devineni uma
-
దేవినేని ఉమా, ఎమ్మెల్యే వసంత కృష్ణ వర్గీయులు రచ్చ రచ్చ
-
బాబు పక్కకు నెట్టేశారు.. అజ్ఞాతంలోకి దేవినేని ఉమ!
సైకిల్ పార్టీలో ఒకప్పుడాయన ఎంతో కీలక నేత. జిల్లాలో ఎక్కడ పార్టీ కార్యక్రమం జరిగినా ఆయన ఉండాల్సిందే. అంతటి కీలక నాయకుడికి ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకుండా పక్కకు నెట్టేశారు. ఆయన ప్రత్యర్థికి టిక్కెట్ ఇచ్చినా కామ్‌గా ఉండిపోయారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చినా పార్టీలో ఎక్కడా కనిపించడంలేదని టాక్ నడుస్తోంది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆ నేత ఇప్పుడెందుకు అజ్ఞాతంలో ఉంటున్నారు? ఇంతకీ ఆ నేత ఎవరు? తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతల్లో కీలకంగా, చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉన్నవారిలో దేవినేని ఉమా మహేశ్వరరావు ఒకరు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇరిగేషన్ మంత్రిగా కూడా పనిచేశారు. అదంతా గత వైభవం. ఇప్పుడు దేవినేని ఉమా పేరు పార్టీలో ఎక్కడా వినిపించడంలేదు. 2014 ఎన్నికల్లో కృష్ణాజిల్లా మైలవరం నుంచి అసెంబ్లీకి ఎన్నికై చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత దేవినేనికి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయన వ్యవహరించే తీరుతో నియోజకవర్గంలోని ముఖ్య నేతల నుంచి క్యాడర్ వరకు దేవినేని ఉమ మీద తిరుగుబాటు చేశారు. ఈసారి ఉమకు టిక్కెట్ ఇవ్వడానికి వీల్లేదని పార్టీ నాయకత్వానికి తెగేసి చెప్పారు.అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్న వసంతకృష్ణ ప్రసాద్ టీడీపీలోకి ఫిరాయించి మైలవరం టిక్కెట్ దక్కించుకున్నారు. వసంతకు టిక్కెట్ ఇచ్చిన చంద్రబాబు అప్పటివరకు పార్టీలో కీలకంగా ఉన్న దేవినేని ఉమను సైడ్ చేసేశారు. ఎన్నికల్లో పార్టీ గెలిస్తే మంచి రోజులొస్తాయని అధినేత చెప్పిన మాటను కాదనలేక తప్పనిసరి పరిస్థితుల్లో మైలవరంలో వసంతకు దేవినేని సహకరించారని టాక్. ఇంతవరకూ బాగానే ఉంది..టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవినేని ఉమాను పార్టీ అధినేతతో సహా ఎవరూ పట్టించుకోవడం మానేశారని సమాచారం.చంద్రబాబు మాటకు కట్టుబడి ఎన్నికల్లో వసంత గెలుపు కోసం కృషి చేసిన దేవినేని ఇప్పుడు కనీసం గుర్తింపు కూడా లేకుండా పోయిందట. ఎమ్మెల్యే టిక్కెట్ దక్కకపోయినా ... టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కచ్చితంగా తనకు సముచిత స్థానం దక్కుతుందని భావించిన దేవినేని ఉమాకు నిరాశే ఎదురయ్యిందట. అందుకే ఇప్పుడాయన పార్టీలో అందరికీ దూరంగా ఉంటున్నారట. కూటమి ఘన విజయం సాధించినా పార్టీ సంబరాల్లో ఉమా ఎక్కడా పాలు పంచుకోలేదట. అధినేతను కలిసి కనీసం శుభాకాంక్షలు కూడా తెలిపింది లేదట. ఇక సాక్షాత్తూ ప్రధానమంత్రి సమక్షంలోనే తమ నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా ..ఎవరితోనూ సంబంధం లేకుండా కామ్ గా ఎక్కడో ఓ మూలన కూర్చుని వెళ్ళిపోయారట.ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, పార్టీ అధికారంలోకి వచ్చింది గనుక చంద్రబాబు తనకు ఏదోరూపంలో ప్రాధాన్యం కల్పిస్తారని దేవినేని ఉమా నమ్మారట. అయితే పరిస్థితులు తనకు అనుకూలంగా లేవని తేలిపోవడంతో ఇక టీడీపీతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారట. దీంతో ఇప్పుడు అటు టీడీపీలోనూ.. ఇటు మైలవరంలోనూ తెలుగుతమ్ముళ్ల చర్చంతా దేవినేని చుట్టూనే తిరుగుతోందట. ఒకప్పుడు పార్టీలో కింగ్ మేకర్లా వ్యవహరించిన దేవినేని ఉమా ప్రస్తుత దీన పరిస్థితి తలుచుకుని తెగ ఫీలైపోతున్నారట. అసలు పార్టీలో ఎవరితోనూ కలవడంలేదనే టాక్ నడుస్తోంది. -
అజ్ఞాతంలో దేవినేని ఉమా..?
-
జూన్ 4 తరువాత చూసుకుందాం: పెద్దిరెడ్డి
-
నువ్వా నన్ను విమర్శిస్తావ్.. దేవినేని ఉమాకు అబ్బయ్య చౌదరి కౌంటర్
-
కలసిన చేతులు.. కలవని మనసులు
జి.కొండూరు: వారిద్దరూ ఐదేళ్లుగా ఒకరిపై మరొకరు మాటల యుద్ధం చేసుకున్నారు. సభ్యత మరిచి నోటికొచ్చినట్లు తిట్టుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇద్దరూ ఒకే పార్టీ నాయకుల య్యారు. వారే వసంత కృష్ణప్రసాద్, దేవినేని ఉమామహేశ్వరరావు. ఈ ఇద్దరూ ఇప్పుడు చేతులు కలిపారు. తమ వర్గం నాయకులను కూడా కలసి పనిచేయాలని పిలుపునిచ్చారు. వసంత నామినేషన్ కార్యక్రమంలోనూ కలసి చేతులు ఊపారు. అందరం కలసి ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తామంటూ గొప్పలు చెప్పారు. ఇదంతా పైకి కనిపిస్తున్న వ్యవహారం. అంతర్గతంగా మాత్రం రెండు వర్గాలు కలసి పనిచేసే పరిస్థితి కనిపించడంలేదు. కలసి పనిచేయడం అన్న మాట అటుంచి ఒకరిపై మరొకరు నమ్మకమే ఉంచలేకపోతున్నారు.వెంటాడుతున్న వెన్నుపోటు భయంమైలవరం నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నుంచి వసంత వెంకటకృష్ణప్రసాద్, టీడీపీ నుంచి దేవినేని ఉమా పోటీ చేశారు. ఉమా ఓటమిపాలవగా వసంత ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుత ఎన్నికలు వచ్చేసరికి వసంత కృష్ణప్రసాద్ టీడీపీ గూటికి చేరారు. అతను టీడీపీలో చేరడాన్ని, ఎమ్మెల్యే టికెట్ పొందడాన్ని దేవినేని ఉమా తీవ్రంగా వ్యతిరేకించారు. అనంతర పరిణామాల్లో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు వారిద్దరూ చేతులు కలిపారు. అయితే క్షేత్రస్థాయిలో ఉమా వర్గం, వసంత వర్గం కలసి పనిచేసే పరిస్థితి కనిపించడంలేదు. ఉమా వర్గాన్ని వసంత వర్గమే కాదు టీడీపీ కేడర్ కూడా నమ్మలేకపోతోందని సమాచారం. పార్టీ ఆదేశాల మేరకు కలసి పనిచేస్తున్నట్లు నటిస్తున్నా ఓటు వేసే సమయానికి ఉమా వర్గీయులు వెన్నుపోటు పొడుస్తారనే అనుమానం వసంతను వెంటాడుతోందని పార్టీలో చర్చ జరుగుతోంది.ఉమా వర్గీయులపై నిఘాఉమా వర్గీయులపై నమ్మకం ఉంచలేని వసంత కృష్ణప్రసాద్ తన కంపెనీల్లో పని చేసే రెండు వేల మంది ఉద్యోగులను రంగంలోకి దింపారు. వారితో ఉమా వర్గంపై నిఘా ఉంచారని, అంతటితో ఆగకుండా ప్రచారం నుంచి డబ్బు పంపిణీ వరకు అన్ని పనులు ఆ ఉద్యోగులే చక్కబెట్టేందుకు సిద్ధమ య్యారని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. వసంత తీరును జీర్ణించుకోలేని ఉమా వర్గీయులు అతనితో కలిసి పనిచేయలేమని తమ నాయకుడి వద్ద వాపోతున్నారని సమాచారం.మళ్లీ ఇన్చార్జులే దిక్కా?వసంత వెంకటకృష్ణప్రసాద్ స్థానికుడు కాదు. వైఎస్సార్ సీపీకి వెన్నుపోటు పొడిచి టీడీపీలో చేరారు. దీంతో మైలవరం నియోజకవర్గంలో టీడీపీ అస్తిత్వం గందరగోళంలో పడింది. ఒక వైపు ఉమా వర్గీయులు, మరో వైపు ఆయన వ్యతిరేకులు, ఇంకో వైపు వైఎస్సార్ సీపీ నుంచి వసంతతోపాటు టీడీపీలో చేరిన చిన్నాచితకా నాయకుల వర్గంగా టీడీపీ విడిపోయింది. ఈ మూడు వర్గాల పోరుతో టీడీపీలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ఎవరిని నమ్మాలో తెలియక, ఎవరికి బాధ్యతలు ఇస్తే ఎవరికి కోపం వస్తుందోనన్న భయంతో వసంత కృష్ణప్రసాద్ తన కంపెనీల నుంచి ఉద్యోగులను దింపి పెత్తనమంతా వారికే అప్పజెప్పారు. వైఎస్సార్ సీపీలో ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న వసంత, స్థానికులను కాదని మండలానికి ఒక ఇన్చార్జ్ని నియమించి పార్టీలో వర్గ పోరుకు కారణమయ్యారు. ఇప్పుడు టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో వసంత తీరును చూసిన టీడీపీ కేడర్, ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మళ్లీ ఇన్‌చార్జులతోనే పాలన చేస్తాడేమోనని ఆందోళనచెందుతోంది.మద్యం కేసులో ఉమా వర్గీయులు‘సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్నట్లు కష్టం మాది, కేసులు మాకు, పెత్తనం మీకా?’ అంటూ ఉమా వర్గీయులు కుమిలిపోతున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తెలంగాణ నుంచి భారీగా మద్యం తరలిస్తూ పట్టుబడిన చేబ్రోలు రాజు, మరో నలుగురు నిందితులు సైతం ఉమా వర్గానికి చెందిన నాయకులే. పట్టుబడిన మద్యంతో తనకు ఎటువంటి సంబంధంలేదని వసంత తప్పుకోవడంతో ఉమా వర్గీయులు మరింత ఆవేదన చెందుతున్నారని సమాచారం. కావాలనే మద్యం రవాణా, పంపిణీ వంటి అసాంఘిక కార్యకాలపాలను తమకు అప్పజెప్పి పెత్తనం మాత్రం వసంత అనుచరులు, ఆయన కంపెనీల ఉద్యోగులు చేస్తున్నారని ఉమా వర్గీయులు రగిలిపోతున్నారు. ఐదేళ్లు తమ నాయకుడికి జరిగిన అవమానంతో పాటు తమకు నియోజకవర్గంలో ఎదురవుతున్న క్షోభకు తగిన బుద్దిచెప్పాలని ఉమా వర్గీయుల్లో చర్చ జరుగుతోందని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. -
గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు
-
‘ఈ ఎన్నికలు.. టీడీపీకి చావుబతుకుల సమస్య’
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: మైలవరం టీడీపీ సీటుపై సందిగ్ధత వీడలేదు. ఉమా సైలెంట్ అయినా.. టిక్కెట్ కోసం బొమ్మసాని సుబ్బారావు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కృష్ణప్రసాద్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 2024 ఎన్నికలు చాలా కీలకమని, టీడీపీకి చావు బతుకుల సమస్య అంటూ కార్యకర్తల సమావేశంలో వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నేనే మైలవరం అభ్యర్ధి అనుకోవద్దు. నాకు మద్దతివ్వండి.. నాకు టిక్కెట్ ఇస్తేనే సహకరించండని నేను అనడం లేదు. నేను, దేవినేని ఉమా కాకుండా మూడో వ్యక్తి వచ్చినా అంతా కలిసి పనిచేద్దాం. అభ్యర్థిగా పార్టీ ఎవరిని ప్రకటించినా రేపు ప్రచార వాహనంపై అంతే ధీటుగా పని చేస్తా. నాకు, దేవినేని ఉమాకు మధ్య 20 సంవత్సరాల నుంచి రాజకీయ విభేదాలు ఉన్నాయి. టీడీపీకి చావు బతుకుల సమస్య’’ అంటూ వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. మరోవైపు, స్థానికులకే సీటు కేటాయించాలంటూ మైలవరం తెలుగు తమ్ముళ్లు పట్టుబడుతున్నారు. వసంత కృష్ణప్రసాద్‌కు టీడీపీ శ్రేణులు మైలవరం టిక్కెట్ ఇవ్వొద్దంటున్నాయి. స్థానికుడినైన తనకే టిక్కెట్ ఇవ్వాలని బొమ్మసాని సుబ్బారావు అంటున్నారు. వరుస బలప్రదర్శనలతో చంద్రబాబును బొమ్మసాని కలవరపెడుతున్నారు. ఇదీ చదవండి: ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్సీలపై వేటు -
చంద్రబాబుకు కొత్త టెన్షన్.. టీడీపీలో మూడు ముక్కలాట
సాక్షి, ఎన్టీఆర్: టీడీపీలో టికెట్ల పంచాయితీ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఎన్నికల్లో టికెట్ ఆశించిన భంగపడుతున్న నేత టీడీపీ అధినేత చంద్రబాబుకు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా కొత్త వారికి టికెట్ ఇస్తే మద్దతు తెలిపే ప్రసక్తేలేదని హెచ్చరిస్తున్నారు. దీంతో, బాబుకు కొత్త టెన్షన్ పట్టుకున్నట్టు రాజకీయంగా చర్చ నడుస్తోంది. ఇక, మైలవరం టీడీపీ ముక్కలుగా విడిపోయింది. చంద్రబాబు తీరుతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాగా, చంద్రబాబు సమక్షంలో నేడు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. ఆయన వెంట కేశినేని చిన్ని, నెట్టెం రఘురాం కూడా ఉన్నారు. అయితే, వసంత చేరికను దేవినేని ఉమా, అతని అనుచరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే వసంత చేరిక సమయంలో కూడా ఉమా కనిపించలేదు. మరోవైపు.. వసంత కృష్ణప్రసాద్‌ను పార్టీలో చేర్చుకోవద్దని గతంలోనే దేవినేని ఉమా.. చంద్రబాబుకు చెప్పాడు. అయినప్పటికీ ఉమా మాటలను చంద్రబాబు లైట్ తీసుకున్నాడు. ఈ క్రమంలో ఉమ తన అనుచరులతో కలిసి నిన్న(శుక్రవారం) పార్టీ అధినేతపై తిరుగుబాటు చేశారు. ఎవరో వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే సహకరించేదిలేదని తెగేసి చెప్పారు. ఉమా వర్గం మరో అడుగు ముందుకేసి ఉమాను కాదని మరో వ్యక్తికి మైలవరం టికెట్ కేటాయిస్తే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. వసంత రాకను ఉమాతో పాటుగా బొమ్మసాని సుబ్బారావు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొత్తంగా టీడీపీలోకి వసంత చేరికతో పార్టీ మూడు ముక్కలుగా విడిపోయింది. -
వసంతకు ఉమా క్యాడర్ వార్నింగ్
-
వసంత వర్సెస్ దేవినేని.. మైలవరం టీడీపీ అభ్యర్థి ఎవరు?
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మైలవరం టీడీపీ రాజకీయాలు గందరగోళంగా మారాయి. టిక్కెట్టు లేదని దేవినేని ఉమాకు చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ ఆయనకు మైలవరం నియోజక వర్గం టిక్కెట్టుపై ఆశలు మాత్రం చావలేదు. ఏదో పని కలి్పంచుకొని మైలవరం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఏదో అనారోగ్యంతో సాధారణంగా చనిపోయిన, దేవినేని ఉమాకు టిక్కెట్ రాకపోవడంతో బాధతో గుండె ఆగిపోయిందని ప్రచారం చేసుకొనే స్థాయికి ఆయన దిగజారారు. మొదటి నుంచి శవ రాజకీయాలు చేయడంలో స్పెషలిస్టుగా పేరున్న దేవినేని ఉమా చివరి యత్నంగా శవరాజకీయ అ్రస్తాన్ని బయటికి తీశారు. ఇది నియోజక వర్గంలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దేవినేని ఉమా చీప్ ట్రిక్స్ చూసి, నియోజక వర్గ ప్రజలు సైతం నవ్వుకొంటున్నారు. వసంత వర్గంలో కల్లోలం.... అధిష్టానం పిలిచి మాట్లాడినప్పటికీ దేవినేని ఉమా పోకడలో ఎటువంటి మార్పు లేకపోవడంతో వసంత వెంకటకృష్ణప్రసాద్ కోటరీలో కల్లోలం మొదలైంది. దేవినేనికి మైలవరం ఎమ్మెల్యే సీటు లేదంటూ గత ఆదివారం న్యూస్ వైరల్ అయిన రోజున మైలవరం మండలం, చండ్రగూడెంకు చెందిన టీడీపీ కార్యకర్త పుల్లారావు, సోమవారం ఇబ్రహీంపట్నంకు చెందిన నూతక్కి సురేష్‌లు అనారోగ్యంతో మృతి చెందారు. అయితే ఈ ఇద్దరు టీడీపీ కార్యకర్తలు దేవినేని ఉమాకి సీటు రానందుకే మృతి చెందారని చిత్రీకరించి వీరిద్దరి కుటుంబాలను దేవినేని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఉమా అనుచరులు వసంత డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటన వైరల్ కావడంతో కల్లోలానికి గురైన వసంత వెంకటకృష్ణప్రసాద్ తన అనుచరుల చేత ఉమా శవరాజకీయాలు చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించారు. చండ్రగూడెంకు చెందిన పుల్లారావు అనారోగ్యంతోనే మృతి చెందాడని మృతుడి కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్న ఆడియోలను సైతం వైరల్ చేశారు. అంతటితో ఆగకుండా ఉమ కుటుంబ చరిత్రను సైతం టచ్ చేసి ఆయన సోదరుడు రమణ మరణానంతరం వదిన ప్రణీతను చంపింది దేవినేని ఉమానేనంటూ, ఇటీవల మృతి చెందిన ఉమా సోదరుడు చంద్రశేఖర్ మృతికి సైతం పరోక్ష కారణం ఉమానే అంటూ సోషల్ మీడియాలో వసంత వర్గీయులు పోస్టులు పెట్టడం కలకలం రేపింది. ఆది నుంచి రాజకీయ శత్రువులే.. మెలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, దేవినేని ఉమా కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. గత కొన్నేళ్లుగా ఈ రెండు కుటుంబాల మధ్య అధిపత్యపోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో దేవినేని ఉమానుకాదని, వసంత కృష్ణ ప్రసాద్‌కు సీటు కేటాయించడం అక్కడ టీడీపీ క్యాడర్‌ను గందరగోళంలోకి నెట్టింది. ఎన్నికల్లో వసంతకృష్ణ ప్రసాద్, దేవినేని ఉమాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా, దేవినేని ఉమా మాత్రం సహకరించేందుకు సిద్ధంగా లేడన్న భావన టీడీపీ క్యాడర్లో నెలకొంది. వసంతకృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరకముందే. సోషల్‌మీడియా వేదికగా వస్తున్న పోస్టులు, వారి మధ్య సాగుతున్న మాటల యుద్ధం చూస్తుంటే టీడీపీ పుట్టి మునగడం ఖాయమని భావిస్తున్నారు. నోటా ఓటు వేయాలని.... వసంత వెంకటకృష్ణప్రసాద్పై టీడీపీ అధిష్టానం సోమ, మంగళవారాల్లో సర్వే జరిపింది. వసంతకు నో చెబుతూ నోటాకే తమ ఓటు అనేలా టీడీపీ కేడర్‌ను దేవినేని ఉమా వర్గీయులు సోషల్ మీడియా ద్వారా ప్రోత్సహించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ఉమాను పెనమలూరు పంపించే ఆలోచనలో చంద్రబాబు
-
టీడీపీకి నే‘తలనొప్పి’
సాక్షి ప్రతినిధి, విజయవాడ: టీడీపీలో ఇంటిపోరు రోడ్డున పడుతోంది. జనసేనతో టికెట్ల పంచాయితీ తేలక ముందే తెలుగు తమ్ముళ్లు రచ్చకెక్కుతున్నారు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా అంతర్గత విభేదాలను తట్టుకొలేక పార్టీ నాయకత్వంపై పరోక్షంగా ధ్వజమెత్తారు. పార్టీలో కొత్త వారి చేరికలను వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో ఆదివారం జరిగిన ‘టౌన్ హాల్ మీటింగ్ విత్ లీడర్’ అనే కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో అసమ్మతి గళానికి అద్దం పట్టాయి. మైలవరం నుంచి దేవినేని ఉమాకు టికెట్ లేదని ఇప్పటికే చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దానిని బలపరుస్తూ తాజా రాజకీయ పరిణామాలు జోరందుకున్నాయి. అవమాన భారంతో.. మైలవరం నుంచే పోటీ చేస్తానని ఉమా చెబుతున్నా శ్రేణులు, అధిష్టానం ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ఉంటే ఉండు.. పోతే పో.. అన్న రీతిలో పార్టీ పెద్దలు వ్యవహరిస్తుండటంతో ఉమాలో అసహనం పెరిగిపోతోంది. ఫలితంగా అవమానభారంతో ఉమా అధిష్టానానికి పరోక్షంగా హెచ్చరికలు చేస్తూ గుంటుపల్లి సమావేశంలో తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ‘వందల కోట్ల రూపాయలు ఇస్తాం అని వస్తున్న రాజకీయ వ్యభిచారులను తరిమికొట్టాలి’ అని ఆయన పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపుతోంది. ‘పసుపు కండువా కప్పుకొని చచ్చిపోతాను తప్ప పార్టీని వీడను. ఫిబ్రవరి రెండో వారంలో అన్నేరావుపేట నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తా’ అని ఉమా చెప్పడంతో పరోక్షంగా చంద్రబాబు, చినబాబుకే హెచ్చరికలు జారీ చేస్తున్నారని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. మరోవైపు ‘పార్టీలో నేను పెద్దతోపును. తనది రెండో స్థానం. నేను తలచుకొంటే ఎవరికైనా టికెట్ ఇప్పిస్తాను’ అని గొప్పలు చెప్పుకొనే ఉమాకు పట్టిన దుస్థితి చూసి పలువురు నేతలు నవ్వుకొంటున్నారు. తాను తలుచుకొంటే మైలవరంతోపాటు, నందిగామ నియోజకవర్గంలో పార్టీని దెబ్బ తీయగలనని ఆయన అధిష్టానానికి సంకేతాలు పంపినట్టు చర్చ జరుగుతోంది. అయితే ఉమా వ్యవహారశైలిని అధిష్టానం లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయనపైన ప్రతిదాడి చేయాలని కొందరు నేతలకు ఇప్పటికే సూచించినట్లు పార్టీ వర్గాల్లో∙చర్చ సాగుతోంది. ముద్దరబోయిన అసంతృప్తి నూజివీడు టీడీపీలో అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు ఈసారి టికెట్ లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. దీనిపై బాబును కలిసి మాట్లాడేందుకు ముద్దరబోయిన యత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన తన వర్గీయులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోసారి అధిష్టానంతో మాట్లాడి ఫలితం లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు చర్చ సాగుతోంది. విజయవాడ వెస్ట్‌లో తాప‘త్రయం’ విజయవాడ వెస్ట్‌లో టికెట్ కోసం మూడు వర్గాలు కత్తులు దూసుకుంటున్నాయి. పేపరు పులిగా పేరొందిన బుద్దా వెంకన్న ర్యాలీలు చేస్తూ తనకు టీడీపీ టికెట్ ఇవ్వాలని పట్టుపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ విజయవాడ వెస్ట్ టికెట్ తనదేనని ఇప్పటికే ప్రకటించుకున్నారు. ‘అందరూ టికెట్ అడుగుతారు కానీ గెలిచే స్తోమత ఉండాలి. మంచి విలువలు ఉండాలి. నాకు సీటు ఇవ్వకపోతే ముస్లిం మైనార్టీలు ఉరివేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నేనే ఎమ్మెల్యే అభ్యర్థినవుతా’ అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. జనసేన మాత్రం పొత్తులో భాగంగా సీటు తమకే వస్తుందని చెబుతోంది. ఆ పార్టీ నేత పోతిన మహేష్ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. జనసేన, టీడీపీ సీట్లు సర్దుబాటు కాకముందే ఇక్కడ ఆ పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. -
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు లీగల్ నోటీసు
-
ఉమా..గిమా..వాడెవడు...దేవినేని ఉమాపై RGV సెటైర్లు
-
దేవినేని ఉమాకు లోకేష్ షాక్.. రూ.35 కోట్లు డిపాజిట్ చేస్తేనే టికెట్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీలో టికెట్ల గోల మొదలైంది. కేవలం డబ్బున్నోళ్లకే చంద్రబాబు టికెట్లు కట్టబెడుతున్నారనే ప్రచారం ఆ పార్టీలో జోరుగా సాగుతోంది. సీనియర్లు అయినా, పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వారైనా సరే పట్టించుకోకుండా కేవలం కరెన్సీ కట్టలు తేగలిగిన వారికే టికెట్లు ఇస్తామని ఆ పార్టీ అధినేత చెబుతున్నారు. ధనం మూలం ఇదం ‘దేశం’అనే ఆర్యోక్తిని చంద్రబాబు బాగా వంట పట్టించుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డికి సంక్షేమ, అభివృద్ధి సుపరిపాలనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. 2019 ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ వైఎస్సార్ సీపీ ఏక పక్ష విజయం సాధించడమే దానికి తార్కాణం. గత అసెంబ్లీ ఎన్నికల కంటే రానున్న ఎన్నికల్లో మరింత ఘోర పరాభవం తప్పదని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. కనీసం ఉనికినైనా చాటుకోవటానికి అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్న డబ్బులను వెదజల్లుదామంటే కొడుకు లోకేష్, భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి అడ్డుతగులుతున్నారు. ఘోరంగా ఓడిపోవడానికి డబ్బులు తగలెయ్యడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేయడంతో చంద్రబాబు వ్యూహం మార్చారు. యఽఽథావిధిగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయం అని గోబెల్స్‌ను తలదన్నే రీతిలో ఎల్లో మీడియాతో కలిసి ప్రచారం చేస్తున్నారు. దానిని అడ్డుపెట్టుకొని ఎన్నికల్లో టికెట్ కావాలంటే డబ్బులు డిపాజిట్ చేయాలని షరతు పెడుతున్నారు. దీనిపై పార్టీలోని సీనియర్లు బెంబేలెత్తిపోతున్నారు. జనరల్ నియోజకవర్గానికి సగటున రూ.35 కోట్లు డిపాజిట్ చేసిన వారికే టికెట్ ఇస్తామని కరాఖండీగా చెబుతున్నారు. గద్దె సైలెంట్... తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామోహ్మనరావు వరుసగా రెండు సార్లు గెలిచారు. ఈసారి టికెట్ ఇవ్వాలంటే రూ.35 కోట్లు డిపాజిట్ చేయాలని చంద్రబాబు కోరినట్లు ఆయన వర్గీయులే చెబుతున్నారు. ఆ స్థాయిలో డిపాజిట్ చేయలేనని గద్దె తేల్చి చెప్పినట్లు చెబుతున్నారు. దీంతో మరో అభ్యర్థిని చూసుకొంటానని, ప్రత్యామ్నాయంగా ఎక్కడో చోట అవకాశం కల్పిస్తామని చంద్రబాబు చెప్పడంతో గద్దె నిశ్చేష్టుడైనట్లు టీడీపీ కీలక నేత ఒకరు పేర్కొన్నారు. దీంతో కొంత కాలంగా ఆయన అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. నియోజకవర్గంలోని కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఉమా ఉక్కిరి బిక్కిరి.... ప్రజాదరణ పక్కన పెడితే చంద్రబాబు శిష్యుడు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీలో చక్రం తిప్పిన మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి. పాపం తన టికెట్‌కు లోకేష్ ఎసరు పెడుతుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు సంపాదించిన డబ్బు రూ.35 కోట్లు డిపాజిట్ చేస్తేనే టికెట్ అని, మైలవరంగానీ, పరిస్థితిని బట్టి ఇంకో నియోజకవర్గంలో గానీ అవకాశాలు కల్పిస్తామని లోకేష్ నిక్కచ్చిగా చెప్పడంతో ఉమా చంద్రబాబును ఆశ్రయించారు. బాబు సైతం లోకేష్ చెప్పిన మాటలకు వంత పలకడంతో దేవినేని డైలమాలో పడ్డారు. ఓటమి ఖాయంగా కనిపిస్తున్నప్పుడు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవడమా, లేదంటే పోటీకి దూరంగా ఉండి ఎమ్మెల్సీ ఇస్తే తీసుకోవడమా అనే మీమాంసలో ఉన్నారు. రగిలిపోతున్న సీనియర్లు.... టీడీపీ ఆవిర్భావం నుంచి నమ్ముకొని అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ వెన్నంటి నడిచిన నాయకులను చంద్రబాబు, లోకేష్ గడ్డి పోచలా తీసి పారేస్తున్నారు. డబ్బున్న నేతలు, ఎన్నారైలకు ప్రాధాన్యం ఇస్తుండటంతో సీనియర్లు రగిలిపోతున్నారు. గుడివాడలో పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న రావి వెంకటేశ్వరావును పక్కన పెట్టి వెనిగండ్ల రామును అభ్యర్థిగా ఖరారు చేయడంలో కేవలం డబ్బు సంచులను చూసేనని టీడీపీ వర్గీయులే అంటున్నారు. గన్నవరంలో సైతం యార్లగడ్డ వెంకట్రావుకు టికెట్ ఖరారు చేయడంలో ఇదే ఫార్ములా పాటించినట్లు పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది.ఇంకా ఇలా పార్టీలో ఎంత మందికి ఎర్త్ పెడతారోనని సీనియర్లు మదనపడుతున్నారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను డబ్బున్న వారిని, ఎన్నారైలను వెతుకులాడే పనిలో నిమగ్నమయ్యారు. -
‘యూజ్లెస్ ఫెలో’ మంత్రిగా ఉన్న నాలుగేళ్లు పార్టీని భ్రష్టుపట్టించావు
సాక్షిప్రతినిధి,విజయవాడ: ఉమ్మడి కృష్ణాజిల్లా టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి దేవినేని ఉమా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా అంతరం పెరిగిపోయింది. చివరకు వ్యక్తిగతంగా దూషణలకు దిగే స్థాయికి దిగజారారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం విజయవాడలో దుర్గమ్మ దర్శనం కోసం వచ్చారు. ఈ సందర్భంగా స్వాగతం పలకడానికి వచ్చిన టీడీపీ నేతలు వర్గాలుగా విడిపోయారు. అమ్మవారి దర్శనం సందర్భంగా చంద్రబాబు అంతరాలయంలోకి వెళ్లేటప్పుడు ఓ వర్గం నాయకులు దేవినేని ఉమా, కేశినేని చిన్ని వర్గానికి చెందిన వారు ముందుగానే తోసుకొంటూ లోపలికి వెళ్లారు. దీంతో ఎంపీ కేశినేని నానితో పాటు, మరికొంత మంది పార్టీనేతలు, లోపలికి వెళ్లకుండా బయటే ఉండిపోయారు. దీంతో చంద్రబాబు కేశినేని నానిని పిలవాలంటూ, తన భద్రతా సిబ్బందికి చెప్పారు. భద్రతా సిబ్బంది సార్ పిలుస్తున్నారు లోపలికి రావాలంటూ కేశినేని నానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. లోపల స్థలం లేదులే, ఇక్కడే ఉంటామని కేశినేని నాని వారికి చెప్పినట్లు తెలిసింది. చివరకు దేవినేని ఉమా బయటకు వచ్చి, కేశినేని నాని భుజంపై చెయ్యి వేసి, లోపలికి వెళ్లాలని కోరారు. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన ఎంపీ కేశినేని నాని, భుజంపైన వేసిన చెయ్యి విసిరికొట్టి, ‘యూజ్లెస్ ఫెలో’ మంత్రిగా ఉన్న నాలుగేళ్లు మీకు ఎవ్వరూ కనిపించలేదు, పార్టీని భ్రష్టు పట్టించావని ఊగిపోయారు. ఊహించని పరిణామం ఎదురు కావడంతో దేవినేని ఉమా సైలెంట్‌గా ఉండిపోయినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వర్గాలను ప్రోత్సహించడంతోనే... పార్టీ మనుగడ కోసం చంద్రబాబు, లోకేష్‌లే వర్గాలను ప్రోత్సహిస్తున్నట్లు ఆ పార్టీ ముఖ్య నేతలే పేర్కొంటున్నారు. ఎంపీ కేశినేని నానికి వ్యతిరేకంగా అతని సోదరుడు కేశినేని చిన్నిని ప్రోత్సహిస్తున్నారు. దీనిపై బహిరంగంగానే ఎంపీ పార్టీ అధిష్టానంపై ఇప్పటికే పలుమార్లు విరుచుకుపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఎంపీ పార్టీ కేశినేని నాని ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. అక్కడ ఆయనకు వ్యతిరేకంగా కేశినేని చిన్ని ఆధ్వర్యంలో మూడు వర్గాలు పనిచేస్తున్నాయి. ఎంపీ మాత్రం పశ్చిమ నియోజకవర్గానికి చెందిన బేగ్‌ను ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఎన్నికల సమాయత్తంలో భాగంగా ఇటీవల పార్టీ కార్యాలయంలో మైనార్టీ నాయకులకు నిర్వహించిన అవగాహన సదస్సు రసాభాసగా మారింది. రెండు వర్గాలుగా చీలిపోయి, పరస్పరం చేయిచేసుకున్నారు. ఇటీవల జరిగిన దళిత శంఖారావంలో సైతం ఎంపీ కేశినాని ఫొటో చిన్నదిగా పెట్టి, ఏ హోదాలో లేని చిన్ని ఫోటో బ్యానర్‌పై పెట్టారని టీడీపీ నేతలు బాహాబాహీకి దిగారు. తనకు వ్యతిరేకంగా దేవినేని ఉమాతో పాటు, నగరంలోని కొంతమంది పార్టీ నేతలను చంద్రబాబుతో పాటు, చినబాబు ప్రోత్సహిస్తున్నారని ఎంపీ కేశినేని నాని రగిలిపోతున్నారు. దీంతో మైలవరంతో పాటు, నగరంలో ఈ వర్గాలకు వ్యతిరేకంగా ఎంపీ కేశినేని నాని సైతం పావులు కదుపుతున్నారు. వరుస పరాజయాలకు తోడు, అంతంతమాత్రంగానే ఉన్న టీడీపీ పరిస్థితి, వర్గ విభేదాలతో పూర్తిగా దిగజారిపోతోందని, ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఈ వర్గ విభేదాలతో ఎలాంటి దుష్పరిణామాలకు చూడాల్సి వస్తుందోనని పార్టీ వర్గాలే పెదవి విరుస్తున్నాయి. -
కృష్ణా: పీఎస్ ముందే టీడీపీ గూండాల హల్చల్
సాక్షి, కృష్ణా జిల్లా: టీడీపీ నేతలు, కార్యకర్తలు బరి తెగించడంతో వీరవల్లి పోలీస్ స్టేషన్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రంగన్నగూడెం ఘటనలో ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్సీపీ నేతలు రాగా, పోలీస్ స్టేషన్ వద్దే టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. టీడీపీ నేతలు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, యార్లగడ్డ వెంకట్రావు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, యార్లగడ్డ వెంకట్రావు సమక్షంలోనే వైసీపీ శ్రేణులపైకి టీడీపీ కార్యకర్తలు దూసుకొచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. కాగా, జిల్లాలో తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యాత్ర సందర్భంగా.. ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. బజారు రౌడీల్లాగా దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. లోకేశ్ రాక సందర్భంగా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశాయి టీడీపీ శ్రేణులు. అయితే అదే సమయంలో కౌంటర్‌గా సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశాయి వైఎస్సార్సీపీ శ్రేణులు. ఈ పరిణామాన్ని టీడీపీ గుండాలు జీర్ణించుకోలేకపోయారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించేసి.. కర్రలతో ఇష్టానుసారంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. ఈ దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్త ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. చదవండి: టక్కుటమార విద్యల్లో చంద్రబాబు పీహెచ్డీ: సజ్జల -
ముందస్తు బెయిల్ మంజూరు చేయండి
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉసిగొల్పి పోలీసులపై దాడి చేయించి గాయపరిచిన వ్యవహారంలో తమపై అన్నమయ్య జిల్లా, ముదివీడు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన వేర్వేరు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ నేతలు నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు విచారణ జరిపారు. పోలీసుల తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ టీడీపీ నేతల దాడిలో దాదాపు 30 మంది పోలీసులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. అందువల్ల తనకు ఈ కేసులకు సంబంధించిన వివరాలు తెలుసుకునే అవకాశం లేకపోయిందన్నారు. పూర్తి వివరాలను తెలుసుకుని కోర్టు ముందుంచేందుకు విచారణను వాయిదా వేయాలని కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ విచారణను 14కి వాయిదా వేశారు. కాగా, ఈలోపే పిటిషనర్లను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, అందువల్ల సోమవారం వరకు పిటిషనర్లకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని దేవినేని ఉమా, కిషోర్ కుమార్‌రెడ్డి తరఫు న్యాయవాదులు హైకోర్టును అభ్యర్ధించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సోమవారం వరకు పిటిషనర్లను అరెస్ట్ చేయవద్దని ఏఏజీ సుధాకర్‌రెడ్డికి మౌఖికంగా స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే..ఇదే వ్యవహారంలో తనపై ముదివీడు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ నేత పులవర్తి నాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కూడా హైకోర్టు సోమవారం విచారణ జరపనుంది. -
‘పోలవరం’ వద్ద మాజీ మంత్రి ఉమా హడావుడి
పోలవరం రూరల్/ గోపాలపురం/బుట్టాయగూడెం : ముందస్తు సమాచారం ఇవ్వకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలిస్తామంటూ టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ, టీడీపీ నేత బొరగం శ్రీనివాసరావులు పోలవరం ఏటిగట్టు సెంటర్‌కు చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. శనివారం ఉదయం 10 గంటల సమయంలో రహస్యంగా మాజీ మంత్రి ఏజెన్సీ గ్రామాల్లోని రోడ్డు మార్గం మీదుగా మోటార్ సైకిల్‌పై స్థానిక ఏటిగట్టు సెంటర్‌కు చేరారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. టీడీపీ హయాంలో పనులు జరిగాయని, ఇప్పుడు ఎంతవరకు జరిగాయో చూస్తామంటూ వాదించారు. ఈ క్రమంలో డీఎస్పీ కె.శ్రీనివాసులు, సీఐ కె.విజయబాబులు వారిద్దరినీ పోలీస్ వాహనంలో ఎక్కించి బుట్టాయగూడెం స్టేషన్‌కు తరలించారు. కన్నాపురం అడ్డరోడ్డు వద్ద టీడీపీ మాజీ మంత్రి కేఎస్ జవహర్‌ను కూడా అడ్డుకుని అక్కడ నుంచే పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామారాయుడు, మాజీ ఎమ్మెల్యేలు గన్ని వీరాంజనేయులు, బడేటి చంటి, ముప్పిడి వెంకటేశ్వరరావు, గోపాలపురం నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి మద్దిపాటి వెంకటరాజులు పోలవరం ప్రాజెక్టు వద్దకు ఏలూరు నుంచి బయలు దేరారు. గోపాలపురం మండలం కొవ్వూరుపాడు వద్దకు చేరు కోగానే పోలీసులు వారిని అడ్డుకుని, గోపాలపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం పలువురు టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని హడావుడి చేశారు. తర్వాత పోలీసులు టీడీపీ నేతలను విడుదల చేశారు. అనంతరం ఉమ మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అన్యాయం జరుగుతోందన్నారు. -
సొంతపార్టీ వాళ్లకే చెమటలు పట్టించిన ఉమా! మాకొద్దు బాబోయ్ అంటున్న తమ్ముళ్లు
ఎన్టీఆర్ జిల్లా: తెలుగుదేశం పార్టీలో జనం నెత్తిన చేతులు పెట్టే నేతలకు కరువేమీ లేదు. అదే కోవలోకి వస్తారు మాజీ మంత్రి..సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు. ఇప్పుడాయన పేరు చెబితే పార్టీలోను, మైలవరం నియోజకవర్గంలోనూ అందరూ మండిపడుతున్నారట. నోటి దురుసు, అహంభావానికి కేరాఫ్ అడ్రస్ అయిన దేవినేని వ్యవహారంతో కార్యకర్తలు ఎప్పట్నుంచో విసిగిపోయి ఉన్నారట. ఇటీవల ఉమా తీరు మరింత వరస్ట్‌గా మారడంతో క్యాడర్ కు అస్సలు రుచించడం లేదని టాక్. దీంతో అతనికి వ్యతిరేకంగా మైలవరంలో గ్రూపులు మొదలయ్యాయట. దేవినేని ఉమా తాజాగా వెలగబెట్టిన నిర్వాకం కారణంగా సైకిల్ పార్టీ శ్రేణులు ఉమా అంటే ఆమడ దూరంలో ఉంటున్నారట. గొల్లపూడి వన్ సెంటర్ లో ఆలూరి చిన్నారావుకు చెందిన స్థలంలో కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ స్థలం ఆలూరి చిన్నారావుకు అతని తల్లి శేషారత్నం గిఫ్ట్ డీడ్ గా ఇచ్చారు. ఆ స్థలంలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో తన ఆస్థిని కాపాడుకునేందుకు శేషారత్నం జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించారు. ఏడాది పాటు ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించి ఎట్టకేలకు కలెక్టర్ గిఫ్ట్ డీడ్ రద్దుచేసి ఆ స్థలాన్ని ఆమెకు ఇప్పించాలని అధికారులను ఆదేశించారు. ఆలూరి శేషారత్నం ఆ స్థలంపై కన్నేశారు కలెక్టర్ ఆదేశాలతో శేషారత్నంకు స్థలం అప్పగించేందుకు అధికారులు అక్కడకు వెళ్ళారు. సరిగ్గా అదే సమయంలో దేవినేని ఉమా జోక్యం చేసుకుని కుటుంబ వ్యవహారాన్ని రాజకీయంగా మార్చేశారని టాక్. వాస్తవానికి టీడీపీ కార్యాలయం పేరిట ఆ స్థలాన్ని పర్మినెంట్ గా కొట్టేయాలనేది దేవినేని ఉమా ప్లాన్ అని చెబుతున్నారు. ఇందులో భాగంగానే దేవినేని ఉమా ఓ రేంజ్ లో డ్రామా నడిపించాడు. కానీ అతని బెదిరింపులకు వెరవకుండా శేషారత్నం ధైర్యంగా నిలబడ్డారు. తల్లీ కొడుకుల మధ్య ఉమా చిచ్చు పెట్టాలని ఎంత ప్రయత్నించినా వ్యూహం ఫలించలేదట. దీంతో అధికారులు ఎట్టకేలకు ఆ స్థలాన్ని ఆమెకు ఇప్పించడంతో పాటు అక్కడున్న టీడీపీ కార్యాలయాన్ని కూడా తరలించారు. ఐతే పార్టీ కార్యాలయం ముసుగులో శేషారత్నం స్థలం కొట్టేయాలన్న దేవినేని ప్లాన్ దారుణంగా ఫెయిలవ్వడంతో పాటు పార్టీకి తీరని నష్టం వాటిల్లేలా చేసిందట. పార్టీ కార్యకర్తకే వెన్నుపోటా? శేషారత్నం కుటుంబం అంతా టీడీపీ పార్టీ పుట్టిన నాటి నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకున్నారు. ప్రస్తుతం వివాదానికి కారణమైన స్థలానికి నెలకు లక్షరూపాయలు అద్దె వస్తుందని తెలిసినా పార్టీ కోసమే అయాచితంగా ఇచ్చేశారు. ఇలాంటి సమయంలో దేవినేని పన్నాగం తెలుసుకుని స్థలాన్ని కాపాడుకునేందుకు శేషారత్నం తీవ్రంగా పోరాడాల్సి వచ్చింది. సొంత పార్టీకి చెందిన వారి స్థలాన్నే కబ్జా చేయాలని దేవినేని ఉమా వేసిన ప్లాన్ సక్సెస్ కాకపోగా...రచ్చ రచ్చగా మారి పచ్చ పార్టీ అభాసుపాలైందట. దీంతో ఈ వ్యవహారాన్ని పార్టీ అధినాయకత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుందట. అసలే మైలవరం టీడీపీలో లోకల్ నాన్ లోకల్ వార్ నడుస్తున్న సమయంలో ఈ పంచాయతీ ఏంటంటూ మండిపడుతున్నారట చినబాబు, చంద్రబాబు. ఇప్పటికే వేరుకుంపటి పెట్టుకున్న మైలవరం తమ్ముళ్లంతా..అదే అదనుగా కట్టకట్టుకుని ఉమాపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేశారట. ఈసారి ఉమా మాకొద్దంటున్నాం కాబట్టి... ఈసారి ఆ సీటేదో మాకే ఇచ్చేయండి బాబు అంటూ అధినేత ముందు క్యూ కట్టేస్తున్నారట. మాకొద్దు బాబు.. మీకో దండం మైలవరం నుంచి దేవినేని ఉమాను బయటికి పంపించేయాలనుకుంటున్న బొమ్మసాని సుబ్బారావు, జంపాల సీత రామయ్య, కాజా రాజ్ కుమార్, జువ్వ రాంబాబు తదితర ఆశావాహులంతా హై కమాండ్ వద్ద ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేశారట. ఈ మొత్తం వ్యవహారాన్ని బయటి నుంచి గమనిస్తున్న క్యాడర్ మాత్రం 2024లో ఉమాకు మైలవరం టిక్కెట్టు ఇస్తే పార్టీ మూసేసుకోవడం ఖాయమని బాహాటంగానే చర్చించుకుంటున్నారట. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై దేవినేని ఉమా అనుచరుల దాడి
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు మండలం గంగినేనిపాలెంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై టీడీపీ నేత దేవినేని ఉమా అనుచరులు దాడికి పాల్పడ్డారు. సర్పంచ్ రామారావు, ఎంపీటీసీ ప్రసాద్‌పై దాడికి టీడీపీ నేతలు యత్నించారు. అడ్డుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు తీవ్రగాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. టీడీపీ నేతల దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. -
మైలవరానికి దేవినేని ఉమా చేసింది శూన్యం : ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
-
టీడీపీ అంతర్గత సర్వే ఏం చెబుతోంది?.. షాక్‌లో మాజీ మంత్రి దేవినేని ఉమా
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండగానే తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటాలు రోడ్డున పడుతున్నాయి. జిల్లా పార్టీలో తిరుగులేదనుకున్న దేవినేని ఉమాకు, గన్నవరం ఇన్చార్జిగా ఇటీవల వెళ్లిన బచ్చుల అర్జునుడుకు పార్టీ తమ్ముళ్లు షాక్ ఇచ్చారు. ఇక విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మొదటి నుంచీ ఉన్న విభేదాలు ఇటీవల మరింత ముదిరాయి. పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా బుజ్జగింపులకు దిగినా.. అక్కడి నేతలు ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. చక్రం తిప్పిన ఉమాకు సెగ.. టీడీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు ఉమ్మడి జిల్లాలో చక్రం తిప్పిన దేవినేని ఉమాకు రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒకప్పుడు నియోజకవర్గంలో ఎదురు నిలిచి మాట్లాడటానికే సాహసించని పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రస్తుతం ఉమాను వ్యతిరేకిస్తూ.. బహిరంగంగా సమావేశం ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో స్థానికులకే టికెట్టు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారు తీర్మానం చేశారు. మరోవైపు టీడీపీ అంతర్గత సర్వేలో సైతం ఉమాకు అనుకూలంగా లేకపోవడంతో, నియోజకవర్గంలోని టీడీపీ నేతలు చేస్తున్న వాదానికి బలం చేకూర్చుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సారి ఎన్నికల్లో దేవినేని ఉమాకు టికెట్టు దక్కడం కష్టమని స్థానిక టీడీపీ నేతలే బలంగా విశ్వసిస్తున్నారు. దీంతో ఉమాలో అంతర్మథనం మొదలై, ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టి, పక్క నియోజకవర్గాల వైపు చూస్తున్నట్లు పార్టీ వర్గాల్లోనే చర్చ సాగుతోంది. పశ్చిమంలో వర్గ పోరు.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రోజు రోజుకు పార్టీలో విభేదాలు ముదిరి పాకాన పడుతున్నాయి. అక్కడ పార్టీ ఇన్చార్జిగా విజయవాడ ఎంపీ కేశినేని నాని ఉన్నారు. అయితే నియోజకవర్గంలో పేపర్ పులులుగా పేర్కొన్న ఇద్దరు ముఖ్యనేతలు నియోజకవర్గ ఇన్చార్జి చేపట్టే కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, బహిరంగంగానే ఇన్చార్జిపై అసమ్మతి గళం విప్పుతున్నారు. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సైతం పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కార్తిక వనసమారాధనల సమయంలోనూ.. విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం పార్టీలో అంతర్గత కుమ్ములాటలను బహిర్గతం చేస్తున్నాయి. దీనికితోడు తాజాగా ఎంపీ సోదరుడు నియోజకవర్గంలో వేరు కుంపటి పెట్టడంతో పార్టీ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. గన్నవరం.. తమ్ముళ్ల పంతం.. అసలే అంతంత మాత్రంగా ఉన్న గన్నవరం టీడీపీ పరిస్థితి ఇప్పుడు మరింత దిగజారింది. గన్నవరంలో పార్టీ బాధ్యతలు తీసుకోవడానికి నేతలు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో బచ్చుల అర్జునుడునే అతికష్టం మీద ఆ నియోజకవర్గ ఇన్చార్జిగా పంపించారు. అయితే బచ్చుల అర్జునుడుకు వ్యతిరేకంగా నియోజకవర్గంలోని పార్టీనేతలు సమావేశం ఏర్పాటు చేసుకొని, పార్టీ నేతలను కలుపుకుపోవటంలో అర్జునుడు ఒంటెద్దు పోకడలకు పోతున్నారని తిరుగుబావూటా ఎగరవేశారు. సీనియర్ కార్యకర్తలకు విలువ ఇవ్వటం లేదని, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారని బహిరంగానే గన్నవరం టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వీటికి బలం చేకూర్చే విధంగా ఇటీవల ఏలూరు జిల్లా పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికేందుకు హనుమాన్ జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై ఎదురురేగిన టీడీపీ నేతలు, కార్యకర్తలు బాబు సమక్షంలో బచ్చుల అర్జునుడు వద్దంటూ నినాదాలు చేశారు. గన్నవరం టీడీపీ అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేశారు. పార్టీలో ఈ పరిణామాలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. చదవండి: పెళ్లిలో కూడానా.. ఇదేమి ఖర్మరా బాబు..! -
పొలిటికల్ కారిడార్: దేవినేని ఉమాను మర్చిపోయిన క్యాడర్, ప్రజలు
-
కేశినేని వర్సెస్ దేవినేని.. టీడీపీలో హాట్ టాపిక్..
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: నందిగామ నియోజకవర్గంపై పూర్తిస్థాయి పట్టు తమకే ఉండాలని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని), మాజీ మంతి దేవినేని ఉమామహేశ్వరరావు పోటాపోటీగా వ్యవహరిస్తుండటం జిల్లా తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. కేశినేని, దేవినేని వర్గ పేచీలు గత వారంగా చంద్రబాబు వద్ద వరుస పంచాయితీలు జరుగుతున్నాయి. చదవండి: డప్పు రమేష్ కన్నుమూత ఏ వర్గం తన వద్దకు వస్తే ఆ వర్గానికి మద్దతుగా మాట్లాడుతూ నిలకడలేని ఆలోచనలు, నిర్ణయాలతో చంద్రబాబే గందరగోళ రాజకీయ పరిస్థితులకు కారకులవుతున్నారని సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. నందిగామతో మొదలైన రచ్చ ఇతర నియోజకవర్గాల ఇంఛార్జులను మార్చాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయని, ఈ పరిణామాలు పార్టీలో అనిశ్చితికి దారితీస్తున్నాయని పెదవి విరుస్తున్నారు. తమ అనుయాయులను అడ్డుగా పెట్టుకుని రిజర్వుడు నియోజకవర్గంలో పెత్తనంపై వారివురి పేచీ ఏంటని సీనియర్లు నిలదీస్తున్నారు. నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులు, సోదరులైన మొండితోక జగన్మోహన్రావు, అరుణ్‌కుమార్‌లు ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్నింటా వేగంగా స్పందిస్తున్నారని, పార్టీ పరంగా పూర్తిగా బలపడిపోయారని, వారిని ధీటుగా ఎదుర్కొనే స్థితిలో సౌమ్య లేరని ఎంపీ కేశినేని చంద్రబాబునాయుడు వద్ద ప్రస్తావించి ఆమెను మార్చాలంటూ పట్టుపట్టారనేది సమాచారం. మరో ఇంఛార్జిని ఎంపికచేసుకునే వరకు విజయవాడకు చెందిన తమ సామాజికవర్గానికే చెందిన గన్నె వెంకట నారాయణ ప్రసాద్ (అన్న)కు నియోజకవర్గ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని ప్రతిపాదించారు. కేశినేనితో పాటు విజయవాడ జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, అన్న, బొమ్మసాని సుబ్బారావు తదితరులను వెంట పెట్టకుని వెళ్లడంతో చంద్రబాబు అంగీకరించారు. ఈ విషయం తెలుసుకున్న దేవినేని ఉమా తంగిరాల సౌమ్యతో పాటు నందిగామ నియోజకవర్గంలోని పలువురు నాయకులను వెంటపెట్టుకుని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఉన్న చంద్రబాబు వద్దకు వెళ్లి ససేమిరా కుదరదని, సౌమ్యనే ఇంఛార్జిగా కొనసాగించాలని పట్టుపట్టడంతో అందుకు కూడా పార్టీ అధినేత అంగీకరించారని చెపుతున్నారు. తాము వెళ్లినప్పుడు అన్నాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి మళ్లీ మాటమార్చడంపై కేశినేని వర్గం కినుక వహించిందని సమాచారం. ఈ వ్యవహారం నందిగామతో ఆగలేదని తిరువూరు ఇంఛార్జి అంశం కూడా రచ్చకెక్కిందని చెపుతున్నారు. గతంలో స్వామిదాసు ఉండగా ఆయన స్థానంలో చావల దేవదత్తుకు ఇంఛార్జి బాధ్యతలు అప్పగించారు. తాజాగా జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి వాసం మునెయ్యను ఇంఛార్జిగా నియమించాలని కేశినేని నాని ప్రతిపాదిస్తున్నారు. అదేవిధంగా జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాల ఇంఛార్జుల మార్పు అంశాన్ని కూడా చంద్రబాబు వద్ద ఎంపీ ప్రస్తావించారని చెపుతున్నారు. లోక్‌సభ నియోజకవర్గం నుంచి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఏడు శాసనసభ స్థానాల బాధ్యతలను అప్పజెపితే అన్నింటినీ చక్కబెడతాననేది కేశినేని నాని తన వాదనగా వినిపిస్తుండగా ఆయన వ్యతిరేకవర్గంగా ఇప్పటికే వ్యవహరిస్తున్న దేవినేని ఉమ, బొండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా, తంగిరాల సౌమ్య తదితరులు తమదైన శైలిలో పావులు కదుపుతున్నారని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. -
పోలీసుల అదుపులో దేవినేని ఉమ
-
టీడీపీ నేత దేవినేనిని నమ్మి మోసపోయాం
సాక్షి, అమరావతి: టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మాటలు నమ్మి మోసపోయామని ట్రాన్స్ట్రాయ్ కంపెనీ కింద సబ్ కాంట్రాక్టులు చేసిన కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఈ మేరకు సబ్ కాంట్రాక్టర్లు తాడేపల్లిలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి మంగళవారం వినతిపత్రం అందజేశారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.20 కోట్లుపైనే ఖర్చు చేసినా ఇంతవరకు బిల్లులు మంజూరు చేయలేదన్నారు. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ తమను మోసం చేశారని తెలిపారు. తమ సమస్యలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు. -
కొండపల్లిలో రచ్చ.. దేవినేని ఉమాపై కేసు నమోదు
ఇబ్రహీంపట్నం (విజయవాడ): కొండపల్లి మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నేపథ్యంలో పోలీస్‌శాఖ విధించిన 144 సెక్షన్ నిబంధనలు ఉల్లంఘించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు టీడీపీ నాయకులు జంపాల సీతారామయ్య, రామినేని రాజశేఖర్ మరికొందరిపై ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. 144 సెక్షన్ నిబంధనలు ఉల్లంఘించి ర్యాలీ చేసి జాతీయ రహదారులపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారు. ఈ పరిణామాలతో 143, 341, 269, రెడ్‌విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీధర్‌కుమార్ తెలియజేశారు. అలాగే గురువారం మధ్యాహ్నం దేవినేని ఉమ, టీడీపీ కార్యకర్తలు కలిసి గొల్లపూడి వన్ సెంటర్ నుంచి సాయిపురం కాలనీకి వెళ్లే రోడ్డుపై గుంపులు గుంపులుగా చేరి టపాసులు కాలుస్తూ శబ్ద కాలుష్యాన్ని కలిగించారు. దీంతో ఉమాతోపాటుగా పఠాన్ అబ్బాస్, ఎ.చిన్న, బొమ్మసాని సుబ్బారావు, రామినేని రాజా, మరి కొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఘోర పరాభవం
సాక్షి, విజయవాడ: పరిషత్ ఎన్నికల్లో మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఘోర పరాభవం ఎదురైంది. దేవినేని ఉమ నియోజకవర్గం మైలవరంలో వైఎస్సార్సీపీ హవా ప్రదర్శించింది. గొల్లపూడిలో 10 ఎంపీటీసీలకు 10 వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటివరకు 14 జడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. -
టీడీపీ.. తెలుగు దొంగల పార్టీగా మారింది: ఎమ్మెల్యే కృష్ణప్రసాద్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ.. తెలుగు దొంగల పార్టీగా మారిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ధ్వజమెత్తారు . కొండపల్లి మైనింగ్‌పై టీడీపీ నేత పట్టాభి ఆరోపణలను ఆయన ఖండించారు. సోమవారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధాలను నిజం చేయాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 1993లో ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకోగా 143 సర్వే నెంబర్‌పై లీజును మైనింగ్ శాఖ అధికారులు మంజూరు చేశారన్నారు. 1943-44లో రూపొందించిన ఆర్ఎస్ఆర్ రికార్డులోనూ 143 సర్వే నెంబర్ ఉందని, ఎప్పటినుంచో ఉందనడానికి ఆధారాలు కూడా ఉన్నట్లు తెలిపారు. 45 ఏళ్లుగా ఆ ప్రాంతంలో మైనింగ్ జరుగుతుంటే, వైఎస్ హయాంలో 143 సర్వే నెంబర్ సృష్టించారని పట్టాభి ఆరోపణల్లో వాస్తవం లేదని వెల్లడించారు. దేవినేని ఉమా ఏడాదిన్నరగా నాపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. -
దేవినేని ఉమా అబద్ధాలకు ఎల్లోమీడియా వత్తాసు పలుకుతోంది : వసంత కృష్ణప్రసాద్
-
సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ : ఆవిధంగా బుక్కయ్యారు
-
తప్పు చెయ్యనివారికి ఈ ప్రభుత్వంలో శిక్ష పడదు : సుచరిత
-
టీడీపీ నిజ నిర్ధారణ కమిటీతో పాటు మేమూ వస్తాం.. సిద్ధమేనా
-
‘టీడీపీ నిజ నిర్ధారణ కమిటీతో పాటు మేమూ వస్తాం.. సిద్ధమేనా’
సాక్షి, తాడేపల్లి: ‘దళితులపై దాడి చేసిన దేవినేని ఉమ ఇంటికి చంద్రబాబు ఎలా వెళ్లారు.. దళితులపై దాడి వెనక చంద్రబాబు పాత్ర ఉంది’ అని పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెరుగు నాగార్జున మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు మరోసారి దళిత ద్రోహి అని నిరూపించుకున్నారు. దళితులపై దాడి చేసిన దేవినేని ఇంటికి చంద్రబాబు ఎలా వెళ్లారు. దళితులపై దాడి వెనక చంద్రబాబు పాత్ర కూడా ఉంది’’ అని ఆరోపించారు. మరో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘దేవినేని అబద్ధాలను నిజం చేయాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టేందుకే చంద్రబాబు గొల్లపల్లి వచ్చారు. 2004లో వసంత నాగేశ్వరరావు కారును దగ్ధం చేసింది గుర్తులేదా. 2016 డిసెంబర్ 4న 143 సర్వే నంబర్లో దేవినేని మైనింగ్ ప్రారంభించారు.. అవి అసలు రెవిన్యూ భూములా.. ఫారెస్ట్ భూములా అనే విషయం తేల్చాలి. 2018లో దేవినేని ఉమా క్రషర్ ప్రారంభించారో లేదో చెప్పాలి. దేవినేని ఉమ తప్పు చేశాడన్న విషయం చంద్రబాబుకు తెలుసు. దేవినేని నీచ పనులకు చంద్రబాబు వత్తాసు పలుకుతున్నారు. అబద్ధాలను నిజం చేసేందుకే టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వేసింది. దేవినేని ఉమను సమర్ధిస్తున్న చంద్రబాబు క్షమాపణ చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. మరో ఎమ్మెల్యే జోగి రమేష్ ‘‘చంద్రబాబు బుద్ధి కొంచెం కూడా మారలేదు. దళితులపై దాడి చేసిన దేవినేని ఇంటికి చంద్రబాబు ఎలా వెళ్తారు. చంద్రబాబుకు కొంచెం కూడా అగ్రవర్ణ అహంకారం తగ్గలేదు. టీడీపీ నిజనిర్ధారణ కమిటీతో పాటు మేమూ వస్తాం.. మీరు సిద్ధమేనా. మైనింగ్‌లో దోచుకుంది ఎవరో మొత్తం తేలుస్తాం’’ అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్సార్సీపీ ఎంపీ సురేష్ మాట్లాడుతూ.. ‘‘పాము పగబట్టినట్లు చంద్రబాబు దళితులపై పగబట్టారు. ఎన్నికల్లో ఓడించారనే కక్షతోనే దళితులపై దాడులు చేస్తున్నారు. దళితులపై దాడి చేసిన వారిని పరామర్శించడమేంటి’’ అని ప్రశ్నించారు. -
దేవినేని ఉమను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్
-
దేవినేని ఉమను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్
సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎస్సీ, ఎస్టీ వేధింపులకు సంబంధించి కోర్టులో డీఎస్పీ పిటిషన్ దాఖలు చేశారు. దేవినేని ఉమను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. దేవినేని ఉమ నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్లో కోర్టును కోరారు. ప్రశాంతంగా ఉన్న కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావును హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో పోలీసులు మంగళవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. తన అనుచరులను, టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి గడ్డమణుగు గ్రామస్తులపై దాడి చేయించిన ఉమాకు మైలవరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి విదితమే. -
చంద్రబాబు హయాంలోనే అక్రమ క్వారీయింగ్: వసంత కృష్ణ ప్రసాద్
సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలోనే అక్రమ క్వారీయింగ్ జరిగిందని మైలవరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అధికారులను బెదిరించి అప్పటి రెవెన్యూ మంత్రి ద్వారా లీజులు తీసుకున్నారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో కొండ పోరంబోకు భూములుగా రికార్డుల్లో మార్చారని దుయ్యబట్టారు. తనపై దేవినేని ఉమ అసత్య ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు, దేవినేని ఉమాకు ఎల్లోమీడియా వత్తాసు పలుకుతోందని ఆయన ధ్వజమెత్తారు. ‘‘ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని టికెట్లు తెచ్చుకున్నవారు ఆయనపైనే చెప్పులు వేశారు. టీడీపీలో లేకుంటే కమ్మ కులస్తులు కాదా?. దేవినేని ఉమాను సొంత నియోజకవర్గంలోనే ప్రజలు ఓడించారు. అక్కడున్నవి రెవెన్యూ భూములా..? ఫారెస్ట్ భూములా? తేల్చాలి. అబద్ధపు ప్రచారాలను ఇప్పటికైనా చంద్రబాబు మానుకోవాలని’’ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హితవు పలికారు. -
దేవినేని ఉమాకు 14 రోజుల రిమాండ్
-
దేవినేని ఉమాకు 14 రోజుల రిమాండ్
-
దేవినేని ఉమా వ్యాఖ్యలతో ప్రజలే తిరగబడ్డారు: మంత్రి కొడాలి నాని
-
నందివాడ పీఎస్‌కు దేవినేని ఉమా తరలింపు
-
మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్ట్
-
దేవినేని ఉమ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు
-
టీడీపీ నేత దేవినేని ఉమకు ఘోర పరాభవం
-
టీడీపీ నేత దేవినేని ఉమకు ఘోర పరాభవం
సాక్షి, కృష్ణా జిల్లా: వీరులపాడు మండలం జూలూరులో టీడీపీ నేత దేవినేని ఉమకు ఘోర పరాభవం ఎదురైంది. రోడ్ల పరిశీలనకు వచ్చిన దేవినేని ఉమను టీడీపీ కార్యకర్తలు నిలదీశారు. టీడీపీ కార్యకర్తలకు ఏ న్యాయం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. దేవినేని ఉమ సహా టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు. -
టీడీపీ నేత దేవినేని దుష్ప్రచారం.. మండిపడ్డ గ్రామస్తులు
సాక్షి, కృష్ణా జిల్లా: టీడీపీ నేతల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు. టీడీపీ నేత దేవినేని ఉమా తీరుపై అనాసాగరం గ్రామస్తులు మండిపడ్డారు. జగనన్న లేఅవుట్లో నీటమునిగాయని దుష్ప్రచారం చేసిన దేవినేనిపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవినేని బూటకపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. -
పేదల ఇళ్లపై చంద్రబాబు నీచ రాజకీయాలు: వెల్లంపల్లి
సాక్షి, అమరావతి: రాష్ట్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 31 లక్షల మంది పేదలకు ఇళ్లు కేటాయించారని పేర్కొన్నారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి కేంద్రకరించారన్నారు. రాజధాని పేరుతో ప్రజలను చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. పేదలకు ఉచితంగా ఇచ్చే ఇళ్లపై చంద్రబాబు, దేవినేని ఉమా నీచ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి నిప్పులు చెరిగారు. -
సీఐడీ విచారణకు హాజరైన టీడీపీ నేత దేవినేని ఉమా
-
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపైసీఐడీ కేసు
-
మాజీ మంత్రి దేవినేని ఉమాకు షాక్
సాక్షి, కృష్ణా జిల్లా: టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమాకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. గొల్లపూడిలో టీడీపీ కోట బీటలు వారుతుంది. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. సీఎం పోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం సమక్షంలో వైఎస్సార్సీపీలోకి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి రామ్మోహనరావు చేరారు. టీడీపీ కార్యకర్తలు, మండలస్థాయి నేతలు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి సీఎం పోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మేరుగ నాగార్జున, ఎంపీ నందిగామ సురేష్‌లు పార్డీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే వైఎస్సార్సీపీలోకి ఆరుగురు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు, జడ్పీటీసీ అభ్యర్థి చేరారు. తాజాగా ఉమా అనుచరుడు, టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి కోమటి రామ్మోహనరావు వైఎస్ఆర్సీపీలోకి చేరారు. వైఎస్సార్సీపీలోకి టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు వరుస చేరికలతో గొల్లపూడిలో టీడీపీ జవసత్వాలు కోల్పోతుంది. చదవండి: నమ్మించి నట్టేట ముంచారు.. టీడీపీ ఎమ్మెల్యేపై గుస్సా ఏపీ: బడ్జెట్ ఆర్డినెన్స్‌ను ఆమోదించిన గవర్నర్ -
టీడీపీ నేత దేవినేని ఉమాపై మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఫైర్
-
‘సోడాలు కొట్టుకునే బతుకు నీది’
సాక్షి, విజయవాడ: టీడీపీ నేత దేవినేని ఉమాపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేవినేని ఉమ మరోసారి తన కులం గురించి మాట్లాడితే సహించేది లేదని నిప్పులు చెరిగారు. ‘‘ఆడా మగా కాని ఉమ.. సోడాలు కొట్టుకునే బతుకు నీది. ఆయన ఓ చవట, దద్దమ్మ, సన్నాసి’’ అంటూ మంత్రి మండిపడ్డారు. పోలవరంపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. డయా ఫ్రం వాల్ కొట్టుకుపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. డయా ఫ్రం వాల్ ఎప్పుడు నిర్మించారో రామోజీరావుకు తెలియదా? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో జరిగిన దానికి మాపై నిందలా? పోలవరంలో టీడీపీ చేసిన పాపాలను మేం కడుగుతున్నామని’’ అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. చదవండి: బాబు బాగోతం వల్లే డయాఫ్రమ్ వాల్‌కు నష్టం పోలవరంపై వాస్తవాలు గోదాట్లో కలిపిన ‘ఈనాడు’ -
నీ ఇంటికి రమ్మంటావా?: వంశీ
సాక్షి, విజయవాడ: చంద్రబాబు డ్రామా కంపెనీ నడుపుతున్నారని, అందులో కుక్కలు, పందులు వంటి వివిధ రకాల జంతువులున్నాయని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అన్నారు. అందులో దేవినేని ఉమ ఒక రకమని ఎద్దేవా చేశారు. ఆయన తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని తీవ్రంగా హెచ్చరించారు. మంగళవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోనే ఏ సీఎం చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఈ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని పేర్కొన్నారు. కానీ మళ్లీ ఎప్పటికీ అధికారంలోకి రామనే భయంతోనే చంద్రబాబు, దేవినేని ఉమ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ ఆరోపణలు సహజమని, కానీ వ్యక్తిగత ఆరోపణలకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు. 2014కి ముందు చంద్రబాబు అధికారంలోకి రావడానికి ఎన్ని హామిలిచ్చారు? ఎన్ని నేరవేర్చారని నిలదీశారు. ఇక ఎన్టీఆర్ మరణానికి కారణమైన చంద్రబాబు, దేవినేనిలకు ఆయన విగ్రహాన్ని ముట్టుకునే అర్హతే లేదని తేల్చి చెప్పారు. అసలు దేవినేని సిగ్గు లేని మనిషని, సీఎం వైఎస్ జగన్‌ను విమర్శించే స్థాయి ఆయనకెక్కడిదని దుయ్యబట్టారు. బహిరంగచర్చకు రమ్మంటే గొల్లపూడిలో నిరసన అంటూ డ్రామాలాడారని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ చర్చకు సిద్ధంగా ఉన్నామని, నీ ఇంటికి రమ్మంటే అక్కడే చర్చిద్దాం.. లేదంటే కొడాలి నాని ఇంటి దగ్గర చర్చకు రమ్మని సవాలు విసిరారు. మరోవైపు చంద్రవాబుకి, లోకేష్‌కు రాష్ట్రంలో ఇల్లు లేదంటూ వారిని అజ్ఞాతవాసులుగా అభివర్ణించారు. వీళ్లిద్దరు తప్ప రాష్డ్రంలో సీఎం వైఎస్ జగన్ పాలనపై అందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. (చదవండి: ఆనాడు బాబు మంగమ్మ శపథం చేశారు) -
'వెన్నుపోటుదారుడు' పేటెంట్ చంద్రబాబుకే
సాక్షి, విజయవాడ: లక్షలాది మంది పేదింటి కలలను సీఎం వైఎస్ జగన్ నిజం చేశారని మంత్రి కొడాలి నాని అన్నారు. కృష్ణా జిల్లా గొల్లపూడిలో మహిళలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఎవరూ ఊహించనంతగా సీఎం జగన్ అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట నిలబట్టుకోవడానికే సీఎం జగన్ పరితపిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే పట్టా అమ్ముకోకూడదని కోర్టులకు వెళ్లి 25 కోట్లు ఖర్చుపెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ధ్వజమెత్తారు. సొల్లు ఉమ, చంద్రబాబు కలిసి కోడిగుడ్డుకు ఈకలు పీకే పని మొదలెట్టారని అన్నారు. ప్రజలను వంచించడానికి చంద్రబాబు కులాలు, మతాల పేరుతో రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు. (ఆనాడు బాబు మంగమ్మ శపథం చేశారు) సొల్లు ఉమ, చంద్రబాబు కలిసి కోడిగుడ్డుకు ఈకలు పీకే పని మొదలెట్టారని అన్నారు. ప్రజలను వంచించడానికి చంద్రబాబు కులాలు, మతాల పేరుతో రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో జేబుదోంగ, వెన్నుపోటుదారుడు అనే పదాలకు పేటెంట్ హక్కు ఉన్నది చంద్రబాబుకే అని, ఆయన మరణానికి కారకులైన దుర్మర్గుడే చంద్రబాబు అని కొడాలి నాని అన్నారు. 'వదినని చంపి శాసనసభ్యుడైన వ్యక్తి ఉమ అని తనపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదం అన్నారు. ఒక నిరుపేదకు కూడా పట్టా ఇవ్వలేని దౌర్భాగ్యం దేవినేనిది. చంద్రబాబు బూటు నాకే వ్యక్తి ఆయన. మీడియా ముందు పోసుకోలు కబుర్లు చెప్పే దేవినేని..ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే.. బడితపూజ చేస్తాం' అని కొడాలి నాని పేర్కొన్నారు. (ఎన్టీఆర్‌పై ఆ ఐదుగురి కుట్ర: సాక్ష్యం ఇదే! ) -
బాబు పసుపు కుంకుమ ఇస్తే ఉప్పు కారం పెట్టారు
సాక్షి, విజయవాడ: గతంలో జరిగిన కార్యక్రమాలకు, ఇప్పుడు జరుగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీకి చాలా వ్యత్యాసం ఉందని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అర్హులైన 31 లక్షల మందికి ఇళ్లిస్తున్నారని తెలిపారు. కోర్టు అనుమతి తరువాతే వీటికి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారని స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆనాడు టీడీపీ హయాంలో రెండు లక్షల ఇళ్ళకు చంద్రబాబు మంగమ్మ శపథాలు చేశాడని విమర్శించారు. ఇప్పుడేమో ప్రభుత్వం ఇచ్చే పట్టా అమ్ముకోకూడదని కోర్టులకు వెళ్ళి ఆపారని మండిపడ్డారు. (చదవండి: ‘పేదలకు ఇళ్లు.. ఆయనకొచ్చిన నష్టమేమిటి?’) మంచి రోజున ఈ ఇళ్ళపట్టాల కార్యక్రమం చేయడం చాలామందికి కడుపునొప్పిగా ఉందని ఎద్దేవా చేశారు. టీడిపీ ఇచ్చిన పట్టాల భూములకు రాయి కూడా కనిపించడం లేదన్నారు. చంద్రబాబు పసుపు, కుంకుమ ఇస్తే ఎన్నికల్లో మహిళలు ఉప్పు కారం పెట్టారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేవినేని ఉమ ఇంటికి కాంట్రాక్టర్లు తిరుగుతున్నారని, ఆయన తక్కువ ధరలకు భూములు చూపించగలడా? అని ప్రశ్నించారు. వ్యవసాయ భూమి పల్లం కాకపోతే ఇంకెలా ఉంటుంది, బుద్ధిలేని మాటలు మాట్లాడుతున్నారని ఉమ మీద మండిపడ్డారు. ఇళ్ళపట్టాల పంపిణీని అడ్డుకునే నాయకులను ప్రజలే నిలదీయాలని వంశీ కోరారు. (చదవండి: బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి ఓవరాక్షన్) -
పనికి మాలిన ప్రేలాపనలు మానేయ్
సాక్షి, కృష్ణా జిల్లా: మాజీ మంత్రి దేవినేని ఉమా నోరు తెరిస్తే తప్పుడు మాటలేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జక్కంపూడిలో ప్రజలు ప్రశ్నించినా ఆయనకు బుద్ధి రాలేదని ధ్వజమెత్తారు. ‘‘తప్పుడు కేసులు అంటూ పిచ్చిపట్టిన వాడిలా మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు నాతో సహా, నా తండ్రి మీద, నా ప్రచార రథం డ్రైవర్‌తో పాటు అనేక మందిపై తప్పుడు కేసులు, సస్పెక్ట్ షీట్లు పెట్టించింది నువ్వు కదా. పచ్చ చొక్కా సీఐ సూరిబాబును అడ్డం పెట్టుకుని నీవు చేసిన అరాచకాలు మైలవరం నియోజకవర్గ ప్రజలందరూ చూశారు. ఇప్పుడు అధికారంలో మేము ఉన్నాం. కానీ నీలా ఎక్కడైనా ఒక్క తప్పుడు కేసు పెట్టించిన దాఖలాలు లేవు. (చదవండి: ఆమె ఆరోపణలు నిరాధారం..) పోలవరం కాలువ మట్టి, గ్రావెల్, నీరు-చెట్టు, ఇసుక, మద్యం అన్నింటిలో దోపిడీకి పాల్పడ్డావు. 15 నెలల నా పాలన గురించి ప్రతి నిత్యం పనికి మాలిన పోస్టులు, పిచ్చి పట్టిన వాడిలా ప్రేలాపనలు చేస్తున్నావు. నీకు జక్కంపూడిలో సరైన సమాధానం చెప్పినా బుద్థి రాలేదని’’ ఆయన ధ్వజమెత్తారు. 2024 ఎన్నికలే తనకు గీటురాయి అని, అభివృద్ధి చేసి చూపించి ప్రజల్లోకి వెళ్తానని వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీల మాదిరిగా కాకుండా తమ వాలంటీర్ల వ్యవస్థ పార్టీల రహితంగా ప్రజల కోసం పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రజలే అంతిమ నిర్ణేతలు అని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. (చదవండి: చెమ్మచెక్క ఆడుతున్నావా? మంత్రి అనిల్ ఫైర్) -
తీసేసిన తహశీల్దార్ దేవినేని ఉమ: కొడాలి నాని
సాక్షి, అమరావతి : ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నేత దేవినేని ఉమపై మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శవ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట అని ఆయన విమర్శించారు. మంత్రి కొడాలి నాని సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌లో కూర్చుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు అధికారులపై అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు. కరోనా నియంత్రణపై సీఎం జగన్ ప్రతి రోజు సమీక్షిస్తున్నారు. కృష్ణా జిల్లాలో తీసేసిన తహశీల్దార్ దేవినేని ఉమ. ఎమ్మెల్యే కావడం కోసం సొంత వదినను చంపిన చరిత్ర దేవినేని ఉమది. ఉమాకు ఏ అర్హత ఉందని ఇరిగేషన్ మంత్రి చేశారు. ప్రజలకు కావాల్సింది విమర్శలు కాదు భరోసా. టీడీపీ నేతలు కరోనా పోరాటంలో కలిసి రాకపోగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. రైతులకు ప్రజలకు ధైర్యం చెప్పకపోగా వారి ఆత్మస్తైర్యం దెబ్బతినేల వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడాలనేది టీడీపీ ఉద్దేశ్యం. ప్రజలు ఇబ్బంది పడితే రాజకీయాలు చేయాలన్నదే టీడీపీ లక్ష్యం. ప్రజల కోసం నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం మాది. గత ఐదేళ్లు చంద్రబాబు చేసింది ప్రచార ఆర్భాటమే. చంద్రబాబు చేతిలో నిమ్మగడ్డ రమేష్ కీలుబొమ్మ. వ్యవస్థలు బాగుపడాలంటే నిమ్మగడ్డ రమేష్ లాంటి వారిని తీసేయాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఎస్ఈసీగా రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్‌ను నియమించాం. చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చుని నాటకాలాడుతున్నారు.’ అని ధ్వజమెత్తారు. 16 నుంచి రెండో విడత రేషన్ పంపిణీ అంతకు ముందు మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. ఈ నెల 16 నుంచి రెండో విడత రేషన్ పంపిణీ చేస్తామన్నారు. రెండో విడతలో 5 కేజీల బియ్యం, కేజీ శెనగలు ఇస్తామని తెలిపారు. 14వేల రేషన్ షాపులకు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, రేషన్ దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కూపన్ల మీద ఉన్న తేదీల్లో మాత్రమే రేషన్ దుకాణాల వద్దకు రావాలన్నారు. గ్రామ సచివాలయాల్లో రైతులు తమ పేర్లు నమోదు చేయించుకోవాలని, పౌర సరఫరాల శాఖ నేరుగా గ్రామాల్లోనే ధాన్యాన్ని సేకరిస్తోందన్నారు. -
‘మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం’
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అంధ్రప్రదేశ్-అమరావతి ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు నీలకంఠారెడ్డి పేర్కొన్నారు. అంతేకాకుండా సీఎం జగన్ ఆదేశిస్తే ఎక్కడికైనా వెళ్లి విధులు నిర్వర్తించేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నీలకంఠారెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీబీ అధికారులకు భయపడి ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగులపై దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ నేతలు బాధ్యతగా మాట్లాడాలని, ఇలా కించపరిచే వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అదేవిధంగా సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు నీలకంఠారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. -
దేవినేని ఉమా పెద్ద ఇసుక మాఫియా కింగ్
-
‘అప్పుడు దోచేశావ్.. ఇప్పుడు కొరత అంటున్నావ్’
సాక్షి, మైలవరం: అధికారంలో ఉన్న సమయంలో అడ్డగోలుగా ఇసుక దోచేసిన దేవినేని ఉమా ఇప్పుడు కొత్తగా ఇసుక కొరత అంటూ ధర్నాలు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఎద్దేవా చేశారు. ఇసుక కోసం ధర్నాలు చేసే అర్హత దేవినేని ఉమాకు లేదని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇసుక నుంచి తైలంబు ఎలా తీయవచ్చో దేవినేని ఉమాకు తెలిసినంతగా రాష్ట్ర్రంలో ఎవరికి తెలియదు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఇసుక కోసం ధర్నాలు చేస్తున్నారు’అని అన్నారు. ‘మైలవరం నియోజకవర్గ పరిధిలో నీ ఆధ్వర్యంలో ఇసుక అక్రమ దందాపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ రూ.100 కోట్ల జరిమానా విధించిన సంగతి మరిచిపోయావా’అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో మంత్రి హోదాలో ఉన్న ఉమా అధికారం దుర్వినియోగంతోనే ఆ ప్రాంతంలో ఇసుక అందుబాటులో లేకుండా పోయిందని వెల్లడించారు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు.. తప్పు మీద తప్పులు చేస్తున్నారని చురకలంటించారు. సెప్టెంబర్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ద్వారా అందరికీ ఇసుక అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. -
టీడీపీ నేతలకు అంత సంతోషమెందుకో: కొడాలి నాని
సాక్షి, అమరావతి : పోలవరంపై హైకోర్టు తాత్కాలికంగా స్టే ఇచ్చిందే కాని చంద్రబాబు నాయుడు చుట్టాలకు ఆ పనులు అప్పగించాలని చెప్పలేదని పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఎవరైనా కోర్టుకు వెళితే స్టే ఇవ్వడం సహజమేనని, ఆ మాత్రం దానికే టీడీపీ నేతలు సంతోషపడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టు మారితే అంతకు ముందు నిర్మాణ సంస్ధల నుంచి తీసుకున్న డబ్బులు వెనక్కి ఇవ్వాల్సి వస్తుందనే భయం టీడీపీ నేతలకు పట్టుకుందని ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి డబ్బులు మిగులుతాయని చంద్రబాబు, దేవినేని ఉమా ఏడుస్తున్నారని ఆరోపించారు. గురువారం వెలగపూడి సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కొడాలి నాని టీడీపీపై తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. అవినీతి నిర్మూలనలో అనేక వత్తిడులు ఎదురవుతున్నాయని గతంలో ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. రివర్స్‌టెండరింగ్ ద్వారా ప్రజాధనాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నారని, సీఎం అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత పోలవరంపై న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పారు. రాజధానిపై అనవసర రాద్దాంతం రాజధానిపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు అనవర రాద్దాంతం చేస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని, రాజధానిని అమరావతి నుంచి తీసివేస్తామని ఆయన చెప్పలేదని స్పష్టం చేశారు. కృష్ణానదికి పెద్దగా వరదలు వచ్చినా, గట్టిగా వర్షాలు కురిసినా అమరావతి మునిగిపోతుందని ఆయన చెప్పారన్నారు. అందులోని లోపాలను గురించి బొత్స వివరించారని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాలతో పోల్చితే అమరావతిలో భవన నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతుందని ఆయన చెప్పారని తెలిపారు. రాజధాని నిర్మాణంపై జరిగిన అవినీతిపై సబ్ కమిటీ వేశామని, దోచుకున్న వాళ్లు అనుభవించక తప్పదని కొడాలి నాని స్పష్టం చేశారు. చంద్రబాబుకు ప్రజలు గూబ గుయ్యమనేలా తీర్పు ఇచ్చినా ఇంకా బుద్ధి రాలేదన్నారు. -
బాబు ఇల్లు మునిగితే.. సంతాప దినాలా!
సాక్షి, అమరావతి: వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను ఆదుకునేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులు, అధికారులు అహర్నిశలు శ్రమిస్తుంటే .. చంద్రబాబు ఇల్లు మునుగుతోందంటూ టీడీపీ నేతలు వారం రోజులపాటు సంతాప దినాలు జరుపుకుంటున్నారని ఎమ్మెల్యే జోగి రమేష్ ఎద్దేవా చేశారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వరదలతో ప్రజలు అల్లాడుతుంటే వారికి సహాయం చేయాలని ఏ రాజకీయ పార్టీకైనా, వ్యక్తికైనా అనిపిస్తుందన్నారు. చంద్రబాబు, ఆయన వందిమాగధులైన దేవినేని ఉమ, బుద్దా వెంకన్న, బొండా ఉమ లాంటివారు మాత్రం బురద రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇక్కడ ఒక ఇంటిని కూడా నిర్మించుకోలేదన్నారు. ఎవరో నిర్మించిన అక్రమ కట్టడంలో ఉండటం ఏంటని నిలదీశారు. బుద్ధిలేని వెంకన్న ఆత్మహత్య చేసుకుంటానంటున్నారని.. ఇలాంటి మాటలు మాట్లాడటానికి సిగ్గు, శరం ఉండాలని పేర్కొన్నారు. చంద్రబాబు ఇంటిపై డ్రోన్ ఎగరటం పెద్ద సమస్యలా గగ్గోలు పెడుతున్నారని, డ్రోన్లతో వరద పరిస్థితులను అంచనా వేయటం తప్పెలా అవుతుందని నిలదీశారు. చంద్రబాబును హత్య చేయడానికి కుట్ర జరుగుతోందని టీడీపీ నేతలు అంటున్నారని.. ఐదుకోట్ల ఆంధ్రులు ఆయనను ఇప్పటికే రాజకీయంగా సమాధి చేశారని అన్నారు. చంద్రబాబును హత్య చేయాల్సిన అవసరం, అగత్యం ఎవరికీ లేదని, ఆయన బందరు రోడ్డులో నడుచుకుంటూ వెళ్లినా పట్టించుకునేవారే ఉండరని అన్నారు. ఓర్వలేకే జగన్ పర్యటనపై విమర్శలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్తే ఓర్వలేని వారంతా మాట్లాడుతున్నారని, టీడీపీ వారి లాగా పర్యటనలకు రూ.కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదని రమేష్ పేర్కొన్నారు. ఇందుకు సీఎం వైఎస్ జగన్ తన సొంత డబ్బు వెచ్చిస్తున్నారని స్పష్టం చేశారు. పెట్టుబడుల కోసం అక్కడి వారితో మాట్లాడి పరిశ్రమలు వచ్చేలా చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు చౌకబారు మాటలు మాట్లాడుతూ.. విందులు, విలాసాలు చేస్తున్నారనటం సరికాదన్నారు. కొందరు బీజేపీలో చేరి చంద్రబాబుకు అనుకూలంగా అద్దె గొంతులు వినిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ అధిష్టానం ఇలాంటి కోవర్టులను గురించి తెలుసుకుని ప్రవర్తించాలన్నారు. కనీస జ్ఞానం లేకుండా లోకేశ్ పడవను అడ్డుపెట్టి వరదను చంద్రబాబు ఇంట్లోకి పంపారని ట్వీట్ చేయటం అతడి అపరిపక్వతకు నిదర్శనమన్నారు. -
అవి నరం లేని నాలుకలు
సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో/మంగళగిరి : ప్రతిపక్ష నేత చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా సహా టీడీపీ నేతలవి నరం లేని నాలుకలని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రభావాన్ని అంచనా వేసేందుకు డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తే చంద్రబాబు భద్రతకు ముప్పు అంటూ గగ్గోలు పెడుతున్నారని దుయ్యబట్టారు. వరద ఉధృతికి ఒకవేళ చంద్రబాబు ఇల్లు మునిగిపోతే ప్రభుత్వం పట్టించుకోలేదని టీడీపీ నేతలు విమర్శలు చేసేవారన్నారు. శుక్రవారం సచివాలయంలో మంత్రులు అనిల్‌కుమార్, కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో వరద పరిస్థితిని తెలుసుకోవడానికి డ్రోన్ కెమెరా వినియోగిస్తే టీడీపీ నేతలకు వచ్చిన బాధ ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నట్టు శ్రీశైలంతో సహా మిగిలిన ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండిన తర్వాతే కిందకు నీళ్లు వదలడం మొదలుపెట్టి ఉంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకేసారి 12 లక్షల క్యూసెక్కులను కిందకు వదలాల్సి ఉంటుందని, అదెంత ప్రమాదకరమో తెలియదా అని నిలదీశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు తన ఇంట్లో అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నారా? వరద ప్రవాహాన్ని అంచనా వేసేందుకు డ్రోన్లతో చిత్రీకరిస్తే ఆయనకు ఎందుకు అంత ఉలికిపాటు అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. రాష్ట్రంలోని జలాశయాలు నిండుకుండల్లా మారడంతో రైతులు, ప్రజలు ఆనందంగా వేడుకలు చేసుకుంటుంటే, టీడీపీ నేతలు మాత్రం ఏడుపు మొహాలు వేసుకుని నిందలు వేస్తున్నారని విమర్శించారు. నలభై ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకుని, సామాజిక బాధ్యతతో వ్యవహరించి వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వానికి సహకరించాలని ఎమ్మెల్యే ఆర్కే హితవు పలికారు. -
అసత్యారోపణలు మానకుంటే నాలుక కోస్తా...
-
దలితులను కించపరిచిన టీడీపీ నేత దెవినేని
-
దేవినేని మైలవరం నియోజవర్గం సమస్యలను నిర్లక్ష్యం చేశారు
-
దేవినేని ఉమకు షాక్ ఇచ్చిన సోదరుడు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఊహించని షాక్ తగిలింది. ఆయన సోదరుడు దేవినేని చంద్రశేఖర్ సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వసంత కృష్ణప్రసాద్‌తో కలిసి దేవినేని చంద్రశేఖర్ లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. పార్టీ కండువా కప్పి చంద్రశేఖర్‌ను వైఎస్సార్సీపీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అనేక రకాల కారణాలు వల్ల పార్టీ మారాల్సి వచ్చిందని చెప్పారు. చదవండి: అమ్మ.. ఉమా! అధికార పార్టీ దోపిడీ ఎక్కువగా ఉందని, పట్టిసీమ ఇరిగేషన్ లాంటి ప్రాజెక్టుల్లో దోపిడీ అధికంగా ఉందని ఆరోపించారు. కేసుల నుండి టీడీపీ నేతలు బయటపడ లేరని అన్నారు. రావణుడి లంక నుండి విభీషణుడు బయటకు వచ్చినట్లు దేవినేని ఉమ నుండి దేవినేని చంద్రశేఖర్ బయటకు వచ్చారని వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. దేవినేని చంద్రశేఖర్, తాను ఎన్నికల్లో కలిసి పనిచేస్తామని తెలిపారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమను అణగదొక్కాలని మంత్రి దేవినేని ఉమ చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇంకా మంత్రి ఆగడాలు సాగవన్నారు. చదవండి: టీడీపీకి దెబ్బ పడింది -
వైఎస్సార్సీపీలో చేరిన దేవినేని చంద్రశేఖర్
-
మైలవరం పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత
-
మైలవరం సిఐ టీడీపీ ఏజెంట్
-
అవినీతి ఫలితం!
‘‘నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. కానీ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు వస్తుందో? లేదో? నాకే తెలీదు. అధికారంలో లేనప్పుడు మీరెలా ఉన్నారు? ఇప్పుడెలా ఉన్నారు? ఒక్కో నియోజకవర్గానికి రూ.వేల కోట్ల నిధులు ఇచ్చాం. అయినా పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. ఒక్కో ఎమ్మెల్యే ఎంత సంపాదించారో, అవినీతి చిట్టా సీఎం వద్ద ఉంది.’’– ఈ నెల 22న టీడీపీ సమన్వయ కమిటీ భేటీలోఇన్చార్జ్ మంత్రి దేవినేని ఉమా ఈ వ్యాఖ్యలు చూస్తే గత నాలుగున్నరేళ్లలో అవినీతి ఏ స్థాయిలో జరిగిందో? నిధులు ఏ తీరున దుర్వినియోగం అయ్యాయో, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందో? అర్థమవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో కూడా ఆయన వ్యాఖ్యాలను బట్టి తెలుస్తోంది. – సాక్షి ప్రతినిధి, అనంతపురం సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో పాటు రాజకీయ వర్గాలు.. కుల, ఉద్యోగ సంఘాల్లో మంత్రి దేవినేని ఉమ వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతోంది. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు, వారితో పాటు సహచర మంత్రే దేవినేని. కానీ ఇంత పరుషంగా సొంత పార్టీ నేతలపై మండిపడ్డారంటే, దాని వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని ఇట్టే తెలుస్తోంది. లేదంటే ‘అనంత’ టీడీపీ నేతలను మందలించే సాహసం దేవినేని చేయలేరు. చంద్రబాబు కూడా జిల్లా నేతలను గతంలో రెండుసార్లు అమరావతికి పిలిచి మందలించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇక్కడి పరిస్థితి నానాటికీ దిగజారుతోందని, హద్దు దాటే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కానీ సీఎం మాటలను జిల్లా నేతలు గడ్డిపోచలా భావించారు. విని వదిలేయడం తప్ప వాటిని సీరియస్‌గా తీసుకోని పరిస్థితి. ‘దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలి’ అనే చందంగా అన్ని నియోజకవర్గాల్లో ఎవరికి వారు దోపిడీపర్వం కొనసాగించారు. 11 చోట్ల ఓటమి ఖాయం.. టీడీపీ మూన్నెల్ల కిందట ఓ సర్వే చేయించింది. అప్పట్లో 11 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 పార్లమెంట్ స్థానాల్లో ఓటమి ఖాయమని రిపోర్ట్లు వచ్చినట్లు ఆ పార్టీ నేతల ద్వారా తెలిసింది. తాజాగా డిసెంబర్ మొదటి వారంలో ఓ సర్వే పూర్తయింది. ఇందులో కూడా 11 చోట్ల ఓటమి ఖాయమని, మరో రెండు చోట్ల కూడా గడ్డుపరిస్థితి ఉందని తేలింది. ఈ లెక్కన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా భావించే మహబూబ్‌నగర్, నల్గొండ లాంటి జిల్లాల్లో ఆపార్టీ ఎలా తుడిచిపెట్టుకుపోయిందో, ఎలాంటి ఉద్ధండులు ఓడిపోయారో అచ్చం అదే తరహా పరిస్థితి జిల్లాలోనూ తప్పదని నిఘా వర్గాలతో పాటు పార్టీ సర్వేల్లోనూ చంద్రబాబుకు అవగతమైంది. దీంతోనే ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సభ్యత్వ నమోదు సాకుగా చూపి చంద్రబాబు అందరిపై ఫైర్ అయ్యారు. అనంతపురం, రాయదుర్గంతో పాటు చాలాచోట్ల సభ్యత్వ నమోదు దారుణంగా ఉందని మండిపడ్డారు. ‘జిల్లా ఇన్చార్జి మంత్రిగా నువ్వేం చేస్తున్నావని దేవినేనిని మందలించారు. ప్రత్యేకంగా దేవినేనిని పిలిచి క్లాస్ తీసుకున్నారు. ‘ఎమ్మెల్యేలు మోనోపోలీగా ఉన్నారు. వన్‌సైడ్ అయ్యారు. ప్రతీ నియోజకవర్గానికి వేలకోట్ల నిధులిచ్చాం. ప్రతి ఒక్కరూ భారీగా ఆర్జించారు. ఎవరెవరు ఎంత సంపాదించారో నా వద్ద లిస్ట్ ఉంది. ఇన్చార్జిగా నియమిస్తే నెలకోసారి వెళ్లి కబుర్లు చెప్పి వస్తున్నావా? ఇలా అయితే నీ కథ చూడాల్సి వస్తుంది’ అని చంద్రబాబు మండిపడినట్లు తెలుస్తోంది. దీంతో ఉమా ఆ కోపం ఎమ్మెల్యేలపై చూపించినట్లు సమాచారం. చంద్రబాబు ప్రస్తావన రావడంతో ఎమ్మెల్యేలు కూడా కిమ్మనకుండా ఉండిపోయారు. పరిస్థితి చూస్తుంటే గత నెలలో సీఎం సమీక్షలతో శింగనమల, కళ్యాణదుర్గం, గుంతకల్లు టిక్కెట్లు సిట్టింగ్‌లకు రావని తేలింది. ఆ సమీక్షల్లో ‘అనంత’ పేరు ఉన్నా, చౌదరి ఆఖరి నిమిషంలో దేవినేనితో మాట్లాడి సమీక్ష లేకుండా చేసుకోగలిగారు. ఈ లెక్కన ‘అనంత’ టిక్కెట్టు కూడా డౌటే. పోతే పెనుకొండ కావాలని నిమ్మల పట్టుబట్టడం, పల్లె రఘునాథరెడ్డి పూర్తి నిస్సత్తువగా మారిపోవడం, రాయదుర్గంలో కాలవను వ్యతిరేకించడం, మడకశిరలో ఈరన్న రాజీనామా తదితర అంశాలతో పార్టీ పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారైంది. ధర్మవరం, రాప్తాడు, తాడిపత్రి, ఉరవకొండ, హిందూపురం లాంటి నియోజకవర్గాల్లో పోటీ ఎవ్వరూ లేరు కాబట్టి టిక్కెట్టు వస్తుంది. కానీ ఇక్కడా వారు గెలిచే పరిస్థితి లేదు. తక్కిన నియోజకవర్గాలతో పోలిస్తే వీటిల్లోనే టీడీపీ బాగా బలహీనపడిందని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో జనవరిలో విడుదల చేసే తొలి జాబితాలో జిల్లా నుంచి నాలుగైదు పేర్ల కంటే ఎక్కువ ఉండే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇదే జరిగితే కనీసం ఐదుగురికి పైగా సిట్టింగ్‌లకు మూడినట్లే. ఒక్కొక్కరిదీ ఒక్కో చరిత్ర ♦ రాప్తాడు ఎంపీపీ దగ్గుబాటి ప్రసాద్‌కు మంత్రి పరిటాల సునీత అన్యాయం చేయడం, ఆర్థికంగా దెబ్బతీసేందుకు మురళీ రూ.30కోట్లతో ఎస్వీఆర్ఎస్ పాలిమర్స్‌ను హైదరాబాద్‌లో స్థాపించారు. ♦ పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగతంగా ఎదగాలనే స్వార్థంతో మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి లాంటి వాళ్లను మంత్రి కాలవ దూరంపెట్టి పార్టీకి నష్టం చేశారు. ♦ కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే తనయుడు మారుతీ పూర్తిగా పార్టీ నేతలు, కార్యకర్తలను విస్మరించి తమ కుటుంబమే ఆర్థికంగా ఎదగాలని దోపిడీకి తెరలేపినట్లు చర్చ జరుగుతోంది. ♦ బాలకృష్ణ బాధ్యతారాహిత్యంతో పీఏలు ఏకంగా హిందూపురంలో దుకాణం పెట్టారు. ♦ వలసొచ్చిన అత్తార్ చాంద్‌బాషా ప్రతీ పనిలో కమిషన్లు ఆరగిస్తున్నారనే అపవాదు ఉంది. ♦ తాడిపత్రిలో అడ్డూఅదుపు లేకుండా గ్రానైట్ ఫ్యాక్షరీల నుండి ట్రాన్స్‌పోర్ట్‌ల వరకూ అన్నిటిలోనూ జేసీ బ్రదర్స్ వేలుపెడుతుండటం తెలిసిందే. ♦ ధర్మవరంలో ఎమ్మెల్యే సూరి ఆర్థికంగా ఎక్కడికో ఎదిగిపోయారనేది బహిరంగ రహస్యం. ♦ జయరాంనాయుడు లాంటి లీడర్లతో పాటు ఉమామహేశ్వర్, లాలెప్ప, విద్యాసాగర్, దుర్గేశ్ లాంటి కార్పొరేటర్లను కూడా ఎమ్మెల్యే చౌదరి కక్షకట్టినట్లు వ్యవహరించి పార్టీని బలహీనపర్చారనే చర్చ ఉంది. ♦ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ హంద్రీ–నీవా, గాలిమరల భూముల కొనుగోళ్లలో చేతివాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ♦ చివరకు ‘కియా’లోని కొరియా ఉద్యోగులు తమ దేశం నుంచి ‘లిక్కర్’ తెచ్చుకోవాలన్నా’ కప్పం కట్టండి అని ఎమ్మెల్యే పార్థసారథే చెబుతున్నట్లు ఎంపీ నిమ్మల కిష్టప్ప పరోక్షంగా సీఎంకు ఫిర్యాదు చేశారు. ఒక్కో నియోజకవర్గంలో రూ.3వేల కోట్ల వరకూ అవినీతి మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలతో పాటు ఇతర నియోజకవర్గాల్లో రూ.3వేల కోట్ల వరకూ అవినీతి జరిగింది. ఈ మొత్తం ‘అవినీతి’లో సింహభాగం ఎమ్మెల్యేల జేబుల్లోకి వెళితే ఆ తర్వాత స్థానం ఆ పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు, ఆ పార్టీ అండతో పనులు దక్కించుకున్న ఏజెన్సీలు లబ్ధి పొందాయి. మూడోస్థానంలో నేతల కుటుంబీకులు, అస్మదీయులు ఉన్నారు. చివరగా పార్టీ ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు వెనకేసుకున్నారు. మొత్తంగా కార్యకర్తలకు ఒరిగింది ఏమీలేదు. ఇక్కడే తేడా కొట్టింది. ‘ఎంత చెప్పినా కార్యకర్తలను కలుపుకుని వెళ్లలేదు. వారి బాగోగులు పట్టించుకోలేదు’ అనే దేవినేని ఉమా పదేపదే వ్యాఖ్యానించారు. సొంతపార్టీ కార్యకర్తలే ఆయా నియోజకవర్గాల్లో సాగిన అవినీతిని పుంఖాను పుంఖాలుగా ప్రచారం చేస్తుండటమే అందుకు నిదర్శనం. టీడీపీ నేతల అవినీతి బాగోతాలను వందల సంఖ్యలో ఇంటెలిజెన్స్ అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరవేశారు. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి పార్టీ పరిస్థితిపై సర్వేలు చేయిస్తూ వచ్చారు. కానీ గతంలో చేయించిన సర్వే చూస్తే తర్వాత వచ్చే సర్వే మరింత దారుణంగా ఉంటోంది. ‘అనంత’పై చంద్రబాబు దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు. దీంతోనే నెలకోసారి జిల్లా పర్యటనకు వస్తున్నారు. మారాల రిజర్వాయర్‌కు నీళ్లిచ్చేందుకు గత నెలలో వచ్చి ఏకంగా రెండురోజులు మకాం వేసి అర్ధరాత్రి 2గంటల వరకూ నియోజకవర్గ సమీక్షలు నిర్వహించి సహజశైలికి భిన్నంగా కార్యకర్తల సమక్షంలోనే ఎమ్మెల్యేలను మందలించారు. ఎన్ని చేసినా పరిస్థితి మాత్రం దారికి రాకపోవడం గమనార్హం. -
‘కల్లు తాగిన కోతిలా ప్రేలాపనలు’
సాక్షి, విజయవాడ : తెలుగు దేశం పార్టీ నాయకుడు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సభ్యతా సంస్కారం మరిచి మాట్లాడుతున్నారని, కల్లు తాగిన కోతిలా ప్రేలాపనలు పేలుతున్నారని వైఎస్సార్ సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ విమర్శించారు. బుధవారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ.. మైలవరంలో ప్రజలకు సాగు నీరు, తాగునీరు ఇవ్వలేని సాగునీటి మంత్రి ఎటువంటి అనుమతులు లేకుండా పనులు ప్రారంభించారని, వాటికి నేడు కోట్లాది రూపాయల టెండర్లు పిలుస్తున్నారని తెలిపారు. దానిపై తాము అధికారులకు ఫిర్యాదు చేస్తే ‘కృష్ణ ప్రసాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు’ అంటూ దేవినేని ఉమా ప్రచారం చేస్తున్నాడని చెప్పారు. మంత్రి ఉమా ఇరిగేషన్ శాఖను అవినీతి శాఖగా మార్చేశారని మండిపడ్డారు. ఇరిగేషన్లో జరుగుతున్న అవినీతిపై మంత్రి ఉమా ఎందుకు సమాధానం చెప్పటం లేదని ప్రశ్నించారు. మైలవరం నియోజకవర్గంలో ప్రభుత్వ, దేవాలయ భూముల్ని బినామీలకు కట్టబెట్టారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను తన అనుచరులతో ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నియోజకవర్గ పరిధిలో అనుమతులు లేకుండా 60 కోట్ల రూపాయలుతో రోడ్లు వేస్తున్నారని, వాటికి 150 కోట్ల రూపాయలకు బిల్లులు చేసుకోబోతున్నారని చెప్పారు. వైవీ సుబ్బారెడ్డిని విమర్శించే స్థాయి దేవినేని ఉమాకు లేదన్నారు. జగన్‌పై హత్యాయత్నం వెనుక అసలు వాస్తవాలు బయటకు వస్తాయనే భయంతో.. డ్రామా అంటూ దుస్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేవినేని ఉమా త్వరలో విచారణను ఎదుర్కోడానికి సిద్దంగా ఉండు’ అంటూ హెచ్చరించారు. మంత్రి దేవినేని ఉమా అవినీతి నిరూపణ కావటం ఖాయమన్నారు. -
దేవినేని అడ్డగోలు దోపిడి
-
దేవినేనీ.. ఇదేం పని!
అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షం ఊసే లేకుండా చేయాలన్న లక్ష్యమో.. లేక ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పట్ల రోజురోజుకీ ప్రజల్లో పెరుగుతోన్న ఆదరణకు భయమేస్తోందో.. మొత్తానికి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల్లో వణుకు మొదలైంది. ముఖ్యంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా తన నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ లేదని చూపడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఫ్లెక్సీల రాజకీయానికి తెరతీశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు చెందిన ఫ్లెక్సీ గానీ, హోర్డింగ్ గానీ కనిపించిందా.. అధికారులపై శివాలెత్తిపోతున్నారు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. సాక్షి, అమరావతిబ్యూరో : అత్త సొమ్ము అల్లుడి దానం అంటే ఇదే.. మైలవరం నియోజకవర్గంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రభుత్వ సొమ్మును యథేచ్ఛగా సొంత ప్రచారానికి దుర్వినియోగం చేస్తున్నారు. అదేమంటే.. ఇది ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ మాత్రమేనని.. ఇందులో మంత్రి చేసుకుంటున్న సొంత ప్రచారం ఏదీ లేదని ఆయన అనుచరులు బుకాయిస్తున్నారు. సరే.. ప్రభుత్వ పథకాల కోసమే నియోజకవర్గంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారనుకున్నా.. ఆయా శాఖల మంత్రుల ఫోటోలు ఆ ఫ్లెక్సీల్లో ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్నలకు ఎటువంటి సమాధానం లేని పరిస్థితి. కేవలం ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు లోకేష్, మంత్రి దేవినేని ఉమాకు ముఖచిత్రాలు మినహా ఎవ్వరి ఫోటోలకు ఫ్లెక్సీలో చోటు లేకపోవడం గమనార్హం. వీటన్నింటిని ఏర్పాటు చేసిన యాడ్స్ కంపెనీకి నెలనెలా ప్రభుత్వమే లక్షలాది రూపాయలు చెల్లిస్తోంది. ప్రతిపక్ష నేతల ఫ్లెక్సీలు కనిపిస్తే శివాలే.. తెలుగుదేశం అధినేత వైఖరితో అధికారపార్టీపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యం.. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తుండటంతో మంత్రి దేవినేని ఉమా నియోజకవర్గంలో తనకు ప్రత్యర్థిగా ఉన్న ప్రతిపక్షనేతపై కత్తికట్టారు. ఎక్కడా వారికి సంబంధించిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకు అధికార యంత్రాంగాన్ని పావుగా వాడేసుకుంటున్నారు. పొరపాటున ఆయన పర్యటిస్తున్న ప్రాంతంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు కనిపిస్తే అధికారులపై ఆయన శివాలెత్తిపోతున్నారు. అధికారులే దగ్గరుండీ.. దీంతో మంత్రికి జడిసి పంచాయతీ, మున్సిపాలిటీ, పోలీసు అధికారులు దగ్గరుండీ ప్రతిపక్ష నేతల ఫ్లెక్సీలు తొలగించేస్తున్నారు. మైలవరం, ఇబ్రహీంపట్నం పోలీసులకు ఈ పని నిత్యకృత్యంగా మారిందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇటీవల వెలగలేరు గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన ఫ్లెక్సీ ఒకటి ఏర్పాటు చేయగా.. దానిని దగ్గరుండి పోలీసులు తొలగించడం జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలు కడితే వారిపై రౌడీ షీట్లు తెరుస్తామని బెదిరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా.. జాతీయ రహదారులపై ఎలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి వీల్లేదు. ఎన్హెచ్ఐ నిబంధనల మేరకు ఏ పార్టీకి చెందిన ఫ్లెక్సీలు పెట్టినా నేరమే. పైగా ఎవరైనా ఏర్పాటు చేసినా వాటిని ఎన్హెచ్ఐ సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగించేస్తారు. పదేపదే ఎవరైనా కావాలని పెడితే.. వారికి నోటీసులు జారీ చేసి చర్యలకు ఉపక్రమిస్తారు. అయితే హైదరాబాద్, జి.కొండూరు జాతీయ రహదారుల్లోని సెంటర్ మీడియన్పై ఏర్పాటు చేసిన విద్యుత్తు స్తంభాలపై దాదాపు 25 కిలోమీటర్ల మేర ప్రభుత్వ సొమ్ముతో ఫ్లెక్సీలు పెట్టారు. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా ఎన్హెచ్ఐ అధికారులు అధికారపార్టీకి వత్తాసు పలుకుతున్నారు. అదేసమయంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఫ్లెక్సీలు ఎక్కడైనా ఉంటే రాత్రిరాత్రే వచ్చి వాటిని తొలగించేస్తున్నారు. ‘మంత్రి ఉమాకు ఓటమి భయం పట్టుకుంది’ కొండపల్లి(ఇబ్రహీంపట్నం): రాష్ట్రమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఓటమిభయం పట్టుకుందని వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర నాయకుడు కాండ్రకొండ పెద్ద గురవయ్య అన్నారు. కొండపల్లిలో వైఎస్సార్ సీపీ బ్యానర్లు తొలగించటమే కాకుండా గోడలకు అంటించిన వాల్‌పోస్టర్లు కూడా అధికారులతో చించివేయించటం చూస్తుంటే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుందన్నారు. కొండపల్లి పార్టీ కార్యాలయంలో వాల్‌పోస్టర్లు చించివేయటంపై గురువారం విలేకరుల సమావేశం నిర్వహించి మంత్రి చేష్టలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సర్పంచి కాండ్రకొండ చినగురవయ్య, షేక్ షిలార్దాదా, అడపా దుర్గా ప్రసాద్, పల్లపోతు నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, జాషువారాజు పాల్గొన్నారు. -
దుర్గగుడిలో మంత్రి దేవినేనికి చుక్కెదురు
సాక్షి, విజయవాడ : దుర్గగుడిలో మంత్రి దేవినేని ఉమకు చుక్కెదురైంది. సాధారణ భక్తులు వెళ్లే క్యూలైన్లో కొండపైకి వచ్చిన మంత్రి ఉమని.. ఓ భక్తురాలు సమస్యలపై నిలదీసింది. క్యూలైన్లో ఉన్న మంత్రి ఉమ గుడిలోని సదుపాయాల గురించి భక్తులను అడుగగా.. క్యూలైన్ల నిర్వహణ గందరగోళంగా ఉందని, గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఓ మహిళా భక్తురాలు అసహనం వ్యక్తం చేసింది. వీఐపీలకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది. దీంతో జవాబు చెప్పలేక పోయిన మంత్రి సమయం అవుతోందంటూ గుడిలోకి వెళ్లిపోయారు. ఫిర్యాదు చేస్తే పట్టించుకోని మంత్రి ఈ మాత్రానికే క్యూలైన్లలో రావటం, సమస్యలు ఉన్నాయా అని అడగటం ఎందుకని భక్తులు అసహనం వ్యక్తం చేశారు. -
పోలవరం వైఎస్ పుణ్యమే
విజయవాడ సిటీ : పోలవరం ప్రాజెక్టు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి అన్నారు. మహానేత తనయుడిగా పోలవరం గురించి మాట్లాడే హక్కు వైఎస్ జగన్‌కే ఉందని చెప్పారు. విజయవాడలోని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి రాగానే 2017నాటికల్లా ప్రాజెక్టు పూర్తిచేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రగల్భాలు పలికిందన్నారు. అనంతరం మాటమార్చి 2018లోగా పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన విషయాన్ని మరిచిపోయారని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల 2019లోగానైనా ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదని.. ఒకవేళ ఈ ప్రభుత్వం ప్రకటించిన గడువు లోపు ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తి చేస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని..లేదంటే మంత్రి దేవినేని ఉమా తప్పుకోవాలని ఆయన సవాల్ విసిరారు. గోదావరి నీరంతా సముద్రంలో కలుస్తుంటే మహానేత స్పందించి పోలవరానికి శ్రీకా రం చుట్టిన విషయాన్ని గుర్తు చేశారు. కృష్ణా డెల్టా గురించి ముసలి కన్నీరు కార్చే టీడీపీ నాయకులు పులిచింతల ప్రాజెక్టుకు టెండర్లు ఎందుకు పిలువలేదో సమాధానం చెప్పాలన్నారు. ఉమా తాను చేసే బ్రోకరిజాన్ని కప్పి పుచ్చుకునేందుకు వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తున్నారన్నారు. ఆనాడు చంద్రబాబు, సోనియాగాంధీ కలిసి వైఎస్ జగన్‌పై అక్రమ కేసులు పెట్టారని, ఈ విషయంపై న్యాయపోరాటం చేస్తున్నామన్నారు. టీడీపీ మంత్రులు నోటికివచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. ఎక్కడైనా ప్రాజెక్టు పూర్తి అయిన తరువాత జాతికి అంకితం చేస్తారని, కానీ డయా ఫ్రంవాల్ కట్టి పోలవరాన్ని జాతికి అంకితం చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరేనని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అనుమానాన్ని ఉమా నివృత్తి చేయాలి మంత్రి దేవినేని ఉమా ‘మగ–ఆడో’ తెలియడం లేదని గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వచ్చిన అనుమానాన్ని ఇప్పడైనా నివృత్తి చేయాలని పార్థసారథి సూచించారు. కేసీఆర్ విజయవాడ వచ్చినప్పుడు దేవినేని ఉమా వంగి వంగి దండాలు పెడుతూ తిరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. -
టీడీపీ మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు
-
‘పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తాం’
విజయవాడ: పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నేతలకు లేదని వైఎస్సార్ సీపీ నేత పార్థసారధి స్పష్టం చేశారు. అసలు పోలవరంకు పునాది వేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అయితే, టీడీపీ మంత్రులు నోటికి వచ్చినట్లు మాట్లాడటం ఎంతవరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు. పోలవరంతో సంబంధాలేని విషయాల్ని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తాజాగా లేవనెత్తడం విడ్డూరంగా ఉందన్నారు. మంగళవారం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన పార్థసారధి.. కనీసం రాజకీయ జ్ఞానం లేకుండా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దేవినేని ఉమ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి ఉమ చేతకానితనం కప్పిపుచ్చుకునేందుకే జగన్‌పై విమర్శలు చేస్తున్నారన్నారు. దేవినేని స్థాయి మరచి మాట్లాడుతున్నారని, పోలవరం గురించి మాట్లాడే హక్కు వైఎస్సార్ వారసులకే ఉందనే విషయం గుర్తించుకోవాలన్నారు. ఉమ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని ఈ సందర్భంగా పార్థసారధి సవాల్ విసిరారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తామన్నారు. ప్రాజెక్టులపై బీజేపీ, టీడీపీ ప్రజలను మోసం చేస్తూ ట్రిక్కులు చేస్తున్నాయని మండిపడ్డారు. ముందు మంత్రి ఉమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మానేసి, రైతులకు మేలు చేసే విధంగా ఆలోచించాలన్నారు. జిల్లాల్లో చాలా చోట్ల నీరు లేక పంటలు ఎండిపోతున్న విషయం మంత్రలు గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు. 2019లోగా పోలవరం ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం పూర్తిచేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని పార్థసారధి తెలిపారు. ఉమకు సిగ్గుంటే చంద్రబాబు ప్రభుత్వంపై సీబీఐ విచారణకు చేయించుకునే దమ్ముందా? అని పార్థసారధి చాలెంజ్ విసిరారు. -
ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ దేవినేని ఉమ
-
ఎమ్మెల్యే ప్రొగ్రస్ రిపోర్ట్ దేవినేని ఉమ
-
రాష్ట్ర శ్రేయస్సు కన్నా బాబుకు కమీషన్లే ముఖ్యం
-
పోలవరం పనుల్లో మరో అవినీతి పర్వం
-
రంగా హత్య వెనుక దేవినేని ఉమా హస్తం
కంచికచర్ల(నందిగామ): వంగవీటి మోహన్ రంగా హత్యకేసులో మొదటి ముద్దాయి దేవినేని కుటుంబమేనని వైఎస్సార్సీపీ నేత, మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు ఆరోపించారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరంలోని తన స్వగృహంలో వసంత శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. మంత్రి దేవినేని ఉమాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సొంత అన్న వెంకటరమణ అయ్యప్పమాలలో ఉండి వంగవీటి మోహన్‌రంగాను హత్య చేశాడని, ఆ హత్య వెనుకాల ఉమామహేశ్వరరావు హస్తముందని ఆయన అన్నారు. నిత్యం అబద్ధాలాడుతూ ప్రజా సమస్యలు పట్టించుకోకుండా పట్టిసీమ పేరుతో తన అనుచరులతో కలిచి కోట్లు దోచుకున్న ఘనత ఉమామహేశ్వరరావుదేనని ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధికోసం సొంత అన్న దేవినేని వెంకటరమణ భార్యను మానసిక ఒత్తిడికి గురిచేసి ఆమె మరణానికి కారణమయ్యాడని, ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యాడని దేవినేని ఉమాపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నవ నిర్మాణ దీక్షల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, అంతేగాక ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తన కుమారుడు వసంత కృష్ణప్రసాద్(కేపీ) టీడీపీలో ఉండగా నాలుగేళ్లపాటు ఉమా కలిసి ఉన్నాడని, ఇప్పుడు కేపీ పార్టీ మారిన తర్వాత విమర్శలు చేయడం సబబు కాదన్నారు. తాను చిన్నతనం నుంచే రాజకీయాల్లో ఉన్నానని, నియోజకవర్గ అభివృద్ధికి, ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశానని ఆయన చెప్పారు. ఇప్పటివరకు ఎటువంటి అవినీతి, మచ్చ లేకుండా ప్రజలతో మమేకమై ఉన్నానన్నారు. ఏడాదిలో జరిగే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సత్తా చాటుతుందని, మైలవరంలో దేవినేని ఉమాను ఓడించేందుకు తమ వంతు కృషిచేస్తామని వసంత పేర్కొన్నారు. సమావేశంలో మాగంటి వెంకటరామారావు, అబ్బూరి మల్లేశ్వరరావు, తదితరులున్నారు. -
దేవినేని ఉమ చిత్తుగా ఓడిపోవడానికి రెడీగా ఉండు..
సాక్షి, నందిగామ: ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుపై మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ...‘దేవినేని ఉమ నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండు. హత్యా రాజకీయాలు, ఆర్థిక నేరాలు చేసింది నీవే. వంగవీటి మోహనరంగా హత్యకేసులో మీ అన్న దేవినేని వెంకట రమణ ముద్దాయి కాదా?. నీ గురించి నీ అన్న గురించి ప్రజలకు తెలుసు. 2019 ఎన్నికలలో మైలవరం నియోజకవర్గం నుంచి వసంత కృష్ణప్రసాద్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. నీ వదిన ప్రణీతను చంపి నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన సంగతి అందరికీ తెలుసు. జలవనరుల శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్నదేవినేని ఉమా కనీసం తన ప్రాంత ప్రజలకు సాగునీటిని కూడా అందించలేకపోతున్నారు. ’ అంటూ ధ్వజమెత్తారు. -
టీడీపీ నేతలకు ప్యాంట్లు, లుంగీలు తడుస్తున్నాయి..
సాక్షి, విజయవాడ : ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు తీవ్రస్థాయిలు విరుచుకుపడ్డారు. దేవినేని ఉమ హుందాతనాన్ని మరిచి వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా దేవినేని వ్యాఖ్యలను టీజేఆర్ సుధాకర్ బాబు ఖండించారు. ఆయన బుధవారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..‘చంద్రబాబు నాయుడు దొంగల పార్టీని నడుపుతున్నారు. వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా వచ్చిన జన సమూహంతో కనకదుర్గ వారధి వణికినప్పటి నుంచి టీడీపీ నేతలకు ప్యాంట్లు, లుంగీలు తడుస్తున్నాయి. పట్టిసీమలో దోచుకున్నారని నివేదిక ఇచ్చింది కాగ్... వైఎస్సార్ సీపీ కాదన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. మీ అన్నయ్య దేవినేని చనిపోయిన రోజు సాయంత్రం మీ వదినగారు చనిపోయారు. ఆమె మృతిపై ఇప్పటికీ చాలా అనుమానాలు, ఆరోపణలు ఉన్నాయి. రాబోయే ఎన్నికలలో టీడీపీ మొదటిగా ఓడిపోయేది మైలవరం నియోజకవర్గమే. కనీస రాజకీయ మర్యాదలు పాటించని కుంకలు మీరు. దమ్ము, ధైర్యం ఈ రెండు పదాలు తెలుగుదేశం నాయకులు వాడకూడదు. బీజేపీతో మేము పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మరోసారి నోరు జారితే దేవినేని ఇంటిని ముట్టడిస్తాం. ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుని తెలంగాణలో ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన దద్దమ్మలు మీరు. మా నాయకుడు... మీ నాయకుడి చరిత్రపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం’ అంటూ సవాల్ విసిరారు. -
మహిళలపై దాడుల్లో టీడీపీ నేతలు...
సాక్షి, అమరావతి : మహిళలపై వేధింపుల కేసుల్లో తెలుగుదేశం పార్టీ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. అధికార పార్టీకి చెందిన ఐదుగురు నేతలు మహిళలపై వేధింపులు, అత్యాచారయత్నం కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వారిలో ఇద్దరు మంత్రులతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇందులో నలుగురు ఎమ్మెల్యేలు మహిళలపై వేధింపులకు పాల్పడినట్లుగా, మరో ఎమ్మెల్యే అత్యాచార యత్నం చేసినట్లుగా కేసులున్నాయని ఢిల్లీకి చెందిన ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్) అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. దేశవ్యాప్తంగా అందరు ఎమ్మెల్యేలు, ఎంపీల ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించి.. వారిలో మహిళలపై వేధింపులు, అత్యాచారయత్నం కేసులున్న వారి జాబితాను ఈ నెల 19న విడుదల చేసింది. ఏడీఆర్ వెల్లడించిన జాబితా ప్రకారం.. మహిళలను వేధించిన కేసుల్లో ఏపీ సీనియర్ మంత్రి, కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వర్రావు, మరో సీనియర్ మంత్రి, శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు, పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, విప్ చింతమనేని ప్రభాకర్, విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఉన్నారు. ఇక ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణపై అత్యాచారయత్నం కేసు ఉంది. ఆయనపై 376 ఐపీసీతో పాటు 506, 511, 379, 366, 324 సెక్షన్ల కింద మహిళలపై వేధింపుల ఆరోపణలు ఉన్నట్లు ఏడీఆర్ నివేదికలో పేర్కొంది. ఈ ఎమ్మెల్యేలపై మహిళా వేధింపుల కేసులే కాకుండా మరిన్ని పోలీసు కేసులు కూడా ఉన్నాయని తెలిపింది. అత్యంత వివాదాస్పదుడిగా పేరు ఉన్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై మహిళలపై నేరాలకు సంబంధించి మొత్తం 23 కేసులున్నాయి. ఇందులో తీవ్రమైన సెక్షన్ల కింద ఉన్న కేసులు 13 ఉన్నాయి. ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణపై 10 కేసులు, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తిపై 4 కేసులున్నట్టు ఏడీఆర్ సంస్థ నిర్థారించింది. మహిళలకు సంబంధించిన కేసుల్లో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు పేర్లు కూడా ఉన్నాయి. మంత్రి దేవినేని ఉమాపై 13 కేసులు, అచ్చెన్నాయుడిపై రెండు కేసులున్నట్టు ఆ సంస్థ తన నివేదిక తేల్చింది. కాగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటూ జీవోలు జారీచేసింది. హత్యలు, దోపిడీ కేసులు, మహిళలపై వేధింపులకు పాల్పడ్డ కేసులు, ప్రభుత్వ అధికారులపై దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడిన ఘటనలకు సంబంధించిన అనేక కేసులు ఈ ఉపసంహరణ జాబితాలో ఉన్నాయి. వాటిల్లో ఎమ్మెల్యేలపై కేసులు కూడా ఉన్నాయా అన్న సందేహం తలెత్తుతోంది. ప్రజాప్రతినిధులై ఉండి.. తప్పుడు చేష్టలకు పాల్పడినవారిపై కేసులను ఎత్తివేయడం దారుణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఏపీలో మహిళలపై దౌర్జన్యాలు,దాష్టీకాలు
-
వైఎస్ జగన్‌ను విమర్శించే అర్హత టీడీపీకి లేదు
-
పట్టిసీమపై బీజేపీ, టీడీపీ మాటల యుద్ధం
-
బీజేపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం..
సాక్షి, అమరావతి : ఏపీ శాసనసభలో బుధవారం పట్టిసీమ ప్రాజెక్ట్‌పై బీజేపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. పట్టిసీమ ప్రాజెక్ట్‌పై బుధవారం సభలో చర్చ సందర్భంగా బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు...ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. నిధులు దుర్వినియోగం చేశారంటూ ఆయన ఆరోపించారు. పట్టిసీమపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. మొత్తం రూ.371 కోట్ల నిధులు దుర్వినియోగం జరిగాయని, కాగ్ కూడా ఆ విషయాన్ని ధ్రువీకరించిందన్నారు. 30 పంపులు ఏర్పాటు చేస్తామని 24 పంపులే ఏర్పాటు చేశారని, ప్రాజెక్ట్ వ్యయం రూ.1170 కోట్లు అంచనా వేసి చివరకు రూ.1487 కోట్లు చెల్లించారన్నారు. ఆధారాలు లేకుండా తాము ఆరోపణలు చేయడం లేదని, వాస్తవాలను మాత్రమే చెబుతున్నామని అన్నారు. దమ్ముంటే విచారణకు సిద్ధం కావాలని విష్ణుకుమార్ రాజు సవాల్ విసిరారు. దీంతో మంత్రులు...విష్ణుకుమార్ రాజుపై ఎదురుదాడికి దిగారు. ఓ దశలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహంతో ఊగిపోయారు. పట్టిసీమపై బీజేపీ చవకబారు ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నారు. దమ్ముంటే రాజీనామాలు చేయండి.. ఇలాగైతే ప్రజల్లోకి వెళ్లలేరని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేయడంతో...దమ్ముంటే రాజీనామాలు చేద్దాం రండి అంటూ విష్ణుకుమార్ రాజు సవాల్ విసిరారు. అక్రమాలకు పాల్పడకపోతే మంత్రులకు భయమెందుకని ఆయన సూటిగా ప్రశ్నించారు. తాను ఎవరితోనూ కుమ్మక్కు కాలేదని, ఆ అవసరం తనకు లేదని అన్నారు. కాగ్ నివేదికను చదివే మాట్లాడుతున్నానని విష్ణుకుమార్ రాజు అన్నారు. మంత్రుల భాష సరిగా లేదు ఏపీ మంత్రుల తీరును మంత్రి మాణిక్యాలరావు తప్పుబట్టారు. పట్టిసీమపై విష్ణుకుమార్ రాజు ఆధారాలతోనే మాట్లాడుతున్నారని, టీడీపీ నేతలు తప్పు చేయకపోతే విచారణకు సిద్ధంగ కావాలన్నారు. మంత్రుల భాష సరిగా లేదని, ప్రభుత్వం అవినీతిని ప్రశ్నిస్తే ప్రజా ద్రోహులవుతారా అంటూ ప్రశ్నించారు. టీడీపీ నేతలు వాస్తవాలను జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. -
‘టీడీపీ భూకబ్జాలపై సీబీఐ దర్యాప్తు జరపాలి’
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్లుగా సాగుతున్న భూకబ్జాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ, మంత్రి దేవినేని ఉమ భూకబ్జాలకు పాల్పడుతుంటే చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం సిట్ల పేరుతో కాలయాపన చేస్తోందని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ విజయవాడ ప్రాంతం భూకబ్జాలకు అడ్డాగా మారిందని ధ్వజమెత్తారు. -
ఏపీ మంత్రి దేవినేనిపై పోలీసు కేసు
-
‘ఉమా నోరు, ఒళ్ళు దగ్గర పెట్టుకో’
సాక్షి, విజయవాడ : టీడీపీ పాలనలో ప్రజలకే కాదని, చివరికి అమ్మవారికి కూడా భద్రత కరువైందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. దుర్గగుడిలో అర్థరాత్రి తాంత్రిక పూజలు జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నా మళ్లీ విచారణ కమిటీ ఏమిటని సుధాకర్ బాబు సూటిగా ప్రశ్నించారు. వీడియో క్లిప్పింగ్స్ స్పష్టంగా ఉంటే విచారణ కమిటీనా అని అన్నారు. ‘టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఈ పూజలు లోకేష్ కి రాజయోగం కోసం చేయించారు అని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటివరకు సీఎం ఎందుకు నోరు మెదపలేదు. ఇది మీ ఇంట్లో విషయం కాదు, కోట్లాది మంది హిందువుల మత విశ్వాసం దెబ్బతింది. గుళ్లో జరిగిన విషయాలు అన్ని ప్రజలకు వివరించాలి. అమ్మ వారి నగలు నిజమైనవేనా అన్న అనుమానం వస్తుంది. మీరు నియమించిన కమిటీకి విలువ లేదు. దేవినేని ఉమా మీరు సూటిగా సమాధానం చెప్పండి, ఒక స్థానిక ఎంపీని మాట్లాడనీయరా, చిత్రవతికి మీ హయాం లో ఇచ్చిన నిధులు ఎన్ని?. ఉమా నోరు అదుపులో పెట్టుకో. అడ్డగోలుగా విమర్శించద్దు. నీ అవినీతి విజయవాడలో, మైలవరం లో ఎవరిని అడిగినా చెబుతారు. పులివెందులకి నీళ్లు ఇచ్చే విషయంలో మీ హయాంలో ఎంత ఖర్చు పెట్టారో, వైఎస్ఆర్ హయాంలో ఎంత పెట్టారో లెక్కలు బయటపెట్టండి.’ అని డిమాండ్ చేశారు. -
‘కృష్ణా’ పంచాయితీపై మంత్రుల చర్చ?
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదాలు, లభ్యత నీటి పంపకాలపై చర్చించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నీటి పారుదలశాఖ మంత్రులు రంగంలోకి దిగనున్నారు. ఈ మేరకు వివాదాలపై చర్చించాలని మంత్రులు హరీశ్‌రావు, దేవినేని ఉమ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా నీటి పారుదల వర్గాలు వెల్లడించాయి. భేటీ తేదీలపై స్పష్టత రాకున్నా, ఒకట్రెండు రోజుల్లోనే సమావేశం అవుతారని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ భేటీకి సన్నాహకంగా అధికారులు, కృష్ణా బేసిన్ పరిధిలో నెలకొన్న వివాదాలు, ప్రస్తుత ప్రాజెక్టుల్లో లభ్యత జలాలపై హడావుడిగా నివేదికలు సైతం సిద్ధం చేశారు. వీటిపై సోమవారంరాత్రి ఖమ్మం పర్యటన ముగించుకొని వచ్చిన హరీశ్‌రావు సమీక్ష జరపాల్సి ఉండగా, అది మంగళవారానికి వాయిదా పడింది. శ్రీశైలంలోకి భారీ ప్రవాహాలు వస్తున్నా, దిగువన నాగార్జునసాగర్‌లోకి పెద్దగా ప్రవాహాలు లేవు. ఈ నేపథ్యంలో రాష్ట్ర తాగునీటి అవసరాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురౌతున్నాయి. దీనిపై కృష్ణాబోర్డు భేటీల్లో చర్చిస్తున్నా పెద్దగా ఫలితాలు లేవు. ఈ నేపథ్యంలో మంత్రుల స్థాయి భేటీ నిర్వహించాలని అధికార వర్గాల నుంచి ఒత్తిడి వస్తోంది. ముఖ్యంగా శ్రీశైలంలో 834 కనీస నీటిమట్టాలకు ఎగువన 118 టీఎంసీలు, సాగర్‌లో 510 అడుగుల ఎగువన 13 టీఎంసీలతోపాటు జూరాల, పులిచింతలలో కలిపి మొత్తంగా 163 టీఎంసీల మేర లభ్యత జలాలున్నాయి. ఈ లభ్యత నీటికి పట్టిసీమ, మైనర్ వినియోగ లెక్కలను కలిపి నీటి వాటాలు కోరాలా.. లేక గత ఏడాది మాదిరి పట్టిసీమ, మైనర్ లెక్కలను తొలగించి, మిగిలిన లభ్యత జలాలు పంచుకోవాలా.. అన్న దానిపై స్పష్టత కోసం ఈ భేటీ ముఖ్యమని అధికార వర్గాలు సూచించినట్లు తెలిసింది. ఎలా చూసినా, వాటాకు మించి ఏపీ నీటి వినియోగం చేసిందని, తెలంగాణకు మరిన్నిఅదనపు జలాలు దక్కాల్సి ఉందని తెలంగాణ అధికారులు స్పష్టం చేస్తున్నారు. వీటన్నింటిపై చర్చించేందుకు మంత్రుల భేటీ మంగళవారం ఉంటుందని ప్రచారం జరగ్గా, అదే రోజున కేంద్ర జల వనరుల మంత్రి నితిన్ గడ్కరీ ఏపీలో పర్యటిస్తున్న నేపథ్యంలో భేటీ జరిగే అవకాశం కనిపించడం లేదు. ఆ తర్వాత భేటీ ఉండే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. -
నీళ్లు నమిలిన దేవినేని ఉమా
-
పర్యాటకానికి ప్రాణనాడిగా పోలవరం
మలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి: ఏపీ సీఎం బాబు సాక్షి, అమరావతి: రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పర్యాటక రంగానికి ప్రాణనాడిగా మలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ, ధవళేశ్వరం, పాపికొండలు, చిన్న చిన్న దీవులు పర్యాటక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు. పర్యాటకులు వీటిని వీక్షించేలా సౌకర్యాలు కల్పించి.. అభివృద్ధి చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి మంగళవారం వెలగపూడిలోని సచివాలయంలోని తన కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిపై వర్చువల్ సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు కోసం 1,055 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు చేయాల్సి ఉండగా, 703 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తయ్యాయని, ఇంకా 352 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని వివరించారు. కాఫర్ డ్యాం కటాఫ్ వాల్, స్పిల్ చానల్ బ్రిడ్జి పనులను జూన్ 8న ప్రారంభించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. జూన్ 30 నుంచి కాంక్రీట్ పనులు వేగవంతం చేయాలని చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యమైన ప్రాజెక్టుల పనుల తీరుపై జిల్లా అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పనులు ఆలస్యం కావడానికి కారణమైన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
భూ సేకరణకు సిద్ధం కండి
మంత్రి దేవినేని ఉమ గుమ్మఘట్ట : జీడిపల్లి నుంచి బీటీపీ వరకు త్వరలో భూ సేకరణ పనులకు సిద్ధంకావాలని ఆర్డీఓ రామారావును జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆదేశించారు. గుమ్మఘట్ట మండలం బీటీప్రాజెక్ట్ రిజార్వాయర్‌ను మంగళవారం జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఉన్నం హనుమంతరాయచౌదరి, బీకే పార్థసారథి, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, ఇతర జిల్లా అధికారులు, ప్రజాప్రతి నిధులు సందర్శించారు. ముందుగా రిజర్వాయర్ వద్దనున్న సవారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రిజర్వాయర్ పై భాగంలో హెడ్‌స్లూయిస్, ప్రాజెక్ట్ ఎత్తు, పూడిక, జీడిపల్లి నుంచి నీరు తెచ్చేందుకు కావాల్సిన లిఫ్ట్‌ల సౌకర్యంపై ఇరిగేషన్ సీఈ జలంధర్, ఎస్ఈ సుబ్బారావును అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి అథితి గృహం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో దేవినేని మాట్లాడారు. సముద్రం సున్నాలో ఉంటే జీడిపల్లి రిజర్వాయర్ 1718 అడుగుల్లో ఉందనీ, బీటీపీకి 330 అడుగుల ఎత్తుకు నీటిని ఎత్తిపోసి 8 లిప్ట్‌ల ద్వారా నీటిని చేర్చాల్సి ఉంటుందన్నారు. ఇందుకు రూ.1100 కోట్లను ప్రభుత్వం ఖర్చుచేయాల్సి ఉందని చెప్పారు. జీడిపల్లికి ప్రస్తుతం ఆరు పంపుల ద్వారా నీటిని చేర్చుతున్నామని, మరో రూ.1000 కోట్లు ఖర్చుచేసి అదనంగా మరో ఆరు పంపులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ పనులు ఆగస్టులోగా పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. బీటీపీకి కచ్చితంగా నీరు తెస్తామని మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. బీటీపీకి నీరివ్వడం సాధ్యం కాదు.. భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ)కు ఇప్పట్లో నీరివ్వడం సాధ్యం కాదనీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. 12 నెలల్లో కృష్ణాజలాలు తెస్తామనే మాటలను ప్రజలు నమ్మవద్దన్నారు. వచ్చే ఎన్నికల నాటికి మీ అందరి కలను కచ్చితంగా సాకరం చేస్తామని చెప్పారు. బీటీపీకి నీరు తేవాలంటే భూసేకరణ పూర్తికావాలా..? ఇందుకు రైతులు అంగీకరించాలా..? ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి సీనయ్య (మంత్రి కాలవ శ్రీనివాసులు)కు కంటనీళ్లు తప్పవని తేల్చి చెప్పారు. వచ్చే ఏడాదికి పోలవరం పూర్తవడం కూడా అనుమానమేనన్నారు. -
మంత్రి దేవినేని ఓ ఉన్మాది
తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ నేత పార్థసారథి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఓ మంత్రిగా కాకుండా ఉన్మాదిలా మాట్లాడుతున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయంపై ప్రతిపక్షంతో సహా పలువురు నేతలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంచనా వ్యయం రూ 16 వేల కోట్ల నుంచి రూ 42 వేల కోట్లకు పెరిగిందని, ఈ అదనపు మొత్తాన్ని ఎవరు భరిస్తారన్న విషయంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి సమాధానం చెప్పకుండా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, కేవీపీ పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని మంత్రి ఎదురుదాడికి దిగుతున్నారని ఆక్షేపించారు. పోలవరం ప్రాజెక్టుకు బద్ధ వ్యతిరేకి సీఎం చంద్రబాబేనని పార్థసారథి విమర్శించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో పోలవరం ప్రాజెక్టును ప్రారంభించినపుడు ఒడిశా, చత్తీస్‌గఢ్‌లను రెచ్చగొట్టి కేసులు వేయించి అడ్డుకున్న ఘనత ఆయనదేనని చెప్పారు. బాపులపాడు మండలంలో టీడీపీకి చెందిన రైతులతో కేసులు వేయించింది దేవినేని ఉమామహేశ్వరరావేనని తెలిపారు. -
అది టీడీపీకి సంప్రదాయంగా మారింది: వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్: అనంతపురం జిల్లా కనగానపల్లి ఎంపీపీ ఉపఎన్నికలో అధికార టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. బుధవారం వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. చంద్రబాబు బాటలోనే ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు బేరసారాలకు దిగుతున్నారని మండిపడ్డారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి పదవులను కైవసం చేసుకోవడం టీడీపీకి సంప్రదాయంగా మారిందని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. మంత్రి దేవినేని ఉమ పై వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'మీ ఇంటి పేరు దేవినేని కాదు అవినీతి. మంత్రి పదవిలో ఉండి స్థాయి దిగజారి మాట్లాడుతున్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలి. పోలవరంపై వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పుడు ఆరోపణలు చేయొద్దు' అన్నారు. కాంట్రాక్టర్ల కమిషన్ల కోసమే పోలవరం అంచనాలను అమాంతంగా పెంచారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును.. ప్రత్యేక హోదా ఇవ్వకున్నా ఫర్వాలేదు మాకు పోలవరం ఇస్తే చాలని తీసుకున్నారని ఆమె విమర్శించారు. -
అది టీడీపీకి సాంప్రదాయంగా మారింది
-
పోలవరం ప్రాజెక్టు పనులపై బాబు సమీక్ష
విజయవాడ: పోలవరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా జనవరి 7నుంచి డయాఫ్రమ్ వాల్ పనులను ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పనులపై ఆయన అధికారులతో మంగళవారం సమీక్షించారు. పెండింగ్ పనులు పూర్తయ్యేలా వేగం పెంచాలని, రాజీపడితే సహించేది లేదని హెచ్చరించారు. కాగా, కాంక్రీట్ పనులకు పరీక్షలు పూర్తి చేసినట్లు ఆ ప్రాజెక్టు అధికారులు సీఎంకి వివరించారు. సమీక్షలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ, పలు విభాగాల అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. -
వరద కాలువ కోసం మంత్రికి ఏడుకోట్లు
ప్రొద్దుటూరు వరద కాలువ టెండర్ల విషయంలో మంత్రి దేవినేని ఉమ అవినీతి భాగోతం బట్టబయలైందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. వరద కాలువ టెండర్ల విషయంలో అవినీతికి పాల్పడిన మంత్రికి సుమారు రూ. ఏడు కోట్ల వరకు ముట్టాయని ఆయన ఆరోపించారు. ఈ రోజు కడపలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి చర్యలు మానుకోకపోతే.. దేవినేని చాంబర్ ఎదుట నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. -
శ్రీవారిని దర్శించుకున్న దేవినేని ఉమ
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్న ఆయన పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన డిజైన్లను స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..2018 లోగా పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తిచేస్తామని.. ప్రస్తుతం ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు వేగవంతంగా జరగుతున్నాయని అన్నారు. మంత్రికి టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. -
ఏ ఎమ్మెల్యేతోనూ వర్గ పోరు లేదు
దేవినేని నెహ్రూ విజయవాడ (గుణదల) : తనకు జిల్లాలోని ఏ ఎమ్మెల్యేతోనూ వర్గపోరు లేదని మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) అన్నారు. తాను టీడీపీలో చేరిన15 రోజుల్లోనే వర్గపోరు అనడం సరికాదని పేర్కొన్నారు. ‘నేనంటే నేను’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనంపై నెహ్రూ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. పార్టీ నేతలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని వివరించారు. అరాజకీయమైన రాజకీయ శక్తులన్నీ వైఎస్సార్ సీపీలోనే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ పత్రికలు, మీడియాతో విరోధం పెట్టుకోలేదని చెప్పారు. అయినా తనపై నిందారోపణలు చేయడం సమంజసం కాదన్నారు. తనపై వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ.. మంత్రులు నారాయణ, దేవినేని ఉమ, సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌తో తాను ఎన్నడూ మాట్లాడలేదని స్పష్టం చేశారు. -
హరీశ్‌రావుకు దేవినేని ఉమా ఫోన్
విజయవాడ : పులిచింతల ప్రాజెక్టు వరద పరిస్థితులపై ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుకు గురువారం ఉదయం ఫోన్ చేసి మాట్లాడారు. పులిచింతల ప్రాజెక్టు వద్ద గంట గంటకూ వరద పెరుగుతున్న దృష్ట్యా నల్లగొండ జిల్లాలోని ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని హరీశ్‌ను ఉమా కోరారు. దీనిపై హరీశ్ సానుకూలంగా స్పందించారు. నల్లగొండ జిల్లా కలెక్టర్‌ను అప్రమత్తం చేస్తానని ఉమాకు ఆయన హామీ ఇచ్చారు. -
'నీటిమట్టాన్ని సక్రమంగానే నిర్వహిస్తున్నాం'
విజయవాడ: రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల వద్ద నీటిమట్టాన్ని సక్రమంగానే నిర్వహిస్తున్నామని ఏపీ భారీ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమ తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం 11.3 అడుగుల నీటి మట్టం ఉందని, బ్యారేజీ ద్వారా 15,110 క్యూసెక్కుల కృష్ణా జలాలను సాగు కోసం కాలువల ద్వారా విడుదల చేస్తున్నామని తెలిపారు. శ్రీశైలంలో నీటిమట్టం తక్కువగా ఉందని, ఐతే నీటి మట్టం ఇంకా పెంచాలని కొందరు బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. పట్టిసీమ ద్వారా 7 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణకు తరలించామని, దానిని 80 టీఎంసీలకు పెంచాలన్నది సీఎం చంద్రబాబు కోరికని మంత్రి తెలిపారు. -
తోటపల్లి రిజర్వాయర్ నుంచి నీరు విడుదల
విజయనగరం: ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గురువారం తోటపల్లి ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేశారు. ఈ ప్రాజెక్ట్ నుంచి లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు కిమిడి మృణాళిని, అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున మిగతా 20వేల ఎకరాలకు వచ్చే ఏడాది మార్చినాటికి నీరందిస్తామని మంత్రి దేవినేని ఉమ తెలిపారు. -
'నాకు ఒక్క గజం స్థలం కూడా లేదు'
విజయవాడ : నాకు ఒక్క గజం స్థలం కూడా లేదని విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో అద్దె ఇంట్లో నివసిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. మంగళవారం గొల్లపూడిలో ప్రజాసాధికారిక సర్వే కార్యక్రమాన్ని అధికారులు మంత్రి ఉమా ఇంటి నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమా... ఆధార్‌కార్డు, ఓటరుకార్డు వివరాలను మాత్రమే అధికారులకు అందచేశారు. ఆస్తులకు సంబంధించిన వివరాలను మంత్రి దేవినేని ఉమ వెల్లడించలేదు. ఎంపీడీఓ బ్రహ్మయ్య, ఎన్యూమరేటర్ నిర్మలకుమారి వివరాలను సేకరించారు. -
'రాయలసీమంటే ఎందుకంత ద్వేషం'
హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ తాకట్టు పెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్పుడు హడావుడి చేస్తున్నారని అన్నారు. రాయలసీమ ప్రజల భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. సీమకు నీళ్లివ్వాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఏమాత్రం లేదన్నారు. రాయలసీమ అంటే ఎందుకంత వివక్ష అని శ్రీకాంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. అయితే సీమ ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటున్నారన్నారు. దేవినేని ఉమకు రాయలసీమంటే ద్వేషమని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలని తాము అంటే పై పెచ్చు ప్రభుత్వం ఎదురు దాడి చేస్తోందన్నారు. అభివృద్ధిని అడ్డుకోవాలనే ఉద్దేశం తమ పార్టీకి ఏమాత్రం లేదన్నారు. -
ఉమా.. హరీశ్ రావు భేటీ!
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం నేపథ్యంలో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు హరీశ్ రావు, దేవినేని ఉమామహేశ్వరరావు ఢిల్లీలో భేటీ అయ్యారు. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్ జిత్ సింగ్ సమక్షంలో ఈ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. కృష్ణాజలాల వినియోగంపై రెండు రాష్ట్రాలు మెట్టు దిగకపోవడంతో ఈ అంశంపై ప్రతిష్టంభన ఏర్పడింది. దాంతో కేంద్రం జోక్యం చేసుకుని ఇద్దరినీ పిలిపించింది. నిన్న జరిగిన సమావేశంలో ఏకాభిప్రాయం రాకపోగా పరస్పరం నిందించుకున్నారు. దాంతో మళ్లీ గురువారం ఉదయం ఇద్దరు మంత్రులతో అమర్ జిత్ సింగ్ సమక్షంలో సమావేశం ప్రారంభమైంది. నీటి వినియోగం విషయంలో విభజన చట్టాన్ని అమలుచేయాలని ఏపీ అడుగుతోంది. అయితే ఈ విషయంలో ఇప్పటికీ ఫైనల్ అవార్డు రాని నేపథ్యంలో పరిధిని ఎలా నిర్ణయిస్తారని తెలంగాణ ప్రశ్నిస్తోంది. ఇద్దరినీ ఒకే తాటిపైకి తేవడం కేంద్రానికి తలకు మించిన భారంగా మారుతోంది. రెండు రోజుల పాటు జరిగిన సమావేశాలలో తుది ఒప్పందం కుదిరేవరకు గతంలో కుదిరిన ఒప్పందాల మేరకే నీటి నిర్వహణ, వినియోగం కొనసాగాలని, యథాతథ స్థితి కొనసాగించాలని అన్నారు. దీనిపై తుది నిర్ణయం తీసుకునే దిశగా రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రులను పిలిపించి సమావేశం ఏర్పాటుచేశారు. -
నన్ను ఇబ్బంది పెట్టేందుకే టీడీపీ ప్రయత్నం
దేవినేని ఉమాపై పీఏసీ చైర్మన్ బుగ్గన ధ్వజం సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న నన్ను ఇబ్బంది పెట్టేందుకు అధికార టీడీపీ ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించింది. ఇందులో భాగంగా భూసేకరణ చట్టం నిబంధనలు సైతం పాటించకుండానే నా సొంత భూములను తీసుకోవడానికి యత్నించింది. ఈ ప్రయత్నాలకు కోర్టు ద్వారా అభ్యంతరం తెలిపితే.. అభివృద్ధికి అడ్డుపడుతున్నానని నాపై మంత్రి దేవినేని ఉమా ఆరోపణలు చేయడం దుర్మార్గం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తప్పుపట్టారు. మంత్రి ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అభివృద్ధికి అడ్డుపడుతున్నానని ఆరోపణలు చేస్తున్న మంత్రి ఉమా ఆయన ఇంటిలో ఆరడుగుల స్థలాన్ని రోడ్డు విస్తరణ కోసం ఒకవేళ మున్సిపాలిటీవారు నిబంధనలు పాటించకుండా తీసుకుంటే అభ్యంతరం వ్యక్తం చేస్తారా? లేదంటే మౌనంగా ఉంటారా? అన్నది తేల్చిచెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బుగ్గన గురువారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం చెరువుపల్లికి సంబంధించి మంత్రి దేవినేని ఉమా చెబుతున్న తొమ్మిదెకరాల భూములకు 1929 నుంచి దస్తావేజులున్నాయని చెప్పారు. అయితే తమకెలాంటి నోటీసులివ్వకుండా.. ప్రతిపక్షంలో ఉన్న తనను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం రెవెన్యూ, పోలీసు, సాగునీటి శాఖల అధికారులతో బలవంతంగా భూముల స్వాధీనానికి ప్రయత్నించిందన్నారు. అందుకే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని వివరించారు. అశోక్‌రెడ్డి, పోతులపై అసెంబ్లీ కార్యదర్శికి బుగ్గన ఫిర్యాదు పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావులను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం గురువారం అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేసింది. పీఏసీ చైర్మన్, పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అసెంబ్లీ ఇన్చార్జ్ కార్యదర్శి సత్యనారాయణను కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. -
'ఢిల్లీ వెళ్లి అనవసర రాద్ధాంతం చేస్తున్నారు'
విజయవాడ: తెలంగాణ నేతలు ఢిల్లీ వెళ్లి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఏపీ భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులు జరిగాయని, కేటాయింపుల్లో కృష్ణానదీ యాజమాన్య బోర్డు జాగ్రత్తలు తీసుకోవాలని సంతకాలు జరిగాయని గుర్తు చేశారు. బచావత్ ట్రైబ్యునల్ తీర్పునకు అనుగుణంగా 512 టీఎంసీలు రాష్ట్రానికి కేటాయింపులు జరిగాయని వివరించారు. కృష్ణా బోర్డు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు. ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన విజయవాడలో స్పష్టం చేశారు. విభజన ప్రకారమే కృష్ణా బోర్డు నడుస్తుందన్నారు. విభజన చట్టాన్ని రూపొందించింది టీఆర్ఎస్సేనని, ఇప్పుడెందుకు జలాల పంపిణీపై దుష్ప్రచారం చేస్తున్నారని దేవినేని ఉమా సూటిగా ప్రశ్నించారు. -
'ఆర్డీఎస్‌పై చర్చించుకుందాం రండి'
హైదరాబాద్: రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) పై చర్చలకు రావాలని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును తెలంగాణ మంత్రి హరీష్ రావు కోరారు. మంగళవారం దేవినేనికి హరీష్ రావు ఫోన్ చేశారు. ఆర్డీఎస్ వద్ద తెలంగాణ సర్కారు చేపడుతున్న పనులను అడ్డుకోవాలంటూ కర్ణాటకలోని రాయచూరు కలెక్టర్‌కు కర్నూలు జిల్లా కలెక్టర్ రాసిన లేఖను ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా ఉమాకు హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై రోజుల్లో సానుకూల నిర్ణయం తీసుకోకుంటే ఇకపై తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి ఎలాంటి సహకారం అందదని హరీష్‌రావు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ వైఖరిపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేయనున్నట్లు హరీష్‌రావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
దేవినేని ఉమకు హరీశ్ రావు ఫోన్
హైదరాబాద్ : నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న అనిశ్చితికి తెర దించేందుకు ఏపీ సర్కార్‌తో చర్చించాలని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఫోన్ కాల్ చేశారు. నీటి పారుదల ప్రాజెక్టులపై చర్చించేందుకు సమావేశం అవుదామని ఈ సందర్భంగా హరీశ్ కోరారు. ఆర్డీఎస్తో పాటు తెలంగాణ నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించుకుందామని సూచించారు. అందుకు మంత్రి దేవినేని ఉమ కూడా అంగీకారం తెలిపారు. సమావేశం ఏర్పాటు చేయాలని హరీశ్‌కు దేవినేని ఉమ తెలిపారు. -
'నీళ్లు రానప్పుడు కొత్త ప్రాజెక్ట్‌లు ఎలా కడతారు?'
విజయవాడ : తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ఎత్తిపోతల ప్రాజెక్ట్‌లు నిర్మిస్తోందని ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. శనివారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దేవినేని నెహ్రు మాట్లాడుతూ... నీటి కేటాయింపులు లేకుండా కొత్త ప్రాజెక్ట్‌లు చేపట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. కర్ణాటక, మహారాష్ట్రలో నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్ట్‌లను ఏపీ, తెలంగాణ కలసి అడ్డుకోవాలని సూచించారు. పైనుంచి నీళ్లు రానప్పుడు కొత్త ప్రాజెక్ట్‌లు ఎలా కడతారని దేవినేని ఉమ.. తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
కృష్ణ..కృష్ణా..!
► డబ్బుల్లేవ్..అంచనాలు తగ్గించండి ► పుష్కర పనులపై అధికారుల అంతర్గత ఆదేశాలు ► ఆహ్వానించిన టెండర్ల రద్దుకు చర్యలు ► స్నానఘాట్లలో భక్తులకు తప్పని ఇక్కట్లు చరిత్రలో నిలిచిపోయేలా కృష్ణా పుష్కరాలు నిర్వహిస్తామని రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ ఓ వైపు ప్రకటనలు చేస్తుంటే, మరో వైపు ఉన్నతాధికారులు పుష్కర పనుల అంచనాలనుతగ్గిస్తున్నారు. చిన్నపాటి మరమ్మతులతో పాత ఘాట్లను పూర్తి చేసి, అత్యవసర పనులనుచేయాలంటున్నారు. ఇప్పటి వరకు చేసిన అంచనాల మొత్తాలను 80 శాతం తగ్గించాలని, ఆహ్వానించిన టెండర్లను రద్దు చేయాలని అంతర్గత ఆదేశాలు ఇస్తున్నారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు : గోదావరి పుష్కరాల కంటే వైభవంగా కృష్ణా పుష్కరాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఆ మేరకు రూ.1500 కోట్ల వరకు నిధులు కేటాయిస్తామన్నారు. దీంతో వివిధ శాఖల ఇంజినీర్లు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని నదీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి పాత స్నానఘాట్లను పరిశీలించారు. అవసరమనుకున్న ప్రాంతంలో కొత్త ఘాట్ల నిర్మాణాలకు అంచనాలు తయారు చేశారు. ఇప్పుడు వాటన్నింటినీ పక్కన పడేసి పాత ఘాట్లకు తాత్కాలిక మరమ్మతులు చేయడానికి అంచనాలు తయారు చేయాలని, ఘాట్ల వద్ద భక్తులు పడిపోకుండా గ్రిప్ టైల్స్ ఏర్పాటుకు అంచనాలు తయారు చేస్తే, అవేమీ అక్కర్లేదు పాడైపోయిన ఘాట్లకు సిమెంట్‌తో ప్లాస్టరింగ్ చేయాలని, గ్రిప్ టైల్స్ వేయకుండా ఘాట్లకు రెడాక్సైడ్ రంగు వేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. కృష్ణా నదిలో నీటిమట్టం గరిష్టంగా పడిపోయిన నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ దిగువన భక్తులు స్నానమాచరించడానికి నదిలో ఒక పాయను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను నిలిపివేసి, జల్లు స్నానంకు అంచనాలు తయారు చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ నెల 12న విజయవాడ నీటిపారుదల సర్కిల్ కార్యాలయం, విజయవాడ కేసీ డివిజన్ ఇంజినీర్లు ప్రకాశం బ్యారేజి దిగువనున్న 33 పుష్కర ఘాట్ల మర్మమతులకు టెండర్లు ఆహ్వానించారు. సుమారు రూ.20 కోట్ల విలువైన పనులకు సంబంధించిన సమాచారాన్ని ఈ ప్రొక్యూర్మెంట్ మార్కెట్ ప్లేస్‌లో ఏర్పాటు చేశామని వివిధ దినపత్రికల్లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ మేరకు ఒక్క విజయవాడ పరిధిలోనే పుష్కర ఘాట్లకు రూ.20 కోట్లకుపైగా నిధులు కేటాయింపు జరిగినట్టు ఆ నోటిఫికేషన్ ద్వారా సమాచారం తెలుసుకున్న కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత కృష్ణాజిల్లా కలెక్టర్ ఆ అంచనాల మొత్తాలను 80 శాతం తగ్గించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో ఆ శాఖ ఇంజినీర్లు బిత్తరపోవడమే కాకుండా పుష్కర ఘాట్లకు గ్రిప్టైల్స్ వేయకుండా మరమ్మతులు చేస్తే భక్తులు ఇబ్బంది పడే అవకాశం ఉందంటున్నారు. అదే అభిప్రాయాన్ని వెల్లడించినా, టైల్స్ అవసరం లేదు. రెడ్ ఆక్సైడ్ వేయండంటూ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇలా అంచనాల మొత్తాలను పూర్తిగా తగ్గించాలని ఆదేశాలు జారీ చేయడంతో సాగునీటిశాఖ అధికారులు పనులు ఎలా పూర్తి చేయాలో అర్థంకాక సతమతమవుతున్నారు. గుంటూరు జిల్లాలోనూ ఇంతే... గుంటూరు జిల్లాలోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. వివిధ శాఖల అధికారులు చేసిన అంచనాలకు భిన్నంగా అరకొరగా నిధులు మంజూరు చేయడంతో ముఖ్యమైన పనుల జాబితాలను తయారు చేసే పనిలో అధికారులున్నారు. పుష్కర ఘాట్లకు రూ.150 కోట్లతో అంచనాలు తయారు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం రూ.65 కోట్లను మంజూరు చేసింది. సీతానగరం ఘాట్‌లో 3 పనులకు రూ.20 కోట్లతో అంచనాలు తయారు చేస్తే రూ.15 కోట్లకు తగ్గించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని మొత్తం అన్ని శాఖలు రూ.485 కోట్లతో అంచనాలు తయారు చేస్తే ఇప్పటి వరకు రూ.360 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అంచనాలను భారీ ఎత్తున రూపొందించినప్పటికీ, ప్రభుత్వం వద్ద నిధుల కొరత ఉండడంతో వాటిలో కోత విధిస్తోంది. ఆగస్టులో జరగనున్న ఈ పుష్కరాలకు ఇంకా ప్రతిపాదనలు దశ పూర్తికాకపోవడం, టెండర్లు ఆహ్వానించే దశలోనే అధికారులు ఉండడంతో పనులపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
కృష్ణా బేసిన్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది
విజయవాడ : కృష్ణా బేసిన్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ గురువారం విజయవాడలో వెల్లడించారు. ప్రస్తుతం 66 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందన్నారు. రెండు రాష్ట్రాలు ఆ నీటినే వినియోగించుకోవాల్సిందన్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి తక్షణసాయంగా 4 టీఎంసీలు కావాలని కృష్ణాబోర్డును ఇప్పటికే కోరామన్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుపై తమ వాదనను సుప్రీంలో వినిపిస్తామని దేవినేని ఉమ చెప్పారు. -
'20 నెలల్లో రూ. 11 వేల కోట్లు ఖర్చు చేశాం'
న్యూఢిల్లీ : రాష్ట్రంలో తాగునీటి సంఘాలకు 20 నెలల్లోనే రూ. 11 వేల కోట్లు ఖర్చు చేశామని ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ వెల్లడించారు. శనివారం న్యూఢిల్లీలో దేవినేని ఉమ మాట్లాడుతూ... హంద్రీ - నీవా మొదటి విడత 2016 కల్లా పూర్తి చేస్తామని చెప్పారు. నిర్ణీత గడువులోగా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రాయలసీమను హర్టీకల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. -
ఏపీలో సర్కారు అడ్డగోలు దోపిడీ:జ్యోతుల
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సర్కార్ అడ్డగోలు దోపిడీకి పాల్పడుతోందని వైఎస్ఆర్ కీంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు నిప్పులు చెరిగారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టుల అంచనాలు పెంచేసి వేలకోట్ల దోపిడీకి చంద్రబాబు శ్రీకారం చుట్టారని జ్యోతుల నెహ్రు ధ్వజమెత్తారు. కేబినెట్ ఆమోదం పేరుతో రూ.6వేల కోట్ల దోపిడీకి తెర తీశారని ఆయన మండిపడ్డారు. ఇద్దరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తిరస్కరించినా... దారుణంగా దోచుకునేందుకు ఏపీ కేబినెట్ సిద్ధమైందని జ్యోతుల నెహ్రు విమర్శించారు. నిబంధనలకు విరుద్ధమైన కార్యక్రమాన్ని తాము ఒప్పుకోమని ఇద్దరు సీఎస్‌లు చెప్పినప్పటికీ, మందబలాన్ని ఉపయోగించుకుని దోపిడీకి పాల్పడటం దారుణమన్నారు. చంద్రబాబు తన అనుచరులకు లబ్ధి చేకూర్చడమే ఈ దోపిడీ ఉద్దేశమన్నారు. ఆ దోపిడీని ప్రశ్నించిన తాము అభివృద్ధి నిరోధకులమంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. రాజకీయ అంచనాల పెంపుపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ ఇకనైనా గొప్పలు చెప్పుకోవడం మానేసి వాస్తవాలు వెల్లడించాలని జ్యోతుల నెహ్రు డిమాండ్ చేశారు. -
ఉమా... నాని మధ్య వార్
ప్రతిష్ట కోసం పాకులాట మంత్రి ఉమా వ్యాఖ్యలతో మరోసారి బయటపడ్డ విభేదాలు తెరపైకి మంత్రి శిద్దా రాఘవరావు, కార్యదర్శి శ్యాంబాబు విజయవాడ : నిర్మాణంలో ఉన్న కనకదుర్గా ఫ్లైఓవర్ వ్యవహారంపై అధికార పార్టీలో రోజుకో అలజడి రేగుతోంది. ఫ్లైఓవర్‌ను సాధించిన ఘనతను తమ ఖాతాలో వేసుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు నేతల మధ్య విభేదాలకు కారణమయ్యాయి. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య వివాదం రగులుతుండగా, తాజాగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎంపీకి వ్యతిరేకంగా బహిరంగంగా వ్యాఖ్యలు చేయటం చర్చనీయాంశమైంది. ఆ ఘనత మంత్రి శిద్దాదేనట! దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలని గత ఎన్నికల ముందు బుద్దా వెంకన్న కుమ్మరపాలెం సెంటర్లో ధర్నా చేశారు. అనంతరం రాష్ట్ర విభజన జరగడం, తరువాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం తెలిసిందే. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎంపీ కేశినేని శ్రీనివాస్ ఇంద్రకీలాద్రి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి మూడు ప్లాన్లు తయారు చేయించి, అందులో ఒక దానిని కేంద్ర ప్రభుత్వం చేత ఆమోదింప చేసి కేంద్రం వాటాగా రూ.280 కోట్ల వరకు నిధులు తీసుకొచ్చారు. ఇదే విషయం శంకుస్థాపన సమయంలో కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీ ప్రకటించారు. ఎంపీ కేశినేని శ్రీనివాస్ తన కార్యాలయం చుట్టూ పలుమార్లు తిరిగారని ఆయన వెల్లడించారు. మంత్రి ఉమామహేశ్వరరావు మాత్రం ఇటీవల విజయవాడలో జరిగిన రోడ్డు భద్రతా వారోత్సవాల్లో మాట్లాడుతూ ఫ్లైఓవర్‌ను తానో, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నో సాధించామని అందరూ అనుకుంటున్నారని, వాస్తవానికి మంత్రి శిద్దా రాఘవరావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి శ్యాంబాబుల కృషితోనే ఈ ప్రాజెక్టు మంజూరైందని బహిరంగంగా ప్రకటించారు. శిద్దా, శ్యాంబాబు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి నివేదికలు ఇవ్వడం వల్లే ఫ్లైఓవర్ మంజూరైందని, వారినే అభినందించాలంటూ అధికారులకు కూడా సూచించారు. దీంతో అక్కడ ఉన్న అధికారులు, తెలుగుదేశం నేతలు అవాక్కైనట్లు పార్టీ వర్గాల సమాచారం. ఒకపక్క ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య ఫ్లైఓవర్ విషయంలో వివాదం కొనసాగుతుండగానే మంత్రి ఉమా తన వ్యాఖ్యల ద్వారా మరో వివాదానికి తెరతీసినట్లయింది. ఉద్దేశపూర్వకంగానే... మంత్రి ఉమా వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినట్లుగానే కనబడుతున్నాయని ఆ పార్టీకి చెందిన నేతలే చెబుతున్నారు. ఎంపీ కేశినేని నాని, మంత్రి ఉమా మధ్య గతంలోనూ వివాదాలు బహిర్గతమైన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఫ్లైఓవర్ ఘనత నానికి దక్కకూడదనే ఉద్దేశంతోనే మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిర్మాణం నత్తనడకనే... ఒకపక్క ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.. మరోపక్క పుష్కరాలు తరుముకొస్తున్నాయి.. అయినా ఆ విషయాన్ని పట్టించుకోని నేతలు వివాదాలపై దృష్టి కేంద్రీకరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణ పనుల్లో జాప్యం ఇలాగే కొనసాగితే కచ్చితంగా పుష్కరాల నాటికి ఫ్లైఓవర్ కచ్చితంగా పూర్తికాదు. అప్పుడు వచ్చే అప్రదిష్టకు ఎవరు బాధ్యత వహిస్తారనేది నేతలు తెచ్చుకోవాలి మరి. -
పెత్తనమంతా వాళ్ల 'అనుచరులదే'
పెనమలూరులో ఎమ్మెల్యే వర్గీయులదే హవా ఇబ్రహీంపట్నంలో మంత్రి వర్గీయులదే పెత్తనం కైకలూరులో సీఎం సామాజిక వర్గానిదే పైచేయి విజయవాడ : బీసీలు, ఎస్సీ, ఎస్టీలే పార్టీకి అండ...వారికే ఉన్నత పదవులు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు నిత్యం ఊదర కొడుతుంటారు. రిజర్వేషన్ ద్వారా ఆ పార్టీ తరపున ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ఎస్సీ, ఎస్టీ, బీసీలు కీలుబొమ్మలుగా మారుతున్నారు. సీఎం సామాజిక వర్గానికి చెందిన వారే పెత్తనం చేస్తున్నారు. అవమానాలను పైకి చెప్పుకోలేక..ఎదురు తిరగలేక అంతర్మధనం చెందుతున్నారు. కొందరు చేసేది లేక పదవులు వదులుకుంటున్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలే అందుకు ఉదాహరణ.. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో పలువురు తెలుగుదేశం పార్టీ తరపున స్థానికసంస్థల ఎన్నికల్లో గెలుపొందారు. మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీపట్నం ఎంపీపీగా తెలుగుదేశం పార్టీ తరపున ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చీతిరాల ప్రసూన గెలుపొందారు. ఆమె పదవి చేపట్టిన రోజు నుంచి మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు వర్గీయులు పెత్తనం చెలాయిస్తున్నారు. ప్రతి మీటింగ్‌లోనూ వైస్ ఎంపీపీ చెరుకూరి వెంకటకృష్ణారావు తెరపై కనిపిస్తారు. ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీ సభ్యురాలు చెన్నుబోయిన రాధ పరిస్థితి కూడా ఇదే. ఈమెకు తెలుగుదేశం పార్టీ నేతలు కనీస గుర్తింపు ఇవ్వడం లేదు. మంత్రి కనుసన్నల్లోనే పనులు జరుగుతున్నాయి. జిల్లా ప్రజాపరిషత్ సమావేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈమె కూడా మంత్రి తీరుపై విసిగిపోయింది. ఇబ్రహీంపట్నం సర్పంచ్‌గా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అజ్మి స్వర్ణ గెలుపొందారు. ఈమె పేరుకే సర్పంచ్, పెత్తనం మాత్రం మంత్రి వర్గీయులదే. అందుకే ఈమె కూడా తన పదవికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదని మంత్రి వర్గీయులపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. వీరు ముగ్గురు ఇటీవల జరిగిన జన్మభూమి సభను బహిష్కరించారు. తమ పదవులను గౌరవించని వారి వద్దకు తాము వచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఇంతటి అవమానం భరిస్తూ ఎలా పనిచేయాలనే ఆవేదన వీరి మనస్సుల్లో ఉంది. అందుకే వారు సభలను బహిష్కరించి నిరసన తెలిపారు. పెనమలూరు ఎంపీపీ రాజీనామా పెనమలూరు ఎంపీపీ బొర్రా కనకదుర్గ బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ. మహిళలకు ప్రభుత్వం రిజర్వేషన్ ఇచ్చిన కోటాలో ఎంపీపీగా ఎన్నికైంది. మహిళలకు ఇస్తున్న గౌరవానికి సంబరపడిపోయింది. ఎంపీపీగా మండలంలో అనుకున్నవి చేయవచ్చని భావించింది. పైగా అధికార పార్టీ తరపున ఎంపీపీగా ఉన్నందున నిధులు కూడా ఎక్కువ రాబట్టుకోవచ్చని ఆమె చేసిన ఆలోచనలు కల లుగా మిగిలాయి. స్వతంత్ర నిర్ణయాలు పనికి రావని, పాలకవర్గం తీసుకునే నిర్ణయాలు ఇక్కడ విశ్వసించే వారు లేరని ఎమ్మె ల్యే బోడె ప్రసాద్ వర్గీయులు ఆమెకు తెలియజెప్పారు. ఆమెలో ఆవేదనతోపాటు సహనం చచ్చిపోయింది. ఎవరిని నిందించాలో అర్థం కాక తన ఎంపీపీ పదవికి రాజీనామా చేస్తున్నానని లేఖను ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు అందజేసింది. కైకలూరులో అసంతృప్తి కైకలూరు నియోజకవర్గానికి చెందిన ఇద్దరు ప్రముఖులకు నామినేటెడ్ పదవులు ఇవ్వడంపై టీడీపీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కైకలూరు వ్యవసాయ మార్కెట్ యార్డు జిల్లాలోనే గుర్తింపు ఉన్నది. ఈ యార్డుకు చైర్మన్‌గా సీఎం సామాజికవర్గానికి చెందిన చింతపల్లి వీరరాజేశ్వరిని నియమించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ముదినేపల్లి మండలానికి చెందిన ఈడ్పుగంటి వెంకట్రామయ్యను నియమించారు. జిల్లావ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో నిరసన జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలపై అగ్రవర్ణాల పెత్తనం సాగుతున్నదనే ఆందోళన నెలకొంది. బలహీనవర్గాల నుంచి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారిని అవమానించే విధంగా అగ్రవర్ణ నాయకులు వ్యవహరిస్తున్నారని, ఇది సీఎం అండదండలతోనే జరుగుతున్నదనే ఆలోచనలో వీరు ఉన్నారు. కొందరు అగ్రవర్ణ ఎమ్మెల్యేలు చేపట్టిన చర్యలు దీనిని రుజువు చేస్తున్నాయి. త్వరలో బీసీ, బలహీనవర్గాల ప్రజాప్రతినిధుల సదస్సు విజయవాడలో నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. -
అవినీతికి ఆయనే బిగ్‌బాస్ !
-
’వాళ్లిద్దరు అవినీతిలో పోటీ పడుతున్నారు’
-
'మంత్రి దేవినేనిని బర్తరఫ్ చేయండి'
-
ఆ మంత్రి అ'మాయకుడు'
గాలేరు నగరి ప్రాజెక్టులో బయటపడ్డ గోల్మాల్ 12 కోట్ల అంచనా వ్యయం 110 కోట్లకు పెంచారు.. సొంత పార్టీ ఎంపీకి కట్టబెట్టారు రూ.35 కోట్ల మేర బిల్లులూ చెల్లించారు... కానీ అవేవీ తనకు తెలియవంటున్న నీటిపారుదల శాఖ మంత్రి కమిషన్లు.. వాటాలు తేలకే బయటపడ్డ కుంభకోణం పరిపాలనా అనుమతులు కూడా లేవని తేల్చిన నిపుణుల కమిటీ మంత్రిని వదిలేసి తమను బలిచేస్తారని భయపడుతున్న అధికారులు హైదరాబాద్: ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 12 కోట్ల నుంచి రూ.110 కోట్లకు పెంచేశారు... అధికార పార్టీ ఎంపీ సీఎం రమేష్‌కి ఆ కాంట్రాక్టు కట్టబెట్టారు... కాంట్రాక్టర్‌కు రూ. 35 కోట్ల మేర రెండు బిల్లులూ చెల్లించేశారు... అసలు పరిపాలనా అనుమతులు లేకుండానే టెండర్లు పిలిచారని నిపుణుల కమిటీ తేల్చింది.. విచిత్రమేమిటంటే ఈ విషయాలేవీ ఆ శాఖ మంత్రికి తెలియవట. ఒక శాఖలో ఇన్ని జరుగుతుంటే ఆ శాఖ మంత్రికే తెలియకుండా ఉంటుందా..? తాను అమాయకుణ్ణని చెబితే కుదురుతుందా? మంత్రికి తెలియకుండానే ఏ ప్రాజెక్టయినా బిల్లుల చెల్లింపు వరకు ముందుకు సాగుతుందా? అలాంటి మంత్రికి పదవిలో కొనసాగే నైతిక హక్కు ఉంటుందా..? ఇంతకీ అది ఏ ప్రాజెక్టు..? ఆ మంత్రి ఎవరు అనేగా మీ సందేహం... ఆ ప్రాజెక్టు... గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులో 29వ ప్యాకేజీ... కాంట్రాక్టు కట్టబెట్టింది... తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్‌కి చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్‌కి.. తనకేమీ తెలియదని చెబుతున్న ఆయన.. నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గాలేరు-నగరి సుజల స్రవంతి(జీఎన్ఎస్ఎస్) ప్రాజెక్టులో భాగంగా గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్ వరకు వరద కాల్వ నిర్మాణంలో మిగిలిపోయిన పనులకు సంబంధించిన వ్యవహారం ఇది. మిగిలిపోయిన పనుల విలువ రూ.12 కోట్లే.. కానీ అంచనాలను భారీగా పెంచి రూ. 110 కోట్లకు టెండర్లు పిలిచారు. చివరకు అధికార పార్టీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్‌కు కట్టబెట్టారు. రూ.35 కోట్ల మేర చెల్లింపులు జరిపేసిన ఈ వ్యవహారంలో తాజాగా అనేక కొత్త నిజాలు బయటపడుతున్నాయి. రెండు బిల్లులు చెల్లించేశారు..: అడ్డగోలుగా కాం ట్రాక్టు కట్టబెట్టడమే కాకుండా కాంట్రాక్టర్‌కు 2 బిల్లులను కూడా ప్రభుత్వం చెల్లించింది. రూ. 110 కోట్ల కాంట్రాక్టులో దాదాపు రూ.35 కోట్ల బిల్లులు కాం ట్రాక్టర్ తీసుకున్నారు. ఏ ప్రాజెక్టుకు ఎంత బిల్లు చెల్లించారనేది సాగునీటి శాఖలోని ‘ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్’ ప్రతివారం నివేదిక రూపొందించి మంత్రికిస్తారు. మంత్రి అనుమతి లేకుండా సాగునీటి శాఖలో ఒక్క రూపాయి బిల్లు కూడా చెల్లించరు. కానీ జీఎన్ఎస్ఎస్ 29వ ప్యాకేజీ బిల్లులు చెల్లించిన విషయం తన దృష్టికి రాలేదని దేవినేని చెబుతున్నారు. అందులో ఎంతమాత్రం వాస్తవం లేదని, మంత్రికి తెలియకుండా ఏమీ జరిగే అవకాశం లేదని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అనుమతులు లేకుండానే బిల్లుల చెల్లింపు మరో నిర్ఘాంతపోయే నిజమేమిటంటే.. అసలు ఎలాంటి పరిపాలనా అనుమతులు లేకుండానే రూ. 110 కోట్లకు టెండర్లు పిలిచారని ఈ వ్యవహారంపై నియమించిన నిపుణుల కమిటీ తేల్చింది. మరి పరిపాలనా అనుమతులు లేకుండానే దాదాపు రూ. 35 కోట్ల విలువైన బిల్లులు ఎలా చెల్లించారనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ప్రభుత్వ పెద్దలతో పాటు ఇటు సాగునీటి శాఖలో, అటు ఆర్థిక శాఖలో ఉన్నతాధికారుల సహకారం ఉంటే తప్ప బిల్లుల చెల్లింపు సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాటాలు దక్కకే బయటకు పొక్కింది.. పనుల అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచాలనే ప్రతిపాదన మొదలు.. టెండర్లు పిలిచే ప్రతిపాదన, బిడ్ల పరిశీలన, కాంట్రాక్టర్ ఎంపిక, ప్రభుత్వం-కాంట్రాక్టర్ మధ్య ఒప్పందం.. అన్ని దశల్లోనూ ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండా ఏమీ జరిగే అవకాశంలేదని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు చెబుతున్నారు. అన్ని దశల్లోనూ అడ్డగోలు వ్యవహారాలు నిరాటంకంగా జరిగిపోయాయి. వాస్తవ పని విలువపై దాదాపు రూ. 100 కోట్లు అదనంగా ఉన్నందున.. ఆమేరకు వాటా వస్తుందని ఈ వ్యవహారంలో అధికార పార్టీ ఎంపీకి సహకరించిన వారు భావించారు. తీరా టెండర్ దక్కించుకున్న తర్వాత.. ఆశించిన స్థాయిలో వాటాలు ఇవ్వడానికి నిరాకరించిన తర్వాతే వ్యవహారం బయటకు పొక్కిందని నీటిపారుదల శాఖలో ప్రచారం జరుగుతోంది. ఎవరి మీద చర్యలు?: పరిపాలనా అనుమతులు లేకుండానే టెండర్లు పిలిచి అధికార పార్టీ ఎంపీకి కాంట్రాక్టు కట్టబెట్టడంతో పాటు బిల్లులు కూడా చెల్లించిన తర్వాత.. ఈ వ్యవహారంపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. నిబంధనలను తుంగలో తొక్కారని.. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా జరగడానికి అవకాశం లేదని నిపుణుల కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. సాగునీటి శాఖలో ఇంత భారీ అవినీతి వ్యవహారం జరిగిన నేపథ్యంలో.. ఆ శాఖ మంత్రి మీద ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారా? కిందిస్థాయి అధికారులను బలిపశువులను చేస్తారా? అని నీటిపారుదల శాఖలో చర్చ జరుగుతోంది. -
2016లోగా హంద్రీ - నీవా పూర్తి చేస్తాం
అనంతపురం : 2016 లోగా హంద్రీ - నీవా ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు. శుక్రవారం అనంతపురంలో ప్రాజెక్టులపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... త్వరలో తోటపల్లి, గుండ్లకమ్మ ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తామన్నారు. రాయలసీమ ప్రాంతంలోని ప్రాజెక్టులన్నీ గడవులోపే పూర్తి చేస్తామన్నారు. హంద్రీ నీవా ప్రాజెక్ట్ పనుల పురోగతిని దేవినేని ఉమా ఈ సందర్భంగా ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. -
దేవినేని ఉమకు జోగు రమేష్ బహిరంగ సవాల్
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జోగు రమేష్ బహిరంగ సవాల్ విసిరారు. మీడియా సమక్షంలో వైఎస్ఆర్ సీపీ నేతలతో కృష్ణా డెల్టాలో పర్యటించే దమ్ము, ధైర్యం మీకుందా అంటూ దేవినేని ఉమాను ప్రశ్నించారు. కృష్ణాజిల్లా వాసులకు సాగు, తాగునీరు అందించలేదని నువ్వు రాయలసీమను రతనాల సీమ చేస్తావా అంటూ జోగు రమేష్ ఈ సందర్భంగా ఉమపై ధ్వజమెత్తారు. -
హరీష్‌పై దేవినేని ఉమ ఫైర్
విజయవాడ: తాగునీటి సమస్యను వివాదం చేయడం తగదంటూ ఏపీ మంత్రి దేవినేని ఉమ.. తెలంగాణ మంత్రి హరీష్ రావుపై మండిపడ్డారు. కృష్ణా జలాల పంపిణీపై సామరస్యంగా చర్చలు జరపాలని ఉమ అన్నారు. తెలంగాణలో నిర్మిస్తున్న పాలమూరు, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులు కొత్తవేనంటూ ఏపీ ప్రభుత్వం రాసిన లేఖపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు ఉన్న హక్కు మేరకే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాద్ధాంతం చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి దేవినేని ఉమ పై విధంగా స్పందించారు. -
వారంతా ఎక్కడ ?
-
చింతమనేనిపై చర్యలు సీఎం నిర్ణయిస్తారు
విజయవాడ: మహిళా తహశీల్దార్‌పై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఎలాంటి చర్యలు తీసుకోవాలో తమ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయిస్తారని మంత్రి దేవినేని ఉమ అన్నారు. పుష్యరాల దృష్ట్యా ఆందోళన విరమించాల్సిందిగా ఉద్యోగులను కోరినట్లు ఆయన మీడియాకు తెలిపారు. తహశీల్దార్‌పై పెట్టిన అక్రమ కేసులన్నింటిని ఎత్తివేయాలని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీకి సూచించామన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు తనపై దాడి చేశారని, తనను ఇసుకలో ఈడ్చుకుంటూ తీసుకెళ్లారని ముసునూరు మహిళా ఎమ్మార్వో వనజాక్షి తెలిపిన విషయం తెలిసిందే. జరిగిన ఘటనపై ఆమె కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతోపాటు ఆమెతో రెవెన్యూ ఉద్యోగ సంఘాలు కలిసివచ్చి దర్నాలకు దిగిన నేపథ్యంలో ప్రభుత్వం తరుపున చర్చలు దేవినేని చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడి ఈ విషయాలు వెల్లడించారు. -
'కేసీఆర్ సెక్షన్ 8 చెల్లదనడం సరికాదు'
విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మంగళవారం విజయవాడలో మండిపడ్డారు.రాష్ట్ర పునర్విజభన చట్టం చెల్లినప్పుడు... సెక్షన్-8 ఎందుకు చెల్లదని కేసీఆర్‌ను ఆయన ప్రశ్నించారు. విభజన నేపథ్యంలో గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతలు ఉంటాయని సెక్షన్ - 8లో పేర్కొన్నారని ఉమా ఈ సందర్భంగా గుర్తు చేశారు. సెక్షన్ -8 చెల్లదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొనడం సరికాదని ఉమా అభిప్రాయపడ్డారు. సెక్షన్ 8 చెల్లకుంటే ఏపీ పునర్విభజన చెల్లుతుందా? అని కేసీఆర్‌ను దేవినేని ఉమా సూటిగా ప్రశ్నించారు. అంతర్గత భద్రత, శాంతి భద్రతలు గవర్నర్ చేతిలోనే ఉంటాయని విభజన చట్టంలో చెప్పారని దేవినేని ఉమా వెల్లడించారు. -
తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నారు...
హైదరాబాద్ : ఎవరెన్ని కుట్రలు చేసి పాలమూరు ఎత్తిపోతల పథకం ఆగదని తెలంగాణ నీటి పారుదల శాఖమంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఎన్ని అవంతరాలు కల్పించినా యుద్ధప్రాతిపదికన పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. హరీష్ రావు శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు - రంగారెడ్డి, నక్కలగండి ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులు లేవన్న ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. దేవినేని ఉమా వ్యాఖ్యలు అవాస్తవాలు అని హరీశ్ రావు అన్నారు. 'హైదరాబాద్‌లో ఉంటూ... హైదరాబాద్‌కు నీళ్లు వద్దా? టీడీపీ నేతలు తిన్నింటి వాసాలు లెక్కిస్తున్నారు. హెచ్ఎండీఏకు మంచినీళ్లు ఇవ్వొద్దన్న మూర్ఖులు ఎవరైనా ఉన్నారా? ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవోలను మాత్రమే మా ప్రభుత్వం అమలు చేస్తోంది. పాలమూరు ఎత్తిపోతల సర్వేకు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జీవో విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో విడుదల చేసిన జీవోలను మాత్రమే మేం అమలు చేస్తున్నాం. కొత్తగా మేం చేసేదీ ఏమీ లేదు. ఎర్రబెల్లి దయకరరావుకు సిగ్గుంటే చంద్రబాబు, దేవినేని ఉమను నిలదీయాలి. ఏ అనుమతులతో పట్టిసీమ, పోలవరాన్ని ప్రారంభించారు. తెలంగాణ బిడ్డలైతే తెలంగాణ టీడీపీ నేతలు పాలమూరు ప్రాజెక్ట్‌పై స్పందించాలి. మంచినీళ్ల కోసం ప్రాజెక్ట్ కట్టొద్దన్న పార్టీ ఒక్క టీడీపీ మాత్రమే. ఎన్ని శాపాలు పెట్టినా అవి మాకు వరాలే. తెలంగాణ రాష్ట్రం విషయంలోనూ అపశకునం పలికారు. అవి మాకు శుభ శకునాలుగా మారాయి. మీరెన్ని కుట్రలు చేసినా పాలమూరు ఎత్తిపోతల పథకం ఆగదు. పక్కవాళ్లు చెడిపోవాలి...మేము మంచిగా ఉండాలన్నది మీ తత్వం. తెలంగాణకు పరిశ్రమలు రాకుండా ఉండాలని ఏపీ సర్కార్ కుట్ర పన్నుతోంది.' అని హరీష్ రావు స్పష్టం చేశారు. -
తిన్నింటి వాసాలు లెక్కపెడతారా?
-
'పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతి లేదు'
-
టీడీపీ నేతలకు అనుగుణంగా ఉద్యోగుల బదిలీలు: దేవినేని
మచిలీపట్నం : టీడీపీ కార్యకర్తలు, నాయకుల మనోభావాలకు అనుగుణంగా అధికారులు, ఉద్యోగుల బదిలీలు చేసుకునే అవకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చారని, దీనిని వినియోగించుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. టీడీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం మచిలీపట్నంలోని రామరాజు కన్వెన్షన్ సెంటరులో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుత కన్వీనరు బచ్చుల అర్జునుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మంత్రి దేవినేని ప్రకటించారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కోట వీరబాబును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలకు త్వరలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. జూన్ 2న నవ నిర్మాణ దీక్షను అన్ని నియోజకవర్గాల్లో చేపట్టనున్నట్లు తెలిపారు. డ్వాక్రా మహిళలకు జూన్ 3 నుంచి ఏడో తేదీ వరకు రుణమాఫీ చెక్కులు అందజేయనున్నట్లు చెప్పారు. ఒక్కొక్క డ్వాక్రా మహిళకు రూ.10 వేలు చొప్పున రుణమాఫీ చేస్తామని, మొదటి విడతగా రూ.3 వేలను చెక్కు రూపంలో అందజేస్తామని తెలిపారు. -
'టీడీపీ కార్యకర్తలకు తక్కువ ధరకే టెండర్లు'
విజయవాడ: రాష్ట్రంలో టీడీపీ నేతలు అధికార దుర్వినియోగం చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నేత పి. గౌతంరెడ్డి ఆరోపించారు. మంగళవారం విజయవాడలో గౌతంరెడ్డి విలేకర్లతో మాట్లాడారు. టీడీపీ కార్యకర్తలకు తక్కువ ధరలకే టెండర్లు అప్పగిస్తున్నారని విమర్శించారు. విజయవాడలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అద్దె ధర రోజుకు రూ. 60 వేలుగా ఉందని ఆయన గుర్తు చేశారు. టీడీపీ కార్యకర్త గరిమెళ్ల నానికి రూ. 15 వేలకే కట్టబెట్టడంలో ఉద్దేశం ఏమిటని ఆయన ప్రశ్నించారు. టీడీపీ మంత్రి దేవినేని ఉమా, స్థానిక ఎమ్మెల్యే బోండా కుమ్మకై గరిమెళ్ల నానికి తక్కువ ధరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ను తక్కువ అద్దెకు ఇచ్చారని గౌతంరెడ్డి అన్నారు. -
దేవినేనింతే!
‘‘హంద్రీ-నీవాను పూర్తి చేసే బాధ్యత మాది. ఏడాదిలో పూర్తి చేసి అనంతపురం పొలాలకు సాగునీరు అందిస్తాం’’- ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో మంత్రి దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యలు. అప్పటి బడ్జెట్లో వందకోట్లు మాత్రమే కేటాయించారు. ‘‘హంద్రీ-నీవాను పూర్తి చేసి 40 టీఎంసీల నీరు అందిస్తాం. ఏడాదిలో పూర్తి చేసేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.’’- గురు, శుక్రవారాల్లో హంద్రీ-నీవా గట్లపై మంత్రి వ్యాఖ్యలు. ‘‘హంద్రీ-నీవాపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి. ఏడాదిలో పూర్తి చేస్తామని మాట ఇచ్చాం. ఆ మాటను తప్పకుండా నిలుపుకుంటాం. ఏడాదిలో పూర్తి చేసి తీరుతాం.’’- మార్చిలో మంత్రి దేవినేనితో పాటు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంయుక్తంగా హంద్రీ-నీవాపై పర్యటించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు. ఈ బడ్జెట్లో 220 కోట్ల రూపాయలు కేటాయించి మమ అనిపించారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: నవ్విపోదురుగాక మాకేటి.. అన్నట్లుంది దేవినేని తీరు. మరో రెన్నెళ్లు గడిస్తే ఏడాదిలో హంద్రీ-నీవాను పూర్తి చేస్తామని నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మొదట ప్రకటించి ఏడాది అవుతుంది. భారీనీటిపారుదలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడుసార్లు ‘అనంత’ పర్యటనకు వచ్చారు. వచ్చిన ప్రతిసారీ ఏడాదిలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పినమాటనే చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జిల్లా మంత్రులు కూడా అదే మాటలు వల్లె వేస్తున్నారు. వీరిలో ఏ ఒక్కరూ ప్రాజెక్టు పనులు ఏమేరకు పూర్తయ్యాయి? ఇంకెంత శాతం పనులు పూర్తి కావాల్సి ఉంది? ఏ మేరకు నిధులు కావాలి? ఎంత కాలంలో పూర్తవుతుంది? అని బహుశా ఆలోచించినట్లు లేదు. కేవలం మాటలతో ‘అనంత’ వాసులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు ఆయన మంత్రి వర్గం, జిల్లా ఎమ్మెల్యేలు ఏ ఒక్కరూ ప్రాజెక్టు పూర్తిపై శ్రద్ధ చూపడం లేదు. సీఎంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్ల కేటాయింపుల్లోనూ హంద్రీ-నీవాకు ప్రాధాన్యత దక్కలేదు. మొదటి బడ్జెట్లో కేవలం వందకోట్లు కేటాయిస్తే, ఆ ఏడాది బడ్జెట్లో 220 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు. ప్రాజెక్టు పూర్తికి మరో రూ.1800 కోట్లు అవసరం: హంద్రీ-నీవా పథకం పనులు 80 శాతం మేర పూర్తయ్యాయి. మరో 20శాతం పూర్తికావాలి. డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ ఇంకా మొదలే కాలేదు. కర్నూలు జిల్లా మల్యాల నుంచి అనంతపురం జిల్లా వరకూ మొదటి విడత పథకం పూర్తి కావాలంటే మరో రూ. 520 కోట్ల అవసరమని అధికారులు చెబుతున్నారు. ఈ రెండు జిల్లాలతో పాటు వైఎస్సార్, చిత్తూరు జిల్లాలో రెండో విడత కూడా పూర్తి కావాలంటే మరో రూ.1800 కోట్ల అవసరం. ఏడాదిలో పూర్తి చేస్తామని గతేడాది చంద్రబాబుతో పాటు మంత్రి దేవినేని ఉమ ప్రకటించడంతో సరిపడా నిధులు పూర్తిస్థాయిలో విడుదల చేస్తారని రైతులు సంబరపడ్డారు. అయితే కేవలం రూ.100కోట్ల మాత్రమే విడుదల చేశారు. ఉద్యోగుల వేతనాలు, కరెంటుబిల్లుల బకాయిలే రూ.170కోట్ల దాకా ఉన్నాయి. ఈ నిధులు ఏ మూలకు సరిపోలేదు. గత నెలలో సీఎం బావమరది బాలకృష్ణ, మంత్రి దేవినేని ఉమతో పాటు జిల్లా నేతలు హంద్రీ-నీవా కాలువపై రెండోసారి పర్యటన చేపట్టారు. ఏడాదిలో పూర్తి చేస్తామని మళ్లీ చెప్పారు. ఇదే క్రమంలో మదనపల్లిలో జరిగిన ఓ బహిరంగసభలో సీఎం కూడా ఇదే మాటలను వల్లె వేశారు. ఏడాదిలో హంద్రీ-నీవా ద్వారా చిత్తూరు జిల్లాకు నీళ్లు తీసుకొస్తామన్నారు. సీఎం చెప్పడంతో ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తారని, రెండేళ్లలో పనులు పూర్తవుతాయని అంతా భావించారు. అయితే గత నెల బడ్జెట్లో రూ.220 కోట్లే కేటాయించారు. ఈ ఏడాదికి సంబంధించి 16.2 టీఎంసీల నీళ్లు హంద్రీ-నీవా ద్వారా ఎత్తిపోశారు. దాదాపు రూ.130కోట్ల కరెంటు బిల్లులు, అధికారుల వేతనాలకు మరో రూ.70కోట్ల అవసరం. ప్రభుత్వం కేటాయించిన నిధులు వీటికే సరిపోతాయి. మరి కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేసేందుకు నిధులు ఎక్కడ ఉన్నాయో మంత్రి దేవినేని సమాధానం చెప్పాలి? చిత్తశుద్ధి లేని పర్యటనలు ఏల ‘దేవినేని’?: హంద్రీ-నీవాకు నిధుల కేటాయింపు వివరాలు పరిశీలిస్తే ప్రాజెక్టు పూర్తిపై సర్కారుకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ఇట్టే తెలుస్తుంది. అయినా దేవినేని రెన్నళ్లకోమారు బుగ్గకారులో కాలువగట్లపైకి రావడం...జిల్లా టీడీపీ నేతలంతా ఆయనతో పాటు వెళ్లడం కాలువ గట్లపై ఫోటోలు దిగడం... షరా మామూలైపోతోంది. కనీసం జిల్లాలోని ఇద్దరు మంత్రలతో పాటు అధికారపార్టీ ఎమ్మెల్యేలు కూడా ప్రాజెక్టుపై స్పందించడం లేదు. ‘ఏడాదిలో పూర్తి చేస్తామని పది నెలలుగా చెబుతున్నావు. నిధులు చూస్తే మరో పదేళ్ల కూడా ప్రాజెక్టు పూర్తయ్యేలా లేదు. చెప్పేమాటలకు,..చేసేపనులకు ఏమాత్రమైనా పొంతన ఉందా?’ అని పల్లె, పరిటాలతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరూ మంత్రిని అడగడం లేదు. శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం - బీకే పార్థసారథి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పెరిగిన ధరలతో హంద్రీ-నీవా కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు సమస్యగా ఉంది. దీనికి సంబంధించి అధికారులు రివ్యూ చేశారు. పెరిగిన రేట్లకు అనుగుణంగా ధరలు పెంచేలా ప్రభుత్వం జీవో జారీ చేయాల్సి ఉంది. దీన్ని కిరణ్ ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచింది. త్వరలోనే అడ్డంకులను అధిగమించి ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఈ ఏడాది గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీళ్లు రప్పిస్తాం. ఒక్కసారైనా నిజం మాట్లాడండి - విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే, ఉరవకొండ. ప్రాజెక్టును పూర్తి చేయాలంటే సరిపడా నిధులు కేటాయించాలి. ఆపై ఏడాదిలో పూర్తి చేసేలా అధికారులను పరుగులు పెట్టించాలి. కాలువగట్లపై తిరగడం..నిద్ర చేయడం ప్రతిపక్షపార్టీలు చేస్తే అర్థం ఉంటుంది. అధికారం మీ చేతులో ఉంది? అలాంటప్పుడు ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా గట్లపై నిద్రపోతే ఏమొస్తుంది. ‘సీమ’కు ద్రోహం చేస్తున్న చంద్రబాబును నిద్రలేపండి. నిధులు కేటాయించండి. ప్రాజెక్టు పూర్తవుతుంది. అంతేకానీ ఏడాదిలో పూర్తి చేస్తామని 10 నెలలుగా చెబుతున్న అబద్దాలు...మరో పదేళ్లు చెప్పినా ప్రాజెక్టు పూర్తి కాదు. ఉత్తుత్తి పర్యటనలతో ఒరిగేది ఏమీ లేదు - జగదీష్, సీపీఐ జిల్లా కార్యదర్శి హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తికి నిర్ధిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు మంత్రి ప్రకటించకుండా ఉత్తుత్తి పర్యటు చేయడం వల్ల ఒరిగే ప్రయోజనం ఉండదు. పనులు పూర్తికి అసవరమైన నిధులు కేటాయించాలి. చాలా చోట్ల భూసేకరణ జరగలేదు. 14వ ప్యాకేజీ కదిరి వద్ద మూడు అక్విడెక్ట్‌లు నిర్మించాల్సి ఉంది. వీటికి నిర్మాణానికి రెండేళ్లు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఖరీఫ్‌కి 40 టీఎంసీల నీరు ఎలా ఇస్తారు. గుత్తేదారుల సమస్యలూ పరిష్కరించాలి. వీటన్నిటిపై కనీస ప్రకటన చేయకుండా పూర్తి చేస్తామని చెప్పడం మరోమారు ప్రజలను తెలుగుదేశంపార్టీ ప్రభుత్వం మోసం చేయడమే అవుతుంది. పర్యటనలు చేస్తే ప్రాజెక్టు పూర్తి కాదు - రాంభూపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఏడాదిలోగా హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెబుతూ మంత్రులు పర్యటించడం ఇది మూడో సారి. ప్రాజెక్టు పూర్తి చేయడంపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిధులు కేటాయించి పనులు ప్రారంభమయ్యేలా చూడాలి. ఆ తరువాత పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించేందుకు పర్యటనలు చేయాలి. అలా కాకుండా నిధులు ఇవ్వకుండా మభ్యపెట్టేందుకు పర్యటిస్తున్నారు. ఏడాదిలో పూర్తి చేస్తామని అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పారు. రెండు నెలలు గడిస్తే ఏడాది పూర్తవుతుంది. ఇప్పటి వరకు ప్రాజెక్టు పనులు ఇంచు ముందుకు కదలలేదు. మంత్రి తన పర్యటనలో ఎక్కడా స్పష్టమైన ప్రకటన చేయకుండా ఖరీఫ్‌కి నీరిస్తామని చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రజలను మోసం చేసేందుకు మంత్రి పర్యటిస్తున్నట్లుగా ఉంది. ప్రాజెక్టుకి నిధులు కేటాయించకపోతే భారీ స్థాయిలో ఉద్యమిస్తాం. -
'తప్పు చేస్తే.. తొలగిస్తా'
అనంతపురం : హంద్రీనీవా సుజల స్రవంతి పథకాన్ని పూర్తి చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించినా, అక్రమాలకు పాల్పడినా నిర్ధాక్షిణంగా తొలగిస్తామని అధికారులు, ఏజెన్సీలను రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ హాలులో నీటిపారుదలశాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ.... గత కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞం పథకాన్ని ధనయజ్ఞం మార్చిందని మండిపడ్డారు. ఇష్టారాజ్యంగా పనులు చేసి అందినకాడికి నిధులు దండుకున్నారని ఆరోపించారు. గతంలో చేసిన ఆ తప్పులను సరిదిద్దుకునే రోజులు వచ్చాయని దేవినేని ఉమా ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. గత ఏడాది 16.5 టీఎంసీలు హంద్రీనీవాకు వస్తే రైతుల కళ్ళల్లో ఆనందం చూశామన్నారు. వచ్చే ఏడాది 40 టీఎంసీలు తీసుకువస్తే చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. ప్రతి 2 కిలోమీటర్లకు ఒక జేఈ, డీఈలు ఉన్నారని యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. పసులు చేపట్టడంలో రియాల్టీ ఉండేందుకు ఎప్పటికప్పుడు వీడియోలు తీయాలన్నారు. చరిత్రలో స్థానం కావాలంటే పనులను పరుగులు పెట్టించాలని ఆయన ఉన్నతాధికారులకు సూచించారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా కాలువపై పర్యటిస్తారని, ఎప్పుడు, ఎక్కడికి ఆయన వస్తారో చెప్పరని... కానీ అధికారులంతా జాగ్రత్తగా పనులు చేపట్టాలన్నారు. పోలవరం కుడికాల్వ ద్వారా కృష్ణాలోకి నీళ్ళు మల్లించి అక్కడి నుంచి హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టుల ద్వారా రాయలసీమ జిల్లాలకు దాదాపు 60 టీఎంసీలు తీసుకొస్తామని అన్నారు. పనులలో చేపట్టడంలో ఏమైనా అక్రమాలు జరిగితే ఫోన్ చేయాలని, లేకున్నా మేసేజ్ చేసినా చాలని లష్కర్ నుంచి ఇంజనీర్ల వరకూ ఎవరిని ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ఎవరికి కేటాయించిన ప్యాకేజీలను వారు రోల్‌మాడల్‌గా తీర్చిదిద్దాలని సూచించారు. ఉద్యోగులకు పనితీరే కొలబద్ద అని, బాగా పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందన్నారు. పదవీవిరమణ చెందిన ఇంజనీర్ల సేవలు కూడా తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ... కరువు జిల్లా అనంత ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్న మంత్రి దేవినేని ఉమాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ చమన్ మాట్లాడుతూ... హంద్రీనీవాను చాలెంజ్‌గా తీసుకొని పనులు పూర్తి చేసేందుకు ఇప్పటికే మూడు సార్లు కాలువగట్టుపై ప్రయాణించారని ఈ సందర్భంగా ఆయన మంత్రిని ప్రశంసించారు. డిసెంబర్ నాటికి అన్ని చెరువులకు నీటిని నింపాలని కోరారు. ఇందుకోసం తమ సంపూర్ణ సహకారం అందిస్తామని చమన్ వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, అనంతపురం సీఈ జలందర్, తిరుపతి సీఈ సుదాకర్, ఎస్ఈలు సుధాకర్‌బాబు, మురళీనాథ్‌రెడ్డి, హెచ్చెల్సీ ఎస్ఈ శేషగిరిరావు, చిన్ననీటిపారుదలశాఖ ఎస్ఈ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, హంద్రీనీవా, హెచ్చెల్సీ, చిన్ననీటిపారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు. -
పట్టిసీమను పూర్తి చేసి తీరుతాం: దేవినేని
విజయవాడ : ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టిసీమను పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ పట్టిసీమ వల్ల ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. ఇక మామిడి రైతులను దళారి వ్యవస్థ నుంచి రక్షిస్తామని దేవినేని హామీ ఇచ్చారు. -
'జగన్ పర్యటిస్తుంటే... వాళ్లకెందుకు బాధ'
విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమా చేస్తున్న ఆరోపణలను గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఖండించారు. మంగళవారం విజయవాడలో కొడాలి నాని మాట్లాడుతూ.... బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారని తెలిపారు. తమ పార్టీ నాయకుడు రాజధాని ప్రాంతాల్లో పర్యటిస్తే టీడీపీ మంత్రులను ఎందుకు బాధ కలుగుతుందో తెలియడం లేదన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని చంద్రబాబు, దేవినేని ఉమాలకు ఈ సందర్బంగా కొడాలి నాని హితవు పలికారు. చంద్రబాబు పేరు చీటర్ బాబు, ఆయన బినామీ ఉమా అని కొడాలి నాని ఎద్దేవా చేశారు. -
'ఎన్టీఆర్ రూపకల్పన చేస్తే..మేం పూర్తి చేస్తాం'
అనంతపురం : హంద్రినీవా సుజల స్రవంతిని ఎన్టీఆర్ రూపకల్పన చేశారని, దాన్ని పూర్తి చేసే అవకాశం తమకు దక్కిందని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ అన్నారు. హంద్రినీవా పనులను 15 రోజులకొకసారి సమీక్షిస్తామని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ఇప్పటికే 32వేల ఎకరాలను సమీకరించినట్లు దేవినేని ఉమ పేర్కొన్నారు. ఈ సందర్భంగా హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ మాట్లాడుతూ హంద్రినీవా పనులను త్వరలో పూర్తి చేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్నారు. హంద్రినీవా సుజల స్రవంతి కాలువ పనులను మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాధరెడ్డి, దేవినేని ఉమ, ఎమ్మెల్యే బాలకృష్ణ తదితరులు పర్యవేక్షించారు. -
'పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి త్వరలో టెండర్లు ఖరారు'
హైదరాబాద్:పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి వారంలోగా టెండర్లు ఖరారు చేస్తానమి ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమ స్పష్టం చేశారు. రూ.1300 కోట్లతో ప్రాజెక్టును పూర్తిచేసి ఎనిమిదివేల క్యూసెక్కుల గోదావరి జలాలను కృష్ణానదిలో కలుపుతామన్నారు. దీనివల్ల కృష్ణా డెల్టా, రాయలసీమ ప్రాంతాలకు మేలు జరుగుతుందని ఉమ తెలిపారు. 12 అడుగుల మట్టం వరకూ మాత్రమే నీటిని నిల్వ చేస్తామని.. 50 టీఎంసీల నీటిని ఒకేసారి నిల్వచేయమని తెలిపారు. రాబోయే నాలుగేళ్లలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తామని ఉమ పేర్కొన్నారు. -
'మన ఊరు - మన చెరువు'పై దేవినేని ఉమ
-
'సీఎంల సమన్వయంతో ముందుకెళ్తాం'
హైదరాబాద్: నాగార్జున సాగర్ నీటి వివాదంపై రాజ్ భవన్లో ఏర్పాటు చేసిన ఇరు రాష్ట్రాల భారీ నీటి పారుదల శాఖ మంత్రుల సమావేశం శనివారం ముగిసింది. అనంతరం రెండు రాష్ట్రాల్లో మంత్రులు దేవినేని ఉమా, హరీష్‌రావు సంయుక్తం విలేకర్లతో మాట్లాడుతూ... ఇరు రాష్ట్రాల్లో రైతులు నష్టపోకుండా చూస్తామని స్పష్టం చేశారు. అలాగే పంటలు ఎండిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. డ్యాంపైకి ఇరు రాష్ట్రాల పోలీసులు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. నీటి విడుదలపై ఇరు రాష్ట్రాల సీఎంలు సమన్వయంతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. నీటి విడుదలపై ఇరు రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు పర్యవేక్షిస్తారని దేవినేని ఉమా, హరీష్‌రావు పేర్కొన్నారు. -
ఇరు రాష్ట్ర రైతులు బాగుండాలని...
-
'సాగర్' నీటి గొడవపై దేవినేని ఉమ
-
' ఏపీ వాదనపట్ల కృష్ణాబోర్డు సానుకూలం'
హైదరాబాద్: సాగర్ జలాల విషయమై తమ అవసరాలను ఎప్పటికప్పుడూ కృష్ణాబోర్డుకు నివేదిస్తున్నట్టు ఏపీ మంత్రి దేవినేని ఉమ చెప్పారు. నాగార్జున సాగర్‌పై నియంత్రణ విషయంలో తెలుగురాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో ఇరురాష్ట్రాల ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తమ వాదనపట్ల కృష్ణాబోర్డు సానుకూలంగా స్పందించినట్టు దేవినేని తెలిపారు. సాగర్ జలాల విషయమై మరోసారి కృష్ణాబోర్డుకు దృష్టికి తీసుకెళ్లి వాస్తవ పరిస్థితిని వివరిస్తామని మంత్రి దేవినేని అన్నారు. -
'హరీష్ రావువి అసత్య ఆరోపణలు'
విజయవాడ: కృష్ణాజలాల వినియోగంపై తెలంగాణ మంత్రి హరీష్ రావు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖమంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. విజయవాడలో శనివారం ఆయన మాట్లాడుతూ... తెలంగాణ సర్కార్ పంతానికి పోయి శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేసిందని ఆయన మండిపడ్డారు. రైతు సమస్యలపై రాజకీయాలు చేయోద్దని ఆయన సూచించారు.