒకవైపు హాస్టల్, ఇంకోవైపు పిల్లలు, మరోవైపు లయన్స్ క్లబ్ యాక్టివిటీస్ .. అన్నీ సమర్థంగా నిర్వహించేది. తనకు స్ట్రెయిన్ ఎక్కువవుతోందని మూడేళ్ల క్రితం హాస్టల్ వేరేవారికి అప్పగించేశాం. సునీత : ఇంటి విషయాల్లో ఈయన చాలా కోఆపరేట్ చేసేవారు. మా పిల్లలపై ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువే. కృష్ణారావు : పాప నిఖిత. ఇంజినీరింగ్ ఫైనలియర్. 2013-14 సంవత్సరానికి లియో ఆఫ్ ద ఇయర్‌గా ఎన్నికైంది. బాబు ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్. సునీత : లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. ఫుట్‌పాత్‌పై పడుకున్నవారికి రగ్గులు అందివ్వడం, తోటగరువు ప్రైమరీ స్కూల్ పిల్లలకు వస్తువుల సరఫరా.. చేపట్టాం. కృష్ణారావు : జువైనల్ హోమ్‌కు వెళ్లి అక్కడి వారికి దుస్తులు, వంటపాత్రలు పంపిణీ చేసేవాళ్లం. తెలుగుదనం ఉట్టిపడేలా ఉగాది ఉత్సవాలు నిర్వహించాం. మా సహకారంతోనే ఇది సాధ్యమైంది. సునీత : ఈయనలో స్నేహభావం ఎక్కువ. ఫ్రెండ్షిప్ అంటే ప్రాణం పెడతారు. పనిని సాధించేవరకు వదిలిపెట్టరు. కృష్ణారావు : నేను ఏం చేసినా నా కుటుంబం నన్ను వెన్నంటే ఉంటుందన్న భావన నాకు చాలా బలాన్నిస్తుంది. సునీత, పిల్లలు నా ఎసెట్స్. -
ఆ ఇద్దరికీ..!
కేసీఆర్ కేబినెట్లో జూపల్లి, లక్ష్మారెడ్డి సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంత్రివర్గంలో జిల్లాకు పెద్దపీట వేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుకు కేబినెట్లో చోటు కల్పించారు. వీరిద్దరు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో మంగళవారం రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. లక్ష్మారెడ్డికి విద్యుత్, జూపల్లికి పరిశ్రమల శాఖలు కేటాయిస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులకు ప్రధానశాఖలు దక్కడం వెనుకబడిన పాలమూరు అభివృద్ధికి దోహదం చేస్తుందనే అభిప్రాయం జిల్లావాసుల్లో వ్యక్తమవుతోంది. నూతన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆరునెలలు కావస్తున్నా మంత్రి వర్గంలో జిల్లాకు చోటుదక్కకపోవడంతో అధికారపార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. మరోవైపు మంత్రివర్గంలో చోటుకోసం టీఆర్ఎస్కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తూ వచ్చారు. సామాజికవర్గాల సమీకరణాల నేపథ్యంలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస గౌడ్‌కు మంత్రివర్గ విస్తరణకు ముందే పార్లమెంటరీ కార్యదర్శి హోదా కట్టబెట్టారు. పార్టీ సీనియర్ నాయకుడు నిరంజన్‌రెడ్డికి ప్రణాళిసంఘం ఉపాధ్యక్షుడిగా నియమించారు. దీంతో ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావుకు మంత్రి పదవులు దక్కడం ఖాయమని విస్తరణ ప్రక్రియకు ముందే స్పష్టత వచ్చింది. విపక్షాలపై పైచేయి సాధించేందుకే! 2001లో టీఆర్ఎస్ ఆవిర్భవించినప్పటి నుంచి జిల్లాలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 2004లో లక్ష్మారెడ్డి ఒక్కరే జడ్చర్ల నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ స్వయంగా మహబూబ్‌నగర్ ఎంపీగా పోటీచేసి గెలుపొందినా ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని కూడా సాధించలేకపోయారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించిన నేపథ్యంలో ఓ ఎంపీ, ఏడు అసెంబ్లీ స్థానాలు గెలుపొందడంతో పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది. జిల్లాకు చెందిన విపక్షనేతలు డీకే అరుణ, చిన్నారెడ్డి, రేవంత్‌రెడ్డి తదితరుల దూకుడుకు కళ్లెం వేస్తూ.. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు జిల్లాకు మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యం కల్పించినట్లు స్పష్టమవుతోంది. -
15 రోజుల్లో అధికారుల విభజన పూర్తి
కేంద్ర పరిపాలనా వ్యవహారాల మంత్రి జితేందర్ సింగ్ వెల్లడి అఖిల భారత సర్వీసు అధికారుల విభజనపై ప్రత్యూష్ సిన్హా కమిటీ భేటీ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల అభ్యంతరాలు తెలియజేసిన ఇరు రాష్ట్రాల సీఎస్‌లు న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీ ప్రక్రియ రెండు వారాల్లోగా పూర్తవుతుందని కేంద్ర సిబ్బంది శిక్షణ, పరిపాలనా వ్యవహారాల మంత్రి జితేందర్‌సింగ్ తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల కేటాయిం పుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యూష్ సిన్హా కమిటీ తయారు చేసిన రెండో జాబితాను ఈ నెల 10న డీఓపీటీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాపై అభ్యంతరాలు వెలవరించేందుకు ఇచ్చిన 15 రోజుల గడువు ముగియడంతో కమిటీ శనివారం మధ్యాహ్నం ఢిల్లీలో సమావేశమైంది. కమిటీ చైర్మన్ ప్రత్యూష్‌సిన్హాతో పాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ఐ.వై.ఆర్.కృష్ణారావు, రాజీవ్‌శర్మలు హాజరయ్యారు. అభ్యంతరాలు వ్యక్తం చేసిన అధికారుల నుంచి స్వయంగా అభిప్రాయాలు తెలుసుకుంది. ముసాయిదా జాబితాపై ఇరు రాష్ట్రాల సీఎస్‌లు తమ ప్రభుత్వాల అభిప్రాయాలు వెల్లడించారు. అధికారుల విభజన ప్రక్రియ ఆలస్యం అయినందున, రెండో జాబితాలో కేటాయించిన అధికారుల్లో అభ్యంతరాలు వ్యక్తం చేయని అధికారులను ఆయా రాష్ట్రాలకు ‘ఆర్డర్ టు సర్వ్’ కింద కేటాయించేందుకు సీఎస్‌లు అంగీ కరించినట్లు తెలిసింది. కమిటీకి ఇదే చివరి సమావేశం కావొచ్చని ఆయన సూచనప్రాయంగా తెలిపారు. కోరుకున్న రాష్ట్రానికే కేటాయింపు: కేంద్రమంత్రి సివిల్ సర్వీసెస్ అధికారుల విభజన ప్రక్రియ అధికారులందరినీ సంతృప్తి పరిచేలా కొనసాగుతోందని మంత్రి జితేందర్‌సింగ్ తెలిపారు. శనివారం ఢిల్లీలోని సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ ఇనిస్టిట్యూట్‌లో ఐఏఎస్ అధికారుల మిడ్‌టర్మ్ ట్రైనింగ్ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా సివిల్ సర్వీసెస్ అధికారుల విభజనకు సంబంధించి మీడియాతో మాట్లాడారు. ‘‘అధికారుల విభజన ప్రక్రియ చాలా పారదర్శకంగా కొనసాగుతోంది. తుది జాబితాను సిద్ధం చేసే పనిలో ఉన్నాం. వీలైనంత త్వరగా దాన్ని పూర్తి చేస్తాం. ప్రతి అధికారిని సంతృప్తి పరిచేలా, అధికారి కోరుకునే రాష్ట్రానికే కేటాయించేలా చూస్తున్నాం. విభజన ప్రక్రియను గరిష్టంగా రెండు వారాల్లో పూర్తి చేయనున్నామన్నారు. కమలనాథన్ మార్గదర్శకాలకు పీఎం గ్రీన్‌సిగ్నల్ హైదరాబాద్: ఉమ్మడిరాష్ట్రంలోని రాష్ట్ర కేడర్ అధికారుల విభజనకు సంబంధించిన రాష్ట్ర సలహా మం డలి చైర్మన్ సీఆర్ కమలనాథన్ కమిటీ రూపొందించిన మార్గదర్శకాలకు ప్రధాని మోదీ ఆమోదం తెలిపినట్టు సమాచారం. పీఎంవో నుంచి డీవోపీటీకి వచ్చాక వా టిని వెబ్సైట్లో పెట్టనుంది. దీని అనుగుణంగానే విభజన ప్రక్రియను కమిటీ వేగవంతం చేయనుంది. భార్యాభర్తల కేసైతే ఓకే..! అఖిల భారత సర్వీసు అధికారుల విజ్ఞాపనలను ప్ర త్యూష్సిన్హా కమిటీ తిరస్కరించినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. భార్యాభర్తల కేసుల విజ్ఞాపనలను పరిగణనలోకి తీసుకుంటామని కమిటీ పేర్కొంది. -
విశాఖ మరింత దూసుకుపోతుంది
త్వరలో కేంద్ర బృందం రాక మొత్తం 34 మంది మృతి సమన్వయంతో సహాయ కార్యక్రమాలు సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు హైదరాబాద్: హుదూద్ వంటి భారీ తుపాను తాకడం కారణంగా విశాఖ నగరంలో పెట్టుబడులు పెట్టడానికి కార్పొరేట్లు, మల్టీనేషనల్ కంపెనీలు వెనక్కి తగ్గుతాయనే ప్రచారంలో ఏ మాత్రం పసలేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. విశాఖ నగరం ఏపీకి ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఇపుడు మరింత వేగంగా అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. సచివాలయంలోని తన చాంబర్లో గురువారం ఆయన మాట్లాడుతూ గతంలో తుపాన్లు మన దేశంలో జనాభా ఉన్న నగరాలు, పట్టణాలను తాకలేదన్నారు. ఎక్కువ గాలుల వేగం ఉన్న అత్యంత ప్రమాదకరమైన పెను తుపాను హుదూద్‌తో కొంత భారీనష్టం కలిగిందే తప్ప ఇలాంటివి, ఇంతకంటే పెద్దవాటితో చైనా, జపాన్, తైవాన్, సౌత్‌కొరియా వంటి దేశాల్లో కోస్తా నగరాలు విలవిల్లాయాడన్న సంగతి మరువరాదని చెప్పారు. అయినా అక్కడ పెట్టుబడులు పెట్టడం ఎవరూ మానుకోలేదన్నారు. బంగాళాఖాతంలో 1891 నుంచి వచ్చిన 77 తుపానుల్లో విశాఖను వణికించినది ఇదొక్కటేనన్నారు. తుపాను, భారీవర్షాల కారణంగా ఉత్తరాంధ్రలోని 44 మండలాల్లో పంటలకు తీవ్ర నష్టం సంభవించిందని చెప్పారు. కేంద్ర బృందం కూడా త్వరలో వస్తుందని తెలిపారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో 60 శాతం విద్యుత్ స్తంభాలు కూలిన కారణంగా సరఫరా పునరుద్ధరణకు కొంచెం సమయం తీసుకోవలసి వచ్చిందన్నారు. శుక్రవారం నాటికి విశాఖకు, శనివారం నాటికి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సరఫరా ఇవ్వగలమని చెప్పారు. ఇంతవరకు అందిన సమాచారం ఆధారంగా 34 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఆస్తి నష్టం ఎంతన్నది మదింపు జరుగుతోందన్నారు. తుపాను రాక ముందు నుంచీ కేంద్ర ం, వాతావరణ శాఖ హెచ్చరికలు ఎంతో మేలు చే శాయన్నారు. మొదట కొంచెం అనుకూల పరిస్థితులు లేకున్నా ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నతాధికారులు, సాధారణ అధికారుల మధ్య సమన్వయం ఉండటంతో బాధితులకు సాయం చేసే అంశంలో టీమ్ వర్కుతో సునాయాసంగా సమస్యనుంచి రెండోరోజుకే తేరుకున్నామని చెప్పారు. అన్నిటికీ మించి ముఖ్యమంత్రి అక్కడ మకాం వేసి వ్యక్తిగత పర్యవేక్షణ చేయడంతో బాధితులకు సాయం సకాలంలో అందుతోంద న్నారు. -
మా వాళ్లని పనిచెయ్యనివ్వట్లేదు
గవర్నర్‌కు ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు లేఖ వెళ్లిపోవాలంటూ ఆంధ్రా ఉద్యోగులపై తీవ్రమైన ఒత్తిడి ఏ ప్రాంతంలోని సంస్థలు ఆ ప్రాంతానివేననటం అన్యాయం, అక్రమం ఏపీ ఫుడ్స్ పేరును తెలంగాణ ఫుడ్స్‌గా మార్చే హక్కెక్కడుంది? షెడ్యూల్స్‌లో లేని 38 సంస్థలనూ విభజించండి ఇది రాష్ట్రాల సమస్య... కానీ ఉద్యోగ సంఘాల జోక్యం పెరిగింది తక్షణం జోక్యం చేసుకోవాలంటూ అభ్యర్థన హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న సంస్థల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉద్యోగులను పనిచేయనివ్వటం లేదని, వెళ్లిపోవాలంటూ ఆంధ్రా ఉద్యోగులపై తెలంగాణ ఉద్యోగ సంఘాల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు తెలియజేశారు. ఈ సంస్థల్లో ఆంధ్రా ఉద్యోగులపై వివక్ష కనబరుస్తున్నారని, అందుకని వీటిని విభజించాలని, లేనిపక్షంలో తక్షణం ఉమ్మడి యాజమాన్యాలను ఏర్పాటు చేయాలని గవర్నరు ఈఎస్ఎల్ నరసింహన్‌ను కోరారు. ఈ మేరకు గవర్నరుకు ఆయనొక లేఖ రాశారు. ‘‘అయితే విభజించటమో లేకుంటే ఉమ్మడి యాజమాన్యాలను ఏర్పాటు చేయటమో రెండు ప్రభుత్వాలూ కలసి చేయాలి. కానీ అలాకాక వీటిలో తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నాయి. ఏపీ ఫుడ్స్ పేరును తెలంగాణ ఫుడ్స్‌గా తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా మార్చేసింది. ఇలా మార్చే అధికారం ఆ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే షెడ్యూలు 10లోని సంస్థలు గత ఐదు దశాబ్దాల కాలంలో ఉమ్మడి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినవి. రెండు రాష్ట్రాల ఉద్యోగులూ వాటిలో పనిచేస్తున్నారు. ఏడాదిలోగా ఈ సంస్థల విషయంలో రెండు ప్రభుత్వాలూ ఒక అవగాహనకు రావాల్సి ఉంది’’ అని సీఎస్ ఆ లేఖలో పేర్కొన్నారు. ‘‘ఏ ప్రాంతంలో ఉంటే వారికే చెందుతాయనేది ధర్మం కాదు. అది అన్యాయం... అక్రమం. కొన్నిటిని విభజించటం సాధ్యం కాదు కాబట్టి ఇరు రాష్ట్రాలూ ఆ సేవల్ని సంయుక్త నిర్వహణ ద్వారా వినియోగించుకోవాల్సి ఉంటుంది. దురదృష్షవశాత్తు ఈ సంస్థల్లో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులపై వెళ్లిపోవాలంటూ ఒత్తిడి పెరుగుతోంది. కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)లో ఆంధ్రా ఉద్యోగుల పట్ల వివక్ష చూపిస్తున్నారు. మూడు నెలలుగా వారిని పనిచేయనివ్వటమే లేదు. జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలోనూ ఇదే పరిస్థితి ఉంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో... ఏ షెడ్యూల్లో లేని 38 సంస్థలను కూడా పదవ షెడ్యూల్లోని సంస్థల్లానే ఇరు రాష్ట్రాలూ పరస్పర అంగీకారంతో విభజించుకోవటం లేదా ఉమ్మడిగా వాడుకోవటం చేయాలి. న్యాక్ డీజీని రానివ్వకుండా అక్కడి తెలంగాణ ఉద్యోగులు అడ్డుకుంటున్నారు. ఇలాగైతే ప్రభుత్వం పనిచేయడం సాధ్యం కాదు కనక తక్షణం జోక్యం చేసుకోవాలి’’ అని ఆ లేఖలో గవర్నరును కోరారు. లేఖ ప్రతులను తెలంగాణ సీఎస్‌తో పాటు కేంద్ర కేబినెట్ కార్యదర్శికి, కేంద్ర హోంశాఖ కార్యదర్శికి పంపించారు. -
66 మంది ఐఏఎస్‌ల కొరత
పలు శాఖల్లో పోస్టుల తగ్గింపునకు కసరత్తు 211 ఐఏఎస్ పోస్టుల కేటాయింపు 165 మంది మాత్రమే పంపిణీ హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 66 మంది ఐఏఎస్‌ల కొరత ఏర్పడింది. ఈ సమస్యను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు కసరత్తు చేస్తున్నారు. అరుుతే పలుశాఖల్లో ఐఏఎస్‌ల పోస్టులను తగ్గించడమే తప్ప మరో ఇప్పటికిప్పుడు మార్గం లేదని ఉన్నతాధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక, రెవెన్యూ, సాగునీటి, వవసాయ శాఖల్లో ముగ్గురు చొప్పున ఐఏఎస్లుండగా.. ఒక్కో పోస్టు చొప్పున తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. పరిశ్రమల శాఖలో కూడా భారీ పరిశ్రమలు, గనులు, పెట్టుబడులు మౌలిక వసతుల కల్పనకు వేర్వేరుగా ముగ్గురు ఐఏఎస్లుండగా.. రెండు పోస్టులకు కుదించనున్నారు. మున్సిపల్ శాఖలో రెండు ఐఏఎస్ పోస్టులుండగా ఇప్పుడు ఒక పోస్టుకే పరిమితం చేయనున్నారు. ఇలా పలు శాఖల్లో ఐఏఎస్ పోస్టులను తగ్గించినా ఇంకా కొరత ఉంటుందని, దీన్ని అధిగమించడానికి కేంద్ర సర్వీసులో ఉన్న అధికారులను వెనక్కు రప్పించుకోవడంతో పాటు ప్రస్తుతం డిప్యుటేషన్‌పై ఉన్న అధికారులను కొనసాగించుకోవాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 211 ఐఏఎస్ పోస్టులను కేటాయించినా.. పంపిణీలో 165 మంది మాత్రమే రాష్ట్రానికి వచ్చారు. అరుుతే ఇందులోనూ 20 మంది కేంద్ర సర్వీసులో పనిచేస్తున్నారు. దీంతో అందుబాటులో ఉన్న ఐఏఎస్‌లు 145 మందికే పరిమితం అయ్యూరు. ఈ విధంగా మొత్తం 66 మంది ఐఏఎస్‌ల కొరత ఏర్పడింది. రాష్ట్రంలోని 13 జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల పోస్టులు, మున్సిపాలిటీలకు కలిపి 40 మంది ఐఏఏస్‌లు అవసరం. అలాగే సచివాలయ స్థాయి శాఖలకు 40 మంది, డెరైక్టరేట్లకు 70 మంది, వివిధ ప్రాజెక్టుల డెరైక్టర్లుగా 15 మంది ఐఏఎస్‌లు ప్రధానంగా అవసరం ఉంటుంది. ప్రత్యూష్ సిన్హా కమిటీ తుది పంపిణీ జాబితాకు ప్రధానమంత్రి మోడీ ఆమోదం లభించిన వెంటనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ల పేర్లతో గెజిట్ నోటిఫికేషన్ జారీ కానుంది. వెనువెంటనే ఏపీ ప్రభుత్వం పోస్టుల కుదింపుతో పాటు ఐఏఎస్‌ల బదిలీలపై దృష్టి సారించనుందని అధికార వర్గాలు తెలిపాయి. -
అర్హు లైన రైతులకు రుణమాఫీ
కాకినాడ సిటీ: అర్హులైన రైతులకు రూ.లక్షా 50 వేలు చొప్పున రుణమాఫీ వర్తింపచేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పష్టం చేశారు. ఈ అంశంపై బుధవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 5న రుణమాఫీకి సంబంధించిన రైతుల బ్యాంక్ రుణాల వివరాలు సీడీ రూపంలో ఎన్ఐసీకి అందజేయాలని బ్యాంక్ అధికారులను ఆదేశించారు. ఆ వివరాలు పరిశీలించి అర్హులైన రైతుల తుది జాబితాను ఈనెల 15వ తేదీలోగా తయారు చేయాల్సి ఉంటుందన్నారు. జాబితా రూపకల్పనలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అనర్హులు జాబితాలోకి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం రేషన్‌కార్డు, ఆధార్ డేటాలను అనుసంధానం చేస్తూ జాబితాలు రూపొందించాలన్నారు. రైతు పేరు, సర్వే నంబర్, పట్టాదారు పాస్ పుస్తకం నంబర్, ఆధార్, రేషన్‌కార్డు నంబర్ వంటి వివరాలతో 27 కాలాల నమూనా పూర్తి వివరాలను 5వ తేదీలోపు ఎన్ఐసీకి అందించాలన్నారు. వీడియో కన్ఫరెన్స్లో పాల్గొన్న అనంతరం బ్యాంక్ అధికారులతో కలెక్టర్ నీతూ ప్రసాద్ సమీక్ష జరిపారు. జిల్లాలోని రైతుల ఆధార్, రేషన్ కార్డు డేటాల అనుసంధానంతో రెవెన్యూ గ్రామాల వారీగా రుణమాఫీకి సంబంధించిన వివరాలను వెంటనే అందించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎస్.జగన్నాథస్వామి, వ్యవసాయ శాఖ జేడీ విజయ్‌కుమార్, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్‌రాజు, వివిధ బ్యాంక్‌ల కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
హత్యా రాజకీయాలొద్దు
కంచికచర్ల : నిత్యం ప్రజలతో సంబంధాలు కొనసాగించే రాజకీయ నాయకులు హత్యలను ప్రోత్సహించవద్దని, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడాలని వైఎస్సార్సీపీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు కోనేరు రాజేంద్రప్రసాద్ సూచించారు. మండలంలోని గొట్టుముక్కలలో ఆదివారం అర్థరాత్రి హత్యకు గురయిన ఆలోకం కృష్ణారావు కుటుంబ సభ్యులను గురువారం కలుసుకుని ప్రగాడ సానుభూతి తెలిపారు. హత్య జరిగిన తీరుపై కుటుంబ సభ్యుల నుంచి వివరాలడిగి తెలుసుకున్నారు. నిద్రపోతున్న కృష్ణారావును లేపి రాడ్లతో, కర్రలతో కొట్టి రెండు పెడరెక్కలు విరిచి లాక్కుంటూ కాళ్లతో తన్నుకుంటూ బయటకు తీసుకువెళ్లి చంపి రోడ్డుపై పడేశారని కృష్ణారావు భార్య ముత్తమ్మ, కుమార్తె వాసిరెడ్డి నాగమణి చెప్పారు. కుంటుంబానికి పెద్దదిక్కు పోయిందని కోనేరు ముందు బోరున విలపించారు. తమను దిక్కులేని వారిని చేసిన హత్యను ప్రోత్సహించిన వారిని శిక్షించాలని అన్నారు. కోనేరు మాట్లాడుతూ ఈ విషయాలన్నీ జిల్లా ఎస్పీ విజయకుమార్ దృష్టికి తీసుకెళ్లి హత్యకు సహకరించిన వారిపై చర్యలు తీసుకునేలా చేస్తానని అన్నారు. పచ్చని గ్రామాల్లో జీవించే వారిపై రాజకీయాల కోసం దాడులు చేసి హత్యలు చేయడం సరికాదని హితవు పలికారు. గ్రామాల్లో అందరూ ఐక్యంగా ఉండి అభివృద్ధికోసం పాటుపడాలని, కక్షలు పెంచుకుంటూపోతే ప్రజలు గ్రామాల్లో ఎవరూ మిగలరని అన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, అధికారంలో ఉన్నంత మాత్రాన హత్యలు చేస్తే చట్టం ఊరుకోదని తెలిపారు. అనంతరం మాజీ ఎంపీటీసీ సభ్యుడు గుదే అక్కారావు ఇంటిపై రాళ్లు రువ్వి కిటికీ అద్దాలను పగులకొట్టారని, బయటకు వస్తే చంపుతామని నానా దుర్భాషలాడుతూ వెళ్లిపోయారని కోనేరుకు తెలిపారు. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సమయం నుంచి టీడీపీ వర్గీయులు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని అయినా ఊరుకుంటున్నామని దీంతో పోలీసు వర్గాలన్నీ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని కోనేరుతో పార్టీ నేతలు వాపోయారు. కోవెలమూడి వెంకటనారాయణ, డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్, జగ్గయ్యపేట మున్సిపల్‌చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు షేక్ షహనాజ్‌బేగం, మహ్మద్ గౌస్, గుదే రంగారావు, అక్కారావు, తాటుకూరి గంగాధరరావు, కోటేరు సూర్యనారాయణరెడ్డి, ములకలపల్లి శేషగిరిరావు, వాసిరెడ్డి విజయకుమార్, జొన్నలగడ్డ సుబ్బారావు, ఆలోకం శ్రీనివాసరావు, గుదే సాంబశివరావు, తాటుకూరి అమ్మారావు, బండి వెంకట్రావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. -
చంద్రబాబుకు మానవత్వమనేది ఉందా ?
-
కృష్ణారావు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
-
కృష్ణారావు హత్య కేసు పక్కదారి పడుతుందా?
-
టీడీపీ హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తోంది: వైఎస్ఆర్సీపీ
కంచికచర్ల: టీడీపీ హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఎమ్మెల్యే రక్షణనిధి, పార్థసారధి, ఉదయభాను ఆరోపించారు. హత్యలకు పాల్పడుతున్న టీడీపీ నేతలకు మంత్రి దేవినేని ఉమ అండగా ఉంటున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. పోలీసులు సరైన సమయంలో స్పందిస్తే కృష్ణారావు హత్య జరిగేదే కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యర్ధుల దాడిలో మరణించిన గొట్టిముక్కల గ్రామ ఉపసర్పంచ్ కృష్ణారావు కుటుంబసభ్యులను ఎమ్మెల్యే రక్షణనిధి, పార్థసారధి, ఉదయభాను పరామర్శించారు. కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం గొట్టిముక్కల గ్రామ ఉప సర్పంచ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కృష్ణారావును సోమవారం తెల్లవారు జామున ప్రత్యర్థులు దాడిలో దారుణ హత్యకు గురయ్యారైన సంగతి తెలిసిందే. -
కృష్ణాజిల్లాలో వైఎస్ఆర్ సీపీ నేత హత్య
-
తప్పు వారిది.. శిక్ష మాకా.. ?
టెక్కలి: విద్యుత్ శాఖాధికారులు చేసిన తప్పులకు గాను ఓ వినియోగదారుడు బలయ్యాడు. తమ వాడకానికి సంబంధించిన విద్యుత్ బిల్లు రావడంలేదంటూ అధికారుల చూట్టూ తిరిగినా వారు పట్టించుకోలేదు. ఇంతలో విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డారు. వివరాలు చూస్తే.. టెక్కలి మండలం తిర్లంగి గ్రామానికి చెందిన పాత్రో కృష్ణారావు ఇంటి మీటరు నెంబర్ 145కు గాను గత ఏడాది డిసెంబర్ నుంచి విద్యుత్ బిల్లులు నిలిచిపోయాయి. రెండు నెలల వేచి చూసిన బిల్లులు రాకపోవడంతో, కృష్ణారావు కుమారుడు దేవేంద్ర అప్పటి ఏఈ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేయగా దీనికి ఫిర్యాదు అవసరం లేదు తక్షణమే బిల్లులు వచ్చినట్లు చర్యలు తీసుకుంటామని ఏఈ చెప్పినట్లు దేవేంద్ర తెలియజేశాడు. నెలలు తరబడి వేచి చూసినా బిల్లులు రాలేదు. మళ్లీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. ఇటీవల విజిలెన్స్ తనిఖీల్లో దొంగతనంగా విద్యుత్ వినియోగిస్తున్నారంటూ కేసు నమోదు చేసి రూ. 1560 అపరాద రుసుం చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. దీనిపై ప్రస్తుత ఏఈ వెంకటరమణ దృష్టికి తీసుకువెళ్లగా అపరాద రుసుం చెల్లించి కొత్త మీటరు కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకోవాలంటూ సలహా ఇచ్చినట్లు దేవేంద్ర తెలిపాడు .అధికారులు చేసిన తప్పుకు మేము బలయ్యూం అంటూ వాపోయూడు. ఈ సమస్యపై విశాఖపట్టణంలో జరిగే విద్యుత్ గ్రీవెన్స్‌సెల్‌కు ఫిర్యాదు చేసి బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టాలని కోరుతామని దేవేంద్ర తెలిపాడు. -
బ్యాంకు ఖాతాదారులే టార్గెట్..!
హుజూర్నగర్ :బ్యాంకు ఖాతాదారుల అజాగ్రత్తను గుర్తుతెలియని వ్యక్తులు చాకచాక్యంగా సొమ్ము చేసుకుంటున్నారు. బ్యాంకుల నుంచి డ్రా చేసుకున్న నగదును తమ వాహనాల డిక్కీల భద్రపరుచుకుని పక్కకు వెళ్లి వచ్చేలోపే దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. హుజూర్‌నగర్‌లో ఇటీవల జరిగిన వరుస చో రీలను గమనిస్తే ఈ విషయం ఇట్టే తెలిసిపోతోంది. ప్రస్తుతం ఈ విషయం నియోజకవర్గ కేంద్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఖాతాదారులు బ్యాంకుల నుంచి నగదును డ్రా చేయాలంటేనే జంకుతున్నారు. అజాగ్రత్తే ప్రధాన కారణం హుజూర్‌నగర్‌లో వాహనాల డిక్కీల నుంచి మాయమవుతున్న నగదుకు అజాగ్రత్తే ప్రధాన కారణంగా తెలుస్తోంది. బ్యాంకుల నుంచి డ్రా చేసుకున్న నగదు ను సదరు వ్యక్తులు డిక్కీలో భద్రపరుచుకుని నేరుగా ఇంటికి వెళ్లకుండా ఇతరత్ర పనులు చూసుకుంటున్న క్రమంలోనే చోరీలు జరిగినట్లు తెలుస్తోంది. సోమవారం హుజూర్నగర్ మండలం శ్రీనివాసపురానికి చెందిన కట్టా కృష్ణారావు బ్యాంకు నుంచి డ్రా చేసుకున్న రూ.5 లక్షల నుంచి రూ.4.50 లక్షలను అతని వా హనం నుంచి గుర్తుతెలియని వ్యక్తులు కొద్ది నిమిషాల్లోనే మాయం చేశారు. అయితే కృష్ణారావు తన వాహనాన్ని ఓ దుకాణం ముందు నిలిపి ఇతర పని చూసుకుంటున్న క్రమంలో ఈ చోరీ జరిగింది. అదే కృష్ణారావు నేరుగా ఇంటికి వెళ్లి ఉంటే ఈ ఘటన జరిగేది కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా గతంలో మేళ్లచెరువు మండ లం మల్లారెడ్డిగూడేనికి చెంది న ఓ వ్యక్తి స్థానికంగా గల ఎస్బీహెచ్ నుంచి రూ. 47,000లను డ్రా చేసి తన మోటార్‌సైకిల్ డిక్కీలో పెట్టుకొని ఓ బట్టల దుకాణంలోకి వెళ్లినప్పుడు, పట్టణానికి చెందిన మరో ధా న్యం వ్యాపారి స్థాని కంగా గల పార్బాయిల్డ్ మిల్లు నుంచి రూ.85,000ల నగదును తీసుకొని తన హీరోహోండా మోటార్ సైకిల్ డిక్కీలో పెట్టుకొని ఇందిరాసెంటర్‌లోని టీ స్టాల్ వద్ద వాహనాన్ని పార్కింగ్ చే సి అజాగ్రత్తగా ఉన్నప్పుడే చోరీలు జరిగాయి. పోలీసులు ఏమంటున్నారంటే.. బ్యాంకుల నుంచి నగదును డ్రా చేసుకునే వ్యక్తులు చాల జాగ్రత్తంగా ఉండాలని ఎస్ఐ వెంకటశివరావు అన్నారు. నగదును వెంట తీసుకువెళ్లే వారికి ఆయన కొన్ని సూచనలు చేశారు. పెద్ద మొత్తంలో నగదును డ్రా చేసినప్పుడు వెంటనే ఇంటికి వెళ్లిపోవాలి. వీలైతే వెంట ఓ వ్యక్తిని తోడుగా తీసుకువెళ్లాలి.తమను సహాయం కోరినా వెంట ఓ కానిస్టేబుల్‌ను రక్షణగా పంపిస్తాం. తమను ఎవరైనా గమనిస్తున్నారనే విషయాన్ని పసిగట్టగలగాలి. అనుమానం వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. పట్టణంలోని బ్యాంకుల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేసి ఇలాంటి దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో వైఎస్ఆర్ సీపీ నాయకుని దుర్మరణం
జూలూరుపాడు: జూలూరుపాడు పోలీస్ స్టేషన్ సమీపంలో తల్లాడ-కొత్తగూడెం ప్రధాన రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కరివారిగూడెం గ్రామ మాజీ సర్పంచ్, వైఎస్ఆర్ సీపీ మండల సీనియర్ మండల నాయకుడు ఆంగోతు కృష్ణారావు(65) మృతిచెందారు. పోలీసులు తెలిపిన ప్రకారం... కరివారిగూడెం గ్రామ సర్పంచ్ ఆంగోతు ధనమ్మ భర్త, మాజీ సర్పంచ్, వైఎస్ఆర్ సీపీ నాయకుడు ఆంగోతు కృష్ణారావు గురువారం జూలూరుపాడులోని తన కూతురు ఝాన్సీ ఇంటికి వెళ్లారు. అక్కడ మనుమరాళ్లుతో కొద్దిసేపు గడిపి తిరిగి కరివారిగూడెం గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. కొత్తగూడెం వైపు నుంచి జూలూరుపాడుకు వస్తున్న బోర్వెల్ వాహనం.. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో గేదెలను తప్పించే క్రమంలో కృష్ణారావు ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. కృష్ణారావు అక్కడికక్కడే మృతిచెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ప్రమాద స్థలంలో కృష్ణారావు మృతదేహాన్ని చూసి కుటుంబీకులు, బంధువులు గుండెవిసేలా రోదించారు. కరివారిగూడెం గ్రామస్తులు, వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో ఘటన స్థలానికి చేరుకున్నారు. కృష్ణారావు దుర్మరణంతో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి ఎస్ఐ ఎన్.గౌతమ్ తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆంగోతు కృష్ణారావు మృతిపట్ల ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైరా ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పూర్ణకంటి నాగేశ్వరరావు, మండల కన్వీనర్ పొన్నెకంటి వీరభద్రం, రైతు విభాగం జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు దారావతు నాగేశ్వరరావు తదితరులు కూడా వేరొక ప్రకటనలో సంతాపం తెలిపారు. -
ఐక్యతతో పునర్నిర్మాణం
కొల్లాపూర్, న్యూస్‌లైన్: తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రజలందరూ సమష్టిగా భాగస్వాములు కావాలని టీజేఏసీ చైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు. కొల్లాపూర్ పట్టణంలో శుక్రవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర విజయోత్సవ సభ నిర్వహించారు. ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు సారథ్యంలో జరిగిన సభకు ముఖ్యఅతిధిగా విచ్చేసిన కోదండరాం మాట్లాడుతూ నిద్రావస్థలో ఉన్న తెలంగాణ ఉద్యమాన్ని 2009లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ద్వారా తట్టి లేపారన్నారు.అన్ని వర్గాల సంఘటిత పోరాటాల కారణంగా తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందన్నారు. ఇక్కడి ప్రజల ఐక్యతను దెబ్బతీసేందుకు సీమాంధ్రకు చెందిన కొందరు నేతలు యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అభివృద్ధిపై గ్రామ స్థాయి నుంచి ప్రణాళికలు రూపొందించాలని, వాటి అమలు కోసం సమిష్టిగా కృషిచేద్దామన్నారు. కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకుని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు తెలివైన వారని, జిల్లా అభివృద్ధికి వారు కష్టపడతారని కొనియాడారు. ప్రజాకవి దేశపతి శ్రీనివాస్ ప్రసంగిస్తూ తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో కేసీఆర్ పాత్ర విశిష్టమైందన్నారు. అమరుల త్యాగఫలాలను స్మరించుకుందామన్నారు. తెలంగాణ పాటలతో ఆయన సభకు విచ్చేసిన వారిని ఉత్సాహపరిచారు. కేసీఆర్ ద్వారానే అభివృద్ధి :స్వామిగౌడ్ తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కేసీఆర్ ద్వారానే సాధ్యమని ఎమ్మెల్సీ స్వామిగౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీనే గెలిపించాలని, మిగతా పార్టీలకు డిపాజిట్లు కూడా రాకూడదని ఆయన కోరారు. తెలంగాణ కోసం పదవులను, పార్టీలను వదులుకున్న జూపల్లి కృష్ణారావు, మందాజగన్నాథంలను మరోమారు ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలిపించాలని కోరారు. శ్రీకాంతాచారి వంటి అమరుల త్యాగఫలమే రాష్ట్ర ఏర్పాటన్నారు. ఈ ప్రాంత టీడీపీ నాయకులు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన చంద్రబాబు నాయకత్వాన్ని వ్యతిరేకించాలన్నారు. టీఆర్ఎస్దే అధికారం : మందా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలుపొందుతారని, టీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పా టు ఖాయమని ఎంపీ మందాజగన్నాథం అన్నారు. 1969 నుంచి తా ను తెలంగాణ ఉద్యమంలో భాగస్వామిగా ఉన్నానన్నారు. ఏపార్టీలో ఉన్నా వాదాన్ని వి నిపించానని చెప్పారు. హైద్రాబాద్‌ను అభివృద్ధి చేసింది తానేనని చెప్పుకుంటున్న చంద్రబాబు చార్మినార్, ఉస్మాని యా క్యాంపస్, ఆస్పత్రి కట్టినప్పుడు కూడా ఉన్నారా అని ప్రశ్నించారు. తెలంగాణ జోలికి రావద్దని హితవు పలికారు. పీడ విరగడైంది: జూపల్లి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం ద్వారా జిల్లాకు పట్టిన పీడ విరగడైందని పరోక్షంగా మాజీ మంత్రి డీకే అరుణపై ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ఆరోపణలు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు మాట ఇచ్చి నిలబెట్టుకున్న సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. సభలో పలువురు జిల్లా, నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. -
గ్రామ రెవెన్యూ సదస్సులు రద్దు
కడప కలెక్టరేట్,న్యూస్‌లైన్: లోక్‌సభ, రాష్ట్ర శాసన సభ సాధారణ ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ మార్చి మొదటి వారంలో వెలువడుతుందన్న సమాచారం కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అందడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 10వ తేదీ నుంచి చేపట్టాలని నిర్ణయించిన గ్రామ రెవెన్యూ సదస్సులను రద్దు చేసింది. రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఐవైఆర్ కృష్ణారావు గురువారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. ఎన్నికల షెడ్యూలు వెలువడక మునుపే ప్రిపరేటరీ వర్క్ నిర్వహించాల్సి ఉంటుంది. గతనెల 31వ తేదీ ఓటర్ల తుది జాబితాను అధికారికంగా ప్రకటించారు. అయితే, ఇంకా జాబితాల ముద్రణ పూర్తి కాలేదు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ పర్సనల్స్ జాబితాలను తయారు చేయాల్సి ఉంటుంది. వీటిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపి ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఎన్నికల్లో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు, ఫ్రీ అండ్ ఫెయిర్‌గా ఎన్నికలు జరగడానికి శాంతిభద్రతల కార్యచరణ ప్రణాళికను రూపొందించాల్సి ఉంటుంది. రెవెన్యూ, పోలీసులు సమన్వయంతో ఈ ప్రణాళికలను రూపొందించాల్సి ఉంటుంది. ఇలా అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాక రాష్ర్ట ముఖ్య ఎన్నికల అధికారులతో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సమావేశం నిర్వహిస్తారు. అనంతరం షెడ్యూల్ విడుదల చేయడం ఆనవాయితీగా వస్తుంటుంది. ప్రీ ఎలక్షన్ వర్క్ జరగకుంటే ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఆటంకాలు ఏర్పడతాయి. ఈ పరిస్థితుల్లో ఈనెల 25వ తేది వరకు రెవెన్యూ సదస్సులు అంటూ అధికారులు గ్రామాలకు వెళితే పనులన్నీ కుంటుపడిపోతాయి. గడువులోపు ఎన్నికలు నిర్వహించడం కష్టమవుతుంది. అందువల్ల ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టరాదంటూ రెవెన్యూ ఉద్యోగులు ఎన్జీఓలతో కలిసి సమ్మెలో పాల్గొంటున్నారు. వీఆర్ఏ నుంచి తహశీల్దార్ వరకు సమ్మెలో కొనసాగుతున్నారు. ఈపరిస్థితుల్లో ఎన్నికలకు సంబంధించిన ముందస్తు పనులు ఎలా పూర్తి చేయాలో అర్థంగాక రాష్ర్ట స్థాయి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈసీఐ ఆదేశాల మేరకు జిల్లానుంచి 45 మంది తహశీల్దార్లను బదిలీ చేయాలని నిర్ణయించారు. అయితే బదిలీ ఉత్తర్వులను తీసుకోరాదని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది. అదే జరిగితే ఎన్నికల ప్రక్రియకు ఆటంకాలు తప్పవని భావిస్తున్నారు. ఎలాగూ రెవెన్యూ సదస్సులు రద్దయ్యాయి గనుక ఈ వారంలో గ్రామసభలు నిర్వహించి కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు పంపిణీ చేయాలని, ఈ-పాస్ పుస్తకాలపై రైతులకు అవగాహన కల్పించాలని సీసీఎల్ఏ కృష్ణారావు అధికారులను ఆదేశించారు. -
రెడీ..
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఫిబ్రవరి 2వ తేదీ జరగనున్న గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ రెవెన్యూ సహాయకుల పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఇందులో భాగంగా పరీక్షల నిర్వహణకు అవసరమైన చీఫ్ సూపరింటెండెంట్లు, ఫ్లైయింగ్ స్క్వాడ్స్, పరిశీలకుల వంటి సిబ్బంది నియామకాలను పూర్తి చేశారు. మూడు వందల కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పరీక్షలు రాసే కేంద్రానికి ప్రత్యేకంగా అదనపు చీఫ్ సూపరింటెండెంట్లు నియమించారు. ఇప్పటికే జిల్లా కేంద్రానికి ప్రశ్నపత్రాలు వచ్చాయి. వీటిని పరీక్ష కేంద్రాలకు చేర్చడం, తిరిగి సమాధాన పత్రాలను జిల్లా కేంద్రానికి వచ్చేందుకు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పరీక్షల్లో అవకతవకలకు ఆస్కారం లేకుండా వీడియో చిత్రీకరణ చేపట్టనున్నారు. పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఐవైఆర్ కృష్ణారావు పలుమార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులకు సూచనలిచ్చారు. జిల్లాలో 27 వీఆర్ఓ పోస్టులకు గానూ 28,352 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీఆర్ఏ పోస్టులు 128 ఉండగా 888 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎస్టీ కేటగిరి క్రింద 4, బీసీ-ఎ క్రింద 4, ఎక్స్‌సర్వీస్ మెన్ (మహిళ) కోటా క్రింద ఒకటి, అంధ మహిళలు 13 వెరసి 22 వీఆర్ఏ పోస్టులకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. పరీక్షల వివరాల ఏర్పాట్లు : వచ్చేనెల 2వ తేదీ ఉదయం 10 నుంచి 12గంటల వరకు వీఆర్ఓ పరీక్షలు, అదేరోజు మధ్యాహ్నం 3నుంచి 5గంటల వరకు వీఆర్ఏ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం కడపలో 38 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి ప్రొద్దుటూరులో 16 కేంద్రాలను గుర్తించారు. ఇక రాజంపేటలో 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 64 పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, ఫర్నీచర్, విద్యుత్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద అవసరమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షా సమయం కంటే ఒక గంట ముందుగానే అభ్యర్థులు కేంద్రాల వద్దకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈనెల 19వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా పంపిన దరఖాస్తుల్లో ఫోటోలు సరిగా కనిపించకుండా ఉండడం, లేదా సంతకాలు సక్రమంగా లేనివి 344 వాటిని అధికారులు ఇప్పటికే గుర్తించారు. అలాంటి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకొని పరీక్షా కేంద్రాల వద్దకు వెళితే అనుమతించరు. అలాంటి అభ్యర్థులు మూడు పాస్‌పోర్టు సైజు ఫోటోలపై గెజిటెడ్ అధికారుల సంతకం చేయించి ఇన్విజిలేటర్‌కు సమర్పిస్తే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఒకరి బదులు మరొకరు పరీక్షలను రాయకుండా ఉండేందుకోసం అభ్యర్థుల వేలిముద్రలను స్వీకరించనున్నారు. -
వెబ్సైట్లో ప్రభుత్వ భూములు
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్‌లైన్ : ప్రభుత్వ భూముల సమాచారం పొందుపరిచేందుకు ప్రభుత్వం ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించిందని రాష్ట్ర భూపరిపాలన చీఫ్ కమిషనర్ ఐవైఆర్.కృష్ణారావు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఆయన మంగళవారం కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వభూమి పరిరక్షణ, వీఆర్వో, వీఆర్ఏల పోస్టులభర్తీకి సంబధించిన పరీక్ష నిర్వహణ, మీ-సేవా, ఆధార్ కార్డుల నమోదు, కోర్టు కేసుల పెండింగ్ తదితర అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి వాటి వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15వ తేదీలోపు ఈ సమాచారాన్ని అప్లోడ్ చేయాలని సూచించారు. వీఆర్వో, వీఆర్ఏ పోస్టుల భర్తీ కోసం పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసేందుకు పలు సూచనలు చేశారు. జిల్లా ప్రధాన కేంద్రంలో ఉన్న విద్యాసంస్థల్లో పరీక్ష నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లా ప్రధాన కేంద్రంలో ఉన్న విద్యాసంస్థలు సరిపోకపోతే రెవెన్యూ డివిజన్ ప్రధాన కేంద్రంలో నిర్వహించాలన్నారు. జిల్లాలో ఆధార్ నమోదు వేగవంతం చేయాలని సూచించారు. వివిధ సంస్థలకు కేటాయించిన ప్రభుత్వ భూములు వినియోగించకుండా ఖాళీగా ఉంచితే ఆ సంస్థలకు నోటీసులు జారీ చేయాలని చెప్పారు. కోర్టు కేసులు, పెండింగ్ ఆడిట్ అభ్యంతరాలు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, జాయింట్ కలెక్టర్ ఉషాకుమారి, డీఆర్వో విజయచందర్, సబ్ కలెక్టర్లు హరిచందన, చక్రధరరావు, ఆర్డీవోలు పి.సాయిబాబు, వెంకటసుబ్బయ్య, అర్బన్ ల్యాండ్ భూసేకరణ ప్రత్యేకాధికారి ఎన్.రమేష్‌కుమార్, ట్రైనీ కలెక్టర్ కాళీచరణ్సుందరావు, డీఐవో శర్మ, కలెక్టరేట్ ఏవో ఇందిరాదేవి తదితర సెక్షన్ల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. భూగర్భజలాల పర్యవేక్షణకు చర్యలు.... భూగర్భ జలాల పర్యవేక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో మంగళవారం భూగర్భజలాల హైడ్రాలజికల్ డేటా యూజర్స్ గ్రూపు కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ ఇరిగేషన్, డ్రెయినేజీ, ఆర్డబ్ల్యూఎస్, రెవెన్యూ సంబంధితశాఖల అధికారుల సహకారంతో హైడ్రాలజీ విభాగం అధికారులు భూగర్భజలాల అధిక వినియోగం వల్ల కలిగే దుష్ఫలితాలు తాగునీరు, సాగునీరు పొదుపుగా వాడుకోవటం తదితర అంశాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. హైడ్రాలజీ ప్రాజెక్టు గుంటూరు డివిజన్ ఈఈ పి.అరుణ, డ్వామా పీడీ అనిల్‌కుమార్, మైక్రో ఇరిగేషన్ పీడీ మంజుల, హార్టికల్చర్ ఏడీ సుబానీ, భూగర్భ జల విభాగం రాజమండ్రి డివిజన్ సహాయ పరిశోధనాధికారి రత్నప్రశాంతి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ అమరేశ్వరరావు, సీపీవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఉపాధి కూలీలకు బీమా
ఉప్పునుంతల/బల్మూరు, న్యూస్‌లైన్: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసే ప్రక్రియను పరిశీలిస్తున్నామని, ఈ విషయమై ఇప్పటికే కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపా రు. ఈజీఎస్ సమాఖ్యలను మరింత పటిష్టం చేయాలని, ఇక్కడ మంచిఫలితం వస్తే రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తామన్నారు. ఉపాధి కూలీలందరికీ బీమా సౌకర్యం కల్పిస్తామని భరోసాఇచ్చా రు. ఆదివారం ఉప్పునుంతల, మామిళపల్లిలో శ్ర మశక్తి సమాఖ్యల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహబూబ్‌నగర్, అనంతపురం జిల్లాలో పథకాన్ని పకడ్బందీగా అమలుచేసేందుకు చర్య లు తీసుకుంటున్నామని చెప్పారు. గ్రామస్థాయి లో కూలీలను సంఘాలుగా ఏర్పాటు చేసి శ్రమశక్తి సమాఖ్యలకు హక్కులు కల్పిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3500ఎకరాల చెంచుల భూములను సాగులోకి తీసుకొస్తామన్నారు. కూలీలు ఈజీఎస్ ను ఉపయోగించుకోవడంతోపాటు వచ్చిన డబ్బుతో తమ పిల్లలను చక్కగా చదివించుకోవాలని సూచించారు. అందులోనే కొంత డబ్బులను పొదుపు చేసుకుంటే ఇతర అవసరాలను తీర్చుకునే వీలుంటుందన్నారు. ఇకముందు ఏయే మార్పులు వస్తే మరింత బాగుంటుందనే అంశాలను కూలీలను నేరుగా మంత్రి అడిగి తెలుసుకున్నారు. గతంలో పథకం లేని రోజుల్లో వ్యవసాయ పనులు లేనప్పుడు పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే వాళ్లమని ఈజీఎస్ వచ్చిన తర్వాత ఉళ్లోనే పనులు చేసుకొని ఉపాధి పొందుతున్నామని సమాఖ్యల ప్రతినిధులు మంత్రికి వివరించారు. ప్రస్తుతం కుటుంబానికి కల్పిస్తున్న వందరోజులు సరిపోవడంలేదని మరో వంద రోజులు పనిదినాలు పెంచడంతోపాటు ప్రస్తుతం ఇస్తున్న కూలీ రేటును రూ.250కి పెంచాలని ప్రతినిధులు మంత్రికి విన్నవించారు. పనిదినాలు పెంచండి: ఎమ్మెల్యేలు రాములు, జాపల్లి ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే కూలీలతో పాటు రైతులు లబ్ధిపొందుతారని అచ్చంపేట ఎమ్మెల్యే రాములు, కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మంత్రికి వివరించారు. కూలీలకు అదనంగా వందరోజులు కల్పించడంతోపాటు రూ.250 వేతనం ఇవ్వాలన్నారు. సమాఖ్యల సమావేశాలు నిర్వహించుకోవడానికి గ్రామ స్థాయిలో ఓ భవనం కట్టించాలని జూపల్లి మంత్రికి విన్నవించారు. అచ్చంపేటలో ఈజీఎస్ సిబ్బందికి ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుచేయడంతోపాటు భూమిలేని నిరుపేద కూలీలకు కనీసం రెండెకరాల భూమి ఇచ్చేవిధంగా కృషిచేయాలని ఎమ్మెల్యే రాములు మంత్రిని కోరారు. చెంచులు వ్యవసాయ రంగంలో రాణించాలి చెంచులు ఐటీడీఏ ద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకుని వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధించాలని మంత్రి ఆకాం క్షించారు. బల్మూరు మండలం బాణాలలో ఐటీడీఏ ద్వారా ఇందిర జలప్రభ పథకంలో పదెకరాల చెంచుల భూముల్లో రూ.5.60లక్షల వ్యయంతో వేసిన బోరును ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ చెం చుల వలసల నివారణకు ప్రత్యేక ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పిస్తామన్నారు. అంతే కాకుండా ఐటీడీఏ పరి ధిలో 3500 ఎకరాల చెంచుల భూముల్లో బోర్లు వేయాడానికి ప్రణాళిక సిద్ధంచేసినట్లు తెలిపారు. -
పశువుల డాక్టర్ల ఫైటింగ్
=రైతుల ముందే కొట్లాట =ఒకరు పశు సంవర్ధక శాఖ ఏడీ, మరొకరు పశు వైద్యాధికారి రాంబిల్లి, న్యూస్‌లైన్: ఇద్దరు బాధ్యత గల అధికారులు దూషించుకున్నా రు. ఒకరిపై ఒకరు కల బడ్డారు. అందరూ చూస్తుండగా వాదులాడుకున్నారు. వీరి వైఖరిని చూసిన వారంతా విస్తుపోయారు. ఒకరు పశు సంవర్ధక శాఖ ఏడీ, మరొకరు రాంబిల్లి పశు వైద్యాధికారి కావడం విశేషం. ఈ సంఘటన గురువారం రాంబిల్లి పశువైద్య శాలలో జరిగింది. రైతులు, సిబ్బంది, ఎస్ఐ కృష్ణారావు కథనం ప్రకారం ఉదయం 8.15 నిమిషాలకు పశు సంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ రాజ్‌కుమార్ రాంబిల్లి పశువైద్యశాలకు తనిఖీ నిమిత్తం వచ్చారు. డాక్టర్ అనిల్‌కుమార్ 10.10 గంటలకు ఆస్పత్రికి చేరుకొని తన గదిని తెరవడంతో ఏడీ కూడా లోపలికి వెళ్లారు. లోపల గడియ పెట్టడంతో సిబ్బంది, రైతులు గదిలోకి వెళ్లలేదు. కాసేపయ్యాక గదిలో నుంచి పెద్ద ఎత్తున కేకలు వినిపించడంతో అందరూ చేరుకుని తలుపును తెరిచారు. ఆ సమయంలో పశు సంవర్థక శాఖ ఏడీ, పశు వైద్యాధికారి పెనుగులాడుతున్న దృశ్యం కనిపించడంతో అంతా విస్తుపోయారు. రిజిస్టర్లో సంతకం చేయకుండా అడ్డుకున్న తనను కొట్టారని ఏడీ ఆరోపించగా, ఏడీ తన చెంపపై కొట్టారని డాక్టర్ అనిల్‌కుమార్ చెప్పారు. సమాచారం అందుకున్న ఎస్ఐ వి.కృష్ణారావు ఆస్పత్రికి చేరుకొని అధికారులు, రైతులు, సిబ్బందిని విచారించారు. అనంతరం ఏడీ డాక్టర్ రాజ్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ డాక్టర్ అనిల్‌కుమార్ సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని పలువురు రైతులు ఫిర్యాదు చేశారని తెలిపారు. తుపాను ఫీడ్ పంపిణీ చేయలేదని, దాని రికార్డులు లేవన్నారు. మూడు నెలల క్రితం వేయాల్సిన టీకాలు రిఫ్రిజిరేటర్లో ఉన్నాయన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు. డాక్టర్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ కావాలనే తనను ఏడీ వేధిస్తున్నారని ఆరోపించారు. ఎస్ఐ కృష్ణారావు మాట్లాడుతూ కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్
పాలకొల్లుటౌన్, న్యూస్‌లైన్ : కోల్‌కతా నుంచి నకిలీ కరెన్సీ నోట్లను తీసుకువచ్చి పాలకొల్లు పరిసర గ్రామాల్లో చెలామణి చేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను మంగళవారం అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ జీవీ కృష్ణారావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన దబ్బా శాంతకుమార్ రోల్డ్‌గోల్డ్ వ్యాపారంలో నష్టం వచ్చి సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో నకిలీ కరెన్సీ మారుస్తున్నాడు. శాంతకుమార్‌ను నకిలీ కరెన్సీ చెలామణికి సంబంధించి నరసాపురం, అన్నవరం, బనగాలపల్లి, సిద్దావటం, బొమ్మూరు, హైదరాబాద్‌ల్లో గతంలో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిశారు. అతని తమ్ముడు దబ్బా రవికుమార్ రూ.1.50 లక్షల నకిలీ కరెన్సీ నోట్లతో పరారయ్యాడు. వీరికి సహకరిస్తున్న పట్టణానికి చెందిన బంగారు శ్రీనివాస్, దిద్దే చిట్టిబాబు, నరసాపురం పట్టణానికి చెందిన ఎస్.అప్పారావు, ఎ.పెద్దిరాజులు నరసాపురం రోడ్డులోని అయ్యప్పస్వామి గుడి వద్ద సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం అందడంతో అరెస్ట్‌చేసి వారి నుంచి రూ.20 వేలు నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా 15 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. నిందితుల అరెస్ట్‌కు ఆచంట ఎస్సై బి.కృష్ణకుమార్, పట్టణ ఎస్సై జి.సుబ్బారావు, ఏఎస్సై రమేష్, సిబ్బంది సహకరించారన్నారు.