టీడీపీ హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తోంది: వైఎస్ఆర్సీపీ
కంచికచర్ల: టీడీపీ హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఎమ్మెల్యే రక్షణనిధి, పార్థసారధి, ఉదయభాను ఆరోపించారు. హత్యలకు పాల్పడుతున్న టీడీపీ నేతలకు
మంత్రి దేవినేని ఉమ అండగా ఉంటున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. పోలీసులు సరైన సమయంలో స్పందిస్తే కృష్ణారావు హత్య జరిగేదే కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రత్యర్ధుల దాడిలో మరణించిన గొట్టిముక్కల గ్రామ ఉపసర్పంచ్ కృష్ణారావు కుటుంబసభ్యులను ఎమ్మెల్యే రక్షణనిధి, పార్థసారధి, ఉదయభాను పరామర్శించారు. కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం గొట్టిముక్కల గ్రామ ఉప సర్పంచ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కృష్ణారావును సోమవారం తెల్లవారు జామున ప్రత్యర్థులు దాడిలో దారుణ హత్యకు గురయ్యారైన సంగతి తెలిసిందే.